latha
-
Latha Mangipudi: హ్యారిస్ గెలిచి మహిళాశక్తిని గెలిపిస్తుంది
‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలాహ్యారిస్ గెలుస్తుంది. ఆమె గెలుపు మహిళాశక్తిని నిరూపిస్తుంది’ అంటున్నారు లత మంగిపూడి. అమెరికాలోని న్యూహ్యాంప్‌షైర్‌కు డెమోక్రటిక్ పార్టీ లెజిస్లేటర్‌గా ఉన్న లత ప్రస్తుతం కమలా హ్యారిస్ గెలుపు కోసం అహర్నిశలూ కృషి చేస్తున్నారు. అమెరికా మహిళల గురించి స్త్రీలకు ఉండాల్సిన దృక్పథం గురించి ఆమె తన అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు.‘ఒక విధంగా చె΄్పాలంటే అమెరికాలో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. అమెరికన్స్ మరోసారి ట్రంప్ నియంతృత్వ పాలనను అంగీకరించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరు. కమలా హ్యారిస్ గెలిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ. అందుకే ‘సేవ్ అవర్ డెమోక్రసీ’ అనే నినాదం తో మేం ప్రజల్లోకి వెళ్తున్నాం. కమలా హ్యారిస్ అమెరికా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడతారని బలంగా నమ్ముతున్నాను’ అన్నారు లత మంగిపూడి. మైసూరుకు చెందిన లత రాజమండ్రికి చెందిన కృష్ణ మంగిపూడిని వివాహం చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ వాసి అయ్యారు. 1985లో యూఎస్‌కు వెళ్లి స్థిరపడ్డారు. అనంతరం యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ న్యూహ్యాంప్‌షైర్ చాప్టర్‌కు 2006 నుంచి 2013 వరకు చైర్పర్సన్ గా కొనసాగారు. అలా ఆమె రాజకీయ జీవితం మొదలైంది. అప్పటి అధ్యక్షుడు ఒబామా, హిల్లరి క్లింటన్ వంటి ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత 2013 నుంచి ఇప్పటివరకు నాషువా నుంచి లెజిస్లేటర్‌గా గెలు΄÷ందుతూనే ఉన్నారు. కమలాహ్యారిస్ గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తూ పర్యటనలు చేస్తున్నారు.స్త్రీల హక్కులకు విఘాతం‘ప్రపంచంలో ఏ మహిళకైనా తన శరీరంపై తనకు పూర్తి హక్కు ఉండాలి. ఆమె తన ఆరోగ్యాన్ని కాపాడుకొనే అవకాశం ఉండాలి కదా. కానీ అమెరికాలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యం గా పిల్లల్ని కనాలా, వద్దా అనే అత్యంత కీలకమైన అంశంపైన మహిళలు తమ హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గర్భం దాల్చిన తరువాత తప్పనిసరిగా బిడ్డను కనాల్సిందే. కానీ బిడ్డను కనేందుకు ఆమె మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యరీత్యా సంసిద్ధంగా ఉండాలి. ఇది బిడ్డను కనాల్సిన తల్లి, డాక్టర్ నిర్ణయించవలసిన విషయం. ఇందులో ప్రభుత్వ జోక్యం అవసరం లేదు. కానీ బలవంతంగానైనా పిల్లలను కనాల్సిందేననడం సరి కాదు. అత్యాచారానికి గురైన వారు, లైంగిక దాడుల వల్ల గర్భవతులైన వాళ్లు కూడా బిడ్డల్ని కనాలంటే ఎలా? అమెరికా మహిళలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ఈ అంశంపై డెమోక్రటిక్ పార్టీ స్పష్టమైన వైఖరిని కలిగి ఉంది. మా పార్టీ గెలిస్తేనే మహిళల హక్కులకు రక్షణ లభిస్తుంది’ అన్నారామె.ఇంకా వివక్షేనా....‘విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు లభించడం లేదు. స్త్రీలు తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకు గురవుతున్నారు. చివరకు కొన్నిచోట్ల ఓటుహక్కును కూడా వినియోగించుకోలేని పరిస్థితి. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకొనే వాతావరణానికి రిపబ్లికన్ పార్టీ విఘాతం కలిగిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఓటుహక్కును ΄÷ందిన వాళ్లు, ఇమ్మిగ్రెంట్స్, కొన్నిచోట్ల మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకొనే అవకాశం లేదు. ఆ పార్టీ మరోసారి గెలిస్తే ఓటుహక్కు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఈసారి మహిళా గెలుపు ప్రజాస్వామిక గెలుపు’ అని ముగించారామె.– పగిడిపాల ఆంజనేయులుసాక్షి, హైదరాబాద్ -
ఆ మాట చెప్పడానికి నువ్వు ఎవరు..?
-
అటవీశాఖ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
మంచిర్యాలక్రైం: ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ వేధింపులు భరించలేక ఓ బీట్ ఆఫీసర్ ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన అటవీ శాఖలో చర్చనీయాంశంగా మారింది. బీట్ ఆఫీసర్ కథనం ప్రకారం... మంచిర్యాల జిల్లా కోటపల్లి అటవీ శాఖ రేంజ్ పరిధిలోని బీట్ ఆఫీసర్ లత ఇటీవల సెక్షన్ ఆఫీసర్ రాందాస్‌తో కలిసి వెంచవెల్లి బీట్‌లో ప్లాంటేషన్ నిర్వహించారు. ఇందుకుగాను సెక్షన్ ఆఫీసర్ రాందాస్ రూ.2 లక్షలు కూలీల వేతనాలు, ప్లాంటేషన్ నిర్వహణకు ఇచ్చారు. అయితే ఇవికాకుండా అదనంగా రూ.1.50 లక్షలను కూలీలకు చెల్లించాల్సి ఉందని, బిల్లు ఇవ్వాలని ఎఫ్ఆర్వో రవిని లత కోరగా అసభ్యకరంగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నారు. దీంతో ఆమె శుక్రవారంరాత్రి మంచిర్యాలలోని తన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన లత భర్త ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. డీఎఫ్‌వోకు ఒడిశా కూలీల ఫిర్యాదు ప్లాంటేషన్ పనులు చేసిన ఒడి శా కూలీలు కూలి డబ్బులు ఇవ్వాలని ఎఫ్ఆర్వోను కోరగా ‘కూలి లేదు, డబ్బులు లేవు, దిక్కున్నకాడ చెప్పుకోండి’అని బెదిరించారు. దీంతో వారంతా జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశీశ్ సింగ్‌కు ఫిర్యాదు చేయగా ఎఫ్ఆర్వోను మందలించారు. ఈ విషయా న్ని మనసులో పెట్టుకొన్న రవి శుక్రవారం తనను కా ర్యాలయానికి పిలిపించి దుర్భాషలాడారని లత ఆ రోపించారు. కాగా, వేధింపుల విషయమై ఎఫ్ఆర్వో రవిని సంప్రదించగా, తాను బీట్ ఆఫీసర్ లతను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని తెలిపారు. -
బతుకమ్మ ఆడుతూ మహిళ మృతి..
మహబూబ్‌నగర్: పీర్ల పండుగ వేడుకల్లో మహిళ బతుకమ్మ ఆడుతూ మృతి చెందిన ఘటన మండలంలోని చెన్నారంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లత(35)కు బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లికి చెందిన సైదులుతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. పీర్ల పండుగ సందర్భంగా ఆమె తల్లిగారి ఇంటికి వచ్చింది. శనివారం రాత్రి పీర్లచావిడి వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే కుటుంబసభ్యులు అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె భర్త ఊరైన కొండారెడ్డిపల్లికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమెకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
మద్యానికి, సిగరెట్లకు బానిసైన నన్ను ఆమె మార్చేసింది: రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు భార్య లత అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. చాలా సందర్భాల్లో ఆమె గురించి గొప్పగా చెప్పారు రజినీ. ఆమె వచ్చాక తన జీవితమే మారిందని పలు మార్లు చెప్పిన సూపర్‌స్టార్.. తాజాగా మరోసారి భార్య లతకు, ఆమెను పరిచయం చేసిన స్నేహితుడు మహేంద్రన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. జీవితాంతం వీరిద్దరికి రుణపడి ఉంటానన్నారు. ‘లత నా జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. ఆమెను చూసే క్రమశిక్షణ నేర్చుకున్నాను. బస్సు కండక్టర్‌గా ఉన్నప్పుడు రోజు మద్యం సేవించేవాడిని. సిగరెట్లు తాగేవాడిని. ఎక్కువగా మంసాహారం తినేవాడిని. ఈ మూడు అలవాట్లు ఆరోగ్యానికి మంచిది కాదు. నా భార్య లత తన ప్రేమతో నన్ను ఆ చెడు అలవాట్లకు దూరం చేసింది. ఆమె వల్లే నేను ఇప్పుడు ఆరోగ్యంగా, క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నాను’ అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. రజనీ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నారు. -
Viral: బ్యాండ్ వాయించి సీఎం ఏక్‌నాథ్‌కు వెల్కమ్ చెప్పిన భార్య
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి ఏక్నాథ్ షిండే తన సొంత నియోజకవర్గమైన థానే స్వగృహానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక శివసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. బ్యాండు, మేళాలు, బాణసంచా పేలుస్తూ శిండేకు ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి సతీమణి లతా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. షిండే రాక సందర్భంగా ఆమె స్వయంగా డ్రమ్స్ వాయించి భర్తకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బ్యాండ్, పాటు లతా షిండే డ్రమ్స్ వాయించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Wife of Maharashtra CM Eknath Shinde, Lata Shinde, beat a drum to welcome him in Thane yesterday, 5th July. He was arriving at his home for the first time after becoming the CM of the state and received a warm welcome from his supporters. pic.twitter.com/0yzZUDJvtY — ANI (@ANI) July 6, 2022 ఏ ఒక్క శివసైనికుడికి అన్యాయం జరగదు కాగా షిండే తన ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం ముంబై నుంచి థానేకు బస్సులో బయలుదేరారు. రాత్రి 9.30 గంటలకు థానే చేరుకున్నారు. ముఖ్యమంత్రిని చూసేందుకు వచ్చిన కార్యకర్తలు భారీ వర్షంలో అలాగే నిలుచుండి స్వాగతం పలికారు. సుమారు నాలుగు గంటల పాటు స్వాగత ర్యాలీ జరిగింది. దివంగత శివసేన నేత ఆనంద్ దిఘే స్మృతి స్ధలంవద్ద షిండే నివాళులర్పించారు. ఈ సందర్బంగా షిండే మాట్లాడుతూ.. దివంగత హిందు హృదయ్ సమ్రాట్, శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే, ధర్మవీర్ ఆనంద్ దిఘే ఆశీర్వాదంతో రాష్ట్రంలో శివసేన–బీజేపీ ప్రభుత్వం అస్థిత్వంలోకి వచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని, ఏ ఒక్క శివసైనికుడికి కూడా అన్యాయం జరగదని నూతన ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. చదవండి: Eknath Shinde-బీజేపీ మీరనుకుంటున్నట్టు కాదు: సీఎం షిండే ట్రాఫిక్ జామ్ శిండే స్వాగత కార్యక్రమం కారణంగా థానే–ముంబై సరిహద్దులో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. కొన్ని రోడ్లను మూసివేయాల్సి వచ్చింది. గత్యంతరం లేక వాహనాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఒక పక్క భారీ వర్షం, మరోపక్క రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా అప్పటికే థానేలో ట్రాఫిక్ మందకొడిగా సాగుతోంది. దీనికి తోడు సీఎంకు స్వాగతం పలికేందుకు అక్కడక్కడ ఏర్పాటుచేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు, కటౌట్లు ట్రాఫిక్‌ను మరింత ఇబ్బందులకు గురిచేశాయి. -
ఘోర రోడ్డుప్రమాదం.. ఆర్కిటెక్చర్ దుర్మరణం
మైసూరు: నగరంలోని పోలీస్ లేఔట్లో నివాసముంటున్న బీఎస్ఎన్ఎల్ రిటైర్డు ఉద్యోగి కూతురు లత (24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఒక ప్రైవేట్ కంపెనీలో ఆర్కిటెక్చర్‌గా పనిచేస్తున్న లత శుక్రవారం స్కూటర్లో ఆఫీసుకు వెళ్తోంది. రింగ్ రోడ్డులో బండిపాళ్య వద్ద వేగంగా వచ్చిన మరో స్కూటర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లత తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు పోయినట్లు వైద్యులు తెలిపారు. సిద్ధార్థ నగర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (పల్లెవెలుగు నుంచి ఏసీ వరకు.. అన్ని బస్సుల్లో తల్లులకు ప్రయాణం ఫ్రీ) -
బ్రేక్‌ఫాస్ట్‌తో స్కూల్ స్టార్ట్..
ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే ఓ మంచి ఆలోచన కొన్ని సమూహాలకు చేరువ చేస్తుంది. అది సమాజానికి మేలు చేసే ఆలోచన అయితే ఎంతో మందికి స్ఫూర్తి సందేశాన్ని అందిస్తుంది. హైదరాబాద్ తిరుమలగిరిలో ఉంటున్న లతా మారవేణి ఆలోచన ఇప్పుడు వందలాది పేద పిల్లల ఉదయాలను ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మార్చుతుంది. అదెలాగో తెలియాలంటే ఆమె చెప్పే విషయాలను మనమూ వినాలి.. ఆచరణలో పెట్టిన ఆలోచనలను తప్పక తెలుసుకోవాలి. ఆకలి, ఆనందం, వికాసం సహజంగా సర్కారు బడుల్లోనే పిల్లల ముఖాల్లో లభిస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. లతా మారవేణి తనకు వచ్చిన చదువును పిల్లలకు పంచేందుకు స్వచ్ఛందంగా స్కూళ్లకు వెళ్లడం మొదలుపెట్టారు. అక్కడ గమనించిన విషయాలు ప్రశ్నగా మదిలో మెదిలితే తనే పరిష్కారం కూడా వెదికారు. హైదరాబాద్‌లోని అల్వాల్, యాప్రాల్‌లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలోని 500 మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నారు లత మారవేణి. వాలంటీర్ల సాయంతో పిల్లలకు ప్రత్యేక క్లాసులు కూడా తీసుకుంటున్నారు. మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న లత హైదరాబాద్ సీఆర్పీఎఫ్లో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శేఖర్ మారవేని అర్ధాంగి. పరిచయమైన పాఠం ‘‘మా స్వస్థలం రాజన్న సిరిసిల్లలోని గంభీరావ్‌పేట. మా వారి ఉద్యోగరీత్యా అస్సామ్‌కి వెళ్లాం. తన డ్యూటీ రోజూ పధ్నాలుగు గంటలపైనే ఉండేది. నాకు రోజంతా ఒంటరిగా అనిపించేది. అప్పుడు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలకు వెళ్లాను. స్వచ్ఛందంగా చదువు చెబుతానని అనడంతో స్కూల్ వాళ్లు కూడా సంతోషంగా ఆహ్వానించారు. అలా రోజూ కొన్ని గంటలు స్కూల్లోనే గడిపేదాన్ని. మొదట్లో పుస్తకాలు, పెన్నులు పిల్లలకు ఇస్తుండేదాన్ని. రోజూ అలా వెళుతున్నప్పుడు గమనించిన విషయం – పిల్లల్లో చాలా మంది ఉదయం ఏమీ తినకుండానే బడికి వస్తున్నారు. మధ్యాహ్నం స్కూల్లోనే భోజనం ఉంటుంది. కొంతమంది పిల్లలు ఆ భోజనం కోసమే స్కూల్‌కి వస్తున్నారని కూడా తెలిసింది. కొన్నాళ్లు బిస్కెట్లు వంటివి ఇచ్చాను. నాతో పాటు అక్కడ పరిచయం అయినవారితో కలిసి కొంత ఎక్కువ మొత్తంలో ఉదయం పూట పిల్లలకు తినడానికి పండు, బిస్కెట్, ఎగ్ వంటివి ఇస్తుండేదాన్ని. అక్కడ రెండేళ్లు ఉన్న తర్వాత ఛత్తీస్‌గడ్‌కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ చూశాను. ఎక్కువ మంది గిరిజన పిల్లలు. పైగా అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అయినా నా కార్యక్రమాలూ అక్కడి స్కూళ్లలోనూ కొనసాగించాను. కొన్నిసార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ, ఆపలేదు. పిల్లలకు స్కూల్ అయిపోయాక కూడా చదువులు చెప్పడం కొనసాగించాను. అల్పాహారం తప్పనిసరి నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాం. ఓరోజు అల్వాల్, యాప్రాల్ ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లకు వెళ్లాను. డీఈఓ పర్మిషన్ తీసుకున్నాను. ఇక్కడ కూడా పిల్లల పరిస్థితి గమనించాక ఉదయం అల్పాహారం తప్పనిసరి అనిపించింది. ముందు కొన్ని రోజులు పిల్లలందరికీ పాలు ఇప్పించాను. కానీ, అవి కొందరికి పడేవి కావు. కొందరు పిల్లలు ఇష్టపడటం లేదు. దీంతో రాగి జావ, పాలు, బాదంపప్పు పొడి కలిపి ఒక్కొక్కరికి ఒక గ్లాసు చొప్పున ఇవ్వడం మొదలుపెట్టాను. దీనిని స్కూల్లో పిల్లలకు అప్పటికప్పుడు తయారుచేసి ఇస్తుంటాం. ఇది పిల్లలకు బలవర్ధకం. నాలుగు గంటలసేపు వారి ఆకలికి తట్టుకునే శక్తికూడా ఉంటుంది. ఇది క్రమంగా పెంచుతూ వచ్చాం. స్కూల్ ప్రిన్సిపల్ పిల్లల శారీరక ఎదుగుదల బాగుందని గ్రోత్ రిపోర్ట్ ఇచ్చారు. శారీరక ఎదుగుదల బాగుంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మేడ్చల్‌లోని కొన్ని స్కూళ్ల నుంచి మా దగ్గర కూడా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించమని అడుగుతున్నారు. నా ఈ ఆలోచన నచ్చిన వారితో కలిసి ‘వైట్’ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాం. ఇప్పుడు మేడ్చల్‌లోని అన్ని స్కూళ్లకు చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. ఈ యేడాది 1500 మందికి ఉదయం పూట బాలామృతం అందించాలని నిర్ణయించుకున్నాను. వాలంటీర్లతో కలిసి పిల్లలకు ఇంగ్లిష్, పెయింటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం అందించడానికి క్లాసులు తీసుకుంటున్నాం. ఐటి సెక్టార్ నుంచి కూడా కొందరు స్వచ్ఛందంగా వచ్చి మా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీటితో పాటు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లి వ్యసనాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ మా వారూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. స్కూల్ బ్రేక్ ఫాస్ట్ తోనే మొదలవుతుంది... అనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వానికి కూడా సబ్మిట్ చేశాం’’ అని వివరించారు లతామారవేణి. – నిర్మలారెడ్డి -
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి లతాశ్రీ
మర్రిపాలెం (విశాఖ ఉత్తరం): పసి హృదయం ప్రాణాంతక వ్యాధితో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. వైద్యానికి అవసరమైన సాయం అందించే చేతులకోసం ఆశగా ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. విశాఖ నగరంలోని బర్మా క్యాంపులో నివాసం ఉంటున్న కానూరి కోటేశ్వరరావు, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఏడవ తరగతి చదువుతున్న లతాశ్రీ యూరిన్ బ్లాడర్‌లో పెరాల్సిస్ స్ట్రోక్ రావడం వల్ల దాని ప్రభావం కిడ్నీపై చూపింది. దీనివల్ల ఆమె తరచూ జ్వరంతో బాధపడుతోంది. కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చూపిస్తే శస్త్ర చికిత్స అసాధ్యమని వైద్యులు చెప్పినట్టు వారు తెలిపారు. మందులు వాడుతున్నా వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడంతో లతాశ్రీని ఎంవీపీ కాలనీలో ఫిజియెథెరపీ కేంద్రంలో పరీక్షలు చేయించారు. ఫిజియోథెరపీ ద్వారా నయం చేస్తామని అక్కడ హామీ ఇచ్చినట్టు వారు వివరించారు. అయితే ఫిజియోథెరపీ ఖర్చుతో కూడినది కావడంతో వారు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రోజుకు రూ.2 వేలు ఖర్చు అవుతుందని రెండు నెలలపాటు ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పినట్టు లతాశ్రీ తల్లిదండ్రులు తెలిపారు. ఇంత మొత్తం భరించడం వాళ్లకు తలకు మించినదిగా మారింది. లతాశ్రీ తండ్రి ఆటో డ్రైవర్‌గా, తల్లి ఇళ్లల్లో పనిచేస్తూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. రెక్కాడితేనే గాని డొక్కాడని పరిస్థితుల్లో తాము ఫిజియోథెరపీ చేయించే స్థోమత లేదని వారు వాపోతున్నారు. దాతలు ముందకు వచ్చి ఫిజియోథెరపీకి అవసరమైన మొత్తాన్ని అందించి తమ కుమార్తె ప్రాణాలు కాపాడాలని వారు కోరుతున్నారు. వివరాలకు 9010943730 నంబరులో సంప్రదించాలని వారు తెలిపారు. ఫిజియోథెరపీ చేయించాలి మా మమ్మీ,డాడీల బాధ నన్ను మరింత మనోవేదనకు గురి చేస్తోంది. నేను వ్యాధి నుంచి బయట పడితే అందరిలా విద్యలో రాణించి వారికి కొండంత అండగా ఉందామనుకున్నాను. వైద్యానికి సాయం అందించే వారు (ఐఎఫ్ఎస్సీ: ఎస్బీఐ ఎన్0020573, ఖాతా: 36749638537, ఐటీఐ బ్రాంచి) నంబరులో జమచేసి ఆదుకోవాలి. – లతాశ్రీ, బాధిత చిన్నారి -
అందుకే అక్కడికి వెళ్లాడు: సురేశ్ భార్య
పెద్దఅంబర్‌పేట: తన భర్త సురేశ్ తహసీల్దార్‌ను హత్య చేయడానికి వెళ్లలేదని, ఆత్మహత్యాయత్నం చేసి భయపెట్టాలనుకున్నాడని.. ఈ విషయం ఆస్పత్రిలో తనతో చెప్పాడని సురేశ్ భార్య లత వెల్లడించింది. శుక్రవారం ఆమె గౌరెల్లిలో విలేకరులతో మాట్లాడింది. తహసీల్దార్‌కు లంచం ఇచ్చానని, మిగిలిన డబ్బులు ఇళ్లు అమ్మి ఇస్తానని ఒప్పుకున్నట్లు సురేశ్ తనతో చెప్పాడని వెల్లడించింది. తహసీల్దార్ మేడమ్ వినకపోవడంతోనే ఆమెను హత్య చేయాలని అనుకున్నట్లు చెప్పాడని తెలిపింది. తమ భూముల వివాదాలను అధికారులే తేల్చాలని లత వేడుకుంది. 1950 నుంచి తమ భూములను తామే సాగుచేసుకుం టున్నామని, అప్పటి నుంచి లేని సమస్యలు ఇప్పుడెందుకు వచ్చాయని సురేశ్ తండ్రి కృష్ణ ప్రశ్నించారు. సమస్యలన్నీ అధికారులే సృష్టించారన్నారు. తమ తండ్రి కూర వెంకయ్య పేరుతో అధికారులు గతంలోనే పట్టా పాసుపుస్తకాలు ఇచ్చారన్నారు. అయితే, 2016లో వాటిని రద్దు చేశారని తెలిపారు. కాగా అబ్దుల్లార్‌పూర్‌మెట్ తహశీల్దార్ చెరుకూరి విజయారెడ్డిని సురేశ్ అనే రైతు సోమవారం సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. తన భూమికి సంబంధించి పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించానని అతడు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సురేశ్ కూడా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం విదితమే. -
ఎంజీఆర్ లతను తడిమిన దానికంటే ఘోరంగా ఆడుతున్నారు..
తమిళనాడు, పెరంబూరు: నటి కస్తూరికి దక్షిణ భారత నటీనటుల సంఘం నోటీసులు జారీ చేసింది. నటి కస్తూరి ఇటీవల ప్రతి విషయానికి స్పందిస్తూ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలను పొందుపరుస్తూ వార్తలకెక్కుతోంది. అదే విధంగా ఇటీవల జరిగిన టీ.20 క్రికెట్ క్రీడను తిలకిస్తూ కోల్‌కొత్తా టీమ్ నత్తనడక క్రీడపై ట్విట్టర్లో ఏంటయ్యా పళ్లాండు వాళ్గ చిత్రంలో ఎంజీఆర్ నటి లతను తడిమిన దానికంటే ఘోరంగా ఆడుతున్నారు అని పేర్కొంది. ఇది కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. అన్నాడీఎంకే కార్యకర్తలు, ఎంజీఆర్ అభిమానులు నటి కస్తూరిని సామాజిక మాధ్యమాల్లో ఏకేస్తున్నారు. ఇక నటి లత కూడా కస్తూరికి సీరియస్‌గా హెచ్చరించారు. ఇలాంటి చీప్ ట్వీట్లతో ప్రచారం పొందాలను చూడడం కంటే మరేదైనా చేసుకోవచ్చుగా అని విమర్శించారు.కాగా నటి కస్తూరి వ్యవహారం గురించి దక్షిణభారత నటీనటులు సంఘం స్పందిస్తూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. అందులో ఎంజీఆర్, నటి లతలపై, ఆమె చేసిన కామెంట్‌కు విరవణ ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు. నటి కస్తూరి తాను నటి లతపై ఎలాంటి విమర్శలు చేయలేదని, అయినా తన ట్వీట్ ఎవరినైనా బాధించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని మరో ట్వీట్ చేసింది. కాగా నటీనటుల సంఘానికి ఏం వివరణ ఇచ్చుకుంటుందో చూడాలి. -
అసభ్యంగా మాట్లాడతావా? ఒళ్లు దగ్గర పెట్టుకో..
పెరంబూరు: తనను, ఎంజీఆర్‌ను అసభ్యంగా మాట్లాడతావా? ఒళ్లు దగ్గర పెట్టుకో. లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవలసి ఉంటుంది అని సీనియర్ నటి లత, నటి కస్తూరిని హెచ్చరించారు. నటి కస్తూరి ఇటీవల తరచూ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. అదేవిధంగా తాజాగా ఎంజీఆర్, లతను కించపరచే విధంగా మాట్లాడింది. ప్రస్తుతం టీ 20 క్రికెట్ క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం చెన్నైలో కోల్కత్తా, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్కత్తా జట్టు మందకొడిగా ఆడుతున్న తీరును ట్విట్టర్లో పేర్కొంటూ ఏంటయ్యా ఇది పళ్లాండు వాళ్గ చిత్రంలో వాద్యియార్ (ఎంజీఆర్) లతను తడిమిన దానికంటే అధికంగా తడుముతున్నారు అని వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేసింది. దీంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, ఎంజీఆర్ అభిమానులు కస్తూరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఆమెపై విమర్శల దాడి చేస్తున్నారు. కాగా కస్తూరి ట్వీట్‌పై నటి లత తీవ్రంగానే స్పందించారు. తనను, ఎంజీఆర్‌ను కలుపుతూ అసభ్య వ్యాఖ్యలు చేయడం వేదన కలిగించిందన్నారు. ఇంత అసభ్యంగా ట్వీట్ చేసిన నటి కస్తూరికి అణకువ, నాగరికం అవసరం అని అన్నారు. ఆమె నటించిన దానికంటే ఎక్కువగా తాము నటించలేదని అన్నారు. అప్పటి చిత్రాల్లోని పాటల సన్నివేశాలు ఎంత ఉన్నతంగా ఉండేవన్నది అందరికీ తెలుసన్నారు. నటి కస్తూరి తన ప్రవర్తనను మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని లత హెచ్చరించారు. -
ఎలాంటి పాత్రనైనా చేస్తా..
తమిళసినిమా: బుల్లితెర తారలు వెండితెరపై కనిపించాలని ఆరాట పడటం, అదే విధంగా వెండితెరపై ఏలిన తారలు బుల్లితెరను ఎంచుకోవడం పరిపాటిగా మారింది. అలా సినిమాల్లో రాణించాలని ఆరాట పడుతున్న మరో నటి లతారావ్. సినిమాలో ఏ తరహా పాత్రనైనా చేయడానికి రెడీ అంటోంది ఈ భామ. ఈమె గురించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు వెండితెరపైనా గుర్తింపు పొందుతోంది. ఇటీవల తెరపైకి వచ్చిన గడికార మణిదర్గళ్ చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంటున్న లతారావ్ ఈ సందర్భంగా తన ఆసక్తిని వ్యక్తం చేస్తూ బుల్లితెరపై నాలుగు భాషల్లో నటించి గుర్తింపు పొందానని చెప్పింది. అయితే ఇప్పుడు సినిమాల్లో రాణించాలన్న కోరికతో బుల్లి తెరకు స్వస్తి చెప్పానని తెలిపింది. ఇంతకుముందు తిల్లాలంగడి చిత్రంలో వడివేలుకు జంటగా కామెడీ పాత్రలో నటించినట్లు పేర్కొంది. అలా పరిచయం అయిన తాను శశికుమార్ దర్శకత్వం వహించిన ఈశన్ చిత్రంలో, సముద్రఖని దర్శకత్వం వహించిన నిమిర్న్దు నిల్, సుదీప్ హీరోగా కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ముడింజా ఇవన్ పుడి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించినట్లు తెలిపింది. తాజాగా కిశోర్‌కు జంటగా గడికార మనిదర్గళ్ చిత్రంలో నటించినట్లు చెప్పింది. ఇందులో మధ్య తరగతికి చెందిన ముగ్గురు పిల్లలకు తల్లిగా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించినట్లు చెప్పింది. అదే విధంగా ప్రస్తుతం భరత్ కథానాయకుడిగా నటిస్తున్న 8 చిత్రంలోనూ, వివేక్, దేవయాని కలిసి నటిస్తున్న ఎళుమిన్ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పింది. మరిన్ని మంచి పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నట్లు, ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అని నటి లతారావ్ పేర్కొంది. మొత్తం మీద మరో క్యారెక్టర్ ఆర్టిస్ కోలీవుడ్‌కు దొరికినట్టే. -
స్త్రీలోక సంచారం
రెండు వేర్వేరు కేసులలో తమిళ నటుడు రజనీకాంత్ భార్య లతకు, మాజీ మంత్రి పి.చిదంబరం భార్య నళినికి సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టుల నుండి చుక్కెదురైంది. రజనీ నటించిన ‘కొచ్చాడియన్’ (2014) నిర్మాణం కోసం ఓ మార్కెటింగ్ అండ్ మీడియా కంపెనీ నుంచి పది కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుని, తిరిగి చెల్లించకుండా చీటింగ్‌కు పాల్పడి కోర్టు ఆదేశించినప్పటికీ ఆ బకాయిలు చెల్లించనందుకు సుప్రీం కోర్టు తిరిగి లతపై క్రిమినల్ ప్రొసీడింగ్‌ని పునఃప్రారంభించగా, ‘శారద చిట్‌ఫండ్’ స్కామ్‌లో తనను విచారించడం కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపడాన్ని సవాల్ చేస్తూ న ళిని చేసిన అప్పీల్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది ::: హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 కింద తన భర్త నుంచి మధ్యంతర జీవనభృతి పొందడం కోసం దిగువ కోరు ్టనుంచి ఒక ముస్లిం మహిళ తెచ్చుకున్న ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం హైందవ మహిళకు మాత్రమే విడిపోయిన భర్త నుంచి ఆటోమేటిక్‌గా (కేసు వేయనప్పటికీ) జీవన భృతి పొందే హక్కు లభిస్తుందని, ముస్లిం మహిళ మాత్రం ముస్లిం వివాహ చట్టం ప్రకారం మొదట భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, జీవన భృతి ఇవ్వడం లేదని రుజువు చేసుకోవలసి ఉంటుందని జస్టిస్ వందన కస్రేకర్ ఆ ముస్లిం మహిళ అభ్యర్థనను తోసిపుచ్చారు . హైదరాబాద్ జె.ఎన్.టి.యు.లో ప్రస్తుతం జరుగుతున్న ఐదు రోజుల ‘ది హేగ్ ఇండియా సైబర్ సెక్యూరిటీ క్యాంప్’లో మహిళా ‘టెకీ’లే ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. హేగ్, నెదర్లాండ్స్, హైదరాబాద్‌లలో ఏకకాలంలో జరుగుతున్న ఈ క్యాంప్‌లో నాటో, చెక్‌పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ వంటి దిగ్గజాలు ఇస్తున్న సెక్యూరిటీ టిప్స్ గురించి తెలుసుకోడానికి మహిళలే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, హైదరాబాద్ క్యాంప్‌కు మొదటి రోజు హాజరైన 54 మందిలో 20 మంది మహిళలేనని క్యాంప్‌ను నిర్వహిస్తున్న హైదరాబాద్ సెక్యూరిటీ క్లస్టర్ వెల్లడించింది ::: మొదటిసారి డేటింగ్‌కి వెళ్లినప్పుడు అబ్బాయా.. అమ్మాయా.. ఎవరు బిల్లు కట్టాలన్న ప్రశ్న ఈ భూమండలంలో ప్రేమ మొదలైన నాటినుంచి ఉన్నప్పటికీ అమ్మాయిల్ని కాదని అబ్బాయిలే సాధారణంగా బిల్లు చెల్లిస్తుండటం కనిపిస్తుంది. అయితే మొదటిసారి డేటింగ్‌కి వెళ్లినప్పుడు బిల్లు కట్టాలన్న చొరవ అమ్మాయిల్లోనే ఎక్కువగా ఉంటుందని, ఆ చొరవపై అబ్బాయిలు నీళ్లు చల్లకూడదని డేటింగ్ యాప్ ‘బడూ’ జరిపిన అధ్యయనంలో తేటతెల్లమయింది ::: మేదే హొజాబ్రీ అనే ఇరాన్ యువతి తన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినందుకు ఇరాన్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేయడంపై ఆ దేశంలో ఇప్పుడు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మేదేను సమర్థిస్తూ, మత పెద్దల్ని విమర్శిస్తూ అక్కడి యువతీయువకులు సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన కామెంట్లు పెడుతూ, వీధులలో డ్యాన్స్‌లు చేస్తూ.. మేదే ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ దేశాల నడుమ దేశ ప్రతిష్టను పెంచేందుకు క్రౌన్ ప్రిన్స్ (వారసత్వంగా రాజు కాబోయే వ్యక్తి) మొహమ్మద్ బిన్‌సల్మాన్ అమలు పరుస్తున్న సంస్కరణల్లో భాగంగా ఇటీవలే మహిళల డ్రైవింగ్‌పై ఉన్న దశాబ్దాల నాటి నిషేధాన్ని ఎత్తి వేసిన సౌదీ అరేబియా ఇప్పుడు.. తన దేశ మహిళలకు ‘నోటరీ’ అధికారాన్ని కూడా ఇచ్చింది. ఈ అధికారంతో మహిళలు ఆటార్నీ హక్కులను ఇవ్వొచ్చు, రద్దు చేయవచ్చు. ఆస్తుల్ని బదలాయించవచ్చు. కంపెనీల స్థాపనకు అవసరమైన డాక్యుమెంట్లను స్టాంప్ వేసి, సంతకం పెట్టి ఇవ్వవొచు ::: యాక్సిస్ బ్యాంక్ ఎం.డి., సి.ఇ.వో. శిఖాశర్మ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగుస్తుండటంలో ఆమె స్థానంలో నియామకానికి బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ముగ్గురి పేర్లను ఆర్.బి.ఐ.కి పంపారు. అయితే ఆ ముగ్గురిలో ఒక్క మహిళ కూడా లేకపోవడం విశేషం ::: భార్యకు, కుమార్తెలకు కానుకగా ఇచ్చే ఆస్తులపై పన్ను విధింపును మినహాయిస్తూ ఆదాయ పన్ను చట్టంలో సవరణలు తేవాలని స్త్రీ, శిశు అభివృద్ధిశాఖ మంత్రి మనేకాగాంధీ, ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. దీనిపై పీయూష్ స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది. -
కిరాణా క్వీన్
జీవితంతో ఆమె చాలాకాలం పోరాడింది. రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేసింది! గ్రామస్థులు రక్షించడంతో కాస్త ఊపిరి తీసుకుంది. నేడు ఊరికే ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె పేరు లతా జాదవ్. ఊరు మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలోని తిల్వానీ గ్రామం. లతా జాదవ్ నడుపుతున్న కిరాణా షాపు మహిళలు కోరుకునే హక్కులకు ప్రతీకగా నిలుస్తుంది. అయితే ‘నేను పదో తరగతి తరవాత కూడా చదువుకుని ఉంటే నా పరిస్థితి వేరేగా ఉండేది’ అంటున్నారు ఆరు పదులు నిండిన లతా జాదవ్. గ్రామంలో కిరాణా షాపు పెట్టిన మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందినప్పటికీ ఆమె ఈ మాటలు అనడానికి వెనుక పెద్ద కథే ఉంది. తల్లి మాటపై పెళ్లి రెండు దశాబ్దాల క్రితమే లత స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు! అప్పటికి లత తల్లి అంగన్వాడీ టీచరు. వ్యవసాయ కూలీ కూడా. తండ్రి మూడు సంవత్సరాలు మిలటరీలో పనిచేసి తిరిగి గ్రామానికి వచ్చిన సమయం అది. ఆయనా ఓ పిండిమరలో పనికి కుదిరాడు. లత కూడా తన తల్లికి వదాంగే గ్రామం అంగన్వాడీలో సహాయానికి వెళ్లేది. కొంతకాలానికి అంగన్వాడీ మూత పడింది. తండ్రి క్యాన్సర్ బారిన పడి, కన్నుమూశాడు. దానితో ఇంటి బాధ్యత లత తల్లి మీద పడింది. ‘‘మేం ఏడుగురు పిల్లలం. ఇంతమందిని చదివించడం అమ్మకి కష్టమే అయినా, చేతనైనంతవరకు మమ్మల్ని చదివించింది’ అంటారు లత. పదో తరగతి పూర్తి కాగానే, లతకు వివాహం చేయాలనుకుంది లత తల్లి. పై చదువులు చదవాలని ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి మాటపై వివాహం చేసుకుంది లత. మెట్టినింట్లో నరకం అత్తవారింట్లో అడుగు పెట్టిన లత, మామగారి పొలంలో ఎనిమిదేళ్లు వ్యవసాయ కూలీగా పనిచేసింది. మామగారు తాగుబోతు. వచ్చిన ఆదాయం ఆ తాగుడికి, తాగి పడ్డ గొడవలకే సరిపోయేది. ఇంత జరుగుతున్నా అత్తగారు మామగారిని వెనకేసుకొచ్చేది. లత భర్త బలాసో జాదవ్ రైతు. సొంతంగా వ్యవసాయం చేస్తూనే కూలీగానూ పనిచేసేవాడు. ఏడాదిలో ఆరు నెలల పాటు, పక్క గ్రామంలో చెరకు కోతకు వెళ్లేవాడు. అతనూ మద్యానికి బానిసై, లతను హింసించడం ప్రారంభించాడు. తిరిగి తల్లి దగ్గరికే..! ‘‘ప్రతి రోజూ నన్ను కొట్టేవాడు. నేను పుస్తకాలు చదవడం ఆయనకు నచ్చేది కాదు. రెండు మూడుసార్లు నా కళ్లజోడు కూడా పగలగొట్టేశాడు. నేను కిరాణా షాపు పెట్టిన తరవాత, అక్కడకు వచ్చి అనేకసార్లు నన్ను జుట్టుపట్టి లాగి, షాపు నుంచి బయటకు ఈడ్చేశాడు. అతని