geetha
-
రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచింది: వంగా గీత
-
పిఠాపురం మైనర్ బాలిక ఘటనపై పవన్ కళ్యాణ్ పై వంగగీత షాకింగ్ వ్యాఖ్యలు
-
దేవుడుతో ఆటలొద్దు.. మీకు దమ్ముంటే లడ్డు వివాదంపై వంగా గీత రియాక్షన్
-
పిఠాపురానికి అండగా నేనున్నా..
-
చెప్పే మాటలు వేరు.. చేసే పనులు వేరు
-
చూసే కళ్ళు బాగుంటే అందరూ బాగుంటారు.. జడ్జ్ గా చేయడం అంటే
-
వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల
-
రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్
-
పిఠాపురం ప్రజలంతా సీఎం జగన్ వైపు..
-
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
-
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
-
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
-
జగన్ కి ఓటు వేస్తే ఇంటింటి అభివృద్ధి, కూటమికి ఓటు వేస్తే పథకాలు ముగింపు
-
వంగా గీత గూస్ బంప్స్ స్పీచ్.. దద్దరిల్లిన పిఠాపురం
-
పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి
-
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
-
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
-
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
-
Geetha Shivarajkumar: ‘గీత’ దాటినా... గీత మారేనా!
గీతా శివరాజ్‌కుమార్. కన్నడ ప్రజలకు చిరపరిచితమైన పేరు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కోడలు. ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్ భార్య. అంతేనా...? కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కూతురు! రాజకీయ కుటుంబంలో పుట్టి కన్నడ సినీ పరిశ్రమకు దిగ్గజాల వంటి తారలను అందించిన ఇంటికి కోడలిగా వెళ్లారు. అయినా పుట్టింటి వారసత్వం ఆమెను చివరికి రాజకీయాల వైపు నడిపించింది. 2014లోనే రాజకీయ అరంగేట్రం చేసిన గీత ఇప్పుడు శివమొగ్గ లోక్‌సభ స్థానంలో బీజేపీ దిగ్గజం యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్రతో పోటీ పడుతున్నారు...నిషేధాన్ని ఉల్లంఘించి.. గీతకు 1986లో శివరాజ్‌కుమార్‌తో పెళ్లయ్యింది. తర్వాత కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యారు. తల్లి మరణానంతరం ఆమె నిర్వహించిన మైసూరులోని ‘శక్తిధామ్’ స్వచ్ఛంద సంస్థ బాధ్యతలు చూస్తున్నారు. చాలాకాలం భర్తకు స్టయిలిస్ట్‌గా కూడా చేశారు. కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి వెళ్లొద్దని రాజ్‌కుమార్ లక్ష్మణరేఖ గీశారు. దాంతో సినిమాల్లో ఎంత పాపులారిటీ సాధించినా ఆయన కొడుకులెవ్వరూ రాజకీయాల వైపే చూడలేదు. కానీ బాల్యం నుంచి ఇంట్లో పూర్తి రాజకీయ వాతావరణం చూసిన గీతకు రాజకీయాలంటే మహా ఆసక్తి. ఆమెకు రెండేళ్లప్పుడు తండ్రి బంగారప్ప ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ స్ఫూర్తితో 2014లో గీత రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ నిర్ణయాన్ని రాజ్‌కుమార్ భార్య పార్వతమ్మ వ్యతిరేకించారంటారు. తటస్థంగా ఉన్న కుటుంబాన్ని శివ రాజ్‌కుమార్, గీత వారి ఆకాంక్షల కోసం రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ ఆమె ఆవేదన చెందినట్టు వార్తలొచ్చాయి. అయినా గీత పట్టించుకోలేదు. శివమొగ్గ లోక్‌సభ స్థానంలో జేడీ(ఎస్) అభ్యరి్థగా యడ్యూరప్పపై పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఓటమితో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. సోదరుడు మధు బంగారప్ప కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు శివమొగ్గ నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అక్కడ రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ రాఘవేంద్రతో తలపడుతున్నారు. ఆయన విజయ పరంపరకు బ్రేకులు వేస్తానని ధీమాగా చెబుతున్నారు!నీటి సమస్య పరిష్కారం తొలి ప్రాధాన్యత.. శివమొగ్గలో నీటి కొరత తీర్చడమే తన మొదటి ప్రాథమ్యమని చెబుతున్నారు గీత. ‘‘నా సోదరుడు, ఇతర ఎమ్మెల్యేల సహకారంతో అనేక సమస్యలను పరిష్కరిస్తా. కాంగ్రెస్ పథకాలు నా విజయానికి దోహదపడతాయి. ‘‘గెలవగానే బెంగళూరు వెళ్లిపోతానన్న బీజేపీ ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తా. శివమొగ్గలో నాకు ఇల్లుంది. ఇక్కడ ఉండకుండా ఎక్కడకు పోతాను? బీజేపీ ఇకనైనా ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు మాని రైతులు, వెనకబడ్డ తరగతులు, ప్రజల కష్టాలపై మాట్లాడితే బాగుంటుంది. నేనెప్పుడూ నా బాధ్యతల నుంచి వెనక్కు తగ్గలేదు. శక్తిధామ్ సంస్థను చూసుకుంటున్నట్టుగానే శివమొగ్గ ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తా. క్షేత్రస్థాయిలో వారికి అందుబాటులో ఉంటా’’ అని చెబుతున్నారు. భర్త శివరాజ్‌కుమార్ ప్రతిష్ట, తండ్రి బంగారప్ప మంచితనం, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన శివమొగ్గలో తనను గెలిపిస్తాయని నమ్మకముందంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!
-
పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే
-
టాలీవుడ్లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)
-
భారీ ర్యాలీతో పిఠాపురంలో నామినేషన్ వేసిన వంగ గీత
-
పిఠాపురంలో వంగా గీత ప్రచార జోరు
-
పిఠాపురం లో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు
-
పవన్ కళ్యాణ్ ను ఓడిస్తాం వంగా గీత విజయం తథ్యం
-
'పేదలపై చంద్రబాబుది కపట ప్రేమ'
-
పెన్షన్లు ఆపేస్తారా.. మీకు ఓటు అడిగే హక్కు లేదు
-
పవన్, వంగా గీతకు తేడా ఇదే
-
వంగా గీత ఎవరికీ భయపడే వ్యక్తికాదు..పవన్ కళ్యాణ్ ని చిత్తు చిత్తుగా ఓడిస్తా
-
పవన్‌కు వంగా గీత స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, కాకినాడ: పిఠాపురంలో పోటీ చేసే అంశంపై మాట్లాడే క్రమంలో.. తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కాకినాడ ఎంపీ, వైఎస్సార్సీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఉదయం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలని పేర్కొన్నారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలిచారు. ఆమె వైఎస్సార్సీపీ వీడి జనసేనలోకి రావాలని ఆశిస్తున్నా అంటూ పవన్ నిన్న మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై వంగా గీత కౌంటర్ తాజాగా స్పందించారు. ‘‘నేను కూడా పవన్‌ను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది?’’ అని అన్నారామె. ‘2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా. 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. పిఠాపురంలో గెలుపుపై పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పిఠాపురంలో పవన్ పోటీ వేళ జనసేనకు ఇవాళ పెద్ద షాకే తగలబోతోంది. నియోజకవర్గ నేత మానినీడు శేషు కుమారి వైఎస్సార్సీపీలో చేరబోతున్నారు. సీఎం జగన్ సమక్షంలోనే ఆమె వైఎస్సార్సీపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. -
పచ్చనాకు సాక్షిగా పచ్చటి తోవలో.. 'కృషిమిత్ర' గీత
‘వ్యవసాయం బాగుండాలంటే రసాయన ఎరువులు, పురుగుల మందులు ఎక్కువగా వాడాలి’ అనే నమ్మకం బలంగా పాతుకుపోయిన గ్రామంలో సేంద్రియ వ్యవసాయం గురించి ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? పెద్దగా స్పందన కనిపించదు. అంగిసింగి అనే ఊళ్లో కూడా అచ్చం అలాగే జరిగింది. అయితే ‘కృషిమిత్ర’ గీత వల్ల ఆ ఊరు మారింది. పచ్చనాకు సాక్షిగా పచ్చటి తోవలో నడుస్తోంది..' పచ్చనాకు సాక్షిగా.. పెళ్లయిన తరువాత అంగిసింగి (నయాగఢ్ జిల్లా–ఒడిశా) అనే ఊళ్లోని అత్తగారింట్లోకి అడుగు పెట్టింది గీతారాణి సప్తతి. అంగిసింగి అనేది వ్యవసాయ ఆధారిత గ్రామం. అయితే రైతులు మాత్రం ‘ఎన్ని రసాయన ఎరువులు వాడితే వ్యవసాయానికి అంత మంచిది’ అనే ధోరణిలో ఉండేవారు. రైతులు పోటీపడి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడడం వల్ల గ్రామంలో ఆస్తమా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండేది. గీత పిల్లలు కూడా ఆస్తమా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే గీత ‘కృషిమిత్ర’ల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. గ్రామాలలో పర్యావరణహిత వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు అవగాహన కలిగించే స్వయం సహాయక బృందం సభ్యులను ‘కృషిమిత్ర’ అంటారు. తన గ్రామంలోని అస్తవ్యస్త వ్యవసాయ పద్ధతులను దృష్టిలో పెట్టుకొని శిక్షణ తరువాత గీత కూడా ‘కృషిమిత్ర’గా మారింది. ‘తక్కువ ఖర్చుతో పర్యావరణ హిత వ్యవసాయం చేయవచ్చు’ అనే నినాదంతో రైతుల దగ్గరకు వెళ్లింది గీత. రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల కలుగుతున్న నష్టాల గురించి వారికి వివరించింది. ప్రచారంతోపాటే తాను స్వయంగా సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలుపెట్టింది. రైతుల భార్యలను పొలానికి తీసుకువెళ్లి తాను ఆచరిస్తున్న పద్ధతులను పరిచయం చేసేది. సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించేది. ‘తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం’ కాన్సెప్ట్‌తో గీత చేసిన సేంద్రియ వ్యవసాయం విజయవంతం అయింది. ఇక అప్పటినుంచి రైతుల్లో కదలిక మొదలైంది. గీతను వెదుక్కుంటూ వచ్చి, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకునేవారు. ‘ఒకప్పుడు సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసే కృషిమిత్ర నేను ఒక్కరినే. నేను చేస్తున్న వ్యవసాయాన్ని గమనించిన తరువాత ఇప్పుడు చాలామంది మహిళలు కృషిమిత్రగా మారారు’ అంటుంది గీత. ఒకవైపు ఇంటిపనులు, పొలం పనులు చేసుకుంటూనే మరోవైపు రైతుల పొలాల దగ్గరికి వెళ్లి వారికి అవసరమైన సలహాలు ఇస్తుంటుంది గీత. మొబైల్ ఫోన్ ద్వారా విజువల్స్, సమాచారాన్ని చేరవేస్తుంటుంది. గీత దినచర్య వేకువ జామునే మొదలవుతుంది. ఆగిపోయిన చదువును దూరవిద్య ద్వారా తిరిగి కొనసాగించాలని నిర్ణయించుకుంది గీత. ఒకప్పుడు ఆమెను నిరుత్సాహపరిచిన భర్త, గీత మాటల వల్ల గ్రామ వ్యవసాయ పద్ధతుల్లో వస్తున్న మార్పులు, రైతులు చూపిస్తున్న గౌరవం చూశాక భార్యకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నాడు. మా ఊరు.. ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితమైన నేను కృషిమిత్ర స్వయం సహాయక బృందంలో చేరడం వల్ల వ్యవసాయం, పర్యావరణానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నాకు తెలిసిన విషయాలను చుట్టుపక్కల వారితో పంచుకుంటున్నాను. ఆశను, ఆశయాలనూ ఎప్పుడూ వదులుకోవద్దు. కాస్త ఆలస్యం అయినా ఫలితం తప్పకుండా వస్తుంది అని చెప్పడానికే మా ఊరే నిదర్శనం. – గీతా రాణి సత్పతి, కృషిమిత్ర ఇవి చదవండి: స్వావలంబనకు చుక్కాని... రుబీనా! -
ఉమెనిఫెస్టో ప్లీజ్!
హక్కులు, అవకాశాల్లో మహిళలకు సమాన భాగస్వామ్యం ఎండమావిగానే మిగిలింది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో రాజకీయపార్టీలు హామీల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు వస్తున్నాయి..పోతున్నాయ్. కానీ మహిళల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, సామాజిక భద్రత ఇప్పటికీ నినాదాలకే పరిమితమవుతున్నాయి. ఇల్లు, బడి, కార్యాలయంతో పాటు రోడ్డు ఇతర బహిరంగ ప్రదేశాల్లో.. ఎప్పుడూ ఏదో ఒక చోట ఏదో రకమైన వివక్ష, వేధింపులు, అణచివేత నిత్యకృత్యంగానే ఉంటున్నాయి. మహిళల రక్షణ కోసం గృహహింస చట్టం, నిర్భయ చట్టం వంటివి ఎన్ని వచ్చినా, షీటీమ్స్, భరోసా కేంద్రాలు, సఖి వంటి ప్రత్యేక రక్షణ బృందాలు ఎన్ని ఉన్నా లైంగిక దాడులు, హింస కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కోటి దాటిన గ్రేటర్ హైదరాబాద్ జనాభాలో సగం మంది మహిళలే. కాగా ప్రస్తుత ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీలు ఏ మేరకు మహిళల ఆకాంక్షలకు, మహిళా సంబంధిత అంశాలకు పెద్ద పీట వేస్తున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. పలు మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, వివిధ విభాగాల్లో మహిళల సంక్షేమం కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలు ‘మహిళా మేనిఫెస్టో’పై దృష్టి సారించాయి. మహిళల సంక్షేమం లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు మహిళా మేనిఫెస్టోను రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాయి. సమాన అవకాశాలు లభించాలి.... స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల హింసను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం అవకాశాలు లభించాల్సిందేనని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ‘అన్నిచోట్లా స్త్రీల ప్రాతినిధ్యం పెరగాలి. విద్య, ఆరోగ్యం, జీవితబీమా, బ్యాంకింగ్, పోలీసు, రవాణా, న్యాయ, వైద్య, ఎయిర్‌ఫోర్స్, నావిక, తదితర అన్ని రంగాల్లో మహిళలు రాణించే విధంగా సమాన అవకాశాలను కల్పించి ప్రోత్సహించాలి. సమాజంలో మహిళలపై హింసకు మద్యపానం కూడా ఒక కారణమే. మద్యాన్ని ఆదాయ వనరుగా భావించే ప్రభుత్వాల దృక్పథం పూర్తిగా మారాలి. మద్యం దుకాణాలను తగ్గించాలి. కచ్చితమైన నియంత్రణ పాటించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపే మద్యం షాపులు తెరిచి ఉంచాలి. ప్రధాన హైవేలు, బస్టాపులు, ఆలయాలు, బడులు, ప్రార్ధనాస్థలాలకు సమీపంలో ఉన్నవాటిని తొలగించాలి..’ అని డిమాండ్ చేస్తున్నాయి. నిర్భయ సెల్ ఏర్పాటు చేయాలి ‘ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలలు, తదితర అన్ని విద్యాసంస్థల్లో బాలికలు, యువతులు నిశ్చింతగా చదువుకొనేందుకు అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అన్ని విద్యాసంస్థల్లో ఇందుకోసం ప్రత్యేంగా 2013 నిర్భయ చట్టానికి అనుగుణంగా నిర్భయ సెల్ ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమ్మాయిల అవసరాలకు అనుగుణమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. టాయిలెట్లు, రక్షిత మంచినీళ్లు, పౌష్టికాహారం అందజేయాలి. చాలామంది పిల్లలు ముఖ్యంగా బాలికలు తీవ్రమైన పోషకాహార లేమితో బాధపడుతున్నారు. అమ్మా యిల్లో రక్తహీనత ఒక సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్కూళ్లలో తృణ ధాన్యా లతో కూడిన పోషకాహారాన్ని అందజేయాలి. స్కూళ్లలో తప్పనిసరిగా చైల్డ్ హెల్త్ కేర్ రికార్డులను అమలు చేయాలి. ఇందులో ఉపాధ్యాయులు, ఆరోగ్యకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు భాగస్వాములు కావాలి. యుక్త వయస్సు బాలికలకు చక్కటి ఆరోగ్య విద్య అందజేయాలి. శానిటరీ ప్యాడ్స్, న్యాప్కిన్స్ అందుబాటులో ఉంచాలి. యుక్త వయస్సులో వచ్చే మార్పుల గురించి అమ్మాయిలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా జెండర్ సెన్సిటైజేషన్ వర్క్‌షాపులను ఏర్పాటు చేయాలి. వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇప్పించి అమ్మాయిలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకొనేలా చర్యలు తీసుకోవాలి. స్వీయ రక్షణ కు నిరంతర శిక్షణ ఉండాలి. ఈ మేరకు మేనిఫెస్టోలో పొందుపరచాలి..’ అని పలు సంఘాలు, సంస్థలు సూచిస్తున్నాయి. మెరుగైన ప్రజా రవాణా అవసరం ‘ప్రస్తుతం గ్రేటర్లో వివిధ రకాల రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మెట్రోతో సహా అన్ని సేవలు రాత్రి 11కే ముగుస్తాయి. దీంతో రాత్రివేళల్లో విధులు నిర్వహించే సాఫ్ట్వేర్ ఉద్యోగినులు, కాల్సెంటర్లలో పని చేసే అమ్మాయిలు, రాత్రి పూట ఆలస్యంగా ఇళ్లకు చేరవలసిన సమయాల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆటోలు, క్యాబ్‌లలో మహిళల భద్రత ప్రశ్నార్ధకంగానే ఉంది. రాత్రి 9 దాటితే ఇలాంటి వాహనాల్లో ప్రయాణం చేయడం దుస్సాహసమే. ఈ పరిస్థితుల్లో సిటీ బస్సులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి..’ అని మహిళా సంఘాలు డిమాండ్ చేసు ్తన్నాయి. రాజకీయ పార్టీలు ఈ అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాయి. అవకాశం ఇస్తే.. అమలు చేసి చూపిస్తాం ‘అమ్మాయిలకు ఉచిత విద్య. వైద్యం కేటాయిస్తే చాలు సాధికారత అనేది దానంతట అదే వస్తుందని మేము నమ్ముతున్నాం. విద్యాపరంగా బలోపేతమైతే..కెరీర్ పరంగా నిర్ణయాలు తీసుకొని జీవితంలో స్థిరపడగలుగుతారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి అవకాశం లభిస్తే దీనిని అమలు చేయడం ద్వారా చేసి చూపేందుకు సిద్ధంగా ఉన్నాం. జాతీయస్థాయిలో బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోను ఒకసారి పరిశీలిస్తే...అనేక కీలకమైన అంశాలు పూర్తిస్థాయిలో అమలుచేసే ప్రయత్నాలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే మహిళా సాధికారతను సంబంధించిన గతంలో ఇచ్చిన హామీని అమలుచేసేందుకు పూనుకున్నాము. – గీతామూర్తి, బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మహిళలకు పెద్దపీట వేసేది కాంగ్రెస్ పార్టీనే.. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మహిళల హక్కులకు భంగం కలుగుతోంది. దిశ లాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర కేబినెట్సహా ఏ అంశంలోనూ మహిళలకు బీఆర్ఎస్ తగిన ప్రాధాన్యత కల్పించలేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే మహిళలకు పెద్దపీట వేసేది తామేనని అర్థమవుతుంది. మహిళలను ప్రధానిగా, రాష్ట్రపతిగా చేసింది కాంగ్రెస్ పార్టీనే. జాతీయ పార్టీ అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు అప్పగించింది కూడా మేమే. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మేమిచ్చిన ఆరు గ్యారంటీల్లో కూడా మహిళాసాధికారత కోసం పథకాలు ప్రకటించాం. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 నగదు, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆసరా పింఛన్ల పెంపు, చదువుకునే విద్యారి్థనులకు మోటారు సైకిళ్లు లాంటి పథకాలతో రాష్ట్రంలో మహిళాభ్యున్నతికి పాటుపడతాం’ – మచ్చా వరలక్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ మహిళాకాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు -
గీతా.. సుబ్రహ్మణ్యం 3 టీజర్
-
గ్రాండ్‌గా సునీల్-హెబ్బా పటేల్‌ల' గీతా' విష్కరణ
హెబ్బా పటేల్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక. ‘గ్రాండ్ మూవీస్’పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్ శిష్యుడు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ... ‘ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. అనివార్య కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ‘గీత’ విడుదలకు సహాయ సహకారాలు అందిస్తున్న పొలిశెట్టి, డివిడి విజయ్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు’ అన్నారు. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ... ‘గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ... ‘గీత’ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’అన్నారు. హీరో సునీల్, హీరోయిన్ హెబ్బా పటేల్ ‘గీత’ వంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంలో నటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడుగా విశ్వ, నిర్మాతగా రాచయ్యలకు ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. ‘గీత’ చిత్రంలో పని చేసే అవకాశం లభించడం పట్ల నటీనటులు, సాంకేతిక నిపుణులు కృతజ్ఞతలు తెలిపారు. -
సునీల్-హెబ్బా పటేల్‌ల ‘గీత’ వచ్చేస్తుంది
హెబ్బా పటేల్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక. ‘గ్రాండ్ మూవీస్’పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్ శిష్యుడు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అన్నారు. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ... "గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ... ‘గీత’చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈనెల 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అన్నారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి , తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సూపర్ గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా... ఓ చాలెంజింగ్ రోల్ చేస్తుండడం విశేషం. సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు ప్లే చేస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు. -
Geetanjali Shree: భారత రచయిత్రి గీతాంజలి శ్రీ సంచలనం
భారత రచయిత్రి గీతాంజలి శ్రీ అంతర్జాతీయ సాహిత్య వేదికపై సంచలనం సృష్టించారు. ఆమె రాసిన నవలకు బుకర్ ప్రైజ్ దక్కింది. ఢిల్లీకి చెందిన గీతాంజలి శ్రీ (గీతాంజలి పాండే) హిందీ నవలా, లఘు కథా రచయిత్రి. ఆమె రాసిన రేత్ సమాధి(2018).. ఆంగ్ల తర్జుమా ‘టాంబ్ ఆఫ్ శాండ్’కు 2022కుగానూ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ లభించింది. టాంబ్ ఆఫ్ సాండ్ అనేది అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ భాషలో వ్రాసిన మొదటి పుస్తకం. పైగా హిందీ నుండి అనువదించబడిన మొదటి నవల. అంతేకాదు బుకర్‌ప్రైజ్ గౌరవం అందుకున్న తొలి భారత రచయిత/రచయిత్రి ఈమెనే. గురువారం లండన్‌లో జరిగిన ప్రదానోత్సవంలో.. గీతాంజలి శ్రీ(64)కి ప్రైజ్‌ను అందించారు. గీతాంజలితో పాటు రేత్ సమాధిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసిన డైసీ రాక్వెల్(అమెరికా)కు కలిపి ఈ గౌరవం అందించారు. అంతేకాదు యాభై వేల బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్లను సైతం క్యాష్ ప్రైజ్‌గా అందించారు. The moment of joy. Huge congratulations to Geetanjali Shree, translator @shreedaisy and @TiltedAxisPress on winning the #2022InternationalBooker Prize for Tomb of Sand @TheBookerPrizes pic.twitter.com/tduTnTzBMo — Ted Hodgkinson (@TeditorTed) May 26, 2022 రేత్ సమాధి.. ఉత్తర భారతంలో ఎనభై ఏళ్ల వృద్ధురాలి కథ. వృద్ధురాలు తన భర్త మరణంతో తీవ్ర డిప్రెషన్లోకి జారుకుంటుంది. ఆపై ఆమె జీవితం కొత్త మారుతుంది.. అది ఎలా అనేది నవలా కథ. బుకర్ వస్తుందని కలలలో కూడా ఊహించలేదు. సాధిస్తా అనుకోలేదు. ఇది ఒక గొప్ప గౌరవం. అద్భుతంగా ఉంది. గర్వంగా ఉంది అని పేర్కొన్నారు గీతాంజలి శ్రీ. ఇప్పటివరకు ఆమె ఐదు నవలలు రాయగా, మయి(2000) క్రాస్‌వర్డ్ బుక్ అవార్డు 2001కి నామినేట్ అయ్యింది. భారతీయ ప్రముఖ రచయిత ప్రేమ్‌చంద్‌పై విమర్శనాత్మక రచన కూడా చేసింది. చిన్నతనంలో పిల్లల పుస్తకాలు ఎక్కువగా ఆంగ్లంలో లేకపోవడంతోనే తాను హిందీపై మక్కువ పెంచుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్తుంటారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనల ఆధారంగా రాసిన హమారా షహర్ ఉస్ బరాస్ విమర్శలకు ప్రశంసలు అందుకుంది. Take a look at the moment Geetanjali Shree and @shreedaisy found out that they had won the #2022InternationalBooker Prize! Find out more about ‘Tomb of Sand’ here: https://t.co/VBBrTmfNIH@TiltedAxisPress #TranslatedFiction pic.twitter.com/YGJDgMLD6G — The Booker Prizes (@TheBookerPrizes) May 26, 2022 డైసీ రాక్వెల్.. అమెరికన్ రైటర్, ట్రాన్స్‌లేటర్‌గా మాత్రమే కాదు.. పెయింటర్‌గా కూడా పాపులర్. ఉర్దూ, హిందీ నవలలను, రచలను ఎన్నింటినో ఆమె ఆంగ్లంలోకి అనువదించారు. వాస్తవానికి 2018లో హిందీలో రేత్ సమాధి ప్రచురించబడింది, 'టాంబ్ ఆఫ్ సాండ్' ఆమె పుస్తకాలలో యూకే ఇంగ్లీష్‌లోకి తర్జుమా అయయింది. టిల్టెడ్ యాక్సిస్ ప్రెస్ ద్వారా ఆగస్టు 2021లో ఆంగ్లంలో ప్రచురించబడింది. మొత్తం 135 పుస్తకాలను యూకేకు చెందిన ఈ అంతర్జాతీయ సాహిత్య వేదిక జ్యూరీ పరిశీలించగా.. చివరి తరుణంలో ఆరు పుస్తకాలు బుకర్ ప్రైజ్ కోసం పోటీపడ్డాయి. అందులో టాంబ్ ఆఫ్ శాండ్‌కు ఈ గౌరవం దక్కింది. -
