హుబ్లీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహా హిరేమఠ హత్య కేసు నిందితుడు ఫయాజ్ రక్త నమూనాను సీఐడీ దర్యాప్తు అధికారులు న్యాయమూర్తి సమక్షంలో సేకరించారు. నిందితునిపై మరింత దర్యాప్తు, అతని డీఎన్‌ఏ పరీక్ష చేయడానికి అనుమతి కోరి సీఐడీ అధికారులు హుబ్లీ 1వ అదనపు సెషన్స్ కోర్టులో అర్జీ వేశారు. ఈ నేపథ్యంలో జడ్జి సమక్షంలో వైద్యులు ఫయాజ్ రక్త నమూనాలను సేకరించారు.
హత్య జరిగిన స్థలం, హత్యకు వాడిన చాకుపై రెండు రక్తపు గ్రూప్‌లను కనుగొన్నారు. ఒక రక్త గ్రూప్ నేహాది అయితే, మరొకటి ఫయాజ్‌ది కావచ్చని, కత్తితో పొడిచేటప్పుడు అతనికి స్వల్ప గాయమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు అధికారులు ఫయాజ్ డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు. కాగా ఫయాజ్‌ను సీఐడీ బృందం 6 రోజుల కస్టడీకి తీసుకున్న సంగతి విదితమే. సోమవారంతో కస్టడీ గడువు ముగియనుంది. అతన్ని మరింతగా విచారించడానికి కస్టడీ గడువును పొడిగించాలని సీఐడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment