ఈ గీత మా పూజే..! | On Ansar Burney's plea, Delhi to help Indian stuck in Pak | Sakshi
Sakshi News home page

ఈ గీత మా పూజే..!

Published Fri, Aug 7 2015 12:12 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM

ఈ గీత మా పూజే..! - Sakshi

ఈ గీత మా పూజే..!

అమృత్‌సర్: 13 ఏళ్ల క్రితం రైళ్లో పొరపాటుగా పాకిస్తాన్‌కు వెళ్లి.. కన్నవారిని చేరేందుకు ఎదురుచూస్తున్న ఈ గీత(23) తమ కూతురు పూజ అని, ఆమె ముద్దుపేరు ‘గుడ్డీ’ అని వీరు చెబుతున్నారు. రాజేశ్‌కుమార్, రామ్ దులారీ అనే ఈ దంపతులూ మూగ, బధిరులే! గీతకు, దులారీకి పోలికలూ ఉన్నాయి! అయితే, వీరి ఫొటోలను చూపిస్తే.. వీరు తన తల్లిదండ్రులు కారని గీత అంటోంది. తమ ఇంట్లో స్త్రీలు చీరలు ధరించేవారని, కానీ దులారీ సల్వార్ కమీజ్‌లో ఉందని అనుమానం వ్యక్తంచేసింది. బిహార్ నుంచి అమృత్‌సర్‌కు వచ్చి స్థిరపడిన రాజేశ్, దులారీలు కుమారుడు రాజు(14)తో కలిసి భిక్షాటన చేస్తూ, చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు.

వీరి కూతురూ చిన్నతనంలోనే రైళ్లలో భిక్షాటన చేసేదని, పొరపాటుగా పాక్ వెళ్లి ఉంటుందని స్థానికుడొకరు చెబుతున్నారు. మరోవైపు.. తాను భారత్‌కు వచ్చి వీరిని కలుస్తానని, గీతకు, వీరికి డీఎన్‌ఏ పరీక్షలు చేస్తే విషయం తేలిపోతుందని పాక్ మానవహక్కుల కార్యకర్త, మాజీ మంత్రి అన్సార్ బర్నీ వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement