పొలిటికల్ గేమ్
ఖయ్యుమ్, నందినీ కపూర్ జంటగా అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ నిర్మిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘డర్టీగేమ్’. కోట శ్రీనివాసరావు, సురేశ్ ప్రధాన పాత్రధారులు. టాకీపార్ట్ షూటింగ్ పూర్తయింది. ‘‘వినాయక చవితి తర్వాత పాటల చిత్రీకరణ ప్రారంభిస్తాం. అక్టోబర్‌లో రిలీజ్’’ అని నిర్మాత తెలిపారు. ‘‘ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తీస్తున్న చిత్రమిది. అధికారం, పదవుల కోసం ఎలాంటి డర్టీ గేమ్స్ ఆడుతున్నారనేది చిత్రంలో చూపిస్తున్నాం’’ అన్నారు వెంకటేశ్వర శర్మ. ‘‘ఇలాంటి కథతో సినిమా నిర్మిస్తున్న తాడి మనోహర్ గట్స్ మెచ్చుకోవాలి’’ అని కోట అన్నారు.