నా శిష్యుడు 'విశ్వ' విజేత కావాలి: వి.వి.వినాయక్
మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ దర్శకత్వంతో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘గీత’.‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక. ‘గ్రాండ్ మూవీస్’ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తుండగా, ప్రముఖ నటుడు సనీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్‌గా పరిచయం అవుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ.. తన శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమవుతున్న "గీత' ఘన విజయం సాధించాలని, తన మిత్రుడు రాచయ్య నిర్మాతగా రాణించాలని అభిలాషించాడు. . ఈ చిత్రంలో పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు. ఈ సినిమా అవకాశం తన గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారని, నిర్మాత రాచయ్యగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చిత్ర దర్శకుడు విశ్వ పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న హిందీ "ఛత్రపతి" పనులతో తలమునకలుగా ఉన్నప్పటికీ... తమ మీద ప్రత్యేకమైన అభిమానంతో "గీత" చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి నిర్మాత ఆర్.రాచయ్య కృతజ్ఞతలు తెలిపారు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా డైరెక్టర్ విశ్వ... "గీత" చిత్రాన్ని అత్యద్భుత ప్రణాళికతో రూపొందించారని పేర్కొన్నారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి, తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా. -
ఐఎంఎఫ్‌కు గీతా గోపీనాథ్ గుడ్‌బై
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకానమిస్ట్‌గా వ్యవహరిస్తున్న గీతా గోపీనాథ్ (49) వచ్చే ఏడాది పదవి నుంచి వైదొలగనున్నారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా తిరిగి చేరనున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ అయిన గీతా గోపీనాథ్ .. ఐఎంఎఫ్ తొలి మహిళా చీఫ్ ఎకానమిస్ట్‌గా 2019 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. ఆమె సెలవును హార్వర్డ్ యూనివర్సిటీ పొడిగించడంతో మూడేళ్ల పాటు ఐఎంఎఫ్‌లో కొనసాగారు. తాజాగా అదే వర్సిటీకి తిరిగి రానున్నారు. గీతా గోపీనాథ్ స్థానంలో మరొకరిని ఎంపిక చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా తెలిపారు. ‘ఐఎంఎఫ్‌కు గీతా గోపీనాథ్ అందించిన సేవలు అసమానమైనవి. ఫండ్ తొలి మహిళా చీఫ్ ఎకానమిస్టుగా ఆమె చరిత్ర సృష్టించారు. గీతా గోపీనాథ్ మేధస్సు, అంతర్జాతీయ ఫైనాన్స్.. స్థూలఆరి్థకాంశాలపై ఆమెకున్న అపార అవగాహన, ఐఎంఎఫ్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రభావవంతమైన పనితీరుతో ఆమె అందరి అభిమానం, గౌరవం చూరగొన్నారు‘ అని జార్జియేవా పేర్కొన్నారు. తన విధుల నిర్వహణలో సహకరించినందుకు సహోద్యోగులకు గీతా గోపీనాథ్ ధన్యవాదాలు తెలిపారు. టీకాల ఊతంతో కోవిడ్–19 మహమ్మారిని అంతమొందించేందుకు తీసుకోతగిన చర్యలపై రూపొందించిన ’పాండెమిక్ పేపర్’కు ఆమె సహరచయితగా వ్యవహరించారు. ఇందులోని ప్రతిపాదనలకు అనుగుణంగా అల్పాదాయ దేశాలకు కూడా టీకాలను చేర్చేందుకు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తదితర ఏజెన్సీలు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాయని ఐఎంఎఫ్ పేర్కొంది. మైసూరు నుంచి అమెరికా వరకు... గీతా గోపీనాథ్ 1971లో మైసూరులో జన్మించారు. మలయాళీ కుటుంబ నేపథ్యం గల గీతా గోపీనాథ్ కోల్‌కతాలో పాఠశాల స్థాయి విద్యాభ్యాసం, ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లోను, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో మాస్టర్స్ చేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ బెర్నాంకీ వంటి దిగ్గజాల గైడెన్స్‌తో 2001లో ప్రతిష్టాత్మక ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో పీహెచ్డీ చేశారు. అదే ఏడాది యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన గీతా గోపీనాథ్ 2005లో హార్వర్డ్‌కు మారారు. 2010లో టెన్యూర్డ్ ప్రొఫెసర్ (దాదాపు పర్మనెంట్ స్థాయి) గా పదోన్నతి పొందారు. హార్వర్డ్ చరిత్రలో ఈ గౌరవం దక్కించుకున్న మూడో మహిళగాను, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ తర్వాత తొలి భారతీయురాలిగాను ఆమె ఘనత సాధించారు. -
అనాధల రాత మారుస్తానంటున్న ‘గీత’
హెబ్బా పటేల్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక. ‘గ్రాండ్ మూవీస్’పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్ శిష్యుడు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంచలన దర్శకులు వి.వి.వినాయక్ త్వరలో రిలీజ్ చేయనున్నారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి , తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సూపర్ గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా... ఓ చాలెంజింగ్ రోల్ చేస్తుండడం విశేషం. సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు ప్లే చేస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు. -
దారుణం: కారు బైక్ ఢీ.. మామ, కోడలు దుర్మరణం
సాక్షి, దొడ్డబళ్లాపురం: వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొనడంతో మామ, కోడలు మృతి చెందిన సంఘటన నెలమంగల తాలూకా మల్లరబాణవాడి గ్రామంలో చోటుచేసుకుంది. గుల్బర్గా జిల్లా మాదాబకు చెందిన గీత (35), సూర్యకాంత్ (45) మృతి చెందారు. సూర్యకాంత్ కుటుంబం జీవనోపాధి కోసం నెలమంగల వచ్చి శాంతినగర్‌లో స్థిరపడ్డారు. కొత్తగా బైక్ కొన్న వీరు ఆదివారం సాయంత్రం పొద్దుపోయాక ఊరిలో తిరిగి ఇంటికి వస్తుండగా వెనుక నుండి వచ్చిన కారు వేగంగా ఢీకొంది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న యువకుడు ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన నెలమంగల పట్టణంలో చోటుచేసుకుంది. చిక్కమగళూరు కడూరుకు చెందిన సంజయ్ (19) నెలమంగలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఆస్పత్రిలోని రెస్ట్ రూంకి వెళ్లి ఎంతసేపయినా రాకపోవడంతో సిబ్బంది అనుమానం వచ్చి చూడగా సంజయ్ మత్తుమందు ఎక్కువ డోస్ తీసుకుని చనిపోయి ఉన్నాడు. దీనిపై అతని తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (ఐసీయూలో నటుడు సత్యజిత్.. పరిస్థితి విషమం) -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
సంగం: ఎంసీఏ పూర్తి చేసిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలోని ఉడ్హౌస్పేటలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఉడ్‌హౌస్‌పేట గ్రామానికి చెందిన దొడ్ల శ్రీనివాసులుకు గీత (24) రెండో సంతానం. గతేడాది ఎంసీఏ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నం చేస్తోంది. శుక్రవారం గీత తల్లి బయటకు వెళ్లగా అన్న గిరీష్ ఎదురింట్లో నిద్రిస్తున్నాడు. తండ్రి కూలి పనికి వెళ్లాడు. ఏమైందో గానీ గీత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కాసేపటికి ఇంటికి వచ్చిన తల్లి గీతను చూసి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న సంగం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బుచ్చిరెడ్డిపాళెం తరలించారు. గీత మృతితో ఉడ్‌హౌస్‌పేట గ్రామంలో విషాదం నెలకొంది. -
కమిషనర్‌కు పురుగుల అన్నం
కర్ణాటక, మైసూరు: పర్యాటక రాజధానిగా ప్రసిద్ధి చెందిన రాచనగరిలో కొందరి నిర్వాకం వల్ల చెడ్డపేరు వస్తోంది. భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్ళిన మహా నగర పాలికే (కార్పొరేషన్) కమిషనర్‌కు హోటల్ సిబ్బంది పురుగుల అన్నం వడ్డించడంతో కంగుతిన్నారు. వెంటనే ఆరోగ్య శాఖ అధికారులకు తెలపడంతో వారు వచ్చి పరిశీలన జరిపి హోటల్ యజమానికి రూ.30 వేల జరిమానా విధించిన సంఘటన మైసూరు నగరంలో చోటు చెసుకుంది. కమిషనర్‌గీతా గురువారం మధ్యాహ్నం భోజనం చేయడానికి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఆనందభవన హోటల్‌కు వెళ్లారు. ఆమె ఆర్డర్ ప్రకారం సిబ్బంది భోజనం తీసుకొచ్చారు. తినబోతుంటే.. ఆమె తినబోతూ చూస్తే భోజనంలో పురుగులు కనిపించాయి. వెంటనే ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన వచ్చి భోజనాన్ని పరిశీలించి పురుగులు ఉన్నట్లు తేల్చారు. హోటల్లో ఉన్న అపరిశుభ్రత, కుళ్ళిపోయిన, పురుగులు పట్టిన కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. -
ప్రియుడు పెళ్లికిఒప్పుకోలేదని ఆత్మహత్య..
గజపతినగరం రూరల్: గజపతినగరం ఠానా వీదికి చెందిన కర్రి గీత (22) మనస్తాపంతో బుధవారం ఇంటిలోనే ఉరివేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. బొండపల్లి మండల కేంద్రానికి చెందిన గవిరెడ్డి క్రాంత్ అనే యువకుడిని గీత ప్రేమించింది. క్రాంత్ ప్రస్తుతం జమ్మూలో ఆర్మీ ఉద్యోగిగా పనిచేస్తుండగా... గీత పాలిటెక్నికల్ కోర్సు పూర్తి చేసింది. ఎప్పుడు పెళ్లి చేసుకుందామని గీత పలుమార్లు క్రాంత్‌ను ప్రశ్నించగా.. తర్వాత చేసుకుందాంలే అని బదులివ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గీత ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆమెను గజపతినగరం సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గీత మృతితో తల్లిదండ్రులు ఈశ్వరరావు, మంగమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అబ్బాయిని ఏ‘మార్చేసి’..
‘మబ్బులోన వాన విల్లులా.. మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులాదాగినావుగా’ ఈ పాట వినిపిస్తే చాలు అలా అలా పాటంతా అలవోకగా పాడేసే సిటీ యూత్ చాలా మందే ఉన్నారు. అయితే.. ఓ అమ్మాయి కోసం అబ్బాయి పాడిన ఈ పాటనే అమ్మాయిలు కూడా పాడేసుకుంటున్నారు. కానీ అబ్బాయిల్ని ఉద్దేశించి పాడినప్పుడు సాహిత్యం మారితే మరింత బాగుంటుంది కదా? సిటీకి చెందిన టీనేజ్ గర్ల్స్‌లో వచ్చిన ఈ ఆలోచన సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. సాక్షి, సిటీబ్యూరో : ‘చిన్నప్పటి నుంచీ నాకు పాడడం అంటే ఇష్టం’ అని చెప్పింది స్ఫూర్తి. నగరంలోని ఎస్సార్‌నగర్, ఈఎస్ఐ ప్రాంతంలోని వికాస్పురి కాలనీలో నివసించే ఈ బీఎస్సీ స్టూడెంట్‌కి పాడడం అంటే ఉండే ఈ ఇష్టంలో విశేషం లేకపోవచ్చు. కానీ..‘మూడేళ్ల వయసులోనే ఇంట్లో ఏవైనా నాలుగైదు వస్తువులు చూస్తే చాలు అప్పటికప్పుడు పాట అల్లేసి పాడేదాన్ని. అలా మా చెల్లి మీద కూడా రాసి పాడాను’ అంటూ ఆమె గుర్తు చేసుకుంటున్నప్పుడు మాత్రం ఔరా అనిపించకమానదు. ‘నాకున్న ఆ డిఫరెంట్ టాలెంట్ గురించి నా చిన్నప్పుడే ఓ ఆంగ్ల పత్రికలో వచ్చింది. అప్పటి నుంచి ఇంకా పాడడం ఎక్కువైంది’ అంటున్న స్ఫూర్తి.. అత్యంత పిన్న వయసులోనే సినిమాలకు పాడిన యంగెస్ట్ సింగర్ కూడా. ‘యమహో యమ అనే సినిమాలో తొలి పాట పాడాను. తద్వారా యంగెస్ట్ సింగర్‌గా తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నా పేరు నమోదైంది. ఆ తర్వాత కిక్ 2, లోఫర్, ఇజం.. ఇలా నాలుగైదు సినిమాల్లో పాడాను’ అంటూ చెప్పింది. అబ్బాయిని ఏ‘మార్చేసి’.. ‘పిల్లా రా పాట ట్రైన్ జర్నీలో విన్నాను. చాలాసార్లు విన్నాను. బాగా నచ్చింది. పాడుకుంటూ ఉంటే అమ్మాయిని సంబోధిస్తూ పాడడం ఎందుకో నాకు నప్పలేదనిపించి.. అప్పటికప్పుడు అమ్మాయి వెర్షన్‌గా కొన్ని వాక్యాలు మార్చి పాడాను. అలా తొలిసారి 1 నిమిషం పాటను రాసి సరదాగా అప్లోడ్ చేశాను. దీనికి 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత మ్యాంగో మ్యూజిక్ వాళ్ల సంప్రదించారు. వాళ్ల కోరిక మేరకు పూర్తి పాటను మార్చి రాసి అప్లోడ్ చేస్తే 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనికి సూర్య అనే ఫ్రెండ్ గిటారిస్ట్‌గా వ్యవహరించాడు’ అంటూ చెప్పుకొచ్చింది స్ఫూర్తి. తాజాగా హుషారు సినిమాలోని ఉండిపోరా (విషాదభావం) అనే హిట్ సాంగ్‌ని ఫిమేల్ వెర్షన్‌లోకి మార్చి పాడిన స్ఫూర్తి ‘ఉండిపోతారా’ అంటూ బదులిచ్చినట్టుగా రాసి పాడడం ద్వారా ఇందులో మరో కొత్త ప్రయోగం జోడించింది. కేవలం వారం రోజుల్లోనే ఇది టాప్ త్రీలో నిలవడం విశేషం. ప్రస్తుతం వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకుంటున్న స్ఫూర్తి.. త్వరలో 2018లోని హాట్సాంగ్స్ అన్నీ గుదిగుచ్చి మాషప్ రూపొందించనున్నానని, మంచి గాయనిగా కావాలనేదే లక్ష్యమని, సొంత కంపోజిషన్ చేయనున్నానని చెప్పింది. అరుదుగా మాత్రం మేల్ సాంగ్‌కి ఫిమేల్ వెర్షన్‌ని రాసి పాడతానంటోంది. ఆల్ ద బెస్ట్ స్ఫూర్తి. -
రేవంత్ రెడ్డి ఎక్కడ..?
సాక్షి, కొడంగల్: తన భర్తను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భార్య గీత డిమాండ్ చేశారు. తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదని వాపోయారు. తీవ్రవాదని ఈడ్చుకెళ్లినట్టు బలవంతంగా లాక్కెల్లి వాహనంలో తీసుకుపోయారని, ఎక్కడి తరలిస్తున్నారో కూడా చెప్పలేదన్నారు. తామేమన్నా తీవ్రవాదులమా అని ప్రశ్నించారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆమె కోరారు. ఇది కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడిగా ఆమె వర్ణించారు. నియంత పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. (రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్) వికారాబాద్ జిల్లాలోని కోస్గిలో కేసీఆర్ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో నిరసనలకు పిలుపునివ్వడంతో రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి, అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరినీ జడ్చర్ల పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు తరలించినట్టు తెలుస్తోంది. మరోవైపు కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (కొడంగల్‌లో ఉద్రిక్తత...!) -
ఇప్పుడు బిల్డప్ కృష్ణ
‘‘బిల్డప్ కృష్ణ’ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర చేశా. అప్పట్లో కొన్ని సినిమాల్లో ఐదారు కుటుంబాల మధ్యలో ముఖ్యమైన పాత్రలో గొల్లపూడి మారుతీరావుగారు ఎలా నటించేవారో.. ఈ సినిమాలో నాది అలాంటి పాత్ర’’ అని నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. సరీష్, గీత జంటగా పోసాని కృష్ణ్ణమురళి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బిల్డప్ కృష్ణ’. విన్సెంట్ సెల్వ దర్శకత్వంలో లక్ష్మీ టాకీస్ సమర్పణలో నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ– ‘‘ఇప్ప టి వరకు ఎన్నో పాత్రలు చేశాను. ‘బిల్డప్ కృష్ణ’లో ఏడ్చే పాత్ర చేశా. సన్నివేశాలు చూసి నేనే కన్నీళ్లు పెట్టుకున్నా.ఈ సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు కూడా కన్నీళ్లు వస్తాయి. విన్సెంట్ నాకు మంచి పాత్ర ఇచ్చారు. అందుకే టైటిల్ కూడా ‘బిల్డప్ కృష్ణ’ అని పెట్టాం. రైటర్‌గా ఉన్నప్పుడు కూడా నాకు నేను ఇలాంటి పాత్ర రాసుకోలేకపోయా, ఎవరికీ రాయలేకపోయా. ఈ సినిమాలో నా పాత్ర చూస్తుంటే గొల్లపూడి మారుతీరావుగారే కనిపిస్తారు’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. పోసానిగారితో చేయడం సంతోషాన్నిచ్చింది’’ అన్నారు విన్సెంట్ సెల్వ. ‘‘నా మొదటి చిత్రంతోనే పోసానిగారితో కలిసి నటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా’’ అని సరీష్ అన్నారు. -
పన్నుల వసూళ్లలో వరంగల్ ముందంజ
కరీమాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డివిజన్ల కన్నా వాణిజ్య పన్నుల వసూళ్లలో వరంగల్ డివిజన్ ముందంజలో ఉందని కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్(డీసీ) గీత బుధవారం వెల్లడించారు. వరంగల్, ఖమ్మం జిల్లాలోని మొత్తం 11 సర్కిళ్లలో మార్చి 2018 నాటికి మొత్తం 21044 మంది డీలర్స్ ఉండగా వీరిలో 15948 మంది గతంలో జీఎస్టీలోకి మైగ్రేషన్ అయ్యారన్నారు. కొత్తగా 5096 మంది గత జులై నుంచి ఈ మార్చి వరకు జీఎస్టీలో మైగ్రేట్ అయినట్లు డీసీ గీత వివరించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది(2018–18)కి ఎక్కువ పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు. ప్రధానంగా 2017–18 సంవత్సరానికి గాను రాబడి రూ.431 కోట్లు వచ్చినట్లు తెలిపారు. కేవలం ఈ మార్చి 2018 వరకు రూ. 56.32 కోట్ల పన్నులు వసూలు చేసినట్లు డీసీ గీత వివరించారు. అలాగే 2017–18 సంవత్సరానికి గాను పాత బకాయిలు రూ.13.6 కోట్లు వసూలు చేశామన్నారు. ఇక జులై 2017 నుంచి మార్చి 2018 వరకు 81 శాతం జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయించినట్లు డీసీ పేర్కొన్నారు. పన్నుల వసూళ్లలో వరంగల్ డివిజన్ వాణిజ్య పన్నులు శాఖా సిబ్బంది ఉత్సాహంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. -
కొంగున ముడేసుకోవాలని చూసే 'భార్యలు జాగ్రత్త'
చెరిసగం అన్నారు పెద్దలు.నువ్వో సగం నేనో సగం అన్నాడు ఆత్రేయ.ఫిఫ్టీ పర్సెంట్ అడగడం న్యాయం.కాని పూర్తిగా కావాల్సిందే అని పట్టుబడితే భర్త తనకు తాను ఏం మిగులుతాడు... గుండు సున్నా.భర్త ఆఫీసరై ఉంటాడు. భార్యకు ఇన్సెక్యూరిటీ. అందంగా ఉంటాడు. భార్యకు ఇన్సెక్యూరిటీ. మంచి మాటకారి. ఇన్సెక్యూరిటీ. ఫేమ్ ఉంది. ఇన్సెక్యూరిటీ. హోదా.. అంతస్తు...అన్నింటికీ ఇన్సెక్యూరిటే.కాని భర్తలందరికీ ఇదే పనా? వేరొక స్త్రీ కోసం వేచి చూడటమే వాళ్ల పనా. వేరొక స్త్రీని వెతకడమే వారి పనా? ఆఫీసుకెళ్లి పని చేసుకోవాలనుకునేవారు, ఎంచుకున్న రంగంలోరాణించాలని కష్టపడేవాళ్లు, ఎంత ఎత్తుకు ఎదిగినా భార్యా పిల్లలు కుటుంబమూ ముఖ్యం అనుకునేవారు ఉండరా?ఉంటారు... కాని వాళ్లను వల్లో వేసుకునేవారు కూడా ఉంటారు అంటుంది ఈ సినిమాలో గీత.ఆమె మంచి అందగత్తె. డబ్బున్నవాళ్ల అమ్మాయి. ఫేమస్ సినీ గాయకుడైన రహెమాన్ భార్య. ఆమెకు భర్త అంటే ఇష్టం. చాలా ప్రేమ. ఎంత ప్రేమంటే అతడి ప్యాంటూ షర్టులా అతణ్ణి ఇరవైనాలుగ్గంటలూ అంటి పెట్టుకోవాలనుకునేంత. ఎక్కడికీ వెళ్లనివ్వదు. ఎవ్వరితో మాట్లాడనివ్వదు. ఎవరినీ కలవనివ్వదు. ముఖ్యంగా ఆడవాళ్ల పక్కన కూర్చున్నా నచ్చదు.తను హ్యాండిల్ చేయలేని పెన్నిధి ఏదో తన దగ్గర ఉంది అని సతమతమైపోతూ ఉంటుంది ఆమె.రహెమాన్‌కు భార్య అంటే అభిమానమే. ఆమె ప్రవర్తన విసుగ్గా ఉన్నా అతడికి మరో స్త్రీ పట్ల ఆసక్తి లేదు. పాటలు, ఇల్లు ఇవే అతని ప్రపంచం. కాని భార్య అతణ్ణి నమ్మదు. కాదు కాదు.. లోకాన్ని నమ్మదు. వల వేసే ఎర వేసే లోకం అంటే ఆమెకు భయం. అంత మాత్రం చేత ఊపిరి ఆడనివ్వకుండా చేయొచ్చా?ఈ వ్యవస్థలో కొన్ని సెటిల్ అయి ఉన్నాయి. మగాడు సాయంత్రం షికార్లు కొట్టాలి. ఫ్రెండ్స్‌తో తిరగాలి. అడపా దడపా పార్టీలు చేసుకోవాలి. రిలాక్స్‌కావాలి. ఆ మేరకు భార్య అతడిని వదిలిపెట్టాలి. ఆడది తీరిక ఉన్నప్పుడు పక్కింటి పిన్ని దగ్గరకు వెళ్లాలి. ఏవో వ్రతాలు నోములు చేసుకోవాలి. నలుగురితో కలిసి షాపింగ్‌కు వెళ్లాలి. బ్యూటీ పార్లల్‌కు వెళ్లాలి.పుట్టింటివాళ్లతో ఫోన్లు మాట్లాడుకోవాలి. ఇల్లు బోరు కొడుతుందని ఉద్యోగం చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి. ఆ మేరకు భర్త ఆమెను వదిలిపెట్టాలి.భార్య అలా వదిలిపెట్టకపోయినా భర్త ఇలా విడువకపోయినా గొడవలు వస్తాయి.ఈ సినిమాలో కూడా గొడవ అదే.నా స్పేస్‌ను నాకు వదిలిపెట్టు అంటాడు భర్త. భార్య వినదు. అతడి కచేరీలకి, పార్టీలకి, ఆఖరకు ఫ్రెండ్స్ ఇళ్లకు వెళితే అక్కడకూ తయారవుతూ ఉంటుంది. చివరకు ఒక దశలో ‘నువ్వు నలుగురి కళ్లల్లో పడటం నాకు ఇష్టం లేదు పాడటం మానెయ్’ అని అల్టిమేటం జారీ చేస్తుంది.అతడు పుట్టిందే పాడటానికి.పాడటం మానేయమంటే?ఇక విసిగిపోతాడు. చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి పారిపోతాడు.గతంలో ఇలాంటి మగవాళ్లు సన్యాసుల్లో కలిసేవాళ్లని అంటారు.రహెమాన్ మాత్రం గోవా బస్సెక్కుతాడు. విముక్తి కోరుకునేవారు, స్వేచ్ఛను ఆశించేవారు వెళ్లేది అక్కడికే కదా. ఒక తోడు వదిలిపెడితే ఇంకో జోడి ఉండనే ఉంటుంది లోకంలో.అదే బస్‌లో ఇంటి నుంచి పారిపోయిన సితార ఎక్కుతుంది. ఆమెది రెగ్యులర్ కథే. దుర్మార్గుడైన మొగుడు. డబ్బు కోసం ఆమెను ఎవరి దగ్గరికైనా పంపడానికి వెనుకాడని వెధవ. ఇలాంటి వాడు వద్దు అని పారిపోయింది. ఇద్దరూ ఈ బస్‌లో పరిచయమయ్యారు. గోవాలో షికార్లు చేశారు. ఆకర్షణ చాలా సులభం. స్త్రీ, పురుషుడు ఒక చోట ఉంటే దప్పికా వెంటనే వెక్కిళ్లూ వచ్చేస్తాయి.కాని ఇద్దరూ కంట్రోల్లో ఉంటారు.కోరికను దాటగలిగిన బంధం కోసం చూస్తారు.అయితే వారికి అదే గోవాలో ఒక వృద్ధ దంపతుల జంట పరిచయం అవుతుంది. వారు దాంపత్య జీవితానికి అసలు సిసలు ఉదాహరణ. ఇద్దరూ పరస్పరం గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ ఒకరి చేయి ఒకరు విడవకుండా... వివాహబంధంలో భార్యాభర్తలు ఇలా ఉండాలి. కాని వీరిద్దరూ? వివాహానికి న్యాయం చేస్తున్నారా?చివరకు వీళ్ల వ్యవహారం తెలియాల్సినవాళ్లకు తెలుస్తుంది. గోవా నుంచి సిటీకి చేరుకుంటారు. గీత రహెమాన్‌కు విడాకులు ఇవ్వాలని నిశ్చయించుకుంటుంది. విడాకులు అయిపోతాయి కూడా. రోషంతో ఇంకొకరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. కాని ఆ పెళ్లి జరగదు. అసలు ఆ పెళ్లి జరగాలని ఆమెకు ఉంటే కదా. ఆమె మనసు తన భర్త దగ్గరే ఉంది. అతడు దూరమయ్యాక తాను కోల్పోయిందేమిటో అర్థమైంది. దుఃఖం, వేదన, కలత... మెల్లగా గీత పిచ్చిదైపోతుంది.ఒక ప్రాణాన్ని క్షోభకు గురి చేసి తాము బావుకున్నది ఏముంది అనుకుంటారు రహెమాన్, సితారలు.సితార రహెమాన్‌ను వదిలి పశ్చాత్తాపంతో తన కోసం ఎదురు చూస్తున్న భర్త దగ్గరకు వెళ్లిపోతుంది.రహెమాన్ గీతను తిరిగి స్వీకరించడంతో కథ ముగుస్తుంది.అర్ధనారీశ్వరంలో పార్వతి సగం, శివుడు సగం.దైవం కూడా నిర్ణయించిన పర్సెంటేజీ అది.మనలో సగం మన జీవిత భాగస్వామికి. మిగిలిన సగం మనకు. ఇది అర్థం కాని దంపతులూ జాగ్రత్త! పుదు పుదు అర్థంగళ్ 1998లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన నిర్మించిన సినిమా ‘పుదు పుదు అర్థంగళ్’. అంటే ‘కొత్తకొత్త అర్థాలు’ అని అర్థం. మనిషి మానసిక బంధాలను, వివాహం ద్వారా నియమబద్ధం చేసే భౌతిక బంధాలను పరిపరి విధాలుగా అర్థం చేసుకోవాలని చెప్పే సినిమా ఇది. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రహెమాన్, గీత, సితార... ఈ సినిమాలో పోటీ పడి నటించారు. అప్పటికి సినిమాల్లో ఒక హీరోయిన్ ‘నంబర్ టూ’ వస్తుందని బస్సు దిగడం, అది అయ్యాక నీళ్లలో చేయి కడుక్కుంటూ కనిపించడం లేదు. ఈ సినిమాలో అదో మామూలు విషయంగా బాలచందర్ చేయించగలిగాడు. ఉప కథలు ఉండటం వల్ల కొన్ని కథల కథ చూస్తున్న భావన కలుగుతుంది. ఆ తర్వాతి కాలంలో పెద్ద కమెడియన్ అయిన వివేక్‌కు ఇది గుర్తింపు తెచ్చిన తొలి సినిమా. ఇళయరాజా, బాలచందర్ కలిసి పని చేసిన చివరి సినిమా ఇది. ఇందులో పాటలు పెద్ద హిట్ అయ్యాయి– తెలుగులో కూడా. ఇందులో పనివాడు ‘నేను కాబోయే ముఖ్యమంత్రిని’ అంటుంటాడు. ప్రతివాడూ రాజకీయాల్లో దిగి ముఖ్యమంత్రి కావాలనుకునే తమిళుల ధోరణి మీద బాలచందర్ పంచ్ కావచ్చు అది. కాని ఆశ్చర్యమేమంటే ఇవాళ ఆయన ఇద్దరు శిష్యులు– రజనీ, కమల్ ముఖ్యమంత్రులు కావడానికి పెద్ద మంత్రాంగం చేస్తున్నారు. – కె -
కాంట్రాక్ట్ లెక్చరర్ ఆత్మహత్య
ఆమె వందలాది మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే గురువు. కానీ ఆ మాతృమూర్తికి ఏ కష్టమొచ్చిందోగానీ మూడేళ్ల బాబుతో పాటు పొత్తిళ్లలో చిన్నారిని వదిలి శాశ్వతంగా వెళ్లిపోవాలనుకుంది. పేగుబంధాన్ని తెంచుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఏడిస్తే పరుగు పరుగున వచ్చి అక్కున చేర్చుకోవాల్సిన తల్లి.. విగతజీవిలా ఎందుకు పడి ఉందో తెలియని పరిస్థితి ఆ చిన్నారులది. ఈ సంఘటన చూసిన వారి కళ్లు చెమరుస్తున్నాయి. సోంపేట: కుటుంబ కలహాలతో మానసికంగా కుంగిపోయిన కాంట్రాక్టు లెక్చరర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా తెర్లాం గ్రామానికి చెందిన తెర్ల నూకరాజుతో, అదే జిల్లా చౌదంటివలస గ్రామానికి చెందిన గేదెల సింహాచలం (గీత)తో 2012, మార్చి9న వివాహం జరిగింది. నూకరాజు ఏపీజీవీబీలో ఫీల్డ్ ఆఫీసర్‌గా, గీత ప్రభుత్వ కళాశాలలో ఒప్పంద అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. 2016లో విజయనగరం నుంచి బొరివంక ఏపీజీవీబీ బ్రాంచికి నూకరాజుకు బదిలీ అయింది. గీత కూడా అదే సంవత్సరం విజయనగరం నుంచి సోంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒప్పంద అధ్యాపకురాలిగా బదీలీపై వచ్చారు. వీరు ఏడు నెలల క్రితం రాజా పంతుల కాలనీలోని ఇంట్లో అద్దెకు దిగారు. వీరికి మూడేళ్ల బాబు చేతన్‌తో పాటు ఐదు నెలల పాప హయాతి ఉన్నారు. వివాహం అయిననాటి నుంచి వీరి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో గీత కుంగిపోయి శుక్రవారం ఉదయం బెడ్రూమ్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విగత జీవి పడి ఉన్న తమ కుమార్తెను చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 24 నుంచి ఆమె ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్‌కు వెళ్లాల్సి ఉంది. మూడు రోజులుగా గొడవలు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఇంటి ఓనర్ వద్దకు వెళ్లిన నూకరాజు.. తన భార్య ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. వాళ్లు వచ్చేసరికి ఆమె మెయిన్‌హాల్‌లో కింద పడి ఉంది. దీనిపై నూకరాజును విచారించగా.. తాను బాత్రూమ్కు వెళ్లి వచ్చే సరికి గీత చీరతో ఉరివేసుకుని ఉందన్నారు. వెంటనే చీర కోసి రక్షించే ప్రయత్నం చేశానని, దుస్తులు మార్చి ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి కిందకు దించానని పోలీసులు, ఇంటి యజమానికి వివరించారు.కాగా, మూడు రోజులుగా నూకరాజు, గీత మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మూడు రోజులుగా బ్యాంకు బ్రాంచిలోనూ నూకరాజు ముభావంగా ఉండేవాడని, భోజనం కూడా సరిగ్గా చేయక పోయేవాడని బ్యాంకు సిబ్బంది వివరిస్తున్నారు. నూకరాజుకు స్వగ్రామంలో కొందరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గృహహింస, అధిక కట్నం వేధింపులతోనే.. నూకరాజు తనను చాలాకాలం నుంచి అధిక కట్నం కోసం వేధిస్తున్నాడని తరుచూ గీత చెబుతుండేదని తండ్రి సత్యనారాయణ తెలిపారు. వీటితో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సోంపేట ఎస్.ఐ దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేశారు. íసీఐ సన్యాసినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గీత రాత మారింది
ఒంగోలు టౌన్: ఆ ఆడ శిశువు జన్మించిన తరువాత రెండు నెలలే తల్లి పొత్తిళ్లలో ఉంది. ఆ మాతృమూర్తి కన్న పేగును దారుణంగా తెంచేసుకుంది. రెండు నెలల పసిగుడ్డును నిర్ధాక్షిణ్యంగా వదిలేసింది. మహిళా శిశు సంక్షేమశాఖ పర్యవేక్షణలో ఆ శిశువు ఒంగోలులోని శారా హోమ్‌లో ఉంటోంది. ఆ శిశువుకు గీత అని పేరు పెట్టారు. ఒకటిన్నరేళ్ల వయస్సు(18నెలలు) కలిగిన గీత చలాకీగా ఆడుకుంటూ ఉంటోంది. అయితే ప్రస్తుతం గీత తలరాత ఒక్కసారిగా మారిపోయింది. ప్రత్యేక అవసరాలు కలిగిన ఆ చిన్నారిని స్వీడన్ దేశానికి చెందిన యువతి కరీనా జూలియన్ మంగళవారం దత్తత తీసుకుంది. కలెక్టర్ వి.వినయ్‌చంద్ సమక్షంలో స్వీడన్ యువతి గీతను దత్తత కింద స్వీకరించింది. ఈ సందర్భంగా కరీనా జూలియన్ మాట్లాడుతూ స్వీడన్లో ఉద్యోగం చేస్తున్న తాను ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భారతదేశంలోని రెండేళ్లలోపు వయస్సు కలిగిన శిశువును తీసుకునేందుకు తాను దరఖాస్తు చేసుకున్నానన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ సమగ్ర బాలల పరిరక్షణ పథకం దత్తత విభాగం ద్వారా స్వీడన్ యువతికి గీతను దత్తత ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పీ సరోజిని, ఐసీపీఎస్ డీసీపీఓ ఎన్ జ్యోతిసుప్రియ, ప్రత్యేక దత్తత విభాగం మేనేజర్ శ్రీలత, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి హీనాప్రతిభ ఉన్నారు. -
నవ్వించడం ఓ వరం
సింహాచలం (పెందుర్తి) : హాస్య నటిగా గుర్తింపు పొందడం ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తానని గీతాసింగ్ తెలిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం హాస్యనటులు సుమన్‌శెట్టి, చిట్టిబాబు, జబర్దస్త్ టీం లీడర్ ఆనంద్‌లతో కలిసి ఆమె దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తేజ తీసిన జై సినిమాతో సినీ రంగప్రవేశం చేశానన్నారు. ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర సినిమాలో నటించానన్నారు. హీరో నరేష్ సిమాలో ప్రస్తుతం నటిస్తున్నాన్నారు. మరికొన్ని సినిమాల్లో చాన్స్‌లు వస్తున్నాయని, స్టోరీలు వింటున్నానన్నారు. కితకితలు సినిమా నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు. సుమన్శెట్టితో తాను ఒక రియాల్టీ షో చేస్తున్నాని వచ్చే నెలలో ఆ షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు. నెగిటివ్ రోల్స్ ఇష్టం : సుమన్‌శెట్టి నెగిటివ్ రోల్స్ చేయడం చాలా ఇష్టమని సినీ నటుడు సుమన్‌శెట్టి తెలిపారు. తెలుగులో జయం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యానన్నారు. 7జి బృందావనం కాలనీ, రణం, యజ్ఞం తదితర సినిమాలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయన్నారు. ప్రస్తుతం అనుకోకుండా ఒక రాజకుమారుడు సినిమాలో నటిస్తున్నాన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, బోజ్‌పురి భాషల్లో ఇప్పటి వరకు భాషల్లో కలిపి 290 సనిమాల్లో నటించానన్నారు. పుట్టింది, పెరిగింది అంతా వైజాగ్ పూర్ణామార్కెట్ అని పేర్కొన్నారు. -
పిడుగుల్లాంటి పిల్లలతో ‘సంగుచక్రం’
తమిళ సినిమా: మైడియర్ కుట్టి సాతాన్ చిత్రం తరహాలో సంగుచక్రం చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు మారశన్ పేర్కొన్నారు. ఇంతకుముందు నడువుల కొంచెం పక్కత్తు కానోమ్, ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లియోవిజన్ వీఎస్.రాజ్‌కుమార్, సినిమావాలా పిక్చర్స్ కే.సతీష్ కలిసి నిర్మించిన తాజా చిత్రం సంగుచక్రం. ఈ సినిమాలో దిలీప్ సుబ్బరాయన్, గీతా, జర్నిరోస్తో పాటు పలువురు బాల తారలు ప్రధాన పాత్రలు పోషించారు. ఫబీర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్రయనిట్ చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు తెలుపుతూ.. ఇది పిల్లల ఇతి వృత్తంతో కూడిన వినోదాన్ని మేళవించిన హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో పది మందికి పైగా బాల తారలు ముఖ్య పాత్రల్లో నటించారని చెప్పారు. 30 ఏళ్ల క్రితం తెరపైకి వచ్చి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న మైడియర్ కుట్టి సాతాన్ చిత్రం తరహాలో దెయ్యం ఇతి వృత్తంతో సాగే కథా చిత్రం ఇదని తెలిపారు. చిత్రంలో పిల్లలే దెయాన్ని భయపెడతారని చెప్పారు. ఇందులో కథానాయకిగా నటించిన గీత షూటింగ్ 20 రోజుల్లో భూమి మీద ఉన్న దాని కంటే తాడుతో కట్టబడి పైన వేలాడిన రోజులే అధికం అని చెప్పారు. అయినా పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో గీత నొప్పిని భరించి నటించారని తెలిపారు. చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు దర్శకుడు మారీశన్ తెలిపారు. ఈయన అసలు పేరు రంజిత్. మరణించిన తన తండ్రి మారి జ్ఞాపకార్థం తన పేరును మారీశన్‌గా మార్చుకున్నారు. -
రెండు వారాల్లో ఆమె పెళ్లి...అంతలోనే విషాదం
-
విషాద ‘గీత’మ్..
మరో రెండు వారాల్లో ఆమె పెళ్లి.. కుటుంబంతో కలసి పెళ్లి బట్టలు కొనేందుకు నగరానికి వచ్చింది.. కాబోయే భర్తతో కలసి షాపింగ్ ముగించుకుని బైక్‌పై తిరిగివెళుతోంది. ఇంతలో టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆమెను కబళించింది. సాక్షి, హైదరాబాద్ : శుక్రవారం రాత్రి సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన మెడికల్ ఆఫీసర్ వాల్యానాయక్, రంజితలకు కూతురు గీత(21), కుమారుడు విశ్వచంద్ ఉన్నారు. గీత అనంతపూర్‌లో బీఏఎంఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సూర్యాపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శబరీనాథ్‌తో గీత వివాహం నిశ్చయమైంది. ఈ నెల 24న వీరి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి బట్టలు కొనేందుకు గీత, శబరీనాథ్‌తో పాటు ఇరువురి కుటుంబ సభ్యులు శుక్రవారం నగరానికి వచ్చారు. కొత్తపేటలోని ఓ వస్త్ర దుకాణంలో పెళ్లి బట్టలు తీసుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో శబరీనాథ్, గీత బైక్‌పై ఎల్బీనగర్ వెళుతుండగా.. వెనుక కారులో కుటుంబసభ్యులు వారిని అనుసరిస్తున్నారు. బైక్ యూటర్న్ తీసుకుంటుండగా అదే సమయంలో ఎల్బీనగర్ నుంచి వేగంగా దూసుకువచ్చిన హెవీ టిప్పర్(ఏపీ29టీఏ3813) వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వెనక కూర్చున్న గీత రోడ్డుపై పడిపోగా, శబరీనాథ్ డివైడర్‌వైపు పడిపోయాడు. గీత తలపై నుంచి టిప్పర్ చక్రం వెళ్లడంతో ఆమె తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. వెనుకనే కారులో వచ్చిన ఆమె తల్లిదండ్రులు గీత మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. మరికొద్ది రోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన కుమార్తెను ఆ పరిస్థితిలో చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గాయపడ్డ శబరీనాథ్‌ను ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్‌ను వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సరూర్‌నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. పెళ్లి బట్టలు కొనేందుకు వచ్చి అనంత లోకాలకు... -
నటిగా దర్శకుడి తల్లి
కాఫీలాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫిదా. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మలయాళీ బ్యూటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన పాత్రలో ఓ హిట్ దర్శకుడి తల్లి కనిపించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రకటించారు. పెళ్లి చూపులు సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తల్లి గీత.. ఫిదా సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. గతంలో తరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన పలు షార్ట్ ఫిలింస్ లో కనిపించిన గీత.. తొలిసారిగా వెండితెర మీద కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత తరుణ్ తల్లి గీత అని కాదు.. గీతగారి కొడుకే తరుణ్ అని చెప్పుకుంటారంటున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. -
రోడ్డుపైనే మహిళ ప్రసవం
పుట్లూరు (శింగనమల) : అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో ఓ మహిళ రోడ్డుపైనే ప్రసవించింది. స్థానిక మహిళలు ఆమెకు పురుడు పోశారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. పుట్లూరు మండలం శనగలగూడూరు ఎస్సీ కాలనీకి చెందిన గీత, నాగేశ్వర్ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హైదరాబాద్‌లో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. గీత నాలుగోసారి గర్భం దాల్చడంతో స్వగ్రామం వచ్చారు. శుక్రవారం ఉదయం పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడం కోసం ఆశా కార్యకర్త 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అప్పటికే ఆ ఆంబులెన్స్ మరో కేసులో ఉండటంతో రావడానికి ఆలస్యమైంది. దీంతో ఆటోలో ఆస్పత్రికి వెళ్లడం కోసం రోడ్డు వద్దకు వచ్చిన గీత కొద్దిసేపటికే స్థానిక మహిళల సాయంతో అక్కడే ప్రసవించి అడపిల్లకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం వచ్చిన 108 సిబ్బంది తల్లీబిడ్డలను పుట్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. నాలుగు మండలాలకు ఒకే ఆంబులెన్స్ పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాలకు ఒకే 108 అంబులెన్స్ ఉండటంతో సకాలంలో వచ్చి ఆస్పత్రులకు తీసుకెళ్లడం ఆలస్యమవుతోంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పుట్లూరులో ఒక అంబులెన్స్ ప్రజలకు అందుబాటులో ఉండేది. అనంతరం అంబులెన్స్‌ల సంఖ్య తగ్గిపోవడంతో ప్రజలు ఆపద సమయంలో అవస్థలు పడాల్సిన దుష్టితి నెలకొంది. -
జయలలిత ఫ్రెండ్ కి కోర్టు నోటీసులు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు గీతకు ఎగ్మూరు నేరవిభాగ కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ నెల 11వ తేదీలోగా తమ ఎదుట హాజరుకావాలని ఆమెను న్యాయస్థానం ఆదేశించింది. జయలలిత మరణం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించాలని కోరుతూ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేయడంతో నోటీసులిచ్చింది. జయలలిత గతేడాది సెప్టెంబర్ 22న అనారోగ్యం కారణంగా అపోలో ఆస్పత్రిలో చేరి డిసెంబర్ 5న కన్నుమూశారు. ఆమె మృతిపై పలు వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో జయ మరణంపై తనకు సందేహం ఉందని, ఆమెను హత్య చేశారనే అనుమానాలున్నట్లు గీత పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత చికిత్స గురించి ఢిల్లీలో సమర్పించిన నివేదిక అబద్దపు నివేదిక అని, అసలైన నివేదిక తన వద్ద ఉందని గీత చెబుతున్నారు. -
తండ్రి అవ్వడం మధురమైన క్షణం: హర్భజన్
ఢిల్లీ: తండ్రి అవ్వడం తన జీవతంలో మధురమైన క్షణం అని భారత ప్రముఖ ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. హర్భజన్‌కు గతేడాది జులైలో కూతురు హినాయా హీర్ పుట్టింది. తండ్రిగా ఎలా ఫీలవుతున్నారని పత్రికా విలేకరు అడిగిన ప్రశ్నకు జీవితంలో అద్భుతమైన క్షణం అని తెలిపారు. ఇది గొప్ప బాధ్యతగా భావిస్తున్నానన్నారు. తండ్రిగా ఆ క్షణాన్ని అంతగా వివరించలేక పోతున్నానని కానీ జీవితంలో ఒక గొప్ప విషయం అని చెప్పారు. హర్భజన్‌కు 2015లో నటి గీతాతో పెళ్లి అయ్యింది. హర్భజన్ ఎంటీవీ రోడీస్ రైసింగ్ ప్రోగ్రాంలో గ్యాంగ్‌లీడర్‌గా గీతాతో పనిచేశారు. -
ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
యాడికి: మండలకేంద్రం యాడికిలో గీత(40) అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మండల కేంద్రం కోట వీధిలో నివాసముండే గీత ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు ఆమెను 108 వాహనంలో తాడిపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి తరలించినట్లు బంధువులు తెలిపారు. అలాగే మండలంలోని కత్తిమానుపల్లిలో ఎల్లమ్మ(30) అనే మహిళ విష ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన బాలక్రిష్ణ భార్య ఎల్లమ్మ కుటుంబ కలహాలతో విష ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, గమనించిన బంధువులు ఆమెను యాడికి ప్రభుత్వ వైద్యశాలకు,అక్కడి నుంచి తాడిపత్రికి తరలించారు. -
వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌గా గీత
వరంగల్ బిజినెస్ : వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనర్‌గా గీత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన హరిత పంజాగుట్ట డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గీతను తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ మూజాహిద్ హూస్సేన్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు గోపి కిశోర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, ,శ్రీనివాస్, మహ్మద్ ఇబ్రహీం హుస్సేన్, మూజిబ్, ప్రవీణ్, రమేష్, మసూద్, శర్మ, జగదీష్, అయ్యూబ్, హబీబ్, అరుణ, నాగమణి, సుమలత, వినయ్ ఉన్నారు. -
ఇష్టంతోనే ఈషాకు..
కోవైకి చెందిన లత, గీత అనే అక్కాచెల్లెళ్లు తమ అభీష్టానుసారమే ఈషా యోగా కేంద్రంలో చేరిపోయారని న్యాయస్థానం తేల్చింది. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు యోగా కేంద్రంలో విచారణ చేపట్టిన కోవై జిల్లా కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు నివేదికను సిద్ధం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రసిద్ధ యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు కోయంబత్తూరులో సువిశాల మై దానంలో ఈషా యోగా కేంద్రం ఉంది. తమకు తెలియకుండా ఇద్దరు కుమార్తెలను బలవంతంగా సన్యాసినులుగా మార్చేసి కేంద్రంలోనే ఉంచుకున్నారని, తమ కుమార్తెలను అప్పగించేలా యోగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కో యంబత్తూరుకు చెందిన సత్యజ్యోతి అనే మహిళ మద్రాసు హైకోర్టులో ఈనెల 10వ తేదీన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తులు ఎస్ నాగముత్తు, వి. భారతిదాసన్ యోగా కేంద్రంలోని సోదరిమణులను విచారించి 11వ తేదీన నివేదిక దాఖలు చేయాల్సిందిగా కోవై ప్ర ధాన న్యాయమూర్తిని ఆదేశించించారు. విచారణ సమయంలో జిల్లా కలెక్టర్, ఎ స్పీ, పోలీసు ఇన్స్పెక్టర్లను వెంట తీసుకు వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా, ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చిం ది. కోవై జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన నివేదికను మద్రాసు హైకోర్టులో దాఖలు చేశారు. తమ ఇష్టపూర్వకంగానే యోగా కేంద్రంలో చేరామని, తమను ఎవ్వరూ ఒత్తిడి చేసి సన్యాసులుగా మా ర్చలేదని వాంగ్మూలం ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ 18 పైబడి మేజర్లుగా ఉన్న అక్కాచెల్లెళ్ల ఇష్టాలను కాదనే హక్కు కోర్టుకు లేదని, వారిద్దరూ మనస్సు మార్చుకుంటే తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు అభ్యంతరం ఉండదని అన్నారు. యోగా కేంద్రంలోకి వెళ్లి కుమార్తెలను పలుకరించే అవకాశం కల్పించాలని నిర్వాహకులను న్యాయమూర్తులు ఆదేశించారు. -
గీత కాంతి..
-
జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యురాలిగా గీత
శ్రీకాకుళ ం కల్చరల్: జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యురాలిగా పట్టణానికి చెందిన సంఘ సేవకురాలు, లైంగిక వేధింపుల నివారణ కమిటీ చైర్పర్సన్ యార్లగడ్డ గీతను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదంతో జువైనల్ వెల్ఫేర్, బాలల సంక్షేమశాఖ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానాలలో జువైనల్ జస్టిస్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులను నియమించారు. ఇందులో భాగంగా ఈనెల 7వ తేదీన సెలక్షన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పలువురిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించగా, వాటిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించారు. బాలనేరస్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, వారి ప్రవర్తనలో మార్పుతేవడం, వారి జీవన విధానాన్ని మంచి మార్గంలో పెట్టేలా చేయడం జువైనల్ సభ్యుల బాధ్యత. ప్రభుత్వం అప్పగించిన ఈ బాధ్యతను అందరి సహకారంతో సక్రమంగా నిర్వహిస్తానని గీత తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యునిగా మల్లేశ్వరరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యునికి రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ బలివాడ మల్లేశ్వరరావును నియమించింది. వీధిబాలలు, చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతను అందరి సహకారంతో నిర్వహిస్తానని తెలిపారు. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
మెదక్: ‘ప్రేమించాను..పెళ్లి చేసుకుంటానని వెంట పడితే బావే కదా అని నమ్మాను.. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు’ అంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. నంగునూరు మండలం మగ్దుంపూర్‌లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గీతను భాస్కర్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. అతడు వరుసకు బావ కావడంతో సంవత్సరం పాటు కలిసి తిరిగారు. తనను పెళ్లి చేసుకోవాలని గీత కోరడంతో భాస్కర్ నిరాకరించాడు. దీంతో జులైలో భాస్కర్‌తో పాటు అతని తల్లిదండ్రులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిని రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే బెయిల్‌పై వచ్చిన భాస్కర్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కాగా తనకు న్యాయం చేయాలంటూ గీత ఆదివారం ప్రియుని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భాస్కర్ ఇంట్లో కుటుంబసభ్యులు ఎవ్వరు లేకపోవడంతో ఆదివారం సాయంత్రం ఆమె వెనుదిరిగింది. -
గీత మహతో కూతురు కాదట!
న్యూఢిల్లీ: 15 ఏళ్లపాటు పాకిస్తాన్లో ఉండి భారత విదేశాంగ శాఖ కృషితో గత నెలలో ఢిల్లీకి చేరుకున్న భారత పుత్రిక గీత (చెవుడు, మూగ) డీఎన్ఏతో ఆమె తండ్రిగా చెప్పుకుంటున్న జనార్దన్ మహతో డీఎన్ఏ సరిపోలలేదని విశ్వసనీయ వైద్య వర్గాలు మంగళవారం మీడియాకు తెలిపాయి. అక్టోబర్ 27వ తేదీన ఇక్కడి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి చేరుకున్న గీతకు కేంద్ర ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలికిన విషయం తెల్సిందే. ఆ విమానాశ్రయానికి తండ్రిగా చెప్పుకుంటున్న బీహార్‌కు చెందిన మహతో కూడా వెళ్లారు. అట్టహాసంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గీతను, ఆమెను ఇంతకాలం పోషించిన పాకిస్తాన్ ట్రస్టు ప్రతినిధులు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మీడియాకు పరిచయం చేశారు. పాకిస్తాన్లో ఉన్నప్పుడు మహతో దంపతుల ఫొటోను చూపి తన తల్లిదండ్రులుగా అంగీకరించిన గీత హఠాత్తుగా విలేకరుల సమక్షంలోనే వారు తనవారు కాదన్నారు. కంగుతిన్న సుష్మా స్వరాజ్, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మహతో దంపతులు గీత తల్లిదండ్రులు అవునా, కాదా అన్న విషయాన్ని తేలుస్తామని చెప్పారు. కాకపోతే ఇండోర్‌లోని కేర్ సెంటర్లో చేర్పిస్తామని చెప్పారు. బిహార్ బిడ్డగా గీతను భావించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీహార ఎన్నికల్లో లబ్ది పొందాలని భావించినట్టు అప్పట్లో మీడియాలో వచ్చిన వార్తలు ప్రస్తుత పరిణామం నేపథ్యంలో గమనార్హం. -
మోదీకి 'ఈదీ' షాక్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కోటి రూపాయల బహుమానాన్ని ఈదీ ఫౌండేషన్ తిరస్కరించింది. పాకిస్థాన్ కు చెందిన ఈ సంస్థే గీతకు ఆశ్రయం కల్పించింది. సోమవారం భారత్ కు చేరుకున్న గీత.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా ఉద్వేగభరితుడైన మోదీ.. కంటికిరెప్పలా గీతను చూసుకున్నందుకు ధన్యవాదాలంటూ ఈదీ ఫౌండేషన్ చైర్మన్ సతీమణి బిల్కిస్ బానో ను అభినందించారు. 'భారత పుత్రికకు మీరు అందించిన సాయం వెలకట్టలేనిదే అయినప్పటికీ మీ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా వంతు సాయంగా కోటి రూపాయలు ప్రకటిస్తున్నాం' అని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మోదీ విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు ఈదీ ఫౌండేషన్ చైర్మన్ అబ్దుల్ సత్తార్ ఈదీ మంగళవారం ఒక ప్రకటన చేశారు. ఫౌండేషన్ అధికార ప్రతినిధి అన్వర్ ఖాజ్మీ.. ఈదీ నిర్ణయాన్ని మీడియాకు తెలిపారు. ' మోదీ ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కానీ ఆయన ప్రకటించిన విరాళాన్ని స్వీకరించలేం' అని ప్రకటనలో పేర్కొన్నారు. 15 ఏళ్ల కిందట భారత్ నుంచి తప్పిపోయిన బాలిక గీతను కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న ఈదీ ఫౌండేషన్ అక్కున చేర్చుకుంది. హిందూ దేవుళ్లను పూజించుకునే అవకాశాన్ని కల్పించి మురిపెంగా పెంచుకుంది. బజరంగీ భాయిజాన్ సినిమా తర్వాత వెలుగులోకి వచ్చిన గీత కథ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గీత వెంట ఇండియాకు వచ్చిన వారిలో ఈదీ సతీమణి బిల్కిస్ బానోతోపాటు ఆమె మనవరాళ్లు సాబా, సాద్ ఈదీలు కూడా ఉన్నారు. వీరు ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖుల్ని కలుసుకున్నారు. డీఎన్ఏ ఫలితాల అనంతరం తల్లిదండ్రులు ఎవరో నిర్ధారణ అయ్యేంతవరకు గీత ఇండోర్ లోని ట్రైనింగ్ సెంటర్ లో ఉంటుంది. -
స్వదేశానికి ‘భారత పుత్రిక’
-
'డీఎన్ఏ పరీక్షలు నా కూతురే అని చెప్తాయి'
పాట్నా: డీఎన్ఏ పరీక్షల్లో గీతా తమ కూతురే అని నిర్ధారణ చేస్తాయని ఆమె రాకకోసం ఎదురు చూస్తున్న తండ్రి జనార్దన్ మహతో అన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ కూతురు తిరిగి రావడంతో చెప్పలేనంత సంతోషంగా ఉందని చెప్పారు. తన కుటుంబమంతా ఆమెతో కబుర్లుపంచుకునేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి లోనైన ఆయన కళ్లు చెమర్చుతూ'పదహారేళ్ల తర్వాత నా కూతురు కనిపించడం ఆనందంగా ఉంది. డీఎన్ఏ పరీక్షలు కూడా గీత నా కూతురే అని చెబుతాయి. నాకు తెలుసు.. ఆమె నాకూతురే. తప్పకుండా నా దగ్గరికి వస్తుంది. నన్ను ప్రేమగా హత్తుకుంటుంది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ధన్యవాదాలు చెప్తున్నాను' అంటూ జనార్దన్ పేర్కొన్నాడు. -
ఆ మౌని కల నిజమైన వేళ.. ..
న్యూఢిల్లీ: ఓ సుదీర్ఘ జీవన ప్రయాణం.. ఒకటి కాదు రెండు కాదు దాదాపు పద్నాలుగేళ్లు.. శత్రువుకన్నా భయంకరంగా చూసే దేశంలో సురక్షితంగా నిలిచిన ప్రాణం. పెరిగి పెద్దయై నేడు మాతృదేశంలో అడుగుపెట్టింది. కొన్నేళ్ల తర్వాత తిరిగి ఆమె అడుగులు భారత గడ్డపై సందడి చేశాయి. ఇన్నాళ్ల ఆమె మౌనం హద్దులు చెరిగింది. ఏడేళ్ల వయసులో పొరపాటున భారత సరిహద్దులు దాటి దశాబ్దకాలంపైగా పాకిస్థాన్‌లో నివసిస్తున్న మూగ, చెవిటి బాలిక గీత నేడు యువతిగా పెద్దదై ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టింది. సోమవారం ఉదయం ఆమె ఉదయం 9గంటల ప్రాంతంలో ఢిల్లీ చేరుకుంది. ఇస్లామాబాద్‌లోని భారత్ కార్యాలయం పంపిన ఫొటోల నుంచి తన తండ్రి, తల్లి, సోదరీమణులను గుర్తించిన గీత.. తన వారితో కలిసిపోనుంది. అయితే, ఆమె తమకూతురంటే తమ కూతురుని పలువురు అంటుండటంతో ముందుగా ఆమెకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాతే తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. పాక్ లో ఆమె బాగోగులు చూస్తున్న స్వచ్ఛంద సంస్థకు చెందిన ఐదుగురు సభ్యులు కూడా ఆమెతో వస్తున్నారు. కరాచీలో నిలిచిన ప్రాణం పుట్టుకతోనే మూగ, చెవిటి బాలిక అయిన గీత ఏడేళ్ల వయసులోనే పొరపాటున పాక్‌లో అడుగుపెట్టింది. సంజౌతా ఎక్స్ ప్రెస్ ద్వారా పాక్ వెళ్లిన గీత.. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయోమయానికి లోనై నాడు లాహోర్ రైల్వే స్టేషన్ లో బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. ఆమె వివరాలు తెలుసుకునేందుకు అక్కడి వారు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఆమెకు మాటలు రాకపోవడమే ఇందుకు కారణమైంది. కేవలం హావభావాలు పలికించగల గీత చిన్ని మనసు దాయాది పాకిస్థాన్ అధికారుల గుండెలను కూడా పిండేసింది. ఆమె గురించి తెలుసుకున్న ఫహద్ ఈదీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ గీత ఆలనపాలనా చూసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఆమె కరాచీలో రెండోసారి జీవనం మొదలైంది. మలుపుతిప్పిన బజరంగీ భాయ్ జాన్ ఎప్పటికైనా తన వాళ్లను కలుస్తానని అనుకున్న గీత నమ్మకమో.. లేక తమ కూతురు ఏనాటికైనా దొరుకుతుందని భారత్ లోని ఆమె తల్లిదండ్రుల ఆశనో.. గీత జీవితాన్ని మార్చేసింది. సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్ జాన్ చిత్రం ఇందుకు వారధిగా నిలిచింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బజరంగీ భాయ్ జాన్ కథ గీత కథ దాదాపు రెండు ఒకేలా ఉన్నాయి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించగా.. గీత తీరని కోరికకు మాత్రం చిగుళ్లు పూయించింది. ఈ చిత్ర విడుదల తర్వాత తన వాళ్ల వద్దకు వెళ్లాలని గీత అనుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. దీంతో మొత్తం భారత విదేశీ యంత్రాంగం రంగంలోకి దిగి ఆమెను తిరిగి భారత్ రప్పించే ఏర్పాట్లు ప్రారంభించింది. ఎన్నో మలుపులు మౌనమే వరంగా కలిగిన గీత జీవితంలో ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. అనూహ్యంగా చిన్నవయసులోనే తల్లిదండ్రులకు దూరమైన ఆమెకు తల్లిదండ్రులు ఎవరనే విషయంలో ఓ అవగాహన ఉన్నప్పటికీ.. గీత తమ కూతురంటే తమ కూతురని పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్ రాష్ట్రాలకు చెందిన కొందరు తల్లిదండ్రులు ముందుకొచ్చారు. దీంతో అధికారులకు తలనొప్పిగా మారింది. మరోపక్క, 14 ఏళ్లుగా అజ్ఞాత వాసంలో ఉన్న గీత కథ ఓ కొలిక్కి వస్తుందనుకున్న తరుణంలో.. కొత్త మలుపు తిరిగింది. గీతకు మైనర్‌గా ఉన్నప్పుడే ఉమేశ్ అనే వ్యక్తితో పెళ్లైందని.. వారికి ఓ బాబు కూడా ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. తనకు అసలు పెళ్లి కాలేదని గీత చెప్పింది. దీనికి తోడు తప్పిపోకముందు దిగిన ఓ బాలిక ఫొటోను చూపించినా ఇది తనది కాదని తెలిపింది. వీటన్నింటికి డీఎన్ఏ పరీక్ష తొలి సమాధానం కానుంది. సల్మాన్ ఇంటికి ఎప్పుడు వెళ్తుందో..! భారత్‌కు వచ్చిన తర్వాత తన జీవితం మలుపు తిరిగేందుకు కారణమైన సల్మాన్ ఖాన్‌ను కలుసుకోవాలనుకుంటున్నట్లు గీత మనోభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సల్మాన్ కూడా తాను గీతను కలుస్తానని చెప్పాడు. ఇండియాకు వచ్చిన మరుక్షణమే కుటుంబ సభ్యులతో సహా వెళ్లి సల్మాన్ ఖాన్ ను కలుస్తానని చెప్పిన నేపథ్యంలో ఆ సందర్భం వచ్చినప్పుడు భావోద్వేగాలు ఎలా ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భావోద్వేగాల నడుమ.. ఇంతకాలంపాటు తనను కంటికి రెప్పల చూసుకున్న కరాచీ ఫౌండేషన్ ఫహద్ ఈదీ ఫౌండేషన్ గీత తిరిగి భారత్ కు వస్తున్న వేళ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తమ కూతురు తమను వదిలి వెళ్లిపోతున్నట్లుగా ఉందని కళ్లు చెమర్చింది. ఏదేమైనా ఎప్పటికైనా తల్లిదండ్రులను చేరాల్సిందేగా అంటూ పేర్కొంది. గీతను చక్కగా అలంకరించి హారతి ఇచ్చి సాగనంపే కార్యక్రమం పూర్తి చేశారు. -
గీత కథలో కొత్త మలుపులు
మైనర్‌గా ఉన్నప్పుడే పెళ్లైందన్న కుటుంబం.. కాలేదన్న గీత కరాచీ: పాకిస్తాన్లో 14 ఏళ్లుగా అజ్ఞాత వాసంలో ఉన్న గీత కథ.. ఓ కొలిక్కి వస్తుందనుకున్న తరుణంలో.. కొత్త మలుపులు తిరుగుతోంది. గీతను బిహార్‌లోని ఆమె కుటుంబ సభ్యులతో స్కైప్ (వీడియో కాలింగ్)లో మాట్లాడిస్తే.. వారిని చూసి వీళ్లే కుటుంబ సభ్యులేనని గుర్తించింది. అయితే ఈ సమయంలోనే గీతకు మైనర్‌గా ఉన్నప్పుడే ఉమేశ్ అనే వ్యక్తితో పెళ్లైందని.. వారికి ఓ బాబు కూడా ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. తనకు అసలు పెళ్లి కాలేదని గీత అంటోంది. దీనికి తోడు తప్పిపోకముందు దిగిన ఓ బాలిక ఫొటోను చూపించినా ఇది తనది కాదని తెలిపింది. దీంతో కథ ముగింపుకు వస్తున్న తరుణంలో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయని.. ఈది ఫౌండేషన్ నిర్వాహకుడు ఫైజల్ ఈది తెలిపారు. గీత తమదగ్గర ఏమైనా దాస్తోందా లేక.. తప్పుదారి పట్టిస్తోందా అనే విషయాలు ఆమెతో మాట్లాడాకే నిర్ధారిస్తామన్నారు. కాగా, అక్టోబర్ 26న గీతతోపాటు ఈది కుటుంబ సభ్యులు భారత్ వస్తున్నారు. అయితే.. గీత కుటుంబ సభ్యులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాకే అప్పగిస్తారని.. పాకిస్తాన్లో భారత హై కమిషనర్ టీసీఏ రాఘవన్ తెలిపారు. -
త్వరలో భారత్‌కు ‘గీత’
-
త్వరలో భారత్‌కు ‘గీత’
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అనుకోకుండా సరిహద్దు దాటి 15 ఏళ్ల నుంచి పాకిస్తాన్లో నివసిస్తున్న మూగ, చెవిటి యువతి గీత.. త్వరలోనే తన కుటుంబాన్ని కలుసుకోబోతోంది. తన కుటుంబ సభ్యుల ఫొటోను గీత గుర్తించడంతో ఆమెను భారత్ రప్పించేందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయినట్లయింది. ‘‘త్వరలోనే గీత భారత్‌కు వస్తుంది. ఆమె కుటుంబాన్ని గుర్తించాం. అయితే డీఎన్ఏ పరీక్ష పూర్తయిన తర్వాత మాత్రమే ఆ కుటుంబానికి అప్పగిస్తాం’’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం న్యూఢిల్లీలో వెల్లడించారు. ఆ తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ మీడియాతో మాట్లాడుతూ.. గీతకు మూడు సెట్ల ఫొటోలు పంపించామని, దానిలో ఒక సెట్లో ఉన్న వ్యక్తులను గీత తన కుటుంబ సభ్యులుగా గుర్తించిందని తెలిపారు. డీఎన్ఏ పరీక్ష తర్వాతే కుటుంబీకులను గుర్తిస్తామన్నారు. గీత తల్లిదండ్రులు బిహార్‌కు చెందిన వారిగా సమాచారం. గీత జాతీయతను ఇప్పటికే గుర్తించామని, ఆమెను వెనక్కి తీసుకువస్తామని చెప్పారు. అయితే ఇది ఆమె తల్లిదండ్రులను గుర్తించామా, లేదా అనేదానికి సంబంధం లేకుండా జరుగుతుందన్నారు. గీత భారత పుత్రిక అని ఆయన అన్నారు. గీత గుర్తించిన వారు డీఎన్ఏ టెస్టులో ఆమె తల్లిదండ్రులే అని తెలిస్తే.. వారికే అప్పగిస్తామని వికాస్ చెప్పారు. లేదంటే గీత సంరక్షణార్థం ఢిల్లీలో, ఇండోర్‌లో ఒక్కో సంస్థను గుర్తించామని, ఆమెలాంటి వికలాంగులకు సేవ చేసే ఆ సంస్థల్లో ఒకదానికి అప్పగిస్తామన్నారు. వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియలన్నీ పూర్తయ్యాయని చెప్పిన ఆయన.. గీతకు భారత్‌లో పెద్ద ఎత్తున స్వాగతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. గీతతో పాటు ఈదీ ఫౌండేషన్‌కు చెందిన ఇద్దరు ప్రతినిధులు భారత్‌కు వస్తారని ఆయన వెల్లడించారు. కాగా, గీతను వెనక్కి పంపుతున్న విషయాన్ని పాక్‌లో గీతను సంరక్షిస్తున్న ఈదీ ఫౌండేషన్ ప్రతినిధి అన్వర్ కజ్మి కూడా ధ్రువీకరించారు. ఆమెను ఈ నెల 26న స్వదేశానికి పంపే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి భారత్‌కు సమాచారమిచ్చామని పాక్ అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమిషన్ పంపిన ఫొటోలోని తన తండ్రిని, సవతితల్లిని, తోబుట్టువులను గీత గుర్తించిందని తెలిసింది. గీతకు ఏడెనిమిదిఏళ్ల వయసున్నపుడు సంఝౌ తా ఎక్స్‌ప్రెస్‌లో సరిహద్దు దాటి పాక్‌లోని లాహోర్ స్టేషన్‌కు చేరింది. రైల్లో ఒంటరిగా ఉన్న ఆ పాపను పాక్ రేంజర్లు గుర్తించి ఈదీ ఫౌండేషన్‌కు అప్పగించారు. అక్కడి నుంచి గీత కరాచీకి చేరింది. సుష్మ ఆదేశాలపై పాక్‌లోని భారత హైకమిషనర్ టీసీఏ రాఘవన్ ఆగస్టులో గీతను కలిశారు. అప్పటి నుంచి గీత పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. గీతను తిప్పి పంపడానికి పాక్ సహకరిస్తున్నదని విదేశాంగ శాఖ తెలిపింది. -
పాక్ నుంచి 'గీత' వచ్చేస్తోంది
-
పాక్ నుంచి 'గీత' వచ్చేస్తోంది
కరాచి: ఎట్టకేలకు గీత తిరిగి మాతృదేశం రాబోతుంది. పన్నేండేళ్ల తర్వాత తన తల్లిదండ్రుల ఒడిని చేరబోతుంది. పుట్టుకతోనే మూగ, చెవిటి లక్షణాలు ఉన్న గీత తన తల్లిదండ్రులను గుర్తించిందని, ఇక ఆమెను భారత్ రప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే డాక్యుమెంట్ల కార్యక్రమాలు పూర్తి చేసి వారి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తామని ఢిల్లీ అధికారులు తెలిపారు. ఆమె తల్లి దండ్రులు ప్రస్తుతం బీహార్‌లో ఉన్నారని చెప్పారు. 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు(2003లో) గీత పొరపాటున సరిహద్దులో తప్పిపోయి ప్రస్తుతం పాకిస్థాన్ లోని కరాచీలో చిక్కిపోయింది. ఆమెకు కరాచీలోని ఈది ఫౌండేషన్ అనే ఓ స్వచ్ఛంద సంస్ధ ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతం ఆమెకు 20 ఏళ్లు దాటాయి. తిరిగి మాతృదేశం భారత్ కు రావాలనే ఆమె ఆకాంక్ష 'బజరంగీ భాయిజాన్' సినిమా విడుదలైన తర్వాత మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసిన సంగతి విదితమే. కాగా, ఈ కూతురు తమ కూతురంటే తమ కూతురని పంజాబ్‌కు చెందిన బధిర దంపతులు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన మరో రెండు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. అయితే, అలా ఆశ్రయించిన వారి ఫొటోలను ఇటీవల పాక్ లోని భారత హై కమిషన్ ఆమెకు చూపించగా వారిని గుర్తుపట్టింది. ఆమె గుర్తుపట్టిన కుటుంబ సభ్యులు ప్రస్తుతం బీహార్‌లో నివసిస్తున్నారు. దీంతో త్వరలోనే ఆమెను భారత్‌కు తీసుకొచ్చే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. -
పాకిస్తాన్‌లోని గీత మా కూతురే.!
-
పాకిస్తాన్‌లోని గీత మా కూతురే!
-
పాకిస్తాన్‌లోని గీత మా కూతురే!
* ఖమ్మం జిల్లాకు చెందిన కృష్ణయ్య, గోపమ్మ దంపతులు * 2006లో మా చిన్న కూతురు గుంటూరులో తప్పిపోయింది * అప్పుడు ఆమె వయసు పదేళ్లు * గీత మమ్మల్ని చూస్తే గుర్తుపడుతుంది * ప్రభుత్వం ఆమె వద్దకు చేర్చేందుకు సహకరించాలి జూలూరుపాడు: పాకిస్తాన్లో స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంటున్న గీత తమ కూతురేనని ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామానికి చెందిన జజ్జర కృష్ణయ్య, గోపమ్మ చెబుతున్నారు. గీత తమను చూస్తే గుర్తుపడుతుందని వారంటున్నారు. ఇటీవల టీవీలు, పత్రికలు, సోషల్ మీడియాలలో గీత అంశం విస్తృతంగా ప్రచారమవుతుండటంతో వాటిని ఈ దంపతులు చూశారు. 2006లో తప్పిపోయిన తమ కూతురు రాణియే ఆ బాలిక అని వారు ఆదివారం విలేకరులకు తెలిపారు. గత 13 ఏళ్లుగా పాక్‌లోని ఈది స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో గీత ఉంటుందన్న సంగతి తెలిసిందే. పదేళ్ల వయసులో ఆమెను పంజాబ్ రేంజర్స్ తీసుకువచ్చి తమకు అప్పగించారని ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ‘‘2006 జనవరి 27న ఏసు సువార్త సభలకు గుంటూరు జిల్లాకు నలుగురు కూతుళ్లను తీసుకొని వెళ్లాను. మరుసటి రోజు చిన్నకూతురు రాణి తప్పిపోయింది. అప్పటికి రాణికి పదేళ్లు. ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ వెతికినా రాణి ఆచూకీ దొరకలేదు. మాకు నలుగురు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి రాజమ్మకు మతిస్థిమితం లేదు. రెండో కూతురు జ్యోతికి వివాహం అయింది. మూడో కూతురు పద్మ బీఎస్సీ చదువుతోంది. చిన్న కూతురు రాణి పుట్టుకతోనే మూగ. ఏమీ చదువుకోలేదు’’ అని గోపమ్మ తెలిపారు. రాణి నుదుటిపై పుట్టమచ్చ ఉందని, చేతులకు పులిపిర్లు ఉన్నాయని, మెల్ల కన్ను ఉందని వివరించారు. ఇటీవల టీవీలు, పేపర్లల్లో చూసిన గీతకు రాణి పోలికలే ఉన్నాయని చెప్పారు. గీత తమ కూతురే అని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భగా దంపతులు రాణి ఎనిమిదేళ్ల నాటి ఫొటోను చూపించారు. తమను చూస్తే గీత గుర్తుపడుతుందని, ప్రభుత్వం ఆమె వద్దకు చేర్చే ప్రయత్నం చేయాలని కోరారు. అవసరమైతే డీఎన్ఏ పరీక్షలకు కూడా సిద్ధమన్నారు. ఈ దంపతులకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. -
ఆ గీత మా గీతే..!: ఖమ్మం జిల్లా దంపతులు
జూలూరుపాడు(ఖమ్మం జిల్లా): పాకిస్తాన్లో స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంటున్న గీత తమ కూతురేనని ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం గ్రామానికి చెందిన జజ్జర కృష్ణయ్య, గోపమ్మలు చెబుతున్నారు. గీత తమను చూస్తే గుర్తు పడుతుందని వారంటున్నారు. ఇటీవల న్యూస్ ఛానల్స్, దినపత్రికల్లోను, సోషల్ మీడియాలలో గీత విషయం విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో వాటిని చూసిన కృష్ణయ్య దంపతులు గీత తమ కూతురేనని చెబుతున్నారు. పాకిస్తాన్ దేశంలో ఈది స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో మన దేశానికి చెందిన బాలిక 13 ఏళ్లుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. 10 ఏళ్ల హిందూ మూగబాలికను పంజాబ్ రేంజర్స్ తీసుకువచ్చి తమకు అప్పగించారని ఈది స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. ఈ విషయాన్ని న్యూస్ ఛానల్స్, దినపత్రికలు విస్తృత ప్రచారం చేశాయి. ఈ కథనాలను చూసిన జజ్జర కృష్ణయ్య, గోపమ్మ దంపతులు గీత తమ కూతురేనని ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. 2006 జనవరి 27న ఏసు సువార్త సభలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు తన నలుగురు కూతుళ్లను తీసుకొని వెళ్లినట్లు జజ్జర గోపమ్మ చెబుతోంది. మరునాడు 28వ తేదీన పదేళ్ల వయస్సులో ఉన్న రాణి తప్పిపోయిందని, వెతికినా ఆచూకీ లభించలేదని, ఆనాటి నుంచి రాణి కోసం వెతకని ప్రదేశంలేదని కృష్ణయ్య, గోపమ్మలు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు నలుగురు ఆడపిల్లలని పెద్ద అమ్మాయి రాజమ్మకు మతిస్థితం లేదని, రెండవ కూతురు జ్యోతికి వివాహం కాగా, మూడవ కూతురు పద్మ బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నది తెలిపారు. చిన్న కూతురు రాణి పుట్టుకతోనే మూగ అని ఏమీ చదువుకోలేదని, రాణి తప్పిపోయే నాటికి పదేళ్ల వయస్సు ఉంటుందని దంపతులు ఆవేదనతో తెలిపారు. రాణి నుదుటిపై పుట్టమచ్చ ఉందని, చేతులకు పులిపిర్లు ఉన్నాయని, మెల్లకన్ను ఉన్నదని వారు చెప్పారు. ఇటీవల టీవీల్లోను, పేపర్లల్లో వస్తున్న కథనాలలోని ఫోటోలను చూసి నోరు, పెదవులు, కళ్ళు రాణి పోలికలను ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా ఎనిమిదేళ్ల నాటి పాసుపోర్టుసైజు ఫొటోను చూపించి, పేపర్లల్లో వచ్చిన ఫొటోలకు పోలిక కన్పిస్తుందని, దీంతో గీత తమ కూతురేనని గట్టిగా నమ్ముతున్నట్లు వారు తెలిపారు. తమను గీత చూస్తే తప్పక గుర్తుపడుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తమను ఆమె వద్దకు చేర్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని వారు కోరుతున్నారు. తాము డీఎన్ఏ పరీక్షలకు సైతం సిద్ధమని అంటున్నారు. కాగా కృష్ణయ్య, గోపమ్మ దంపతులు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటున్నారు. -
గీతను తీసుకొచ్చేందుకు సన్నాహాలు: సుష్మ
న్యూఢిల్లీ: భారత్ నుంచి తప్పిపోయి పాకిస్తాన్‌కు చేరిన మూగ చెవిటి అమ్మాయి గీతను భారత్‌కు రప్పించేందుకు చట్టపరమైన చర్యలు చేట్టామని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ట్విటర్ ద్వారా తెలిపారు. ‘గీతను వెనక్కి తీసుకుని రావటానికి అవసరమైన చర్యలను పూర్తిచేస్తున్నాం’ అని ఆమె అన్నారు. అంతే కాకుండా గత కొన్ని రోజులుగా పంజాబ్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాలుగు కుటుంబాలు గీత తమ కూతురేనని చెప్తున్నారని సుష్మ పేర్కొన్నారు. ‘‘భారత హైకమిషనర్‌కు గీత కొన్ని వివరాలు చెప్పింది. తనకు ఏడుగురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నారని పేర్కొంది. తన తండ్రితో కలసి ఆలయానికి వెళ్లినట్లు రాసి చూపింది. ఆలయం పేరు ‘వైష్ణోదేవి’ అని రాసింది. గీత కుటుంబాన్ని వెతకటంలో సాయం చేయండి’’ అని సుష్మ ట్వీట్ చేశారు. 15ఏళ్ల క్రితం పొరపాటున పాకిస్తాన్లో కాలుపెట్టిన గీతను కరాచీలోని భారత హైకమిషనర్ టీసీఏ రాఘవన్ కలిసిన సంగతి తెలిసిందే.