Anita Bose
-
ఆరెస్సెస్ వారి నేతాజీ జయంతి వేడుకలు
కోల్‌కతా: స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్ఏ) వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆరెస్సెస్ సన్నద్ధమవుతోంది. ఈ తరుణంలో.. నేతాజీ కూతురు అనితా బోస్(80) స్పందించారు. జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈ సందర్భంగా.. కోల్‌కతాలోని షాహిద్ మినార్ గ్రౌండ్లో జయంతి వేడుకల నిర్వహణకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరు కానున్నారు. అయితే.. ఈ పరిణామంపై నేతాజీ కూతురు అనిత ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.. తన తండ్రి పేరును ఆరెస్సెస్, బీజేపీలు పాక్షికంగా వాడుకోవాలని యత్నిస్తున్నాయేమో అని అన్నారామె. ఆర్ఎస్ఎస్ భావజాలం.. జాతీయవాద నాయకుడైన తన తండ్రి(నేతాజీ) లౌకికవాదం, సమగ్రత ఆలోచనలు.. పరస్పర విజాతి ధృవాలను, అవి ఏనాడూ కలవవని ఆమె అన్నారు. సిద్ధాంతాల విషయానికొస్తే.. దేశంలోని ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీకి, నేతాజీకి చాలా ఎక్కువ సారూప్యతలు ఉన్నాయన్నారామె. అన్నింటికి మించి ఆయన లెఫ్టిస్ట్ అనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆరెస్సెస్, బీజేపీలు ఆయన వైఖరిని ప్రతిబింబించలేవు. వాళ్లు అతివాదులు, నేతాజీది వామపక్ష భావజాలం అని ఫోన్ ద్వారా జర్మనీ నుంచి ఇక్కడి మీడియాతో ఆమె మాట్లాడారు. విభిన్న సమూహాలు నేతాజీ జన్మదినాన్ని వివిధ మార్గాల్లో జరుపుకోవాలని కోరుకుంటాయి. వారిలో చాలా మంది తప్పనిసరిగా ఆయన ఆలోచనలతో ఏకీభవిస్తున్నారు. అయితే.. నేతాజీ ఆశయాలను, ఆలోచనలను స్వీకరించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తే అది ఖచ్చితంగా బాగుంటుంది అని అనిత బోస్ వెల్లడించారు. నేతాజీ.. ఆరెస్సెస్ విమర్శకుడా? అనే ప్రశ్నకు.. ఆ విషయంపై తనకు స్పష్టత లేదని ఆమె బదులిచ్చారు. అయితే.. ఆరెస్సెస్ గురించి, నేతాజీ భావజాలం గురించి మాత్రం తనకు స్పష్టత ఉందని, ఈ రెండు పొసగని విషయాలని ఆమె అన్నారు. ముఖ్యంగా నేతాజీ సెక్యులరిజం అనేది ఆరెస్సెస్‌కు సరిపోని అంశమని పేర్కొన్నారామె. ఇదిలా ఉంటే.. 2021లో తృణమూల్ కాంగ్రెస్-బీజేపీలు నేతాజీ 125వ జయంతి వేడుకల కోసం పోటాపోటీ పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే ఆ రెండు పార్టీలు అలాంటి చర్యలకు దిగడం గమనార్హం. -
నేతాజీ ‘అస్థికల’కు డీఎన్ఏ టెస్ట్ డిమాండ్!
