తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం గచ్చిబౌలిలో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. తాజాగా ఇవాళ ఆమెను చెన్నైలోనే ఎగ్మోర్ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 29 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు
కాగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల పరిపాలనలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారంది.
(ఇది చదవండి: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు.. కస్తూరి అరెస్ట్)
క్షమాపణలు చెప్పిన కస్తూరి
అలా వచ్చినవారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొంది. అలాగైతే ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై చెన్నైలో నివసించే తెలుగు వారు మండిపడ్డారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తెలుగువారికి కస్తూరి క్షమాపణలు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment