సుజాత (ఫైల్)
వైఎస్‌ఆర్ జిల్లా,రాజంపేట: గత ఏడాది డిసెంబరు 26న రాజంపేట పట్టణంలో సంచలనం రేపిన వివాహిత సుజాత హత్యోదంతంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మిస్టరీని చేధించేందుకు పోలీసులు తమదైన రీతిలో దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ అన్బురాజన్ పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ఆధ్వర్యంలో సుజాత హత్య కేసులో పురోగతి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతురాలి వీర్యం శాంపిల్స్, బ్లడ్‌శాంపిల్స్ రిపోర్టుతోపాటు కానిస్టేబుల్ డీఎన్‌ఏ రిపోర్టు వచ్చిన తర్వాత హత్యకేసు మిస్టరీ వీడే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
హత్య జరిగిన తీరు ఇలా..
రాజంపేట పట్టణం నడిబొడ్డున నూని వారిపల్లెరోడ్డులోని నలందా స్కూలు వీధిలో శ్రీనివాసులరెడ్డి, సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త జీవనోపాధి కోసం గల్ఫ్‌దేశానికి వెళ్లారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సుజాత పట్టణంలోనే ఒంటరిగా జీవనం సాగించేది. ఈ నేపథ్యంలో సుజాత హత్యచారం ఘటన సంచలనం రేపింది. సుజాత హత్య కేసులో ప్రధానంగా కిరణ్ అనే కానిస్టేబుల్‌కు డీఎన్‌ఏ పరీక్షలు చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. మృతిచెందిన సుజాతతో ఆర్థిక వ్యవహారాలు సాగిస్తున్న కానిస్టేబుల్ ఆమెతో సన్నిహితంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ కిరణ్ రక్తాన్ని డీఎన్‌ఏ పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపారు. ఈ విషయాన్ని డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment