Subhas Chandra Bose
-
నేతాజీని స్ఫూర్తిగా తీసుకోండి
న్యూఢిల్లీ: భావిభారత పౌరులైన విద్యార్థులు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని పరాక్రమ్ దివస్ కార్యక్రమంలో భాగంగా పాత పార్లమెంట్ భవంతిలో నేతాజీ చిత్రపటం వద్ద మోదీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులనుద్దేశించి తర్వాత మోదీ ప్రసంగించారు. ‘ నాడు స్వరాజ్యం కోసం ప్రజలు ఐక్యంగా మెలిగారు. నేడు ప్రజల మధ్య అదే ఐక్యత సాధిస్తే అది వికసిత భారత్‌కు బాటలు వేస్తుంది. దేశాన్ని బలహీనపరిచే, దేశ ఐక్యతను నీరుగార్చే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నేతాజీ నుంచి స్ఫూర్తి పొందాలి. అభివృద్ధి చెందిన భారత్‌ను సాధించాలన్న లక్ష్యంగా ముందుకుసాగే మనందరికీ నేతాజీ సదా స్ఫూర్తినందిస్తూనే ఉంటారు. కంఫర్ట్ జోన్‌ను వీడదాంతర్వాత మోదీ కటక్‌లో జరిగిన పరాక్రమ్ దివస్ కార్యక్రమంలోనూ వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ నేతాజీ ఎప్పుడూ తాను సౌకర్యవంతమైన జీవితం(కంఫర్ట్జోన్లో) గడపాలనుకోలేదు. దేశ స్వాతంత్య్ర కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ సాకారం కావాలంటే మనందరం కంఫర్ట్ జోన్‌ను వీడి కష్టించి పనిచేయాలి. ప్రపంచస్థాయి అత్యుత్తమ పనితీరు కనబరచాలి. మెరుగైన పనితీరు మీద దృష్టిపెట్టాలి. అభివృద్ధి చెందిన భారత్‌నే సుభాష్ చంద్రబోస్ కలలుగన్నారు. వికసిత్ భారత్‌ను సాక్ష్యాత్కారింపజేసుకుని నేతాజీకి నిజమైన నివాళులు అర్పిద్దాం’’ అని అన్నారు. నిజమైన నేతచర్చలో పాల్గొన్న విద్యార్థులతో మోదీ మాట్లాడారు. నేతాజీ బోధనల్లో నీకేం ఇష్టం? అని ఒక అమ్మాయిని అడగ్గా.. ‘‘నాకు మీ రక్తం ఇవ్వండి. నేను మీకు స్వా తంత్య్రాన్ని ఇస్తా.. అనే మాటలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయి. అన్నింటికన్నా ఆయనకు దేశమే ముఖ్యం. దేశంలో కర్భన ఉద్గారాల వెల్లడిని తగ్గించాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలి. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాలు, బస్సులు వాడాలి’’ అని అమ్మాయి చెప్పింది. దీంతో మోదీ కల్పించుకుని.. ‘‘ మా ప్రభుత్వం అదే బాటలో పయనిస్తోందికదా. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం 1,200 విద్యుత్ బస్సులను సమకూర్చింది. మరిన్ని అందుబాటులోకి తేనుంది. పీఎం సురక్షా యోజన సైతం తెచ్చాం. ఇంటి పైకప్పుపై సౌరఫలకాల వ్యవస్థ ఏర్పాటుచేసుకుంటే నెలనెలా విద్యుత్ బిల్లుల బాధ ఉండదు’’ అని మోదీ అన్నారు. -
దుర్గాపూజ: ఈ క్రెడిట్ ‘నేతాజీ’కే దక్కుతుంది..!
