isha yoga centre
-
ఈషా యోగా సెంటర్ నుంచి అదృశ్యం.. బావిలో శుభశ్రీ మృతదేహం
సాక్షి, చెన్నై : కోయంబత్తూరు ఈషాయోగా కేంద్రంలో యోగా శిక్షణకు వెళ్లి అదృశ్యమైన శుభశ్రీ మరణించింది. ఓ బావిలో ఆమె మృతదేహం ఆదివారం మధ్యాహ్నం బయట పడింది. వివరాలు.. తిరుప్పూర్‌కు చెందిన పళణి కుమార్ భార్య శుభశ్రీ గత ఏడాది డిసెంబర్లో వారం రోజుల పాటుగా ఈషాయోగా కేంద్రంలో శిక్షణ నిమిత్తం వెళ్లారు. గత నెల 18వ తేదీన ఆమె అదృశ్యమయ్యారు. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కోయంబత్తూరు పోలీసులు తీవ్రంగా గాలించారు. సీసీ కెమెరాలలో ఆమె ఈషా యోగా కేంద్రం నుంచి బయటకు ఓ రోడ్డు మార్గంలో వెళ్తుండటం వెలుగు చూసింది. దీంతో ఆ పరిసరాలలో ఆమె కోసం గాలిస్తూవచ్చారు. ఆదివారం మధ్యాహ్నం సెమ్మేడు గాంధీ కాలనీలోని ఓ పాడు పడ్డ బావిలో మహిళ మృత దేహం బయట పడింది. పరిశీలనలో ఆ మృతదేహం శుభశ్రీగా తేలింది. శిక్షణకు వెళ్లిన శుభశ్రీ, యోగా కేంద్రం నుంచి బయటకు వచ్చేయడం, ఆ తర్వాత అదృశ్యం కావడం, ప్రస్తుతం మృతదేహంగా బావిలో తేలడం మిస్టరీగా మారింది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
‘పరుల సేవలో తరించడమే ఈశ్వర తత్వం’
చెన్నై : అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈషా యోగా కేంద్రంలో నిర్వహించిన మహా శివరాత్రి వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం సాయంత్రం కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రానికి విచ్చేసిన కోవింద్.. ఆదియోగి విగ్రహం వద్ద ‘ఆదియోగి దివ్య దర్శనం’ పేరిట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సౌండ్-లైట్ షోను ప్రారంభించారు. దీంతో వెల్లంగిరి కొండలు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. అనంతరం ‘జ్ఞానం - ధ్యానం - ఆనందం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు కోవింద్. తర్వాత ధ్యాన లింగం, లింగ భైరవి దేవిలను దర్శించుకున్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు కోవింద్. ‘పరుల సేవలో తరించే జీవితమే అత్యుత్తమ జీవితం. ఇదే ఆ పరమేశ్వరుని సందేశం. మనిషి ముక్తి సాధించడానికి 112 మార్గాలున్నాయి. దాన్ని సూచిస్తూ నెలకొల్పిన ఈ 112 అడుగుల ఆదియోగి విగ్రహం ఏదుట ఈ రోజు మీ అందరిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నా’రు. అంతేకాక యువత యోగా పట్ల ఆకర్షితులవ్వడం చాలా సంతోషకరమైన పరిణామంగా చెప్పుకొచ్చారు. ఈశా ఫౌండేషన్ 1994 మార్చి నుంచి ప్రత్యేకంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది మరింత ఘనంగా శివరాత్రి వేడుకలును నిర్వహించారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమిత్ త్రివేది, హరిహరన్, కార్తీక్ తదితరులు సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. జాగరణ సందర్భంగా రాత్రంతా సంగీతం, ఫోక్ ఆర్ట్, ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు దేశవిదేశాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. -
‘ఈషా’లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
-
శివరాత్రి వేడుకలు.. కాజల్ డ్యాన్స్ వీడియో వైరల్
చెన్నై : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గుగురు జగ్గీ వాసుదేవ్ శివరాత్రి పర్వదినం సందర్భంగా కోయింబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో సోమవారం రాత్రి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నా, అదితిరావు హైదరిలతో పాటు రానా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వాసుదేవ్ మహాశివరాత్రి విశిష్టత గురించి ప్రసంగించారు. అనంతరం శివరాత్రి జాగరణలో భాగంగా రాత్రంతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో కాజల్, ఆమె సోదరి నిషా అగర్వాల్, తమన్నా, వాసుదేవ్ కలిసి డ్యాన్స్ చేశారు. వారంతా డ్యాన్స్ చేస్తున్న వీడియోను కాజల్ అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ గాయకుడు కార్తిక్ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా హాజరయ్యారు. కొద్దిసేపు వాసుదేవ్‌తో మాట్లాడి ఆయన వెళ్లిపోయారు. View this post on Instagram 😍😍😍😃😃 #KajalAggarwal #Kajal #Kajalism #ishafoundation #Sadhguru A post shared by MEGAANGELKAJAL (@megaangelkajal) on Mar 4, 2019 at 10:12am PST -
ఇష్టంతోనే ఈషాకు..
