DNA Test
-
40 ఏళ్ల తరువాత తల్లిని చేరిన కూతురు
ఐదు రోజుల పసికూనగా వెళ్లిపోయిన కూతురు 40 ఏళ్ల తరువాత తల్లి ముందు నిలబడితే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా! ఈ అంతులేని సంతోషానికి ఇటీవల వేదికయ్యింది చిలీలోని శాన్ ఆంటోనియో. వివరాల్లోకి వెళ్తే.. 40 ఏళ్లకిందట.. శాన్ అంటోనియాకు చెందిన 24 ఏళ్ల ఎడిటా బిజామాకు అప్పటికే ఇద్దరమ్మాయిలు. మూడో సారి కుమార్తె పుట్టింది. పిల్లల్లో పేదరికాన్ని తగ్గించడానికి అప్పటి అగస్టో పినోచెట్ నాయకత్వంలోని సైనిక నియంతృత్వ ప్రభుత్వం అంతర్జాతీయ దత్తతలే మార్గమని భావించింది. అట్లా దాదాపు 20వేల మంది పిల్లలను బలవంతపు దత్తత ఇచ్చింది. బిడ్డ కడుపులో ఉండగా.. బిజామా సైతం దత్తతకు అంగీకరించింది. కానీ.. పాప పుట్టిన తరువాత పంపించడానికామె ఒప్పుకోలేదు. ‘ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, స్థిరత్వం లేదు. పిల్లలను ఎలా పెంచుతావ్’అంటూ ప్రశ్నించిన ప్రభుత్వాధికారులు ఆమె ఐదు రోజుల కూతురిని తీసుకెళ్లిపోయారు. బిజామా కుటుంబంలోని చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. కానీ పేగు తెంచుకు పుట్టింది కదా.. బిజామా బిడ్డకోసం రోదిస్తూనే ఉంది. వెదకడానికి కనీసం పేరు తెలియదు. మార్గం కూడా లేదు. మరోవైపు.. ఆమె కూతురు అడామరీ గార్సియా ఫ్లోరిడాలో పెరిగింది. ఇప్పుడు ప్యూర్టో రికోలో నివసిస్తోంది. తనను దత్తత తీసుకున్నారని చిన్నతనం నుంచే తెలుసు. కానీ కన్న తల్లిదండ్రులను కలుసుకోవడమెలాగో తెలియదు. అలాంటి సమయంలో ఆమె ఫ్రెండ్ ఒకరు.. శిశువుగా దత్తతకు వచ్చి.. చిలీలోని తన సొంత కుటుంబాన్ని కలుసుకున్న టెక్సాస్ అగ్నిమాపక అధికారి టేలర్ గ్రాఫ్ గురించి చెప్పారు. అలాంటివారికోసం సాయం చేసేందుకు ఆయన ఏర్పాటు చేసిన ‘కనెక్టింగ్ రూట్స్’స్వచ్ఛంద సంస్థ గురించి వివరించారు. వెంటనే ఆ సంస్థను కలిసింది గార్సియా. కుటుంబం గురించి తెలుసుకోవడానికి గార్సియా తపన చూసి.. ఆమెను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు సైతం ప్రోత్సాహమందించారు. సోదరి బర్త్ సరి్టఫికెట్ ద్వారా కుటుంబ వివరాలు తెలిసాయి. అయినా.. డీఎన్ఏ పరీక్షతో బిజామానే గార్సియా కన్నతల్లని కనెక్టింగ్ రూట్స్ నిర్ధారించింది. వెంటనే మొదటిసారి జూమ్ ద్వారా మాట్లాడుకున్నారు. గార్సియాది ప్యూర్టో రికన్ స్పానిష్, మయామీ యాస. కానీ తల్లి, అక్కలది విలక్షణమైన చిలీ యాస. మొదటిసారి సంభాషణ కష్టమే అయ్యింది. ఒకరినొకరు చూసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. గతవారం కుటుంబం చెంతకు చేరుకుంది గార్సియా. 41 ఏళ్ల గార్సియాకు తల్లికి, ఇద్దరు అక్కలకు దగ్గరకు పోలికలున్నాయి. అంతేకాదు.. పెద్దక్కకు ఇష్టమున్నట్టే ఆమెకూ కుక్కలంటే చాలా ఇష్టం. ఇప్పుడు గార్సియా చిలీయాస, వంటకాలు, సంగీతం అన్నింటినీ నేర్చుకుంటోంది. అక్కలతో ఎక్కువకాలం గడపాలని నిర్ణయించుకుంది. కనెక్టింగ్ రూట్స్ ఈ ఏడాది చిలీకి తీసుకువచి్చన ఐదుగురు దత్తతదారుల్లో గార్సియా ఒకరు. ఇది ఆ ఎన్జీవో చేసిన నాలుగవ పునరేకీకరణ. ఎన్జీవో చర్యలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. 40 ఏళ్ల కిందట దత్తతకు పోవడంతో ఇప్పుడు తల్లులు పెద్దవారవుతున్నారు. కొందరు చనిపోయారు. అందుకే ఆలస్యం కాకముందే సాధ్యమైనన్ని ఎక్కువ కుటుంబాలను తిరిగి కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది కనెక్టింగ్ రూట్స్. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీర్పేట్ మాధవి కేసు..దర్యాప్తులో కీలక ముందడుగు
సాక్షి,హైదరాబాద్: సంచలనం రేపిన మీర్‌పేట వెంకటమాధవి హత్య కేసులో కీలక ముందడుగు పడింది. భర్త గురుమూర్తే వెంకట మాధవిని హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో మాధవి మిస్సింగ్ కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. క్లూస్ టీమ్ ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్యకేసు నమోదు చేశారు. గురుమూర్తిపై బీఎన్ఎస్(BNS) 101 సెక్షన్ పెట్టారు.క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలను పోలీసులు ఎఫ్ఎస్ఎల్కు పంపారు. వెంకటమాధవిగా భావిస్తున్న శరీర టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకలను ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు పంపారు. మాధవి పిల్లలు, తల్లి దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించారు. వీటితో మాధవి డీఎన్ఏ మ్యాచింగ్ కోసమే ఫోరెన్సిక్ పరీక్షలకు పోలీసులు నిర్ణయించారు. మరికొన్ని గంటల్లో పోలీసులకు డీఎన్ఏ నివేదిక చేరనుంది. డీఎన్ఏ నివేదికతో గురుమూర్తిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు.ఇక, ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా బ్లూ రేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇదే సమయంలో ఈనెల 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల రికార్డు ఫుటేజ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు విషయమై దేశంలోని ప్రధానమైన ఫోరెన్సిక్ నిపుణుల సహకారాన్ని పోలీసులు తీసుకుంటున్నారు. కాగా, నేడు పోలీసుల చేతికి డీఎన్ఏ రిపోర్టు అందే అవకాశం ఉంది.కేసులో ఈ పురోగతితో సంచలనం సృష్టించిన మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించినట్లయింది. కేసు నుంచి తప్పించుకోడానికి మాజీ సైనికుడు గురుమూర్తి పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. డీఎన్ఏ పరీక్షలతో కేసును పోలీసులు కొలిక్కి తీసుకొస్తున్నారు. -
మర్డర్ మిస్టరీని ఛేదించిన సిగరెట్ పీక
ఎంత ప్రొఫెషనల్ నేరగాడైనా నేరానికి సంబంధించి ఏదో ఒక క్లూ వదులుతాడంటారు. అది నిజమేనని మరోసారి నిరూపించిన ఉదంతమిది. అప్పుడెప్పుడో 1984లో జరిగిన ఓ హత్య మిస్టరీని 2014లో చేధించారు. హంతకుడు తాగి పడేసిన సిగరెట్ పీకే అతని పీకకు చుట్టుకుంది. అత్యాధునికమైన డీఎన్ఏ ప్రొఫైలింగ్ మనవాన్ని పట్టించింది. 2021లో అతనికి శిక్ష పడింది.బ్రిటన్‌లో గ్లాస్గోకు చెందిన 58 ఏళ్ల మేరీ మెక్ లాఫ్లిన్కు రెండు పెళ్లిళ్లయ్యాయి. మొత్తం 11 మంది పిల్లలున్నారు. వారు వేర్వేరు నగరాల్లో ఉంటడంతో ఒక్కతే ఉంటోంది. కొడుకు మార్టిన్ కలెన్ (24) వారానికోసారి తల్లిదగ్గరకు వచ్చేవాడు. 1984 అక్టోబర్ 2న తల్లిని చూసేందుకు వచ్చినప్పుడు ఫ్లాట్ నుంచి భయంకరమైన వాసన వచ్చింది. లోపల మేరీ శవమై, మంచం మీద పడుంది. ఐదు రోజుల క్రితమే హత్యకు గురైనట్లు పోస్టుమార్టంలో తేలింది. సెప్టెంబర్ 26న ఆమె పబ్‌లో గడిపిందని, తర్వాత నడుచుకుంటూ ఇంటికెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దారిలో ఆగి సిగరెట్ కొనుక్కుందని కూడా చెప్పారు. బూట్లు చేతబట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమెను వెంబడించడం చూసినట్టు ఓ ట్యాక్సీ డ్రైవర్ వాంగ్మూలమిచ్చాడు. అయినా కేసు ఎటూ తేలలేదు. ఒకానొక దశలో ఆమె పిల్లలపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఏడాది దర్యాప్తు తర్వాత కేసును మూసేశారు. తర్వాత మరో నాలుగుసార్లు దర్యాప్తు చేసినా లాభం లేకపోయింది. 30 ఏళ్ల తరువాత 2014లో ఈ హత్యకు సంబంధించిన సాక్షాధారాలను మరోసారి సమీక్షించాల్సిందిగా స్కాటిష్ క్రైమ్ క్యాంపస్‌లో పనిచేస్తున్న జోవాన్ కోక్రాన్‌ను మేరీ కుమార్తె గినా మెక్ గావిన్ అడిగారు. 1984ల్లో డీఎన్ఏ ప్రొఫైలింగ్ గురించి అంతగా తెలియకపోయినా అన్ని సాక్ష్యాలనూ భద్రపరిచారు. వాటిలోని మేరీ జుట్టు, గోరు వంటివాటిని డీఎన్ఏ ప్రొఫైలింగ్ చేశారు. లివింగ్ రూమ్‌లో కాఫీ టేబుల్ మీది యాష్ ట్రేలోని ఉన్న సిగరెట్ పీక కీలక క్లూగా మారింది. పీకకు అంటిన డీఎన్ఏ గ్రాహం మెక్ గిల్ అనే నేరస్తుని డీఎన్ఏతో సరిపోలింది. అతను పలు లైంగిక నేరాల కేసుల్లో తీవ్ర శిక్షలు అనుభవిస్తున్నాడు. సరే, కేసు వీడింది కదా అనుకుంటే మరో చిక్కు వచ్చి పడింది. మేరీ హత్యకు గురైన సమయంలో మెక్ గిల్ ఖైదీగా ఉన్నట్టు రికార్డులు చూపించాయి. జైల్లో ఉంటే హత్య ఎలా చేయగలడా అని అధికారులు తల పట్టుకున్నారు. నేషనల్ రికార్డ్స్ ఆఫ్ స్కాట్లాండ్లో విచారించిన మీదట చిక్కు ముడి వీడింది. మేరీ హత్య జరిగిన సమయంలో మెక్ గిల్ ఐదు రోజులు పెరోల్‌పై బయట ఉన్నట్టు తేలింది. దాంతో 2019లో మెక్‌గిల్‌ను అరెస్టు చేశారు. దోషిగా నిర్ధారించి 2021లో 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మేరీ హత్య సమయంలో మెక్‌గిల్‌కు 22 ఏళ్లు. 59 ఏళ్ల వయసులో అతనికి శిక్ష పడింది. ‘‘తల్లి హంతకుడిని జీవితకాలంలో చూస్తామనుకోలేదు. ఆశే మమ్మల్ని నడిపించింది. మొత్తానికి ఉపశమనం కలిగింది’’అని గినా అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హత్య కేసులో ఇద్దరు జవాన్ల అరెస్టు
సేలం: కేరళ రాష్ట్రం కొల్లం అంజల్ ప్రాంతానికి చెందిన రంజనికి మదన్కోట్ ఇండియా మిలటరీ దళం విభాగంలో పని చేసిన కుమార్‌కు సంబంధం ఏర్పడింది. దీంతో రంజనికి 2006లో కవల పిల్లలు పుట్టారు. అయితే ఆ పిల్లలు తనకు పుట్టలేదని కుమార్ పిల్లలను అంగీకరించలేదు. దీంతో రంజని డీఎన్ఏ పరీక్షలు చేయడానికి మహిళా సంఘాల సాయం కోరింది. దీంతో తీవ్ర ఆవేశం చెందిన కుమార్ తన స్నేహితుడు, మిలటరీ జవాన్ కన్నూర్ రాజేష్ సాయంతో రంజనిని, ఆమెకు పుట్టిన ఇద్దరు కవల పిల్లలను హత్య చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో వారిద్దరిని అధికారులు మిలటరీ నుంచి తొలగించారు. పోలీసులు వారి కోసం గాలిస్తూ వచ్చారు.పట్టించిన ఏఐ సాంకేతికత2010లో ఈ కేసు సీబీఐకి అప్పగించారు. ఈ స్థితిలో వారిని పట్టుకోవడం కోసం సీబీఐ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. రాజేష్ అప్పటి చిత్రం మేరకు ఇప్పుడు ఎలా ఉంటాడో చిత్రాన్ని రూపొందించారు. అదే ఛాయలు ఉన్న వ్యక్తి పుదుచ్చేరిలో తిరుగుతున్నట్టు పోలీసులు కనుగొన్నారు. అక్కడ వారు ఆస్తులను సైతం కొనుగోలు చేసుకున్నట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు పుదుచ్చేరిలో కుమార్, రాజేష్‌లను ఆదివారం అరెస్టు చేశారు. అనంతరం వారిని కేరళకు తరలించి సోమవారం ఎర్నాకుళం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
సరదా డీఎన్ఏ పరీక్ష... మర్డర్ మిస్టరీని ఛేదించింది!
అది 1997. అమెరికాలో మిషిగన్ రాష్ట్రంలో మాకినాక్ కౌంటీ. ఓ డ్రైనేజ్ కాలువలో నవజాత శిశువు మృతదేహం దొరికింది. పోలీసులు ఎంత విచారించినా ఆ చిన్నారిని ఎవరు పొట్టన పెట్టుకున్నారో కనిపెట్టలేకపోయారు. తనకు ‘బేబీ గార్నెట్’గా నామకరణం చేసి స్థానిక శ్మశానవాటికలో ఖననం చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ పుణ్యమా అని ఏకంగా పాతికేళ్ల తర్వాత ఆ మిస్టరీ వీడింది. ఓ యువతి సరదాగా చేసుకున్న డీఎన్ఏ టెస్ట్ ఈ కేసులో ఆమె అమ్మమ్మను జైలుపాలు చేసింది. క్రిస్మస్ సందర్భంగా డీఎన్ఏ కిట్లు కానుకగా ఇవ్వడం అమెరికాలో ఆనవాయితీ. అలా మిషిగాన్‌లోని న్యూబెర్రీలో పూల దుకాణంలో పనిచేసే జెన్నా గెర్వాటోవ్స్కీకి డీఎన్ఏ కిట్ అందింది. ఆమె సరదాకు టెస్ట్ చేసుకుని అక్కడితో మరిచిపోయింది. అయితే, ‘బేబీ గార్నెట్’ కేసు గురించి విన్నారా?’ అంటూ 2022లో పోలీసుల నుంచి ఆమెకు కాల్ వచ్చింది. అవునని చెప్పింది జెన్నా. తన డీఎన్ఏ బేబీ గార్నెట్ డీఎన్ఏతో సరిపోయిందని వారు చెప్పడంతో ఆశ్చర్యపోయింది. 1997లో చనిపోయిన శిశువుకు, తనకు సంబంధమేమిటో అర్థం కాలేదు. ఇంటికి వెళ్లాక తల్లి కారాకు చెబితే స్పామ్ కాల్ అయి ఉంటుందని కొట్టిపారేసింది. కానీ వారం తరువాత షాప్‌లో ఉండగా అర్జెంటుగా ఇంటికి రమ్మంటూ తల్లి ఫోన్ చేసింది. వెళ్లి చూస్తే ఇంట్లో పోలీసులున్నారు. బేబీ గార్నెట్ తనకు పిన్ని అవుతుందని వారు చెప్పడంతో జెన్నా ఆశ్చర్యపోయింది. పోలీసులు తల్లితో మాట్లాడి ఆమెనూ డీఎన్ఏనూ పరీక్షలకు ఒప్పించారు. కారాకు బేబీ గార్నెట్ స్వయానా సోదరి అని తేలింది. కారాను లోతుగా ప్రశ్నించగా తన తర్వాత తల్లి నాన్సీకి ఓ పాప పుట్టిందని, ఊపిరాడక మరణించిందని చెప్పింది. కానీ ఆ పాపను పుట్టగానే సంచిలో పెట్టి పడేశారన్నది పోలీసుల వాదన. నాన్సీపై నవజాత శిశువు హత్యాభియోగం మోపారు. రుజువైతే ఆమెకు జీవిత ఖైదు పడవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అల లండను పురములో.. పుట్టగానే తారుమారు.. ఐదు దశాబ్దాల తర్వాత వెలుగులోకి!
సగం జీవితం అయిపోయాక.. పెరిగిన ఇల్లే గాక పెంచిన తల్లిదండ్రులు.. తోబుట్టువులు.. ఎవరూ తనవారు కారని తెలిస్తే? ఇప్పటిదాకా ఏర్పరుచుకున్న బంధాలన్నీ అబద్ధమేనని అర్థమైతే? ఊహించడానికే కష్టంగా ఉంది కదూ! లండన్‌లో ఇద్దరు మహిళలకు అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎందుకంటే వారిద్దరూ పసికందులుగా ఉన్నప్పుడే తారుమారయ్యారు. అల వైకుంఠపురం సినిమాను తలపించే ఈ ఉదంతం లండన్‌లో టాకాఫ్ ద టౌన్‌గా మారిందిప్పుడు. డీఎన్ఏ కిట్‌తో... 2021 క్రిస్మస్. లండన్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌కు చెందిన టోనీకి మిత్రులు డీఎన్ఏ హోమ్ టెస్టింగ్ కిట్ కానుకగా ఇచ్చారు. దాంతో పనేముంది లెమ్మని పక్కకు పడేశాడు. రెండు నెలల తర్వాత ఫిబ్రవరిలో కిట్ కంటపడింది. సెలవు రోజు కావడంతో టైం పాస్ కోసం తన శాంపిల్‌ను డీఎన్ఏ టెస్ట్‌కు పంపాడు. తర్వాతి ఆదివారం సాయంత్రం తల్లి జోన్‌తో ఫోన్లో మాట్లాడుతుండగా రిజల్ట్ మెయిల్ వచి్చంది. తన తల్లి కుటుంబం ఐర్లాండ్‌లో ఎక్కడి నుంచి వచి్చందో దాని ఆధాంరగా గుర్తించగలిగాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ తన చెల్లెలి పేరు చూసి షాకయ్యాడు. తన చెల్లెలు జెస్సికాకు బదులు క్లెయిర్ అనే పేరును సోదరిగా పేర్కొన్నారు. తామిద్దరి డీఎన్ఏలు పూర్తిగా సరిపోలడమే అందుకు కారణం. జెస్సికా తమకు ముగ్గురు అన్నదమ్ముళ్ల తర్వాత పుట్టిన ఏకైక అమ్మాయి. అలాంటిది తను అసలైన చెల్లె కాదని డీఎన్ఏ టెస్టు పేర్కొనడం టోనీని కలవరపరిచింది. ఏమైనా 80 ఏళ్ల తల్లికి ఈ విషయం చెప్పి ఆందోళనకు గురి చేయొద్దనుకున్నాడు. మర్నాడే క్లెయిర్‌ను సంప్రదించాడు. డీఎన్ఏ పరీక్ష రిజల్టు గురించి వివరించాడు. ‘‘అది పొరపాటని అనుకుంటున్నా. నువ్వేమైనా తెలుసుకోగలవా?’ అంటూ మెసేజ్ చేశాడు. దాంతో తను కూడా షాకైంది. ఎందుకంటే క్లెయిర్‌కు రెండేళ్ల క్రితమే ఆమె కొడుకు డీఎన్ఏ కిట్‌ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చాడు. పరీక్ష చేయించుకుంటే తల్లిదండ్రులతో తన డీఎన్ఏ అస్సలు పోలలేదు. ఈ వివరాలన్నీ టోనీతో పంచుకుందామె. ఆ క్రమంలో, జెస్సికా పుట్టిన ఆస్పత్రిలోనే క్లెయిర్ కూడా పుట్టిందని తేలింది. ఏం జరిగిందంటే... జోన్ 1967లో నాలుగో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచి్చంది. నవజాత శిశువును ఆమె కాసేపు ముద్దులాడాక సిబ్బంది పిల్లల గదిలోకి తీసుకెళ్లారు. అర్థరాత్రి దాటాక మరో మహిళకు పుట్టిన పాపను కూడా పిల్లల వార్డుకు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ తారుమారయ్యారు. జోన్‌కు పుట్టిన క్లెయిర్ మరో మహిళ పొత్తిళ్లలోకి, ఆమెకు పుట్టిన జెస్సికా జోన్ చెంతకు చేరారు. పాపాయి జుత్తు రంగు నల్లగా ఉండటంతో అనుమానించినా, ముగ్గురు కొడుకుల తరువాత పుట్టిన కూతురు కావడంతో ఆ సంతోషంలో పెద్దగా పట్టించుకోలేదు. ఇద్దరూ నా కూతుళ్లే ఆస్పత్రిలో తనకు తెలిసిన ఈ నిజాలను క్లెయిర్‌తో పంచుకున్నాడు టోనీ. ఆమె మర్నాడే వెళ్లి తన అసలు తల్లి జోన్‌ను, కుటుంబాన్ని కలిసింది. క్లెయిర్ రోజూ ఆ ప్రాంతం మీదుగానే ఆఫీసుకు వెళ్తుంటుంది. ఇన్నేళ్లుగా తన అసలు తల్లి అదే రూట్లో తనకు తెలియకుండా ఉంటోందని తెలుసుకుని భావోద్వేగానికి గురైంది. తన క్లెయిర్ భర్తకు, పిల్లలకు విషయం చెప్పింది. క్లెయిర్, జెస్సికా ఇద్దరూ తన కూతుళ్లేనని జోన్ చెప్పుకొచి్చంది. జెస్సికా అసలు ఏడాది ముందే మరణించింది. న్యాయపరమైన చిక్కులు.. తారుమారు కారణంగా క్లెయిర్, జెస్సికా పుట్టిన రోజులు మారిపోయాయి. దాంతో బర్త్ సరి్టఫికెట్ మొదలుకుని పాస్‌పోర్ట్ దాకా అన్నీ మార్చాల్సిన అవసరం వచి్చంది. ఈ నిర్వాకంపై జాతీయ ఆరోగ్య ట్రస్టు (ఎన్హెచ్ఎస్)కు టోనీ ఘాటుగా లేఖ రాశాడు. తప్పు ఒప్పుకున్న ట్రస్టు, వారిద్దరికీ పరిహారం ఇస్తామని ప్రకటించింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Neha Hiremath murder: నేహా హత్య కేసు నిందితునికి డీఎన్ఏ పరీక్ష
హుబ్లీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహా హిరేమఠ హత్య కేసు నిందితుడు ఫయాజ్ రక్త నమూనాను సీఐడీ దర్యాప్తు అధికారులు న్యాయమూర్తి సమక్షంలో సేకరించారు. నిందితునిపై మరింత దర్యాప్తు, అతని డీఎన్ఏ పరీక్ష చేయడానికి అనుమతి కోరి సీఐడీ అధికారులు హుబ్లీ 1వ అదనపు సెషన్స్ కోర్టులో అర్జీ వేశారు. ఈ నేపథ్యంలో జడ్జి సమక్షంలో వైద్యులు ఫయాజ్ రక్త నమూనాలను సేకరించారు. హత్య జరిగిన స్థలం, హత్యకు వాడిన చాకుపై రెండు రక్తపు గ్రూప్‌లను కనుగొన్నారు. ఒక రక్త గ్రూప్ నేహాది అయితే, మరొకటి ఫయాజ్‌ది కావచ్చని, కత్తితో పొడిచేటప్పుడు అతనికి స్వల్ప గాయమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు అధికారులు ఫయాజ్ డీఎన్ఏ పరీక్ష నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు. కాగా ఫయాజ్ను సీఐడీ బృందం 6 రోజుల కస్టడీకి తీసుకున్న సంగతి విదితమే. సోమవారంతో కస్టడీ గడువు ముగియనుంది. అతన్ని మరింతగా విచారించడానికి కస్టడీ గడువును పొడిగించాలని సీఐడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది. -
దత్తత ఇచ్చిన బిడ్డకు డీఎన్ఏ పరీక్ష వద్దు
ముంబై: అత్యాచారానికి గురైన బాధితురాలికి జన్మించిన బిడ్డను ఇతరులు దత్తత తీసుకున్న తర్వాత ఆ బిడ్డకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలనుకోవడం సమంజసం కాదని బాంబే హైకోర్టు తేలి్చచెప్పింది. బిడ్డ ప్రయోజనాలను కాపాడాలని, ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డీఎన్ఏ పరీక్ష నిర్వహించవద్దని పోలీసులను ఆదేశించింది. బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఈ నెల 10న తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో 2020లో ఓ వ్యక్తి 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చింది. బిడ్డకు జన్మనిచి్చంది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని జైలుకు పంపించారు. మైనర్ బాలికకు జన్మించిన బిడ్డను గుర్తుతెలియని దంపతులు దత్తత తీసుకున్నారు. నిందితుడు 2 సంవత్సరాల 10 నెలలుగా జైల్లోనే ఉన్నాడు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసులను ప్రశ్నించింది. బాధితురాలి బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేశారా? అని ఆరా తీసింది. బిడ్డను ఇతరులు దత్తత తీసుకున్నారని పోలీసులు బదులివ్వడంతో ఇక డీఎన్ఏ పరీక్ష అవసరం లేదని ఆదేశించింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. -
వివాదాలకు చెక్!
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వే స్టేషన్లో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగిన నాలుగు వారాల తర్వాత డీఎన్ఏ పరీక్షల నివేదిక వెల్లడైంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కోసం ఒకరి కంటే ఎక్కువ మంది మందుకు రావడంతో వాస్తవ సంబంధీకుల వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షలకు ఆదేశించిన విషయం తెలిసిందే. 81 మృతదేహాల గుర్తింపు వివాదాస్పదం కావడంతో మొత్తం 88మంది నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించి, ఢిల్లీ లేబరేటరీకి పంపారు. ఈ నివేదిక అందేంత వరకు స్థానిక ఎయిమ్స్‌లోని కంటైనర్లలో ఆయా మృతదేహాలను భద్రపరిచారు. వీటిలో 29మంది పరీక్ష నివేదికలు అందాయని భువనేశ్వర్ నగరపాలక సంస్థ(బీఎంసీ) మేయర్ సులోచన దాస్ శుక్రవారం తెలిపారు. మిగిలిన మృతదేహాల పరీక్ష నివేదికలు త్వరలో చేరుతాయన్నారు. గుర్తించిన 29మంది మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. ఐదుగురు తక్షణమే స్పందించి ఎయిమ్స్‌కు చేరుకున్నారు. గుర్తించిన మృతదేహాలను భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్, రైల్వే, ఒడిశా రవాణాశాఖ, ఎయిమ్స్ అధికారుల సమక్షం లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఇతరులు త్వరలో వస్తారని మేయర్ వివరించారు. ఉచిత సౌకర్యాలు.. మృతదేహాలను స్వగ్రామానికి తీసుకు వెళ్లాలనుకునే కుటుంబ సభ్యులకు ఒడిశా రవాణాశాఖ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. ఎయిమ్స్ ప్రాంగణంలో దాదాపు 10 అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచినట్లు రవాణాశాఖ అధికారి తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరైనా భువనేశ్వర్‌లో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకుంటే, స్థానిక యంత్రాంగం భరత్పూర్, సత్యనగర్ శ్మశానవాటిక లలో వారికి అన్ని ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు. -
అంత్యక్రియలు చేసిన మరుసటి రోజే ఇంట్లో ప్రత్యక్షం
తిరువళ్లూరు: తల్లి మృతి చెందిందని భావించి అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజే ఆమె ప్రాణంతో ఇంటి వద్ద ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా సేలైకండ్రిగ గ్రామానికి చెందిన సొక్కమ్మాల్(56)కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం సేలై కండ్రిగలోని చిన్న కుమారుడు శరవణన్ వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం సొక్కమ్మాల్‌కు, ఎదురింటి మహిళకు ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణలో సొక్కమ్మాల్ స్వల్పంగా గాయపడడంతో అలిగి చైన్నెలో ఉంటున్న పెద్ద కుమారుడు గాంధీ వద్దకు వెళ్లిపోయింది. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో పచ్చరంగు చీర, ఎరుపు రంగు జాకెట్‌ను ధరించినట్లు తెలిసింది. బుధవారం తిరువళ్లూరు జిల్లా పుట్లూరు రైల్వే ట్రాక్‌పై అదే కలర్ దుస్తులతో వృద్ధురాలి మృతదేహం గుర్తు తెలియని రీతితో కనిపించింది. మృతదేహాంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వార్త పలు దినపత్రికల్లో రావడంతో మృతి చెందిన వృద్ధురాలు సొక్కమ్మాల్గా భావించిన ఆమె చిన్నకుమారుడు శరవణన్ ఈ రైల్వే పోలీసుల నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చి బంధువులకు సమాచారం ఇచ్చాడు. చైన్నెలో ఉన్న గాంధీకి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే గాంధీకి, శరవణన్‌కు మధ్య మాటలు లేకపోవడంతో గాంధీ ఫోన్ లిప్ట్ చేయలేదు. మే 28వ తేదీ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా సొక్కమ్మాల్ సోమవారం ఉదయం శరవణన్ ఇంటి వద్దకు రావడంతో కలకలం రేపింది. సొక్కమ్మాల్ ప్రాణంతో వచ్చారన్న విషయం తెలియడంతో జనం పెద్ద ఎత్తున గుమికూడారు. దీనిపై రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతి చెందిన మహిళ తన తల్లిగా భావించి అంత్యక్రియలు నిర్వహించామని, ప్రస్తుతం తన తల్లి ప్రాణంతో ఇంటికి వచ్చిందని సమాచారం అందించాడు. దీంతో రైల్వే పోలీసులు శరవణన్‌ను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో మృతి చెందిన మహిళ సొక్కమ్మాల్ కాదని నిర్ధారించారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు మంగళవారం డిప్యూటీ తహసీల్దార్ అంబిక, ఆర్ఐ గణేషన్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికి తీశారు. డీఎన్ఏ టెస్టు కోసం నమూనాలను సేకరించారు. విచారణలో మృతి చెందిన మహిళ రెడ్‌హిల్స్‌కు చెందిన ఏలుమలై భార్య శకుంతలమ్మాల్(66)గా గుర్తించారు. -
అవి శ్రద్ధా శరీర భాగాలే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ హత్యా ఘటనలో మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో లభ్యమైన ఎముకలు శ్రద్ధా వాకర్‌వేనని పోలీసు వర్గాలు గురువారం తెలిపాయి. హత్యారోపణలు ఎదుర్కొంటున్న అఫ్తాబ్ గది నుంచి సేకరించిన రక్తం నమూనాలు శ్రద్ధవేనని తేలింది. ఎముకలు, రక్తం నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలు శ్రద్ధా వాకర్ తండ్రి డీఎన్ఏతో సరిపోలాయని ఆ వర్గాలు వివరించాయి. డీఎన్ఏ రిపోర్టుతోపాటు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక అందిందని స్పెషల్ పోలీస్ కమిషనర్(శాంతిభద్రతలు) సాగర్‌ప్రీత్ హూడా మీడియాకు తెలిపారు. అఫ్తాబ్‌కు నిపుణులు నిర్వహించిన పాలీగ్రాఫ్ పరీక్ష నివేదిక కూడా బుధవారం పోలీసులకు అందింది. కేసు దర్యాప్తులో ఈ నివేదికలు కీలకంగా మారాయి. శ్రద్ధావాకర్‌తో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ పూనావాలా ఆమెను గొంతుపిసికి చంపిన అనంతరం శరీరాన్ని 35 భాగాలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడవేశాడు. -
Heteroparental superfecundation: కవలలే గానీ... తండ్రులు వేరు
బ్రెజిల్లో ఓ 19 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. ఇందులో విశేషం ఏముందంటారా? చాలా పెద్ద విశేషమే ఉంది. ఆ కవలలిద్దరికీ తండ్రులు వేర్వేరు! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే. సదరు యువతి ఒకే రోజున ఇద్దరు యువకులతో శారీరకంగా కలవడం ఇందుకు దారి తీసిందట!! పిల్లలకు 8 నెలలు వచ్చాక అసలు వారి తండ్రి ఎవరా అని ఆమెకు అనుమానం వచ్చింది. వారి తండ్రిగా తాను భావిస్తున్న యువకునికి పితృత్వ పరీక్ష చేయించగా కవలల్లో ఒకరి డీఎన్ఏతో మాత్రమే సరిపోయిందట. దాంతో ఆమెతో పాటు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. కాసేపు ఆలోచించిన మీదట, తాను అదే రోజు మరో యువకునితో శారీరకంగా కలిసిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. డీఎన్ఏ పరీక్ష చేయించగా రెండో బాబుకు అతనే తండ్రి అని తేలింది! ‘‘ఇది అత్యంత అరుదైన సంగతి. 10 లక్షల్లో ఒక్క కేసులో మాత్రమే ఇలా జరిగేందుకు ఆస్కారముంటుంది’’ అని డాక్టర్లు చెబుతున్నారు. శాస్త్రీయంగా దీన్ని హెటరో పేరెంటల్ సూపర్ ఫెకండేషన్ (బహుళ పిండోత్పత్తి)గా పిలుస్తారట. ఒకే రోజు ఇద్దరు పురుషులతో శారీరకంగా కలిసి, సదరు స్త్రీ తాలుకు రెండు అండాలు వారి వీర్య కణాలతో వేర్వేరుగా ఫలదీకరణ చెందితే ఇలా జరుగుతుందట. ఫలితంగా తయారయ్యే రెండు పిండాలూ వేర్వేరు మావి (ఉమ్మనీటి సంచి)లో పెరుగుతాయట. మనుషుల్లో అత్యంత అరుదే అయినా పలు జంతువుల్లో మాత్రం ఇది కాస్త సాధారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
Viral Video: ‘మన బిడ్డకు తండ్రి నేను కాదు.. ఇదిగో సాక్ష్యం’
మనుషుల భావోద్వేగాలతో ఆటాడుకుంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందంటూ ట్విట్టర్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన 12 గంటల్లోనే ఏకంగా రెండు మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. ఏకంగా 65 వేల మంది స్పందించారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే .. తమ కూతురి పుట్టినరోజు సందర్భంగా ఓ వ్యక్తి గిఫ్ట్ తీసుకొచ్చి కిచెన్‌లో ఉన్న తన భార్యకిస్తాడు. గిఫ్ట్ ప్యాక్‌లో ఓ కవర్ తెరిస్తే.. అందులో మరొకటి.. అది తెరిస్తే.. ఇంకొకటి.. అలా చివరికి ఓ రెండు కాగితాలు మిగులుతాయి. ఏదో గొప్ప బహుమతి ఇస్తావనుకుంటే ఇవేంటీ అని ఆమె భర్తను ప్రశ్నిస్తుంది. సరే ఈ కాగితాల్లో ఏముంది? ఆమె ప్రశ్నకు ఆ వ్యక్తి సమాధానం వింటే షాకవడం ఖాయం. ‘అవి DNA పరీక్షా ఫలితాలు.. వాటి ప్రకారం మన బిడ్డకు తండ్రి నేను కాదు’ అని అతను చెప్పగానే ఆమె నిశ్చేష్టురాలవుతుంది. చదవండి👉పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి .. అబార్షన్‌కు హైకోర్టు నో.. ఓకే చెప్పిన సుప్రీంకోర్టు ఈ వీడియోలో నిజమెంత? అబద్దమెంత? వ్యూస్ కోసం చేశారా? లేక నిజంగానే జరిగిందా? అన్నదానిపై పరిశీలన చేశాం. ఇది రెండేళ్ల కిందటిదిగా తేలింది. వీడియో పాతదా? కొత్తదా? అన్నది పక్కనపెడితే ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని నెటిజన్లు అంటున్నారు. కోపతాపాలు పెరగడంతో విచ్చలవిడిగా విడాకులు తీసుకుంటున్నారు. అప్పటికే పుట్టిన బిడ్డల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది. ఇక కృత్రిమ గర్భధారణతో పుట్టిన బిడ్డల విషయంలోనూ గందరగోళం నెలకొంటోందని ఎన్నో కేసులు చెబుతున్నాయి. వీటికి తోడు అనైతిక సంబంధాలు.. వెరసి ఎంతో మానసిక వ్యధను పిల్లలు ఎదుర్కొంటున్నారు. చదవండి👉జో బైడెన్‌కు క్యాన్సరా? పొరపాటున నోరు జారారా లేక నిజమా? వైట్ హౌస్ క్లారిటీ He gifted her the DNA test resuIts on their “daughter's” birthday😬… pic.twitter.com/CKMqPZiKRr — d🦕n (@javroar) July 20, 2022 -
గ్యాంగ్ రేప్ నిందితులకు డీఎన్ఏ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుడు, చట్టంతో విభేదించిన బాలురకు కచ్చితంగా శిక్ష పడేలా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వీరికి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్ (టీఐపీ) పూర్తి చేసిన అధికారులు నిందితులకు డీఎన్ఏ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయస్థానాలు అనుమతి మంజూరు చేయడంతో తదుపరి చర్యలకు ఉపక్రమించారు. అవసరమైన పక్షంలో బాధితురాలి నుంచీ నమూనాలు సేకరించాలని యోచిస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసులో సాదుద్దీన్, మరో ఐదుగురు చట్టంతో విభేదించిన బాలురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు సైతం పట్టుబడి జువైనల్ హోమ్‌కు చేరాడు. అయితే ఇతడు కేవలం బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడానికి సంబంధించి మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సాదుద్దీన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు సహా ఐదుగురు మాత్రం గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాన్సూ బేకరీ నుంచి బాలికను ఇన్నోవా కారులో పెద్దమ్మ గుడి సమీప ప్రాంతాలకు తీసుకువెళ్లిన ఈ ఐదుగురూ గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో వెంట్రుకలు, వినియోగించిన టిష్యూ పేపర్లతో సహా అనేక ఆధారాలు సేకరించారు. బాలిక పోలీసులకు, న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలోనూ తనపై ఆ కారులోనే అఘాయిత్యం జరిగినట్లు బయటపెట్టింది. దీంతో ఇన్నోవా కారులో లభించిన ఆధారాలు క్లూస్ టీమ్ ద్వారా సేకరించిన పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఇప్పుడు సాదుద్దీన్ సహా ఐదుగురి నుంచి సేకరించిన నమూనాలకూ పంపనున్నారు. ఈ రెండింటినీ సరిపోల్చే నిపుణులు ఆ రోజు కారులో ఉన్నది, బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది వీరేనంటూ సాంకేతికంగా నిర్థారించనున్నారు. పోలీసులు దాఖలు చేసే అభియోగపత్రాల్లోనూ ఈ అంశాన్ని పొందుపరుస్తారు. న్యాయస్థానంలో నేరం నిరూపించడానికి ఇది కీలకం కానుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కోర్టుల్లో బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలంటూ పోలీసులు కోర్టును కోరుతున్నారు. కాగా బాలికపై సామూహిక అత్యాచారంలో ఎమ్మెల్యే కుమారుడి పాత్ర లేకున్నా... బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు, ఆధారాలు ఉండటంతోనే జువైనల్ హోమ్‌కు చేరాడు. ఇతడిపై ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్ కింద సదరు ఆరోపణలు నమోదు చేశారు. ఆమ్నేషియా పబ్ వద్ద సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఓ కీలక విషయం గుర్తించారు. ఇన్నోవా కారులో అప్పటికే ఉన్న సాదుద్దీన్‌ను దింపిన ఎమ్మెల్యే కుమారుడు అక్కడే కారు ఎక్కాడని, అలా ఈ కేసులో చిక్కాడని తెలుసుకున్నారు. (చదవండి: కోర్టును ఆశ్రయించిన పోలీసులు.. ఎందుకంటే..?) -
30 ఏళ్ల క్రితం కిడ్నాప్.. ఇల్లు, కొలను, కొండలు అవి మాత్రమే తెలుసు.. ఆ ఒక్క ఫొటోతో
బీజింగ్: లీ జింగ్వీకి తన అసలు పేరు ఏమిటో తెలీదు. ఎవరికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో కూడా తెలీదు. చిన్నప్పుడే కిడ్నాప్ అయిన లీకి తెలిసిందల్లా తాను ఆడుకున్న ఇల్లు, చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలే. వాటినే 30 ఏళ్ల పాటు గీస్తూ ఉండడంతో చివరికి లీ తన కన్నతల్లి దగ్గరకి చేరాడు. చైనాలో జరిగిన ఈ ఉద్వేగ భరితమైన కలయిక పతాక శీర్షికలకెక్కింది. 1989లో లీకి నాలుగేళ్ల వయసున్నప్పుడు పొరుగింట్లోని వ్యక్తి కల్లబొల్లి కబుర్లు చెప్పి తనతో తీసుకువెళ్లి కిడ్నాపర్లకి అప్పగించాడు. కిడ్నాపర్లు నాలుగేళ్ల ఆ బాలుడిని రైల్లో హెనాన్ ప్రావిన్స్‌కి తీసుకువెళ్లి ఒక కుటుంబానికి అమ్మేశారు. అప్పట్నుంచి లీ తన కన్న తల్లిదండ్రుల కోసం పరితపిస్తూనే ఉన్నాడు. పసిబాలుడు కావడంతో వారి పేర్లు, ఊరి పేరు గుర్తు లేదు. కానీ తన ఇల్లు, దాని పక్కనే ఉన్న కొలను, చుట్టుపక్కల ఉండే కొండలు, అటవీ ప్రాంతం గుర్తుకు ఉండడంతో వాటిని గీస్తూనే ఉండేవాడు. చిన్నతనం నుంచి కొన్ని వందల, వేలసార్లు ఆ ఇంటి పరిసరాలను గీయడంతో అతను ఏదీ మర్చిపోలేదు. పెరిగి పెద్దయ్యాక తన తల్లిదండ్రుల్ని కలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. చివరికి గత ఏడాది సోషల్ మీడియాలో తాను 30 ఏళ్లుగా గీస్తున్న చిత్రాన్ని పోస్టు చేయడంతో అది విస్తృతంగా షేర్ అయింది. దీంతో పోలీసులకి ఆ ఊరుని, లీ కుటుంబాన్ని కనిపెట్టడం సులభంగా మారింది. చివరికి ఈ ఏడాది కొత్త సంవత్సరం రోజు తన ఇద్దరు పిల్లల్ని వెంట పెట్టుకొని లీ తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత కన్నతల్లిని చూడగానే భావోద్వేగం పట్టలేక కిందపడిపోయాడు. తన తండ్రి మరణించాడన్న విషయం తెలుసుకొని తెగ బాధపడ్డాడు. తోడబుట్టిన వారిని చూసి పట్టలేని ఆనందంతో కన్నీళ్లు కార్చాడు. వచ్చే నెల లూనార్ మాసం కావడంతో బంధు మిత్రులందరితో కలిసి తన తండ్రి సమాధిని సందర్శిస్తానని లీ చెప్పాడు. ఆ సమాధి దగ్గర నేను గొంతెత్తి చెప్పాలనుకుంటున్న మాట ‘‘సన్ ఈజ్ బ్యాక్’’ అంటూ లీ ఉద్వేగంతో చెప్పాడు. Li Jingwei was abducted from his village when he was 4-years-old and trafficked across China. After over three decades of being apart, he drew the sketch of his home village from memory and finally traced his mother. #China #Reunion #EmotionalVideo #HeartTouchingVideo #NewsMo pic.twitter.com/5wM0KS6vKz — IndiaToday (@IndiaToday) January 3, 2022 -
స్వస్థలానికి సాయితేజ భౌతికకాయం.. పచ్చబొట్టు ఆధారంగా గుర్తింపు
బి.కొత్తకోట: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడపల్లెకు చెందిన బి.సాయితేజ అమరుడై శుక్రవారానికి మూడు రోజులైంది. శనివారం ఉదయం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయి తేజ భౌతికకాయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలాలకు భౌతికకాయాన్ని తరలించారు. ఆయన మరణ వార్త తెలిసిన బుధవారం సాయంత్రం నుంచి రేగడపల్లెలో విషాదం అలుముకుంది. సాయితేజ కుటుంబాన్ని ఓదార్చేందుకు, పరామర్శించేందుకు ప్రజలు, పార్టీలకు అతీతంగా నాయకులు తరలివస్తున్నారు. కడసారి చూపు కోసం అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పరామర్శకు ఎవరు వచ్చినా ‘అయ్యా.. నా బిడ్డ ఇంకా రాలేదు’ అంటూ విలపిస్తున్న తల్లి భువనేశ్వరిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సాయితేజ మృతదేహం రాక కోసం రేగడపల్లె, కురబలకోట, బి.కొత్తకోట మండలాల్లోని పలు గ్రామాలు ఎదురు చూస్తున్నాయి. సాయితేజ గురించి తెలిసిన వాళ్లు, ముఖ్యంగా సైనిక ఎంపిక కోసం శిక్షణ పొందిన వారు విలపిస్తున్నారు. సాయితేజ ఇచ్చిన శిక్షణతో ఎంతోమంది సైనికులుగా ఎంపికయ్యారు. వారంతా అతడికి నివాళులర్పించేందుకు మృతదేహం కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో రేగడపల్లెలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది డీఎన్ఏ పరీక్షల్లో జాప్యం లాన్స్‌నాయక్ సాయితేజ భౌతికకాయాన్ని గుర్తించేందుకు గరువారం రాత్రి అతడి తల్లిదండ్రులు భువనేశ్వరి, తండ్రి మోహన్, తమ్ముడు మహేష్‌బాబు, కుమారుడు మోక్షజ్ఞల నుంచి సేకరించిన రక్త నమూనాలను ఢిల్లీ తీసుకెళ్లారు. అందరి శ్యాంపిల్స్ సేకరణ పూర్తయ్యాక జెనెటిక్ ల్యాబ్స్‌లో డీఎన్ఏ పరీక్షలు జరిపి మృతదేహాన్ని అప్పగిస్తామని అధికారులు సాయితేజ కుటుంబ సభ్యులకు తెలిపారు. శనివారం ఉదయానికి ఈ ప్రక్రియ పూర్తి అయింది. సాయితేజ శరీరంపై ఉన్న పచ్చబొట్టు గుర్తుల ఆధారంగా అతడి భౌతిక కాయాన్ని గుర్తించారు. పచ్చబొట్ల వివరాలను, ఫొటోలను ఢిల్లీ సైనిక అధికారులకు వివరాలను సాయితేజ తండ్రి మోహన్ తెలిపారు. సాయితేజ ఎడమ వైపు గుండె భాగంపై భార్య పేరు ఆంగ్లంలో శ్యామ అని, కుడిచేతి మీద త్రిశూలం ఆకారంలో శివుడిబొమ్మతో కూడిన పచ్చబొట్లు ఉన్నాయి. సాయితేజ ఇంట్లో విషణ్ణవదనాలతో కుటుంబసభ్యులు, బంధువులు -
1959లో హత్యాచారం.. డీఎన్ఏ టెస్ట్‌తో ఇప్పుడు తీర్పు.. ట్విస్ట్ ఏంటంటే
వాషింగ్టన్: అత్యాచారం.. ఆడవారి జీవితాన్ని సమూలంగా నాశనం చేసే దుర్ఘటన. దురదృష్టం కొద్ది బాల్యంలోనే ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే.. వారు జీవితాంతం నరకయాతన అనుభవిస్తారు. ప్రస్తుత రోజుల్లో ముఖ్యంగా చిన్నారుల్లో అమ్మాయి, అబ్బాయి తేడా లేకుండా అకృత్యాల బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే నేటికి కూడా మన సమాజంలో అత్యాచార బాధితులు తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయాడానికి ఎక్కువగా ముందుకు రావడం లేదు. వచ్చిన కేసుల్లో సత్వర న్యాయం జరగడం లేదు. ఇక సమయం గడిచిన కొద్ది నిందితులకు శిక్షపడే అవకాశాలు తక్కువ. మన దగ్గర పరిస్థితులు ఇలా ఉన్నాయి. కానీ అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం 62 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తిని అత్యాచార కేసులో నేరస్థుడిగా నిర్ధారించింది కోర్టు. డీఎన్ఏ టెస్ట్ ఆధారంగా అతడిని దోషిగా తేల్చింది. ఆ వివరాలు.. 62 ఏళ్ల క్రితం హత్యాచారం... 62 ఏళ్ల క్రితం అనగా 1959లో ఈ దారుణం చోటు చేసుంది. స్పోకనే వెస్ట్ సెంట్రల్ పరిసర ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల బాలిక క్యాంప్‌ఫైర్ మింట్స్ అమ్మడానికి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. బాలిక గురించి గాలించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. రెండు వారాల తర్వాత చిన్నారి మృతదేహం లభ్యమయ్యింది. బాలికపై దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పేరు జాన్ రీగ్ హాఫ్. అప్పటికి అతడిపై పోలీసులకు ఎలాంటి అనుమానం కలగలేదు. (చదవండి: లైంగిక వేధింపులు: ‘నన్ను క్షమించండి.. నాకు బతకాలని ఉంది.. కానీ’) అందుకే నిందితుడిపై అనుమానం రాలేదు... కారణం ఏంటంటే జాన్ రీగ్ హాఫ్ అమెరికా ఆర్మీలో సైనికుడిగా పని చేస్తుండేవాడు. అందుకని పోలీసులు అతడిని అనుమానించలేదు. ఇక దారుణానికి ఒడిగట్టిన సమయంలో జాన్ రీగ్ దారుణం జరిగిన స్పోకేన్ కౌంటీలోని ఫెయిర్‌చైల్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు.. బాలికపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేశారని తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలించసాగారు. పట్టించిన మరో దారుణం ఈ క్రమంలో అప్పటికే 9 ఏళ్ల చిన్నారి ఉసురు తీసిన జాన్ రీగ్.. మరో దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళ కాళ్లు, చేతులు కట్టేసి.. కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు జాన్ రీగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడి వయసు 20 సంవత్సరాలు. మహిళను హత్య చేసిన కేసులో అమెరికా కోర్టు జాన్ రీగ్‌కి శిక్ష విధించింది. (చదవండి: కన్నపేగు పోరాటం.. ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని..) మహిళ హత్య కేసు విచారణ సమయంలో జాన్ రీగ్‌కు సంబంధించి పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు గుర్తించారు. బాలిక హత్యాచారానికి గురైన సమయంలో జాన్ రీగ్ ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్నట్లు గమనించారు. అయితే ఇప్పుడున్నంత సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లో అందుబాటులో లేకపోవడంతో బాలిక హత్యాచార కేసులో జాన్ రీగే నేరస్థుడని పోలీసులు నిరూపించలేకపోయారు. అప్పట్లో ఈ కేసు ‘మౌంట్ ఎవరెస్ట్’ పేరుతో ప్రసిద్ధి చెందింది. అత్యాధునిక డీఎన్ఏ పరిజ్ఞానం సాయంతో.. ఈ సంవత్సరం ప్రారంభంలో, టెక్సాస్‌లోని డీఎన్ఏ ల్యాబ్‌కు బాధితురాలి శరీరం నుంచి వీర్య నమూనాను తీసుకెళ్లడానికి పోలీసు డిపార్ట్మెంట్కు అనుమతి లభించింది. ఇక చిన్నారి శరీరంపై ఉన్న వీర్య నమూనాలు ముగ్గురు అనుమానితుల్లో ఒకరితో సరిపోలింది. ఆ ముగ్గురు ఎవరనగా.. జాన్ రీగ్, అతడి ఇద్దరు సోదరులు. ఇక బాలిక శరీరం మీద లభ్యమైన వీర్య నమూనాలు జాన్ రీగ్‌తో సరిపోలాయి. దాంతో బాలికపై హత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తి జాన్ రీగ్ అని తెలిపారు పోలీసులు. ఆ తర్వాత కేసు మూసివేశారు. అదేంటి నేరస్థుడికి శిక్ష విధించాలి కదా అంటే.. అతడు దాదాపు 30 ఏళ్ల క్రితమే అనగా 1971లో మృతి చెందాడు. (చదవండి: హత్యాచార కేసు: 30 రోజుల్లోనే విచారణ పూర్తి.. సంచలన తీర్పు) మరి కేస్ ఎలా చేధించారు అంటే.. మహిళను హత్య చేసిన కేసులో జాన్ రీగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. బాలిక హత్యాచారం కేసులో అతడే నిందితుడై ఉంటాడని భావించారు. ఈ క్రమంలో జాన్ రీగ్‌తో పాటు అతడి తమ్ముళ్లిద్దరి వీర్య నమూనాలను, బాధిత బాలికపై సేకరించిన వీర్య నమూనాలను భద్రపరిచారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక డీఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో జాన్ రీగ్‌ను నేరస్థుడిగా నిర్థారించారు. కేసు చేధించేనాటికే అతడు మరణించడంతో ఫైల్ ముసివేశారు. చదవండి: మహిళా ఉద్యోగికి ఏఈ లైంగిక వేధింపులు.. బుద్ధి చెప్పిన కుటుంబ సభ్యులు -
కన్నపేగు పోరాటం.. ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని..
కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఓ సంఘటన ఈ సోమవారం నాడు చోటు చేసుకుంది. అధికార యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. జరగాల్సిన కార్యక్రమం యథావిధిగా నడుస్తోంది. మీడియా అటెన్షన్ కూడా ఈ విషయం మీదనే కేంద్రీకృతమై ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన కేసు అది. అనుపమ అనే ఓ తల్లి తన బిడ్డ కోసం చేస్తున్న పోరాటం. కన్నపేగు చేస్తున్న పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం భాగమైంది. పోలీసులు బిడ్డను వెతికి రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇక అనుపమ చేతిలో పెట్టడమే తరువాయి. బిడ్డను చూపించండి! ఆదివారం నాటి రాత్రి పోలీసులు బిడ్డతో కేరళ రాజధాని తిరువనంతపురం చేరారు. ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదేశం మేరకు డీఎన్ఏ పరీక్ష కోసం సోమవారం నాడు బిడ్డ నుంచి నమూనా సేకరించారు. డీఎన్ఏ పరీక్ష తమ కళ్ల ముందే జరగాలని అనుపమ పట్టుపట్టింది. తన బిడ్డ నమూనాలను మార్చివేయరనే నమ్మకం ఏమిటని ప్రశ్నించింది అనుపమ. ఒక్కసారి బిడ్డను కళ్లారా చూస్తానని ప్రాధేయపడింది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో అంతా సవ్యంగా జరుగుతుందనే నమ్మకం కలగడం లేదని ఆమె పడుతున్న ఆవేదన, ఆందోళన అందరికీ అర్థమవుతోంది. నమూనా సేకరణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేసినట్లు చెబుతూ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. అనుపమ, ఆమె ప్రేమికుడు, బిడ్డ నమూనాలు స్థానిక రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చేరినట్లు ఆ రాష్ట్రంలోని కౌముది మీడియా తెలిపింది. నమూనాలు సరిపోలినట్లు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత న్యాయపరమైన నిబంధనలు పూర్తి చేసి బిడ్డకు అనుపమకు ఇస్తారు. అప్పటివరకు బిడ్డను జిల్లా చైల్డ్ ప్రొటెషన్ ఆఫీసర్ సంరక్షణలో ఉంచుతారు. ఆ బిడ్డ ఈ బిడ్డేనా! జరుగుతున్న పరిణామాలు అనుపమకు సంతోషాన్నిస్తున్నట్లే కనిపిస్తున్నట్లు స్థానిక మీడియా చెప్తోంది. అలాగే పోలీసులు తీసుకువచ్చిన బిడ్డ అనుపమకు పుట్టిన బిడ్డ అనడానికి తార్కికపరమైన ఆధారాలు అందుతున్నాయి. బిడ్డ మాయమైన తర్వాత ఒకటి– రెండు రోజుల తేడాలో ఆ రాష్ట్రంలో అమ్మ తొట్టిల్ (ఉయ్యాల) పథకంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉయ్యాలలోకి ఇద్దరు బిడ్డలు వచ్చారు. వారిలో ఒక బిడ్డకు గత నెలలో పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. ఓ బిడ్డను దత్తత ఇచ్చినట్లు తెలిసింది. ఆ బిడ్డ కోసం గాలించి ఆదివారం నాడు విజయవంతంగా ఛేదించారు. కన్నపేగు పోరాటం వృథా కాదని, ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటోంది. అనుపమ ఒడికి చేరే క్షణం కోసం ఎదురు చూస్తోంది. ఇదీ జరిగింది! అనుపమ గత ఏడాది అక్టోబర్‌లో ఓ బిడ్డకు తల్లయింది. ఆమె కేరళ సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు పొందిన సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆమె ప్రేమించిన వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి. అనుపమ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి స్వయానా కూతురినే మోసం చేశాడు. ఆమె కన్నబిడ్డను ఆమె నుంచి వేరు చేశాడు. ‘బిడ్డను రహస్య ప్రదేశంలో సంరక్షిస్తున్నట్లు’ కొద్ది నెలల పాటు ఆమెను మభ్యపెట్టాడు. తాను మోసపోయానని తెలిసిన తర్వాత ఆమె ఇంటి నుంచి పారిపోయి, ప్రేమికుడితో కలసి పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. ఆమె తండ్రి సమాజంలో పరపతి కలిగిన వ్యక్తి, కమ్యూనిస్ట్ నాయకుడు, ప్రజాప్రతినిధి కూడా కావడంతో పోలీసులు మొదట్లో ఆమె కంప్లయింట్‌ను ఫైల్ చేయడానికి మీనమేషాలు లెక్కపెట్టారు. ఆమె పోలీసులు, శిశు సంక్షేమశాఖతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను కలిసి తన బిడ్డను తనకు ఇప్పించమని వేడుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించింది. అనుపమ తండ్రి చేసిన ఘోరం రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారి తీసింది. మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ నెల 18వ తేదీన వెలువడిన ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో కదలిక వచ్చింది. సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన పోలీసులు బిడ్డను సొంత రాష్ట్రానికి తీసుకువెళ్లారు. బిడ్డ రాష్ట్రానికి చేరిన వార్త సోమవారంనాడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. -
పొరపాటున వేరే వారి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..!
వాషింగ్టన్: తల్లి అయితే గాని స్త్రీ జన్మకు పరిపూర్ణత లభించదనుకునే సమాజం మనది. ఇక మాతృత్వం కోసం ప్రతి మహిళ పరితపిస్తుంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చి.. అమ్మ అని పిలుపించుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. దురదృష్టం కొద్ది పిల్లలు పుట్టే అవకాశం లేని వారి బాధ వర్ణానాతీతం. అయితే ప్రస్తుతం వీరిపాలిట వరంగా మారింది కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్). కృత్రిమ గర్భధారణ ఎందరో మహిళలకు మాతృత్వం అనే వరాన్ని తిరిగి అందిస్తుంది. ఇదంతా బాగానే ఉంది.. కానీ దీనిలో ఏ మాత్రం తేడా జరిగినా.. ఫలితం దారుణంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు అమెరికాకు చెందిన ఓ జంట. ఇందుకు కారణమైన ఐవీఎఫ్ క్లినిక్‌పై కేసు నమోదు చేశారు. ఆ వివరాలు.. (చదవండి: భర్త మరణించిన ఆరు నెలలకు గర్భం..!) అమెరికాకు చెందిన డఫ్నా, అలెగ్జాండర్ కార్డినాల్ దంపతులకు వివాహం అయ్యి చాలా కాలమయ్యింది కానీ పిల్లలు కలగలేదు. దాంతో వాళ్లు కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్) ద్వారా బిడ్డను కనాలనుకున్నారు. ఈ క్రమంలో తమ ఇంటికి సమీపంలో ఉన్న ఓ ఐవీఎఫ్ కేంద్రాన్ని సంప్రదించారు. ఐవీఎఫ్ ద్వారా గర్భవతి అయిన డఫ్నా.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ రంగు, ఒత్తైన నల్లటి జుట్టు.. చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. తమ కుటుంబంలో ఎవరికి ఈ చిన్నారి లాంటి శరీర ఛాయ, జుట్టు లేవు. అయితే బిడ్డ పుట్టిన సంతోషంలో ప్రారంభంలో వారు ఇవేం పట్టించుకోలేదు. కానీ బిడ్డ పెరుగుతున్న కొద్ది వారిలో అనుమానం బలపడసాగింది. ఈ క్రమంలో డఫ్నా దంపతులు వారి బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయించారు. ఫలితాలు వారిద్దరిలో ఎవరితో కూడా సరిపోలేదు. దాంతో వారి అనుమానం మరింత బలపడింది. (చదవండి: కోవిడ్ కాలం.. అంకురం కోసం...) ఈ క్రమంలో వారు తాము సంప్రదించిన ఐవీఎఫ్ కేంద్రానికి వెళ్లి.. విషయం చెప్పి.. నిలదీయగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. డఫ్నా దంపతులు ఐవీఎఫ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే మరో జంట కూడా కృత్రిమ గర్భధారణ కోసం పక్కనే ఉన్న క్లినిక్‌కు వచ్చారు. అయితే ఈ రెండింటిలో పని చేసేది ఒక్కడే డాక్టర్. ఫలితంగా సదరు డాక్టర్ పొరపాటున ఇరువురి పిండాలను తారుమారు చేశాడు. అంటే డఫ్నా దంపతుల పిండాన్ని వేరే వారి గర్భంలో.. వారి పిండాన్ని డఫ్నా గర్భంలో ప్రవేశపెట్టాడు. జుట్టు, శరీర ఛాయ వేరుగా ఉండటంతో అనుమానం రావడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో డఫ్నా దంపతులు సదరు ఐవీఎఫ్ కేంద్రం మీద కేసు పెట్టారు. తమ జన్యుపరమైన బిడ్డను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. (చదవండి: బరువు తగ్గించే ఔషధానికి ఆమోదం.. షాపులకు క్యూ కట్టిన జనాలు) ఈ క్రమంలో రెండు జంటలు తమ తమ జన్యుపరమైన బిడ్డలను పరస్పరం మార్చుకుని... సొంత బిడ్డలతో ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా డఫ్నా దంపతులు తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. మేం వేసిన లాసూట్ ద్వారా భావోద్వేగ నష్టాలు, పరిహారం,ఆస్తి నష్టాలు, అలాగే అనేక రకాల ఖర్చులను కోరుతోంది. చదవండి: కోమాలోకి వెళ్లి సొంత భాష మర్చిపోయి.. కొత్త భాష మాట్లాడుతోంది!! -
‘ఆ బిడ్డ నాకు పుట్టలేదు! డీఎన్ఏ టెస్ట్ చేయండి’: విడాకుల్లో కొత్త ట్విస్ట్
తిరువనంతపురం: భార్యాభర్తల మధ్య వివాదంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. అసలు భార్యకు పుట్టిన బిడ్డ తనకు పుట్టలేదని ఓ భర్త కోర్టులో సరికొత్త వాదనకు తెరలేపాడు. అందరికీ డీఎన్ఏ పరీక్ష చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన ఓ వ్యక్తి ఆర్మీలో పని చేస్తున్నాడు. అతడికి 2006 మే 5వ తేదీ వివాహమైంది. వివాహమైన 22 రోజులకే లడ్డాఖ్‌కు వెళ్లాడు. అయితే 2007 మార్చి 9వ తేదీన భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది. చదవండి: ఏసీ హాల్లో ఎందుకు? గ్రౌండ్లో కూడా పెళ్లి చేసుకోండి అయితే పెళ్లయినప్పటి నుంచి అతడు భార్యతో కలవలేదు. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కూడా కలవకపోయినా బిడ్డ పుట్టడంపై అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఆ కేసు ఇప్పుడు హైకోర్టుకు చేరింది. కోర్టు వాదనల సమయంలో ఆయన మరికొన్ని విస్తుగొల్పే విషయాలు తెలిపారు. తనకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని వైద్యులు చెప్పారని, అందుకే తనకు పిల్లలు కలగరని చెప్పినట్లు తిరువనంతపురం వైద్య కళాశాల ఇచ్చిన సర్టిఫికెట్ కోర్టుకు చూపించారు. చదవండి: బెడ్రూమ్లోకి వెళ్తే వద్దంటుండు: భర్తపై భార్య ఫిర్యాదు ఈ సందర్భంగా భార్యపై ఆరోపణలు చేశాడు. ‘నా భార్యకు ఆమె సోదరి భర్తతో వివాహేతర సంబంధం ఉందని, అతడి వలన నా భార్యకు కొడుకు పుట్టాడు’ అని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలోనే డీఎన్ఏ పరీక్ష చేయాలని విజ్ఞప్తి చేశాడు. అతడి వాదనలు విన్న న్యాయస్థానం డీఎన్ఏ పరీక్షకు అనుమతి ఇచ్చింది. ఈ కేసు విచారణ సాగుతోంది. మరి డీఎన్ఏ పరీక్షలో ఏం తేలుతుందో వేచి చూడాలి. -
డీఎన్ఏ వెలికితీతకు కొత్త కిట్
సాక్షి,హైదరాబాద్/రాయదుర్గం: మానవులతో పాటు జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల నుంచి డీఎన్ఏను సులువుగా వేరు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలోని అస్పైర్ బయోనెస్ట్లో పనిచేస్తున్న 30 ఎం జీనోమిక్స్ స్టార్టప్ కంపెనీ వినూత్నమైన కిట్‌ను అభివృద్ధి చేసింది. యాంప్‌రెడీ అని పిలుస్తున్న ఈ కొత్త కిట్.. ఇతర పరికరాలేవీ ఉపయోగించకుండానే 5సెకన్లలోనే డీఎన్ఏను వేరుచేయగలదు. డీఎన్ఏ ఆధారిత పరీక్షలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, అతి తక్కువ నమూనా ద్వారానే డీఎన్ఏను వెలికితీయొచ్చని 30ఎం జీనోమిక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని ప్రధాన పరిశోధన సంస్థలు యాంప్‌రెడీ పనితీరును ధ్రువీకరించాయని సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ బెన్నెట్ దాస్, పీఎస్‌కేఎన్ పావని, యశ్వంత్‌రెడ్డి తెలిపారు. చదవండి: గవర్నర్ తమిళిసైకి ఇందిరా శోభన్ లేఖ -
నాదంటే నాదే.. కుక్కకు డీఎన్ఏ టెస్ట్
భోపాల్ : భారత్‌లో డీఎన్ఏ టెస్ట్ అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే చేస్తుంటారు. వారసత్వం విషయంలో కుటుంబ పరమైన విభేదాలు వచ్చిప్పుడు అసలైన వారసుడు ఎవరో తెలుసుకోవాడనికి ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తుంటారు. అతడు నా తండ్రే కావాలంటే డీఎన్ఏ టెస్ట్ చేసుకోండి అంటూ కొందరు మీడియా ముందుకు వచ్చిన సందర్భాలనూ చూశాం. కానీ ఆశ్చర్యకరంగా ఓ పెట్‌డాగ్ (పెంపుడు కుక్కకు) డీఎన్ఏ టెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన అరుదైన కేసు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌కు చెందిన ఇద్దరి వ్యక్తుల మధ్య కుక్క విషయంపై వివాదం ఏర్పడింది. ఈ వివాదాన్ని పరిష్కరించడం కోసం చివరికి డీఎన్ఏ టెస్ట్ చేయాల్సి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసముంటున్న సాహెబ్ ఖాన్ అనే వ్యక్తి తమ కుక్క గత కొన్నిరోజులుగా కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కార్తీక్ శివ్‌హారే అనే ఏబీవీపీ నేత సైతం ఇదే తరహా ఫిర్యాదు చేశారు. ఇద్దరి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు.. కుక్క కోసం వెతకడం ప్రారంభించగా అచూకీ లభించింది. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చిపడింది. ఆ కుక్కను ఎవరికి అప్పగించాలి అనేది తలనొప్పిగా మారింది. దీనిపై ఇరు వర్గాలను పిలిపించగా.. ఆ కుక్క తమదంటే.. తమదేఅంటూ వాదించడం ప్రారంభించారు. మొదట ఫిర్యాదు చేసిన సాహెబ్ ఖాన్ ఆ కుక్క వివరాలను వెల్లడిస్తూ.. మూడు నెలల క్రితం ఆ కుక్కను ఫలానా వ్యక్తి దగ్గర కొనుగోలు చేశానని, దాని పేరు కోకోగా పెట్టుకున్నాని వివరించారు. ఆ కుక్క తల్లి వివరాలను కూడా వెల్లడించాడు. మరోవైపు కార్తీక్ కూడా ఈ కుక్క తనదేఅని గట్టిగా చెప్పారు. నాలుగు నెలల కిత్రం ఓ వ్యక్తి వద్ద కొన్నానని, దాని పేరు టైగర్ అని చెప్పారు. ఆ కుక్క తల్లి వివరాలను కూడా వెల్లడించారు. అయితే ఆ కుక్క మాత్రం కోకా అని పిలిచినా, టైగర్ అని పిలిచినా స్పందించడం పోలీసులతో పాటు ఇద్దరు యజమానులను ఆశ్యర్యానికి గురిచేసింది. ఇక చేసేదేమీ లేక.. చివరికి పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. కుక్కకు డీఎన్ఏ టెస్ట్ చేసి దాని తల్లి వివరాలు తెలుసుకుంటే అసలైన యజమాని ఎవరనేది తెలుసుకోవడం సులభమవుతుందని భావించారు. దీనిపై స్థానిక ఎస్పీ మాట్లాడుతూ. కుక్కపై తాము బాధ్యతగా ఉన్నామని, పరీక్ష అనంతరం అసలైన యజమానికి అప్పగిస్తామన్నారు. అయితే ఈ కుక్క చివరికి ఎవరికి దక్కుతుందన్న విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మరోవైపు ఈ కేసుపై జంతు హక్కుల పరిరక్షణ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూగజంతువుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని, వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం: డీఎన్ఏ పరీక్ష ఉత్తమం
అలహాబాద్ : పిల్లల పితృత్వాన్ని నిరూపించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయించటం ఒక్కటే న్యాయబద్ధమైన, శాస్త్రీయమైన మార్గమని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య వివాహేతర సంబంధాన్ని నిరూపించటానికి భర్తకు.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి వివాహేతర సంబంధం కలిగిలేనని, భర్త ఆరోపణలు అబద్ధమని తేల్చడానికి భార్యకు డీఎన్ఏ పరీక్ష ఉత్తమమైనదని పేర్కొంది. నీలం అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి వివేక్ అగర్వాల్ మంగళవారం విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, యువతీ యువకులు తమకు నచ్చిన వారితో కలిసి ఉండొచ్చని గతంలో అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పిన సంగతి తేలిసిందే. వారి జీవితాల్లో కలుగజేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. నచ్చిన వారితో కలిసి జీవించే అవకాశం యువతకు ఉందని పేర్కొంది. వేర్వేరు మతాలకు చెందిన యువతి, యువకుడు వివాహం చేసుకున్న ఘటనలో న్యాయస్థానం ఈ సంచలన తీర్పునిచ్చింది. -
రేప్ కేసుల్లో న్యాయం జరగాలంటే...
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ దళిత యువతి అత్యాచారం కేసులో బాధితురాలికి న్యాయం జరగాలంటూ కాంగ్రెస్, దళిత పార్టీలు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఏ అత్యాచారం కేసులోనైనా బాధితులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం లేదా అధికార యంత్రాంగం ప్రధానంగా మూడు చర్యలు తీసుకోవాల్సి ఉంది. మొదటిది లైంగిక దాడి సాక్ష్యాల కిట్స్‌ను అందుబాటులోకి తీసుకరావడం. రేప్ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలంటే కోర్టు ముందు నిలబడే తిరుగులేని సాక్ష్యాలను బాధితుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. వారి నుంచి వివిధ రకాల నమూనాలతోపాటు డీఎన్ఏను సేకరించి సీల్డ్ బాక్సులో నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించే ప్రత్యేకమైన కిట్లను అందుబాటులోకి తీసుకరావడం. నిర్భయ కేసును దృష్టిలో ఉంచుకొని 2014లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘సెక్సువల్ అసాల్ట్ ఫోరెన్సిక్ ఎవిడేన్స్ లేదా సేవ్’ కిట్ల ఆవశ్యకత గురించి తెలియజేస్తూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా సూచించింది. (హథ్రాస్: న్యాయం చేసే ఉద్దేశముందా?) 2019 వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం కేవలం తొమ్మిదంటే తొమ్మిది రాష్ట్రాలు మాత్రమే కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేశాయని, సేఫ్ కిట్లను సేకరించాయని తెల్సింది. 16 నిమిషాలకు ఓ అత్యాచారం జరుగుతున్న భారత్‌లో దేశవ్యాప్తంగా 3,120 సేఫ్ కిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్’వర్గాలు తెలిపాయి. ఇలాంటి కిట్లు ప్రస్తుతం అమెరికాలో లక్షల్లో ఉన్నాయి. గత ఆరు నెలల్లో ఇలాంటి కిట్ల ద్వారా సేకరించిన డీఎన్ఏ సాక్ష్యాధారాలతోనే రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులోని పలు కోర్టులు నేరస్థులకు సకాలంలో శిక్షలు విధించగలిగాయి. హథ్రాస్ దళిత యువతి రేప్ కేసులో సేఫ్ కిట్లను ఉపయోగించినట్లయితే సాక్ష్యాధారాలను తారుమారు చేశారన్న ఆరోపణలుగానీ, అనుమానాలుగానీ వ్యక్తం అయ్యేవి కావు. (రేప్ కేసుల్లో బాధితుల పేర్లు వెల్లడిస్తే..) రేప్ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలంటే పోలీసులకు, నర్సులకు, వైద్యులకు తగిన శిక్షణ అవసరం. నిర్భయ గ్యాంగ్ రేప్ నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోకి 357 సీ సెక్షన్ ప్రకారం రేప్ బాధితులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా వైద్య చికిత్సను అందించాలి. దీనికి సంబంధించి 2014లో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం, ప్రైవేటు అనే తేడా లేకుండా వైద్యులు, నర్సులు రేప్ బాధితులు మానసిక ఒత్తిడికి గురికాకుండా అండగా ఉండాలి. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా బాధితులకు సేఫ్ కిట్లతో పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను భద్రంగా ఉంచాలి. రేప్ కేసుల్లో సాక్ష్యాధారాల సేకరణకు మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది కనుక వైద్య సిబ్బందికి ఎంతో క్రమశిక్షణ అవసరం. అత్యాచార కేసుల్లో బాధితులు మరణించిన పక్షంలో వారి మత దేహాలను కొంతకాలం పాటు భద్రపర్చాలి. అనుమానాలు వ్యక్తం అయిన సందర్భాల్లో మరోసారి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించేందుకు వీలుంటుంది. మతదేహాన్ని దహనం చేయకుండా పూడ్చి పెట్టినట్లయితే సాక్ష్యాధారాలను సేకరించేందుకు వీలుంటుంది. భారత్‌లాంటి దేశంలో మెజారిటీ సామాజిక వర్గాల ప్రజలు దహన సంస్కారాలే చేస్తారు. (హత్రాస్ ఉదంతం.. ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు) హథ్రాస్ రేప్ కేసులో బాధితురాలు మంగళవారం ఉదయం మరణించగా, ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు ఆమె మతదేహాన్ని దహనం చేయడం తెల్సిందే. ఆ మరుసటి రోజే బాధితురాలిపై అత్యాచారం జరగలేదంటూ పోలీసులు ఫోరెన్సిక్ నివేదికను బయట పెట్టారు. దానిపై సర్వత్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోసారి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించేందుకు బాధితురాలి మృతదేహం లేకుండా పోయింది. ఈ విషయంలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టం ముందు దోషులను నిరూపించేందుకు పోలీసులకు కూడా తగిన శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. -
కూతురు కోసం ఓ తల్లి ఆరాటం
సాక్షి, మచిలీపట్నం: తప్పిపోయిన కూతురు పదేళ్ల తర్వాత ప్రత్యక్షమవడంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. పేగు తెంచుకు పుట్టిన కన్న కూతుర్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఆ తల్లి ఆరాటపడుతోంది. కూలి పని చేసుకుని పెంచుకుంటా కుమార్తెను అప్పగించండంటూ ఉన్నతాధికారులను వేడుకుంటోంది. సంబంధిత వివరాలు ఇలా ఉన్నాయి... కృష్ణా జిల్లా తిరువూరు భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గాయం నాగమణికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పదేళ్ల క్రితం ఆమెతో భర్త గొడవపడి ఇద్దరు కుమార్తెలను, ఓ కుమారుడుని తీసుకుని ఇంటి నుంచి వెళ్లి పోయాడు. మద్యానికి బానిసైన భర్త కన్నబిడ్డలను వదిలేయడంతో వారిలో ఇద్దరు తల్లి వద్దకు చేరుకున్నారు. తప్పిపోయిన బాలిక అమూల్య కోసం ఆ తల్లి గాలించినా ఫలితం లేకుండా పోయింది. కాగా, ఐదేళ్ల అమూల్యను ఓ మహిళ చేరదీసి చేవూరి కృష్ణవేణి పేరుతో మచిలీపట్నంలోని బాలసదన్‌లో చేర్పించింది. అక్కడ ఏడో తరగతి వరకు చదివిన అమూల్య ప్రస్తుతం ఎ.కొండూరులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీవీబీ)లో 8వ తరగతి చదువుతోంది. కోవిడ్ నేపథ్యంలో కేజీవీబీ మూసివేయగా.. రాజ్యలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు ఆశ్రయం ఇచ్చారు. తన కుటుంబ వివరాలు చెప్పడంతో ఆ ఉపాధ్యాయురాలు అమూల్యను వెంటబెట్టుకుని తిరువూరులో గాలించారు. చివరకు తల్లి ఆచూకీ తెలిసింది. తన బిడ్డను అప్పగించమని కేజీబీవీ అధికారిని ఆ తల్లి వేడుకోగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీని సంప్రదించాలని సూచించారు. డీఎన్ఏ పరీక్షలో నిర్ధారిస్తేనే.. ఐసీడీఎస్ అధికారులు, తహసీల్దార్ అమూల్యగా నిర్ధారిస్తూ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. అయితే డీఎన్ఏ పరీక్ష చేస్తే కానీ అమూల్యను నాగమణి కుమార్తెగా నిర్ధారించలేమని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చెప్పింది. దీంతో ఆ తల్లి కన్న కూతురు కోసం అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తన కుమార్తెను అప్పగించాలని వేడుకుంటోంది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ‘స్పందన’లో వినతిపత్రం సమర్పించింది. గుర్తిస్తే అప్పగించవచ్చు ఐదేళ్ల ప్రాయంలో తప్పిపోయిన పిల్లలకు కొంతమేర తల్లిదండ్రులను గుర్తించే జ్ఞాపకశక్తి ఉంటుంది. ఇటువంటి కేసుల్లో తల్లిదండ్రులను గుర్తిస్తే బంధువులు, చుట్టుపక్కల వారిని విచారించి వాస్తవమైతే లిఖిత పూర్వకంగా అంగీకారం తీసుకుని అప్పగించవచ్చు. భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తే డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవచ్చు. – డి.ఆంజనేయరెడ్డి, డైరెక్టర్, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ -
‘అత్యాచార ఆరోపణలన్నీ కాంగ్రెస్ పుణ్యమే’
డెహ్రాడూన్: కాంగ్రెస్ నేతల కుట్రల వల్లే తనపై అత్యాచార ఆరోపణలు వచ్చాయని ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగి తెలిపారు. కాంగ్రెస్ కుయుక్తులకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బన్సిందర్ భగత్‌కు చెప్పారు. ఆరోపణలపై ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమని ఎమ్మెల్యే వెల్లడించారు. వివాదాల్లో చిక్కుకున్న మరో ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యే నేగిని పార్టీ అధ్యక్షుడు బన్సిందర్ భగత్ సోమవారం పిలిపించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన వాదనలు బయటికొచ్చాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. కేసు పోలీసుల విచారణలో ఉందని, అది పూర్తయిన తర్వాత దోషిగా తేలితే క్రమశిక్షణ చర్యలు తప్పవని బన్సిందర్ భగత్ ఈ సందర్భంగా స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక ఎమ్మెల్యే నేగి అకృత్యంపై కేసు నమోదైనా కూడా ఇంతవరకూ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతమ్‌సింగ్ విమర్శించారు. డీఎన్ఏ పరీక్షలు చేయించండని బాధితురాలు చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నిష్పాక్షిత దర్యాప్తునకు సిద్ధమని చెప్పిన సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారు. హోంమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి సీఎం మర్చిపోయారా అని చురకలంటించారు. (చదవండి: పోలీసులకు తలనొప్పిగా మారిన కేసు..) కాగా, ఎమ్మెల్యే నేగి తనపై అత్యాచారం చేశాడని డెహ్రాడూన్ కు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 2016 నుంచి 2018 మధ్య ఎమ్మెల్యే తనను లైంగికంగా లొంగదీసుకున్నాడని, పెళ్లి తరువాత కూడా తనపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఆయన కారణంగా తనతో భర్త తెగదెంపులు చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే సాన్నిహిత్యంతో తను ఈ ఏడాది మే 18న ఒక బిడ్డకు జన్మనిచ్చానని మహిళ తెలిపారు. నిజానిజాలను తెలుసుకునేందుకు తన బిడ్డకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంపై నోరువిప్పకుండా ఉండేందుకు ఎమ్మెల్యే భార్య గతంలో తనకు 25లక్షలు రూపాయలు ఆఫర్ చేశారని కూడా ఆమె ఆరోపించారు. (చదవండి: నా బిడ్డకు తండ్రి : చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే) -
నా బిడ్డకు తండ్రి : చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే
డెహ్రాడూన్: బీజేపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు ఉత్తరాఖండ్ రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి. లైంగికంగా లొంగదీసుకొన్నాడంటూ ద్వారహత్ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగిపై ఓ వివాహిత మహిళ కేసు నమోదు చేయడం కలకలం రేపింది. తన భర్తపై అత్యాచారం కేసు పేరుతో తప్పుడు ఫిర్యాదు చేస్తామని బెదిరించిందనీ, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందనీ ఎమ్మెల్యే భార్య రీటా నేగి పోలీసులకు ఫిర్యాదు చేసిన రెండు రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. తనపై పలుమార్లు అత్యాచారం చేశారంటూ డెహ్రాడూన్ కు చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పొరుగున ఉండే తాను 2016లో తన తల్లి అనారోగ్యానికి సంబంధించి తొలిసారి అతణ్ని కలిశానని చెప్పారు. ఈ నేపథ్యంలో 2016 - 2018 మధ్య తనను లైంగికంగా లొంగదీసుకున్నాడని, తన పెళ్లి తరువాత కూడా తనపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. చివరకు భర్త దగ్గరకు వెళ్లొద్దని ఆదేశించాడని, ఆయన ఒత్తిడి కారణంగానే తన అత్తమామలు,భర్తపై తప్పుడు కేసులు పెట్టానని చెప్పారు. దీంతో విషయాన్ని భర్తకు వివరించడంతో అతను తనతో తెగదెంపులు చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. ఫలితంగా తను ఈ ఏడాది మే18న ఒక బిడ్డకు జన్మనిచ్చానని తెలిపారు. నిజానిజాలను తెలుసుకునేందుకు తన బిడ్డకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంపై నోరువిప్పకుండా ఉండేందుకు ఎమ్మెల్యే భార్య గతంలో తనకు 25లక్షలు రూపాయలు ఆఫర్ చేశారని కూడా ఆమె ఆరోపించారు. అటు తన భర్త రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని, తన కొడుకును చంపేస్తానంటూ బెదిరించిందని నేగి భార్య ఆరోపించారు. ఈ ఫిర్యాదులను ధృవీకరించిన డెహ్రాడూన్ డీఐజీ అశోక్ కుమార్ బ్లాక్ మెయిల్ ఆరోపణలపై మహిళ, తల్లి తదితరులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ రెండు కేసులపై దర్యాప్తు జరుగుతోందన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను నిరాధారమైనవంటూ ఎమ్మెల్యే కొట్టిపారేశారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించి, రాజకీయ నాయకులుగా మారడానికి ఒక ముఠా పనిచేస్తోందని ఆరోపించారు. త్వరలోనే నిజాలు బహిర్గతమవుతాయన్నారు. పోలీసుల దర్యాప్తు ఫలితాల ఆధారంగా పార్టీ చర్యలు తీసుకుంటుందని ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు బన్సిధర్ భగత్ ప్రకటించారు. దీనిపై రెండేళ్ల తర్వాత ఆ మహిళ ఎందుకు ఫిర్యాదు చేసిందనేది కూడా తేలాల్సి ఉందన్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ మండిపడుతున్నారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. -
దెబ్బతిన్న డీఎన్ఏపై పరిశోధనలు
సాక్షి, సంగారెడ్డి: దెబ్బతిన్న లేదా పాడైన డీఎన్ఏను సరిచేసే (మరమ్మతు) ప్రొటీన్ పనివిధానాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) పరిశోధకులు ఆవిష్కరించారు. ఈ అధ్యయన ఫలితాలు పీర్–రివ్యూ జర్నల్ ‘న్యూక్లియిక్ యాసిడ్ రీసెర్చ్’లో ప్రచురితమైనట్లు ఐఐటీహెచ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గువాహటి ఐఐటీ బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ అరుణ్‌గోయెల్ సహకారంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. జర్నల్‌లో వచ్చిన డాక్యుమెంట్‌ను అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనింద్యారాయ్, డాక్టర్ అరుణ్‌గోయెల్, మోనిషామోహన్, ఆకుల దీప, అరుణ్ థిల్లాన్‌లు సంయుక్తంగా రచించినట్లు తెలిపారు. శరీరంలో సహజంగా ఉత్పత్తయ్యే కొన్ని రకాల రసాయనాలు డీఎన్ఏకు నష్టాన్ని కలిగిస్తాయని డాక్టర్ అనింద్యారాయ్ వివరించారు. ఈ సమస్యకు సత్వరం చికిత్స చేయకపోతే మరణం వరకు దారితీస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దెబ్బతిన్న డీఎన్ఏకు చికిత్స చేయడానికి పరిశోధనలు చేపట్టినట్లు వివరించారు. ఈ పరిశోధనలకు భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, సైన్స్ అండ్ రీసెర్చ్ ఇంజనీరింగ్ బోర్డు (ఎస్ఈఆర్బీ) నిధులను సమకూరుస్తున్నట్లు తెలిపారు. డీఎన్ఏకి ఏదైనా నష్టం జరిగితే కేన్సర్ వంటి వ్యాధులకు ఈ మార్పులు దారితీస్తాయన్నారు. -
సుఖాంతమైన భవానీ కథ!
సాక్షి, విజయవాడ : నాలుగేళ్ల వయసులో తప్పిపోయిన భవానీ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. 13 ఏళ్ల తర్వాత కన్నతల్లిదండ్రుల చెంతకు భవానీ చేరింది. ఆదివారం మీడియా సమక్షంలో పెంచిన తల్లిదండ్రులు భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా భవానీ మాట్లాడుతూ తనకూ ఇద్దరూ తల్లులు ఇష్టమేనని, పదిరోజులు పెంచిన అమ్మ దగ్గర ఉంటే, మరో పది రోజులు కన్న తల్లి వద్ద ఉంటానని తెలిపింది. తనకు ఇప్పటివరకు కన్ఫ్యూజన్ ఉండేదని, ఇకనుంచి ఇద్దరి వద్ద ఉంటానని చెప్పింది. ప్రస్తుతానికి కన్న తల్లి వద్దకు వెళుతున్నట్టు తెలిపింది. కన్నవాళ్ళ వద్దకు వెళుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. భవానీ కనిపించడం సంతోషంగా ఉందని కన్నతల్లి తెలిపారు. తనను ఇన్నాళ్లు పెంచినందుకు జయమ్మ-జీవరత్నం దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. కన్నబిడ్డలా పెంచాం! భవానీని కన్నబిడ్డలా పెంచాం కానీ, ఆమె కన్న తల్లి వద్దకే వెళతానని చెబుతోందని పెంచిన తల్లి జయమ్మ తెలిపారు. ఆమె వెళుతున్నందుకు బాధగా ఉందన్నారు. అయినా పది రోజులకోసారి వస్తననడం సంతోషం కలిగిస్తోందన్నారు. పాప భద్రత కోసమే తాము డీఎన్ఏ టెస్ట్ కోరినట్టు తెలిపారు. పాప సంతోషమే తమకు ముఖ్యమన్నారు. భవానీ తమ కూతురని మళ్లీ వస్తారేమోనని టెన్షన్‌గా ఉందని, పాపను బాగా చూసుకోవాలని కోరుతున్నామని పెంచిన తండ్రి జీవరత్నం తెలిపారు. 13 ఏళ్ల క్రితం తప్పిపోయింది! నాలుగేళ్ల వయసులో తప్పిపోయి అమ్మానాన్నలకు దూరమైంది భవానీ. అయినా చిన్ననాటి జ్ఞాపకాలను పదిలపర్చుకుని.. పదమూడేళ్ల తర్వాత వారి జాడ తెలుసుకుంది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన కోడిపెంట్ల మాధవరావు, వరలక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. వారు 2006 నవంబర్‌లో ముగ్గురు బిడ్డల్ని ఇంటివద్దే ఉంచి కూలి పనులకు వెళ్లారు. వారి కుమార్తె భవానీ తన అన్నయ్యలు సంతోష్, గోపీతో ఆడుకుంటూ తప్పిపోయింది. రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్న భవానీని జయరాణి (జయమ్మ) అనే మహిళ చేరదీసి ఆమె తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల వాకబు చేసింది. ఫలితం లేకపోవడంతో అప్పట్లోనే సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. భవానీ సంబంధీకులు వచ్చేవరకు ఆమెను తానే సాకేందుకు ముందుకొచ్చింది. భవానీని పెంచి ఇంటర్మీడియెట్ వరకు చదివించింది. భవానీకి ప్రస్తుతం 17 ఏళ్లు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జయరాణి (జయమ్మ) గతంలో హైదరాబాద్‌లో ఉంటూ అక్కడి ఇళ్లల్లో పని చేస్తుండేది. కొంతకాలం క్రితం కుటుంబ సభ్యులు, భవానీతో కలిసి విజయవాడ వచ్చి ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తాను పని చేస్తున్న ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని వంశీ, భార్య కృష్ణకుమారి వద్దకు భవానీని తీసుకెళ్లింది. భవానీ వివరాలను ఇంటి యజమాని వంశీ ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పింది. ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. శనివారం ఆ పోస్ట్‌ను చూసిన భవానీ అన్న.. వంశీకి వీడియో కాల్ చేశాడు. డీఎన్ఏ టెస్ట్.. ట్విస్ట్! అయితే, భవానీని తల్లిదండ్రుల వద్దకు పంపించేందుకు పెంచిన తల్లిదండ్రులు జయమ్మ-జీవరత్నం అభ్యంతరం తెలిపారు. వచ్చినవారు అసలైన తల్లిదండ్రులని నిర్ధారణ కావాలని.. అప్పుడే తనను వారి వద్దకు పంపుతామని జయమ్మ చెప్పారు. అందుకోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. భవానీ అభీష్టంతోనే తల్లిదండ్రుల వద్దకు పంపిస్తామని వెల్లడించారు. భవానీని అప్పగించే విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. పోలీసుల సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. వచ్చినవారే నిజమైన తల్లిదండ్రులని నిర్ధారణ అయ్యాకే అప్పగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు భవానీ మాత్రం తన తల్లిదండ్రుల వద్దకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇందుకోసం ఏ పరీక్షలకైనా సిద్ధమేనని వెల్లడించారు. దీంతో ఈ వివాదం పటమట పోలీస్ స్టేషన్‌కు చేరింది. దీంతో పోలీసులు ఓ వైపు కన్న తల్లిదండ్రులు, మరోవైపు పెంచిన తల్లిదండ్రుల సమక్షంలో వివాదాన్ని పోలీసులు పరిష్కరించారు. -
భవానీని అప్పగించడంలో ట్విస్ట్..
సాక్షి, విజయవాడ : నాలుగేళ్ల వయసులో తప్పిపోయిన భవానీని తల్లిదండ్రులకు అప్పగించడంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. భవానీని తల్లిదండ్రుల వద్దకు పంపించేందుకు పెంచిన తల్లిదండ్రులు జయమ్మ-జీవరత్నం అభ్యంతరం తెలిపారు. వచ్చినవారు అసలైన తల్లిదండ్రులని నిర్ధారణ కావాలని.. అప్పుడే తనను వారి వద్దకు పంపుతామని జయమ్మ చెప్పారు. అందుకోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. భవానీ అభీష్టంతోనే తల్లిదండ్రుల వద్దకు పంపిస్తామని వెల్లడించారు. భవానీని అప్పగించే విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. పోలీసుల సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. వచ్చినవారే నిజమైన తల్లిదండ్రులని నిర్ధారణ అయ్యాకే అప్పగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు భవానీ మాత్రం తన తల్లిదండ్రుల వద్దకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇందుకోసం ఏ పరీక్షలకైనా సిద్ధమేనని వెల్లడించారు. అప్పుడప్పుడు జయమ్మ వద్దకు కూడా వస్తానని చెప్పారు. కాగా, వంశీ, కృష్ణకుమారి దంపతుల ఇంట్లో భవానీని పనిలో పెట్టాలనే ఉద్దేశంలో జయమ్మ ఆమెను వారివద్దకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఇంటి యజమాని వంశీ.. భవానీ వివరాలను ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పారు. ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. శనివారం ఆ పోస్ట్‌ను చూసిన భవానీ అన్న.. వంశీని సంప్రదించాడు. 13 ఏళ్ల తరువాత తమ బిడ్డ ఆచూకీ తెలిసి భవానీ తల్లిదండ్రులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. పడమట పోలీస్ స్టేషన్‌కు చేరిన భవానీ వివాదం.. భవానీని అప్పగించడానికి పెంచిన తల్లిదండ్రులు జయమ్మ-జీవరత్నం అభ్యంతరం తెలుపడంతో ఈ వివాదం పటమట పోలీస్ స్టేషన్‌కు చేరింది. దీంతో పోలీసులు ఓ వైపు కన్న తల్లిదండ్రులు, మరోవైపు పెంచిన తల్లిదండ్రుల సమక్షంలో వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తాము డీఎన్ఏ పరీక్షలకు సిద్ధంగా ఉన్నట్టు భవానీ సోదరుడు గోపి తెలిపారు. చదవండి : కన్నవారిని కలిపిన ఫేస్బుక్ -
‘అన్ని రోడ్లు రోమ్’కే వెళ్లాయి!
‘ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ (అన్ని రోడ్లు రోమ్‌కే వెళతాయి)’ అన్న నానుడి చారిత్రకంగా అక్షర సత్యమని తేలింది. ఇటలీ రాజధాని రోమ్ నగర పరిసరాల్లోని 29 చోట్ల పురాతత్వ శాస్త్రజ్ఞుల తవ్వకాల్లో బయట పడిన 12వేల సంవత్సరాల క్రితం నాటి 127 మంది మానవుల చెవి భాగాలపై డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆశ్చర్యకరమైన అంశాలు బయట పడ్డాయి. అప్పటికే రోమ్ నగరానికి గ్రీకులు, సిరియన్లతోపాటు లెబనాన్ దేశస్థులు వలసవచ్చారని తేలింది. 127 మానవుల చెవుల్లో ఈ మూడు దేశాల ప్రజల డీఎన్ఏలు బయటపడ్డాయి. రోమ్ నగరం విశిష్టతకు సంబంధించి ఇప్పటికే ఆర్కియాలోజీ, చారిత్రక నివేదికలెన్నో తెలియజేస్తున్నాయి. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఈ విషయాలను ధ్రువీకరించడం పెద్దగా జరగలేదు. ఆ దిశగా ఇది ముందడుగు అని చెప్పవచ్చు. పాశ్చాత్య యూరప్ సామ్రాజ్యం పతనమయ్యాక నాలుగో శతాబ్దంలో గ్రీస్, సిరియా, లెబనాన్ నుంచి రోమ్ నగరానికి భారీగా వలసలు పెరిగాయని స్టాన్ఫోర్డ్, ఇటాలియన్ యూనివర్శిటీలకు చెందిన పరిశోధకులు తెలిపారు. -
బిడ్డల తారుమారు.. తల్లుల కన్నీరు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తల్లులమైనందుకు సంబరపడాలో, బిడ్డలు తారుమారైనట్లు చెలరేగిన వివాదంతో దిగాలుపడాలో తెలియని పరిస్థితి వారిది. కేవలం వారం రోజుల క్రితమే పురుడుపోసుకున్న తల్లులు తారుమారైనట్లు చెప్పబడుతున్న తమ బిడ్డలతో తంటాలు పడుతున్న చిత్రమైన ఉదంతం తమిళనాడులో చోటుచేసుకుంది. తిరుచ్చిరాపల్లి జిల్లాలోని భెల్ బాయిలర్ కర్మాగారంలో పనిచేసే కార్మికుల కోసం ప్రాంగణంలోనే ఒక ఆస్పత్రి ఉంది. భెల్ ఉద్యోగి వినోద్ భార్య అఖిల ఈనెల 11న మగబిడ్డకు జన్మనిచ్చింది. అఖిల తన బిడ్డతో ఆస్పత్రి ప్రసవహాలు 8వ నంబరు మంచంపై ఉండేవారు. అలాగే బాలకుమార్ అనే మరో ఉద్యోగి భార్య సంగీత సైతం ఈనెల 12న మగబిడ్డను ప్రసవించింది. సంగీతకు అదే హాలులో 12వ నంబరు మంచాన్ని కేటాయించారు. శుక్రవారం ఉదయం తల్లులిద్దరూ నిద్రపోతుండగా ఆస్పత్రి సిబ్బంది వారిద్దరి బిడ్డలను స్నానం చేయించేందుకు తీసుకెళ్లి మరలా అవే మంచాలపై పడుకొబెట్టి వెళ్లిపోయారు. నిద్రనుంచి మేల్కొన్న తల్లులు తమ బిడ్డలకు చనుబాలు ఇవ్వబోగా అఖిల పక్కన పడుకుని ఉన్న బిడ్డ పాలుతాగలేదు. దీంతో అనుమానం వచ్చిన అఖిల ఇది తన బిడ్డ కాదని కేకలు వేస్తూ బిడ్డ మారిపోయిందని బిగ్గరగా రోదించింది. తనకు జన్మించిన బిడ్డ సంగీత వద్ద ఉందని ఆస్పత్రి సిబ్బందికి తెలిపారు. అయితే సంగీత ఆమె ఆరోపణలను ఖండిస్తూ ఇది తన బిడ్డేనని వాదించారు. ఈ వివాదం ముదరడంతో ఆస్పత్రి ప్రధానవైద్యులు, భెల్ బాయిలర్ కర్మాగారం ప్రధానాధికారి విచారణ జరిపారు. ఇద్దరి బిడ్డల రక్తాన్ని, బరువును పరిశీలించారు. అయితే ఇద్దరు బిడ్డల రక్తం ఓ పాజిటివ్, 2.95 కిలోల బరువు సమానంగా ఉండడంతో మరింత చిక్కు సమస్యగా మారింది. ఇలా లాభం లేదనుకుని డీఎన్ఏ పరీక్ష చేయించి ఎవరి బిడ్డలో తేల్చాలని నిర్ణయించారు. ఇద్దరు బిడ్డల బొడ్డుతాడు, రక్తం నమూనాలను సేకరించి డీఎన్ఏ పరీక్షకు పంపారు. ఫలితాలు రావడానికి మూడువారాలు పడుతుందని, ఆ తరువాతనే ఎవరి బిడ్డ ఎవరో తేలుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
షాకింగ్ : అమ్మాయి శవంలో అబ్బాయి డీఎన్ఏ
లాహోర్ : సాధారణంగా ప్రతీ ఒక్కరి శరీరంలో జన్యు కణాలను గుర్తించేందుకు డీఎన్ఏ ప్రముఖ పాత్ర పోషిస్తాయన్న సంగతి మనందరికి తెలిసిందే. కానీ పాకిస్తాన్లో మాత్రం వింత ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన యువతి మృతదేహంలో యువకుడికి సంబంధించిన డీఎన్ఏ కణాలను గుర్తించినట్లు పాకిస్తానీ ఇన్వెస్టిగేషన్ టీమ్ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని లర్ఖానా జిల్లాలోని బీబీ ఆసిఫా డెంటల్ కాలేజీలో నిమృత కుమారి ఫైనల్ ఇయర్ చదువుతుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే నిమృత ఈ ఏడాది సెప్టెంబర్ 16న తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. డీఎన్ఏ పరీక్షల కోసం సెప్టెంబర్ 17న నిమృతా మృతదేహం, ఆమె వేసుకున్న బట్టలపై పడిన రక్త నమూనాను జంషోరూ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. పరీక్షల నిర్వహణ సమయంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడినట్లు పోలీస్ అధికారి మసూద్ బంగాశ్ వెల్లడించారు. 'నిమృతా దేహం నుంచి సేకరించిన రక్త నమూనాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాము. అయితే ఆ నివేదికలో మాత్రం అబ్బాయికి సంబంధించిన డీఎన్ఏ వివరాలు రావడం మమ్మల్ని ఆశ్చర్యపరిచిందని' మసూద్ తెలిపారు. ఇన్నాళ్లు మేం నిమృతా ఆత్మహత్య చేసుకుందన్న కోణంలో భావించాము. కానీ ఎప్పుడైతే డీఎన్ఏలో వేరొకరికి సంబంధించిన వివరాలు రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగిందని ఆయన పేర్కొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న నిమృత కుటుంబసభ్యులు ఆమెని ఎవరో హత్య చేశారని ఆరోపణలతో సింద్ హైకోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించిన సింధ్ న్యాయస్థానం... నిమృత కేసులో జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. నిమృతది హత్యా? ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా సెప్టెంబర్‌లో కాలేజ్‌లో హిందూ, మైనారిటీకి సంబంధించి ప్రిన్సిపాల్‌తో జరిగిన గొడవలో నిమృత ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి 32 మందితో పాటు మృతురాలి కాల్‌డేటా ఆధారంగా తోటి విద్యార్థులైన మెహ్రాన్ అబ్రో, అలీ షాన్ మెమన్లను అనుమానితులుగా భావించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విషయమై కాలేజీలో విచారించగా నిమృత తన హాస్టల్ గదిలోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఇదే విషయమై నిమృతా సోదరుడు విశాల్ స్పందిస్తూ.. నా సోదరిది ముమ్మాటికి హత్యేనని, ఆమె మెడకు కేబుల్ వైర్‌తో బిగించిన గుర్తులు ఉన్నాయని, అంతేగాక ఆమె చేతులను ఎవరో బలవంతంగా పట్టుకున్న గుర్తులు కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే పోలీసులు మాత్రం మెహ్రన్ అబ్రో, నిమృతాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, శారీరకంగా కూడా దగ్గరయ్యారని చెబుతున్నారు. నిమృతా పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అబ్రో ఈ అఘాయిత్యానికి ఏమైనా ఒడిగట్టాడా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. Young Medical student Nimirta Kumari's dead body found in Chandika medical college hostel larkana, Further couldn't get Reasons behind it .... She was final year student RIP... pic.twitter.com/WSrOJlhF8D — Sanjay Soni (@sanjaysindhi65) September 16, 2019 -
సుజాత కేసులో కానిస్టేబుల్‌కు డీఎన్ఏ పరీక్ష!
వైఎస్ఆర్ జిల్లా,రాజంపేట: గత ఏడాది డిసెంబరు 26న రాజంపేట పట్టణంలో సంచలనం రేపిన వివాహిత సుజాత హత్యోదంతంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మిస్టరీని చేధించేందుకు పోలీసులు తమదైన రీతిలో దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ అన్బురాజన్ పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ఆధ్వర్యంలో సుజాత హత్య కేసులో పురోగతి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతురాలి వీర్యం శాంపిల్స్, బ్లడ్‌శాంపిల్స్ రిపోర్టుతోపాటు కానిస్టేబుల్ డీఎన్ఏ రిపోర్టు వచ్చిన తర్వాత హత్యకేసు మిస్టరీ వీడే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. హత్య జరిగిన తీరు ఇలా.. రాజంపేట పట్టణం నడిబొడ్డున నూని వారిపల్లెరోడ్డులోని నలందా స్కూలు వీధిలో శ్రీనివాసులరెడ్డి, సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త జీవనోపాధి కోసం గల్ఫ్‌దేశానికి వెళ్లారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సుజాత పట్టణంలోనే ఒంటరిగా జీవనం సాగించేది. ఈ నేపథ్యంలో సుజాత హత్యచారం ఘటన సంచలనం రేపింది. సుజాత హత్య కేసులో ప్రధానంగా కిరణ్ అనే కానిస్టేబుల్‌కు డీఎన్ఏ పరీక్షలు చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. మృతిచెందిన సుజాతతో ఆర్థిక వ్యవహారాలు సాగిస్తున్న కానిస్టేబుల్ ఆమెతో సన్నిహితంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ కిరణ్ రక్తాన్ని డీఎన్ఏ పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపారు. ఈ విషయాన్ని డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ధ్రువీకరించారు. -
సెలవు కావాలి.. డీఎన్ఏ టెస్ట్ చేపించు
టోక్యో: ‘పెటర్నటి లీవ్’(పితృత్వ సెలవు) అడిగినందుకు తనను అవమానించడమే కాక.. డీఎన్ఏ టెస్ట్ రిపోర్టు సమర్పించాల్సిందిగా ఆదేశించారంటూ 2015లో ఓ వ్యక్తి కోర్టులో వేసిన కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే అత్యల్ప బర్త్ రేట్‌తో సతమతమవుతోన్న జపాన్ తాజా వివాదంతో ఒక్కసారి ఉల్కిపడింది. 2015లో జరిగిన ఈ కేసు వివరాలు.. కెనడాకు చెందిన గ్లేన్ వుడ్(49) గత ముప్పై ఏళ్లుగా జపాన్‌లో నివాసం ఉంటూ అక్కడే పని చేస్తున్నాడు. అప్పుడు అతని భార్య నేపాల్‌లో ఉద్యోగం చేస్తుంది. అప్పటికే ఆమె గర్భవతి. డెలీవరి సమయానికి భార్య దగ్గర ఉండాలనే ఉద్దేశంతో వుడ్ పెటర్నటి లీవ్‌కు దరఖాస్తు చేశాడు. అయితే సదరు కంపెనీ అతడికి సెలవు మంజూరు చేయకుండా.. పుట్టిన బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేపించి, వుడ్డే ఆ బిడ్డకు తండ్రని నిరూపిస్తేనే సెలవు ఇస్తామని తెలిపింది. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో వుడ్ నేపాల్‌లో ఉన్న తన బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేపించి.. ఆ రిపోర్ట్స్‌ను తన కంపెనీలో సమర్పించాడు. ఆ తర్వాతే అతడికి సెలవు లభించింది. ఆ తర్వాత ఆరోగ్యం బాగాలేకపోవడంతో వుడ్ మెడికల్ లీవ్ తీసుకున్నాడు. అయితే కంపెనీ అతడికి జీతం చెల్లించకపోవడమే కాక.. ఉద్యోగంలో నుంచి తొలగించింది. దాంతో కంపెనీ తీరును ఎండగడుతూ.. కోర్టులో కేసు వేశాడు వుడ్. దీని గురించి అతడు మాట్లాడుతూ.. ‘ఇది కంపెనీ పాత పద్దతనుకుంటా. అయితే ఇక్కడ నాకు ఇప్పటికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. డీఎన్ఏ రిపోర్టు సమర్పించే వరకు కంపెనీ నాకు పెటర్నటి లీవ్ ఇవ్వలేదు. నెలలు నిండకుండానే నా కుమారుడు జన్మించడంతో.. తనని ఐసీయూలో పెట్టాల్సి వచ్చింది. వీటన్నింటిని నా భార్య ఒక్కతే చూసుకుంది. ఆ సమయంలో తను చాలా ఇబ్బంది పడింది. క్రిస్టమస్ తర్వాతే నాకు లీవ్ దొరికింది’ అన్నాడు వుడ్. ‘ఆ తర్వాత 2016, మార్చిలో నా కుమారుడ్ని తీసుకుని జపాన్ వచ్చేశాను. కానీ పని ఒత్తిడి వల్ల నా ఆరోగ్యం చెడిపోయింది. దాంతో ఆరు నెలల పాటు మెడికల్ లీవ్ తీసుకున్నాను. తర్వాత విధుల్లో చేరాను. కానీ కంపెనీ నాకు ఆరు నెలల వేతనాన్ని చెల్లించలేదు. అంతేకాక నన్ను ఉద్యోగం నుంచి కూడా తొలగించారు. ఈ అంశంలో నాకు న్యాయం జరగడం కోసం కోర్టును ఆశ్రయించాను’ అని తెలిపాడు వుడ్. జపాన్ చట్టం ప్రకారం అక్కడి కంపెనీలు బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇద్దరికి ఏడాది పాటు సెలవు ఇవ్వాలి. అదికాక మరో ఆరు నెలల సెలవును కూడా అదనంగా మంజూరు చేయాలి. అయితే జపాన్‌లో పెటర్నటి సెలవు తీసుకునే వారి పురుషుల సంఖ్య చాలా తక్కువని నివేదికలు వెల్లడిస్తున్నాయి. -
ఇక ‘డీఎన్ఏ’ ఆధారిత డైట్
సాక్షి, న్యూఢిల్లీ : ‘మందులు మనకు ఆహారం కారాదు. ఆహారమే మనకు మందు కావాలి’ ఇది మనకు ఆధునిక ఆరోగ్య సూత్రం. అవి, ఇవి అనకుండా అడ్డమైన గడ్డి తిని లేని రోగాలు తెచ్చుకొని మందులు తింటూ బాధ పడేకన్నా.. ఏ మందులు అవసరం లేని, ఏ రోగాలు దరిచేరని మనకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆచితూచి తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పది కాలాలపాటు హాయిగా జీవించొచ్చట. అందుకేనేమో కియో డైట్, వీరమాచినేని డైట్ అంటూ మార్కెట్లో ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు వీటికి భిన్నంగా పూర్తి శాస్త్ర విఙ్ఞానపరంగా మరో డైట్ అమల్లోకి వస్తోంది. అదే ‘పర్సనల్ న్యూట్రిషన్ డైట్ (వ్యక్తిగత పోషకాల ఆహారం)’. మన డీఎన్ఏను విశ్లేషించి జన్యుపరంగా సంక్రమించే జబ్బులేవో అంచనా వేసి, ఆ జబ్బులు రాకుండా నివారించ గలిగిన ఆహారం తీసుకోవడమే ఆ డైట్. ఈ డైట్‌ను ఆలోపతి వైద్యులే నిర్ణయిస్తారు. ఇప్పుడు ఈ పద్ధతి నార్వేలో ఊపందుకుంది. అక్కడకుగానీ, భారత్‌లోని డీఎన్ఏ సెంటర్లకుగానీ మన లాలాజలం తీసి పంపిస్తే చాలు మన డీఎన్ఏ జన్యుక్రమాన్ని విశ్లేషించి నివేదిక పంపిస్తారు. వచ్చే అవకాశం ఉన్న జబ్బులు గురించి కూడా విశ్లేషిస్తారు. ఉదాహరణకు ‘కార్డియో వాస్కులర్ డిసీసెస్’ వచ్చే అవకాశం ఉందంటే, మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ కన్నా చెడు కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్ కన్నా ఎల్డీఎల్) ఎక్కువ ఉన్నట్లయితే మాంసాహారానికి గుడ్‌బై చెప్పి సాత్విక ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. చేపలు పుష్కలంగా తినొచ్చు. ‘ఫుడ్ ఫర్ మీ రీసర్చ్ ప్రాజెక్ట్’ కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఆహార పోషకాలను నిర్ధారించుకోవాలి. అందుకోసం అవసరమైతే డైటీషియన్ దగ్గరకు వెళ్లాలి. మానవ శరీరంలో దాదాపు ఐదు లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుందని, మనం తినే ఆహార పదార్థాల్లో ఎక్కువ భాగం వాటికే పోతుందని ‘పర్సనలైజ్డ్ న్యూట్రిషన్’ పరీక్షల్లో బయటపడడంతో ఈ కొత్త డైట్ విధానం అవసరం అని వైద్యులు తేల్చారు. మనం తినే ఆహారాన్ని బట్టి మన పెద్ద పేగులో బ్యాక్టీరియా రకాలు మారుతాయని కూడా ఆ అధ్యయనంలో తేలింది. మనం సరైన డైటింగ్ చేయడం ద్వారా కొన్ని రకాల బ్యాక్టీరియాలను చంపేయవచ్చట. అంటే వాటిని చంపడానికి వేరే మందులు అవసరం లేదన్న మాట. అందుకనే ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి డీఎన్ఏను తప్పనిసరిగా విశ్లేషించి డేటాను నిక్షిప్తం చేయాల్సిందిగా ‘జాతీయ ఆరోగ్య సేవల ప్రాజెక్ట్ ’ అధికారులకు బ్రిటన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. -
డీఎన్ఏ నమూనా ఇవ్వండి... రొనాల్డోకు పోలీసుల వారెంట్
లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపేందుకు డీఎన్ఏ నమూనాలు ఇవ్వాలని లాస్‌వెగాస్ పోలీసులు ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు, పోర్చుగల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోను కోరారు. 2009 జూన్ 13న హోటల్ సూట్లో రొనాల్డో తనపై అత్యాచారం చేశాడంటూ అమెరికాకు చెందిన మాజీ మోడల్ క్యాథరిన్ మోర్గా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సమగ్ర విచారణ చేయాలని భావిస్తున్న పోలీసులు... హోటల్లో దొరికిన క్యాథరిన్ దుస్తులను ప్రధాన ఆధారంగా భావిస్తున్నారు. అందుకే, డీఎన్ఏ నమూనాలు కోరుతూ ఇటలీలో లీగ్ ఆడుతున్న రొనాల్డోకు వారెంట్ పంపారు. మరోవైపు ఘటనను బయటకు చెప్పకుండా ఉండేందుకు క్యాథరిన్‌కు 3.75 లక్షల అమెరికన్ డాలర్లు చెల్లించేందుకు అప్పట్లోనే అంగీకారం కుదిరింది. అయితే, ‘మీ టూ’ ఉద్యమ ప్రభావంతో ఆమె మళ్లీ నోరు విప్పింది. రొనాల్డో, అతడి న్యాయవాదులు ఈ అభియోగాలను మొదటి నుంచి ఖండిస్తున్నారు. -
డీఎన్ఏ పరీక్షల్లో దొరికిపోయాడు
దొడ్డబళ్లాపురం: ఆ అమ్మాయిని ప్రేమించానన్నాడు.. శారీరకంగా లొంగదీసుకున్నాడు.. తీరా గర్భవతి అని తెలిసి నువ్వెవరో తెలీదన్నాడు..అయితే ఆ మోసగాడు డీఎన్ఏ పరీక్షల్లో అడ్డంగా దొరికిపోయాడు.. నెలమంగల తాలూకా చిక్కగొల్లరహట్టి గ్రామానికి చెందిన మోహన్‌గౌడ (30)ఈ కథలో హీరో కం విలన్... మోహన్‌గౌడ స్థానిక యువతి (22)ని కొన్నాళ్లుగా ప్రేమించానని నాటకమాడి శారీరకంగా లొంగదీసుకుని తీరా ఆమె గర్బవతి అని తెలిసి నువ్వెవరో తెలీదన్నాడు. అయినా యువతి ధైర్యంతో బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మోహన్‌గౌడ పలుమార్లు రౌడీలను పంపించి బెదిరించాడు. యువతిని పెద్దమర్రిచెట్టు (దొడ్డాలదమర) వద్ద ఉన్న లాడ్జికి తీసికెళ్లి బలవంతంగా శారీరక సంబంధం ఏర్పరచుకుని వీడియోతీసి బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేసాడు. కొన్నాళ్లకు యువతి గర్భవతి అని తెలిసి దూరం పెట్టాడు. దీంతో యువతి తల్లిదండ్రులతో కలిసి మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పో లీసులు మోహన్గౌడను అరెస్టు చేసి జైలుకు కూడా పంపిం చారు. కేసు నెలమంగల జేఎంఎఫ్‌సీ కోర్టులో విచారణ జరిగింది. కోర్టులో యువతికి పుట్టిన బిడ్డకు తనకూ సంబంధం లేదని మోహన్‌గౌడ వాదించాడు. అయితే కోర్టు పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకుని డీఎన్ఏ పరీక్షకు ఆ దేశించింది. ఇప్పుడు బిడ్డ మోహన్గౌడకు కలిగిందే అని డీఎన్ఏ పరీక్షలు తేల్చాయి. కోర్టు డీఎన్ఏ పరీక్షకు ఆదేశించడానికి పోలీసులు సేకరించిన సాక్ష్యాలు కలిసివచ్చాయి. యువతితో మోహన్‌గౌడ దిగిన లాడ్జీ సీసీటీవీ ఫుటేజీ, ఇద్దరూ కారు, బైక్‌లపై తిరిగిన వీడియోలు, ఫోన్ కాల్ రికార్డ్‌లు సేకరించిన పోలీసులు వాటన్నిటినీ కోర్టుకు సమర్పించారు. -
పావు శాతం బీజీ–3 విషం!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఇటీవలి అంచనా ప్రకారం రాష్ట్రంలో 15 శాతం విస్తీర్ణంలో నిషేధిత బీజీ–3 పత్తి సాగైంది. తాజాగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని డీఎన్ఏ లేబొరేటరీ జరిపిన పరీక్షల్లో 25 శాతం బీజీ–3 పత్తి పంట ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంచనా ప్రకారమే ఈ స్థాయిలో అనుమతిలేని బీజీ–3 పత్తి సాగైనట్లు తేలడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిషేధిత పత్తి విత్తనంపై ఉక్కుపాదం మోపుతామని బీరాలు పలికిన వ్యవసాయ యంత్రాంగం కనీసం తుప్పును కూడా వదిలించలేకపోయింది. విత్తన కంపెనీలు రైతులకు బీజీ–3ని అంటగడుతుంటే, ‘సొరకాయ కోతల’కే అధికారులు పరిమితమయ్యారంటున్నారు. ఇప్పటివరకు 36 లక్షల ఎకరాలకు మించి పత్తి సాగైతే, దాదాపు 8 లక్షల ఎకరాల్లో బీజీ–3 పత్తి విత్తనం వేసినట్లు అంచనా. గ్లైపోసేట్‌ను నిషేధించడంతో ఇప్పుడు వేసిన బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు ఏ మందు వేయాలో రైతులకు తెలియక కలవరపడుతున్నారు. ల్యాబ్‌పై దుష్ప్రచారం వ్యవసాయ శాఖ దాని అనుబంధ విభాగాలకు చెందిన కొందరు అధికారులు పనిగట్టుకొని విత్తన కంపెనీలకు వంతపాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. మొదట్లో బీజీ–2 విత్తనంలో బీజీ–3 విత్తనాలను ఐదు శాతం కలిపేందుకు కేంద్రానికి విన్నవించేలా ప్రయత్నించారు. ఆ పాచిక పారలేదు. చివరకు బీజీ–3 విత్తనాలను అంటగట్టే కంపెనీలకు అనుగుణంగా కుట్ర చేసినట్లు తేలింది. కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో ‘మలక్‌పేటలోని డీఎన్ఏ లేబొరేటరీకి బీజీ–3ని నిర్ధారించే సామర్థ్యం అంతగా లేదు’అని నమ్మించేందుకు కొందరు అధికారులు ప్రయత్నాలు చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఇటీవల కేంద్రం నిర్వహించిన సమావేశానికి తయా రు చేసిన నివేదికలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ‘హైదరాబాద్ మలక్‌పేట డీఎన్ఏ లేబరేటరీకి బీజీ–3ని నిర్ధారించే పటిష్టమైన అత్యాధునిక వసతులున్నాయి’అని కేంద్రం ఇచ్చిన ప్రశంసాపూర్వకమైన లేఖను వ్యవసాయ శాఖ వర్గాలు బయటపెట్టాయి. అంటే కావాలనే డీఎన్ఏ లేబొరేటరీపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీజీ–3 నిర్ధారణ పరీక్షలను సవాల్ చేసేలా విత్తన కంపెనీలను పురికొల్పడమే ఇందులో ప్రధాన కుట్ర అని వ్యవసాయ శాఖలోని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. రహస్య భేటీ బీజీ–3ని సరఫరా చేసిన కంపెనీలు ఇటీవల హైదరాబాద్‌లో ఒక రహస్య భేటీ నిర్వహించాయి. కొందరు వ్యవసాయ అనుబంధ అధికారులు ఆ రహస్య భేటీకి హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. కంపెనీలను గట్టెక్కించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు భోగట్టా. ఇలా వ్యవసాయ శాఖ, దాని అనుబంధ విభాగాలకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. కొందరు రైతులకు మద్దతు తెలుపుతుంటే, కొందరు కంపెనీలకు బాసటగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. డీఎన్ఏ లేబొరేటరీ పరీక్షలపై చర్చ హైదరాబాద్ మలక్‌పేటలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ లేబొరేటరీకి ఈ ఏడాది 200 పత్తి నమూనాలను పరీక్షలకు పంపారు. వాటిని పరీక్షించగా అందులో 50 నమూనాలు బీజీ–3గా నిర్ధారించారు. అవన్నీ కూడా ప్రముఖ విత్తన కంపెనీలవే కావడం గమనార్హం. ఆయా కంపెనీలన్నీ రాష్ట్రంలో బీజీ–2 విత్తనాన్ని సరఫరా చేయడానికి అనుమతి పొందినవే. కానీ అవే నిషేధిత బీజీ–3ని కూడా రైతులకు సరఫరా చేశాయి. వాస్తవంగా బీజీ–3 నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆలస్యం చేసింది. మొదట్లో బీజీ–2లో బీజీ–3 విత్తనాలను ఐదు శాతం కలుపుకునేందుకు అవకాశం కల్పించాలన్న కంపెనీలకు మద్దతు తెలిపేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖలో కొందరు ప్రయత్నాలు చేశారు. కానీ వ్యవహారం బయటపడటంతో ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆ తర్వాత బీజీ–3పై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర అధికారులు కేంద్రానికి విన్నవించారు. బీజీ–3ని నియంత్రించాలంటే దానికి వాడే గ్లైపోసేట్ పురుగు మందును ముందు నిషేధించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కానీ కీలకమైన పత్తి సాగు ప్రారంభ సమయంలో నిషేధించకుండా, దాదాపు 70 శాతం సాగయ్యాక ఆలస్యంగా నిషేధమో, నియంత్రణో అర్థంగాకుండా ఆదేశాలిచ్చారు. దీం తో రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరకు బాగుపడింది బీజీ–3ని రైతులకు అంటగట్టిన కంపెనీలే. -
నరరూప రాక్షసుడ్ని.. కండోమ్ పట్టించింది
ఎనిమిదేళ్ల చిన్నారిని ఒళ్లు గగుర్బొడిచే రీతిలో హత్యాచారం చేసి.. ఆపై పోలీసులకు చిక్కకుండా సైకోయిజం ప్రదర్శించిందో మృగం. అయితే ముప్పై ఏళ్ల తర్వాత నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ కేసును ఓ కండోమ్ సాయంతో పోలీసులు చేధించటం విశేషం. ఇండియానా రాష్ట్రం, ఫోర్ట్ వైనే నగరంలో 1988, ఏప్రిల్1న 8 ఏళ్ల చిన్నారి ‘ఏప్రిల్ టిన్స్లే’ అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మూడు రోజుల తర్వాత అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో బాలిక మృతదేహం ముక్కలై పడి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్‌లో చిన్నారిని లైంగికదాడి చేసి, ఆపై చిత్రవధ చేసి చంపినట్లు తేలింది. దీంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు మాత్రం పోలీసులకు సవాల్ విసురుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో 1990లో నగరంలోని ఓ గోడ మీద..‘ఆ ఎనిమిదేళ్ల చిన్నారిని చంపింది నేనే. ఆ పాపా ఇంకో షూ మీకు దొరికిందా?.. హహ.. మళ్లీ చంపేస్తా’ అంటూ రాతలు కనిపించాయి. దీంతో పోలీసులు దర్యాప్తును మరింత ఉధృతం చేశారు. సుమారు 30 ఏళ్లుగా దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. చివరికి జన్యుశాస్త్రవేత్త సాయంతో దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జెనాలజీని ఆశ్రయించారు. (జెనాలజీ అంటే వంశవృక్షాన్ని తయారుచేసేందుకు ఉపయోస్తారు. ఆ డేటా ఇంటర్నెట్లో దొరుకుతుంది కూడా). కండోమ్ ద్వారానే... జెనాలజీ ఆధారంగా గ్రాబిల్‌కు చెందిన జాన్ మిల్లర్(59), అతని సోదరుడిపై పోలీసులకు అనుమానాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ నెల మొదట్లో జాన్ మిల్లర్ ఇంటి డస్ట్ బిన్ నుంచి విచారణ అధికారులు కండోమ్‌లను సేకరించారు. వాటి పరీక్షల అనంతరం నిందితుడు మిల్లరే అని నిర్ధారించిన పోలీసులు.. చివరకు అతన్ని అరెస్ట్ చేశారు. తాము ప్రశ్నించేందుకు వెళ్లిన సమయంలోనే మిల్లర్ నేరం ఒప్పేసుకున్నాడని అలెన్ కౌంటీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను అలెన్ కౌంటీ జైలుల్లో ఉండగా, వచ్చే వారం కేసు కోర్టులో విచారణకు రానుంది. గోల్డెన్ స్టేట్ కిల్లర్, టకోమా చిన్నారి మిచెల్లా వెల్చ్ హత్యాచారం కేసు కూడా జెనాలజీ ద్వారానే చిక్కుముడి వీడటం తెలిసిందే. -
ఆస్పత్రిలో శిశువులు తారుమారు
పటాన్చెరు టౌన్: ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన శిశువులు తారుమారైన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. పటాన్చెరు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వసుంధర, సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురహరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని జిన్నారం మండలం అండూర్ గ్రామానికి చెందిన శ్రీశైలం తన భార్య అర్చనను కాన్పుకోసం కోసం శనివారం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే బొల్లారం గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్ భార్య సరస్వతినీ ప్రసవం కోసమే చేర్పించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం డెలివరీ కోసం సరస్వతి, అర్చనను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. వైద్యులు ముందుగా సర్వసతికి డెలివరీ చేయగా బాబు పుట్టాడు. అయితే వార్డుబాయ్ సరస్వతికి పుట్టిన బాబును పొరపాటున అర్చన కుటుంబీకులకు అందజేశాడు. కాసేపటి తర్వాత అర్చనకు పాప పుట్టింది. పాపను అర్చన కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు తీసుకెళ్లగా జరిగిన పొరపాటు తెలిసింది. వైద్యాధికారులు కుటుంబ సభ్యులతో చర్చించి శిశువులు ఇద్దరికీ డీఎన్ఏ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. పరీక్షల అనంతరం శిశువులను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని వైద్యులు తెలిపారు. -
దేశవ్యాప్తంగా డీఎన్ఏ డేటా బ్యాంకులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో డీఎన్ఏ డేటా బ్యాంకులను కేంద్రం త్వరలోనే ఏర్పాటు చేయనుంది. నిబంధనలకు విరుద్ధంగా పౌరుల డీఎన్ఏ వివరాలను బయటకు వెల్లడిస్తే మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ డీఎన్ఏ ముసాయిదా బిల్లును రూపొందించింది. డీఎన్ఏ ప్రొఫైల్స్, డీఎన్ఏ శాంపిల్స్, రికార్డులను బాధితులు, నిందితులు, అనుమానితులు, తప్పిపోయినవారు, మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తుల్ని గుర్తించేందుకు మాత్రమే వాడతామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ బిల్లు రూపకల్పనలో న్యాయశాఖ బయోటెక్నాలజీ విభాగం సలహాలను తీసుకుందన్నారు. ఈ ముసాయిదా బిల్లుకు ప్రస్తుతం న్యాయశాఖ తుదిరూపు ఇస్తోందన్నారు. డీఎన్ఏ సమాచారాన్ని అక్రమంగా కోరేవారికి కూడా మూడేళ్ల జైలుశిక్షతో పాటు లక్ష వరకూ జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. వచ్చే సమావేశాల్లో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఇటీవల కేంద్రం సుప్రీంకు తెలిపిందన్నారు. -
జయ రక్త నమూనాలు మా వద్ద లేవు: అపోలో
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత చికిత్సకు సంబంధించిన వైద్య డాక్యుమెంట్లు, రక్త నమూనాలు తమ వద్ద లేవని అపోలో ఆస్పత్రి యాజమాన్యం మద్రాసు హైకోర్టుకు తెలిపింది. అమృత అనే యువతి జయలలిత కుమార్తెగా రుజువు చేసుకునేందుకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో జయ రక్తనమూనాలపై బదులివ్వాల్సిందిగా జడ్జి అపోలో ఆస్పత్రిని ఆదేశించారు. ‘ఆమె చికిత్సకు సంబంధించిన పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాం. చికిత్స సమయంలో ఆమె నుంచి సేకరించిన నమూనాలను అప్పటికప్పుడే వాడేశాం. ప్రస్తుతం మావద్ద ఏమీ లేవు’ అని గురువారం కేసు విచారణ సందర్భంగా కోర్టుకు ఆస్పత్రి వివరణ ఇచ్చింది. -
చిన్ని తల్లిదండ్రుల డీఎన్ఏ నమూనా సేకరణ
మార్కాపురం : గుజరాత్‌లోని పాండిచేరా పోలీసుస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందిన చిన్నారి డీఎన్ఏ (రక్త నమూనాలు), గతేడాది అక్టోబర్‌లో తప్పిపోయిన పెద్దారవీడు మండలం గొబ్బూరుకు చెందిన మాకం చిన్ని తండ్రి అబ్రహం రక్తనమూనాలను సూరత్ పోలీసులు సేకరించి ఫలితం కోసం ల్యాబ్‌కు పంపారు. దీంతో సర్వత్రా, అటు గుజరాత్ పోలీసులు, ఇటు మార్కాపురం పోలీసులు, ప్రజలు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. మూడు, నాలుగు రోజుల్లో ఫలితాలు వచ్చేలా గుజరాత్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసును ఇటు ప్రకాశం పోలీసులు, అటు సూరత్ కమిషనర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతేడాది అక్టోబర్ 10న మార్కాపురం ఎస్సీ హాస్టల్లో చదుకుంటూ అదృశ్యమైన మాకం చిన్ని కేసు మిస్టరీగా మారింది. సూరత్ సమీపంలో దొరికిన చిన్నారి మృతదేహం పోలికలు, మాకం చిన్ని పోలికలు ఒకే విధంగా ఉండటంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. మృతదేహం ఒంటిపై అక్కడక్కడా గాయాలు ఉండటంతో హత్య చేసి ఉంటారన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మాకం చిన్ని తల్లిదండ్రులను మార్కాపురం పోలీసులు సూరత్ తీసుకెళ్లారు. కుమార్తె పోలికలు సంఘటన స్థలంలో ఉన్న మృతదేహం పోలికలు దగ్గరగా ఉన్నా ఎడమ మోచేతి కింద పుట్టుమచ్చ లేదని, తన కుమార్తె కాకపోవచ్చని అబ్రహం అనుమానం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఫింగర్ ప్రింట్స్ కూడా ఆధార్ సాఫ్ట్‌వేర్‌లో మ్యాచ్ కాకపోవడంతో డీఎన్ఏ పరీక్షలకు సిద్ధమయ్యారు. బుధవారం చిన్ని తండ్రి అబ్రహం రక్తనమూనా సేకరించగా గురువారం రాత్రి తల్లి విశ్రాంతమ్మ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నట్లు తెలిసింది. ఆమె రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపనున్నారు. డీఎన్ఏ పరీక్షలో మృతురాలిది, తల్లిదండ్రుల రక్తనమూనాలు మ్యాచ్ అయితే మాకం చిన్నిగా పోలీసులు భావిస్తారు. అలా కాకుంటే చిన్ని ఎక్కడుందనేది పోలీసులకు సవాల్‌గా మారనుంది. డీఎన్ఏ పరీక్షల ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
మన మూలాలు ఎక్కడ ?
సాక్షి, హైదరాబాద్ : భారత ఉప ఖండం చరిత్రకు సంబంధించిన ప్రధాన ప్రశ్నలతో పాటు, భారతీయ నాగరికతపై చేసిన వివిధ సూత్రీకరణలపై చర్చకు సమాధానాలు కనుక్కునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 92 మంది శాస్త్రజ్ఞులు రూపొందించిన ‘ ఓ నూతన పత్రం’ దీనికి మార్గం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే ‘ది జెనోమిక్ ఫార్మేషన్ ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా’ శీర్షికతో ఆన్లైన్లో పోస్టయిన ఈ పత్రంలో జన్యుశాస్త్రం మొదలుకుని ఉప ఖండంలో ప్రాచీన నివాసితుల వంశ పారంపర్య వివరాల వరకు పరిశీలించారు. అన్ని ప్రతిష్టాత్మక సంస్థలే... మనదేశ నాగరికతపై కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఉపకరించే ఈ పత్రాన్ని తయారు చేయడంలో హైదరాబాద్‌లోని సీసీఎంబీ మొదలుకుని హార్వర్డ్, ఎంఐటీ, ద రష్యన్ అకాడమి ఆఫ్ సైన్సెస్, ద బీర్బల్ సహాని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెన్ (లక్నో), ద దక్కన్ కాలేజీ, ద మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్, ద ఇనిస్టిట్యూట్ ఫర్ ఆర్కియాలాజికల్ రిసెర్చ్ ఇన్ ఉజ్బెకిస్తాన్... ఇలా 92 ప్రపంచప్రసిద్ధి పొందిన శాస్త్ర,సాంకేతిక, పరిశోధన సంస్థలకు చెందిన వారు భాగస్వాములయ్యారు. ఈ అధ్యయనానికి సహ డైరెక్టర్లుగా వ్యవహరించిన వారిలో జన్యుశాస్త్ర నిపుణుడు డేవిడ్ రీచ్ కూడా ఉన్నారు. అధ్యయనం ఇలా... వందేళ్ల క్రితం నాటి ప్రజల డీఎన్ఏ శాంపిళ్లతో (612 మంది ప్రాచీన పౌరులు) జన్యువుల ఆధారంగా ఈ పరిశీలన నిర్వహించారు. ఇందులో దక్షిణాసియా మొదలుకుని తూర్పు ఇరాన్, ప్రస్తుత ఉజ్బెకిస్తాన్‌లోని తురాన్, తుర్కెమినిస్తాన్, తజికిస్తాన్, ఖజకిస్తాన్‌లకు చెందిన వారి నమూనాలున్నాయి. మొత్తం 612 జన్యువుల్లో 362 మంది డీఎన్ఏలను తొలిసారి పరీక్షించారు. ఈ జన్యువుల నుంచి తీసుకున్న డేటాను ప్రస్తుతం దక్షిణాసియాలోని 246 విలక్షణ గ్రూపులతో సహా పైన పేర్కొన్న ఆయా ప్రాంతాల వ్యక్తుల సమాచారంతో పోల్చి చూశారు. దేనికోసమీ పరిశోధన ? మధ్య, దక్షిణాసియాలలో ప్రజలు ఎలా స్థిరపడ్డారు ? అన్న విషయంపై అంచనాకు వచ్చేందుకు తగిన స్థాయిలో పురాతన డీఎన్ఏతో పాటు పరిశీలన కొరవడింది. దీనికి సంబంధించి అనేక సూత్రీకరణలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని దక్షిణాసియాలోని రాజకీయాలతో ముడిపెట్టి చేసినవీ ఉన్నాయి. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి బలం చేకూర్చేలా నీలికళ్ల శ్వేతజాతీయులు గుర్రాలపై ఉపఖండానికి వచ్చి తమకు ఎదురైనా ప్రతీ దేశంపై విజయం సాధించారన్నది వీటిలో భాగంగా ఉన్నాయి. దీనికి పూర్తి విరుద్ధ వాదననను హిందుత్వవాదులు తీసుకొచ్చారు. భారత–ఐరోపా భాషలన్నీ భారత్ నుంచే పశ్చిమానికి వ్యాపించాయనే సూత్రీకరణా ఉంది. స్త్రీల నుంచి స్ల్రీలకు బదిలీ అయ్యే మైటోకాండ్రియల్ డీఎన్ఏ మన ఉపఖండ ప్రత్యేకతగా ఉంది. కొన్ని వేల సంవత్సరాలుగా స్థానికులు( ఇండీజీనియస్) భారత్‌లో ఉన్నారని ఈ పరిశీలన సూచిస్తోంది. అయితే పురుషుల నుంచి పురుషులకు బదిలీ అయ్యే ‘వై’ క్రోమోజోమ్‌ల ప్రాతిపదికన పశ్చిమ యూరో ఆసియన్లు, ఇరాన్ పీఠభూమి, మధ్య ఆసియన్లతో భారత్‌కు ఎక్కువ సంబంధాలున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో అసలు సింధు నాగరికతకు చెందిన ప్రజలెవరన్న ప్రశ్న ముందుకొచ్చింది. వారికి ద్రవిడియన్లుగా ముద్రపడ్డవారితో లేక ఆర్యుల వలసల కారణంగా దక్షిణాదికి పరిమితమైన వారితో వీరికి సంబంధాలున్నాయా ? లేదా వారే ఆర్యులా ? వారే క్రమంగా దక్షిణాదికి తరలివచ్చారా అన్న ప్రశ్నలకు జవాబులు ఈ అధ్యయనంలో లభించవచ్చునని భావిస్తున్నారు. కనుక్కున్నది ఏమిటీ ? ఈ అధ్యయనంలోని జన్యుపరమైన అంచనా ప్రకారం ప్రాచీన భారతం... ఉత్తర, దక్షిణ ప్రాంతాల ప్రజల పూర్వీకులను రెండు ప్రత్యేక బృందాలుగా విభజించారు. ప్రస్తుత యూరోపియన్లు, తూర్పు ఆసియన్ల మాదిరిగా ఈ బృందాలు రెండు కూడా ఒక దానికి ఒకటి పూర్తిగా భిన్నమైనవని పేర్కొన్నారు. అయితే ఈ రెండు జాతులు కూడా ఎక్కడి నుంచి వచ్చాయన్నది ప్రశ్న. వివిధ కాంబినేషన్లలో మూడు బృందాలు కలగలిసి పోయి ఈ రెండు జాతులు ఏర్పడడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. అవి... –ఈ అధ్యయనంలో దక్షిణ భారత ప్రాంత పూర్వీకులుగా పేర్కొన్నవారు (దక్షిణాసియాలో వేట ప్రధాన వృత్తిగా ఉన్న వారు) ఉపఖండంలో అతి ప్రాచీన ప్రజలని తేల్చారు. వీరికి ఆధునిక అండమాన్ ద్వీప ప్రజలతో సారూప్యతలున్నాయి. –ఇరాన్‌కు చెందిన రైతులు ఉపఖండానికి వలస వచ్చారు. వారి ద్వారా గోధుమలు, బర్లీ వంటి పంట పద్ధతులు ఇక్కడకు వచ్చాయి. – మధ్య ఆసియా నుంచి ఉత్తర అప్ఘనిస్తాన్ వరకున్న ప్రాంతంలోని ప్రజలు (ఆర్యులుగా గతంలో పిలిచేవారు) భారత్‌కు వలస వచ్చినవారిలో ఉన్నారు. వీరితో పాటు దక్షిణ ఆసియాతో సంబంధాలున్న ముఖ్యమైన జనాభా సింధు నాగరికతకు చెందినదిగా భావిస్తున్నారు.సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజలు చాలా మటుకు భారత జనాభాకు వారధిగా నిలుస్తూ దక్షిణాసియా పూర్వీకులకు సంబంధించి ప్రధాన వనరుగా నిలుస్తున్నట్టు ఈ అథ్యయనం పేర్కొంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
డీఎన్ఏ టెస్ట్ ఓవర్!
మీ నాన్నగారి పేరు మీకు తెలుసు. మీ తాతగారి పేరు తెలుసు. మీ ముత్తాత పేరు అంటే కాస్త కష్టపడి తెలుసుకోవచ్చు. కానీ మీ ముత్తాత నాన్నగారి పేరేంటి? అని ఎవరైనా అడిగితే.. ఆలోచనలో పడతారు కదూ. ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవాలనే ఆలోచన కూడా కలుగుతుంది కదూ. హీరోయిన్ అమీ జాక్సన్‌కు అలాంటి ఆలోచనే కలిగింది. తన ఫ్యామిలీ ట్రీ గురించి తెలుసుకోవాలనుకున్నా రామె. ఆల్రెడీ వై క్రోమోజోమ్ డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకున్నారు. నాన్న వైపు పూర్వీకులను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ టెస్ట్‌ను ప్రిఫర్ చేస్తారు. అమ్మవైపు పూర్వీకులను తెలుసుకోవాలనుకునేవారు మైటోకాండ్రియాల్ డీఎన్ఏ టెస్ట్ ప్రిఫర్ చేస్తారు. అమ్మానాన్న.. ఇద్దరి ఫ్యామిలీ హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆటోసోమల్ డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటారు. ఈ విషయంపై అమీ మాట్లాడుతూ– ‘‘నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావ్? అని కొత్తగా పరిచయమైన కొందరు నన్ను అడుగుతున్నారు. అప్పుడు నేను ఇంగ్లాండ్ అని చెప్పాను. ‘నువ్వు ఇంగ్లాండ్ అమ్మాయిలా లేవు. నీలో ఆ పోలికలు అంత స్పష్టంగా కనిపించడం లేదు’ అన్నారు. మా నాన్నమ్మ 1990లో పోర్చ్గల్లో ఉండేవారు. కానీ అంతకు ముందు ఏం జరిగిందో తెలీదు. ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం నాకు ముఖ్యం. మా నాన్నగారి వైపు వాళ్ల గురించి తెలుసుకోవాలనుంది. కష్టమని తెలుసు. కానీ ప్రయత్నం మొదలుపెట్టాను’’ అన్నారు. డీఎన్ఏ టెస్ట్ ప్రాసెస్ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘టెస్ట్ చేయించుకోవడం ఈజీ. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అధికారులకు సంబంధిత వివరాలను చెప్పాలి. వీటితోపాటు మన లాలాజలాన్ని అందజేయాలి. దీనిని వాళ్లు మిలియన్ల మంది డీఎన్ఏలతో పోల్చి చూస్తారు. కొన్ని వారాల తర్వాత ఫలితాలను చెబుతారు’’ అని చెప్పుకొచ్చారు. -
తొలి ఆంగ్లేయుడు శ్వేతజాతీయుడు కాదా..?
లండన్ : పురాతన బ్రిటిషర్లు శ్వేతజాతీయులు కాదని డీఎన్ఏ పరీక్షల ద్వారా తేలింది. పదివేల సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తి ఎముకలపై తొలిసారిగా నిర్వహించిన అత్యంతాధునిక జన్యు పరీక్షలు, ఫేషియల్ రీకన్స్ర్టక్షన్ టెక్నిక్స్ ద్వారా అసాధారణ విషయాలు వెలుగుచూశాయి. తొలితరం ఆంగ్లేయులు నలుపు వర్ణంతో, ఉంగరాల జుట్టు, నీలి కళ్లు కలిగిఉన్నారని తెలిసింది. బ్రిటన్‌లోని సోమర్సెట్ చెద్దార్ లోయలో లభించిన అతిపురాతన మానవ కళేబరంపై పరీక్షలు నిర్వహించిన శాస్త్రవేత్తలు విస్తుగొలిపే అంశాలను వెల్లడించారు. తాము పరిశీలించిన మానవ కళేబరం జీవించి ఉంటే సదరు వ్యక్తి ‘బ్లాక్’ అని స్పష్టం చేశారు. ఆంగ్లేయులు శ్వేతజాతీయులు కాదని, కాలక్రమేణా వారి చర్మం వర్ణం మారిఉండవచ్చని తమ పరిశోధనలో తేలినట్టు వారు పేర్కొన్నారు. 1903లో సోమర్సెట్లోని చెద్దార్లో లభించిన కళేబరం, వాటి ఎముకలు అప్పటి నుంచి సంచలనంగానే మారాయి. వందేళ్లకు పైగా శాస్త్రవేత్తలు ‘చెద్దార్ మెన్’ కథను వెలికితీసే పనిలో పడ్డారు. అతని ముఖకవళికలు, పూర్వాపరాలు, తన పూర్వీకుల గురించి ఎలాంటి విషయాలు వెలుగుచూస్తాయనేది ఎప్పటికప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. నేచురల్ హిస్టరీ మ్యూజియం, యూనివర్సిటీ కాలేజ్ లండన్ నిర్వహించిన జన్యు పరీక్షల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయని మ్యూజియం శాస్త్రవేత్త డాక్టర్ టామ్ బూత్ చెప్పారు. -
'డీఎన్ఏ పరీక్షతో అన్ని అనుమానాలు పోతాయ్'
సాక్షి, న్యూఢిల్లీ : డీఎన్ఏ పరీక్ష చేయడం ద్వారా స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ (నేతాజీ) మరణంపై ఉన్న అనుమానాలన్నింటికి స్వస్తి పలకవచ్చని ఆయన కూతురు అనితా బోస్ అన్నారు. బోస్‌ను ఖననం చేసిన అవశేషాలు మిగిలి ఉంటాయని వాటి డీఎన్ఏను పరీక్షిస్తే అసలు విషయం తేలిపోతుందని అభిప్రాయపడ్డారు. 'లేయిడ్ టు రెస్ట్ : ది కాంట్రవర్సి ఓవర్ సుభాష్ చంద్రబోస్ డెత్' అనే పుస్తకంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ మరణంపై ఉన్న అనుమానాల పరంపరను పేర్కొంటూ వస్తున్న ఈ కొత్త పుస్తకాన్ని ఆశీష్ రే రాశారు. సుభాష్ చంద్రబోస్ అవశేషాలను 1945 సెప్టెంబర్ నుంచి టోక్యోలోని రెంకోజి ఆలయంలో భద్రపరుస్తూ వస్తున్నారు. నేడు దేశ వ్యాప్తంగా నేతాజీ 121వ జయంతి వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. -
అనూహ్యం: నటించాడు.. నిజమైంది!
బీజింగ్: వాడకుండా వదిలేస్తే ఏ వస్తువైనా పనిచేయడం మానేస్తుంది. మనిషి అవయావాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. దీనికి నిదర్శనంగా నిలిచే ఉదంతం చైనాలో జరిగింది. 12 సంవత్సరాల పాటు మూగవాడిగా నటించిన ఓ వ్యక్తి చివరకు నిజంగానే మాట కోల్పోయాడు. అసలేం జరిగింది... ఝెజియాంగ్ తూర్పు ప్రావిన్స్‌లోని ఓ గ్రామానికి చెందిన జెంగ్ 33 ఏళ్ల చెంగ్ 2005లో కేవలం 5 వేల రూపాయల అద్దె వివాదంలో తన భార్య తరపు బంధువొకరిని చంపేశాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సొంతూరు వదిలిపెట్టి మరో ప్రావిన్స్‌కు పారిపోయాడు. పేరు మార్చుకుని మూగవాడిగా నటిస్తూ ఓ నిర్మాణ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి చేసుకుని తండ్రి కూడా అయ్యాడు. ఇలా దొరికాడు.. ఎవరికీ అనుమానం రాకుండా రహస్య జీవితం గడుపుతున్న జెంగ్పై పోలీసులు కన్నుపడింది. అతడి దగ్గర ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకపోవడంతో పోలీసుల అనుమానం బలపడింది. దీంతో పోలీసులు గత అక్టోబర్‌లో అతడి రక్త నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపారు. 12 ఏళ్లుగా పరారీలో ఉన్న ఓ హత్య కేసు నిందితుడి తల్లిదండ్రులతో జెంగ్ డీఎన్ఏ సరిపోలింది. బండారం బయటపడటంతో జెంగ్ నేరాన్ని అంగీకరించాడు. 12 ఏళ్లు మూగవాడిగా నటించడంతో మాట కోల్పోయానని అతడు పేపర్‌పై రాసి పోలీసులకు వెల్లడించాడని స్థానిక దినపత్రిక పేర్కొంది. అతడు దోషిగా తేలితే మరణశిక్ష పడే అవకాశముంది. -
అమృత పిటిషన్‌పై ప్రభుత్వానికి నోటీసులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత కూతురిగా తనను ప్రకటించాలంటూ అమృత అనే మహిళ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం విచారించింది. ఈ అంశంపై స్పందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు తాము జయ బంధువులమనీ, అమృత ఆమె కూతురేనని బెంగళూరుకు చెందిన ఎల్ఎస్ లలిత, రంజనీ రవీంద్రనాథ్ కోర్టుకు తెలిపారు. అమృత జయ కూతురో కాదో తేల్చేందుకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని వారు కోరారు. తండ్రి నిర్ధారణ కంటే ముందుగా జయలలితే తన తల్లి అని అమృత నిరూపించుకోవాల్సి ఉందని వారి తరఫు న్యాయవాది బదులిచ్చారు. -
డీఎన్ఏ పరీక్షకు అనుమతివ్వండి
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత కుమార్తెనని నిరూపించుకునేందుకు తనను డీఎన్ఏ పరీక్షకు అనుమతివ్వాలని బెంగళూరుకు చెందిన అమృత గురువారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జయలలితను బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ఖననం చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. తాను జయలలిత కుమార్తెనని, డీఎన్ఏ పరీక్షకు సైతం సిద్ధమని ఇటీవల అమృత సుప్రీంకోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను తిరస్కరించిన అత్యున్నత న్యాయస్థానం తొలుత హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం మద్రాస్ హైకోర్టులో అమృత పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్లో డీఎన్ఏ విషయంగా పేర్కొన్న కొన్ని అంశాలను జస్టిస్ ఎస్.వైద్యనాథన్ పరిగణనలోకి తీసుకోలేదు. విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
మర్మం ఏదైనా.. మార్గం డీఎన్ఏ..!
ఇటీవల కేరళలో సముద్రంలోకి వెళ్లిన చాలామంది జాలర్లు ఓక్కీ తుపాను తీవ్రతకు మరణించారు. గుర్తింపు పత్రాలేవీ లేకపోవడంతో ఏ మృతదేహం ఎవరిదో తెలుసుకోలేకపోయారు!! ఏం చేయాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పని చేసిన ఎన్.డి.తివారీ గుర్తున్నారా? ఆయన తన తండ్రి అంటూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేసి మరీ గెలిచాడు! ఎలా తెలిసింది? హైదరాబాద్‌లోని నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో ఇటీవల చిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. ఒక నవజాత శిశువుకు పొరపాటున రెండు ట్యాగులు కట్టేయడంతో బిడ్డ ఎవరికి పుట్టారన్న విషయంపై గందరగోళం నెలకొంది. చివరికి ఈ కేసు ఎలా తేలింది? ఈ మూడు చిక్కు ప్రశ్నలకు సమాధానం వెతకడం.. ఒకప్పుడైతే చాలా కష్టమయ్యేదేమో గానీ ఇప్పుడు రోజుల వ్యవధిలో పరిష్కారమైపోతాయి. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ మహత్యమే ఇదంతా. మనిషి మాత్రమే కాదు.. భూమ్మీది ప్రాణి కోటిలోని ఈ ప్రత్యేక జన్యు సమాచార నిధిని సక్రమంగా వాడుకుంటే.. అటు నేర సంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు, జంతు ప్రపంచాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సాధ్యమవుతుంది. మరి ఈ డీఎన్ఏ అంటే ఏమిటి? వేలిముద్రల కంటే డీఎన్ఏ ఆనవాళ్లు ఎంత ప్రత్యేకం? డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎలా చేస్తారు? అన్న సందేహాలు మీకూ ఉన్నాయా? చదివేయండి మరి! నిచ్చెన ఆకారం.. సకల సమాచారం.. అతి సూక్ష్మ బ్యాక్టీరియా మొదలుకొని ఒకప్పటి రాక్షస బల్లుల వరకూ అన్ని జీవుల్లోని కణాల్లో ఉండే ప్రాథమికమైన విషయం డీఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్.. క్లుప్తంగా డీఎన్ఏ. మనం ఎంత పొడవు పెరగాలి? కళ్ల రంగు ఏంటి? వచ్చే జబ్బులేవి? వంటి అన్ని రకాల సమాచారం దీంట్లోనే ఉంటుంది. మన కణ కేంద్రకాల్లోని మైటోకాండ్రియాలో ఉండే క్రోమోజోమ్‌లలో ఈ డీఎన్ఏ ఉండ చుట్టుకుని ఉంటుంది. అడినైన్, గ్వానైన్, థయమీన్, సైటోసైన్ అనే నాలుగు రసాయనాలతో ఏర్పడే డీఎన్ఏ.. మెలితిరిగిన నిచ్చెన ఆకారంలో ఉంటుందని 1953లో జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిచ్చెన మెట్లు రెండు రకాలుగా ఉంటాయి. అడినైన్ కేవలం థయమీన్‌తో మాత్రమే జతకట్టి ఒక మెట్టులా ఉంటే.. సైటోసైన్ గ్వానైన్తో మాత్రమే జతకడుతుంది. ఇలాంటి ఒక్కో మెట్టును న్యూక్లియోటైడ్ బేస్ పెయిర్ అంటారు. మానవ డీఎన్ఏలో దాదాపు 300 కోట్ల బేస్ పెయిర్స్ ఉంటాయని అంచనా. ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియ ఇదీ రక్తం, స్వేదం, ఎముక, వెంట్రుకలు, శుక్ర కణాలు, కణజాలం ఇలా ఏదైనా జీవ పదార్థాన్ని సేకరించడంతో డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నమూనాల ఆధారంగా వాటి కణాల్లోంచి డీఎన్ఏను ప్రత్యేక పద్ధతుల ద్వారా వేరు చేస్తారు. పాలిమరేస్ చైన్ రియాక్షన్ ద్వారా ఈ డీఎన్ఏ పోగుల సంఖ్యను కొన్ని వేల రెట్లు పెంచుతారు. ఈ పోగులన్నింటినీ ఓ ద్రావణంలోకి వేసి విద్యుత్తు ప్రసారం చేస్తారు. దీన్ని జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అంటారు. డీఎన్ఏ పోగులకు రుణావేశం ఉంటుంది కాబట్టి అవన్నీ ధనావేశమున్న చోట గుమిగూడతాయి. కొన్ని రసాయనాలను వాడటం ద్వారా ఈ పోగులను ప్లాస్టిక్ కాగితంపై కనిపించేలా చేస్తారు. ఇలా రెండు జన్యు క్రమాలను పోల్చినప్పుడు వాటిలో ఎంత మేరకు ఒకేలా ఉందో తెలిసిపోతుంది. ఉపయోగాలేంటి? నేర నిర్ధారణతోపాటు అనేక ఇతర రంగాల్లో డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎంతో ఉపయోగకరం. మాతృత్వ, పితృత్వ వివాదాల పరిష్కారానికి, అవశేషాల ఆధారంగా వ్యక్తులు, జంతువులను గుర్తించేందుకూ ఈ పద్ధతిని వాడుతున్నారు. ఆస్పత్రుల్లో నవజాత శిశువుల మార్పిడికి సంబంధించిన వార్తలు వింటూ ఉంటాం.. అలాంటి వివాదాలను పరిష్కరించేందుకు డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మేలైన మార్గం. ప్రతి ఒక్కరిదీ ప్రత్యేకం.. భూమ్మీద 730 కోట్ల మందికిపైగా మనుషులుంటే.. ఇందులో ఏ ఒక్కరి డీఎన్ఏ కూడా ఇంకొకరి మాదిరిగా ఉండదు. అయితే డీఎన్ఏలోని 300 కోట్ల బేస్ పెయిర్స్‌లో 99.7 శాతం అందరికీ సమానమే. మిగిలిన బేస్ పెయిర్స్‌లో ఉండే తేడాలే ఒకొక్కరినీ ప్రత్యేకం చేస్తాయి. ఈ తేడాలు ఎక్కడున్నాయో గుర్తించడం ద్వారా ఇద్దరి డీఎన్ఏను పోల్చవచ్చు. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పని చేసేది ఇలాగే. బిడ్డకు తండ్రికి మధ్య ఉండే పోలికలు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే.. తోబుట్టువుల మధ్య ఇది 25 శాతం నుంచి 75 శాతం వరకూ ఉంటుంది. ఒకే పిండం రెండుగా విడిపోయి పుట్టిన కవలల్లో మాత్రమే వంద శాతం పోలిక కనిపిస్తుంది. ఎవరైనా డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవచ్చా? భారత్‌లో ప్రస్తుతానికి ఇది సాధ్యం కాదు. మాతృత్వ, పితృత్వ పరీక్షల కోసం కోర్టు ఆదేశాలు తప్పనిసరి. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్‌తోపాటు తిరువనంతపురంలోని ద రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్జీసీబీ) ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఈ ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ నియంత్రణ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు, ప్రమాదాల్లో మరణించి రూపురేఖలు తెలియని స్థితిలో ఉన్న వారి కి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు అందులో ప్రామాణిక పద్ధతులను నిర్దేశించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
తల్లీబిడ్డలను కలిపిన డీఎన్ఏ
సాక్షి, హైదరాబాద్: ఆ తల్లీ బిడ్డలను డీఎన్ఏ పరీక్ష కలిపింది. ఎవరి పిల్లలు వారికి దక్కడంతో వారం రోజులుగా తల్లడిల్లిన ఆ తల్లుల కళ్లల్లో ఆనందం వ్యక్తమైంది. హైదరాబాద్‌లోని ఏఎస్ఆర్ నగర్‌కు చెందిన శివకుమార్ భార్య అఖిల, ఎల్బీ నగర్‌కు చెందిన మహేశ్ సతీమణి మనీషారాణి ప్రసవం కోసం ఇటీవల నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో చేరారు. నవంబర్ 29న ఒకే సమయంలో వేర్వేరుగా ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చారు. ప్రసూతి విభాగంలోని కిందిస్థాయి సిబ్బంది శిశువులకు కట్టిన ట్యాగ్‌ను పరిశీలించకుండానే ఒకరి బిడ్డను మరొకరికి అప్పగించారు. బంధువులకు అనుమానం వచ్చి ఆందోళనకు దిగడంతో అప్రమత్తమైన ఆస్పత్రి వైద్యులు అదే రోజు శిశువులకు రక్త పరీక్ష నిర్వహించి, వారి తల్లులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలపై తమకు నమ్మకం లేదని, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని శిశువుల తల్లిదండ్రులు పట్టుబట్టడంతో ఆ మేరకు డిసెంబర్ ఒకటో తేదీన శిశువులు, తల్లిదండ్రుల నుంచి రక్తపు నమూనాలు సేకరించారు. బుధవారం ఉదయం డీఎన్ఏ ఫలితాలు వచ్చాయి. రిపోర్టు ఉన్న సీల్డ్ కవర్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ, శిశువుల తల్లిదండ్రుల సమక్షంలో తెరిచి, అందులో ఏముందనేదీ బయటికి చదివి వినిపించారు. ముందస్తుగా అప్పగించినట్లు ఎవరి శిశువు వారి చెంతే ఉన్నట్లుగా రిపోర్టులో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అప్రమత్తమయ్యాం: ఈఎస్ఐ మెడికల్ సూపరింటెండెంట్ ఆస్పత్రి కి ంది స్థాయి సిబ్బంది పొరపాటు వల్ల చిన్నారుల తారుమారు జరిగిందని నాచారం ఈఎస్ఐ మెడికల్ సూపరెండెంట్ డాక్టర్ పద్మజ చెప్పారు. తల్లిదండ్రులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని పట్టు పట్టడంతో రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఎవరి పిల్లలు వారి వద్దనే ఉన్నట్లు తేలిందని చెప్పారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరగరాదు ఆస్పత్రిలో చిన్నారుల తారుమారు ఘటనపై చిన్న చిన్న పొరపాట్లే తప్పిదాలకు దారి తీస్తుంది. ఈ విషయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. – ఎమ్మెల్యే ప్రభాకర్ ఎంతో ఆవేదన చెందాం తమకు కొడుకు పుట్టాడని ఎంతో సంతోషపడ్డాము. ఇంతలోనే శిశువుల తారుమారు ఘటన తమను ఎంతో ఆవేదనకు గురిచేసింది. వారం రోజులుగా మానసిక ఆందోళనకు గురయ్యాం. చివరకు మా పిల్లలు మా దగ్గర ఉన్నారనే విషయం తెలియడంతో సంతోషంగా ఉంది. – అఖిల, మనీషారాణి -
ఆ చిన్నారులు మారలేదు
-
అమ్మ ఒడికి చేరిన ఆ చిన్నారులు!
సాక్షి, హైదరాబాద్: నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో చిన్నారులు తారుమారైన వ్యవహారం సుఖాంతమైంది. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా ఎవరి చిన్నారులను వారి తల్లిదండ్రులకు అధికారులు బుధవారం అప్పగించారు. ఈ వ్యవహారంలో ఎవరి పోలికలు ఉన్న పిల్లలు వారికే చెందడం గమనార్హం. ఈఎస్ఐ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులు తారుమారు కావడంతో వివాదం తలెత్తింది. చిన్నారులు తారుమారు కావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. తమ బిడ్డను తమకు అప్పగించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ వివాదానికి తెరదించేందుకు ఆస్పత్రి అధికారులు డీఎన్ఏ పరీక్షలను ఆశ్రయించారు. డీఎన్ఏ పరీక్షల ఫలితాలు వచ్చేవరకు చిన్నారులను ఈఎస్ఐ ఆస్పత్రి సంరక్షణలో ఉంచారు. బుధవారం ఉదయం 11 గంటలకు డీఎన్ఏ పరీక్ష ఫలితాలు వచ్చాయి. వీటి ఆధారంగా తారుమారైన ఇద్దరు శిశువుల తమ తల్లుల ఒడికి చేరుకున్నారు. -
జయ.. అమృత.. ఓ మిస్టరీ!
చెన్నై: జయలలిత వారసులమంటూ చాలా మంది కోర్టులను ఆశ్రయించారు. కానీ ఇందులో అమృత అనే యువతి సుప్రీంకోర్టుకు వెల్లడించిన అంశాలు.. అవసరమైతే డీఎన్ఏ పరీక్షకూ సిద్ధమని ప్రకటించటం ఆసక్తికర చర్చకు తెరలేపింది. అయితే. అసలు జయకు కూతురుందా? ఉంటే ఆమెనెవరు పెంచారు? జయ సన్నిహితులేమంటున్నారు? ఈ అమృత ఎవరు? ఈ అంశాలపై స్పష్టత వస్తేనే కేసులో చిక్కుముడి వీడుతుంది. ఈ నేపథ్యంలో అమృత చెబుతున్న అంశాలను ఓసారి గమనిస్తే.. అమృత చెబుతున్నదేంటి? జయలలిత సినీ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లోనే 1980 ఆగస్టు 14న చెన్నై సమీపంలోని మైలాపూర్‌లో జయలలిత నివాసంలో తాను జన్మించినట్లు అమృత తెలిపారు. ‘సినిమా కెరీర్ పాడవకుండా బిడ్డపుట్టిన విషయాన్ని బయటకు రానీయకుండా జయ కుటుంబసభ్యులు జాగ్రత్తపడ్డారు. తనను శైలజ, సారథి దంపతులకు అప్పగించటంతో.. అప్పటినుంచి బెంగళూరులోని రామసంద్రలోనే పెరిగాను. రెండేళ్ల క్రితం శైలజ మృతి చెందగా ఈ ఏడాది మార్చిలో సారథి కన్నుమూశారు. చనిపోయే సమయంలో సారథి తనను పిలిచి నేనున వీరి సొంత కూతురిని కాదని.. జయలలిత ఏకైక కుమార్తెను అనే విషయాన్ని చెప్పారు’ అని అమృత పేర్కొన్నారు. సారథి చెప్పిన మిగిలిన వివరాలను జయ బంధువులనడిగి నిర్దారించుకున్నట్లు అమృత తెలిపారు. జయ సన్నిహితులు, బంధువులు, వరుసకు సోదరైన లలిత, మేన కోడలు రంజని కూడా ఈ విషయాన్ని నిర్ధారించారన్నారు. అమ్మ నన్ను ముద్దుపెట్టుకుంది 1996 జూన్ 6న జయలలిత దగ్గరికి తాను తొలిసారి వెళ్లానని, చూసిన వెంటనే ఆమె తనను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుందని అమృత వెల్లడించారు. తర్వాత కూడా పలుమార్లు జయను కలిసినట్లు తెలిపారు. సచివాలయానికి వెళ్లిన ప్రతిసారీ.. ‘నువ్వు ఎక్కడైనా ఉండు. ప్రాణాలతో ఉంటే చాలు’ అనేవారని అమృత తెలిపారు. అమృత చెప్పే విషయాలను జయ చిన్ననాటి స్నేహితురాలు గీత సమర్థించారు. శోభన్‌బాబు–జయలలితకు ఓ కుమార్తె పుట్టిందని, ఆమే అమృత అని తెలిపారు. ఈ విషయం శశికళ సహా జయ సన్నిహితులందరికీ తెలుసన్నారు. జయకు కూతురు ఉన్న విషయం వాస్తవమేనని జయ మేనత్త కూతురు ఎల్ఎస్ లలిత కూడా వెల్లడించారు. అయితే.. ఆ కూతురు అమృతేనా కాదా? అనేది నిర్ధారించలేనన్నారు. ఆరుద్ర భార్య అదే చెప్పారు శోభన్‌బాబుతో సంబంధాన్ని జయలలిత 1979లోనే బయటపెట్టినట్లు తెలుస్తోంది. తమ సంబంధంపై వార్తలు రాసిన నాటి తమిళ వారపత్రిక ‘స్టార్ అండ్ స్టైల్’కు రాసిన లేఖలో ‘ఏడేళ్లుగా శోభన్ బాబుతో సహజీవనం చేస్తున్నా. ఈ విషయాన్ని దాచి పెట్టాల్సిన అవసరం లేదు’ అని జయలలిత చెప్పినట్లు సమాచారం. శోభన్ బాబు వివాహితుడు కావడం వల్లే ఆయన్ను పెళ్లి చేసుకోలేకపోయానని జయ ఆ లేఖలో పేర్కొన్నట్టు చెబుతారు. ఇదే విషయాన్ని ప్రముఖ కవి ఆరుద్ర భార్య రామలక్ష్మి ధృవీకరించారు. శోభన్‌బాబు, జయలలిత మధ్య సంబంధముండేదని, అయితే.. శోభన్ బాబు తన భార్యకు ద్రోహం చేయొద్దనుకోవడంతోనే వీరి ప్రేమ పెళ్లివరకు రాలేదన్నారు. అమృత వెనక శశికళ? సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురినంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన అమృత వెనక శశికళ ప్రోద్బలం ఉన్నట్లు భావిస్తున్నారు. తన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించడానికి అమృత సమాయత్తం అవుతున్నారు. సుప్రీంలో అమృత పిటిషన్ దాఖలు చేసినప్పుడు మద్దతుగా ఆమె బంధువులు లలిత, రంజనీ సంతకాలు చేశారు. జైల్లో శశికళను రంజని కొన్ని నెలల కిత్రం కలుసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమృత ద్వారా జయలలిత వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేయాలని రంజనీకి శశికళ సూచించినట్లు తెలుస్తోంది. జయకు స్వయానా కూతురని అమృత నిరూపించుకుంటే, ఆ తరువాత పార్టీ, ఆస్తులను చేజిక్కించుకోవచ్చని శశికళ పథకం పన్నినట్లుగా ఆమె అంతరంగికులే చెబుతున్నారు. జయలలిత తల్లి సంధ్యకు సమీప బంధువైన రంజనీతో కూడా శశికళకు ముందుగానే పరిచయం ఉంది. 1980లో జయలలిత ప్రసవించినపుడు రంజనీ అక్కడే ఉన్నట్లు లలిత చెప్పిందని సమాచారం. జయలలిత తొలి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మంత్రులు, పార్టీ నేతలు నల్ల చొక్కాలు ధరించి అన్నాశాలై నుంచి అమ్మ సమాధి ఉన్న మెరీనా బీచ్ వరకు మౌనర్యాలీ నిర్వహించారు. జయ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న సీఎం పళని స్వామి, పన్నీర్ సెల్వం -
డాడీ నా ఆస్తి
ఆస్తి ఎప్పుడూ డబ్బే కానక్కర్లేదు. మంచివాళ్లకది అస్తిత్వం కావచ్చు. నాన్న కోసం కొందరు... అమ్మ కోసం కొందరు కొడుకు కోసం కొందరు... ‘కోట్ల’ కోసం కొందరు.. డి.ఎన్.ఎ. పరీక్ష అడుగుతారు. సరదాగా మాట్లాడుకోవాలంటే డి.ఎన్.ఎ. అంటే ‘డాడీ నా ఆస్తి’. అలాంటి ఆస్తుల కోసం జరిగిన... కొన్ని కొట్లాటలివి. అమ్మెవరో, నాన్నెవరో తెలియకపోవడం దురదృష్టం. తెలుసుకునే అవకాశం ఉండడం అదృష్టం. ఆ అదృష్టం పేరే డి.ఎన్.ఎ.టెస్ట్! వారసులెవరో చెప్పడానికి మాత్రమే కాదు, నేరస్థులెవరో తేల్చడానికీ డి.ఎన్.ఎ. టెస్ట్ పనికొస్తుంది. కొన్నిసార్లు సెలబ్రిటీలను బుక్ చెయ్యడానికి కూడా! అమృత అనే బెంగుళూరు అమ్మాయి.. ‘నేను జయలలిత కూతుర్ని. కావాలంటే డి.ఎన్.ఎ. టెస్టు చేయించండి. తేలిపోతుంది’ అని సుప్రీంకోర్టులో కేసు వేసింది. కేసు నిన్న సోమవారం జడ్జీల ముందుకు వచ్చింది. ‘ఇలాంటి కేసులు అనుమతించేది లేదని’ కోర్టు ఆ కేసును తోసేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద అమృత ఆ కేసును వేసింది. జయలలిత మీద కూతురిగా తనకు హక్కు ఉందని ఆమె ఈ కేసు వేయలేదు. జయలలిత మీద కూతురిగా తనకు ఉన్న హక్కుకోసం కేసు వేసింది. అంటే.. జయకూతురిగా ఆమె ఈ కేసు వేసింది! అది కూడా.. ‘తల్లి’ ఆస్తుల కోసం ఆమె ఈ కేసు వేయలేదు. వైష్ణవ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబ ఆచార వ్యవహారాల ప్రకారం తన తల్లికి అంత్యక్రియలు జరిపించుకుంటానని, అందుకు అనుమతి ఇవ్వమని అడిగింది. ఒక వేళ డి.ఎన్.ఎ. టెస్టు తప్పనిసరి అని కోర్టు భావిస్తే, డిసెంబర్ 5 దాటకుండా టెస్టుకు ఆదేశించమని కూడా అమృత కోరింది. చనిపోయి ఏడాది జయలలిత చనిపోయి డిసెంబరు ఐదుకు ఏడాది అవుతుంది. ఏడాది దాటిందంటే మృతదేహంలో డి.ఎన్.ఎ.టెస్టుకు అవసరమైన కణాలు క్షీణించే ప్రమాదం ఉంది. అదీ అమృత తొందర. కోర్టు ఆమె కేసును కొట్టేసింది కాబట్టి ఇప్పుడామెకు ఎలాంటి తొందరా అక్కర్లేదు. అయితే చివర్లో కోర్టు ఒక మాట అంది. కావాలంటే హైకోర్టులో పిటిషన్ వేసుకోమంది. 37 ఏళ్ల అమృత నవంబర్ 22న సుప్రీం కోర్టులో ఈ కేసు వేసింది. అంతకు ముందు కూడా ఒక వ్యక్తి ‘నేను జయమ్మ కొడుకును’ అంటూ కోర్టుకు ఎక్కి కోర్టు చేత చివాట్లు తిన్నాడు. ఇప్పుడు అమృతను కోర్టు మరీ అంతగా చివాట్లు వేయలేదు కానీ, ‘ఏంటమ్మా.. ఇది!’ అని మాత్రం చికాకు పడింది. నిజానికి ఇదేమంత సెన్సేషనల్ కేసు కాదు. వచ్చే రెండుమూడు రోజుల్లో అమృత హైకోర్టుకు వెళ్లి, హైకోర్టు డి.ఎన్.ఎ. టెస్టుకు ఆదేశిస్తే అప్పుడైనా అది వార్త మాత్రమే అవుతుంది కానీ, సంచలన వార్త అయ్యే అవకాశం లేదు. సెలబ్రిటీల జీవితాల్లోకి ఇలాంటి కూతుళ్లు, కొడుకులు వస్తుంటారు. పోతుంటారు. కొద్దిమందే నిజ నిర్థారణలో వారసులని తేలుతుంటారు. ఆ మధ్య.. ధనుష్ తమ కొడుకనీ, డి.ఎన్.ఎ. టెస్టు చేయిస్తే తేలుతుందని.. తమిళనాడులోని వృద్ధ దంపతులిద్దరు కోర్టును ఆశ్రయించారు. అప్పుడు మాత్రం అది సంచలనం అయింది. సాక్ష్యంగా ధనుష్ మణికట్టు మీద పచ్చబొట్టు కూడా ఉంటుంది చూసుకొమ్మని ఆ ‘అమ్మానాన్న’ ప్రూఫ్ చూపించారు. పచ్చబొట్టు కనిపించలేదు! కొందరికైతే చెరిగిపోయిన పచ్చబొట్టు కనిపించింది. మొత్తానికి డి.ఎన్.ఎ. వరకూ వెళ్లకుండానే ‘డీల్’ కుదిరిపోయింది. డి.ఎన్.ఎ. తివారీ! కాంగ్రెస్ లీడర్ ఎన్.డి. తివారీకి ఇంకోపేరు డి.ఎన్.ఎ. తివారి. పాపం ఆయనకది మీడియా పెట్టిన పేరు. ప్రస్తుతం తివారీ వయసు 92 ఏళ్లు. ‘కృష్ణారామా’ అనుకుంటూ ఢిల్లీలో గడుపుతున్నారు. పదేళ్ల క్రితం రోహిత్ శేఖర్ అనే వ్యక్తి ‘నాన్న కోసం’ అంటూ కోర్టుకెక్కాడు. ‘ఎవర్నాయనా మీ నాన్న?’ అని కోర్టు అడిగితే.. ఎన్.డి. తివారీ పేరు చెప్పాడు. తివారీ కాదన్నా, డి.ఎన్.ఎ. టెస్టు కాదనలేదు. చివరికి ‘వాడు.. నా కొడుకే’ అని తివారీ ఒప్పుకున్నారు. ఫారిన్లో అయితే ఎప్పుడూ ఏదో ఒక డి.ఎన్.ఎ. గొడవ ఉంటూనే ఉంటుంది. స్వర్గీయ స్టీవ్ జాబ్స్ కూడా డి.ఎన్.ఎ. కేసులో ఉన్నారు. స్టీవ్‌కి చిన్ననాటి స్నేహితురాలు క్రిస్–యాన్‌కు బిడ్డ పుట్టినప్పుడు, ఆ బిడ్డకు తండ్రి స్టీవేనని ఆమె లోకానికి ప్రకటించింది. అయితే స్టీవ్ ఒప్పుకోలేదు. చివరికి డి.ఎన్.ఎ. టెస్టులో అతడే తండ్రి అని తేలింది! హాలీవుడ్ స్టార్ ఎడ్డీ మర్ఫీది ఇలాంటి కథ. ఒక అమ్మాయిని తల్లిని చేసి, నేను మాత్రం తండ్రిని కాదు అన్నాడు. డి.ఎన్.ఎ. ఒప్పుకుంటుందా? ‘డాడీ’ అని íపిలిపించింది. ఆమెరికన్ టీవీ సెలబ్రిటీ ‘కోర్ట్నీ కర్దేషియన్’ ది మాత్రం రివర్స్ స్టోరీ. ఆమె తన కొడుకుని ‘అడుగో డాడీ’ అంటూ తన బాయ్‌ఫ్రెండ్ స్కాట్ డిసిక్ దగ్గరికి పంపింది. డి.ఎన్.ఎ. టెస్టు మాత్రం ‘నో డాడీ’ అనేసింది. బ్రిటన్ ప్యాలెస్‌లో ఇండియన్! ప్రిన్స్ విలియమ్స్‌ది అయితే డి.ఎన్.ఎ. థ్రిల్లర్. రెండు శతాబ్దాల పాటు భారతదేశాన్ని పరిపాలించిన ఆంగ్లేయులు భారతదేశంలోని సంపదలను దోచుకున్నారని చరిత్ర చెబుతోంది. అయితే డి.ఎన్.ఏ పరీక్ష ఒక సంచలన వార్తను ప్రపంచానికి తెలియచేసింది. భారతీయ సంతతిని బ్రిటిష్ రాయల్ తన ప్యాలెస్‌కి తీసుకెళ్లిందట! ప్రిన్స్ విలియమ్స్‌కి చేసిన డిఎన్ఏ పరీక్షలో ప్రిన్స్ విలియమ్స్ భారతీయ సంతతికి జన్మించినవాడని రిపోర్ట్ వచ్చింది. చార్లెస్ ప్రిన్స్ నాలుగు తరాల ముందు ఉన్న నాయనమ్మ... ఎలిజా కేవార్క్, థియోడర్ ఫోర్బ్స్ (1788 – 1820) ల కుమార్తెట. థియోడర్ సూరత్‌లో వ్యాపారం చేశాడట. అలా ప్రిన్స్ విలియమ్స్‌కి భారతదేశంతో అనుబంధం ఉందని డి.ఎన్.ఏ పరీక్ష తేల్చి చెప్పింది. విశ్వవిఖ్యాత అమెరిక్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రేకు 2005లో డి.ఎన్.ఏ పరీక్ష చేయించుకునే వరకు, తను ఆఫ్రికా జులు జాతికి చెందిన మహిళనని తెలియదు. జొహన్నస్‌బర్గ్‌లో ఒక సెమినార్లో ఈ వాస్తవం ఆమె బయట పెట్టారు. డి.ఎన్.ఏ పరీక్ష ద్వారా, తన మూలాలు దక్షిణాఫ్రికాకి చెందిన జులు జాతికి చెందినవి తెలుసుకున్నానని, ఆ జాతికి చెందిన వ్యక్తిని కావడం తనకు చాలా సంతోషంగా చెప్పుకున్నారు. ‘నేను జయప్రద భర్తని’ అని చాలా ఏళ్ల క్రితం ఒకాయన రాద్ధాంతం చేశాడు. ఆయనే.. ‘ప్రియాంకను కూడా నేను పెళ్లి చేసుకున్నాను’ అని ఆ ఊరూ, ఈ ఊరూ తిరుగుతూ చెప్పుకున్నాడు. డి.ఎన్.ఎ.లో ఆ విషయాలు తేలవు. నాలుగు పీకితే తేల్తాయి. బ్లడ్ రిలేషన్‌కి క్లెయిమ్ చేస్తే మాత్రం డి.ఎన్.ఎ. తప్పదు. బ్రహ్మ దేవుడే దిగి వచ్చి ‘అతడే మీ డాడీ, ఈమే మీ మమ్మీ’ అని చెప్పినా నమ్మేందుకు ఆధారం ఉండదు కానీ డి.ఎన్.ఎ. చెబితే మాత్రం బ్రహ్మైనా నమ్మాల్సిందే. -
సర్కారీ విత్తూ..నాసిరకమే!
♦ రైతులకు నాసిరకం విత్తనాలను అంటగట్టిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ♦ సోయాబీన్, జీలుగ విత్తనాలు నాణ్యమైనవి కావని లేబొరేటరీలో నిర్ధారణ ♦ విత్తనాభివృద్ధి సంస్థకు నోటీసుల జారీకి వ్యవసాయశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలపై యుద్ధం అంటూ ప్రభుత్వం ఓవైపు దాడులు చేస్తుంటే.. మరోవైపు సర్కారు వారి సంస్థే రైతులకు నాసిరకం విత్తనాలను అంటగట్టింది. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (టీఎస్ఎస్డీసీ) సబ్సిడీపై సరఫరా చేసిన సోయాబీన్, జీలుగ విత్తనాలు నాసిరకమని సాక్షాత్తూ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని డీఎన్ఏ లేబొరేటరీ నిర్ధారించడం నివ్వెరపరుస్తోంది. వాస్తవానికి సోయాబీన్, జీలుగ విత్తనాల్లో 80–95 శాతం వరకు మొలక రావాలి. కానీ వికారాబాద్ జిల్లా తాండూరులో సేకరించిన సోయాబీన్ విత్తనా న్ని డీఎన్ఏ లేబొరేటరీలో పరీక్షించగా.. కేవలం 56 శాతమే మొలక రావడం గమనార్హం. అదే జిల్లా పెద్దేముల్లో సేకరించిన జీలుగ విత్తనా లను పరీక్షించగా అందులో 46 శాతమే మొలక వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో సేకరించిన సోయాబీన్ (జేఎస్‌వో–335 వెరైటీ) విత్తనాన్ని డీఎన్ఏ లేబొరేటరీలో పరీక్షించగా 57 శాతమే మొలక ఉన్నట్లు నిర్ధారించారు. అదే జిల్లాలో ఓ చోట సేకరించిన జీలుగ విత్తనంలో 55 శాతమే మొలక ఉన్నట్లు గుర్తించారు. యాథృచ్చికంగా అక్కడక్కడ సేక రించిన నమూనాల్లోనే ఇలా నాసిరకం సర్కారు విత్తనాలు బయటప డడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహనే ఎండీగా వ్యవహరిస్తుం డటం గమనార్హం. ఇతర ప్రైవేటు విత్తన కంపెనీలపై ఎలా చర్యలు తీసు కుంటారో.. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విత్తనాభివృద్ధి సంస్థకు కూడా నోటీసులు జారీ చేస్తామని, ఆ ప్రకా>రం కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తామని వ్యవసాయశాఖ విత్తన విభాగం డిప్యూటీ డైరెక్టర్ కుమారస్వామి ‘సాక్షి’కి తెలిపారు. టెండర్ల ద్వారా కొనుగోలు చేసి... ఖరీఫ్‌లో 2.5 లక్షల క్వింటాళ్ల వరి, 63,800 క్వింటాళ్ల మొక్కజొన్న, 64 వేల క్వింటాళ్ల జీలుగ, 2.40 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పటివరకు 43 వేల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు, 39 వేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలు సరఫరా చేశారు. సోయాబీన్ విత్తనాలను 33 శాతం సబ్సిడీతో, జీలుగ విత్తనాలను 50 శాతం సబ్సిడీతో సరఫరా చేశారు. వీటిని టెండర్లు, ప్రైవేటు విత్తన కంపెనీల ద్వారా సేకరించి రైతులకు విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసింది. నిబంధనల ప్రకారం టెండర్లు పిలవకపోవడం, నాణ్యమైన విత్తనాలను సరఫరా చేశారా? లేదా? అన్న అంశంపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే సోయాబీన్, జీలుగ విత్తన నమూనాల్లో కొన్నిచోట్ల నాసిరకం విత్తనాలు వెలుగుచూశాయి. ప్రభుత్వమే ఇలాంటి విత్తనాలు సరఫరా చేస్తే ఇక ప్రైవేటు కంపెనీలు సరఫరా చేసే ఇతర విత్తనాలపై రైతులకు నమ్మకం ఎలా కలుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా సోయాబీన్ విత్తనాలను అధిక ధరకు కొనుగోలు చేసేలా కంపెనీలతో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ టెండర్లు ఖరారు చేయడంపై మొదట్లో విమర్శలు వచ్చాయి. దుమారం చెలరేగడంతో సర్కారు వాటి ధరలను కాస్తంత తగ్గించింది. కానీ కంపెనీలు సరఫరా చేసిన విత్తనాలపై నిఘా పెట్టడంలో వ్యవసాయశాఖ విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర విత్తనాలూ అంతే..? ప్రైవేటు కంపెనీలు సరఫరా చేసిన విత్తనాల్లో కూడా ఎక్కువగా నాసిరకానివే ఉన్నట్టు డీఎన్ఏ లేబొరేటరీలో నిర్ధారణ అయింది. పోలీసులు, వ్యవసాయాధికారులు బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలోని పలు దుకాణాలు, కంపెనీల గోదాముల నుంచి విత్తన నమూనాలు సేకరించారు. ఇప్పటివరకు సేకరించిన నమూనా విత్తనాలు 5,594 కాగా.. అందులో 3,830 విత్తనాలను డీఎన్ఏ లేబొరేటరీలో పరీక్షించారు. అందులో 122 విత్తనాలు నాసిరకమని తేలింది. అందులో అత్యధికంగా 92 విత్తన నమూనాలు పత్తివే ఉన్నాయి. నాణ్యమైన విత్తనాలైతే 95 శాతానికి పైగా మొలకెత్తుతాయి. అయితే రైతులకు విక్రయించినవాటిలో అత్యధికం 55 నుంచి 70 శాతంలోపే మొలకలుంటున్నాయి. ప్రభుత్వం తూతూమంత్రంగానే విత్తన కంపెనీలపై కేసులు పెడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క పీడీ యాక్టు కేసు నమోదైంది. మిగిలినవన్నీ అత్యంత సాధారణ కేసులు.. అరెస్టులే! దీంతో విత్తన కంపెనీ యాజమాన్యాలు ఏమాత్రం భయపడడంలేదని అంటున్నారు. -
కన్నబిడ్డలేనా..? తండ్రులు డిఎన్ఏ టెస్ట్..
పుణె నగరంలో తండ్రులు పిల్లలు తమ కన్నబిడ్డలేనా అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ సైన్సు లేబొరేటరీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బిడ్డలు తమ సొంతవారా కాదా? అనే అనుమానంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వచ్చే తల్లిదండ్రుల సంఖ్య 2014లో 37గా ఉండగా.. 2015లో 197కు చేరింది. గతేడాది 321 మంది డిఎన్ఏ పరీక్షలు చేయించుకున్నట్లు పుణె ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ కృష్ణకాంత్ కులకర్ణి చెప్పారు. 2014 నుంచి డిఎన్ఏ పరీక్షలు చేసే సదుపాయాన్ని ల్యాబ్‌లో కల్పించినట్లు తెలిపారు. అప్పటి నుంచి వందల సంఖ్యలో జంటలు డిఎన్ఏ పరీక్షల కోసం వస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఈ కేసులు ముంబైలో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వెళ్లేవని తెలిపారు. అందుకే పుణె నుంచి డిఎన్ఏ పరీక్షలకు వెళ్తున్న వారి సంఖ్యను గుర్తించలేకపోయామని చెప్పారు. ముంబై ల్యాబ్‌లో ఎక్కువ మంది డిఎన్ఏ పరీక్షలకు వస్తుండటంతో పుణెలో కూడా ఆ సదుపాయాన్ని ప్రారంభించారని తెలిపారు. గత మూడేళ్లలో డిఎన్ఏ పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని వివరించారు. ముఖ్యంగా పిల్లలు కన్నబిడ్డలేనా? అని తెలుసుకోవడానికి ఎక్కువ మంది వస్తున్నారని చెప్పారు. క్రిమినల్, హత్య కేసుల ఒత్తిడి విపరీతంగా ఉండగా.. అందుకు తోడుగా పెటర్నిటీ టెస్టు కోసం వస్తున్నవారి సంఖ్య పెరగడంతో తలకు మించిన భారంగా మారుతోందని తెలిపారు. పెటర్నిటీ టెస్టుల కోసం వస్తున్న జంటల్లో సంపన్న కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయని అధికారులు తెలిపారు. జంటల్లో ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడమే వారిని ల్యాబ్‌ల వద్దకు తీసుకువస్తోందని అన్నారు. టెస్టుకు భారీగా ఖర్చు అవుతుందని చెప్పారు. పిల్లల డిఎన్ఏ తల్లి డిఎన్ఏతో మ్యాచ్ అయితే.. అనుమానం నివృత్తి చేసుకోవడానికి తండ్రి కూడా టెస్టు చేయించుకుంటున్నారని తెలిపారు. ఆస్తి వివాదాల మీద కూడా కొన్ని జంటలు పెటర్నిటీ టెస్టు చేయించుకుంటున్నట్లు వెల్లడించారు. -
డీఎన్ఏ టెస్టు చేయించుకున్నా.. నేనెవరంటే!
-
డీఎన్ఏ టెస్టు చేయించుకున్నా.. నేనెవరంటే!
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన లౌకికవాదాన్ని తెలియజెప్పేందుకు ఓ మంచి ప్రయత్నం చేశాడు. దేశ ప్రజలందరికీ తాను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు. ఒక చిన్న వీడియో రూపొందించి.. దాని ద్వారా తన మతం ఏంటో అందరికీ తెలియజేశాడు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. ఆ వీడియోకు 16.66 అనే టైటిల్ పెట్టాడు. తనది ఏ మతమో తెలుసుకోడానికి తాను డీఎన్ఏ టెస్టు్ చేయించుకున్నానని ముందుగా అందులో చెబుతాడు. వీడియోలో ఎక్కడా నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడని నవాజుద్దీన్.. అన్నింటినీ తెల్లటి ప్లకార్డుల మీద నల్లటి మార్కర్‌తో రాసి వివరిస్తాడు. ''హాయ్ నేను నవాజుద్దీన్ సిద్దిఖీని. నేను డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నా. దాని రిపోర్టు వచ్చింది. అందులో నేను ఎవరని ఉందంటే..'' అంటూ మొదలుపెడతాడు. అప్పటివరకు మామూలు ప్యాంటు, షర్టులలో ఉన్న నవాజ్.. ఆ తర్వాతి నుంచి ఒక్కో డ్రస్ మారుస్తుంటాడు. తెల్లటి కుర్తా పైజమా ధరించి, నుదుటన సింధూరం పెట్టుకుని, భుజం మీదుగా కాషాయ వస్త్రం ఒకటి కప్పుకొని.. తాను 16.66% హిందువునని చెబుతాడు. ఆ తర్వాతి షాట్లో నల్లటి బంద్గలా సూట్ వేసుకుని, తలమీద తెల్లటి ఫర్టోపీ పెట్టుకుని తాను 16.66% ముస్లింనని అంటాడు. ఆపై గెడ్డం, మీసాలు, తలమీద ఎర్రటి తలపాగాతో కనిపించి 16.66% సిక్కునని వివరిస్తాడు. అంతేకాదు, తెల్లగా పైనుంచి కింది వరకు ఒకటే డ్రస్ వేసుకుని, మెడలో శిలువ చైన్ ధరించి తాను 16.66% క్రిస్టియన్ అని కూడా చెబుతాడు. ఆ తర్వాత బౌద్ధులు ధరించే కాషాయ దుస్తులు ధరించి, తాను 16.66% బౌద్ధుడినంటాడు. మిగిలిన 16.66% ప్రపంచంలో మిగిలిన అన్ని మతాలు కలిసి ఉన్నాయంటాడు. చివరగా.. తన తన ఆత్మను కనుగొన్నప్పుడు మాత్రం, తాను నూటికి నూరుశాతం కళాకారుడినని స్పష్టం చేస్తాడు. దేశంలో లౌకివాదం మీద పెరుగుతున్న చర్చ నేపథ్యంలో అందరూ సమానమేనని చెప్పడానికి నవాజుద్దీన్ తనదైన శైలిలో ఇలా ఒక ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం నవాజ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. మున్నా మైఖేల్, మంటో, మామ్, బాబుమొషాయ్ బందూక్‌బాజ్ సినిమాల్లో అతడు నటిస్తున్నాడు. Sixteen Point Six Six...https://t.co/MKS9gBY6R1 — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) 24 April 2017 -
'మోగ్లీ గర్ల్ మా పాపే'
లఖింపూర్ ఖేరి: ఉత్తరప్రదేశ్ లోని ఓ అడవిలో కోతులతో పాటు జీవిస్తూ పోలీసుల కంటపడిన ఎహ్సాస్ అలియాస్ 'మోగ్లీ గర్ల్' తమ బిడ్డేనంటూ ఓ జంట పోలీసులను ఆశ్రయించింది. ఎహ్సాస్ అసలు పేరు లక్ష్మీ అని 2012లో ఆమె తప్పింపోయిందని వారు చెబుతున్నారు. ఈ మేరకు 2012 నవంబర్ లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పత్రాన్ని ఆధారంగా చూపారు. తమకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి లక్ష్మీని అప్పగించాలని కోరుతున్నారు. రోటిన్ పెట్రోలింగ్ కు వెళ్లిన పోలీసులకు అడవిలో కోతులతో ఆడుకుంటూ ఓ అమ్మాయి కనిపించింది. దీంతో ఆమె కాపాడి స్ధానిక ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. ఇందుకు సంబంధించి ఓ కేసును కూడా నమోదు చేశారు. అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాలకు చిక్కలేదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. కాగా, మోగ్లీ గర్ల్ తమ బిడ్డేనని జంట చూపుతున్న ఫిర్యాదు పత్రాన్ని పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
కవలలే భార్యాభర్తలు!
వాషింగ్టన్: కొన్నాళ్ల కిందట అమెరికాలో ఓ జంట వివాహమాడింది. సంతానం కలగకపోవడంతో వారు ఐవీఎఫ్ కేంద్రాన్ని ఆశ్రయించారు. కానీ అక్కడే వారిని నిర్ఘాంతపరిచే విషయం తెలిసింది. వారివురూ కవలలు అని వైద్యులు చెప్పడంతో ఆశ్చర్యానికి లోన య్యారు. ‘వారివురి డీఎన్ఏ నమూనాలను చూసి ఆశ్చర్యపోయాను. ఇద్దరి డీఎన్ఏలు ఒకే విధంగా ఉన్నాయి. ముందుగా వీరివురికి దగ్గరి బాంధవ్యం ఉండొచ్చని భావించా. ఆ తర్వాత వారి పుట్టిన తేదీలు ఒకే రోజు కావడంతో నిర్ఘాంతపోయాను. డీఎన్ఏలను క్షుణ్నంగా పరీక్షించి వారిద్దరు కవలలు అని నిర్ధారణకు వచ్చాను’ అని డీఎన్ఏ పరీక్ష చేసిన డాక్టర్ హెరాల్డ్ చెప్పారు. అయితే నిజానికి వీరు చిన్నతనంలోనే ఓ రోడ్డు ప్రమాదంలో తమ తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ తర్వాత వీరిద్దరిని వేర్వేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాయని డాక్టర్ వివరించారు. -
డిఎన్ఏ పరీక్షకు ధనుష్ నో!
డీఎన్ఏ పరీక్షకు నటుడు ధనుష్ ససేమిరా అంటున్నారు. ధనుష్ తమ కొడుకు అంటూ మదురై జిల్లా మేలూర్కు చెందిన కదిరేశన్–మీనాక్షి దంపతులు మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో మొదలైన కలకలం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజా పరిణామం ఏమిటంటే కదిరేశన్, మీనాక్షీ దంపతులు ధనుష్ తమ కొడుకేనని నిరూపించడానికి తాము డీఎన్ఏ పరీక్షకు సిద్ధం అని మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగగా వారి ఆరోపణల్లో నిజం లేదని, అందుకు ఆధారాలు తాము ఇప్పటికే కోర్టుకు సమర్పించామని ధనుష్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే డీఎన్ఏ పరీక్షకు అంగీకరించబోమని, అది నటుడు ధనుష్ ఆత్మవిశ్వాసానికి, స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ తేదీని ప్రకటించకుండా వాయిదా వేశారు. -
అతిపెద్ద ఆదిమచరిత్ర!
⇒ సిద్దిపేటలో బయటపడ్డ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాప్‌స్టోన్ ⇒ చరిత్రలో నిలవనున్న నంగునూరు మండలం నర్మేట గ్రామం ⇒ భారీ క్రేన్ ద్వారా పురాతన సమాధిపై భారీ శిల తొలగింపు ⇒ రెండు గంటపాటు శ్రమించిన పురావస్తుశాఖ అధికారులు ⇒ డీఎన్ఏ పరీక్షల ద్వారా త్వరలో ఇతర వివరాలు వెల్లడి నంగునూరు: సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం నర్మేటలో బయటపడ్డ ప్రాచీన మానవుని సమాధి ప్రపంచంలోనే అతిపెద్ద క్యాప్‌స్టోన్(సమాధి మీద ఉంచే రాయి)గా నిలుస్తుందని పురావస్తుశాఖ సహాయ సంచాలకుడు రాములునాయక్ పేర్కొన్నారు. నర్మేటలో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో వెలుగుచూసిన అతిపెద్ద సమాధిపై ఉన్న గండ శిలను మంగళవారం భారీ క్రేన్‌తో తొలగించారు. వారం రోజుల కిందట బండను లేపేందుకు ప్రయత్నించగా క్రేన్ వైర్లు తెగిపోవడంతో హైదరాబాద్ నుంచి భారీ క్రేన్‌ను తెప్పించారు. పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్లు రంగాచార్యులు, పద్మనాభం పర్యవేక్షణలో బండను లేపేందుకు ప్రయత్నించారు. ఒక దశలో క్రేన్ పైకి లేవడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్‌కు సూచనలు చేస్తూ, రెండు గంటలపాటు శ్రమించి రాతిబండను ఎట్టకేలకు పక్కకు జరిపించడంతో...స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రాములునాయక్ మాట్లాడుతూ మెన్హీర్ వద్ద బయటపడ్డ ఈ రాతి సమాధి సుమారుగా 40 టన్నులు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నామన్నారు. 15 రోజులపాటు తవ్వకాలు జరిపి, అందులో లభించిన అవశేషాలకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రాచీన మానవులు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వారి ఆహా రపు అలవాట్లు ఏమిటి, జీవితకాలం ఎంత, వారి సంతతి ఎలా అంతరించిపోయింది అనే విషయాలపై శాస్త్రీయంగా పరిశోధన చేసి మూడు నెలల్లో బహిర్గతం చేస్తామన్నారు. పెరిగిన సందర్శలకు తాకిడి తవ్వకాల్లో బయటపడ్డ రాతి శిలను మంగళవారం తొలగిస్తున్నారని తెలియడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. సిద్దిపేటలోని శ్రీవిద్య కళాశాల విద్యార్థులు అక్కడికి చేరుకొని మెన్హీర్, తవ్వకాల్లో బయటపడ్డ వస్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. జెడ్పీవైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సోమిరెడ్డి, రమేశ్‌గౌడ్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు సమాధిపై శిలను తొలగించడాన్ని ఆసక్తిగా తిలకించారు. పక్కకు తొలగించిన సమాధిపై కప్పు -
సౌదీ కంపెనీ నిర్బంధంలోని కార్మికులను విడిపించండి
కేంద్ర మంత్రి సుష్మాకు కేటీఆర్ లేఖ సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియాలోని అల్–హజ్రీ ఓవర్సీస్ కంపెనీ నిర్బంధంలో ఉన్న 29 మంది రాష్ట్ర కార్మికులకు విముక్తి కల్పించి, స్వదేశానికి రప్పించేందుకు సహకరించాలని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌కు రాష్ట్ర ఎన్ఆర్ఐ విభాగం మంత్రి కె.తారకరామా రావు సోమవారం లేఖ రాశారు. కార్మికులను కంపెనీ యాజమాన్యం ఓ గదిలో నిర్బంధించిందని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్మికులను భారత్ పంపించేందుకు కంపెనీ ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు డిమాండ్ చేస్తోందన్నారు. కార్మికులు స్థానిక కార్మిక కోర్టుని ఆశ్రయించగా, కంపెనీ సొంత ఖర్చులతో 3 రోజుల్లో కార్మికులను స్వదేశానికి పంపించా లని తీర్పు ఇచ్చిందన్నారు. అయినా, కంపెనీ యాజమాన్యం కార్మి కులను ఓ గదిలో నిర్బందంలో ఉంచిందన్నారు. సౌదీలోని కంజీ నగరం అల్ సఫానియా ప్రాంతంలో ఈ కార్మికులు ఉన్నారని తెలిపారు. డీఎన్ఏ టెస్టు కోసం అబుదాబీకి ఇదిలా ఉండగా అబుదాబీలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో మృతిచెందిన నలుగురు రాష్ట్ర కార్మికుల మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించేందు కోసం రక్త నమూనాలు అందజేసేందుకు వారి కుటుంబ సభ్యులు మంగళవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అబు దాబీకి వెళ్లనున్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు వారికి పాస్‌పోర్టు, వీసా ఏర్పాట్ల ను పూర్తి చేసినట్లు సాధారణ పరిపాలన విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. -
చరిత్ర ఆనవాళ్లను చెరిపేయొద్దు
నంగునూరు: తవ్వకాల సందర్భంగా గ్రామాలలో బయటపడుతున్న చారిత్రక ఆనవాళ్లను కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పురావస్తు శాఖ సంచాలకులు విశాలాక్షి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో రెండో విడత తవ్వకాలను ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలమాకులలోని రక్కిసరాళ్ల ప్రాంతంలో ఆది మానవుల అవశేషాలు ఉన్నాయన్నారు. సుమారు 3,500 సంవత్సరాల కిందట ఇక్కడ మానవులు జీవించారని, సిస్ట్ బరియల్ సమాధులను నిర్మించారని చెప్పారు. ఆదిమానవులు ఎక్కడి నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారో శాస్త్రీయంగా పరిశోధిస్తామన్నారు. పుల్లూర్‌లో జరిపిన తవ్వకాల్లో 2,500 యేండ్ల నాటి సమాధులుగా తేల్చామని, నర్మెట, పాలమాకులలో లభించే వస్తువులపై డీఎన్ఏ పరీక్షలు చేసి వాస్తవాలు వెలికి తీస్తామన్నారు. తెగిన క్రేన్ వైర్లు తవ్వకాల్లో భాగంగా బయటపడ్డ అతి పెద్ద రాతి సమాధిని తెరిచేందుకు రెండు క్రేన్లతో ప్రయత్నించగా.. ఓ క్రేన్ తీగలు తెగి గాలిలోకి లేచింది. రాతిబండ చాలా బరువు ఉందని, హైదరాబాద్ నుంచి రెండు భారీ క్రేన్లను తెప్పించి కప్పులను తొలగిస్తామని విశాలక్షి తెలిపారు. ఆమె వెంట పురావస్తుశాఖ ఉప సంచాలకులు రాములునాయక్, సహాయ సంచాలకులు పద్మనాభం, జెడ్పీవైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ రవీందర్‌రెడ్డి, పురావస్తుశాక సహాయ సంచాలకులు నాగరాజు, ప్రాచీన కట్టడాల సంరక్షకుడు భానుమూర్తి, స్థానిక నాయకులు ఉన్నారు. -
మధ్య ఆసియా టు సిద్దిపేట
వేల ఏళ్ల కిందే ఇక్కడికి వలసలు ► యూరప్ నుంచీ వచ్చిన మానవ సమూహాలు ►తిరుగు ప్రయాణమైన కొన్ని గుంపులు ►పురాతత్వ శాస్త్రవేత్తలు, సీసీఎంబీ పరిశోధనలో వెల్లడి ►పుల్లూరు, ఖమ్మం శిలాయుగపు సమాధుల అవశేషాలకు డీఎన్ఏ పరీక్ష ► అంతర్జాతీయసదస్సులో పురావస్తుశాఖ సంచాలకురాలు విశాలాచ్చి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సిద్దిపేట.. వేల కిలోమీటర్ల దూరంలోని మధ్య ఆసి యా.. ఈ రెండు ప్రాంతాలకు ఏదైనా సంబంధముందా? అసలా అవకాశం ఉండదనే అనుకుంటాం. కానీ మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవారు సిద్దిపేట పరిసరాలకు వలస వచ్చారని పురావస్తు పరిశోధకులు, సీసీఎంబీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. వేల ఏళ్ల క్రితం ఈ వలసలు సాగాయని తేలింది. డీఎన్ఏ పరీక్షలతో.. పురావస్తు శాఖ సిద్దిపేట సమీపంలోని పుల్లూరుబండలో 2015లో తవ్వకాలు జరిపి.. వేల ఏళ్లనాటి బృహత్ శిలాయుగపు సమాధులను గుర్తించింది. ఖమ్మం పరిధిలో గతంలో జరి పిన తవ్వకాల్లో వెలుగుచూసిన ఆనవాళ్లను భద్రపరిచి ఉంచారు. వాటన్నింటినీ ఇటీవలే సీసీఎంబీకి పంపి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. సమాధుల్లో లభించిన అవశేషాల్లోని డీఎన్ఏలు స్థానికుల డీఎన్ఏతో సరిపోలలేదు. కానీ మధ్య ఆసియాలోని ఇరాన్, ఇరాక్, పాలస్తీనాల్లో కొన్ని తెగల డీఎన్ఏలతో సరిపోలాయి. కొన్ని అవశేషాల డీఎన్ఏలు యూరప్ వాసుల డీఎన్ఏతో సరిపోలాయి. దీనిని బట్టి ఆయా ప్రాం తాల నుంచి అప్పట్లోనే ప్రజలు వలస వచ్చారని నిర్ధారించారు. నివేదికలో వెల్లడి సోమవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో ప్రారంభమైన ‘రీడిస్కవరింగ్ తెలంగాణ’అంతర్జాతీయ సదస్సులో పురావస్తుశాఖ సంచాలకురాలు విశాలాచ్చి ఈ పరిశోధనకు సంబంధించిన నివేదికను వెల్లడించారు. ‘‘సమాధుల్లోని మానవ అవశేషాలకు డీఎన్ఏ పరీక్షలు చేయించగా.. వారు మధ్య ఆసియా నుంచి వలసవచ్చారని వెల్లడైంది. ఆ సమూహం మళ్లీ ఇక్కడి నుంచి తిరిగి మధ్య భారత్ మీదుగా మధ్య ఆసియాకు చేరినట్టు తెలుస్తోంది. అందువల్లే ఆ డీఎన్ఏ ఇప్పుడు సిద్దిపేటలో లేదు. కానీ మధ్యభారత్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు మధ్య ఆసియా దేశాల్లో దాని జాడలు కనిపిస్తున్నాయి. ఆ ప్రజలు ఇక్కడికి వలస రావటానికి, తిరిగి వెళ్లటానికి కారణాలను అన్వేషించాల్సి ఉంది. ఆ ప్రయత్నం ప్రారంభిం చాం..’’అని ఆమె తెలిపారు. ఇక ఇదే ప్రాం తంలో మరో చోట లభించిన అవశేషాల డీఎన్ఏ యూరప్ వాసులతో సరిపోయిందని, అంటే యూరప్ నుంచి కూడా వలసలొచ్చాయని పేర్కొన్నారు. పూర్తి సమాచారం లభించాలంటే చాలా పరిశోధనలు చేయాల్సి ఉందని.. మరికొన్ని చోట్ల నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించబోతున్నామని తెలిపారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పరిధిలోని పాల్మాకుల, నర్మెట్టల్లో తవ్వకాల కోసం దరఖాస్తు చేసుకోగా ఏఎస్ఐ ఇటీవలే అనుమతి మంజూరు చేసిందని చెప్పారు. సముద్ర మార్గంలో రవాణా.. క్రీస్తుపూర్వం 600 నుంచి 500 సంవత్సరాల సమయంలో భారీగా వలసలు చోటుచేసుకున్నాయని ఈ పరిశోధనలో పాలు పంచుకున్న సీసీఎంబీ ప్రతినిధి తెలిపారు. అప్పట్లోనే నౌకల ద్వారా సరుకురవాణా సాగిందని, ప్రజలు సముద్రమార్గాల్లోనే వెళ్లేవారని పేర్కొన్నారు. రష్యా, లాట్వియా, జార్జియా, బాల్టిన్ తదితర ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాంతాలకు వలసలు వచ్చినట్టు గుర్తించామన్నారు. -
గీత తల్లిదండ్రుల నిర్ధారణకు డీఎన్ఏ టెస్ట్
⇒ డీఎన్ఏ నమూనాలు ఇచ్చిన కొత్తగూడెం దంపతులు సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ నుంచి వచ్చిన భారతీయ యువతి గీత తమ అమ్మాయే అంటున్న కొత్తగూడెం దంపతులకు విదేశాంగ మంత్రిత్వ అధికారులు మంగళవారం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. పదేళ్ల వయసులో తమ అమ్మాయి రాణి తప్పిపోయిందని, పాకిస్తాన్ నుంచి వచ్చిన గీత తమ అమ్మాయేనని కిష్టయ్య, గోపమ్మ దంపతులు పేర్కొంటున్న విషయం తెలిసిందే. గీత తమ అమ్మాయేనని చెప్పుకుంటున్న నలుగురు దంపతులకు వైద్యులు ఇప్పటికే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా.. గీత డీఎన్ఏతో ఎవరిది సరిపోలేదు. దీంతో గీతకు భోపాల్‌లోని ఒక సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం కల్పించిన విషయం తెలిసిందే. అయితే గీత తమ అమ్మాయేనని.. పోలికలు చాలా ఉన్నాయని కిష్టయ్య, గోపమ్మ దంపతులు మీడియాతో పేర్కొన్నారు. డీఎన్ఏ ఫలితాలు రావడానికి మూడు వారాల సమయం పడుతుందని విదేశాంగ మంత్రిత్వ అధికారులు చెప్పారన్నారు. 2006లో గుంటూరులో జరిగిన క్రైస్తవ మహాసభలకు హాజరైనప్పుడు తమ అమ్మాయి తప్పిపోయిందని, అప్పట్లో పత్రికల్లోనూ వార్తలు వచ్చాయన్నారు. గీత చెప్పిన ఆనవాళ్లు కూడా తమ ఇంటి వద్ద ఉన్నాయని గోపమ్మ తెలిపింది. -
గీతా తమ కూతురే అన్నజంటకు DNA పరీక్ష
-
డీఎన్ఏ పరీక్షకు శాంపిల్స్ సేకరణ
రిపోర్ట్ వచ్చిన తర్వాతే శవం అప్పగింత మునిపల్లి: మండలంలోని పిల్లోడి గ్రామంలో వివాదాస్పదంగా మారిన శవాన్ని బయటకు తీశారు. గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్ రమణమూర్తి, సిబ్బంది డీఎన్ఏ పరీక్ష నిర్వహించడానికి ఆ శవం నుంచి శాంపిల్స్ సేకరించారు. బుధవారం పిల్లోడి గ్రామానికి గాంధీ ఆసుపత్రి నుంచి ప్రొఫెసర్ రమణమూర్తితోపాటు సిబ్బంది, మునిపల్లి తహసీల్దార్ పద్మావతి, బుదేరా ఎస్ఐ కోటేశ్వర్ రావు వచ్చి పాతిపెట్టిన శవాన్ని బయటకు తీసి శాంపిల్స్ సేకరించారు. పిల్లోడి గ్రామానికి చెందిన బాలయ్య పిల్లలు, కుటుంబ సభ్యులు, మునిపల్లి గ్రామానికి చెందిన పద్మారావు పిల్లలు, కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాలను సేకరించి డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రొఫెసర్ రమణమూర్తి తెలిపారు. శవం డీఎన్ఏ పరీక్షకు ఎవరిది అనుకూలంగా ఉంటే వారికే శవాన్ని అప్పగించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఆగస్టు 29న బుదేరా శివారు 65వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతి చెందిన బాలయ్య తన భర్తేనంటూ పిల్లోడికి చెందిన భూమమ్మ బుదేరా పోలీసులకు ఫిర్యాదు చేసి శవాన్ని గ్రామానికి తీసుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించిన విషయం విధితమే. ఈ క్రమంలో మునిపల్లికి చెందిన పద్మారావు కుటుంబ సభ్యులు స్పందిస్తూ పాతిపెట్టిన శవం తమదంటే తమదంటూ వారు, భూమమ్మ పర్సపరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుదేరా పోలీసులు శవానికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించ తలపెట్టారు. దీని కోసమే డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బయటికి తీసిన శవాన్ని డీఎన్ఏ రిపోర్టు వచ్చేంత వరకు మళ్లీ పాతిపెట్టారు. టెన్షన్.. టెన్షన్ పాతి పెట్టిన శవాన్ని బయటకు తీయడానికి డాక్టర్లు వస్తున్నారని తెలియడంతో పిల్లోడి గ్రామస్తులతోపాటు మునిపల్లివాసుల్లో తీవ్ర టెన్షన్ నెలకొంది. డీఎన్ఏ పరీక్ష నిర్వహించి ఇక్కడే శవం బాలయ్యదా, పద్మారావుదా అని చెబుతారని ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూశారు. శాంపిల్స్ సేకరించి గాంధీ ఆసుపత్రిలోనే డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తారని అసలు విషయం తెలియడంతో ఇరుగ్రామాల ప్రజలు, ఇరు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పంచె, పాయింట్‌కు తేడా లేదా? పిల్లోడి గ్రామానికి చెందిన బాలయ్య పంచె, లుంగీపైనే ఎక్కువగా ఉండెవాడని పిల్లోడి గ్రామస్తులు తెలిపారు. మునిపల్లికి చెందిన పద్మారావు ఎప్పుడూ పాయింట్‌నే వేసుకునేవాడని గ్రామస్తులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పాయింట్ వేసుకున్నాడా? లేకుంటే పంచె కట్టుకునఆడా అని తెలుసుకునే పని పోలీసులకు తిరిగి మొదలైంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపకుండానే శవాన్ని అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదరా బాదరగా ఫిర్యాదు తీసుకుని శవాన్ని అప్పగించి చేతులు దులుపుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
విజయవాడలో శిశువు మార్పిడి వివాదం
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శిశువు మార్పిడిపై వివాదం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో ఓ మహిళ ప్రసవించగా, ఆమెకు మగబిడ్డ పుడితే.. ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఆడపిల్ల పుట్టిందని చెప్పారంటూ మహిళ కుటుంబ సభ్యులు గురువారం ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బందిని గట్టిగా నిలదీస్తే చనిపోయిన మగశిశువును తమకు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రజితకు పుట్టింది ఆడబిడ్డే
- శిశువుల తారుమారు వివాదానికి డీఎన్ఏ రిపోర్ట్‌తో తెర - రమాదేవికి జన్మించింది మగశిశువే అని తేల్చిన నివేదిక.. సాక్షి, హైదరాబాద్: సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల తారుమారు వివాదానికి డీఎన్ఏ పరీక్ష రిపోర్ట్‌తో తెరపడింది. చత్రు, రజిత దంపతులకు జన్మించింది ఆడబిడ్డే అని తేలింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన జంగయ్య భార్య రమాదేవి ఆగస్టు 23న మధ్యాహ్నం మగశిశువుకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ మండలం కడ్తాల్‌కు చెందిన చత్రు భార్య రజిత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. లేబర్ రూమ్‌లోని ఆయా సుల్తానా.. రమాదేవి అని పిలువగా పొరపాటున రజిత పెద్దమ్మ మసుర్ వ చ్చి నిలబడింది. వచ్చిన వారు ఎవరో నిర్ధారించుకోకుండా ఆయా ఆ మగబిడ్డను ఆమెకు అప్పగించింది. శిశువుల అప్పగింతలో తప్పు దొర్లినట్లు గుర్తించిన వైద్యులు వెంటనే అప్రమత్తమై రజిత బంధువులకు అప్పగించిన మగబిడ్డను స్వాధీనం చేసుకుని రమాదేవికి ఇచ్చారు. అయితే తమకు పట్టింది మగ బిడ్డని, ఆస్పత్రి సిబ్బందే శిశువులను మార్చారంటూ చత్రు ఆస్పత్రిలో ఆందోళనకు దిగడంతో పాటు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇరువురు దంపతుల నుంచే కాకుండా పుట్టిన ఆడ, మగ శిశువుల నుంచి రక్తపు నమూనాలు సేకరించి డీఎన్ఏ టెస్టుకు పంపించారు. బుధవారం రిపోర్ట్ అందడంతో.. ఆ సీల్డ్ కవర్‌ను సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ సమక్షంలో ఆసుపత్రి వైద్యులు తెరిచారు. మగ శిశువు జంగయ్య, రమాదేవి దంపతులకు జన్మించాడని.. ఆడ శిశువు చత్రు, రజితలకు జన్మించిందని డీఎన్ఏ నివేదిక తేల్చింది. దీంతో ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ విద్యావతి, వైద్యులు జంగయ్య, రమాదేవి దంపతులకు మగశిశువును అప్పగించారు. శిశువుల విషయంలో తమకు జీవితాంతం అనుమానం ఉండేదని.. డీఎన్ఏ పరీక్షలో నిజం తేలడంతో తాము మనస్ఫూర్తిగా శిశువులను తీసుకుంటున్నామని ఇరు కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. కాగా ఆసుపత్రి ఆయా సుల్తానా నిర్లక్ష్యంతోనే శిశువులు తారుమారై.. ఇంత వివాదం జరిగిందని భావించిన ఉన్నతాధికారులు ఆమెను విధుల నుంచి తప్పించారు. -
శిశువుల మార్పిడి వివాదానికి తెర!
హైదరాబాద్: శిశువుల మార్పిడి వివాదానికి తెర పడింది. తనకు పుట్టింది ఆడశిశువు కాదు.. మగశిశువేనని ఆందోళనకు దిగిన రజిత అనే మహిళకు ఆడశిశువు జన్మించిందని డీఎన్ఏ రిపోర్టులో వెల్లడైంది. మగశిశువు డీఎన్ఏతో మరో మహిళ రమాదేవి డీఎన్ఏ మ్యాచ్ అయినట్టు అధికారులు తెలిపారు. ఇద్దరు శిశువులు, తలిదండ్రుల డీఎన్ఏ రిపోర్టును అధికారులు బుధవారం విడుదల చేశారు. కాగా, గత కొన్ని రోజుల క్రితం కోఠి మెటర్నిటీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన శిశువుల మార్పిడి జరిగిన సంగతి తెలిసిందే. ఒకేరోజున రమాదేవి, రజిత ఇద్దరు మహిళలు ప్రసవించారు. ఈ నేపథ్యంలో బాలింత రజితకు అబ్బాయి పుట్టాడని ముందుగా చెప్పి.. కొద్దిసేపటి తరువాత వచ్చి, కాదు.. రజితకు అమ్మాయేనని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో వివాదానికి దారి తీసిన సంగతి విధితమే. తన భార్య(రజిత) మగబిడ్డకే జన్మనిచ్చిందని.. ఆస్పత్రి సిబ్బందే బాబును తారుమారు చేసి ఆడ శిశువును అంటగట్టారని ఆమె భర్త శత్రువు ఆస్పత్రి వర్గాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు జంటలతో పాటు ఇద్దరు చిన్నారులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. డీఎన్ఏ నివేదికలో బాబు తల్లి రమాదేవి అని తేలిందని పోలీసులు తెలిపారు. -
శిశువుల మార్పిడి వివాదానికి తెర!
-
ప్రతి జిల్లాలోనూ ఫొరెన్సిక్ ల్యాబ్‌లు
ఇక నుంచి బెంగళూరులోనే డీఎన్ఏ పరీక్షలు రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ బెంగళూరు: రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఫొరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ వెల్లడించారు. సోమవారమిక్కడి మడివాళలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవలి కాలంలో నేరాల సంఖ్య పెరుగుతోందని, ఈ నేపథ్యంలో నేరస్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా చేసేందుకు సాక్ష్యాల అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు ఫొరెన్సిక్ ల్యాబ్‌లు ఇచ్చే నివేదికలు ఎంతైనా ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఇక డీఎన్ఏ పరీక్షల కోసం గతంలో హైదరాబాద్ లేదంటే ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని అయితే ఇక నుంచి బెంగళూరులోనే డీఎన్ఏ పరీక్షలను నిర్వహించే విధంగా ఫొరెన్సిక్ ల్యాబ్‌ను ఉన్నతీకరిస్తున్నట్లు మంత్రి పరమేశ్వర్ వెల్లడించారు. ప్రస్తుతం ఫొరెన్సిక్ ల్యాబ్‌లో 186 మంది నిపుణులు విధులు నిర్వర్తిస్తున్నారని, ఈ సంఖ్యను 286కు పెంచనున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంలో మైసూరు జిల్లా కలెక్టర్ శిఖా పై బెదిరింపులకు పాల్పడ్డ కేసుపై మంత్రి పరమేశ్వర్ స్పందిస్తూ....‘టైస్టులనే పట్టుకునే మా పోలీసులకు మరిగౌడను పట్టుకోవడం పెద్ద విషయమేమీ కాదు, ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న మంజునాథ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడైన మరిగౌడ పరారీలో ఉన్నాడన్నారు. త్వరలోనే అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు’ అని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డీజీపీ ఓం ప్రకాష్, రాష్ట్ర హోం శాఖ ప్రధాన సలహాదారు కెంపయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థి ప్రతిభను డీఎన్ఏ టెస్టుతో కొలవచ్చు!
లండన్: పిల్లలలో ప్రతిభాపాటవాలను ముందుగానే గుర్తించి వారిలోని లోపాలను సరిదిద్దేందుకు అవకాశం ఏర్పడింది. లండన్ లోని కింగ్స్ కాలేజికి చెందిన శాస్త్రవేత్తలు పిల్లల డీఎన్ఏపై పరిశోధనలు చేసి అకడమిక్స్ లో వారు రాణించే స్థాయిని ముందుగానే గుర్తించే టెక్నిక్ ను కనుగొన్నారు. వయసుతో సంబంధం లేకుండా దాదాపు 20వేల మంది విద్యార్థులపై శాస్త్రజ్ఞుల బృందం ప్రత్యేక డీఎన్ఏ పరీక్షలు జరిపింది. 16 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థుల డీఎన్ఏల్లో మార్పులున్నట్లు వాటి ఫలితాల్లో గుర్తించింది. విద్యార్థులపై ఈ పరీక్షలు చేయడం ద్వారా నేర్చుకోవడంలో వెనుకబడుతున్న వారిని గుర్తించి వారి సమస్యలను పరిష్కరించే అవకాశం కలుగుతుందని చెప్పారు. కవలలపై పరిశోధనల వల్ల జన్యుపరమైన వివరాలు పూర్తిగా తెలుస్తాయని అన్నారు. వీరిలోని పాలీజెనిక్ స్కోర్ డీఎన్ఏ టెస్టులో అంతరాన్ని తెలియజేస్తుందని చెప్పారు. ఏ వ్యక్తిదైనా పాలీజెనిక్ స్కోర్ ను లెక్కించాలంటే జెనోమేవైడ్ అసోసియేషన్ స్టడీ(జీడబ్ల్యూఏఎస్) ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా కూడా పిల్లల్లో అకడమిక్ విజయాలకు సంబంధించిన అంశాలను తెలుసుకోవచ్చని వివరించారు. జన్యుపరమైన మార్పుల్లో ఒకటైన న్యూక్లియోటైడ్ పాలీమార్ఫిజమ్(ఎస్ఎన్ పీ) ద్వారా విద్యార్థుల్లోని చురుకుదనాన్ని సులువుగా గుర్తించవచ్చని చెప్పారు. ఎస్ఎన్ పీలు వ్యక్తిలోని ధృఢస్థిరాత్వాన్ని తెలియజేస్తాయని వీటిని ఎక్కువపాళ్లలో కలిగివున్న వారు మంచి విద్యావంతులవుతారని వివరించారు. -
‘సానియాకు డీఎన్ఏ పరీక్ష చేయండి’
-
‘సానియాకు డీఎన్ఏ పరీక్ష చేయండి’
చిన్నారి సానియాను చైల్డ్వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిన్నారిని ఎవరికి అప్పగించాలనే విషయమై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. చిన్నారి సానియాకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఉత్తర్వులిచ్చింది. అప్పటి వరకు సానియా బాధ్యతను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చూసుకుంటుందని పేర్కొంది. -
మతం ముసుగున మగాధిపత్యం
సామాజిక, నైతిక స్మృతిగా ఇస్లాంను నిర్వచించినప్పుడు దానిది విప్లవాత్మక దృష్టి, ప్రత్యేకించి లైంగిక సమస్యలపై అది ఆ కాలం కంటే చాలా పురోగమించినది. కాల క్రమంలో చట్టంపై మగ గుత్తాధిపత్యం దాని ఉదారవాద స్ఫూర్తిని ధ్వంసం చేసింది. పాకిస్తాన్‌లోని తిరోగమనవాద మితవాదుల గత చరిత్రను, పెరుగుతున్న వారి ప్రభావాన్ని బట్టి చూస్తే ఈ వ్యాసం అసాధారణ మైనదే. పాకిస్తాన్ సెనేట్ (పార్ల మెంటు ఎగువ సభ) మానవ హక్కుల కమిటీ ఆ దేశంలోని ఇస్లామిక్ భావజాల మండలి (సీఐఐ)ని రద్దు చేయాలని సూచించింది. అర్థ దయార్ద్ర హృదయ నియంత ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ 1962లో తన కొత్త రాజ్యాంగాన్ని రుద్దారు. అప్పుడే ఆయన దేశంలోని చట్టాలన్నీ ఇస్లామిక్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండేలా చేయడానికి తగు మార్గాలను సూచించడానికి సీఐఐను ఏర్పాటు చేశారు. రాజ్యాంగబద్ధమైన ఒక సంస్థను రద్దు చేయమని కోరడం సాధారణంగా జరిగేదేమీ కాదు. అయితే, భర్తలు ‘‘తప్పు దారి పట్టిన’’ భార్యలపై ‘‘తేలికపాటి’’ హింసను ప్రయోగించడాన్ని అనుమతించాలి, నేరమూ, శిక్షల పరిమా ణాన్ని సహజంగానే భర్తకు వదిలిపెట్టాలి అని సీఐఐ సూచించింది. దీంతో వ్యవహారం తీవ్ర స్థాయికి చేరిన ట్టుంది. సీఐఐ సూచనలు తప్పనిసరిగా అమలు చేయాల్సినవి కాదనేది నిజమే. కానీ అవి బహిరంగ చర్చను ప్రభావితం చేస్తాయి. అర్థరహితమైన స్త్రీద్వేషం, మహిళల పట్ల అనుమా నపు జబ్బు ప్రపంచవ్యాప్తంగానే పతాక శీర్షికలకు ఎక్కుతు న్నాయి. చాలావరకు అవి అపహాస్యాన్ని వ్యక్తంచేసేవే అయి ఉంటాయి. ఆ అపహాస్యపు ప్రతిస్పందనా తక్కువే. మతాధికార దుర్వినియోగం ఎల్లప్పుడూ సున్నిత వ్యవహరమే. స్వార్థ ప్రయోజనాలు ఎల్లప్పుడూ కపట భక్తి ముసుగును కప్పుకునే ఉంటాయి మరి. అందువలన ఈ అంశానికి సంబంధించిన దృక్కోణం ఉండాల్సిన క్రమం లోనే ఉంది. ఒకటి, ఇస్లామిక్ భావజాల మండలి అనే పేరే తప్పుగా పెట్టినది. సభలోని అన్ని పక్షాలకు ప్రాతినిధ్యం ఉండటం అనేది ఏ ప్రజాస్వామిక మండలికైనా మొట్ట మొదటి ఆవశ్యకత. ఆ లక్షణం లేకున్నా సీఐఐ ఒక మండలి వంటిది ఏదైనా కావచ్చునేమో... అంతేగానీ ఏదేమైనా అది ఇస్లామ్‌కు చెందినది మాత్రం కాదు. 7వ శతాబ్దంలో ఇస్లాంను సామాజిక, నైతిక శిక్షా స్మృతిగా నిర్వచించి నప్పుడు దానిది విప్లవాత్మక దృష్టి, ప్రత్యేకించి లైంగిక సమస్యలపై అది నాటి కాలం కంటే ఎంతో ముందుకు పురోగమించినదిగా ఉండేది. అందువల్లనే అత్యుత్సాహంగా ఇస్లాంలోకి పరివర్తన చెందినవారిలో అత్యధికులు మహిళలే. ఇస్లాం మహిళలకు వారసత్వ హక్కులను, ఒక రూపంలోని మనోవర్తిని ఇచ్చింది. ఆ కాలంలో మరెవరూ ఆ పని చేయలేదు. అయితే కాలక్రమంలో చట్టానికి భాష్యం చెప్పడంపై మగవారి గుత్తాధిపత్యం దాని ఉదారవాద స్ఫూర్తిని ధ్వంసం చేసి, ఆచరణను మగ ఆధిపత్యంగా మార్చింది. ఇస్లామిక్ న్యాయశాస్త్రంలో ఇజ్తిహాద్ అనే భావన ఉంది. దాని ప్రకారం చట్టం మౌలిక ఉద్దేశాన్ని కాపాడటం కోసం మీరు దాన్ని మీ స్వతంత్ర బుద్ధితో వ్యాఖ్యానించవచ్చు. అత్యంత సుపరిచితమైన ఉదాహరణనే తీసుకుందాం. విశ్వాసులు దొంగల చేతులను ఖండించాలని పవిత్ర ఖురాను చెబుతుంది. అయినా సమాజాలు దొంగతనాన్ని అదుపుచేయడానికి మార్గాంతరాలను కనుగొన్నాయి. కాబట్టి ఏ ముస్లిం దేశం లోనూ ఇంకా ఆ శిక్షను అమలు చేయడం లేదు. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని నియంత జనరల్ జియా ఉల్ హఖ్ సుదీర్ఘమైన తన పదేళ్ల కిరాతక పాలనలో పాకిస్తాన్లో ఈ శిక్షను పునరుద్ధరించాలని ప్రయ త్నించి, విఫలమయ్యాడు. మారుతున్న పరిస్థితుల వెలు గులో... చట్టంలో ఒక చోట సవరణను చేయగలిగారంటే వెనుకడుగు వేసిన మరెక్కడైనా కూడా ఆ పనిని చేయవచ్చు. ఉదారణకు, సుప్రీంకోర్టు షా బానో కేసులో... ఆమెకు మాజీ భర్త మనోవర్తిగా పడేస్తున్న బిచ్చం కంటే ఎక్కువ తీసుకోడానికి అర్హత ఉన్నదని తీర్పు చెప్పింది. ఆ వృద్ధురాలికి మాజీ భర్త ఇవ్వజూపిన డబ్బు నెలకు సరిప డటం కాదు గదా, ఒక్క పూట భోజనం కొనుక్కోడానికి కూడా చాలనిది. ఆ తర్వాత 1980లలో భారత మితవా దులు ప్రజాభిప్రాయాన్ని ఆ తీర్పునకు విజయవంతంగా తిరోగమన దిశకు మరల్చగలిగారు. తమ భార్యలను, ఇతర మహిళా బంధువులను మనుషులుగా గాక తమ ఆస్తు లైన వస్తువులుగా చూసే... మగాళ్లు లైంగకపరమైన క్రూర త్వంతో ప్రగతిశీలమైన ముస్లిం చట్టాన్ని మహిళలకు వ్యతిరేకంగా ఎలా తిరగరాయగలరనే దానికి ఇది ఒక ఉదా హరణ. అలాంటి ఆలోచనా ధోరణి కుహనా మతవాదపు ముసుగులో దాక్కుంటుంది. పాకిస్తాన్లో ఈ సమస్య ఒక సంక్షోభంగా మారింది. ‘‘అత్యాచారం కేసుల్లో డీఎన్ఏ పరీక్షలను ప్రాథమిక ఆధా రంగా ఆమోదించ రాదనడం, విద్యాలయాల్లో, కార్యాల యాల్లో ఆడామగా కలిసి ఉండటాన్ని నిషేధించే మోడల్ బిల్లు సీఐఏ ఆదేశాల్లో కొన్ని. ఠారెత్తించే మత ధిక్కార చట్టం కింద వచ్చిన ఫిర్యాదుల పరిశీలనలో అతి చురుగ్గా ప్రతి స్పందించే మండలి... ఆ చట్టం కింద తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని శిక్షించే చర్యలను తీసుకోవాలంటూ చేసే విజ్ఞప్తులను తిరస్కరిస్తుంది’’ అని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. పాకిస్తాన్‌లోని పలుకుబడిగల కొన్ని వర్గాల అభి ప్రాయం అలాంటి నిరపేక్ష అధికారాన్నిసవాలు చేయ డానికి సిద్ధంగా ఉండటం ఆశను రేకెత్తించే అంశం. ప్రజలు సీఐఐకి వ్యతిరేకంగా మాట్లాడటానికి సిద్ధపడుతున్నారు. మానవ హక్కుల కమిటీ సభ్యులు అందుకు ఒక ఉదాహరణే తప్ప ఒకే ఒక్క ఉదాహరణ కాదు. ఇస్లామిక్ భావజాల మండలి ‘‘మత, సాంస్కృతిక విలువల వక్రభాష్యాల వాయుతరంగాల’’తో ముంచెత్తుతోందంటూ ప్రధాన పాకి స్తానీ ఇంగ్లీషు దినపత్రిక ‘డాన్’ దానిని ఖండించింది. ‘‘మహిళలను ప్రభావితం చేసే చట్టాలు పార్లమెంటు ఏకాభిప్రాయంతోనే జరిగేలా’’ చేయాలని అది శాసన కర్తలకు విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి నిరోధకత్వం పార్లమెం టులో వృద్ధి చెందడం కాదుగదా, మనజాలదనే అంతరార్థం ఈ సూచనలో ఉంది. కపటుల కోసం, మహత్తరమైన మతాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకునే అత్యధమ కపటుల కోసం ఇస్లాం నరకంలో ఒక ప్రత్యేక ప్రదేశాన్ని కేటాయించి ఉంచింది. వారు ఏ రూపంలో వచ్చినా, ఏ నేపథ్యంలో వారు తమ దుష్టత్వానికి పాల్పడ్డా... ఈ కపటులను ‘‘మిత్రులుగా స్వీకరించరాదు’’, వంచకులుగా, పిరికిపంద లుగా చూడాలి. పాకిస్తాన్ ఈ నయవంచుకుల ముసుగు లను తొలగిస్తుందని ఆశిద్దాం. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
చెప్పేస్తాడనే చంపేశాడు...
► బాలుడిపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడి అరెస్టు ► డీఎన్ఏ పరీక్ష ద్వారా మృతుడి గుర్తింపు రాజేంద్రనగర్: మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో మూడు నెలల క్రితం జరిగిన బాలుడి కిడ్నాప్, లైంగికదాడి, దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. చిన్నారిపై తాను జరిపిన పాశవిక చర్యను బయటపెడతాడనే చంపేశానని నిందితుడు వెల్లడించాడు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్సై లక్ష్మీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మొఘల్స్ కాలనీ నివాసి సయ్యద్ మునిరుద్దీన్ కుమారుడు సయ్యద్ అభిదుద్దీన్ (9) స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. గతేడాది డిసెంబర్ 23 మధ్యాహ్నం ఒంటి గంటకు అభిదుద్దీన్ తన చిన్నాన్న కుమారుడితో కలిసి కిరణాషాపునకు వెళ్లాడు. అదే సమయంలో వట్టెపల్లి నూర్ కాలనీకి చెందిన సయ్యద్ మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ సోహెల్ (27) మీర్‌చౌక్ ఠాణా పరిధిలో అప్పుడే దొంగిలించిన బైక్‌పై అక్కడికి చేరుకున్నాడు. మద్యం, గంజాయి మత్తులో ఉన్న ఇర్ఫాన్ రోడ్డుపై వెళ్తున్న అభిద్దుదీన్ను బడా మజీద్ ఎక్కడని ప్రశ్నించాడు. తనకు తెలుసు అని చెప్పడంతో బైక్‌పై ఎక్కించుకున్నాడు. చిన్నాన్న కొడుకు కూడా బైక్ ఎక్కడానికి యత్నించగా ఎక్కించుకోలేదు. గతంలో ఇర్ఫాన్ కుటుంబం ఈ బాలుడి ఇంటి పక్కనే ఉండేది. రైల్వే ట్రాక్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అభిదుద్దీన్పై ఇర్ఫాన్ లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలుడు ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్తానని అనడంతో భయపడ్డ ఇర్ఫాన్ గొంతు నులిమి అతడిని చంపేశాడు. ఇంకా బతికి ఉండవచ్చనే అనుమానంతో రాయితో తలపై బలంగా మోదాడు. అంతటితో ఆగకుండా కత్తితో చాతీలో విచక్షణ రహితంగా పొడిచాడు. బాలుడి వంటిపై దస్తులు తీసి తగులబెట్టాడు. శవాన్ని నాలాలోకి విసిరేశాడు. ఇదిలా ఉండగా కుమారుడు కనిపించకపోవడంతో అభిదుద్దీన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జనవరి 14న నాలాలో బాలుడి శవం కనిపించింది. అప్పటికే పూర్తిగా కుళ్లిపోయింది. ఘటనా స్థలంలో పోలీసులకు కత్తి, చెప్పుల జత దొరికాయి. ఆ శవం తన కుమారుడిది కాదని అభిదుద్దీన్ తండ్రి మొదట అన్నాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలంలో లభించిన ఎముకలు, తండ్రి రక్తం సేకరించి డీఎన్ఏ పరీక్ష చేయించగా ఆ శవం అభిదుద్దీన్దే అని తేలింది. హతుడు చిన్నాన్న కుమారుడు నిందితుడు ఇర్ఫాన్‌ను గుర్తుపట్టి ఇతనే అభిదుద్దీన్ తీసుకెళ్లాడని గతంలోనే పోలీసులకు చెప్పాడు. కానీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకోలేదు. అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఇర్ఫాన్‌ను గురువారం ఉదయం అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. గతంలో ఇలాంటి కేసులోనే... ఇర్ఫాన్ గతంలో శాలిబండ ఠాణా పరిధిలో ఓ బాలుడి పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈకేసులో పోలీసులు రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి వచ్చాక ఇర్షాన్ మళ్లీ బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు. -
'తండ్రి నువ్వు కాదని డీఎన్ఏతో ప్రూవ్ చేయ్'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలికి తన భర్త బ్రాడ్ పిట్‌పై అనుమానం మొదలైంది. మరో హాలీవుడ్ నటి మెలిస్సా ఎథెరిడ్జ్ పిల్లలకు అసలు తండ్రి తన భర్త బ్రాడ్ పిట్నేమో అనే ఆలోచన ఆమెను వేధిస్తోంది. దీంతో ప్రస్తుతం డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని ఆమె బ్రాడ్ పిట్ ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరీక్ష ద్వారా తాను ఎథెరిడ్జ్ పిల్లలకు తండ్రి కాదనే విషయం నిరూపించుకోవాలని ఆమె బ్రాడ్ ను గట్టిగా నిలదీసినట్లు సమాచారం. అయితే, అసలు ఈ అనుమానం ఆమెకు ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా.. మరేం లేదు. మొన్న ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఎథెరిడ్జ్ మాట్లాడుతూ తనకు పిల్లలు కావాలని కోరుతూ బ్రాడ్ పిట్ శుక్రకణాలు దానం చేయాలని బ్రాడ్ పిట్ ను కోరానని తెలిపింది. కానీ, అలా జరగకపోవడంతో.. సింగర్ డేవిడ్ క్రాస్బైను సంప్రదించి అతడి స్పెర్మ్ ద్వారా ఇద్దరు సంతానాన్ని పొందినట్లు తెలిపింది. కానీ, ఈ విషయం చెప్పినప్పటి నుంచి ఎంజెలీనాకు మాత్రం కలవరింత మొదలైంది. ఆమె పిల్లల అసలు తండ్రి బ్రాడ్ పిట్ అయ్యుండొచ్చని భావిస్తూ పరీక్ష చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. -
కవలలే కానీ, తండ్రులు మాత్రం ఇద్దరు!
సాధారణంగా అన్నీ దేశాలలో మాదిరిగానే వియత్నాంలో ఇద్దరు కవలలు పుట్టారు. కానీ, వీరు అందరిలా సామాన్యమైన కవలలు మాత్రం కాదు. ఎందకుంటే ఆ కవల చిన్నారులకు తండ్రులు మాత్రం ఇద్దరు అని వైద్యులు తేల్చేశారు. వియత్నాం ఉత్తర ప్రాంతం హోయా బిన్హ్ లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ కవల చిన్నారుల వయసు రెండేళ్లు. ఓ చిన్నారికి జట్టు చాలా పలుచగా ఉండగా, మరో కవల చిన్నారికి ఎక్కువ వెంట్రుకలు ఉన్నాయి. ఏదో సందేహం వచ్చిన చిన్నారుల తండ్రి డీఎన్ఏ టెస్టుల కోసం కవలల్ని ఆస్పత్రికి వెళ్లారు. కవలలు పుట్టిన సమయంలో డాక్టర్లు పొరపాటుగా చిన్నారుల్ని తారుమారు చేశారేమేనని ఆయన అనుమానపడ్డారు. ఆస్పత్రిలో అసలు ట్విస్ట్ మొదలైంది పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆ కవలలకు అసలు తల్లి ఆమెనని, కానీ తండ్రులు మాత్రం వేరని చెప్పారు. కవలలకు ఫాదర్స్ ఇద్దరు ఉండటం చాలా అరుదైన సంఘటన అని చెబుతున్నారు. మహిళ అండం జీవితకాలం 12 నుంచి 48 గంటలు ఉంటుందని, ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల వీర్యకణాలతో అవి పిండంగా మారడంతో ఇద్దరు కవలలు ఈ విధంగా పుడతారని డీఎన్ఏ టెస్ట్ చేసిన వైద్యులు వివరించారు. ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోవడం ఆ తల్లిదండ్రుల వంతు అయింది. రెండో చిన్నారికి తండ్రి ఎవరన్న అనుమానం వారిలో మొదలైంది. -
నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష చేయండి
బోస్ కుమార్తె అనిత న్యూఢిల్లీ: జపాన్‌లోని టోక్యో రెంకోజీ ఆలయం లో ఉన్న నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని ఆయన కుమార్తె అనితబోస్ కోరారు. తద్వారా ఆ అస్థికలు తన తండ్రివో కాదో తేలుతుందన్నారు. తైపీలోని తైహోకు విమానాశ్రయం సమీపంలో 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని తానూ నమ్ముతున్నానన్నారు. జర్మనీలో ఉంటున్న ఆమె వచ్చే నెల భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, అప్పుడు డీఎన్ఏ పరీక్ష గురించి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తానని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో అనిత వెల్లడించారు. -
గీత మహతో కూతురు కాదట!
న్యూఢిల్లీ: 15 ఏళ్లపాటు పాకిస్తాన్లో ఉండి భారత విదేశాంగ శాఖ కృషితో గత నెలలో ఢిల్లీకి చేరుకున్న భారత పుత్రిక గీత (చెవుడు, మూగ) డీఎన్ఏతో ఆమె తండ్రిగా చెప్పుకుంటున్న జనార్దన్ మహతో డీఎన్ఏ సరిపోలలేదని విశ్వసనీయ వైద్య వర్గాలు మంగళవారం మీడియాకు తెలిపాయి. అక్టోబర్ 27వ తేదీన ఇక్కడి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి చేరుకున్న గీతకు కేంద్ర ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలికిన విషయం తెల్సిందే. ఆ విమానాశ్రయానికి తండ్రిగా చెప్పుకుంటున్న బీహార్‌కు చెందిన మహతో కూడా వెళ్లారు. అట్టహాసంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గీతను, ఆమెను ఇంతకాలం పోషించిన పాకిస్తాన్ ట్రస్టు ప్రతినిధులు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మీడియాకు పరిచయం చేశారు. పాకిస్తాన్లో ఉన్నప్పుడు మహతో దంపతుల ఫొటోను చూపి తన తల్లిదండ్రులుగా అంగీకరించిన గీత హఠాత్తుగా విలేకరుల సమక్షంలోనే వారు తనవారు కాదన్నారు. కంగుతిన్న సుష్మా స్వరాజ్, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మహతో దంపతులు గీత తల్లిదండ్రులు అవునా, కాదా అన్న విషయాన్ని తేలుస్తామని చెప్పారు. కాకపోతే ఇండోర్‌లోని కేర్ సెంటర్లో చేర్పిస్తామని చెప్పారు. బిహార్ బిడ్డగా గీతను భావించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీహార ఎన్నికల్లో లబ్ది పొందాలని భావించినట్టు అప్పట్లో మీడియాలో వచ్చిన వార్తలు ప్రస్తుత పరిణామం నేపథ్యంలో గమనార్హం. -
ఏటా వెయ్యి గుర్తు తెలియని శవాలు
నగరంలో గుర్తుతెలియని శవాల కేసులు పోలీసులకు సవాల్‌గా మారాయి. నేరగాళ్లు పకడ్బందీగా, ఆనవాళ్లు దొరకకుండా ఒక ప్రాంతంలో హత్య చేసి శవాలను వేరే ప్రాంతాల్లో పడవేస్తున్నారు. దీంతో వివరాలు లభించక పోలీసులు గుర్తు తెలియని శవాలుగా పరిగణించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఏటా వేలాది గుర్తు తెలియని కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. దీనిపై ఇటీవల ఓ కేసులో సుప్రీం కోర్టు సీరియస్‌గా స్పందించడంతో...ప్రభుత్వం గుర్తు తెలియని శవాల కేసులను శోధించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ముఖ్యనగరాల్లో డీఎన్ఏ సమాచార నిధి ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. తద్వారా గుర్తుతెలియని శవాల కేసులు, మిస్సింగ్ కేసుల పరిష్కారం ఈజీ అవుతుందని పోలీసులు అంటున్నారు. ఈ నేపథ్యంలో డీఎన్ఏ సమాచార నిధిపై సాక్షి ప్రత్యేక కథనం. ఏటా వెయ్యి గుర్తుతెలియని శవాలు ఆచూకీ తెలియక పోలీసుల అవస్థలు ఇప్పటి వరకు సరైన దిశ, దశ లేని దర్యాప్తులు ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు డీఎన్ఏ సమాచార నిధి ఏర్పాటు సుప్రీం ఆదేశాల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ఎంతో ఉపయుక్తం అంటున్న నగర పోలీసులు ఉత్తరాదిలో అదృశ్యమైన ఓ వ్యక్తి నగరంలో శవంగా కనిపిస్తాడు... ఆ రాష్ట్రంలో మిస్సింగ్‌గా ఉన్న ఈ కేసు ఇక్కడ ఆన్‌నోన్ డెడ్‌బాడీగా ఉంటుంది... అనేక కారణాల నేపథ్యంలో ప్రత్యర్థుల్ని హత్య చేస్తున్న నేరగాళ్ళు వారి శవాలను వేరే ప్రాంతానికి తరలించి రోడ్లపై పడేస్తున్నారు... ఇది అక్కడ మిస్సింగ్ కేసుగా నమోదైనా ఇక్కడ వారికి ఆ విషయం తెలీక గుర్తు తెలియని శవంగానే ఉండిపోతోంది.... రాజధానిలో ఏటా లభిస్తున్న గుర్తుతెలియని మృతదేహాల వెనుక ఇలాంటి కథలు, కారణాలెన్నో. ఇప్పటి వరకు సరైన వేదిక లేకపోవడంతో ఈ కేసుల దర్యాప్తు దశ, దిశ లేకుండా సాగి క్లోజ్ అవుతోంది. కేవలం ఇక్కడే కాదు... దేశ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను పరిష్కారం లభించనుంది. మిస్సింగ్ కేసులు, గుర్తుతెలియని శవాల డీఎన్ఏ సమాచార నిధిని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సిటీలో వెలుగుచూస్తున్న ‘బహిరంగ నేరాలు’ తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా గుర్తుతెలియని మృతదేహాలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. వ్యాపార, ఆర్థిక లావాదేవీలతో పాటు సెక్సువల్ జెలసీ కారణంగా అత్యంత దారుణంగా హత్యలు చేస్తున్న ప్రత్యర్థులు మృతదేహాలను బహిరంగ ప్రదేశాలకు తీసుకువచ్చి పడేస్తున్నారు. ఈ తరహా కేసులను కొలిక్కి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కట్లేదు. ఇదే మరికొందరు నేరగాళ్లు ఇదే బాటపట్టడానికి ‘ప్రోత్సాహం’ ఇస్తోంది. ఇదే ఆ దుండగుల ధైర్యం.. ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పుడు మినహా హత్య, హత్యాయత్నం వంటివి జరిగినప్పుడు పోలీసుల దృష్టి తొలుత హతుల్ని గుర్తించడంపై ఉంటుంది. వీరెవరో తెలిస్తే గత చరిత్ర, వ్యాపార/వ్యక్తిగత లావాదేవీలు, ప్రవర్తన తెలుసుకోవడం సాధ్యంకాదు. హత్యకు వీటిలో ఏదో ఒకటి కారణమై ఉంటుంది. ఘటనాస్థలి, హతుడు లేదా హంతకుడికి సంబంధించి స్థలంలో శవాన్ని వదిలేస్తే అది దర్యాప్తునకు ఆధారంగా మారుతుంది. ఈ కారణంగానే హంతకులు హత్య తర్వాత హతుల్ని గుర్తుపట్టే అవకాశం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. ఒకవేళ పోలీసులు గుర్తించినా... దానికి కొంత సమయం పడుతుంది. ఈలోపు నిందితులు ‘జాగ్రత్తలు’ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ‘రెడ్‌హ్యాండెడ్’ కాకపోవడానికి కారణాలనేకం.... హత్యలు చేసి మృతదేహాలను పార్శిల్స్ రూపంలో తరలిస్తున్నా రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు దొరక్కపోవడానికి అనేక కారణాలనేకం. ఇలాంటివి తీసుకువెళ్లే దుండగులు కార్లు, జీపులనే వాడతారు. పైగా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఇలాంటి పనులు చేస్తుంటారు. నగరంలో అవసరమైన స్థాయిలో సీసీ కెమెరాలు, వాటి పర్యవేక్షణ లేదు. ఇలా అనేక కారణాలతో శవాలను తరలిస్తున్న వారు రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం అరుదుగా మారింది. ‘లుక్ఔట్’తో సరిపెట్టాల్సిందే... ఇలా బహిరంగ ప్రదేశాల్లో శవాలుగా దొరుకుతున్న వారంతా ఎక్కడో ఒకచోట మిస్ అవుతున్న వారే. ప్రస్తుతం మిస్సింగ్ కేసులు, అన్నోన్ డెడ్‌బాడీ కేసుల దర్యాప్తు మొక్కుబడిగానే సాగుతోంది. వీరి ఫొటోలతో లుక్ఔట్ నోటీసులు జారీ చేస్తున్న పోలీసులు వాటిని అన్ని పోలీసుస్టేషన్లకు పంపిస్తున్నారు. గుర్తుతెలియని మృతదేహాల్లో అనేక చెడిపోయిన స్థితిలో లభిస్తుండటంతో వీటిని మిస్సింగ్ కేసు నమోదు చేసిన మరో ఠాణా అధికారులు ఫొటోలను చూసినా గుర్తించే స్థితిలో ఉండట్లేదు. వీటన్నింటికీ తొడు సమన్వయ లోపం ఉండనే ఉంటోంది. ఫలితంగా అనేక మిస్సింగ్ కేసులు మిస్సింగ్స్ గానే, గుర్తు తెలియని మృతదేహాల కేసులు అలానే ఉండిపోతున్నాయి. ‘సుప్రీం’ ఆదేశాలతో కదిలిన కేంద్రం... గుర్తుతెలియని శవాలకు సంబంధించి ఓ కేసును విచారించిన సుప్రీం కోర్టు జనవరిలో వీటిని కొలిక్కి తెచ్చేందుకు సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో కదిలిన కేంద్ర ప్రభుత్వం డీఎన్ఏ సమాచార నిధి ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికోసం తయారు చేసిన ముసాయిదా బిల్లు ప్రకారం దేశంలోని అన్ని జిల్లాల్లో డీఎన్ఏ నమూనా సేకరణ, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాల్లో పని చేయడానికి అవసరమైన సంఖ్యలో నిపుణుల్ని ఎంపిక చేస్తారు. వీరికి నగరంలో ఉన్న సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో శిక్షణ ఇప్పిస్తారు. వీరు గుర్తుతెలియని మృతదేహాలు, ‘మిస్సింగ్ కేసుల’ డీఎన్ఏను సేకరించి విశ్లేషించడంతో పాటు భద్రపరుస్తారు. అవీ ఇవీ అన్నీ తేలతాయి... ఈ సెంటర్ ఏర్పాటుతో ఓపక్క మిస్సింగ్ కేసులతో పాటు మరోపక్క అన్నోన్ డెడ్‌బాడీస్ గుట్టు రట్టవుతుందని అధికారులు చెప్తున్నారు. ఎవరైనా తమ వారు తప్పిపోయారని ఫిర్యాదు చేస్తే సంబంధీకులు డీఎన్ఏను సేకరిస్తారు. అలాగే దొరుకుతున్న గుర్తుతెలియని శవాల డీఎన్ఏను భద్రపరుస్తారు. ఈ వివరాలతో దేశ వ్యాప్తంగా సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిద్ధమవుతుంది. ఫలితంగా ఓ రాష్ట్రంలో తప్పిపోయి, మరో రాష్ట్రంలో శవంగా మారిన వారి వివరాలను తక్షణం గుర్తించే వీలు కలుగుతుంది. దీంతో పాటు మతిస్థిమితం లేని కారణంగా ఓ ప్రాంతంలో తప్పిపోయి మరో చోట పోలీసుల చెంతకు చేరుతున్న వారి వివరాలూ తెలుసుకుని సంబంధీకులకు అప్పగించే అవకాశం ఏర్పడుతుంది. దారుణహత్యలకు ఒడిగడుతున్న నేరగాళ్ళను కచ్చితంగా జైలుకు పంపేందుకు ఆస్కారం ఉందని నగర అధికారులు అంటున్నారు. సిటీలో దొరికిన గుర్తుతెలియని శవాల గణాంకాలు ఏడాది సంఖ్య 2011 937 2012 1068 2013 1061 2014 1108 2015 (అక్టోబర్)1070 03.08.2010 మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌లో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం.12 ఎదురుగా ఉన్న బస్‌షెల్టర్ నెం.3 వద్దకు సూట్‌కేస్‌లో దారుణ హత్యకు గురైన మహిళ శవం లభించింది. దుండగులు కారులో తెచ్చి ఈ సూట్‌కేసు వదిలి వెళ్ళారు. 20.12.2010 సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలోని రామ్‌కోఠిలో ఫుట్‌పాత్‌పై కాళ్లు, తల లేని ఓ బాలుడి మొండెం దొరికింది. ఇది జరిగిన రెండో రోజున నారాయణగూడ ఠాణా పరిధిలో కాళ్లు లభించాయి. కేసు నారాయణగూడ ఠాణాకు బదిలీ అయింది. ఈ భాగాలు ఆ ప్రాంతంలో వాచ్‌మన్‌గా పని చేస్తున్న అరుణ్‌సింగ్ కుమారుడు రాకేష్దిగా భావించారు. అయితే బాధిత కుటుంబం కాదనడంతో దర్యాప్తు ముందుకు కదలలేదు. 28.6.2012 వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో నిలబెట్టి ఉన్న ప్లాస్టిక్ డ్రమ్‌లో ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్‌లతో పార్సిల్ చేసి టేప్ వేసి వదిలిన శవం లభించింది. ఈ కేసూ దర్యాప్తులో ఒక్క అడుగూ ముందుకు వెళ్ళలేదు. 21.07.2013 అబిడ్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని పాలథీన్ సంచిలో పార్శిల్ చేసి తెచ్చారు. ఎంజే మార్కెట్ ప్రాంతంలోని చెత్తకుప్పలో పడేశారు. ఈ కేసు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. -
'డీఎన్ఏ పరీక్షలు నా కూతురే అని చెప్తాయి'
పాట్నా: డీఎన్ఏ పరీక్షల్లో గీతా తమ కూతురే అని నిర్ధారణ చేస్తాయని ఆమె రాకకోసం ఎదురు చూస్తున్న తండ్రి జనార్దన్ మహతో అన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ కూతురు తిరిగి రావడంతో చెప్పలేనంత సంతోషంగా ఉందని చెప్పారు. తన కుటుంబమంతా ఆమెతో కబుర్లుపంచుకునేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి లోనైన ఆయన కళ్లు చెమర్చుతూ'పదహారేళ్ల తర్వాత నా కూతురు కనిపించడం ఆనందంగా ఉంది. డీఎన్ఏ పరీక్షలు కూడా గీత నా కూతురే అని చెబుతాయి. నాకు తెలుసు.. ఆమె నాకూతురే. తప్పకుండా నా దగ్గరికి వస్తుంది. నన్ను ప్రేమగా హత్తుకుంటుంది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ధన్యవాదాలు చెప్తున్నాను' అంటూ జనార్దన్ పేర్కొన్నాడు. -
ఆ మౌని కల నిజమైన వేళ.. ..
న్యూఢిల్లీ: ఓ సుదీర్ఘ జీవన ప్రయాణం.. ఒకటి కాదు రెండు కాదు దాదాపు పద్నాలుగేళ్లు.. శత్రువుకన్నా భయంకరంగా చూసే దేశంలో సురక్షితంగా నిలిచిన ప్రాణం. పెరిగి పెద్దయై నేడు మాతృదేశంలో అడుగుపెట్టింది. కొన్నేళ్ల తర్వాత తిరిగి ఆమె అడుగులు భారత గడ్డపై సందడి చేశాయి. ఇన్నాళ్ల ఆమె మౌనం హద్దులు చెరిగింది. ఏడేళ్ల వయసులో పొరపాటున భారత సరిహద్దులు దాటి దశాబ్దకాలంపైగా పాకిస్థాన్‌లో నివసిస్తున్న మూగ, చెవిటి బాలిక గీత నేడు యువతిగా పెద్దదై ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టింది. సోమవారం ఉదయం ఆమె ఉదయం 9గంటల ప్రాంతంలో ఢిల్లీ చేరుకుంది. ఇస్లామాబాద్‌లోని భారత్ కార్యాలయం పంపిన ఫొటోల నుంచి తన తండ్రి, తల్లి, సోదరీమణులను గుర్తించిన గీత.. తన వారితో కలిసిపోనుంది. అయితే, ఆమె తమకూతురంటే తమ కూతురుని పలువురు అంటుండటంతో ముందుగా ఆమెకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాతే తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. పాక్ లో ఆమె బాగోగులు చూస్తున్న స్వచ్ఛంద సంస్థకు చెందిన ఐదుగురు సభ్యులు కూడా ఆమెతో వస్తున్నారు. కరాచీలో నిలిచిన ప్రాణం పుట్టుకతోనే మూగ, చెవిటి బాలిక అయిన గీత ఏడేళ్ల వయసులోనే పొరపాటున పాక్‌లో అడుగుపెట్టింది. సంజౌతా ఎక్స్ ప్రెస్ ద్వారా పాక్ వెళ్లిన గీత.. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయోమయానికి లోనై నాడు లాహోర్ రైల్వే స్టేషన్ లో బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. ఆమె వివరాలు తెలుసుకునేందుకు అక్కడి వారు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఆమెకు మాటలు రాకపోవడమే ఇందుకు కారణమైంది. కేవలం హావభావాలు పలికించగల గీత చిన్ని మనసు దాయాది పాకిస్థాన్ అధికారుల గుండెలను కూడా పిండేసింది. ఆమె గురించి తెలుసుకున్న ఫహద్ ఈదీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ గీత ఆలనపాలనా చూసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఆమె కరాచీలో రెండోసారి జీవనం మొదలైంది. మలుపుతిప్పిన బజరంగీ భాయ్ జాన్ ఎప్పటికైనా తన వాళ్లను కలుస్తానని అనుకున్న గీత నమ్మకమో.. లేక తమ కూతురు ఏనాటికైనా దొరుకుతుందని భారత్ లోని ఆమె తల్లిదండ్రుల ఆశనో.. గీత జీవితాన్ని మార్చేసింది. సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్ జాన్ చిత్రం ఇందుకు వారధిగా నిలిచింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బజరంగీ భాయ్ జాన్ కథ గీత కథ దాదాపు రెండు ఒకేలా ఉన్నాయి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించగా.. గీత తీరని కోరికకు మాత్రం చిగుళ్లు పూయించింది. ఈ చిత్ర విడుదల తర్వాత తన వాళ్ల వద్దకు వెళ్లాలని గీత అనుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. దీంతో మొత్తం భారత విదేశీ యంత్రాంగం రంగంలోకి దిగి ఆమెను తిరిగి భారత్ రప్పించే ఏర్పాట్లు ప్రారంభించింది. ఎన్నో మలుపులు మౌనమే వరంగా కలిగిన గీత జీవితంలో ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. అనూహ్యంగా చిన్నవయసులోనే తల్లిదండ్రులకు దూరమైన ఆమెకు తల్లిదండ్రులు ఎవరనే విషయంలో ఓ అవగాహన ఉన్నప్పటికీ.. గీత తమ కూతురంటే తమ కూతురని పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్ రాష్ట్రాలకు చెందిన కొందరు తల్లిదండ్రులు ముందుకొచ్చారు. దీంతో అధికారులకు తలనొప్పిగా మారింది. మరోపక్క, 14 ఏళ్లుగా అజ్ఞాత వాసంలో ఉన్న గీత కథ ఓ కొలిక్కి వస్తుందనుకున్న తరుణంలో.. కొత్త మలుపు తిరిగింది. గీతకు మైనర్‌గా ఉన్నప్పుడే ఉమేశ్ అనే వ్యక్తితో పెళ్లైందని.. వారికి ఓ బాబు కూడా ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. తనకు అసలు పెళ్లి కాలేదని గీత చెప్పింది. దీనికి తోడు తప్పిపోకముందు దిగిన ఓ బాలిక ఫొటోను చూపించినా ఇది తనది కాదని తెలిపింది. వీటన్నింటికి డీఎన్ఏ పరీక్ష తొలి సమాధానం కానుంది. సల్మాన్ ఇంటికి ఎప్పుడు వెళ్తుందో..! భారత్‌కు వచ్చిన తర్వాత తన జీవితం మలుపు తిరిగేందుకు కారణమైన సల్మాన్ ఖాన్‌ను కలుసుకోవాలనుకుంటున్నట్లు గీత మనోభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సల్మాన్ కూడా తాను గీతను కలుస్తానని చెప్పాడు. ఇండియాకు వచ్చిన మరుక్షణమే కుటుంబ సభ్యులతో సహా వెళ్లి సల్మాన్ ఖాన్ ను కలుస్తానని చెప్పిన నేపథ్యంలో ఆ సందర్భం వచ్చినప్పుడు భావోద్వేగాలు ఎలా ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భావోద్వేగాల నడుమ.. ఇంతకాలంపాటు తనను కంటికి రెప్పల చూసుకున్న కరాచీ ఫౌండేషన్ ఫహద్ ఈదీ ఫౌండేషన్ గీత తిరిగి భారత్ కు వస్తున్న వేళ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తమ కూతురు తమను వదిలి వెళ్లిపోతున్నట్లుగా ఉందని కళ్లు చెమర్చింది. ఏదేమైనా ఎప్పటికైనా తల్లిదండ్రులను చేరాల్సిందేగా అంటూ పేర్కొంది. గీతను చక్కగా అలంకరించి హారతి ఇచ్చి సాగనంపే కార్యక్రమం పూర్తి చేశారు. -
ఈ గీత మా పూజే..!
అమృత్సర్: 13 ఏళ్ల క్రితం రైళ్లో పొరపాటుగా పాకిస్తాన్‌కు వెళ్లి.. కన్నవారిని చేరేందుకు ఎదురుచూస్తున్న ఈ గీత(23) తమ కూతురు పూజ అని, ఆమె ముద్దుపేరు ‘గుడ్డీ’ అని వీరు చెబుతున్నారు. రాజేశ్‌కుమార్, రామ్ దులారీ అనే ఈ దంపతులూ మూగ, బధిరులే! గీతకు, దులారీకి పోలికలూ ఉన్నాయి! అయితే, వీరి ఫొటోలను చూపిస్తే.. వీరు తన తల్లిదండ్రులు కారని గీత అంటోంది. తమ ఇంట్లో స్త్రీలు చీరలు ధరించేవారని, కానీ దులారీ సల్వార్ కమీజ్‌లో ఉందని అనుమానం వ్యక్తంచేసింది. బిహార్ నుంచి అమృత్‌సర్‌కు వచ్చి స్థిరపడిన రాజేశ్, దులారీలు కుమారుడు రాజు(14)తో కలిసి భిక్షాటన చేస్తూ, చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. వీరి కూతురూ చిన్నతనంలోనే రైళ్లలో భిక్షాటన చేసేదని, పొరపాటుగా పాక్ వెళ్లి ఉంటుందని స్థానికుడొకరు చెబుతున్నారు. మరోవైపు.. తాను భారత్‌కు వచ్చి వీరిని కలుస్తానని, గీతకు, వీరికి డీఎన్ఏ పరీక్షలు చేస్తే విషయం తేలిపోతుందని పాక్ మానవహక్కుల కార్యకర్త, మాజీ మంత్రి అన్సార్ బర్నీ వెల్లడించారు. -
డీఎన్ఏ బిల్లుతో బహుపరాక్
మానవ డీఎన్ఏ నమూనాలను సేకరించడానికీ, భద్రపరచడానికీ వీలు కల్పించే కీలకమైన బిల్లు తయారైంది. బహుశా వర్షాకాల సమావేశాలు సక్రమంగా సాగితే ఈపాటికే అది పార్లమెంటు ముందుకొచ్చేది. డీఎన్ఏ(డీ ఆక్సీరైబో న్యూక్లిక్ ఆసిడ్) పరీక్షల విషయంలో అందరికీ అపారమైన విశ్వాసం ఉంటుంది. అవి సందేహాతీతం గా దేనినైనా నిరూపించగలవన్న నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా నేరాలు జరిగిన ప్పుడు, వారసత్వం, బంధుత్వం, వ్యక్తుల గుర్తింపు వగైరా అంశాలను నిర్ధారించడా నికి డీఎన్ఏను మించింది లేదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. సశాస్త్రీయమైన దర్యాప్తునూ, సంప్రదాయక సాక్ష్యాలనూ కాదని కేవలం ఇలాంటి సాంకేతికాంశాల పైన ఆధారపడటం సరైంది కాదన్న వాదన కూడా ఎప్పటినుంచో ఉంది. అందుకు మద్దతుగా ఇజ్రాయెల్ శాస్త్రవేత్త ఒకరు 2009లో ఒక అనుమానిత వ్యక్తి డీఎన్ఏ నమూనాను పోలిన డీఎన్ఏను కృత్రిమంగా రూపొందించి అందరినీ ఆశ్చర్యపరి చాడు. దాదాపు అన్ని దేశాల్లోనూ 1988 ప్రాంతంనుంచి డీఎన్ఏ నమూనాల సేకరణ మొదలైంది. దాదాపు 60 దేశాలు నేరస్తుల డీఎన్ఏ డేటా బ్యాంకులను నిర్వహిస్తున్నాయి. మన దేశంలో న్యాయస్థానాలు కూడా డీఎన్ఏ పరీక్షల ఆధారం గా చేస్తున్న నేర నిర్ధారణలనూ, ఇతర అంశాలనూ 1985 నుంచీ ఆమోదిస్తున్నాయి. డీఎన్ఏ పరీక్షల విషయంలో ఒక నియంత్రణ వ్యవస్థ ఉండాలన్న వాదనతో విభేదించేవారెవరూ ఉండరు. రెండు దశాబ్దాలుగా దేశంలో డీఎన్ఏ పరీక్షలు, వాటి ఆధారంగా కేసుల నిర్ధారణ కొనసాగుతున్నా దానికి ఒక చట్టబద్ధమైన ప్రాతిపదిక లేదు. దీనిపై ఒక చట్టం ఉండాలని 2003లో ఆనాటి ఎన్డీయే ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది. బిల్లు ముసాయిదా కూడా తయారైంది. నిపుణుల కమిటీని నియమించి ఆ బిల్లుకు తదనంతరకాలంలో ఎన్నో మార్పులు చేశారు. అయితే, ఇన్నేళ్లుగా ఈ బిల్లులోని అంశాలపైనా, అది చట్టమైతే ఉండే పర్యవసానాలపైనా ప్రజల్లో తగినంత చర్చ జరగలేదు. ఇటీవల ఆధార్ కార్యక్రమంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ గోప్యత అనేది పౌరుల ప్రాథమిక హక్కు కాదని వాదించారు. ఈ నేపథ్యంలో డీఎన్ఏ బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచనలుండే అవకాశముందో వేరే చెప్పన వసరం లేదు. నేర స్థలంలో సేకరించే జన్యుపరమైన నమూనాల సేకరణ, వాటి పరీక్షలపైనే కాక ఈ బిల్లు డీఎన్ఏ డేటా బ్యాంకుకు కూడా వీలు కల్పిస్తున్నది గనుక, అందులో పౌరులకు సంబంధించిన అనేక అంశాలు ఇమిడి ఉంటాయి గనుక దానిపై విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ బిల్లు జాతీయ స్థాయి డేటా బ్యాంకు ఏర్పాటుకు వీలు కల్పిస్తోంది. దీనికి అనుబంధంగా రాష్ట్ర స్థాయి, ప్రాంతీయ స్థాయి డేటా బ్యాంకులు పనిచేస్తాయి. వీటి పర్యవేక్షణకు జాతీయ బోర్డు ఒకటుంటుంది. ప్రతి డేటా బ్యాంకులోనూ ఆరు క్యాటగిరీలకింద డీఎన్ఏ డేటాను నిక్షిప్తం చేస్తారు. ఇవి- నేర స్థలంలో సేకరించేవి, అనుమానితులకు సంబంధించినవీ, నేరస్తులకు సంబంధించినవీ, ఆచూకీ తెలియ నివారికి సంబంధించినవీ, గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించినవీ, స్వ చ్ఛందంగా ఇచ్చే నమూనాలు. భవిష్యత్తులో ప్రభుత్వాలు అవసరమనుకుంటే ఈ వర్గీకరణ ఇంకా పెరగనూవచ్చు. చూడటానికి ఇందులో తప్పేమిటని అనిపించవ చ్చుగానీ ఇది అనేక కొత్త సమస్యలను సృష్టిస్తుంది. అసలు నేరస్తులనుంచి డీఎన్ఏ సేకరణ స్వచ్ఛందంగా జరుగుతుందా లేక వారిపై బలవంతంగా దాన్ని అమలు చేస్తారా? వారు స్వచ్ఛందంగా ఇస్తారనుకున్నా...ఒకసారి నేరం చేసినవారు జీవి తాంతం నేరస్తులుగానే ఉంటారన్న సిద్ధాంతాన్ని ఇది బలపర్చడం లేదా? ఇది బ్రిటిష్ వలసపాలకులు కొన్ని జాతులను నేరస్త జాతులుగా గుర్తించినట్టుగా లేదా? ఇక అనుమానితుల పేరిట ఎవరి డీఎన్ఏనైనా సేకరించడానికి బిల్లు ఆస్కారం కల్పి స్తోంది. ఇది భవిష్యత్తులో అత్యంత వివాదాస్పదమయ్యే క్లాజు. జరిగిన నేరంతో సంబంధం ఉండవచ్చునన్న సాకు చూపి పోలీసులు ఎవరి డీఎన్ఏనైనా సేకరించ డానికి ఇది వీలు కల్పిస్తోంది. అలాగే డీఎన్ఏ విశ్లేషణకు రక్తమిచ్చేవారినుంచి తీసుకునే అంగీకార పత్రంలో వారి పేరు, ఇతర అంశాలతోపాటు వారి కులం వివరాలను సేకరించేలా రూపొందించారు. కుల, మత విద్వేషాలు తరచుగా రగుల్కొనే మన దేశంలో ఇది ఎలాంటి దుష్పరిణామాలకు దారితీయగలదో వేరే చెప్పనవసరం లేదు. ఈ బిల్లుపై ఏర్పరిచిన నిపుణుల కమిటీలో ఉన్న ఉషా రామనాథన్, సునీల్ అబ్రహాంవంటివారు లేవనెత్తిన అభ్యంతరాలను చాలామటు కు బుట్టదాఖలు చేశారని వారు చెబుతున్న అంశాలనుబట్టి తెలుస్తోంది. ఈ డేటా బ్యాంకుల నిర్వహణ, వాటి పనితీరు పర్యవేక్షణ అంశాలకోసం నెలకొల్పే బోర్డు విషయంలోనే ఆ ఇద్దరూ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. డీఎన్ఏ ఫలితాలను తారుమారు చేసిన సందర్భాల్లో నిర్దోషులు అన్యాయంగా బలైపోయే అవకాశం... అసలు నిందితులు తప్పించుకునే ఆస్కారం ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అందుకు కారకులైనవారికి విధించే శిక్షలేమిటో బిల్లులో పొందు పర్చలేదు. అనుద్దేశపూర్వకంగా, మానవ తప్పిదం కారణంగా తారుమారైన పక్షంలో... వాటి ఆధారంగా అమాయకులకు శిక్షలు పడిన సందర్భంలో అందుకు కారకులపై ఉండే చర్యలేమిటో చెప్పలేదు. బాధ్యతనూ, జవాబుదారీతనాన్నీ నిర్దేశించని ఏ చట్టమైనా ఆచరణలో చట్టుబండలే అవుతుంది. ఈ బిల్లు చట్టమైతే డీఎన్ఏ నమూనాల సాయంతో నేరస్తుల గుర్తింపు, వారిని శిక్షించడం సులభమవు తుందని... నేరాలు తగ్గుముఖం పడతాయని ఆశించడం తప్పేమీ కాదు. కానీ... ఇప్పటికే ఇలాంటి డేటా బ్యాంకుల్ని నిర్వహిస్తున్న దేశాలు ఈ కృషిలో ఎంతవరకూ సఫలీకృతమయ్యాయో ఒక్కసారి అధ్యయనం చేయడం ఉత్తమం. లేనట్టయితే అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా పౌరుల వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుంది. వారి హక్కులకు భంగం కలుగుతుంది. పాలకులు దీన్ని గుర్తించాలి. -
35 ఏళ్లు మౌనంగా...
చేయని నేరం ‘నాకెవరి మీదా కోపం లేదు.. దేవుడు నాతోనే ఉన్నాడు’... కోర్టు వెలుపలకు రాగానే తనను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులతో అన్నాడు జేమ్స్ బెయిన్. ముదిమి మీదపడ్డా ఉత్సాహంగానే కనిపించాడు. చిరునవ్వులు చిందిస్తూ, ప్రశాంతంగా మాట్లాడాడు. ఇంకెవరైనా అతడి పరిస్థితులనే ఎదుర్కొన్నట్లయితే, వ్యవస్థపై పగ పెంచుకొనేవారు. చేయని నేరానికి జైలుగోడల వెనుక ముప్ఫై ఐదేళ్లు మగ్గిపోయినా, అతడు ప్రశాంతంగా మాట్లాడటం మీడియా ప్రతినిధులకు ఆశ్చర్యం కలిగించింది. ముప్ఫై ఐదేళ్లలోనూ అతడు ఒక జైలు కాదు, ఏకంగా ఆరు జైళ్లు మారాడు. అయినా, ఏమాత్రం ఆవేశం లేకుండా ప్రశాంతంగానే ఉన్నాడు. డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా ఫ్లోరిడా కోర్టు అతడిని నిర్దోషిగా నిర్ధారించి విడుదల చేసింది. చట్టం ముందు నిర్దోషిగా రుజువు కావడానికి ఇన్నేళ్లు పట్టింది. ఇలా ఇరుక్కున్నాడు... అది 1974వ సంవత్సరం. అప్పటికి జేమ్స్ పద్దెనిమిదేళ్ల కుర్రాడు. ఫ్లోరిడాలోని బార్టో పట్టణంలో సొంత ఇంట్లోనే అమ్మా నాన్నలతో కలసి ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఆ ఇంటికి పోలీసులొచ్చారు. కాస్త మాట్లాడాలని చెప్పి జేమ్స్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయారు. పోలీసులు ఎందుకు పిలిచారో అతడికి తెలియదు. చుట్టుపక్కల ఏదైనా సంఘటన జరిగి ఉంటుందని, ప్రశ్నించి వదిలేస్తారని భావించాడు. అయితే, రెండు రోజులు పోలీస్ స్టేషన్లోనే గడిచిపోయాయి. తర్వాత అక్కడి నుంచి అతడిని పోక్ కౌంటీ జైలుకు తరలించారు. జైలుకు వెళ్లాక గానీ జేమ్స్‌కు అసలు సంగతి అర్థం కాలేదు. బార్టో పట్టణంలో ఒక తొమ్మిదేళ్ల పిల్లాడిపై అత్యాచారం జరిగింది. నల్లజాతి యువకుడు కావడంతో పోలీసులు అలవాటుగా జేమ్స్ బెయిన్‌ను ఆ కేసులో ఇరికించారు. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన యువకుడి పేరు ‘జేమ్స్’ అని చెప్పాడు ఆ పిల్లాడు. అతడు నల్లగా ఉంటాడని, చెంపలకు దట్టంగా జుట్టు ఉంటుందని.. ఇలాంటివే కొన్ని పోలికలు చెప్పాడు. అతడికి ఎర్ర మోటారు సైకిలు ఉందని కూడా చెప్పాడు. కర్మకాలి జేమ్స్ బెయిన్ మోటార్ సైకిలు ఎర్ర రంగుదే కావడంతో పాటు ఆ పిల్లాడు చెప్పిన పోలికలు దాదాపు సరిపోయాయి. ఇంకేం.. పోలీసులు జేమ్స్‌ను లోపలేసేశారు. తానేపాపం ఎరుగనంటూ అతడు ఎంతగా మొత్తుకున్నా, వారు వినిపించుకోలేదు. పకడ్బందీగా కేసు బిగించారు. ఆరుగురు అనుమానితులను వరుసగా నిలబెట్టి ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించారు. వాళ్లలో జేమ్స్‌తో పాటు మరొకరికే చెంపలపై దట్టంగా జుట్టు ఉంది. దురదృష్టవశాత్తూ బాధిత బాలుడు జేమ్స్ వైపు వేలు చూపించాడు. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాలను ఫ్లోరిడా కోర్టు పూర్తిగా విశ్వసించింది. జేమ్స్ వాదనను ఏమాత్రం పట్టించుకోకుండా, అతడికి యావజ్జీవ శిక్ష విధించింది. అతడు దాఖలు చేసుకున్న అప్పీళ్లన్నీ బుట్టదాఖలయ్యాయి. తన బతుకు ఇక జైలుగోడల మధ్యే తెల్లారిపోతుందనే పరిస్థితికి చేరుకున్నాడు. డీఎన్ఏ పరీక్షలతో మలుపు... జేమ్స్‌పై కేసు నమోదైన కాలంలో డీఎన్ఏ పరీక్షలు అందుబాటులో లేవు. అప్పట్లో ఇతర వైద్య పరీక్షల ఆధారంగా అత్యాచారాల వంటి నేరాలను నిర్ధారించేవారు. అయితే, జేమ్స్ విషయంలో అలాంటి పరీక్షలనూ నిర్వహించలేదు. డీఎన్ఏ పరీక్షలు అందుబాటులోకి వచ్చాక, అన్యాయంగా జైళ్లలో మగ్గిపోతున్న నిరపరాధులకు న్యాయం చేయడానికి ‘ఇన్నోసెంట్ ప్రాజెక్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. ‘ఇన్నోసెంట్ ప్రాజెక్ట్’ చొరవ ఫలితంగా పాత కేసుల్లో సైతం డీఎన్ఏ పరీక్షలను తాజాగా నిర్వహించేందుకు అమెరికన్ కోర్టుల నుంచి అనుమతి లభించింది. ఆ క్రమంలోనే జేమ్స్ దాఖలు చేసుకున్న అప్పీలును 2006లో ఫ్లోరిడా కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే, పునర్విచారణకు కావలసిన పాత రికార్డులేవీ లేకపోవడంతో జేమ్స్ వాటి కోసం దరఖాస్తుల మీద దరఖాస్తులు చేసుకున్నాడు. కానీ అవన్నీ కోర్టులోనే గల్లంతైనట్లు తేలింది. ఎట్టకేలకు 2009లో కోర్టు డీఎన్ఏ పరీక్షలకు అనుమతించింది. నేరానికి పాల్పడింది జేమ్స్ కాదని ఆ పరీక్షల్లో తేలింది. ఫలితంగా 2009, డిసెంబర్ 17న అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. జైలులో గడిపిన ప్రతి సంవత్సరానికీ 50 వేల డాలర్ల చొప్పున కోర్టు అతడికి 17 లక్షల డాలర్లకు పైగా పరిహారాన్ని ప్రకటించింది. -
డిఎన్ఎతో నిర్దోషికి విముక్తి
చేయని నేరం కటకటాల వెనుక మూడు దశాబ్దాల కాలం అన్యాయంగా మగ్గిపోయాడు కార్నెలియస్ డుప్రీ. జరిగిన నేరానికీ, అతడికీ ఏ సంబంధమూ లేదు. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాలను మాత్రమే నమ్మిన కోర్టు అతడికి ఏకంగా 75 ఏళ్ల సుదీర్ఘ కారాగార శిక్ష విధించింది. ఏ పాపం ఎరుగనంటూ అతడు ఎంతగా మొరపెట్టుకున్నా, అదంతా అరణ్యరోదనగానే మిగిలింది. ఎట్టకేలకు డీఎన్ఏ పరీక్షల పుణ్యమా అని నిర్దోషిగా తేలాడు. ఎట్టకేలకు ముదిమి మీద పడ్డ స్థితిలో జైలు గోడలు దాటి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాడు. ఇదీ సంఘటన... అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని డాలాస్ నగరంలో 1979 నవంబర్ 23న సాయంత్రం వేళ ఒక అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలసి మద్యం దుకాణానికి వచ్చింది. వారిద్దరూ కారు పార్క్ చేసి, మద్యం కొనుక్కున్నారు. తిరిగి కారు వద్దకు చేరుకునే సమయంలో ఇద్దరు దుండగులు ఆయుధాలు చూపి దాడి చేశారు. ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌ను చితక్కొట్టి వదిలేశారు. అమ్మాయిని దగ్గర్లోనే ఉన్న ఒక పార్కులోకి లాక్కు పోయి అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె కోటును తీసుకుని పరారయ్యారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెండు రోజుల తర్వాత దుండగులు ఆ కోటును దగ్గర్లోనే ఉన్న ఒక దుకాణంలో అమ్మేశారు. పోలీసులకు ఈ సమాచారం తెలియడంతో నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. నెల్లాళ్ల తర్వాత కార్నెలియస్ డుప్రీని, ఆంథోనీ మాసింగిల్ అనే మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు చెప్పిన పోలికలతో మాసింగిల్ సరిపోయినా, డుప్రీకి ఆ పోలికలేవీ లేవు. అయినా, పోలీసులు అతడిని కూడా లోపలేసేసి ఓ పనైపోయిందనుకున్నారు. ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో బాధితురాలు డుప్రీని, మాసింగిల్ను చూపింది. పోలీసులు ఇదే అంశాన్ని వారు కోర్టులో ప్రవేశపెట్టారు. బాధితురాలి బాయ్‌ఫ్రెండ్ దుండగుల దాడిలో గాయపడినా, పోలీసులు అతడి వాంగ్మూలాన్ని మాత్రం నమోదు చేసుకోలేదు. ఏడాదికి పైగా వాదోపవాదాలు నడిచాయి. దోపిడీకి, అత్యాచారానికి పాల్పడినట్లు డుప్రీ, మాసింగిల్లపై పోలీసులు అభియోగం మోపారు. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, దోపిడీ కేసులో డుప్రీని, మాసింగిల్ను దోషులుగా తేల్చి, 75 ఏళ్ల శిక్ష విధించింది. మాసింగిల్ను మరో అత్యాచారం కేసులోనూ కోర్టు దోషిగా తేల్చింది. తాము అమాయకులమంటూ ఇద్దరూ న్యాయ పోరాటం ప్రారంభించారు. వ్యూహాత్మకమైన ఎర! నేరగాళ్లకు అందించే మానసిక చికిత్స కార్యక్రమానికి హాజరైతే శిక్ష తగ్గిస్తామంటూ 2004లో పోలీసులు ఎర చూపారు. దానికి హాజరైతే తాను నేరం చేసినట్లుగా అంగీకరించినట్లే అవుతుందని భావించిన డుప్రీ అందుకు నిరాకరించాడు. జైల్లో ఉంటూనే ప్రజా సంఘాలకు విజ్ఞప్తులు పంపుతూ పట్టు వదలకుండా చట్టంతో పోరాటం కొనసాగించాడు. అతడు జైలులో ఉంటున్న కాలంలోనే నేర పరిశోధనలో డీఎన్ఏ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా నిజాలను నిగ్గు తేల్చాలంటూ మూడో అప్పీలు దాఖలు చేసుకున్నాడు డుప్రీ. కోర్టు డీఎన్ఏ పరీక్షలకు ఆదేశించింది. 1979 నవంబర్ 23 నాటి సంఘటనలో బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడింది డుప్రీ, మాసింగిల్ కాదని తేలింది. ఫలితంగా డుప్రీ 2010లో జైలు గోడల నుంచి విముక్తుడయ్యాడు. జైలులో గడిపిన ప్రతి ఏడాదికి 80 వేల డాలర్ల చొప్పున దాదాపు 24 లక్షల డాలర్లు డుప్రీకి పరిహారంగా చెల్లించాలని 2011 జనవరి 4న ఇచ్చిన తుది తీర్పులో కోర్టు ఆదేశించింది. జైలు నుంచి బయట పడుతూనే డుప్రీ తన చిరకాల ప్రియురాలు సెల్మా పెర్కిన్స్ను పెళ్లాడాడు. మాసింగిల్పై మరో అత్యాచారం కేసు పెండింగులో ఉన్నందున అతడు ఇంకా జైలులోనే ఉన్నాడు. అయితే, 2006లో అతడు పెరోల్ పొంది బాహ్యప్రపంచంలో కొంతకాలం గడిపాడు. రెండో కేసులో డీఎన్ఏ పరీక్షలు తేలితే, దాని నుంచి కూడా తనకు విముక్తి దొరుకుతుందని మాసింగిల్ ఎదురు చూస్తున్నాడు. -
‘స్మార్ట’గా డీఎన్ఏ టెస్టింగ్
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చేయలేని పని అంటూ ఏదీ లేదేమో. అంతగా పెరిగిపోయింది దీని టెక్నాలజీ. తాజాగా ఈ పనుల జాబితాలోకి మరొకటి చేరింది. అదే డీఎన్ఏ స్కానింగ్! అవును నిజమండి బాబు..! లాస్ ఏంజిలెస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు త్రీడీ ప్రింటర్‌తో తయారు చేసిన ఓ అటాచ్‌మెంట్‌ను తగిలించుకుంటే చాలు.. ఎలాంటి స్మార్ట్ఫోనైనా డీఎన్ఏ మైక్రోస్కోపుగా మారిపోతుంది. వీటితో కేన్సర్ నుంచి అల్జీమర్స్ వరకూ మనకు వచ్చే ప్రమాదమున్న అనేక రకాల వ్యాధుల గురించి ముందుగానే తెలుసుకోవచ్చు. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. డీఎన్ఏ పోగులకు రంగులు అద్ది లేజర్ల సాయంతో ఉత్తేజితం చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. డీఎన్ఏ పోగులో పదివేల కంటే ఎక్కువ బేస్‌పెయిర్స్ ఉన్నప్పుడు ఈ పరికరం చక్కగా పనిచేసింది. త్వరలోనే దీన్ని మలేరియా నిరోధకతను పరీక్షించేందుకు ఉపయోగించనున్నారు. -
డీఎన్ఏ బుక్
ఫేస్బుక్... ప్రపంచం దాసోహమైన సోషల్ హబ్. డీఎన్ఏ... ప్రపంచంలోని జీవరాశిని నడిపిస్తున్న ఓ నిర్మాణం. ఈ రెంటినీ ఏకం చేసింది యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ‘జీన్స్ ఫర్ గుడ్’. వారసత్వంగా ఆస్తులొస్తాయో లేదో కానీ.. పూర్వీకుల లక్షణాలు, వారికున్న జబ్బులు మాత్రం వస్తాయి. వంశపారంపర్యంగా ఏయే జబ్బులు వచ్చే అవకాశముందో తెలుసుకోవాలనుకునేవాళ్ల కోసం ఓ ఫేస్బుక్ యాప్‌ను క్రియేట్ చేసింది. దీని ద్వారా 20,000 మంది ఆరోగ్య వివరాలను సేకరించడం కోసం ఓ ప్రశ్నావళిని తయారు చేసింది. వారిచ్చే సమాధానాల ఆధారంగా ఆయా వ్యక్తుల ఆరోగ్య చరిత్రను, అలవాట్లను, జీవన విధానాన్ని తెలుసుకుని.. ఆ హెల్త్ ప్రోగ్రెస్‌ని గ్రాఫికల్ టూల్స్ ద్వారా ప్రజెంట్ చేయనుంది. వారికి ఏయే జబ్బులు రావొచ్చో సమాచారంతో పాటు.. ఆరోగ్య పరిస్థితులను విశ్లేషించుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఇలా సేకరించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. -
విమాన బాధితుల డీఎన్ఏ పరీక్షలు పూర్తి
ప్యారిస్: జర్మన్ విమాన ప్రమాదంలో మృతిచెందినవారిని గుర్తించేందుకు కావాల్సిన డీఎన్ఏ పరీక్షలు పూర్తయినట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. మొత్తం 150 మంది ప్రయాణీకుల్లో 78 మంది డీఎన్ఏ పరీక్షలు తేలాల్సి ఉండగా వాటిని కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే, వారి పేర్ల జాబితా ఇంకా విడుదల చేయలేదని, మరోసారి క్రాస్ చెకింగ్ అయిపోయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో మిగిలిపోయిన ప్రయాణీకులకు చెందిన శిథిల రూప శకలాలను 50 హెలికాప్టర్లలో తరలిస్తున్నామని, చిద్రమైన శరీరభాగాలను ఓ చోటచేర్చేందుకు 50మంది విమానం కూలిపోయిన పర్వత ప్రాంతంలో గాలింపులు చేపడుతున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో జర్మనీ విమానం 'ఎయిర్ బస్ ఏ320' విమానాన్ని కోపైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశాడన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. -
యాచక బాలలకు డీఎన్ఏ పరీక్షలు
రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ నిర్ణయం సాక్షి, ముంబై: నగరంలో యాచకులవద్ద కనిపిస్తున్న చిన్న పిల్లలకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షల్లో దోషులుగా తేలిన యాచకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆస్పత్రులు, రైల్వే స్టేషన్ల నుంచి చిన్న పిల్లలు ఆపహరణకు గురవుతున్న సంఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు నిర్మూలించడంలో దర్యాప్తు బృందాలు విఫలమవుతున్నాయి. దీంతో యాచకులవద్ద కనిపించే పిల్లల్లో అపహరణకు గురైనవారు ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తే అసలు విషయం బయటపడుతుందని మహిళ, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ముంబైలో కూడళ్లవద్ద, లోకల్ రైళ్లలో, స్టేషన్లలో, బస్టాపుల్లో.. ఇలా ఎక్కడ చూసినా యాచకులవద్ద పిల్లలు కనిపిస్తున్నారు. చిన్న పిల్లలుంటే ఎవరైన జాలీ, కరుణ చూపించి డబ్బులు వేస్తార ని యాచకులు తమ వద్ద పసికందులను కచ్చితంగా ఉంచుకుంటారు. యాచకులకు పిల్లలను అద్దెకు ఇచ్చే ముఠాలు కూడా ఉన్నాయి. వారికి పాలు, ఆహారం ఇవ్వడంతోపాటు సాయంత్రం పిల్లల యజమానికి కొంత డబ్బు అప్పజెప్పాల్సి ఉంటుంది. దీంతో వారు డబ్బుకు ఆశపడి పిల్లలను నిద్రపోకుండా చేస్తారు. ఒకవేళ ఏడ్వకుంటే వారిని గిల్లి బలవంతంగా మరీ ఏడిపిస్తారు. ఇలాచేస్తే డబ్బులు కచ్చితంగా ఇస్తారని వారు భావిస్తారు. కాని వారివెంటే ఉండే పిల్లలు నిజానికి వారి బిడ్డలేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కొందరు ఇతర రాష్ట్రాల నుంచి అపహరించిన పిల్లలు కూడా ఉండవచ్చనే అనుమానాలున్నాయి. అందుకు ప్రత్యేకంగా కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయని గతంలో పట్టుబడ్డ నిందితుల ద్వారా వెల్లడైంది. దీంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని మహిళ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి విద్యా ఠాకూర్ చెప్పారు. అందుకు రైల్వే పోలీసు, రాష్ట్ర పోలీసు, మహిళ శిశు హక్కుల కమిటీతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఈ చర్చల్లో తుది నిర్ణయం కాగానే నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఠాకూర్ చెప్పారు. పరీక్షల్లో వారి పిల్లలు కాదని తేలితే పిల్లలను బాలల సంరక్షణాలయాలకు పంపించి, దోషులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. -
90 నిమిషాల్లో డీఎన్ఏ పరీక్ష
* ఎఫ్ఎస్ఎల్లో అమెరికా తయారీ ‘ర్యాపిడ్ హెచ్ఐటీ’ యంత్ర ప్రదర్శన * పరిశీలించిన శాస్త్రవేత్తలు, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీస్ అధికారులు * కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: కేవలం 90 నిమిషాల్లోనే డీఎన్ఏ పరీక్షను పూర్తి చేసే అత్యాధునిక ర్యాపిడ్ హ్యూమన్ ఐడెంటిఫికేషన్(ర్యాపిడ్ హెచ్ఐటీ) యంత్రాన్ని దాని తయారీదారులు రాష్ర్టంలో తొలిసారిగా ప్రదర్శించారు. హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్)లో గురువారం ఈ ప్రదర్శన జరిగింది. పలువురు శాస్త్రవేత్తలు, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీస్ ఉన్నతాధికారులు హెఐటీ మెషీన్ పనితీరును పరిశీలించారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ కెవిన్ బృందం దీన్ని అభివృద్ధి పరిచింది. రాష్ట్రానికి వచ్చిన ప్రొఫెసర్ కెవిన్ స్వయంగా హెచ్ఐటీ యంత్రాన్ని ప్రదర్శించారు. లాలాజలం, వెంట్రుకలు, రక్త నమూనాల ఆధారంగా వాటిలోని డీఎన్ఏను విశ్లేషించి ఆ వ్యక్తి వివరాలను గంటన్నర వ్యవధిలోనే వెల్లడించడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఈ ప్రక్రియకు కనీసం నాలుగు రోజల సమయం పడుతోంది. డీఎన్ఏ నమూనాలను సేకరించడం దగ్గరి నుంచి నిపుణులు వాటిని విశ్లేషించి నివేదిక అందించే వరకు క్లిష్టమైన ప్రక్రియ ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు వివరించారు. ర్యాపిడ్ హెచ్ఐటీ యంత్రం మాత్రం అతి తక్కువ వ్యవధిలోనే సమగ్ర వివరాలు అందించడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. దీనివల్ల నేర నిర్ధారణ, కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల జరిగిన వోల్వో బస్సు దగ్ధం ఘటనలో సజీవ దహనమైన దాదాపు 36 మంది ప్రయాణికుల మృతదేహాలను గుర్తించడానికి చాలా సమయం పట్టిన సంగతి తెలిసిందే. అలాంటి సందర్భాల్లో ఈ యంత్రం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని, ఒక్క రోజులోనే డీఎన్ఏ విశ్లేషణ పూర్తవుతుందని ఎఫ్ఎస్ఎల్ నిపుణులు వివరించారు. అమెరికన్ సంస్థ ఇన్‌టెజెన్ ఎక్స్ తయారు చేసిన ఈ పరికరం విలువ రూ. 3.50 కోట్లు. దీని కొనుగోలుకు రాష్ర్ట ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఎఫ్ఎస్ఎల్ అధికారులు తెలిపారు. -
జిల్లాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు
* తొలి దశలో నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో * వరంగల్‌లో డీఎన్ఏ కేంద్రం.. ఎఫ్ఎస్ఎల్ అధికారుల ప్రతిపాదన * త్వరలోనే సర్కారు గ్రీన్‌సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: నేరస్తుల నిగ్గు తేల్చడంలో కీలక పాత్ర వహించే ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాంతీయ కేంద్రాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతోపాటు హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఉన్న డీఎన్ఏ కేంద్రం తరహాలో మరో కేంద్రాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎస్ఎల్కు కేసుల తాకిడి పెరిగింది. ఓవైపు కేసులు పెరుగుతుండటం.. మరోవైపు సైంటిఫిక్ అసిస్టెంట్లు, శాస్త్రవేత్తల కొరత వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వరంగల్‌లో ఓ ప్రాంతీయ కేంద్రం ఉన్నా.. మిగతా జిల్లాల నుంచి వచ్చే కేసులకు సంబంధించి ఘటనా స్థలం నుంచి సేకరించిన ఆధారాల విశ్లేషణ బాధ్యత హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్పైనే పడుతోంది. దీంతో అనేక కేసుల్లో దర్యాప్తు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాల కేసుల్లో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ మందకొడిగా సాగుతోందనే విమర్శలున్నాయి. అయితే, డీఎన్ఏ పరీక్షలకు సంబంధించి ప్రతి నెలా 60కి పైగా కేసులు వస్తుండటం.. సంస్థలో నిష్ణాతుల సంఖ్య తక్కువగా ఉండటం వంటివి ఈ జాప్యానికి కారణమని ఎఫ్ఎస్ఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్‌లో మరో డీఎన్ఏ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎఫ్ఎస్ఎల్ అధికారులు ప్రతిపాదించారు. అదేవిధంగా మిగిలిన కేసులకు సంబంధించి ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను తొలి దశలో మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్‌లలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. అనంతరం మిగిలిన జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. వీరి ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇదిలా ఉండగా.. ఎఫ్ఎస్ఎల్కు 220 మందికి పైగా నిపుణుల అవసరముండగా.. ప్రస్తుతం 150 మంది వరకే ఉన్నారని.. ఆ కొరతను కూడా తీర్చాలని అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. -
ఎబోలాను గుర్తించేందుకు డీఎన్ఏ సెన్సర్!
భారత సంతతి విద్యార్థి బృందం ఆవిష్కరణ మెల్బోర్న్: ఒక చుక్క రక్తాన్ని గాజు స్లైడ్‌పై వేసి ఓ చిన్న పరికరంలో ఉంచితే చాలు.. ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ ఉనికిని ఇట్టే నిర్ధారించుకోవచ్చు. ఎబోలాతో పాటు ఇంకా అనేక ప్రమాదకర వైరస్లు, బ్యాక్టీరియాలను గుర్తించేందుకూ ఉపయోగపడే అతి చౌకైన డీఎన్ఏ సెన్సర్‌ను ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి విద్యార్థితో కూడిన బృందం ఆవిష్కరించింది. స్మార్ట్‌ఫోన్ లేదా ఓ చిన్న పరికరంతో ఈ బయో సెన్సర్ పనిచేస్తుంది. అందుకే సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన అనిరుధ్ బాలచందర్‌తో పాటు మరో ఐదుగురు విద్యార్థులు రూపొందించిన ఈ బయో సెన్సర్‌కు ‘హార్వార్డ్ బయోమాడ్ కాంపిటీషన్’లో అవార్డు దక్కింది. -
ఆస్ట్రేలియన్ మహిళ అస్థిపంజరం వెలికితీత
అనంతపురం : పుట్టపర్తిలో హత్యకు గురైన ఆస్ట్రేలియన్ మహిళ టోనీ అన్నేల్ గేట్ మృతదేహానికి శవ పరీక్ష పూర్తియింది. టోనీ అస్తిపంజరం నుంచి బంగారు చైన్‌తో పాటు రెండు ఉంగరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ మృతదేహానికి డీఎన్ఏతో పాటు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారు. వాటిని బెంగళూరుకు పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా సత్యసాయి భక్తురాలైన టోనీ అన్నెల్ గేట్ ఈ ఏడాది జూలై 23న పుట్టపర్తికి వచ్చింది. అప్పటి నుంచి ఆగస్ట్ 14 వరకు ప్రశాంతి నిలయంలోని మిత్రురాలి ఇంటిలో గడిపింది. ఆగస్ట్ 15 నుండి వివేకానందనగర్‌లో సాయిగౌరీ అపార్ట్మెంట్లోని 304 నంబర్ గదిలో నివసిస్తోంది. ఆగస్టు 28న వస్తువుల కొనుగోలు విషయమై బెంగళూరు వెళ్తున్నానని తన మిత్రురాలు సుట్టర్కు సమాచారం ఇచ్చింది. ఆ మరుసటి రోజు నుండి టోనీ కనిపించలేదు. అనుమానం వచ్చిన సుట్టర్ అక్టోబర్ 12వ తేదీన పుట్టపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది. సాయిగౌరీ అపార్ట్మెంట్ వాచ్మెన్, మరొకరితో కలిసి టోనీని డబ్బుకోసం హతమార్చారు. -
గృహనిర్బంధంలో ఎన్డీ తివారీ?
కాంగ్రెస్ కురువృద్ధుడు నారాయణ దత్త తివారీ గృహనిర్బంధంలో ఉన్నారా? అవుననే అంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత అలనాటి ప్రేయసి, కాంగ్రెస్ నేత ఉజ్వల శర్మ, ఆమె కుమారుడు రోహిత్ శేఖర్. వారు 88 ఏళ్ల నేతను కలిసేందుకు వెళ్తే అధికారులు వారిని ఆపేశారు. దాంతో ఆమె ఇనుప గేటు బద్దలు గొట్టి మరీ అనుచరులతో సహా లోపలికి వెళ్లారు. లక్నోలో శుక్రవారం ప్రజలకు ఈ వివాదం పెద్ద వినోదంగా మారింది. 'తివారీ అనారోగ్యంగా ఉన్నారు. ఆయనకు సహాయం అవసరం. కాబట్టి నేను లోపలికి వెళ్లాల్సిందే. అసలు ఇదంతా ఒక కుట్ర. ఆయనని గృహనిర్బంధంలో ఉంచినట్టుగా ఉంది.' అని 70 ఏళ్ల ఉజ్వల వాదించారు. ఉజ్వలతో తివారీకి వివాహేతర సంబంధం ద్వారా రోహిత్ శేఖర్ జన్మించారు. అయితే చాలా కాలం తివారీ ఈ విషయాన్ని అంగీకరించలేదు. చివరికి కోర్టు బలవంతంగానైనా డీఎన్ ఏ పరీక్ష చేయించాలని ఆదేశించడంతో తివారీ రోహిత్ తన పుత్రుడేనని అంగీకరించారు. ఈ సంఘటన జరిగిన ఇరవై రోజుల తరువాత నుంచీ తనను తివారీని కలవనీయకుండా నిర్బంధాలు పెరుగుతున్నాయని ఉజ్వల ఆరోపిస్తున్నారు. 'నాకు తివారీ ఆస్తిపాస్తులు వద్దు. ఆయన జీవన సంధ్యా కాలంలో కాసింత సేవచేసుకునే అవకాశం కల్పించండి' అని ఆమె అన్నారు. అయితే తివారీ ఆదేశాల మేరకే తాము ఆమెను నిరోధించామని పోలీసులు చెబుతున్నారు. -
పర్యావరణ సేవలలో నీటి పాత్ర
B. Rajendra Senior Faculty Hyderabad Eamcet, Botany In the series of EAMCET model papers the third and concluding part of the First year includes Units V, VI & VII. In Unit V Cytology, Biomolecules and Cell Division are included. For EAMCET point of view at least four questions are possible from this unit. Some problems on DNA structure can be asked from biomolecules. Similar kind of problems is also possible from Molecular biology of second year. To his convenience student can practice few model questions either revising first year or second year syllabus. As, a chapter on biomolecules, is new to our syllabus it is better practice some questions from this chapter. Chemistry subject also have a chapter on Biomolecules. For long term students this chapter and entire units V & VI needs thorough study as concepts are very vague. Unit-VI is on Anatomy and Unit- VII is on Ecology. Here are some model questions from these chapters Some model questions from Unit- V, VI & VII of First year 1. Non-membrane bound cell organelle found in a living cell A. Ribosome B. Lysosme C. Centriole D. Chromosome 1) A & B 2) A & C 3) B & C 4) A, C & D 2. Carrier proteins in the membranes are required for the transport of 1) Non-polar molecules 2) Polar molecules 3) Water 4) Gases 3. Cell walls of algae contain A. Cellulose B. Hemicellulose C. Galactans D. Mannans 1) A, B, C 2) B, C, D 3) A, C, D 4) A, B, D 4. In living plant cells intercellular transport is facilitated by 1) Plasmodesmata 2) Pits 3) ER 4) Cytoskeleton 5. AssertionA: Mitochondria, chloroplasts are not considered as endomembrane system Reason R: Their functions are independent of other cell organelles 1) Both A and R are correct and R is the correct explanation of A. 2) Both A and R are correct but R is not the correct explanation of A. 3) A is true, R is false 4) A is false, R is true. 6. True statement regarding Golgi complex I. It helps in the cell wall formation II. It helps in intracellular transport III. It is a site of glycoprotein and glycolipid synthesis IV. It synthesizes steroidal hormones in animal cells 1) I & II 2) II & III 3) III & IV 4) I & III 7. Sausage shaped cell organelle is 1) Mitochondria 2) Plastids 3) Golgi 4) ER 8. Location of ribosomes in eukaryotic cells is A. Cytoplasm B. Attached to ER C. Inside mitochondria D. Inside chloroplasts 1) A & B 2) B & C 3) B, C & D 4) A, B, C & D 9. Centrosome consisting of 1) 9 +2 pattern microtubules 2) Two centrioles 3) 9 peripheral tubules 4) Three basal bodies 10. Histone protein which is not a part of nucleosome core 1) H1 2) H2A 3) H2B 4) H3 11. Nucleotide among the following 1) Cytidylic acid 2) Cytosine 3) Thymidine 4) Cytidine 12. Assertion(A): Lipids are not strictly macromolecules. Reason(R): They are seen in acid insoluble fraction during chemical analysis of tissues. 1) Both A & R are true and R is the correct explanation of A. 2) Both A & R are true but R is not the correct explanation of A. 3) A is true, R is false 4) A is false, R is true. 13. Cocanavalin A is 1) Primary metabolite 2) Vitamin 3) A Lecitin 4) Intermediate metabolite 14. In a small stretch of a DNA 10 Adenines are present equally distributed on both strands. The total number of hydrogen bonds between G & C are 1) 15 2) 50 3) 30 4) 20 15. A DNA molecule shows 400 nucleotides. The length is 1) 6800A0 2) 680 A0 3) 680 nm 4) 680mm 16. G2 phase is 1) Phase between S and M phases 2) Phase preceding S phase 3) Phase followed by G1 phase 4) Phase preceding G0 phase 17. Average time required by a yeast cell to divide is 1) 20 min 2) 24 hrs 3) 90 min 4) 12 hrs 18. Quiescent stage for cells like heart cells of humans is 1) Before G1 phase 2) Within G1 phase 3) After G1 phase 4) Before M phase 19. Disc shaped proteinaceous structures that attach to the spindle fibres during cell division are1) Centromeres 2) Telomeres 3) Centrosomes 4) Kinetochores 20. Assertion (A): The interphase is called as 'the resting phase' Reason (R): In interphase cells take rest 1) Both A & R are true and R is the correct explanation of A. 2) Both A & R are true but R is not the correct explanation of A. 3) A is true, R is false 4) A is false, R is true. 21. Nuclear envelope disappears 1) During metaphase 2) Before anaphase 3) At the end of prophase 4) During cytokinesis. 22. True statements among the following I. During anaphase centromeres split and chromatids separate II. Nucleolus disappears during prophase. III. The daughter cells formed after mitosis are always identical in their size. IV. The number of DNA, in each cell, immediately after the division is equal to that of parent cells. 1) I & II 2) II & III 3) III & IV 4) IV & I 23. Crossing over occurs during 1) Leptotene 2) Pachytene 3) Diakinesis 4) Anaphase-I 24. The number of chromosomes in each cell of pollen grain of Pyrus malus is 1) 17 2) 19 3) 24 4) 8 25. Primary meristem that increases the thickness of the stem. 1) Apical meristem 2) Intercalary meristem 3) Cambium 4) Phellogen. 26. Tissue that helps the plants from elastic stress. 1) Collenchyma 2) Parenehyma 3) Sclerenchyma 4) Aerenchyma 27. Life long activity of meristems is seen in A : Apical meristems B : Intercalary meristem C : Vascular cambium D : Cork Cambium. 1) Only B 2) Only D 3) A, C, D 4) A, B, C 28. Polyarch, exarch vascular bundles are present in 1) Dicot root 2) Dicot stem 3) Monocot root 4) Monocot stem 29. True statement regarding secondary growth 1) Only in open vascular bundles it is seen 2) Roots don't show any secondary growth 3) Secondary growth results from secondary meristems 4) Primary meristems can also participate in secondary growth. 30. Correct arrangement of tissues centripetally in secondary growth 1) Cork ® primary phloem ® vascular cambium ® secondary phloem 2) Cork cambium® cortex® endodermis® vascular cambium 3) Secondary cortex ® cork ® phellogen ® vascular cambium ® primary xylem 4) Medulla® primary xylem® secondary xylem® vascular cambium 31. True statement among the following I. All apical meristems are primary II. All primary meristems are apical III. Some lateral meristems are primary IV. Some secondary meristems are lateral 1) I & II 2) Only II 3) I & IV 4) I & III 32. Phloem parenchyma is absent in 1) Dicot stem 2) Monocot stem 3) Dicot root 4) Monocot root 33. Bicolleteral vascular bundles consisting of 1) Xylem on either side of phloem. 2) Cambium on either side of phloem 3) Phloem on either side of Xylem. 4) Centrally located Xylem surrounded by phloem. 34. Ground tissue system consisting of 1) Cortex and stele 2) Medulla and cortex 3) Tissues other than epidermis and vascular tissue 4) Tissues other than endodermis and vascular tissues. 35. In Ecological services water role is 1) Supporting services 2) Provisional service 3) Regulating services 4) Cultural service 36. Hypostomatous condition with multiseriate epidermis is seen in 1) Acacia 2) Nerium 3) Calotropis 4) Casuarina 37. In pond ecosystem roots established first in 1) Scrub stage 2) Submerged plant stage 3) Marsh-meadow stage 4) Reed -swamp stage 38. Both mechanical and vascular tissues are very well developed in 1) Mesophytes 2) Hydrophytes 3) Parasites 4) Xerophytes 39. Assertion(A): Opuntia is adopted to xerophytic condition Reason(R): Succulent stem stores water and spines reduces transpiration. 1) Both A, R are true and R is the correct explanation of A. 2) Both A, R are true but R is not the correct explanation of A. 3) A is true but R is false 4) A is false but R is true 40. Match the following Lists List - I A.Succulent roots of Asparagus B. Cladode of Asparagus C. Spine in Opuntia D. Scaly leaf in Casuarina List - II i. Photosynthesis ii. Reduces transpiration iii. Drought avoiding character iv. Storage of food and water v. Protection and reduction in transpiration A B C D 1) iii i ii v 2) iv ii v i 3) iii i v ii 4) iv i iii ii Key 1) 2 2) 2 3) 3 4) 1 5) 1 6) 4 7) 1 8) 4 9) 2 10) 1 11) 1 12) 2 13) 3 14) 3 15) 2 16) 1 17) 3 18) 2 19) 4 20) 3 21) 3 22) 4 23) 2 24) 1 25) 3 26) 1 27) 3 28) 3 29) 3 30) 2 31) 4 32) 2 33) 3 34) 3 35) 2 36) 2 37) 2 38) 4 39) 1 40) 3 -
కొత్త మలుపు తిరిగిన 'అనుహ్య' హత్య కేసు
ముంబైలో అత్యంత పాశవికంగా హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తర్ అనుహ్య కేసు కొత్త మలుపు తిరిగింది. అనుహ్య హత్య కేసులో అరెస్ట్ అయిన చంద్రబాన్ సనప్ డీఎన్ఏకు, మృతురాలి శరీరంలో లభించిన డీఎన్ఏకు సరిపోలడం లేదు. అత్యాచారం జరిగినప్పుడు నిందితుడి వీర్యం బాధితురాలి శరీరంలో ఉంటుంది. దాని ఆధారంగా ఫోరన్సిక్ నిపుణులు పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలలో మృతురాలి శరీరంలోని డిఎన్ఏతో నిందితుడి డిఎన్ఏ సరిపోలడంలేదు. ఈ మేరకు మహారాష్ట్ర ఫోరన్సిక్ నివేదిక మంగళవారం స్పష్టం చేసింది. దాంతో అనుహ్య కేసు మరో సారి మరో మలుపు తిరగటంతో ముంబై పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ కేసు ఎప్పటికి కొలిక్కి వస్తుందోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా మచిలీపట్నంకి చెందిన ఎస్తర్ అనుహ్యా ముంబైలోని టీసీఎస్‌లో సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తుంది. గతేడాది డిసెంబర్లో క్రిస్టమస్స్ సెలవులకు ఇంటి వచ్చిన అనుహ్య... జనవరి మొదటి వారంలో ముంబై తిరుగు ప్రయాణమైంది. ఆ క్రమంలో ముంబైలో దిగిన అనుహ్య ఆకస్మాత్తుగా అదృశ్యమైంది. అనుహ్య ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తండ్రి హరి ప్రసాద్ కంగారుపడి ముంబై పోలీసులను ఆశ్రయించారు. అయిన ఫలితం కనిపించకపోవడంతో హరిప్రసాద్ ఆయన బంధువులు ముంబై నగరంలో అనుహ్య కోసం జల్లెడ పట్టారు. నగరంలోని కంజూర్‌మార్గ్ ప్రాంతంలో కాలిపోయి ఉన్న మృతదేహన్ని అనుహ్యదిగా ఆమె తండ్రి గుర్తించారు. అనుహ్య మృతిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో అనుహ్య తండ్రి హరిప్రసాద్ కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఫిర్యాదు చేశారు. దాంతో ముంబై పోలీసులు చంద్రభాన్ సనప్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనుహ్యపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు చంద్రభాన్ నేరాన్ని ఒప్పుకున్నాడు. అయితే అనుహ్య మృతదేహంలోని డీఎన్ఏకి చంద్రభాన్ డీఎన్ఏ సరిపోలకపోవడంతో ముంబై పోలీసులకు అనుహ్య కేసు పెద్ద మిస్టరీగా మారింది. -
‘దొంగ’ ముద్దుతో దొరికారు!
లండన్: ఫ్రాన్స్‌లో ఓ నగల దుకాణం. గతేడాది ఓ రోజు ఇద్దరు ముసుగు దొంగలు చొరబడ్డారు. దుకాణం యజమాని అయిన 56 ఏళ్ల మహిళను కట్టేశారు. తలపై పెట్రోలు పోసి.. అరిస్తే తగలబెడతామని బెదిరించారు. ఒక దొంగ కాపలాగా ఉండగా మరో దొంగ మొత్తం దోచేశాడు. తర్వాత ఆమె కట్లు విప్పేసి ఇద్దరూ వెళ్లిపోయారు. పోలీసులకు దొరకకుండా ఏ ఒక్క ఆధారమూ వదలలేదు. కానీ, చివరికి దొరికిపోయారు. మహిళ కట్లు విప్పే ముందు కాపలాగా ఉన్న దొంగ ఆమె బుగ్గపై పెట్టిన ముద్దే పట్టించింది. ఆమె బుగ్గపై దొంగ లాలాజలాన్ని సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు డీఎన్ఏను విశ్లేషించారు. ఆ సమాచారం ఆధారంగా దొంగను పట్టుకున్నారు. -
అనూహ్య కేసు.. పోలీసుల అదుపులో నలుగురు
అనూహ్య కేసుపై ముంబై పోలీసు కమిషనర్ వెల్లడి సాక్షి, ముంబై: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో ముంబై పోలీసులు శనివారం నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించామని, వాటి ఫలితాలు రావాల్సి ఉందని ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారని, వారిలో కొందరికి నేర చరిత్ర ఉందన్నారు. ఆమెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నామని, అయితే దీనిపై ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే స్పష్టత వస్తుందని ఓ పోలీసు అధికారి చెప్పినట్లు ఎన్డీటీవీ తెలిపింది. -
నాలుగు మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు
ముంబై: ఠాణేలో బుధవారం జరిగిన డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మృతి చెందిన తొమ్మిది మంది ప్రయాణికుల్లో గుర్తు పట్టని నాలుగు మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. వారి మృతదేహాలు గుర్తు పట్టనంతగా కాలిపోయాయని, దీంతో డీఎన్ఏ పరీక్షలు చేయాలని నిర్ణయించామని పశ్చిమ రైల్వే అధికార ప్రతినిధి ఒకరు గురువారం విలేకరులకు తెలిపారు. బుధవారం ఉదయం 2.35 గంటల ప్రాంతంలో రైలు ఎస్4 బోగీతో పాటు మంటలు అంటుకున్న ఎస్-2, ఎస్-3 బోగీల్లో ప్రయాణికులు వీరు కావచ్చని అనుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ రైల్వే పోలీసుల స్వాధీనంలో ఉన్న ఈ మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆ తర్వాత ఈ మృతదేహాలను వారివారి కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు. పశ్చిమ ముంబైకి 145 కిలోమీటర్ల దూరంలో గోల్వాడ్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో ఓ మహిళతో సహా తొమ్మిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉండటంతో ప్రమాదాన్ని అంచనావేయలేక అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటనపై రైల్వే భద్రత కమిషనర్ విచారణ చేస్తున్నారు. ఐదుగరిని దీపికా షా (65), దేవ్ శంకర్ ఉపాధ్యాయ్ (48), సురేంద్ర షా (68), నషీర్‌ఖాన్ అహ్మద్‌ఖాన్ పఠాన్ (50), ఫెరోజ్ ఖాన్ (38)లుగా అధికారులు గుర్తించారు. -
డీఎన్ఏ పరీక్ష ఫలితమే అంతిమం: సుప్రీం
న్యూఢిల్లీ: పితృత్వానికి సంబంధించి డీఎన్ఏ పరీక్ష ఫలితాన్నే కచ్చితమైన సాక్ష్యంగా పరిగణించాలని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. సంబంధిత చట్టంలో పేర్కొన్న ప్రకారం ఉన్న సాక్ష్యం, డీఎన్ఏ పరీక్ష ఫలితం.. ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు శాస్త్రీయంగా నిరూపితమైన డీఎన్ఏ పరీక్ష ఫలితాన్నే పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ సీకే ప్రసాద్, జస్టిస్ ఖేహర్‌ల ధర్మాసనం తేల్చి చెప్పింది. డీఎన్ఏ పరీక్షలో తండ్రి కాదని తేలినప్పుడు.. ఆ వ్యక్తిని తండ్రి బాధ్యతలను నిర్వర్తించాల్సిందిగా బలవంతం చేయకూడదని పేర్కొంది. భార్యకు, కూతురికి భరణం ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించిన భర్త కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. కూతురు పుట్టే నాటికి తన భార్యతో శారీరక సంబంధం లేదని, ఆ పాప తన కూతురు కాదని ఆ భర్త వాదించారు. డీఎన్ఏ పరీక్షల ఫలితాన్ని ఆయన రుజువుగా చూపారు. -
ఇన్ని కార్డులెందుకు?: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వివిధ అవసరాల కోసం రకరకాల కార్డులు జారీ చేయడంపై గవర్నర్ నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాన్‌కార్డు, సిటిజన్ కార్డు, ఆధార్.. ఇలా రకరకాల కార్డుల స్థానంలో డీఎన్ఏ ఆధారిత కార్డులు జారీ చేస్తే మేలని సూచించారు. శనివారం సెంట్రల్ యూనివర్సిటీలోని సీఆర్ రావు ఇన్స్టిట్యూట్లో డీఎన్ఏ 2013 సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఎన్ఏ టెక్నాలజీలో వస్తున్న మార్పులపై ప్రజలతోపాటు పోలీసులు, వైద్యులకు అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన ఈ సదస్సులో ఆయన మాట్లాడారు. నేరం జరిగినప్పుడు దోషులకు తగిన శిక్ష పడాలని, న్యాయం సకాలంలో అందాలని ప్రజలు ఆశిస్తారన్నారు. పరిమితుల పేరుతో జరిగే జాప్యాన్ని సహించే పరిస్థితి లేదని గవర్నర్ స్పష్టం చేశారు. దర్యాప్తులో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలను వాడకంలోకి తేవాలని సూచించారు. కార్యక్రమంలో డీజీపీ ప్రసాదరావు, ఫోరెన్సిక్ సెన్సైస్ లేబొరేటరీ డెరైక్టర్ శారద అవధానం, సీఆర్ రావు ఏఐఎంఎస్సీఎస్ అధ్యక్షుడు డాక్టర్ వి.కె.సారస్వత్ తదితరులు పాల్గొన్నారు. -
డీఎన్ఏతో 19 మంది గుర్తింపు
పాలెం బస్సు దుర్ఘటనలో ఇద్దరి మృతదేహాల అప్పగింత మిగతా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం మిగిలిన శవాలను నేడు గుర్తించే అవకాశం ఉస్మానియా మార్చురీ వద్ద బంధువుల పడిగాపులు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద అక్టోబర్ 30వ తేదీ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన వారిలో 19 మంది మృతులను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించగలిగారు. గాలి బాలసుందరరాజు(55), ఆయన భార్య మేరి విజయలక్ష్మి(52)తోపాటు అక్షయ్‌సింగ్(22) మృత దేహాలను పోలీసులు సోమవారం రాత్రి బంధువులకు అప్పగించారు. మిగిలిన వారి మృతదేహాలను మంగళవారం తీసుకెళ్లనున్నట్లు వారి బంధువులు పోలీసులకు తెలిపారు. ఘటనలో 45 మంది మృత్యువాత పడగా క్లీనర్ సహా మరో ఐదురుగు ప్రయాణికులు తీవ్రంగా గాయపడి అపోలో డీఆర్డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 42 మృతదేహాలను పోస్టుమార్టం కోసం అదే రోజు రాత్రి ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో డీఎన్ఏ పరీక్షలు జరిపి నివేదిక వచ్చాకే బంధువులకు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలు సేకరించి విశ్లేషించారు. వీరిలో 19 మందికి సంబంధించిన డీఎన్ఏ నివేదికలు రావడంతో మృత దేహాలను తీసుకెళ్లేందుకు రావాలని సూచిస్తూ మహబూబ్‌నగర్ పోలీసులు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బాధితుల బంధువులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. మృతదేహాల తరలింపుకు అవసరమైన ఫ్రీజర్ బాక్సులు, వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. అయితే మరో 23 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉన్నందున వారి బంధువులు మార్చురీ వద్దే ఎదురు చూస్తున్నారు. మంగళవారం సాయంత్రంలోగా మిగిలిన మృతదేహాలను కూడా గుర్తించే అవకాశం ఉందని కొత్తకోట సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించింది వీరినే బి.అక్షయ్‌సింగ్(22), మహ్మద్ సర్దార్(32), సయ్యద్ మహ్మద్ జమాలుద్దీన్(27), ఎన్.రుహియా(32), కుసుమ వేదపతి(27), వెంకటేష్ యాదవ్(45), ఆడారి రవి(27), జి.బాలసుందరరాాజు(55), మేరి విజయలక్ష్మి(52), రఘువీర్(33), శివకిరణ్(33) ప్రశాంత్‌గుప్తా, నంజుండగౌడ, అష్తోష్పాం డ, ఫణికుమార్, జ్యోతిరంజన్సాహూ, మోషిన్పాషా, నాగశ్రవంతి, వి.ఎన్.కృష్ణ కోలుకుంటున్న క్షతగాత్రులు తీవ్రంగా గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బెంగళూరు వాసి యోగేష్‌గౌడ(29) ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్లు వైద్యు లు తెలిపారు. బస్సు క్లీనర్ ఇజాజ్‌పాషా(25), వ్యాపారి మజార్పాషా(30), సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాజేష్(28), సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయి శ్రీకర్(32)లు క్రమంగా కోలుకుంటున్నట్లు ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ డా.సమి తెలిపారు. మధ్యంతర నివేదిక ఇచ్చాం: ఎఫ్ఎస్ఎల్ డెరైక్టర్ బస్సు దగ్ధం ఘటనకు సంబంధించి మృతదేహాల గుర్తింపునకు వీలుగా ఉస్మానియా ఆస్పత్రి వైద్యులకు మధ్యంతర నివేదిక సమర్పించినట్లు రాష్ర్ట ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఏపీఎఫ్ఎస్ఎల్) డెరైక్టర్ శారద ‘సాక్షి’కి సోమవారం తెలిపారు. ఇప్పటివరకూ 19 మృతదేహాలను డీఎన్ఏ ద్వారా గుర్తించామని, మిగతా మృతదేహాలను త్వరితగతిన గుర్తించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. కేశినేని ట్రావెల్స్ బస్సు సీజ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్న కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సును సోమవారం మేడ్చల్ ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. రాయ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కేశినేని ట్రావెల్స్ బస్సు(ఏపీ 31 టివి 5656) పలుచోట్ల ప్రయాణికులను ఎక్కించుకుంటూ దింపుతూ వస్తోంది. ఆర్టీవో శంకర్ ఆధ్వర్యంలో కొంపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించి బస్సును సీజ్ చేశారు. బెంగళూరులో పాలమూరు పోలీసుల దర్యాప్తు బస్సులో 45 మంది సజీవ దహనమైన సంఘటనకు సంబంధించి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు సోమవారం బెంగళూరులో దర్యాప్తు చేపట్టారు. స్థానిక కళాసిపాళ్యలోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయానికి వెళ్లి సిబ్బందిని ప్రశ్నించారు. బస్సుకు చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బస్సులో రసాయనాలున్న ప్లాస్టిక్ కంటైనర్లను తీసుకెళ్లారా? అవి ఎవరివి అంటూ సిబ్బందిని అడిగారు. అనంతరం కోలారు సమీపంలో హొసకోటె వద్ద ఉన్న వోల్వో కర్మాగారానికి వెళ్లిన పోలీసులు.. బస్సు నిర్మాణంపై సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. బస్సు డ్రైవర్ ఫిరోజ్ బాషా సొంతూరు కోలారుకు వెళ్లి.. అక్కడి పోలీ సుస్టేషన్‌లో అతనిపై ఏవైనా కేసులున్నాయా అని వాకబు చేసినట్లు సమాచారం. మండే వాటివల్లే బస్సు దగ్ధమైందా? మండే స్వభావం ఉన్న వాటివల్లే మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు నిమిషాల వ్యవధిలో దగ్ధమై ఉంటుందా? అన్న కోణంలో రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) దర్యాప్తు చేపట్టనుంది. ఇందుకోసం సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగనున్నాయి. అలాగే, దివాకర్ ట్రావెల్స్ పేరుతో ఉన్న బస్సు జబ్బార్ ట్రావెల్స్ పేరుతో నడుస్తున్న వైనంపై కూడా విచారణ జరగనుంది. ఇందుకోసం రవాణా శాఖ అధికారులను విచారించనున్నారు. మృతదేహాల అప్పగింత పూర్తయిన తర్వాత దర్యాప్తు ముమ్మరం కానుంది. మంటలు రేగడానికి కారణం ఏమిటి? అంత వేగంగా ఎలా వ్యాపించాయి? మండే స్వభావం ఉన్న పదార్థాలేవైనా బస్సులో ఉన్నాయా? అన్న అంశాలపై సీఐడీ దృష్టి సారించనుంది. ప్రయాణికుల సామాన్లను ఉంచే డిక్కీలో బాణసంచ వంటి పేలుడు పదార్థాలు ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బస్సు అనుమతులకు సంబంధించి ఆర్టీఏ అధికారులను విచారించనున్నట్లు సీఐడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
డీఎన్ఏ పరీక్ష ద్వారా మృతుల గుర్తింపు
-
ఆరు విధాలుగా గుర్తించొచ్చు!
-
ఆరు విధాలుగా గుర్తించొచ్చు!
మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది మరణించగా.. వారికి సంబంధించి 42 మృతదేహాలను ఇంకా గుర్తించలేకపోయారు. అగ్నికీలలకు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడమే దానికి కారణం. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాల సమయంలో మృతులను ముఖ్యంగా ఆరు విధాలుగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవి.. సీటు నెంబర్: మృతదేహమున్న సీటు నంబర్‌ను బస్సు బయల్దేరే ముందు రూపొందించిన ప్రయాణికుల జాబితాతో పోల్చిగుర్తిస్తారు. అయితే మార్గమధ్యలో సీట్లు మారే అవకాశమున్నందున ఈ విధానంతో కచ్చితంగా గుర్తించలేం. ఆభరణాలు: మృతదేహాలను స్వాధీనం చేసుకునే క్రమంలో పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తారు. అందులో మృతదేహం ఉన్న ప్రాంతం (సీటు లేదా మధ్య ఖాళీ స్థలంలో) నుంచి తీశారు? దానిపై లభించిన నగలు, ఆభరణాల వివరాలను పొందుపరుస్తారు. వాటి ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించవచ్చు. ఈ తరహాలోనే ప్రస్తుత ఘటనలోనూ నగల ఆధారంగా ఇద్దరి మృతదేహాలను బంధువులు గుర్తించారు. వస్త్రాలు, వస్తువులు: ప్రయాణిస్తున్న సమయంలో ధరించిన వస్త్రాలు, వెంట తీసుకువెళ్తున్న వస్తువులు సైతం కీలక ఆధారాలే. అవి లభించకపోతే సూట్‌కేసులు, బ్యాగులు, సెల్ఫోన్లు, లైటర్లు వంటి వాటిని సేకరిస్తారు. వాటి ఆధారంగానూ గుర్తించవచ్చు. శరీరం, గాయాలు: మృతుల ఒడ్డు, పొడుగు వంటి శరీరాకృతులను ఎముకల ద్వారా తెలుసుకోవడంతో పాటు గాయా లు, అంగవైకల్యాలు తదితరాలు సైతం గుర్తింపునకు ఉపకరిస్తాయి. దంతాలతో గానీ, గతంలో ఆపరేషన్లు జరగడం, కాళ్లు-చేతులు విరగడం వంటి ఆధారాలూ గుర్తింపునకు పనికొస్తాయి. రక్తం, డీఎన్ఏ: శరీరం పూర్తిగా కాలిపోయినా.. అంతర్గత అవయవాల్లో కొంత వరకు రక్త నమూనాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. అదీ సాధ్యం కానప్పుడు బోన్ మ్యారోను సేకరించి విశ్లేషిస్తారు. అవీ లభ్యమయ్యే పరిస్థితి లేకపోతే డీఎన్ఏ పరీక్షలే శరణ్యం. మృతదేహానికి సంబంధించి, ఏ చిన్న ఆధారం నుంచైనా దీనిని గుర్తించొచ్చు. సూపర్ ఇంపొజిషన్: మృతదేహం నుంచి డీఎన్ఏ, రక్తనమూనాలను సేకరించే అవకాశం లేనప్పుడే ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఇందులో మృతదేహం పుర్రెను ఆధునిక పరికరాలు, కంప్యూటర్ సాయంతో విశ్లేషించి, ముఖాకృతి ఇస్తారు. దాన్ని అనుమానితుల ఫొటోతో సరిపోల్చడం ద్వారా నిర్ధారిస్తారు. -
మృతుల గుర్తింపుకు పది రోజులు!
* దేహాలు బాగా కాలిపోయినందున డీఎన్ఏ పరీక్షల్లో ఆలస్యమవుతుందని ఫోరెన్సిక్ నిపుణుల వెల్లడి * ఒక్కరు మినహా మిగతావారి బంధువుల నుంచి నమూనాల సేకరణ * నగలు, వాచీ, సిమ్‌కార్డుల ఆధారాలతో కొన్ని మృతదేహాల గుర్తింపు * అయినా డీఎన్ఏ రిపోర్టు వచ్చేవరకూ ఇవ్వలేమన్న ఉస్మానియా వైద్యులు, పోలీసులు * ఫోరెన్సిక్ అధికారులు, పోలీసుల వ్యవహార శైలిపై మండిపడ్డ మృతుల బంధువులు సాక్షి, హైదరాబాద్: బస్సు దగ్ధం ఘటనలో మృతులను గుర్తించేందుకు ఎనిమిది నుంచి పది రోజుల వరకూ పట్టవచ్చని అధికారులు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద బుధవారం తెల్లవారుజామున బస్సు దగ్ధమై 45 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన అనంతరం మృతదేహాలను హైదరాబాద్‌లోని ఉస్మానియా మార్చురీకి తరలించారు. దీంతో మృతుల బంధువులంతా గురువారం ఉదయం 8 గంటలకే ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ దుర్ఘటనలో దేహాలూ పూర్తిగా కాలిపోవడంతో.. డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి వచ్చింది. మృతుల వివరాలకు అనుగుణంగా రక్త సంబంధీకుల నుంచి రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఏపీఎఫ్ఎస్ఎల్) నిపుణులు డీఎన్ఏ నమూనాలను సేకరించారు. గుజరాత్‌కు చెందిన ఒక మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం శుక్రవారం ఇక్కడకు చేరుకుని నమూనాలు ఇవ్వనున్నారు. మృతదేహాల నుంచి కాలర్ బోన్, దవడ ఎముకలను సేకరించామని, వారి రక్త సంబంధీకుల నమూనాలతో పోల్చి మృతులు ఎవరనేదీ నిర్ధారిస్తామని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు. ప్రమాదంలో ఎముకలు కూడా బాగా కాలిపోవడంతో డీఎన్ఏ సేకరణ కూడా కష్టంగా మారిందని, అందువల్ల డీఎన్ఏ పరీక్షల ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని వారు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సాధారణంగా 15 రోజుల వరకూ పడుతుందని, బస్సు దుర్ఘటన కేసును ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని రోజూ మూడు బృందాలు 24 గంటలూ పరిశోధన చేసేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. అయినప్పటికీ డీఎన్ఏ పరీక్షలు పూర్తయ్యేందుకు 8 నుంచి 10 రోజుల వరకూ సమయం పట్టవచ్చని వివరించారు. అయితే, డీఎన్ఏ పరీక్షలు పూర్తయిన తరువాత మాత్రమే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. కానీ, తమ ఆప్తులు మరణించారనే వేదనతో ఉన్న తమను... అంత్యక్రియలు కూడా సకాలంలో నిర్వహించుకోలేకపోతున్నామనే బాధ మరింత ఆవేదనకు గురిచేస్తోందని మృతుల బంధువులు పేర్కొంటున్నారు. ఆధారాలున్నా ఇవ్వలేం బస్సు దుర్ఘటన మృతదేహాలను గుర్తించేందుకు నగలు, వాచీలు, సెల్‌ఫోన్ సిమ్కార్డులూ వంటి ఆధారాలు దొరికినా.. డీఎన్ఏ రిపోర్టు వచ్చే వరకూ బంధువులకు అప్పగించలేమని అధికారులు తేల్చిచెప్పారు. దాంతో ఆధారాలు దొరికితే తమవారి భౌతికకాయాలను అప్పగిస్తారేమోనని వచ్చిన బంధువులు ఆవేదనలో మునిగి పోయారు. అయితే, బస్సు ప్రమాదంలో సజీవ దహ నమైన ఘటనలో 42 మృతదేహాలకు శవపరీక్షలు పూర్తయ్యాయని ఉస్మానియా ఫోరెన్సిక్ విభాగాధిపతి టకీయుద్దీన్ తెలిపారు. శాంపిళ్లను ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించామని చెప్పారు. ఈ విషయంలో తాము చేయాల్సిన పని పూర్తయిందని, ఇక చేయాల్సిందంతా పోలీసులేనని స్పష్టం చేశారు. పోలీసులు చెప్పాకే మృతదేహాలను అప్పగిస్తామన్నారు. మరోవైపు.. పోలీసులు మృతుల డీఎన్ఏ రిపోర్టు వచ్చాకే భౌతికకాయాలు అప్పగిస్తామని, అంతవరకూ ఆగాల్సిందేనన్నారు. దీంతో కొందరు మృతుల బంధువులు.. గుర్తించిన మృతదేహాలనైనా ఇవ్వాలని అధికారులను నిలదీశారు. అయితే, అధికారులు వారిగోడు పట్టించుకోకుండా.. నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని ఫోరెన్సిక్ లేబొరేటరీకి వెళ్లి, శాంపిళ్లు ఇవ్వాలని మృతుల బంధువులకు సూచించారు. అయితే, మృతుల బంధువుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారున్నారు. వారికి ఫోరెన్సిక్ లేబొరేటరీ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఎక్కడికెళ్లాలో, ఎలా వెళ్లాలో తెలియక కొంతమంది బాధితులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి బంధువులంతా ఫోరెన్సిక్ ల్యాబ్ వెళ్లినా... నమూనాలు ఇవ్వడానికి గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చింది. కొన్ని ఆధారాలు లభ్యమైనా ప్రమాదానికి గురైన బస్సులో మృతదేహాల వద్ద దొరికిన కొన్ని వస్తువులు, నగలు, సెల్ఫోన్లను ఉస్మానియా ఆస్పత్రిలో ఆయా మృతదేహాలతో పాటే భద్రపరిచారు. ఆ వస్తువులను కొందరి బంధువులు గుర్తించారు కూడా. వెంకటేష్ యాదవ్ అనే ప్రయాణికుడికి చెందిన వెండి మొలతాడు, ఆయన సోదరి అనిత నగల ఆధారంగా బంధువులు అన్నాచెల్లెళ్ల మృతదేహాలను గుర్తించారు. కానీ, అవే నగలు తమ బంధువు ధరించినవిగా మరో కుటుంబం చెప్పడంతో ఆ మృతదేహాలను ఎవరికీ అప్పగించలేదు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన శివకిరణ్ మృతదేహాన్ని.. బెల్టు, సెల్‌ఫోన్‌లోని మెమొరీకార్డు, చేతి వాచీ ఆధారంగా బంధువులు గుర్తుపట్టారు. కానీ, ఆ మృతదేహాన్ని బుధవారమే ఎవరో తమవారిదని చెప్పారని పేర్కొంటూ అధికారులు అప్పగించలేదు. మరో మృతుడు వేదపతి ధరించిన జీన్స్‌ప్యాంట్, సాక్స్, బనియన్ల ఆధారంగా బంధువులు మృతదేహాన్ని గుర్తించినా, అధికారులు అప్పగించలేదు. ఇలా మరో ఇద్దరికి సంబంధించి కూడా ఆధారాలను గుర్తించినా మృతదేహాలను ఇవ్వలేదు. ఆధారాలు ఉంటే మృతదేహాన్ని అప్పగించాలని మంత్రులు కూడా చెబుతున్నారని, అయినా ఇవ్వడం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకునే దిక్కులేదు ఘటన మృతదేహాలను బుధవారం సాయంత్రం ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు. కానీ, బంధువులు, బాధితుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. నమూనాల సేకరణ ఎలా జరుగుతోంది? మృతుల బంధువులకు దిశానిర్దేశం చేయడం తదితర అంశాలపై ఒక్క ఉన్నతాధికారి కూడా వచ్చి పర్యవేక్షణ చెయ్యలేదు. మరోవైపు ఫోరెన్సిక్ అధికారులు, పోలీసులు కూడా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. ఒక్కరంటే ఒక్క రాష్ట్రస్థాయి అధికారి కూడా రాలేదు. కనీసం మృతుల బంధువులకు మంచినీళ్లు కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. చివరకు బంధువులు గొడవ చేస్తే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అధికారి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఉత్తరాఖండ్ ఘటన సమయంలోనూ ఇదే తంతు.. ఉత్తరాఖండ్‌లో వరదలు ముంచెత్తినప్పుడు కూడా రాష్ట్రప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. వందలాది మంది జాడ తెలియక ఆందోళన చెందిన బంధువులకు ప్రభుత్వం కనీస భరోసా ఇవ్వలేకపోయింది. కొన్ని మృతదేహాలు లభ్యమైన తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ మృతదేహాలు కావాలంటే డెహ్రాడూన్‌కు వచ్చి నమూనాలు ఇవ్వాలని, డీఎన్ఏ పరీక్షలు చేసి వాటిని అప్పగిస్తామని చెప్పింది. డెహ్రాడూన్‌కు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణ సౌకర్యం కల్పించలేదు. ప్రస్తుతం బస్సు దుర్ఘటనలోనూ రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆరు విధాలుగా గుర్తించొచ్చు! సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది మరణించగా.. వారికి సంబంధించి 42 మృతదేహాలను ఇంకా గుర్తించలేకపోయారు. అగ్నికీలలకు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడమే దానికి కారణం. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాల సమయంలో మృతులను ముఖ్యంగా ఆరు విధాలుగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవి.. 1. సీటు నెంబర్: మృతదేహమున్న సీటు నంబర్‌ను బస్సు బయల్దేరే ముందు రూపొందించిన ప్రయాణికుల జాబితాతో పోల్చిగుర్తిస్తారు. అయితే మార్గమధ్యలో సీట్లు మారే అవకాశమున్నందున ఈ విధానంతో కచ్చితంగా గుర్తించలేం. 2. ఆభరణాలు: మృతదేహాలను స్వాధీనం చేసుకునే క్రమంలో పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తారు. అందులో మృతదేహం ఉన్న ప్రాంతం (సీటు లేదా మధ్య ఖాళీ స్థలంలో) నుంచి తీశారు? దానిపై లభించిన నగలు, ఆభరణాల వివరాలను పొందుపరుస్తారు. వాటి ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించవచ్చు. ఈ తరహాలోనే ప్రస్తుత ఘటనలోనూ నగల ఆధారంగా ఇద్దరి మృతదేహాలను బంధువులు గుర్తించారు. 3. వస్త్రాలు, వస్తువులు: ప్రయాణిస్తున్న సమయంలో ధరించిన వస్త్రాలు, వెంట తీసుకువెళ్తున్న వస్తువులు సైతం కీలక ఆధారాలే. అవి లభించకపోతే సూట్‌కేసులు, బ్యాగులు, సెల్ఫోన్లు, లైటర్లు వంటి వాటిని సేకరిస్తారు. వాటి ఆధారంగానూ గుర్తించవచ్చు. 4. శరీరం, గాయాలు: మృతుల ఒడ్డు, పొడుగు వంటి శరీరాకృతులను ఎముకల ద్వారా తెలుసుకోవడంతో పాటు గాయా లు, అంగవైకల్యాలు తదితరాలు సైతం గుర్తింపునకు ఉపకరిస్తాయి. దంతాలతో గానీ, గతంలో ఆపరేషన్లు జరగడం, కాళ్లు-చేతులు విరగడం వంటి ఆధారాలూ గుర్తింపునకు పనికొస్తాయి. 5. రక్తం, డీఎన్ఏ: శరీరం పూర్తిగా కాలిపోయినా.. అంతర్గత అవయవాల్లో కొంత వరకు రక్త నమూనాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. అదీ సాధ్యం కానప్పుడు బోన్ మ్యారోను సేకరించి విశ్లేషిస్తారు. అవీ లభ్యమయ్యే పరిస్థితి లేకపోతే డీఎన్ఏ పరీక్షలే శరణ్యం. మృతదేహానికి సంబంధించి, ఏ చిన్న ఆధారం నుంచైనా దీనిని గుర్తించొచ్చు. 6. సూపర్ ఇంపోషన్: మృతదేహం నుంచి డీఎన్ఏ, రక్తనమూనాలను కూడా సేకరించే అవకాశం లేనప్పుడే ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఇందులో మృతదేహం పుర్రెను ఆధునిక పరికరాలు, కంప్యూటర్ సాయం తో విశ్లేషించి, ముఖాకృతిని ఇస్తారు. దాన్ని అనుమానితుల ఫొటోతో సరిపోల్చడం ద్వారా నిర్ధారిస్తారు. -
డీఎన్ఏ పరీక్షల కోసం మృతుల బంధువుల పడిగాపులు
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి బంధువులు డీఎన్ఏ పరీక్షల కోసం నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ వద్ద పడిగాపులు పడుతున్నారు. కడసారి చూపుకు నోచుకోకపోయినా... కనీసం తమవారి మృతదేహాన్ని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షల కోసం బంధువులు ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే అక్కడ హెల్ప్‌లైన్ నంబర్లు పరిచేయకపోవటం... వైద్య సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటంతో మృతుల బంధువులు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. పరీక్షల నిర్వహణకు జరుపుతున్న జాప్యంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవారి మృతదేహాలను త్వరగా అప్పగించాలని బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహాలను రేపటికల్లా అందచేయకుంటే ఆత్మహత్యలకు కూడా వెనకాడమని వారు స్పష్టం చేశారు. కాగా 39మంది మృతుల బంధువుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించినట్లు మహబూబ్‌నగర్ డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్ తెలిపారు. వారం తర్వాత డీఎన్ఐ నమూనా ఫలితాలు వెల్లడి అవుతాయని... అప్పటివరకూ మృతదేహాలు ఉస్మానియా మార్చురీలోనే ఉంటాయని తెలిపారు. మరోవైపు ఉస్మానియా మార్చరీలో తమ రాష్ట్ర వాసుల వివరాలపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి, రవాణాశాఖ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. మంత్రి రామలింగారెడ్డి...మృతుల బంధువులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
కన్నీరు మున్నీరవుతున్న కుటుంబం
-
మృతుల బంధువుల డీఎన్ఏ నమానాల సేకరణ
-
మృతుల బంధువుల డీఎన్ఏ నమానాల సేకరణ
మహబూబ్ నగర్ బస్సు ప్రమాద దుర్ఘటనలో మరణించిన వారి బంధువులు హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. మృత దేహాలను గుర్తించేందుకు బంధువుల నుంచి డీఎన్ఏ నమూనాలను ఆస్పత్రి సిబ్బంది సేకరించారు. బుధవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే. బస్సులో మంటలు చేలరేగడంతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను గుర్తించడానికి వీలులేకుండా కాలిపోయాయి. వీటిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను గుర్తించడం కోసం బంధువుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు. ఏలూరుకు చెందిన స్రవంతి, ఆసీఫ్ అహ్మద్ (బెంగళూరు), చంద్రశేఖర్ షిల్గే (మహారాష్ట్ర), జ్యోతిరంజన్ సాహూ (ఒడిశా), అశుతోష్ పాండాల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. -
పాతికేళ్ల నాటి అత్యాచారం, హత్య కేసులో నిందితుడి అరెస్టు
చట్టానికి చేతులు చాలా పొడవైనవని అంటారు. చిన్న వెంట్రుక ముక్క ఉన్నా, గోరు దొరికినా, పన్ను గాట్లు లభించినా కూడా నిందితులెవరో ఇట్టే పట్టుకుని చెప్పగల పరిజ్ఞానం ఇప్పుడు ఉంది. ఇలాంటి పరిజ్ఞానం ఉండబట్టే, ఎప్పుడో పాతికేళ్ల క్రితం జరిగిన అత్యాచారం, హత్య కేసులో డీఎన్ఏ సాక్ష్యం ఆధారంగా జర్మన్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. 1987 నవంబర్ నెలలో జర్మనీలోని ఓస్నాబ్రూక్ నగరంలో తొమ్మిదేళ్ల క్రిస్టీనా అనే అమ్మాయి లైంగిక వేధింపులకు గురైంది. ఆమె స్కూలు బెల్లు వినకపోవడంతో రోజూ అందరితో కలిసి వెళ్లేది, ఒక్కర్తే నడుచుకుంటూ ఇంటికి వెళ్లిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలెగ్జాండర్ రెటెమెయర్ తెలిపారు. కొంచెం చీకటిగా, మొక్కలతో ఉండే అడ్డదారి అయితే త్వరగా ఇంటికి చేరుకోవచ్చని ఆ దారిలో వెళ్లసాగింది. అప్పుడు ఆమెను 19 ఏళ్ల వ్యక్తి ఒకడు అటకాయించాడు. ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా, తన తల్లికి చెబుతానని బెదిరించింది. దాంతో అతడు ఆమెను పీకపిసికి చంపేశాడు. అప్పట్లో బాధితురాలి దుస్తులను దాచిపెట్టారు. వాటితోపాటు హంతకుడి చర్మం కొంత భాగం ఆమె గోళ్లలో ఇరుక్కోగా దాన్ని కూడా భద్రపరిచారు. తర్వాత ఇటీవల అతడి డీఎన్ఏను కనుగొని, ఈ కేసును ఓ టీవీ చానల్‌లోని క్రైం షోలో చూపించారు. దీంతో.. ఆ కార్యక్రమం చూసిన ఓ ప్రేక్షకుడు నిందితుడి గురించి ఉప్పందించాడు. వెంటనే నిందితుడిని డీఎన్ఏ శాంపిల్ ఇవ్వాల్సిందిగా ఆదేశించి, పరీక్షించగా.. అది పాత డీఎన్ఏతో సరిపోలింది. ప్రస్తుతం 45 ఏళ్ల వయసున్న ఆ నిందితుడిని హత్యానేరంతో పాటు.. నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. -
ఆ ఉద్యోగిని బిడ్డకు ప్రియుడే తండ్రి..!
బెంగళూరు, న్యూస్‌లైన్: ప్రియుడితో సహజీవనం చేస్తూనే మాజీ భర్తతో ఏకకాలంలో లైంగిక సంబంధం కొనసాగిస్తున్న మహిళ నెల తప్పితే... ఆ బిడ్డకు తండ్రికి ఎవరు? అనే సందిగ్ధం వేధించక మానదు. ఇటువంటి సంకట స్థితినే ఎదుర్కొన్న ఓ కార్పొరేట్ కంపెనీ ఉద్యోగిని (40) నాలుగు నెలలుగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా వాస్తవాన్ని తెలుసుకొని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రియుడే తండ్రని రుజువుకావడంతో, ఇకపై ఆయనతోనే కాపురం చేయాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరాదికి చెందిన ఆమె బెంగళూరులోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తోటి ఉద్యోగిని పదేళ్ల క్రితం పెళ్లాడినా వీరికి సంతానం కలగలేదు. దీంతో వారు రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అదే కంపెనీలోని మరో సహోద్యోగితో ఆమె సహజీవనం సాగిస్తున్నారు. అయితే, ఆమె ఇప్పటికీ మాజీ భర్తతో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమె 4 నెలల క్రితం గర్భం దాల్చారు. తల్లినవుతున్నందుకు ఆనందించాలో, పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో తెలియక విచారించాలో తెలియక యాతన పడ్డారు. డీఎన్ఏ పరీక్షల ద్వారానే వాస్తవం నిగ్గుతేల్చుకోవాలని ఆమె నిర్ణయానికొచ్చారు. మాజీ భర్తను, ప్రియడిని వెంట పెట్టుకొని వారం క్రితం ఇక్కడి ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించి డీఎన్ఏ పరీక్షలకు అభ్యర్థించారు. అరుదైన సందర్భం కావడంతో తొలుత సందేహించిన వైద్యులు, తర్వాత పరీక్షలకు అనుమతించారు. ఆ ముగ్గురి రక్త నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపారు. ఉత్కంఠతో ఎదురు చూసిన నివేదిక శుక్రవారం వచ్చింది. తన బిడ్డకు కడుపులో బిడ్డకు ప్రియుడే తండ్రి అని రూఢికావడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. ఆమెతో కాపురం చేయడానికి మాజీ భర్త, ప్రియుడు ఇద్దరూ ఆసక్తి చూపడం విశేషం. ఇక ప్రియుడితోనే కలిసి జీవించాలని ఆమె నిర్ణయించుకున్నారు. -
యాసిన్ భత్కల్ ను గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు!
భారత జాబితాలో మోస్ట్ వాంటెడ్ టెర్రిరిస్ట్ యాసిన్ భత్కల్ కు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భత్కల్ ఐడెంటిటీని ధృవీకరించడానికి బీహార్ పోలీసులు కర్నాటక పోలీసులను సంప్రదించినట్టు తెలిసింది. భత్కల్ ను అరెస్ట్ చేసిన వెంటనే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి ఓ టీమ్ ను పంపించాలని విజ్క్షప్తి చేసినట్టు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వ్యక్తి భత్కలేనా కాదా అని ధృవీకరించడానికి కర్నాటక పోలీసు విభాగానికి చెందిన ఓ టీమ్ బీహార్ కు వెళ్లినట్టు సమాచారం. కర్నాటకలోని తీరపాంత్రమైన భత్కల్ గ్రామానికి యాసిన్ భత్కల్ చెందినవాడని అధికారులు తెలిపారు. మభ్యపెట్టే విషయంలో భత్కల్ ఆరితేరిన వాడు కావడంతో అతని కుటుంబ సభ్యులతో జీవసంబంధమైన అంశాన్ని పోలీసులు సరి చూడటానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించానున్నారు.