కోల్‌కతాలో దుర్గాపూజ వేడుకలు ఎంత ఆర్భాటంగా ఘనంగా జరుగుతాయో తెలిసిందే. అంతేగాదు అక్కడ చేసే దుర్గా వేడుకలు యునెస్కో గుర్తింపును కూడా అందుకున్నాయి. అంతలా చరిత్రలో పేరుగాంచడానికి కారణం స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ చంద్రబోస్. ఆయన విశాల దృక్పథం సరొకొత్త పూజా ఆవిష్కరణకు నాంది పలికింది. దేశభక్తిని పెంపొందించే వేదికలా.. బహింరంగంగా అంతా కలిసి చేసుకునే వేడుకగా మలిచారు. అలా కోల్‌కతాలో ఈ వేడుకలు బహిరంగంగా పెద్ద కోలాహలంగా జరగడం ప్రారంభమయ్యింది. సామాన్యుడు కూడా ఈ పండుగలో పాలుపంచుకోవాలనే సంకల్పం నెరవేరేలా మార్పులు తీసుకొచ్చారు. నవరాత్రుల సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోల్‌కతాలో జరిగే దుర్గాపూజ వేడుకను ఎలా మార్చారు..? అంతలా గుర్తింపు వచ్చేందుకు కారణమైనవి ఏంటి?..తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.పశ్చిమ బెంగాల్లో ఈ వేడుకలు మొదట్లో జమిందార్లు నిర్వహించేవారు. ఆ తర్వాత 1610లో బరిషాకు చెందిన సవర్ణ చౌదరి కుటుంబం చేసే వేడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలన్నీ ఘనంగా నిర్వహించినప్పటికీ ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ప్రభావితం చేయలేకపోయాయి. అయితే నేతాజీ స్వాతంత్ర్యం కోసం రకరకాల ప్రణాళికతో ముందుకు పోతున్న ఆయనకు ఈ వేడుక ఎంతాగానో ఆకర్షించింది. ఈ వేడుకును అందర్ని కలుపుకునే నిర్వహించి దీంతో స్వాతంత్ర సమరయోధులను సంఘాన్ని ఏర్పరుచుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన పుట్టింది. ఆ క్రమంలో నేతాజి 'సర్బోజోనిస్' అనే పేరుతో 10 రోజుల వేడుకలు నిర్వహించారు. ఆయనే ఆ కమిటీ ఆధ్యక్షుడిగా ఉండి ఈ పండుగ జయప్రదమయ్యేలా ముందుండి నడిపించారు. ఇక్కడ సర్బోజోనిన్ అంటే సమాజంలోని అందరి పండుగ అని అర్థం. బెంగాల్ వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంలా అంగరంగ వైభవంగా ఈ వేడుకలు ఇప్పటికి కొనసాగడం విశేషం. ఖైదీలు పూజించే హక్కు..1920లో బోస్ మాండలే జైలులో ఉన్నప్పుడు తన రాజకీయ గురువు బసంతీ దేవికి దుర్గాపూజ గురించి వివరిస్తూ లేఖ రాశారు. ప్రతి ఏడాది ఒకసారి వచ్చే ఈ నవరాత్రుల పండుగలో జైలులో ఉన్న తన బిడ్డల సందర్శించి వారి బాధలను తొలగిస్తుంది. అందువల్ల తాము కూడా పూజించుకునే హక్కు ఉందంటూ ఓ నినాదం లేవనెత్తారు నేతాజీ. ఆ కాలంలో క్రిస్మస్ వంటి పండుగలకు ప్రభుత్వం తరుపున రూ. 1200 గ్రాంట్ వచ్చేది. అలానే మాకు కూడా కావలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ వంతుగా రూ. 140లు, ప్రభుత్వం తరుఫు నుంచి రూ. 660లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే దీన్ని ఖైదీల జీతం నుంచే మినహించమని బ్రిటిష్ అధికారులు ఆదేశించడం నచ్చక నేతాజీ బర్మాలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెమోరాండం పంపారు. అయితే అది కూడా తిరస్కరింపబడింది. దీంతో ఆయన ఖైదీలకూ కూడా తమ మతపరమైన ఆచారాలను నిర్వహించుకునే హక్కు ఉందంటూ నిరాహార దీక్ష ప్రారంభించారు. అలాగే సరస్వతి పూజకు అదనంగా రూ. 60 ఇవ్వాలిన డిమాండ్ చేశారు. ఈ ఘటన దావనంలా వ్యాప్తి చెందడంతో బ్రిటిష్ ప్రభుత్వం దిగి వచ్చి ఖైదీలు ఒక్కొక్కరికి పూజ నిమిత్తం రూ. 30 మంజూరు చేసింది. ఇది తక్కువ మొత్తమే అయినా ఖైదీల హక్కులను హైలెట్ చేసింది. పూజా సంప్రదాయంలో మార్పులు..ఎచ్చల విగ్రహ సంప్రదాయంలో దుర్గా దేవత ఆరాధన తీసుకొచ్చారు. అంటే ఒకే పైకప్పుకింద పూజించటం అని చెప్పొచ్చు. దుర్గమ్మ ఆమె పిల్లలు అంతా ఒకే వేదికపై పూజలు చేసుకునేలా చేయడం. అలాగే విగ్రహా తయారీ సంప్రదాయ పద్ధతిలో కూడా మార్పులు తీసుకొచ్చారు. దుర్గమ్మ ఆమె పిల్లిలిద్దర్ని వేర్వేరు ఫ్రేమ్‌లలో తయారు చేయమని కళాకారులను కోరారు. దీని వల్ల సమయం ఆదా కావడమే గాక, ఏకకాలంలో వివిధ విగ్రహాలు రూపుదిద్దుకునే వెసులబాటు ఏర్పడింది. ఈ పండుగతో చిన్నా చితక పనులు చేసుకునే వారందర్నీ ఒకతాటిపైకి తీసుకొచ్చి మనమంతా ఒక్కటే అని చాటిచెప్పేలా ఈ పూజలో అందరూ భాగమయ్యేలా చేశారు. అట్టడుగు, ధనిక వర్గం అనేది దేవుడి సమక్షంలో ఉండదనే గొప్ప విషయాన్ని నేతాజీ ఆనాడే ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేసి, ఆ సంప్రదాయం నేటికీ కొనసాగేలా చేశారు. యావత్తు ప్రపంచం కోల్‌కతా దుర్గా పూజ సంపద్రాయానికి ఫిదా అయ్యి నమస్కరించేలా చేశారు. (చదవండి: కరణ్ జోహార్ 'టై' అంత ఖరీదా..? దేనితో డిజైన్ చేశారంటే..) -
అవును! నేను అన్నది నిజమే..బోస్పై కంగన మరో ట్వీట్ వైరల్
సిమ్లా : సినీ నటి, హిమాచల్ ప్రదేశ్ మండి లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి కంగనా రౌనత్ భారత్‌కు తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఈ తరుణంలో తాను చేసిన వ్యాఖ్యల్ని కంగనా సమర్ధించుకున్నారు. ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన సమ్మిట్‌లో కంగనా రనౌత్ మాట్లాడారు. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్లిపోయారంటూ మాట్లాడారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ట్రోలింగ్‌పై స్పందిస్తూ కంగనా ట్వీట్ చేశారు. అందుకు కారణాల్ని వివరిస్తూ.. నాడు ‘అక్టోబర్ 21, 1943న సింగపూర్‌లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తనకు తానే ప్రధాని అని ప్రకటించారంటూ ఓ జాతీయ మీడియా కథనాన్ని ట్వీట్ చేశారు. All those who are giving me gyan on first PM of Bharata do read this screen shot here’s some general knowledge for the beginners, all those geniuses who are asking me to get some education must know that I have written, acted, directed a film called Emergency which primarily… pic.twitter.com/QN0jD3rMfu — Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) April 5, 2024 ‘భారత్ తొలి ప్రధాని అంశంలో నన్ను విమర్శిస్తున్న వారు ఈ స్క్రిన్‌లో ఉన్న ఒక్కసారి చదవండి. నాకు కొంచెం చదువు చెప్పుచ్చు కాదా అని నన్ను అడుగుతున్న మేధావులందరికీ నేను ఒకటే చెబుతున్నా. నేను రైటర్‌ను. యాక్ట్ చేశా. డైరెక్షన్ చేశా అనే విషయాన్ని గుర్తుంచుకోండి’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. -
నేతాజీ జయంతికి సెలవు.. పిల్ కొట్టివేత
న్యూఢిల్లీ: స్వాతంత్ర సమర యోధుడు, ఆజాద్ హింద్‌ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని.. సెలవు దినంగా ప్రకటించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇలాంటి వ్యవహారాలతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయొద్దని పిటిషనర్‌ని మందలించింది న్యాయస్థానం. నేతాజీ సుభాష్ చంద్రబోస్.. 1897 జనవరి 23వ తేదీన కటక్‌లో జన్మించారు. అయితే.. ఆయన జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. తద్వారా ఆ మహనీయుడికి ఓ గౌరవం దక్కుతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సెలవు ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిల్లో అభ్యర్థించారు పిటిషనర్ కె కె రమేష్. అయితే.. దేశానికి ఆయన(నేతాజీ) చేసిన సేవలను గుర్తించడానికి ఉత్తమ మార్గం.. కష్టపడి పని చేయడమేనని, అంతేకానీ, ఇలా జయంతికి సెలవులను జోడించడం కాదు అని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అయినా ఇది పూర్తిగా భారత ప్రభుత్వ పరిధిలోని అంశమని, న్యాయ వ్యవస్థ పరిధిలోకి రాదని పేర్కొంటూ ఆ పిల్‌ను డిస్మిస్ చేశారాయన. ఇదీ చదవండి: గూగుల్ పోటీలో నెగ్గిన మన కుర్రాడు -
తలచుకుంటే నడుచుకోవాలి!
