
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత కుమార్తెనని నిరూపించుకునేందుకు తనను డీఎన్‌ఏ పరీక్షకు అనుమతివ్వాలని బెంగళూరుకు చెందిన అమృత గురువారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జయలలితను బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ఖననం చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. తాను జయలలిత కుమార్తెనని, డీఎన్‌ఏ పరీక్షకు సైతం సిద్ధమని ఇటీవల అమృత సుప్రీంకోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను తిరస్కరించిన అత్యున్నత న్యాయస్థానం తొలుత హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం మద్రాస్ హైకోర్టులో అమృత పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌లో డీఎన్‌ఏ విషయంగా పేర్కొన్న కొన్ని అంశాలను జస్టిస్ ఎస్.వైద్యనాథన్ పరిగణనలోకి తీసుకోలేదు. విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment