
కవలలే కానీ, తండ్రులు మాత్రం ఇద్దరు!
సాధారణంగా అన్నీ దేశాలలో మాదిరిగానే వియత్నాంలో ఇద్దరు కవలలు పుట్టారు.
సాధారణంగా అన్నీ దేశాలలో మాదిరిగానే వియత్నాంలో ఇద్దరు కవలలు పుట్టారు. కానీ, వీరు అందరిలా సామాన్యమైన కవలలు మాత్రం కాదు. ఎందకుంటే ఆ కవల చిన్నారులకు తండ్రులు మాత్రం ఇద్దరు అని వైద్యులు తేల్చేశారు. వియత్నాం ఉత్తర ప్రాంతం హోయా బిన్హ్ లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ కవల చిన్నారుల వయసు రెండేళ్లు. ఓ చిన్నారికి జట్టు చాలా పలుచగా ఉండగా, మరో కవల చిన్నారికి ఎక్కువ వెంట్రుకలు ఉన్నాయి. ఏదో సందేహం వచ్చిన చిన్నారుల తండ్రి డీఎన్ఏ టెస్టుల కోసం కవలల్ని ఆస్పత్రికి వెళ్లారు. కవలలు పుట్టిన సమయంలో డాక్టర్లు పొరపాటుగా చిన్నారుల్ని తారుమారు చేశారేమేనని ఆయన అనుమానపడ్డారు.
ఆస్పత్రిలో అసలు ట్విస్ట్ మొదలైంది
పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆ కవలలకు అసలు తల్లి ఆమెనని, కానీ తండ్రులు మాత్రం వేరని చెప్పారు. కవలలకు ఫాదర్స్ ఇద్దరు ఉండటం చాలా అరుదైన సంఘటన అని చెబుతున్నారు. మహిళ అండం జీవితకాలం 12 నుంచి 48 గంటలు ఉంటుందని, ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల వీర్యకణాలతో అవి పిండంగా మారడంతో ఇద్దరు కవలలు ఈ విధంగా పుడతారని డీఎన్ఏ టెస్ట్ చేసిన వైద్యులు వివరించారు. ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోవడం ఆ తల్లిదండ్రుల వంతు అయింది. రెండో చిన్నారికి తండ్రి ఎవరన్న అనుమానం వారిలో మొదలైంది.