గ్రాండ్‌గా సునీల్-హెబ్బా పటేల్‌ల' గీతా' విష్కరణ | Sunil And Hebah patel Geetha Movie To Release On 9th September | Sakshi
Sakshi News home page

Geetha: గ్రాండ్‌గా సునీల్-హెబ్బా పటేల్‌ల' గీతా' విష్కరణ

Published Thu, Aug 25 2022 2:22 PM | Last Updated on Thu, Aug 25 2022 2:26 PM

Sunil And Hebah patel Geetha Movie To Release On 9th September - Sakshi

హెబ్బా పటేల్, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక.  ‘గ్రాండ్ మూవీస్‌’పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్‌ శిష్యుడు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు మేకర్స్‌. 



ఈ సందర్భంగా  దర్శకుడు విశ్వ మాట్లాడుతూ... ‘ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. అనివార్య కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ‘గీత’ విడుదలకు సహాయ సహకారాలు అందిస్తున్న పొలిశెట్టి, డివిడి విజయ్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు’  అన్నారు.

నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ... ‘గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ... ‘గీత’ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’అన్నారు. హీరో సునీల్, హీరోయిన్ హెబ్బా పటేల్ ‘గీత’ వంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంలో నటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడుగా విశ్వ, నిర్మాతగా రాచయ్యలకు ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. ‘గీత’ చిత్రంలో పని చేసే అవకాశం లభించడం పట్ల నటీనటులు, సాంకేతిక నిపుణులు కృతజ్ఞతలు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement