CMs office
-
లుధియానాలో రూ.7 కోట్ల దోపిడీ
లుధియానా: పంజాబ్‌లోని లుధియానాలో భారీ దోపిడీ జరిగింది. బ్యాంకులకు సేవలందించే సీఎంఎస్ సెక్యూరిటీస్ కార్యాలయం నుంచి సుమారు రూ.7 కోట్ల నగదును ఆగంతకులు ఎత్తుకుపోయారు. న్యూ రాజ్‌గురు నగర్లో ఉన్న సంస్థ ఆఫీసులోకి శనివారం అర్ధరాత్రి దాటాక సుమారు 10 మంది ముసుగులు ధరించిన దుండగులు ప్రవేశించారు. భద్రతా సిబ్బందిని తుపాకీతో బెదిరించి, గదిలో బంధించారు. వారి సెల్ఫోన్లను ధ్వంసం చేశారు. అనంతరం అక్కడ దొరికిన సుమారు రూ.7 కోట్ల నగదుతో సీఎంఎస్‌కు చెందిన వ్యానులోనే ఉడాయించారు. సీసీ టీవీ కెమెరాలను కూడా వెంట తీసుకెళ్లారు. చోరీ సమాచారం ఉదయం 7 గంటల సమయంలో పోలీసులకు అందింది. లుధియానా పోలీస్ కమిషనర్ మన్దీప్ సింగ్ సిద్ధు ఘటనాస్థలిని పరిశీలించారు. తీసుకెళ్లిన వ్యానును ముల్లన్పూర్ దాఖా వద్ద దొంగలు వదిలేసి వెళ్లారని, అందులో రెండు ఆయుధాలు కూడా లభ్యమయ్యాయని ఆయన తెలిపారు. ‘సీఎంఎస్ సంస్థ నిర్లక్ష్యం వల్లే దోపిడీ జరిగింది. లాకర్లలో భద్రపరచాల్సి ఉండగా నగదును వ్యానుల్లోనూ, కార్యాలయం గదిలోనూ అజాగ్రత్తగా వదిలేసినట్లు తేలింది. ఘటన సమయంలో సంస్థ సిబ్బందిలో ఇద్దరి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయి. ఎంత నగదు పోయిందనే విషయంలో బాధిత సంస్థ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఘటనలో లోపలి వ్యక్తుల ప్రమేయం పైనా దర్యాప్తు జరుపుతున్నాం’అని తెలిపారు. కేసును ఛేదించేందుకు యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సాయం కూడా తీసుకుంటున్నామన్నారు. -
అన్నీ తానైన శశికళ..
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంతిమ సంస్కారంలో ఆమె స్నేహితురాలు అన్నీ తానై కార్యక్రమాలు నిర్వహించారు. రాజాజీ హాల్లో జయలలిత పార్ధివదేహం చుట్టూ సీఎం పన్నీర్ సెల్వం, శశికళ, ఆమె భర్త నటరాజన్, దత్తపుత్రుడు సుధాకర్, అన్న కూతురు దీప ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నారు. ఇంతకాలం జయలలిత దగ్గరకు రాకుండా ఉన్న శశికళ భర్త నటరాజన్ మంగళవారం ఆమె భౌతికకాయం వద్ద హడావుడి చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిన సమయంలో ఇతరులెవరూ దరిదాపుల్లోకి రాకుండా శశికళ కట్టడి చేయగలిగారు. హిందూ సంప్రదాయం ప్రకారం దత్త పుత్రుడు అంతిమ సంస్కారం చేయాల్సి ఉంది. అయితే జయ దత్తపుత్రుడు సుధాకర్‌కు ఆ అవకాశం కల్పిస్తే అధికారికంగా వారసుడిగా గుర్తించినట్లు అవుతుందనే భయంతో ఆయన్ను ఆ దరిదాపుల్లోకి కూడా రాకుండా చేశారు. గవర్నర్, సీఎం, మాజీ గవర్నర్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చివరిసారిగా పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించాక శవపేటిక మీద ఉంచిన జాతీయజెండాను తీసి శశికళకు అందించారు. ఆ తర్వాత ఆమె శవపేటిక చుట్టూ నీళ్లు, బియ్యం చల్లి, గంధపు చెక్కల ముక్కలు ఉంచి జయకు అంతిమ సంస్కారాలు చేశారు. స్నేహితురాలి పట్ల ఉన్న అపార అభిమానం చాటుకుని ఆమె రుణం తీర్చుకోవడానికే శశికళ తన చేతుల మీదుగా అంత్యక్రియలు చేశారని శశికళ మద్దతుదారులు చెబుతున్నారు. ఇకపై పార్టీలో, ప్రభుత్వంలో తాను ఏది చెబితే అదే జరుగుతుందని పరోక్షంగా చూపించుకోవడానికి జయ బంధువులెవరినీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చేశారని శశికళ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అన్నా డీఎంకేలో ఆధిపత్య పోరు కూడా కనిపించింది. తన స్నేహితురాలి చివరి యాత్ర తన ఇష్ట్రపకారమే జరగాలని పట్టుబట్టిన ఆమె స్నేహితురాలు శశికళ తన పంతం నెగ్గించుకున్నారు. నేస్తం మాటే నెగ్గింది... అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచినప్పటి నుంచి ఆమె అంత్యక్రియల నిర్వహణపై పన్నీర్ సెల్వం, శశికళ తమ మాట చెల్లుబాటు అయ్యేలా ప్రయత్నించారు. దేశవ్యాప్తంగా ఉక్కు మహిళగా పేరు పొందిన అమ్మ పార్థివ దేహాన్ని మంగళ, బుధవారాలు ప్రజల సందర్శనార్థం ఉంచి గురువారం అంత్యక్రియలు చేరుుంచాలని పన్నీర్ సెల్వం భావించారు. మంగళవారం వీఐపీలు ఆమె భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి వెళితే, బుధ, గురువారాలు సాధారణ ప్రజలకు చివరి చూపు అవకాశం కల్పించాలని ఆయన భావించారు. మూడు రోజుల పాటు మృత దేహాన్ని ఉంచుకోవడానికి అవసరమైన వైద్య సహాయం ఏర్పాటు చేరుుంచాలని కూడా యోచించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సోమవారం రాత్రి అపోలో ఆసుపత్రిలో చర్చలు జరిపిన సందర్భంలో సెల్వం తన అభిప్రాయాలను తెలియచేశారు. ఇదే చర్చల్లో పాల్గొన్న శశికళ మంగళవారమే అంత్యక్రియలు పూర్తి చేద్దామని స్పష్టంచేశారు. ఆలస్యం అయ్యే కొద్దీ పార్టీ శ్రేణులు, ప్రజలను అదుపు చేయడం ఇబ్బంది అవుతుందని ఆమె గట్టిగా చెప్పారు. చివరకు ఆమె మాటే నెగ్గి మంగళవారం సాయంత్రమే అంత్యక్రియలు చేయాలని నిర్ణరుుంచారు. అతనెవరు?: మెరీనా బీచ్ ఒడ్డున జయలలిత అంతిమ సంస్కారం చేస్తున్న సమయంలో మొదటి నుంచి చివరి దాకా శశికళ వెన్నంటే ఉన్న యువకుడు ఎవరు? అతనికి అంత ప్రాధాన్యత ఎలా దక్కింది? అని అన్నా డీఎంకే పార్టీ ముఖ్యులతో పాటు, తమిళ మీడియా సంస్థలు ఆరా తీశారుు. అతను జయలలిత సోదరుడు జయకుమార్ కొడుకు దీపక్‌గా గుర్తించారు. ఇప్పటివరకు ఎవరో కూడా తెలియని దీపక్‌కు శశికళ అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారనేది రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది. ఉదయం నుంచి వెంకయ్య అక్కడే రాజాజీ హాల్‌కు ఉదయం 8గంటలకు జయలలిత భౌతికకాయం వచ్చినప్పటినుంచి మెరీనా బీచ్ ఒడ్డున అంత్యక్రియలు ముగిసే వరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అక్కడే గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకే వెంకయ్య తొలి నుంచి చివరివరకు అంతిమ సంస్కారాలను దగ్గరుండి నడిపించారని బీజేపీ వర్గాలు చెబుతున్నారుు. -
అమ్మ పేరుతోనే మొదలు..
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలున్న ప్రతి రోజూ సభల్లో పురచ్చితలైవి, అమ్మ అంటూ జయలలిత పేరు వినిపించని రోజు ఉండదంటే అతిశయోక్తి లేదు. లోక్‌సభలో 37 మంది సభ్యులతో మూడో అతి పెద్ద పార్టీగా, రాజ్యసభలో 13 మంది సభ్యులతో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న ఏఐడీఎంకే నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతి సభ్యుడు ఉభయ సభల్లో తాము ప్రసంగించే ముందు జయలలితకు కృతజ్ఞతలు చెప్పడం ఆనవాయితీ. అలా ఏ సభ్యుడైనా అమ్మ పేరు సంబోధించినప్పుడు మిగిలిన సభ్యులు బల్లలు చరుస్తారు. దీంతో సభలోని దాదాపు అన్ని పార్టీల ఇతర సభ్యులు కూడా ఆసక్తిగా వినడం కనిపిస్తుంది. అలా ప్రతిసారి సంబోధించడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించినా.. వారి నాయకురాలిపై ఆ సభ్యులకు ఉన్న వాత్సల్యం అబ్బురపరుస్తుంది. సభ్యులు తమ ప్రసంగాల్లో జయలలిత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనియాడుతూ తమ ప్రసంగాలను ముగిస్తారు. జైలు జీవితంలో వైరాగ్యం సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు జీవితంలో వచ్చిన వైరాగ్యం, తీవ్రమైన మధుమేహం, వైద్య చికిత్సలపై నిరాసక్తత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రాణాలను హరించి వేశారుు. జయలలిత సుమారు 45 ఏళ్ల వయస్సులోనే మధుమేహ వ్యాధి బారినపడ్డారు. తీరికలేని రాజకీయ జీవితం వల్ల ఆ వ్యాధి రానురానూ మరింత ముదిరింది. ఆసుపత్రిలో చేరితే ప్రచారం జరుగుతుందని వెనకంజ వేసిన జయలలిత కొన్నాళ్లు ఇంటి వద్దే చికిత్స చేరుుంచుకున్నారు. అరుుతే టాన్సీ భూముల కుంభకోణంపై ఒకసారి జైలుకు వెళ్లిన జయ.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014లో కొన్నాళ్లు బెంగళూరులో జైలు జీవితం గడిపారు. రెండోసారి జైలు జీవితం మానసికంగా వైరాగ్యానికి దారితీసింది. జైలులో ఉన్నపుడు చికిత్స చేసేందుకు వచ్చిన వైద్యులను దరిచేరనీయలేదు. మందులు వేసుకునేందుకు నిరాకరించారు. విషాదాల డిసెంబర్ సాక్షి, చెన్నై: తమిళనాడుకు డిసెంబర్ నెల ఎప్పుడూ విషాదాన్నే అందిస్తోంది. ప్రజల మనసులు గెలుచ్చుకున్న మహానాయకుల మరణాలు కానీ.. ప్రజలను కకావికలం చేసే పెను విపత్తులు గానీ డిసెంబర్లోనే అధికంగా సంభవించడం కాకతాళీయం! అందులో ముఖ్య ఘటనలు... 2016: డిసెంబర్ 5: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం. 2015:డిసెంబర్: అనూహ్యంగా వచ్చిపడ్డ కుండపోత వర్షాలు చెన్నై, కాంచీపురం, కడలూరు, తిరువళ్లూరు, తూత్తుకుడి తదితర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. అధికారిక లెక్కల ప్రకారం 422 మంది మృత్యువాతపడ్డారు. 2004: డిసెంబర్ 26: సునామీ విరుచుకుపడింది. భారత తీరంలో దాదాపు 20 వేల మందిని కబళించింది. అందులో అత్యధికులు తమిళులే. ఆ సునామీ వల్ల 6.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1987: డిసెంబర్ 24: అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జి.రామచంద్రన్ మృతి చెందారు. ఆయన అభిమానులు 100 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. 972: డిసెంబర్ 25: స్వతంత్ర భారతదేశం మొదటి, చివరి గవర్నర్ జనరల్, సంయుక్త మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సి.రాజగోపాలాచారి మృతి చెందారు. 1973: డిసెంబర్ 24: సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర ఉద్యమకారుడు, ఆత్మగౌరవ ఉద్యమ ఆద్యుడు, ద్రవిడ కళగం వ్యవస్థాపకుడు ‘పెరియార్’ రామస్వామి మరణించారు. 1964: డిసెంబర్ 22: భారీ తుఫాను తమిళనాడును ముఖ్యంగా దక్షిణ తీరాన్ని అతలాకుతలం చేసింది. రామేశ్వరం నుంచి పంబన్ బ్రిడ్జి మీదుగా వెళ్తున్న రైలును సముద్రం మింగేసింది. ఈ ప్రమాదంలో 115 మంది ప్రయాణికులు మృతి చెందారు. తీరంలో మరో 800 మందికి పైగా ప్రజలు చనిపోయారు. -
అమ్మలోటు తీర్చేదెవరు?
సీఎం పదవిని శశికళ ఎందుకు కోరలేదు? మరణించేవరకూ జయ వెన్నంటి ఉన్న శశికళ ముఖ్యమంత్రి పదవిని ఎందుకు కోరలేదు? అన్న ప్రశ్నకు రాజకీయ పండితులు అనేక కారణాలు చెబుతున్నారు. జయ, శశికళను పట్టి పీడిస్తున్న అక్రమాస్తుల కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. జయ కన్నుమూసినా-ఈ కేసు నడుస్తుంది. శశికళ ఈ కేసులో రెండో ముద్దాయి. ఈ కారణంగానే ఆమె సీఎం పదవి ఆశించలేదని చెబుతున్నారు. ఆమె సుప్రీంకోర్టు నుంచి నిర్దోషిగా బయటపడే వరకూ ముఖ్యమంత్రి పదవిపై కన్నేయకపోవచ్చు. ‘అమ్మ’ బతికుండగా చట్టపరమైన ఇబ్బందులొచ్చినప్పుడు మాత్రమే సీఎం పదవి చేపట్టిన అనుభవం పన్నీర్సెల్వంది. ఇప్పుడు, శశికళను ఇబ్బందిపెట్టకుండా, అలా అని కీలుబొమ్మ సీఎం అని పేరు తెచ్చుకోకుండా బండి నడపడం ఆయనకు కుదిరేపని కాదు. ఈ క్రమంలో ఈ ఇద్దరు తేవర్ల మధ్య విభేదాలొస్తే ప్రభుత్వం కూలిపోతుంది. డీఎంకే, దాని అధినేత ఎం.కరుణానిధిని బూచిగా చూపించి అన్నాడీఎంకేలో సాధిస్తున్న ఐక్యత ఎక్కువ కాలం నిలబడదు. శశికళ కారణంగా తేవర్లు ఇప్పటికే ఏఐఏడీఎంకేలో ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నారనే ఆరోపణ ఉంది. జయలేని ఈ పరిస్థితుల్లో శశికళ, ఆమె కుటుంబ సభ్యుల కారణంగా రాష్ట్రంలో తేవర్ల ఆధిపత్యం కనిపిస్తే అది ఈ పార్టీకి శాపమవుతుంది. దాదాపు వందేళ్ల తమిళ రాజకీయాల్లో ‘బ్రాహ్మణేతర ప్రజాస్వామ్యం’ బలపడింది. అంటే తమిళనాట ఏ ఒక్క కులం ఆధిపత్యం లేకుండా పాలన, రాజకీయాలు నడుస్తున్నాయి. డీఎంకేలో సైతం తేవర్లకు తగినంత ప్రాతినిధ్యం ఉంది. అసెంబ్లీలో 42 మంది తేవర్లు ఎమ్మేలేలున్నా, జయ మంత్రివర్గంలో గౌండర్లకు తగినంత వాటా ఇచ్చారు. ఒకవేళ సెల్వం, శశికళ ఏకమైతే, పార్టీలో గౌండర్, నాడార్, వన్నియార్ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలందరూ చేతులు కలిపితే డీఎంకేలో చేరడానికి ఫిరాయింపు నిరోధకచట్టం అడ్డంకి కాదని తమిళ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ నిర్మాణం బలహీనం డీఎంకే సంస్థాగత నిర్మాణం పటిష్టమైంది. క్రమం తప్పకుం డా అన్ని జిల్లాల్లో పార్టీ కమిటీలకు ఎన్నికల ద్వారా మాత్రమే నేతలను ఎన్నుకుంటారు. నాయకత్వం మాత్రమే కరుణానిధి కుటుంబం గుప్పిట్లో ఉంది. ఏఐఏడీఎంకేకు అలాంటి బలమైన వ్యవస్థ లేదు. జయ వంటి నేత లేనప్పుడు ఏఐఏడీఎంకే బలహీన మయ్యే ప్రమాదముంది. బీజేపీ ఏఐఏడీఎంకే అంతర్గత రాజకీయా ల్లో పెద్దగా జోక్యం చేసుకోదనే వాదన వినిపిస్తోంది. నరేంద్రమోదీ ప్రభుత్వంగాని, బీజేపీ కేంద్ర నాయకత్వంగాని ప్రస్తుత సెల్వం సర్కారును నిలబెట్టడానికి ప్రయత్నించకపోవచ్చు. కర్ణాటకలో మాదిరిగా విస్తరించడానికి వీలులేని తమిళనాట మితిమీరిన రాజకీయం చేసి నష్టపోయే స్థితిలో బీజేపీ లేదు. పన్నీర్‌సెల్వంను వద్దునుకుంటే- ప్రధాన శూద్రకులాలు తేవర్లు, కొంగు వెల్లాల గౌండర్ల మధ్య రాజీ కుదిరితే లోక్‌సభ డెప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురైకి అవకాశం రావచ్చని ప్రచారం జరుగుతోంది. తేవర్ల ‘ఆధిపత్యం’ కరుణకు ఆయుధమవుతుందా? జయ నీడన శశికళ నాయకత్వాన తేవర్లు డీఎంకే హయాంతో పోల్చితే కాస్త ఎక్కువ అధికారం అనుభవిస్తున్నారు. ఎంతకాదన్నా జయ కులాలకు ప్రాధాన్యం విషయంలో సమతూకం పాటించారు. అలాకాక పన్నీర్‌సెల్వం, శశికళ ఓ అవగాహనకు వచ్చి లేదా రాకుండా పాలనలో తేవర్ల ఆధిపత్యాన్ని తీసుకొస్తే అది కరుణానిధికి పదునైన ఆయుధమవుతుంది. కొద్ది నెలలకైనా ఏఐడీఎంకేలో కీచులాటలను వాడుకోవడానికి కరుణ రంగంలోకి దిగుతారు. తేవరేతర కులాలను ఏకం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇలాంటి ప్రమాదాలు రాకుండా జాగ్రత్తగా పార్టీని, ప్రభుత్వాన్ని సాఫీగా నడిపే సామర్ధ్యం ఏఐడీఎంకే నాయకత్వానికి లేవు. మరో విధంగా చెప్పాలంటే-సెల్వం డా.