ఎంజీఆర్‌ లతను తడిమిన దానికంటే ఘోరంగా ఆడుతున్నారు.. | South Indian Actors Club Notice to Actress Kasthuri | Sakshi
Sakshi News home page

నటి కస్తూరికి నోటీసులు

Published Fri, Apr 12 2019 8:52 AM | Last Updated on Fri, Apr 12 2019 8:52 AM

South Indian Actors Club Notice to Actress Kasthuri - Sakshi

కస్తూరి

తమిళనాడు, పెరంబూరు:  నటి కస్తూరికి దక్షిణ భారత నటీనటుల సంఘం నోటీసులు జారీ చేసింది. నటి కస్తూరి ఇటీవల ప్రతి విషయానికి స్పందిస్తూ ట్విట్టర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలను పొందుపరుస్తూ వార్తలకెక్కుతోంది. అదే విధంగా ఇటీవల జరిగిన టీ.20 క్రికెట్‌ క్రీడను తిలకిస్తూ కోల్‌కొత్తా టీమ్‌ నత్తనడక క్రీడపై ట్విట్టర్‌లో ఏంటయ్యా పళ్లాండు వాళ్గ చిత్రంలో ఎంజీఆర్‌ నటి లతను తడిమిన దానికంటే ఘోరంగా ఆడుతున్నారు అని పేర్కొంది. ఇది కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. అన్నాడీఎంకే కార్యకర్తలు, ఎంజీఆర్‌ అభిమానులు నటి కస్తూరిని సామాజిక మాధ్యమాల్లో ఏకేస్తున్నారు.

ఇక నటి లత కూడా కస్తూరికి సీరియస్‌గా హెచ్చరించారు. ఇలాంటి చీప్‌ ట్వీట్‌లతో ప్రచారం పొందాలను చూడడం కంటే మరేదైనా చేసుకోవచ్చుగా అని విమర్శించారు.కాగా నటి కస్తూరి వ్యవహారం గురించి దక్షిణభారత నటీనటులు సంఘం స్పందిస్తూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. అందులో ఎంజీఆర్, నటి లతలపై, ఆమె చేసిన కామెంట్‌కు విరవణ ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు. నటి కస్తూరి తాను నటి లతపై ఎలాంటి విమర్శలు చేయలేదని, అయినా తన ట్వీట్‌ ఎవరినైనా బాధించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని మరో ట్వీట్‌ చేసింది. కాగా నటీనటుల సంఘానికి ఏం వివరణ ఇచ్చుకుంటుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement