
రజనీకాంత్ భార్యపై కేసు నమోదు
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కొచ్చాడయాన్ సినిమా వ్యవహారంలో ఆయన సతీమణి లతపై కేసు నమోదైంది. బెంగళూరు పోలీసులు లతపై కేసు నమోదు చేశారు. కొచ్చాడయాన్ సినిమా కేసుకు సంబంధించిన లత నకిలీ పత్రాలను కోర్టులో దాఖలు చేశారు. బెంగళూరు పోలీసులు లతను విచారించనున్నారు.
కొచ్చాడయాన్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై వివాదం కొనసాగుతోంది.