ఎమ్జీఆర్ చిత్ర రీమేక్‌లో విజయ్? | Vijay to act in MGR film remake | Sakshi
Sakshi News home page

ఎమ్జీఆర్ చిత్ర రీమేక్‌లో విజయ్?

Published Mon, Feb 29 2016 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

ఎమ్జీఆర్ చిత్ర రీమేక్‌లో విజయ్?

ఎమ్జీఆర్ చిత్ర రీమేక్‌లో విజయ్?

 ఎమ్జీఆర్ చిత్ర రీమేక్‌లో విజయ్ నటించనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌లో అవునంటూ ప్రచారం జరుగుతోంది. దివంగత మక్కల్ తిలగమ్ ఎమ్జీఆర్ నటించిన ఇంగ వీటి పిళ్లై చిత్ర రీమేక్‌లో నటించాలన్న ఆకాంక్షను ఈ తరం నటులు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అందులో ఇళయదళపతి విజయ్ పేరు ఉండటం గమనార్హం. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన రెండుకు పైగా పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.
 
 ఇందులో సమంత, ఎమీజాక్సన్‌లు ఆయనతో రొమాన్స్ చేస్తున్నారు. తెరి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మార్చిలో ఆడియో, ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత కలైపులి ధాను సన్నాహాలు చేస్తున్నారు. కాగా విజయ్ త దుపరి భరతన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది ఆయన 60 వ చిత్రం అన్నది గమనార్హం. కీర్తీసురేశ్ కథానాయకిగా నటించనున్న ఈ చిత్రంలో మరో ఇద్దరు బ్యూటీస్ కూడా నటించనున్నట్లు తాజా సమాచారం.
 
 అందులో ఒకరు క్రేజీ భామ కాజల్‌అగర్వాల్ అనీ, మరో నటి ఐశ్వర్య రాజేశ్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు భరతన్ దర్శకత్వంలో విజయ్ అళగీయ తిరుమగన్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. కాగా ఈ తాజా చిత్రంలో కూడా విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నారనీ తెలిసింది. మరో విశేషం ఏమిటంటే విజయ్ నటించనున్న 60వ చిత్రం ఎమ్జీఆర్ నటించిన ఇంగ వీటిపిళ్లైకి రీమేక్ అని కోలీవుడ్ వర్గాల బోగట్టా.
 
  అందులో ఎమ్జీఆర్ అమాయకపు యువకుడిగానూ ధైర్యవంతుడిగానూ రెండు వైవిధ్యభరిత పాత్రల్లో నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. అలాంటి చిత్రాన్ని చిన్న చిన్న మార్పులతో విజయ్ హీరోగా తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే ఎమ్జీఆర్ నటిం చిన ఇంగ వీటిపిళ్లై చిత్రాన్ని విజయా సంస్థే నిర్మించిందన్నది గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement