
టీ.నగర్ (చెన్నై): దివంగత తమిళనాడు సీఎం జయలలిత కూతురినంటూ ఇటీవల కోర్టులో పిటిషన్ వేసిన అమృత జయ కూతురే అని జయ స్నేహితురాలు గీత ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. నటుడు శోభన్‌బాబు, జయకు అమృత జన్మించిందని, ఈ విషయం శశికళకు తెలుసన్నారు. 1996 నుంచి జయలలితతో అమృత సంబంధాలు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. 1999లో ఓసారి ఆంధ్రప్రదేశ్‌లో శోభన్‌బాబు ఇంటికి వెళ్లినప్పుడు కూడా ఆయన తనకు కుమార్తె ఉన్నట్లు, ఆమె అమృత అని తనతో చెప్పారన్నారు. డీఎన్‌ఏ పరీక్షల్లోనే అసలు విషయం తెలుస్తుందని అన్నారు.