
సాక్షి, న్యూఢిల్లీ : డీఎన్‌ఏ పరీక్ష చేయడం ద్వారా స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ (నేతాజీ) మరణంపై ఉన్న అనుమానాలన్నింటికి స్వస్తి పలకవచ్చని ఆయన కూతురు అనితా బోస్ అన్నారు. బోస్‌ను ఖననం చేసిన అవశేషాలు మిగిలి ఉంటాయని వాటి డీఎన్‌ఏను పరీక్షిస్తే అసలు విషయం తేలిపోతుందని అభిప్రాయపడ్డారు.
'లేయిడ్ టు రెస్ట్ : ది కాంట్రవర్సి ఓవర్ సుభాష్ చంద్రబోస్ డెత్' అనే పుస్తకంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ మరణంపై ఉన్న అనుమానాల పరంపరను పేర్కొంటూ వస్తున్న ఈ కొత్త పుస్తకాన్ని ఆశీష్ రే రాశారు. సుభాష్ చంద్రబోస్ అవశేషాలను 1945 సెప్టెంబర్ నుంచి టోక్యోలోని రెంకోజి ఆలయంలో భద్రపరుస్తూ వస్తున్నారు. నేడు దేశ వ్యాప్తంగా నేతాజీ 121వ జయంతి వేడుకలు జరిగిన విషయం తెలిసిందే.