
అలహాబాద్ : పిల్లల పితృత్వాన్ని నిరూపించేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేయించటం ఒక్కటే న్యాయబద్ధమైన, శాస్త్రీయమైన మార్గమని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య వివాహేతర సంబంధాన్ని నిరూపించటానికి భర్తకు.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి వివాహేతర సంబంధం కలిగిలేనని, భర్త ఆరోపణలు అబద్ధమని తేల్చడానికి భార్యకు డీఎన్‌ఏ పరీక్ష ఉత్తమమైనదని పేర్కొంది. నీలం అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి వివేక్ అగర్వాల్ మంగళవారం విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, యువతీ యువకులు తమకు నచ్చిన వారితో కలిసి ఉండొచ్చని గతంలో అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పిన సంగతి తేలిసిందే. వారి జీవితాల్లో కలుగజేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. నచ్చిన వారితో కలిసి జీవించే అవకాశం యువతకు ఉందని పేర్కొంది. వేర్వేరు మతాలకు చెందిన యువతి, యువకుడు వివాహం చేసుకున్న ఘటనలో న్యాయస్థానం ఈ సంచలన తీర్పునిచ్చింది.