నేతాజీ అస్థికలకు డీఎన్‌ఏ పరీక్ష!
లండన్: జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ అస్థికలకు డీఎన్‌ఏ టెస్టు జరపాలని.. సుభాష్ చంద్రబోస్ చివరి రోజుల్లో జరిగిన పరిణామాలపై పరిశోధనలు చేస్తున్న బోస్‌ఫైల్స్.కామ్ అనే వెబ్‌సైట్ డిమాండ్ చేసింది. 1945, ఆగస్టు 18నలో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మృతిచెందారని..
అంత్యక్రియల తర్వాత ఆయన అస్థికలను టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని ఇటీవలే భారత ప్రభుత్వం విడుదల చేసిన రహస్యాల్లో వెల్లడైంది. అయితే దీన్ని విభేదిస్తున్నవాళ్లూ ఉండటంతో.. నేతాజీ అస్థికలకు డీఎన్‌ఏ పరీక్ష జరిపితే అంతా తేలిపోతుందని బోస్‌ఫైల్స్.కామ్ కోరింది. 1995లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే.. డీఎన్‌ఏ పరీక్ష కోసం భారత ప్రభుత్వం అనుమతివ్వాలంటూ.. ఈ వెబ్‌సైట్ సృష్టికర్త నేతాజీ మునిమనవడు ఆశిశ్ రాయ్ రాసిన లేఖను కూడా ఈ వెబ్‌సైట్ పోస్టు చేసింది.