మంచిర్యాలక్రైం: ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ వేధింపులు భరించలేక ఓ బీట్ ఆఫీసర్ ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన అటవీ శాఖలో చర్చనీయాంశంగా మారింది. బీట్ ఆఫీసర్ కథనం ప్రకారం... మంచిర్యాల జిల్లా కోటపల్లి అటవీ శాఖ రేంజ్ పరిధిలోని బీట్ ఆఫీసర్ లత ఇటీవల సెక్షన్ ఆఫీసర్ రాందాస్‌తో కలిసి వెంచవెల్లి బీట్‌లో ప్లాంటేషన్ నిర్వహించారు. ఇందుకుగాను సెక్షన్ ఆఫీసర్ రాందాస్ రూ.2 లక్షలు కూలీల వేతనాలు, ప్లాంటేషన్ నిర్వహణకు ఇచ్చారు.
అయితే ఇవికాకుండా అదనంగా రూ.1.50 లక్షలను కూలీలకు చెల్లించాల్సి ఉందని, బిల్లు ఇవ్వాలని ఎఫ్‌ఆర్‌వో రవిని లత కోరగా అసభ్యకరంగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నారు. దీంతో ఆమె శుక్రవారంరాత్రి మంచిర్యాలలోని తన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన లత భర్త ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
డీఎఫ్‌వోకు ఒడిశా కూలీల ఫిర్యాదు
ప్లాంటేషన్ పనులు చేసిన ఒడి శా కూలీలు కూలి డబ్బులు ఇవ్వాలని ఎఫ్‌ఆర్‌వోను కోరగా ‘కూలి లేదు, డబ్బులు లేవు, దిక్కున్నకాడ చెప్పుకోండి’అని బెదిరించారు. దీంతో వారంతా జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశీశ్ సింగ్‌కు ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఆర్‌వోను మందలించారు. ఈ విషయా న్ని మనసులో పెట్టుకొన్న రవి శుక్రవారం తనను కా ర్యాలయానికి పిలిపించి దుర్భాషలాడారని లత ఆ రోపించారు. కాగా, వేధింపుల విషయమై ఎఫ్‌ఆర్‌వో రవిని సంప్రదించగా, తాను బీట్ ఆఫీసర్ లతను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment