Geetha Movie First Look Poster Released By VV Vinayak - Sakshi
Sakshi News home page

నా శిష్యుడు 'విశ్వ' విజేత కావాలి: వి.వి.వినాయక్

Published Thu, Dec 16 2021 10:56 AM | Last Updated on Thu, Dec 16 2021 11:06 AM

Geetha Movie First Look Poster Released By VV Vinayak - Sakshi

మాస్‌ డైరెక్టర్‌ వివి వినాయక్‌ ప్రియ శిష్యుడు విశ్వ దర్శకత్వంతో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘గీత’.‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక.  ‘గ్రాండ్ మూవీస్’ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తుండగా, ప్రముఖ నటుడు సనీల్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్‌గా పరిచయం అవుతున్నాడు.  పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని వి.వి.వినాయక్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా వినాయక్‌ మాట్లాడుతూ..    తన శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమవుతున్న "గీత' ఘన విజయం సాధించాలని, తన మిత్రుడు రాచయ్య నిర్మాతగా రాణించాలని  అభిలాషించాడు. . ఈ చిత్రంలో పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు.     ఈ సినిమా అవకాశం తన గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారని, నిర్మాత రాచయ్యగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చిత్ర దర్శకుడు విశ్వ పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న హిందీ "ఛత్రపతి" పనులతో తలమునకలుగా ఉన్నప్పటికీ... తమ మీద ప్రత్యేకమైన అభిమానంతో "గీత" చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి నిర్మాత ఆర్.రాచయ్య కృతజ్ఞతలు తెలిపారు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా డైరెక్టర్ విశ్వ... "గీత" చిత్రాన్ని అత్యద్భుత ప్రణాళికతో రూపొందించారని  పేర్కొన్నారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి, తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement