ఇష్టంతోనే ఈషాకు..
కోవైకి చెందిన లత, గీత అనే అక్కాచెల్లెళ్లు తమ అభీష్టానుసారమే ఈషా యోగా కేంద్రంలో చేరిపోయారని న్యాయస్థానం తేల్చింది. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు యోగా కేంద్రంలో విచారణ చేపట్టిన కోవై జిల్లా కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు నివేదికను సిద్ధం చేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రసిద్ధ యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు కోయంబత్తూరులో సువిశాల మై దానంలో ఈషా యోగా కేంద్రం ఉంది. తమకు తెలియకుండా ఇద్దరు కుమార్తెలను బలవంతంగా సన్యాసినులుగా మార్చేసి కేంద్రంలోనే ఉంచుకున్నారని, తమ కుమార్తెలను అప్పగించేలా యోగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కో యంబత్తూరుకు చెందిన సత్యజ్యోతి అనే మహిళ మద్రాసు హైకోర్టులో ఈనెల 10వ తేదీన పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తులు ఎస్ నాగముత్తు, వి. భారతిదాసన్ యోగా కేంద్రంలోని సోదరిమణులను విచారించి 11వ తేదీన నివేదిక దాఖలు చేయాల్సిందిగా కోవై ప్ర ధాన న్యాయమూర్తిని ఆదేశించించారు. విచారణ సమయంలో జిల్లా కలెక్టర్, ఎ స్పీ, పోలీసు ఇన్‌స్పెక్టర్లను వెంట తీసుకు వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా, ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చిం ది. కోవై జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన నివేదికను మద్రాసు హైకోర్టులో దాఖలు చేశారు.
తమ ఇష్టపూర్వకంగానే యోగా కేంద్రంలో చేరామని, తమను ఎవ్వరూ ఒత్తిడి చేసి సన్యాసులుగా మా ర్చలేదని వాంగ్మూలం ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ 18 పైబడి మేజర్లుగా ఉన్న అక్కాచెల్లెళ్ల ఇష్టాలను కాదనే హక్కు కోర్టుకు లేదని, వారిద్దరూ మనస్సు మార్చుకుంటే తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు అభ్యంతరం ఉండదని అన్నారు. యోగా కేంద్రంలోకి వెళ్లి కుమార్తెలను పలుకరించే అవకాశం కల్పించాలని నిర్వాహకులను న్యాయమూర్తులు ఆదేశించారు.