మన్మోహన్సింగ్ కాదు. శశికళ సోనియాగాంధీ కాదు. తమిళనాట గౌండర్లు, తేవర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటే, ఉత్తర జిల్లాల్లో వన్నియార్లు ఎక్కువ. మదురై నుంచి కన్యాకుమారి జిల్లా వరకూ నాడార్ల ఉనికి బాగా కనిపిస్తుంది. ఏఐఏడీఎంకే భవిష్యత్? ‘‘జయ మరణం తర్వాత ఏఐఏడీఎంకే చీలిపోతుందని భావిస్తున్నా. 30 శాతం పార్టీ ఎమ్యెలేలు తేవర్ కులానికి చెందినవారు (పన్నీర్ సెల్వం, శశికళ-ఇద్దరూ తేవర్లే). దాదాపు 70 శాతము న్న తేవరేతర శాసనసభ్యులు తేవర్ల ఆధిపత్యాన్ని సహించక పోవచ్చు.’’ జయలలిత చనిపోయాక తమిళనాడు పాలకపక్షం భవితవ్యంపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి చెప్పిన మాటలివి. కొత్త సీఎంగా పన్నీర్‌కు పార్టీ ఉన్నతస్థాయి సమావేశంలో మద్దతు లభించింది. పార్టీ నాయక త్వాన్ని శశికళకు అప్పగించడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని మంగళవారం రాత్రి చెన్నై నుంచి వార్తలొచ్చాయి. జయలలిత అనంతర పరిస్థితుల్లో ఏఐఏడీఎంకే భవిష్యత్తు ఎలా ఉంటుందనే ప్రశ్నకు జవాబు మాత్రం కొన్ని నెలల తర్వాత లభించవచ్చు. డీఎంకేకే అడ్వాంటేజ్! 92 ఏళ్లు దాటిన కరుణానిధి ఎక్కువ కాలం బతక్కపోవచ్చేమోగాని ఆయన మరణానంతరం డీఎంకేను నిలబెట్టడానికి ఆయన చిన్న కొడుకు, మాజీ డెప్యూటీ సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు, చిన్న కూతురు కనిమొళి ఉన్నారు. 29 ఏళ్ల క్రితంఎంజీఆర్ మరణానంతర పరిస్థితులను డీఎంకేకు అనుకూలంగా కరుణ మార్చగలిగారు. ఇప్పుడు కూడా ఏఐడీఎంకే కీచులాటలు ప్రమాదకర స్థాయికి చేరితే లబ్ధిపొందేది మళ్లీ డీఎంకేయే. ఏ రకంగా చూసినా ఏఐఏడీఎంకేను 2021 మే అసెంబ్లీ ఎన్నిక ల వరకూ నడిపించే గట్టి నాయకుడే కనిపించడం లేదు. ఎంజీఆర్ మరణానంతర పరిణామాలు పునరావృతం కావేమో! 1987 డిసెంబర్లో పార్టీ స్థాపకుడు, సీఎం ఎం.జి.రామచంద్రన్ మరణించాక జరిగిన పరిణామాలు పునరావృతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అప్పట్లో ఇద్దరు సీఎంలు(వీఆర్ నెడుంజెళియన్, జానకీ రామచంద్రన్) రెండు నెలల్లోపే అధికారం కోల్పోయాక ఎంజీఆర్ వారసురాలిగా జయలలిత ఆవిర్భవించారు. అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటలను సాకుగా చూపి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం దాదాపు ఏడాది రాష్ట్రపతి పాలన విధించింది. 1988 జనవరి ఎన్నికల్ల్లో ఓడినా 1991 మే నాటికి జయలలిత సీఎం అయ్యారు. జయ మాదిరి జనాకర్షణ శక్తి ఉన్న నేత పాలకపక్షంలో హఠాత్తుగా పుట్టుకొచ్చే అవకాశాలు లేవు. తమిళ హీరో అజిత్‌కుమార్‌ను జయ తన వారసుడని చెప్పారని జరుగుతున్న ప్రచారానికి అధారాలు సృష్టిస్తే తప్ప ఆయన రంగం మీదకు రావడం కష్టం.