పాట్నా: డీఎన్ఏ పరీక్షల్లో గీతా తమ కూతురే అని నిర్ధారణ చేస్తాయని ఆమె రాకకోసం ఎదురు చూస్తున్న తండ్రి జనార్దన్ మహతో అన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ కూతురు తిరిగి రావడంతో చెప్పలేనంత సంతోషంగా ఉందని చెప్పారు. తన కుటుంబమంతా ఆమెతో కబుర్లుపంచుకునేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నదని అన్నారు.
ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి లోనైన ఆయన కళ్లు చెమర్చుతూ'పదహారేళ్ల తర్వాత నా కూతురు కనిపించడం ఆనందంగా ఉంది. డీఎన్ఏ పరీక్షలు కూడా గీత నా కూతురే అని చెబుతాయి. నాకు తెలుసు.. ఆమె నాకూతురే. తప్పకుండా నా దగ్గరికి వస్తుంది. నన్ను ప్రేమగా హత్తుకుంటుంది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు ధన్యవాదాలు చెప్తున్నాను' అంటూ జనార్దన్ పేర్కొన్నాడు.
'డీఎన్ఏ పరీక్షలు నా కూతురే అని చెప్తాయి'
Published Mon, Oct 26 2015 12:04 PM | Last Updated on Fri, Sep 28 2018 8:12 PM
Advertisement
Advertisement