అమ్మ పేరుతోనే మొదలు..
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలున్న ప్రతి రోజూ సభల్లో పురచ్చితలైవి, అమ్మ అంటూ జయలలిత పేరు వినిపించని రోజు ఉండదంటే అతిశయోక్తి లేదు. లోక్‌సభలో 37 మంది సభ్యులతో మూడో అతి పెద్ద పార్టీగా, రాజ్యసభలో 13 మంది సభ్యులతో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న ఏఐడీఎంకే నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతి సభ్యుడు ఉభయ సభల్లో తాము ప్రసంగించే ముందు జయలలితకు కృతజ్ఞతలు చెప్పడం ఆనవాయితీ.
అలా ఏ సభ్యుడైనా అమ్మ పేరు సంబోధించినప్పుడు మిగిలిన సభ్యులు బల్లలు చరుస్తారు. దీంతో సభలోని దాదాపు అన్ని పార్టీల ఇతర సభ్యులు కూడా ఆసక్తిగా వినడం కనిపిస్తుంది. అలా ప్రతిసారి సంబోధించడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించినా.. వారి నాయకురాలిపై ఆ సభ్యులకు ఉన్న వాత్సల్యం అబ్బురపరుస్తుంది. సభ్యులు తమ ప్రసంగాల్లో జయలలిత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనియాడుతూ తమ ప్రసంగాలను ముగిస్తారు.
జైలు జీవితంలో వైరాగ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు జీవితంలో వచ్చిన వైరాగ్యం, తీవ్రమైన మధుమేహం, వైద్య చికిత్సలపై నిరాసక్తత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రాణాలను హరించి వేశారుు. జయలలిత సుమారు 45 ఏళ్ల వయస్సులోనే మధుమేహ వ్యాధి బారినపడ్డారు. తీరికలేని రాజకీయ జీవితం వల్ల ఆ వ్యాధి రానురానూ మరింత ముదిరింది. ఆసుపత్రిలో చేరితే ప్రచారం జరుగుతుందని వెనకంజ వేసిన జయలలిత కొన్నాళ్లు ఇంటి వద్దే చికిత్స చేరుుంచుకున్నారు. అరుుతే టాన్సీ భూముల కుంభకోణంపై ఒకసారి జైలుకు వెళ్లిన జయ.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014లో కొన్నాళ్లు బెంగళూరులో జైలు జీవితం గడిపారు. రెండోసారి జైలు జీవితం మానసికంగా వైరాగ్యానికి దారితీసింది. జైలులో ఉన్నపుడు చికిత్స చేసేందుకు వచ్చిన వైద్యులను దరిచేరనీయలేదు. మందులు వేసుకునేందుకు నిరాకరించారు.
విషాదాల డిసెంబర్
సాక్షి, చెన్నై: తమిళనాడుకు డిసెంబర్ నెల ఎప్పుడూ విషాదాన్నే అందిస్తోంది. ప్రజల మనసులు గెలుచ్చుకున్న మహానాయకుల మరణాలు కానీ.. ప్రజలను కకావికలం చేసే పెను విపత్తులు గానీ డిసెంబర్‌లోనే అధికంగా సంభవించడం కాకతాళీయం!
అందులో ముఖ్య ఘటనలు...
2016: డిసెంబర్ 5: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం.
2015:డిసెంబర్: అనూహ్యంగా వచ్చిపడ్డ కుండపోత వర్షాలు చెన్నై, కాంచీపురం, కడలూరు, తిరువళ్లూరు, తూత్తుకుడి తదితర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. అధికారిక లెక్కల ప్రకారం 422 మంది మృత్యువాతపడ్డారు.
2004: డిసెంబర్ 26: సునామీ విరుచుకుపడింది. భారత తీరంలో దాదాపు 20 వేల మందిని కబళించింది. అందులో అత్యధికులు తమిళులే. ఆ సునామీ వల్ల 6.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
1987: డిసెంబర్ 24: అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జి.రామచంద్రన్ మృతి చెందారు. ఆయన అభిమానులు 100 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు.
972: డిసెంబర్ 25: స్వతంత్ర భారతదేశం మొదటి, చివరి గవర్నర్ జనరల్, సంయుక్త మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సి.రాజగోపాలాచారి మృతి చెందారు.
1973: డిసెంబర్ 24: సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర ఉద్యమకారుడు, ఆత్మగౌరవ ఉద్యమ ఆద్యుడు, ద్రవిడ కళగం వ్యవస్థాపకుడు ‘పెరియార్’ రామస్వామి మరణించారు.
1964: డిసెంబర్ 22: భారీ తుఫాను తమిళనాడును ముఖ్యంగా దక్షిణ తీరాన్ని అతలాకుతలం చేసింది. రామేశ్వరం నుంచి పంబన్ బ్రిడ్జి మీదుగా వెళ్తున్న రైలును సముద్రం మింగేసింది. ఈ ప్రమాదంలో 115 మంది ప్రయాణికులు మృతి చెందారు. తీరంలో మరో 800 మందికి పైగా ప్రజలు చనిపోయారు.