బారినుంచి తప్పించుకోవడానికి ఒక్కోసారి నేను షాపులో తాళం వేసుకుని ఉండేదాన్ని. ఒక్కోసారి గళ్లాపెట్టిలో డబ్బులన్నీ లాక్కెళ్లిపోయేవాడు’’ అని.. నాటి రోజుల్ని తలచుకుని కన్నీటి పర్యంతం అవుతుంది లత. ఇంత జరుగుతున్నా ఎవరూ జోక్యం చేసుకోకపోయేసరికి తన కష్టాలను పంచాయితీ దృష్టికి తీసుకెళ్లారు లత. అక్కడా న్యాయం జరగలేదు. ఇక చేసేది లేక వదాంగేలో ఉంటున్న తల్లి దగ్గరకు వెళ్లిపోయింది. లత పుట్టింటికి వెళ్లిన సమయంలో, ఆమె చచ్చిపోయిందని నమ్మించి, ఆమె భర్త మరో వివాహం చేసుకున్నాడు! కొత్తగా వచ్చిన భార్యకు అసలు విషయం తెలియడంతో ఆమె కూడా అతడిని వదిలి వెళ్లిపోయింది. మారాను రమ్మని పిలిచి లత పుట్టింట్లో ఉన్న రోజుల్లో ఒకరోజు భర్త ఆ ఊరు వచ్చి, బడిలో ఉన్న కొడుకును తీసుకెళ్లిపోయాడు! కూతురిని మాత్రం తీసుకువెళ్లలేదు. రెండేళ్లు గడిచాయి. ‘నేను మారాను. నిన్ను ప్రేమగా చూసుకుంటాను’ అని ఇంటికి తిరిగి రమ్మని బతిమాలాడు. భర్త కపట ప్రేమను నమ్మి, లత తిరిగి భర్త ఇంటికి చేరింది. మళ్లీ అదే చేదు అనుభవం! మద్యం సేవించి తనను కొట్టడం మొదలుపెట్టాడు. ఆ వేధింపుల్ని భరించలేక ఒకరోజు లత ఆత్మహత్య చేసుకోవాలని అరవై అడుగుల లోతు ఉన్న బావిలో దూకబోయింది. కొడుకు అది గమనించి పెద్దగా అరిస్తే ఇరుగుపొరుగు వచ్చి కాపాడారు. వద్దంటే వద్దన్నాడు! కొడుకు పెద్దయ్యాక సైకిల్ రిపేర్ షాపు పెట్టాడు. అప్పుడే, 1990 ప్రాంతంలో లత కిరాణా కొట్టు పెట్టాలని నిశ్చయించుకుంది. కొడుకుని వ్యవసాయం వైపు ప్రోత్సహించింది. కిరాణా కొట్టు ప్రారంభించే విషయంలో భర్త నుంచి ఎంత వ్యతిరేకించినా వచ్చినా పట్టించుకోలేదు. స్వతంత్రంగా బతకాలనే తన కల నెరవేర్చుకోడానికి లత దేనినైనా విడిచిపెట్టేందుకు ఆమె సిద్ధపడుతుందని భర్త అర్థం చేసుకున్నాడు. అలా తిల్వానీ గ్రామంలో మగవారి సహాయం లేకుండా కిరాణా దుకాణం ప్రారంభించిన మొట్టమొదటి మహిళగా నిలిచింది లత. కొట్టు నడుపుతూ పొలం కొనుక్కుంది లత దైనందిన జీవితం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది. ఆవు, గేదెల పాలు పిండి, పేడంతా ఒక చోటకు చేర్చుతుంది. ఆ తరువాత కిరాణా దుకాణానికి Ðð ళ్లి, మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేస్తుంది. మళ్లీ సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు కిరాణా దుకాణంలో ఉంటుంది. వారానికి మూడురోజులు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాజని గ్రామానికి వెళ్లి పశువులకు దాణా తీసుకువస్తుంది. ఇప్పుడు లత కేవలం కిరాణా షాపు సొంతదారు మాత్రమే కాదు, సమీప గ్రామంలో అర ఎకరం పొలానికి రైతు కూడా. ఇక భర్త అంటారా.. గత ఏడాది జరిగిన ఒక ప్రమాదంలో మరణించాడు. ‘ఆ ఘటన జరగడానికి రెండేళ్ల ముందు నుంచీ నన్ను కొట్టడం మానేశాడు’ అని గుర్తు చేసుకుంటుంది లతా జాదవ్. – రోహిణి -
ఆమె సంక్షేమమే ధ్యేయం
ఇల్లు, కాలేజీ తప్ప మరో లోకం లేకుండా ఇంటర్ పూర్తయింది. 17ఏళ్లకేపెళ్లయింది. అయితే అందరిలాతన జీవితం వంటింటికే పరిమితంకావొద్దని, తన కాళ్ల మీద తానునిలబడాలని నిర్ణయించుకుంది. భర్త సహకారంతో డిగ్రీ పూర్తి చేసి, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను స్థాపించింది. జీవితమంటే తానుబతకడం కాదు... పది మందినిబతికించడంలోనే అసలు అర్థం ఉందని భావించింది. సమాజాన్నిసరికొత్తగా చూడాలనుకుంది. మహిళా సంక్షేమమే ధ్యేయంగా ‘ఉమన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేసింది. ఆమే నిజాంపేట్‌కు చెందిన లతాచౌదరి. సాక్షి, సిటీబ్యూరో: జీవితంలోస్థిరపడిపోయిన లతాచౌదరి... అంతటితో రిలాక్స్ అయిపోకూడదని అనుకుంది.వివక్షపైపోరాడాలనుకుంది. అందుకు ఏదో ఒకటి చేయాలనే భావనతో 2004లో ‘ఉమన్ వెల్ఫేర్సర్వీస్ ఆర్గనైజేషన్’ను స్థాపించింది. స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి, మహిళా సాధికారత, హక్కులు, సేవ్ ఏ చైల్డ్, డొమెస్టిక్వాయొలెన్స్పై ఈ సంస్థ పనిచేస్తోంది. వాట్సప్ గ్రూప్‌లో అవగాహన.. ‘ఎంతోమంది డిగ్రీలు, పీజీలు చదివి పెళ్లయ్యాక వంటింటికి పరిమితమవుతున్నారు. ఈ సమయంలో చాలామంది డిప్రెషన్‌కు గురవుతున్నారు. వారికి వ్యాపార ఆలోచనలున్నా.. పెట్టుబడికి ఇబ్బంది అవుతోంది. ఇంకొంత మందికి డబ్బుంటే... ఏ బిజినెస్ చేయాలి? ఎలా చేయాలి? తెలియడం లేదు. ఇలాంటి వారికోసమే సంస్థ పేరుతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాం. వారికి తగిన సలహాలు, సూచనలు అందిస్తున్నాం. అదే విధంగా లైంగిక దాడులకు గురైన ఆడపిల్లలకు మనోధైర్యాన్నిస్తూ... సమాజంలో ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మా వాట్సప్ గ్రూప్‌లో వలంటరీ డాక్టర్లు, అడ్వొకేట్స్, సైకాలజిస్టులు, సామాజిక కార్యకర్తలు... ఇలా ఎంతో మంది ఉన్నారు. సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ, లోలోపల కుంగిపోయే వారికి పరిష్కారాలు చూపుతున్నామ’ని చెప్పారు లత. ఉపాధి శిక్షణ... మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జ్యువెలరీ మేకింగ్, బేకింగ్, అల్లికలు, బొమ్మల తయారీ తదితర ఉపాధి రంగాల్లో శిక్షణిస్తున్నాం. వారిని మోటివేట్ చేసి వాళ్ల కాళ్లపై వారు నిలబడేలా మనోధైర్యాన్నిస్తున్నాం. విభిన్న అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. పేద గర్భిణీలకు తగిన కౌన్సెలింగ్ ఇస్తూ... ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? తదితర వివరిస్తున్నామ’ని చెప్పారు లతా చౌదరి. -
జయకు కూతురా.. జీర్ణించుకోలేకున్నా!: నటి
సాక్షి, టీ.నగర్: తమిళనాడు దివంగత సీఎం జయలలితకు కుమార్తె ఉన్నట్లు చెప్పడాన్ని సీనియర్ నటి లత ఖండించారు. మదురై జిల్లా ఎంజీఆర్ అభిమాన సంఘం నిర్వహించే ఎంజీఆర్ వందేళ్ల వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె మదురై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ అన్నాడీఎంకేలో ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయని, వ్యక్తిగత కుటుంబ ఆధిపత్య వివాదాలు దాటి బయటికి వచ్చారని, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పాలన ఐదేళ్లు కొనసాగుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. జయలలితకు కుమార్తె ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని, ఈ విషయం తాను జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. జయలలిత మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఈ ప్రశ్నలెందుకు లేవనెత్తలేదని అన్నారు. జయలలిత ధైర్యవంతురాలని, కుమార్తె ఉన్నట్లయితే ధైర్యంగా ఒప్పుకునేవారని తెలిపారు. జయలలిత ఆస్తులను పొందేందుకు అమృతను వెనుక నుంచి ఎవరో నడిపిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. నటుడు విశాల్ మాత్రమే కాదు, రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తానని తెలిపారు. విశాల్‌ను ఎవరైనా వెనుక నుంచి నడిపిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆ విషయం తెలియదని లత సమాధానమిచ్చారు. ఆయన ప్రజలకు విశ్వాసపాత్రుడిగా పేరొందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆర్కేనగర్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే ఆహ్వానిస్తే ప్రచారం చేస్తానన్నారు. ముందే ఎందుకు చెప్పలేదంటే.. జయలలిత కుమార్తె అనే విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదనే విషయంపై అమృత ఓ ప్రైవేటు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తనను పెంచిన తల్లి 2015లో మృతి చెందారని, పెంచిన తండ్రి పార్థసారథి 2017 మార్చిలో మృతి చెందినట్లు తెలిపారు. తాను జయలలిత కుమార్తె అనే విషయాన్ని పెంపుడు తండ్రి చనిపోతూ తెలపడంతో దీన్ని ధ్రువపరచుకోలేకపోయానని తెలిపారు. -
'జయ కుమార్తె' పై స్పందించిన సీనియర్ నటి
-
కొడుకుతోపాటు తల్లి ఆత్మహత్య
భర్త వేధింపులు భరించలేక బావిలో దూకి.. మాక్లూర్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలో భర్త వేధింపులు భరించలేక రెండేళ్ల కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గుత్ప గ్రామానికి చెందిన అన్నపూర్ణ (28)కు మాదాపూర్ గ్రామానికి చెందిన రంజిత్‌తో 2009లో వివాహం జరిగింది. వీరికి కుమార్తె నందిని, కొడుకు లక్కీ(2) ఉన్నారు. అన్నపూర్ణ మానిక్‌భండార్ గ్రామ ఆరోగ్య ఉప కేంద్రంలో రెండో ఏఎన్ఎంగా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తోంది. కొన్నేళ్ల నుంచి భర్త రంజిత్ తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. భర్త ప్రవర్తన నచ్చక అన్నపూర్ణ తల్లిగారింటికి ఇటీవలే వెళ్లిపోయింది. గ్రామ పెద్దలు నచ్చజెప్పి అన్నపూర్ణను తీసుకు వచ్చారు. శుక్రవారం రాత్రి తాగి వచ్చిన రంజిత్ భార్యతో గొడవ పడి కొట్టాడు. భార్య వద్ద ఉన్న బ్యాంకు బుక్, డబ్బులు ఇవ్వాలని తరచూ గొడవ పడేవాడు. భార్యకు ప్రతి నెల వేతనం రాగానే ఏటీఎం కార్డు తీసుకువెళ్లి డబ్బులు డ్రా చేసుకుని దుబారా ఖర్చు చేసేవాడు. ఎటో వెళ్లి ఆదివారం ఇంటికి వచ్చిన రంజిత్‌కు భార్య అన్నపూర్ణ, కొడుకు లక్కీ కనిపించకపోవడంతో అత్తామామలకు ఫోన్ చేసి చెప్పాడు. మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం బావివైపు వెళ్లిన స్థానికులకు దుర్వాసన రావడంతో బావిలోకి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. శనివారం ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి భర్త రంజిత్, అత్త లక్ష్మిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామునాయుడు తెలిపారు. -
విధిని గెలిచి
ఆశ చిన్నపిల్లగా ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి వేధింపులు తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయింది ఆశ. ఒక రైల్వేస్టేషన్లో కొందరు దుర్మార్గులకు చిక్కింది. వాళ్లు ఆమెను ఒక వేశ్యాగృహానికి అమ్మేశారు. ‘పాప్రి’ ది కూడా ఇలాంటి కథే! లతకు పదహారు సంవత్సరాల వయసులో పెళ్లయింది. కాపురం చేయకుండానే భర్త ఆమెను పుణేలోని ఒక వేశ్యాగృహానికి అమ్ముకున్నాడు. పెద్ద చదువులు చదవాలని ఎన్నో కలలు కన్న లత చీకటి కూపంలో చిక్కుకుపోయింది.ఇలాంటి బాధితులకు విముక్తి కలిగించి కొత్త దారి చూపిస్తుంది ‘ఫ్రీ ఏ గర్ల్ మూమెంట్’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. మనుషుల అక్రమరవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ సంస్థ, అమ్మాయిలను వేశ్యాగృహలకు అమ్మే సంఘవిద్రోహశక్తులపై పోరాటం చేయడానికి ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తోంది. బాధిత మహిళలను చీకటికూపం నుంచి విముక్తి కలిగించడానికి మాత్రమే పరిమితం కాకుండా వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపడానికి, సరికొత్త ఉత్సాహంతో భవిష్యత్తుకు కొత్తదారి వేసుకోవడానికి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ‘జె.వాల్టర్ థామ్సన్ అమ్‌స్టర్‌డామ్’తో కలిసి ముంబైలో ‘ది స్కూల్ ఫర్ జస్టిస్’ అనే విద్యాసంస్థను ప్రారంభించింది. న్యాయవాదులు కావాలని, తమలాంటి బాధిత మహిళలకు అండగా నిలవాలనుకునే విముక్త మహిళలకు ఈ స్కూల్ అండగా నిలుస్తుంది. స్కూల్ నుంచి మొదలు లా డిగ్రీ చేతికందే వరకు అన్ని రకాల సహాయ సహాకారాలు అందిస్తుంది ‘ది స్కూల్ ఫర్ జస్టిస్’‘‘నేను లాయర్ కావడం ద్వారా, కష్టాల్లో ఉన్నవారికి చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటున్నాను’’ అంటుంది ఆశ. ‘పబ్లిక్ ప్రాసిక్యూటర్’ కావాలని కలలు కంటోంది లత. ‘‘సమాజాన్ని, చట్టాలను అర్థం చేసుకోవడానికి న్యాయవాద వృత్తి ఉపకరిస్తుంది’’ అంటున్నారు ‘ది స్కూల్ ఫర్ జస్టిస్’ నిర్వాహకులు. బతుకులోనే చావును చూసిన విషాదం. కలలు కనడానికి కూడా ధైర్యం లేని దయనీయ విషాదం. ఇప్పుడు చీకట్లో నుంచే కొత్త వెలుగు రేఖ ఉదయించింది... ఆ వెలుగురేఖలకు ‘ది స్కూల్ ఫర్ జస్టిస్’ వెన్నుదన్నుగా నిలుస్తోంది. -
వివాహిత ఆత్మహత్య
మేడిపల్లి: వివాహిత కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని మృతి చెందింన సంఘటన కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం పసునూర్ గ్రామంలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కొప్పుల రాజేశం, లత దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన లత ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇష్టంతోనే ఈషాకు..
కోవైకి చెందిన లత, గీత అనే అక్కాచెల్లెళ్లు తమ అభీష్టానుసారమే ఈషా యోగా కేంద్రంలో చేరిపోయారని న్యాయస్థానం తేల్చింది. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు యోగా కేంద్రంలో విచారణ చేపట్టిన కోవై జిల్లా కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు నివేదికను సిద్ధం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రసిద్ధ యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు కోయంబత్తూరులో సువిశాల మై దానంలో ఈషా యోగా కేంద్రం ఉంది. తమకు తెలియకుండా ఇద్దరు కుమార్తెలను బలవంతంగా సన్యాసినులుగా మార్చేసి కేంద్రంలోనే ఉంచుకున్నారని, తమ కుమార్తెలను అప్పగించేలా యోగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కో యంబత్తూరుకు చెందిన సత్యజ్యోతి అనే మహిళ మద్రాసు హైకోర్టులో ఈనెల 10వ తేదీన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తులు ఎస్ నాగముత్తు, వి. భారతిదాసన్ యోగా కేంద్రంలోని సోదరిమణులను విచారించి 11వ తేదీన నివేదిక దాఖలు చేయాల్సిందిగా కోవై ప్ర ధాన న్యాయమూర్తిని ఆదేశించించారు. విచారణ సమయంలో జిల్లా కలెక్టర్, ఎ స్పీ, పోలీసు ఇన్స్పెక్టర్లను వెంట తీసుకు వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా, ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చిం ది. కోవై జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన నివేదికను మద్రాసు హైకోర్టులో దాఖలు చేశారు. తమ ఇష్టపూర్వకంగానే యోగా కేంద్రంలో చేరామని, తమను ఎవ్వరూ ఒత్తిడి చేసి సన్యాసులుగా మా ర్చలేదని వాంగ్మూలం ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ 18 పైబడి మేజర్లుగా ఉన్న అక్కాచెల్లెళ్ల ఇష్టాలను కాదనే హక్కు కోర్టుకు లేదని, వారిద్దరూ మనస్సు మార్చుకుంటే తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు అభ్యంతరం ఉండదని అన్నారు. యోగా కేంద్రంలోకి వెళ్లి కుమార్తెలను పలుకరించే అవకాశం కల్పించాలని నిర్వాహకులను న్యాయమూర్తులు ఆదేశించారు. -
సూపర్‌స్టార్ భార్యకు సుప్రీం నోటీసులు
మరొక్క రెండు వారాల్లో కబాలి సినిమా విడుదల అవుతుందనగా.. సూపర్‌స్టార్ రజనీకాంత్ భార్య లతకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కొచ్చాడయాన్ సినిమా హక్కుల వివాదంలో ఈ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా హక్కులను లత అక్రమంగా అమ్మారని యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సుప్రీంలో కేసు దాఖలు చేసింది. లతా రజనీకాంత్ కొన్ని పత్రాలను ఫోర్జరీ చేశారని గత సంవత్సరం ఓ ఎఫ్ఐఆర్ దాఖలైంది. 2015 జూన్ 9వ తేదీన యాడ్ బ్యూరో సంస్థ ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ దాఖలైంది. కోర్టులో నకిలీ పత్రాలు సమర్పించి సినిమా హక్కులను లత ఓ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి అమ్మారని అందులో పేర్కొన్నారు. మోషన్ కాప్చర్ విధానంలో తీసిన మొట్టమొదటి సినిమా అయిన కొచ్చాడయాన్లో రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేయగా, ఆయన సరసన దీపికా పడుకొనే నటించింది. మరోవైపు.. రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ఈనెల 22వ తేదీన విడుదల కావాల్సి ఉంది. యూట్యూబ్‌లో ఈ సినిమా టీజర్, పాట ఇప్పటికే సంచలనం సృష్టించాయి. వయసు మళ్లిన డాన్‌గా రజనీ లుక్ అదిరిపోయిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. -
రెహమాన్‌కు మరో గౌరవం
భారతీయ సంగీతానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్. ప్రతీ సినీ సాంకేంతిక నిపుణుడు సాంధించాలనుకునే ఆస్కార్ అవార్డ్‌ను కూడా సొంతం చేసుకున్న రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ నిర్మాత దర్శకుడు సుభాష్ ఘయ్ ఏర్పాటు చేసిన హృదయనాథ్ మంగేష్కర్ అవార్డ్‌కు రెహమాన్ ఎంపిక అయ్యాడు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్, ఆశాభోంస్లేల సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ పేరు మీద ఈ అవార్డ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే లతా మంగేష్కర్, ఆశాభోంస్లే, అమితాబ్ బచ్చన్, సులోచన టాయ్లకు ఈ అవార్డ్‌ను అందించారు. ఈ ఏడాదికి గాను ఎఆర్ రెహమాన్‌ను ఎంపిక చేశారు. సౌత్‌లో సంగీత దర్శకుడిగా పరిచయం అయినా... తన టాలెంట్ తో బాలీవుడ్, ఆ తరువాత హాలీవుడ్ స్థాయికి ఎదిగిన మ్యూజిక్ సెన్సేషన్ రెహమాన్. 2009లో హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ తెరకెక్కించిన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు సంగీతం అందించిన రెహమాన్ ఆ సినిమాకు రెండు ఆస్కార్లను అందుకున్నాడు. -
భార్యను హతమార్చిన భర్త
ముద్దనూరు (వైఎస్సార్‌జిల్లా): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్యపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలైన భార్య అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ముద్దునూరు మండలం పెనికలపాడు గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చెండ్రాయుడు (39), లత (35) లకు పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇద్దరు గొడవ పడ్డారు. అదే సమయంలో శ్రీనివాసులు తన చేతిలో ఉన్న కత్తితో భార్య తలపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.