dirty game
-
ఎవరు ఆడారు?
హాస్యనటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఖయ్యుమ్ (అలీ తమ్ముడు) ఫస్ట్ టైమ్ హీరోగా నటించిన చిత్రం ‘డర్టీ గేమ్’. అస్మిత కథానాయిక. షిరిడీసాయి క్రియేషన్స్ పతాకంపై తాడి మనోహర్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సునీల్ కశ్యప్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని దర్శకుడు సాగర్, నిర్మాత ప్రసన్న కుమార్ విడుదల చేశారు. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘మంచి కథ కుదిరింది. డర్టీ గేమ్ ఏంటి? ఎవరెవరు ఆడారు? అన్నది ఆసక్తికరం. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ అంశాలన్నీ మా చిత్రంలో ఉంటాయి. సునీల్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘పూరీ జగన్నాథ్ వంటి దర్శకులతో పని చేసిన నేను ఈ చిత్రం చేయడానికి కారణం కథ నచ్చడమే. పాటలు ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకం ఉంది’’ అని సునీల్ కశ్యప్ అన్నారు. ఖయ్యుమ్, అస్మిత, కవిత, జీవీ, కోటా శంకర్ రావు, సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బీఎస్ కుమార్. -
ఆట ఆడింది ఎవరు?
ఖయ్యుమ్, నందినీ కపూర్ జంటగా అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ నిర్మిస్తున్న సినిమా ‘డర్టీ గేమ్’. డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. నిర్మాత మాట్లాడుతూ - ‘‘వర్తమాన రాజకీయాల నేపథ్యంలో సాగే పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. డర్టీ గేమ్ ఆడింది ఎవరు? ఆ గేమ్‌ని ఎలా బయటపెట్టారు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. కోట శ్రీనివాసరావు, సురేశ్, పరుచూరి గోపాలకృష్ణ పాత్రలు, నటన సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. త్వరలో ఆడియో, వచ్చే నెలలో సినిమా రిలీజ్ చేయాలను కుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్. -
ఒక్కరు మారినా ఆనందమే!
సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ వైపు చిత్రాలకు కథలు అందిస్తూనే మరోవైపు అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తుంటారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డర్టీ గేమ్’. అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో షిరిడీసాయి క్రియేషన్స్ పతాకంపై తాడి మనోహర్ కుమార్ కీలక పాత్ర పోషిస్తూ, నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు సురేశ్, ఖయ్యుం ఇతర పాత్రధారులు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభమైంది. ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రమిది. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా చూసి ఒక్క ఎమ్మెల్యే మారినా మా నిర్మాత జీవితం ధన్యమైనట్లే’’ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. ‘‘మంచి మెసేజ్ ఇచ్చే చిత్రం నిర్మించడం ఆనందంగా ఉంది’’ అని నిర్మాత పేర్కొన్నారు. -
'ప్రభుత్వం డర్టీ గేమ్ ఆడుతోంది'
ఢిల్లీ: అధికార పక్షానికి ఒక పద్ధతిలో, ప్రతిపక్షాలకు మరో రకంగా విధానాలను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం డర్టీ గేమ్ ఆడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. బుధవారం రాజ్యసభ సమావేశం వాయిదా పడిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిపక్ష నాయకులను కేసుల్లో ఇరికించేందుకే అవినీతి నిరోధక శాఖ అధికారిని ఇటీవల ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసిందని గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. అలాగే అధికార పార్టీ నేతలపై ఉన్న కేసులను సమాధి చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు ఎవ్వరూ అవినీతికి పాల్పడలేదని ఆజాద్ స్పష్టం చేశారు. గతంలో ఉన్న అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ నేషనల్ హెరాల్డ్ కేసును మూసివేయాలని భావించినట్లు తెలిపారు. అయితే ఆయన స్థానంలో మరొకరిని తీసుకురావడం.. ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడానికి చేసిన పని అని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ నిర్థోషిగా బయటపడుతుందని గులాం నబీ ఆజాద్ ధీమా వ్యక్తం చేశారు.