కోవైకి చెందిన లత, గీత అనే అక్కాచెల్లెళ్లు తమ అభీష్టానుసారమే ఈషా యోగా కేంద్రంలో చేరిపోయారని న్యాయస్థానం తేల్చింది. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు యోగా కేంద్రంలో విచారణ చేపట్టిన కోవై జిల్లా కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు నివేదికను సిద్ధం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రసిద్ధ యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు కోయంబత్తూరులో సువిశాల మై దానంలో ఈషా యోగా కేంద్రం ఉంది. తమకు తెలియకుండా ఇద్దరు కుమార్తెలను బలవంతంగా సన్యాసినులుగా మార్చేసి కేంద్రంలోనే ఉంచుకున్నారని, తమ కుమార్తెలను అప్పగించేలా యోగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కో యంబత్తూరుకు చెందిన సత్యజ్యోతి అనే మహిళ మద్రాసు హైకోర్టులో ఈనెల 10వ తేదీన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తులు ఎస్ నాగముత్తు, వి. భారతిదాసన్ యోగా కేంద్రంలోని సోదరిమణులను విచారించి 11వ తేదీన నివేదిక దాఖలు చేయాల్సిందిగా కోవై ప్ర ధాన న్యాయమూర్తిని ఆదేశించించారు. విచారణ సమయంలో జిల్లా కలెక్టర్, ఎ స్పీ, పోలీసు ఇన్స్పెక్టర్లను వెంట తీసుకు వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా, ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చిం ది. కోవై జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన నివేదికను మద్రాసు హైకోర్టులో దాఖలు చేశారు. తమ ఇష్టపూర్వకంగానే యోగా కేంద్రంలో చేరామని, తమను ఎవ్వరూ ఒత్తిడి చేసి సన్యాసులుగా మా ర్చలేదని వాంగ్మూలం ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ 18 పైబడి మేజర్లుగా ఉన్న అక్కాచెల్లెళ్ల ఇష్టాలను కాదనే హక్కు కోర్టుకు లేదని, వారిద్దరూ మనస్సు మార్చుకుంటే తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు అభ్యంతరం ఉండదని అన్నారు. యోగా కేంద్రంలోకి వెళ్లి కుమార్తెలను పలుకరించే అవకాశం కల్పించాలని నిర్వాహకులను న్యాయమూర్తులు ఆదేశించారు. -
'మా కుమార్తెలను సన్యాసినులుగా మార్చారు'
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని ప్రసిద్ధ ఈషా యోగా కేంద్రం వివాదాల్లో చిక్కుకుంది. తల్లిదండ్రులకు తెలియకుండా ఇద్దరు కుమార్తెలను బలవంతంగా సన్యాసినులుగా మార్చేసి కేంద్రంలోనే ఉంచుకున్నారని కోయంబత్తూరుకు చెందిన సత్యజ్యోతి మద్రాసు హైకోర్టులో బుధవారం పిటిషన్ వేశారు. యోగా కేంద్రంలోని సోదరీమణులను విచారించి 11వ తేదీన నివేదిక దాఖలు చేయాలని కోవై ప్రధాన న్యాయమూర్తిని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌లోని వివరాలు.. కోవైకి చెందిన కామరాజ్, సత్యజ్యోతిలకు లత,గీత ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ అవివాహితులు. ప్రముఖ యోగా గురువు జగ్గివాసుదేవ్ నేతృత్వంలో కోవై వెల్లియంగిరి కొండ ప్రాంతంలో నెలకొల్పిన ఈషా యోగా కేంద్రానికి ఏడాది క్రితం వెళ్లిన కుమార్తెలు ఇంటికి రాలేదు. వారిని కలుసుకునే అవకాశమూ కల్పించలేదు. తమ కుమార్తెలకు గుండు కొట్టించి సన్యాసినులుగా మార్చిసినట్లు తెలుసుకుని కృంగిపోయాం. తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా వారిద్దరినీ సన్యాసులుగా మార్చడం చట్టవిరుద్దం. తమ కుమార్తెను విడిపించాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. వెంటనే తమ ఇద్దరు కుమార్తెలను కోర్టులో హాజరుపరిచేలా ఆదేశించాలని సత్యజ్యోతి పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయమూర్తులు ఎస్ నాగముత్తు, వి.భారతీదాసన్ ఈ పిటిషన్‌ను బుధవారం విచారించారు. పిటిషన్ దారు కోరినట్లు ఇద్దరు యువతులను హాజరుపర్చాలని ఆదేశించడం లేదు. అయితే కోవై జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ఎస్పీని వెంటపెట్టుకుని బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈషా యోగా కేంద్రానికి వెళ్లాలి. పిటిషన్‌దారుని ఇద్దరు కుమార్తెలను కలుసుకోవాలి. ఇష్టపూర్వకంగా సన్యాసినులుగా మారారా లేదా బలవంతంగా చేర్చుకున్నారా అనే అంశంపై వారిద్దరి నుంచి పూర్తి వివరాలను సేకరించి గురువారం నివేదికను హైకోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అక్కాచెల్లెళ్లు ఇష్టపూర్వకంగానే ఈషాలో చేరినట్లు రుజువైతే హైకోర్టు జోక్యం చేసుకోదని వారు స్పష్టం చేశారు. కేసును గురువారానికి (11వ తేదీ) వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.