ఆట ఆడింది ఎవరు?
ఖయ్యుమ్, నందినీ కపూర్ జంటగా అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ నిర్మిస్తున్న సినిమా ‘డర్టీ గేమ్’. డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. నిర్మాత మాట్లాడుతూ - ‘‘వర్తమాన రాజకీయాల నేపథ్యంలో సాగే పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. డర్టీ గేమ్ ఆడింది ఎవరు? ఆ గేమ్‌ని ఎలా బయటపెట్టారు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. కోట శ్రీనివాసరావు, సురేశ్, పరుచూరి గోపాలకృష్ణ పాత్రలు, నటన సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. త్వరలో ఆడియో, వచ్చే నెలలో సినిమా రిలీజ్ చేయాలను కుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్.