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సంగ్రామ యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలుగా భావిస్తున్న వాటిని భారత్‌కు రప్పించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆయన ఒక్కగానొక్క కుమార్తె అనితా బోస్ పాఫ్ ఈ మేరకు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ నేతాజీ కుమార్తె స్పందించడం గమనార్హం. 1945 ఆగస్ట్ 18న తైవాన్ వద్ద జరిగిన విమానప్రమాదంలో నేతాజీ తుది శ్వాస విడిచారని, ఆయన అస్థికలు జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని ప్రతీతి. ‘‘అస్థికలను భారత్ తేవాల్సిన సమయమొచ్చింది. అవి మా నాన్నవే అని చెప్పేందుకు నేటి డీఎన్ఏ టెస్టింగ్ విధానం సాయపడనుంది. ఇందుకు జపాన్ ప్రభుత్వం, రెంకోజీ ఆలయ ప్రధాన పూజారి గతంలోనే అంగీకరించారు. దేశ స్వేచ్ఛ కంటే నేతాజీకి ఆయన జీవితంలో మరేదీ ముఖ్యంకాదు. భారతజాతి స్వేచ్ఛావాయువులు పీల్చాలని నేతాజీ కలలుగన్నారు. ఆ కల నేడు నెరవేరింది. కానీ.. ఆయనిప్పుడు లేరు. కనీసం ఆయన అస్థికలనైనా భరతమాత(స్వదేశం) చెంతకు చేరుద్దాం’ అని అనిత బోస్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. నేతాజీ అవశేషాలకు డీఎన్ఏ టెస్ట్ నిర్వహించాలని ఆయన కుటుంబం చాలా ఏళ్ల నుంచి విజ్ఞప్తి చేస్తోంది. విషయంలో జపాన్, రెంకోజీ ఆలయాలు సిద్ధంగా ఉన్నా.. భారత ప్రభుత్వం నుంచి స్పందన కొరవడిందని జపాన్ విదేశాంగ శాఖ గతంలో ప్రకటించింది. ఇదీ చదవండి: 38 ఏళ్ల తర్వాత మంచు దిబ్బల నడుమ లాన్స్ నాయక్ చంద్రశేఖర్ -
కంగన ఎఫెక్ట్: గాంధీజీపై నేతాజీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ) స్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్నకు, గాంధీజీకి మధ్య సంబంధాలు అంత బాగుండేవి కావు. కానీ మా నాన్నకు గాంధీజీ అంటే చాలా అభిమానం’’ అన్నారు. ఉన్నట్లుండి నేతాజీ కుమార్తె.. తన తండ్రి గురించి, గాంధీజీ గురించి మాట్లాడటానికి కారణం ఏంటంటే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆ వివరాలు.. స్వాతంత్య్రం గురించి వివాదం రాజేసి.. అది సద్దుమణగకముందే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కంగన. గాంధీజీ, నెహ్రూ ఇద్దరు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను బ్రిటీష్ వారికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక చరిత్ర ప్రకారం చూసుకున్న గాంధీజీ, నేతాజీకి మధ్య సిద్ధాంతపరమైన విబేధాలున్న సంగతి తెలిసిందే. (చదవండి: మహాత్ముడు కొల్లాయి గట్టింది ఎందుకు?) ఈ క్రమంలో తాజాగా కంగన వ్యాఖ్యలపై నేతాజీ కుమార్తె అనిత బోస్ స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కంగన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. ‘‘మా నాన్నకు, గాంధీ గారికి మధ్య సత్సంబంధాలు ఉండేవి కావు. మరోవైపు మా నాన్నకు గాంధీ గారంటే చాలా ఇష్టం’’ అని తెలిపారు. ‘‘వారిద్దరు గొప్ప నాయకులు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఒకరు లేకుండా ఒకరిని ఊహించుకోలేం. వారిద్దరిది గొప్ప కలయిక. కేవలం అహింసా సిద్ధాంతం వల్ల మాత్రమే మనకు స్వాతంత్య్రం సిద్ధించింది అంటూ చాలాకాలం నుంచి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ, ఐఎన్ఏ పోషించిన పాత్ర మనందరికి తెలుసు’’ అన్నారు అనితా బోస్. (చదవండి: మరోసారి కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియో వైరల్) ‘‘అలానే కేవలం నేతాజీ, ఐఎన్ఏ వల్ల మాత్రమే స్వాతంత్య్రం వచ్చింది అనే ప్రచారం వ్యర్థం. గాంధీజీ మా నాన్నతో సహా ఎందరికో ప్రేరణగా నిలిచారు. స్వాతంత్య్రం గురించి ఏకపక్ష ప్రకటనలు చేయడం తెలివితక్కువతనం’’ అంటూ పరోక్షంగా కంగనకు చురకలు వేశారు అనితా బోస్. చదవండి: బేలాబోస్: ఆమె పేరు మీద ఒక రైల్వేస్టేషన్! -
'డీఎన్ఏ పరీక్షతో అన్ని అనుమానాలు పోతాయ్'
సాక్షి, న్యూఢిల్లీ : డీఎన్ఏ పరీక్ష చేయడం ద్వారా స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ (నేతాజీ) మరణంపై ఉన్న అనుమానాలన్నింటికి స్వస్తి పలకవచ్చని ఆయన కూతురు అనితా బోస్ అన్నారు. బోస్‌ను ఖననం చేసిన అవశేషాలు మిగిలి ఉంటాయని వాటి డీఎన్ఏను పరీక్షిస్తే అసలు విషయం తేలిపోతుందని అభిప్రాయపడ్డారు. 'లేయిడ్ టు రెస్ట్ : ది కాంట్రవర్సి ఓవర్ సుభాష్ చంద్రబోస్ డెత్' అనే పుస్తకంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ మరణంపై ఉన్న అనుమానాల పరంపరను పేర్కొంటూ వస్తున్న ఈ కొత్త పుస్తకాన్ని ఆశీష్ రే రాశారు. సుభాష్ చంద్రబోస్ అవశేషాలను 1945 సెప్టెంబర్ నుంచి టోక్యోలోని రెంకోజి ఆలయంలో భద్రపరుస్తూ వస్తున్నారు. నేడు దేశ వ్యాప్తంగా నేతాజీ 121వ జయంతి వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. -
నేతాజీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
-
నేతాజీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, జాతీయ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్ట్ 18న విమాన ప్రమాదంలో చనిపోయారనే విషయాన్ని నమ్ముతున్నట్లు ఆయన కుమార్తె అనితా బోస్ (73) ప్రకటించారు. స్వాతంత్ర్య పూర్వమే ప్రపంచవ్యాప్తంగా ఎంతో బలమైన నాయకుడిగా ఎదిగిన తన తండ్రి నేతాజీ భారత్ తిరిగొస్తే, నెహ్రూకు మంచి బలమైన ప్రత్యామ్నాయంగా మారి ఉండేవారని ఆమె వ్యాఖ్యానించారు. జపాన్‌లోని రెంకోజీ దేవాలయంలో ఉంచిన నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అనితా బోస్ డిమాండ్ చేశారు. బోస్ 119వ జయంతి సందర్భంగా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాని ప్రయత్నాల పట్ల అనితా బోస్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ మిస్టరీకి ఇప్పటికైనా ముగింపు పడుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. తండ్రికి సంబంధించి ప్రత్యేక జ్ఞపకాలేవీ లేకపోయినప్పటికీ, ఆయన గొప్పదనం గురించి తల్లి ఎపుడూ చెబుతూ ఉండేవారన్నారు. భారతదేశం స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తి అని అనితా బోస్ కొనియాడారు. కొన్ని సమస్యలపై నెహ్రుకు, తన తండ్రికి అభిప్రాయాలు ఒకేలా ఉన్నా, విబేధాలు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యంగా మత ఘర్షణలు, మతాధిపత్యం లేని రాజకీయ వ్యవస్థను ఇద్దరూ అభిలాషించారని తెలిపారు. అలాగే పారిశ్రామికీకరణను ఇద్దరూ కోరుకున్నా, పాకిస్తాన్ విషయంలో మాత్రం చాలా తేడాలున్నాయని ఆమె చెప్పారు. బోస్ బతికుంటే రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించేవారని, నెహ్రూకు ప్రత్యామ్నాయంగా కచ్చితంగా ఉండేవారని వ్యాఖ్యానించారు. పొరుగుదేశం పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగ్గా ఉండేలా ప్రయత్నించి, విజయం సాధించి వుండేవారని తెలిపారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన ఒక వ్యక్తి, దేశానికి, రాజకీయాలకు, తన కుటుంబానికి సంబంధం లేకుండా ఒక బాబాగా ఎక్కడో పర్వతాల్లో బతికి ఉంటారనే విషయాన్ని ఎలా నమ్ముతామని అనితా బోస్ ప్రశ్నించారు. ఆయన బతికుంటే అందరికీ సంతోషమే కానీ, పర్వతాల్లో గుమనామి బాబా సంచరిస్తున్నారంటూ మతి లేని ప్రచారం చేయడం నేతాజీ ప్రతిష్టకే భంగకరమన్నారు. అలాగే దేశం కోసం జీవితాన్ని అర్పించిన వ్యక్తి మరణం వివాదాస్పద కావడం బాధ కలిగించిందన్నారు. దేశ ప్రజలు తన తండ్రిని ఆ వివాదం ద్వారా గుర్తు పట్టడం విచారించాల్సిన విషయమని అనితా బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో భారత్, జపాన్ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలన్నారు. ప్రత్యేక నిపుణులతో అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. దశాబ్దాలుగా ఇంత అగౌరవమైన చర్చ జరుగుతున్నా జపాన్ ఈ నిజాలను బయట పెట్టకపోవడం ఆ దేశానికే అవమానకరమని చురకలంటించారు. కాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి భారత ప్రభుత్వం వద్ద ఉన్న కొన్ని రహస్య పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బోస్ 119వ జయంతి సందర్భంగా ఈ నెల 23వ తేదీన (శనివారం) బహిర్గతం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జరిగే కార్యక్రమానికి బోస్ కుటుంబ సభ్యులు, కొందరు నాయకులు హాజరవుతారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ గురువారం తెలిపారు. ఈ నేపథ్యంలో నేతాజీ కుమార్తె అనిత వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరి కొద్దిగంటల్లో ప్రభుత్వం వివరాలు బయటపెట్టనున్న తరుణంలో ఏడు దశాబ్దాలుగా ఉత్కంఠను రాజేసిన మిస్టరీకి ఇక తెరపడనుందా.. వేచి చూడాల్సిందే. -
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని...
రేపు నేతాజీ జయంతి కోల్‌కతా వీధులన్నీ - ‘‘అదిగో... మన అమ్మాయి వచ్చేస్తుంది’ అని మేలుకుంటాయి. చేతులన్నీ హారతి పళ్లేలవుతాయి. దారులన్నీ స్వాగత తోరణాలవుతాయి. ఆ వచ్చేది ఎవరో కాదు... నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూతురు అనితాబోస్. ఈ ప్రొఫెసరమ్మ కోల్‌కతా వీధుల్లో కారులో ప్రయాణిస్తున్న సమయంలో పక్కవారితో మాట్లాడుతున్నట్లుగానో, పుస్తక పఠనంలో లీనమైపోయినట్లుగానో కనిపించరు. చెప్పాలంటే, ఆమె వీధులతో ‘మౌన సంభాషణ’ చేస్తూ ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తారు. అల్లంత దూరాన... అంతెత్తులో గంభీరంగా నేతాజీ విగ్రహం. అది చూస్తున్నప్పుడు ఆయన కూతురు కళ్లలో కనిపించే ‘మెరుపు’ను పట్టుకోగలిగితే ఆమె అణువణువూ తండ్రి నామస్మరణతో ఎంత గర్వంగా ఎగిసిపడుతుందో అర్థమవుతుంది. బాల్యం నుంచి ఇప్పటి వరకు తన తండ్రి గురించి ఆమె ఎన్నెన్నో వీరగాథలు విని ఉంది. వాటిలో పూర్తి నిజాలు ఉండి ఉండొచ్చు. వీరాభిమానం నుంచి పుట్టిన ‘కల్పన’లు ఉండి ఉండొచ్చు. అయితే తన తండ్రి ‘చారిత్రక పురుషుడు’ అనేదాంట్లో మాత్రం మరో మాటకు తావులేదనే విషయం అనితాబోస్కు అర్థమైంది. ఇండియాలో ఉన్న నేతాజీ బంధువుల మాటల్లో ‘నాన్న’ జాడను వెదుక్కుంది ఆమె. ఆమె మోములో ‘నేతాజీ’ని చూసుకొని మురిసిపోయేవారు బంధువులు. స్వాతంత్య్రానికి పూర్వం నాటి నలుపు, తెలుపు ఛాయాచిత్రాలతో, ఇప్పటి ‘ప్రెసిడెన్సీ కాలేజీ’ విజువల్‌తో సుభాష్ చంద్రబోస్ కుటుంబ నేపథ్యం, చదువు పరిచయం అవుతుంది. బంగారు చెంచా నోట్లో పెట్టుకొని పుట్టారు సుభాష్ చంద్రబోస్. కాలు కింద పెట్టాల్సిన అవసరం లేదు. సుఖాలు, సౌకర్యాలు క్యూ కట్టి నిల్చొంటాయి. చదువు విషయానికి వస్తే పుంభావ సరస్వతి. ఇండియన్ సివిల్ సర్వీస్‌లో నాలుగవ ర్యాంకు. ఎటు చూసినా భద్రజీవితమే! ‘‘ఆయనకేం తక్కువ’’ అని అనుకోవడానికి పెద్ద జాబితానే ఉంది. వీటన్నిటినీ కాదనుకొని సుభాష్ స్వాతంత్య్ర సమరంలోకి అడుగు పెట్టారు. నేతాజీ అయ్యారు. బ్రిటిష్ వాడి జాత్యహంకారంపై ఒంటి కాలి మీద లేచారు. అనేకానేకసార్లు కారాగారం పాలయ్యారు. అనారోగ్యానికి గురయ్యారు. ప్రతిష్ఠాత్మకమైన ‘భారత జాతీయ కాంగ్రెస్’ అధ్యక్ష పదవికి ఎన్నికైన బోస్ ఆ తరువాత కాలంలో కాంగ్రెస్‌ను వీడారు. ‘ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ ఫ్రీ. అవర్ స్ట్రగుల్ ఈజ్... నో డౌట్ ఏ నాన్వ యొలెన్స్ స్ట్రగుల్...’ ఈ దృశ్యంలో బోస్ కంచుకంఠాన్ని మళీ మళ్లీ వినాలనిపిస్తుంది. భారత స్వాతంత్య్రానికి ‘నాన్వయొలెన్స్ స్ట్రగుల్’ మాత్రమే సరిపోదని ‘ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్’ను స్థాపించారు. ప్రతి మనిషీ ఒక సైనికుడై ప్రాణార్పణ చేయాలన్నారు. ‘ఫాసిస్ట్ డిసిప్లేన్’ ‘సోషలిస్ట్ ఐడియాలజీ’తో ముందుకు వెళ్లాలనే బోస్ ఆలోచనను చాలామంది విభేదించినా... అంతకంటే చాలామంది ఆయన్ను ఆరాధించడానికి ప్రొఫెసర్ అంటోని పెలింక తన ఇంటర్వ్యూలో ఉపయోగించిన ‘మాగ్నటిక్ పర్సన్’ అనే విశేషం కారణం కావచ్చు. ‘డెమోక్రసీ ఇండియా స్టైల్’ గ్రంథకర్తగా పెలింక ప్రసిద్ధుడు. చరిత్రకారుడు సుగతబోస్ నేతాజీకి సమీప బంధువు కూడా. స్వాతంత్య్ర సమర బాటలో నేతాజీ చేసిన ప్రయాణాల గూర్చి, ఎదురైన ప్రమాదాల గూర్చి తన ఇంటర్వ్యూలో చెప్పారు. నేతాజీని ఉద్దేశించి సుగతబోస్ ‘ ఏ మ్యాన్ విత్ అన్లిమిటెడ్ కరేజ్’ అని ఎందుకన్నారో ఆయన చెప్పిన విషయాల్లోనే తెలిసిపోతుంది. నేతాజీ సెక్రటరీ భార్య ఇంటర్వ్యూతో పాటు ప్రొఫెసర్ క్రిష్ణబోస్, జస్టిస్ యం.కె.ముఖర్జీ... మొదలైన వారి ఇంటర్వ్యూలు ఈ డాక్యుమెంటరీకి బలాన్ని ఇచ్చాయి. ఒక దృశ్యంలో: అనితాబోస్, కెప్టెన్ లక్ష్మీ సెహెగెల్ ఇంటికి వెళ్లి ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. ‘మై డాటర్!’ అని అనితను అక్కున చేర్చుకుంటారు లక్ష్మీ. ఇద్దరి కళ్లలో నీళ్లు ప్రేక్షకులకు సైతం భావోద్వేగపూరిత కన్నీళ్లను తె ప్పిస్తాయి. గత దృశ్యాల నుంచి వర్తమానానికి, ఇక్కడి నుంచి మళ్లీ గతానికి వెళ్లే దృశ్యాల సమాహారంగా ఈ డాక్యుమెంటరీ కనిపిస్తుంది. సందర్భానుసారంగా ఉపయోగించుకున్న ఆనాటి బ్రిటీష్ రాజ్‌కు సంబంధించిన నలుపు తెలుపు దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఈ డాక్యుమెంటరీకీ కాలం లేదు. ఇది గతానిది. వర్తమానానిది. రేపటి భవిష్యత్‌ది! ఒక మాట: నేతాజీకి సంబంధించిన విషాదమేమిటంటే, మరణానికి సంబంధించిన మిస్టరీ గురించి జరిగినంత చర్చ ఆయన రాజకీయాభిప్రాయాల గురించి, సైద్ధాంతిక దృక్పథం గురించి జరగలేదు. ఒకవేళ జరిగినా...అది ప్రధాన స్రవంతి మీడియాకు దూరంగా ఉంది. ‘ఫలానాచోట... నేతాజీ స్వామీజీగా అవతరించాడు’లాంటి టాపిక్లపై జరిగే చర్చ కంటే ఆ యోధానుయోధుడి పొలిటికల్ కెరీర్, పబ్లిక్ లైఫ్ గురించి తెలుసు కోవాల్సిన విషయాలు, చర్చించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. - యాకుబ్ పాషా యం.డి డాక్యుమెంటరీ పేరు: నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెరైక్టర్: తిల్మన్ రెమ్మే కె మెరా: బ్రెమెర్ జాన్ హిన్రిచ్