న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపాన ఉన్న ఛత్రంలో సెప్టెం బరు 8న స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ నిలువెత్తు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించడం ఒక చరిత్రాత్మక ఘట్టం. ఒకప్పుడు ఆ ఛత్రంలో ఉండిన బ్రిటిష్ రాజు 5వ జార్జ్ విగ్రహం తొలగింపుతో ఏర్పడిన ఖాళీని ఎవరితో భర్తీ చేయాలన్న విషయమై దశాబ్దాల తరబడి సాగిన ఊగిసలాట అనంతరం తీసు కున్న సముచిత నిర్ణయం ఇది. స్వాతంత్య్ర సాధన కోసం సాయుధ మార్గాలను అన్వేషిస్తూ నేతాజీ 1941 జనవరి 26న భారతదేశాన్ని వీడి ప్రవాసం వెళ్లిన అనంతరం ఇన్నేళ్లకు న్యూఢిల్లీలో తొలిసారిగా ఏర్పాటైన ఆ యోధుడి గర్వస్థలి ఇది! 1947కి ముందే అండమాన్‌ను వలస పాలన నుంచి విముక్తం చేసి, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు బోస్‌ను ‘అఖండ భారత్‌కు తొలి అధిపతి’గా మోదీ ప్రశంసించడం కూడా సరైనదే. అదే సమయంలో మనం స్వతంత్ర భారతిపై బోస్ ఆలోచనలు ఏమిటన్నవి మననం చేసుకోవాలి. స్వాతంత్య్రానంతరం భారత భద్రతా బలగాలు ఎలా ఉండాలనే విషయమై నేతాజీ ఐరోపాలో ఉన్నప్పుడే ప్రయోగాత్మకమైన ఆలోచనలు చేశారని చాలామందికి తెలియకపోవచ్చు. 1943 అక్టోబరు 21న షోనన్ (సింగ పూర్)లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు పూర్వరంగంగా బోస్ 1943 ఆగస్టు 25న ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’కి నాయకత్వం వహించడానికి చాలాముందే ఈ ప్రయత్నాలు జరిగాయి. ఆనాటికి బెర్లిన్‌లో ఉంటున్న దివంగత భారతీయ పాత్రికేయుడు ఏసీఎన్ నంబియార్‌తో భవిష్యత్ స్వతంత్ర భారత విదేశాంగ విధానం, రక్షణ, అంతర్గత పాలనపై తన ఆలోచనలను బోస్ 1934 నుండీ నిరంతరంగా పంచుకుంటూ వచ్చారు. 1942–1945 మధ్య కాలంలో నంబియార్ ఐరోపాలో బోస్‌కు సహాయకారిగా ఉన్నారు. బోస్ ఆయనను 1942 జనవరిలో పూర్తి దౌత్య హోదాతో బెర్లిన్‌లోని జర్మనీ విదేశాంగ కార్యాలయానికి అను బంధంగా ఉన్న ‘ఆజాద్ హింద్ ఆఫీస్’కు తన డిప్యూటీగా నియమించుకున్నారు. 1943 ఫిబ్రవరి 8న బోస్ రహ స్యంగా ఐరోపాను విడిచిపెట్టారు. బోస్‌తో నంబియార్ జర్మనీ, జపాన్లలోని ఫౌజ్ యంత్రాంగం ద్వారా మంత నాలు జరుపుతుండేవారు. బోస్‌కు ఆయన చివరి సమా చారం 1945 జనవరి 12న జర్మనీ పడవ యు–234 ద్వారా బట్వాడా అయింది. అయితే ఆ పడవ 1945 మే 14న అమెరికా నౌకాదళానికి పట్టు బడటంతో ఆ సమాచారం బోస్‌కు చేరలేదు. గాంధీజీ ప్రబోధించిన మత సామరస్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వతంత్ర భారతావనిలో అన్ని పాలనా వ్యవస్థలను నిర్మించడం బోస్ పథకం అని నంబియార్ నాతో చెప్పారు. జర్మనీలో బోస్ చేపట్టిన ప్రారంభ కార్యకలాపాలలో ఒకటి, 1941 డిసెంబర్ నుంచి భారత సైనిక దళాన్ని పటిష్టం చేసుకుంటూ రావడం. అందుకోసం ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి అగ్రరాజ్యాలకు పట్టుబడిన భారతీయ యుద్ధ ఖైదీలను జర్మనీ సహకారంతో వాలంటీర్లుగా తీసుకున్నారు. ఏడాది లోనే దాదాపు 4,000 మంది బోస్ దళ వాలంటీర్లుగా చేరారు. ‘‘భారతదేశంలోని ప్రధాన సామాజిక వర్గాలతో బోస్ దళం సమీకృతంగా ఉండేది. ఆ వర్గాలలోని అల్పసంఖ్యాకులైన ముస్లిం, సిక్కు ప్రతినిధుల సంక్షేమం కోసం బోస్ శ్రద్ధ వహించారు. అంతే కాదు, బోస్ తన కొత్త సైన్యాన్ని మతం, కులం లేదా ప్రాంతం ఆధారంగా రెజిమెంట్లుగా విభజించాలని అనుకోలేదు. తన దళంలో మైనారిటీల మనోభావాలు దెబ్బతినకుండా జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను బోస్ జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారు. ముస్లింలు నిరసించిన ‘వందేమాతరం’కు బదులుగా రవీంద్రనాథ్ టాగూర్ ‘జనగణమన’ను ఎంచుకున్నారు. మైసూర్‌కు చెందిన బ్రిటిష్ వ్యతిరేక యోధుడు టిప్పు సుల్తాన్ స్ఫూర్తిని సైన్యంలో ప్రేరేపించ డానికి ఆజాద్ దళ త్రివర్ణ పతాకం మధ్యలో దుముకుతున్న పులిని చేర్చారు’’ అని చరిత్రకారుడు సుగతా బోస్ తెలి పారు. తర్వాత పులి గుర్తుకు బదులుగా గాంధీజీ ‘చరఖా’ వచ్చింది. ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని సైనికుల వేర్వేరు భాషల వల్ల కూడా సైనిక దళ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందని బోస్ బలంగా నమ్మారు. ఆ పరిస్థితిని నివారించేందుకు రోమన్ లిపిలో రాసిన హిందుస్థానీ భాషను దళాల ఉమ్మడి మాధ్యమంగా బోస్ స్వీకరించారని ఫౌజ్‌కు 1941–45 మధ్య హిందీ–జర్మన్ అనుసంధాన వ్యాఖ్యాతగా పనిచేసిన ఆక్స్ఫర్డ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ విజిటింగ్ లెక్చరర్ రుడాల్ఫ్ హార్టోగ్ తెలిపారు. హిందువులు, ముస్లిములు మాట్లాడే భాషలను హిందూస్థానీగా సమ్మిళితం చేయడం ద్వారా తన సైనిక దళంలో బోస్ భారతదేశంలోని రెండు ప్రముఖ సంస్కృతుల మధ్య సమైక్యతను సాధించారని హార్టోగ్ రాశారు. 1939 తర్వాత కాంగ్రెస్‌లోని మితవాద నాయకులతో విభేదించిన కారణంగా గాంధీజీకి బోస్ దూరమైనప్పటికీ, అది ఆయన పట్ల బోస్‌కు ఉన్న గౌరవాన్ని ఏమాత్రం తగ్గించలేదు. 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చిన ప్పుడు బోస్ ‘ఆజాద్ హింద్ రేడియో’ ద్వారా గాంధీజీ ఆదేశాలను విధిగా పాటించాలని భారతీయులందరికీ స్పష్టమైన పిలుపు నిచ్చారు. (క్లిక్ చేయండి: ప్రత్యామ్నాయ భావజాల దార్శనికుడు) 1944 జూలై 6న బోస్ తన ఆజాద్ హింద్ ఫౌజ్‌కు గాంధీజీ ఆశీర్వాదం కోసం సింగపూర్ నుండి ప్రత్యేక రేడియో ప్రసంగం చేశారు. ‘‘జాతిపితా, భారతదేశ విముక్తి కోసం ఈ పవిత్ర యుద్ధంలో మేము మీ ఆశీర్వాదాలను, శుభాకాంక్షలు కోరుతున్నాము’’ అని బోస్ తన ప్రసంగంలో అన్నారు. 2012లో భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, గాంధీజీని ఎవరైనా ‘జాతిపిత’ అని సంబోధించిన తొలి సందర్భం అది! ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి నేతాజీ ప్రాధాన్యాలను అనుసరించాలనుకుంటే, దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలి. లేదంటే, మత సామరస్యం అన్నది ఒక నినాదంలా మాత్రమే మిగిలిపోతుంది. (క్లిక్ చేయండి: అంబేడ్కర్ పేరు ఎందుకు పెట్టాలంటే...) - వప్పల బాలచంద్రన్ కేబినెట్ సెక్రటేరియట్ మాజీ ప్రత్యేక కార్యదర్శి (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నేతాజీ ‘అస్థికల’కు డీఎన్ఏ టెస్ట్ డిమాండ్!
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సంగ్రామ యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలుగా భావిస్తున్న వాటిని భారత్‌కు రప్పించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆయన ఒక్కగానొక్క కుమార్తె అనితా బోస్ పాఫ్ ఈ మేరకు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ నేతాజీ కుమార్తె స్పందించడం గమనార్హం. 1945 ఆగస్ట్ 18న తైవాన్ వద్ద జరిగిన విమానప్రమాదంలో నేతాజీ తుది శ్వాస విడిచారని, ఆయన అస్థికలు జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని ప్రతీతి. ‘‘అస్థికలను భారత్ తేవాల్సిన సమయమొచ్చింది. అవి మా నాన్నవే అని చెప్పేందుకు నేటి డీఎన్ఏ టెస్టింగ్ విధానం సాయపడనుంది. ఇందుకు జపాన్ ప్రభుత్వం, రెంకోజీ ఆలయ ప్రధాన పూజారి గతంలోనే అంగీకరించారు. దేశ స్వేచ్ఛ కంటే నేతాజీకి ఆయన జీవితంలో మరేదీ ముఖ్యంకాదు. భారతజాతి స్వేచ్ఛావాయువులు పీల్చాలని నేతాజీ కలలుగన్నారు. ఆ కల నేడు నెరవేరింది. కానీ.. ఆయనిప్పుడు లేరు. కనీసం ఆయన అస్థికలనైనా భరతమాత(స్వదేశం) చెంతకు చేరుద్దాం’ అని అనిత బోస్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. నేతాజీ అవశేషాలకు డీఎన్ఏ టెస్ట్ నిర్వహించాలని ఆయన కుటుంబం చాలా ఏళ్ల నుంచి విజ్ఞప్తి చేస్తోంది. విషయంలో జపాన్, రెంకోజీ ఆలయాలు సిద్ధంగా ఉన్నా.. భారత ప్రభుత్వం నుంచి స్పందన కొరవడిందని జపాన్ విదేశాంగ శాఖ గతంలో ప్రకటించింది. ఇదీ చదవండి: 38 ఏళ్ల తర్వాత మంచు దిబ్బల నడుమ లాన్స్ నాయక్ చంద్రశేఖర్ -
జైహింద్ స్పెషల్: ది గ్రేట్ ఎస్కేప్
జర్మనీ నుంచి బోస్ జపాన్ బయల్దేరాడు. జర్మనీ సబ్‌మెరైన్ యు–180 లో ప్రయాణించి మధ్యలో జపాన్ సబ్‌మెరైన్ ఐ–29లోకి మారి వెళ్లాడు. ఆర్మీకి గానీ, పోలీసు విభాగానికి గానీ చెందని ఒక సాధారణ పౌరుడు రెండు దేశాల సబ్మెరైన్లలో మారి ప్రయాణించడం అదే మొదటిసారి! బోస్ మేనేజ్ చేశాడు. జపాన్‌లో దిగాక, బోస్ అక్కడి నుంచి సింగపూర్ వెళ్లాడు. జర్మనీలో ఎలాగైతే భారతీయులతో సైన్యాన్ని కూడగట్టుకున్నాడో అక్కడా అలాగే ఒక లీజన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అదే.. ఇండియన్ నేషనల్ ఆర్మీ. అదే అజాద్ హింద్ ఫౌజ్ బోస్ తప్పించు కున్నాడు! ‘‘బ్రిటన్ తరఫున జర్మనీపై ఇండియా యుద్ధం చేస్తుందని ప్రకటించడానికి మీరెవరు?’’ అని వైశ్రాయ్ని నిలదీసినందుకు జైలుపాలై.. వారం రోజులు అన్నం నీళ్లూ ముట్టకుండా జైల్లోనే హంగర్ స్ట్రైక్ చేసి విడుదలైనవాడు.. దేశం నుంచే తప్పించుకున్నాడు! బోస్ దేశం దాటకుండా బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తాలో అతడు ఉంటున్న ఇంట్లోనే అతడిని బంధించి, చుట్టూ నిఘా పెట్టినప్పటికీ అతడు తప్పించుకున్నాడు.! ‘జర్మనీతో ‘టై–అప్’ అయితే బ్రిటన్‌ని ఇంటికి పంపడం తేలిక. ఓం శాంతి అంటే లాభం లేదు. మిలట్రీ ట్రక్కుల నుంచి ఇండియాలోకి జర్మన్ సైన్యాన్ని దింపాలి..’ అనే ప్లాన్‌తో తప్పించుకున్నాడు! ఎలా తప్పించుకున్నాడు?! పోలికలు తెలియకుండా పఠాన్‌లా వేషం వేసుకున్నాడు. గుండ్రటి ముఖం కనిపించకుండా గడ్డం పెంచాడు. భాష విని గుర్తుపట్టకుండా మూగ, చెవిటి అయ్యాడు. ముందు పెషావర్ వెళ్లాడు. అక్కడి నుంచి కాబూల్. అక్కడి నుంచి రష్యా. అక్కడ బుక్కయ్యాడు! రష్యాకు, బ్రిటన్‌కు పడదు కాబట్టి తనను చేరదీస్తారు అనుకున్నాడు కానీ, రష్యన్ అధికారులు అనుమానిస్తారని అనుకోలేదు. వాళ్లతడిని మాస్కో తరలించారు. అక్కడ కొద్దిగా నయం. రెండు మూడు ఆరాలు తీసి బోస్‌ని మాస్కోలోని జర్మనీ రాయబారి షూలెన్బర్గ్ దగ్గరికి పంపారు. షూలెన్బర్గ్కి బోస్ మీద నమ్మకం కుదిరింది. అతడిని ఇటలీ మీదుగా జర్మనీ పంపే ఏర్పాటు చేశారు! బ్రిటన్‌కు మండిపోయింది. తప్పించుకున్న వాడు తప్పించుకున్నట్లు ఉండకుండా దేశాలన్నీ తిరగడం ఏమిటి? కనిపిస్తే కాల్చిపారెయ్యమని సీక్రెట్ ఏజెంట్లని పంపింది. జర్మనీలో అడుగు పెట్టకముందే అతడిని చంపేయాలి. అదీ టార్గెట్. కానీ బోసే మొదట తన టార్గెట్‌ని రీచ్ అయ్యాడు. జర్మనీలో అతడు క్షణం ఖాళీగా లేడు. హిట్లర్ని కలిశాడు. బ్రిటన్ గురించి, ఇండియా గురించి చెప్పాడు. బెర్లిన్‌లో ఒక రేడియో స్టేషన్ స్టార్ట్ చేశాడు. దాన్నుంచి స్వతంత్ర భారత్ నినాదాలు ప్రసారం చేశాడు. జర్మనీకి బందీలుగా ఉన్న ఐదువేల మంది భారతీయ సైనికులతో కలిసి ‘ఇండియన్ లీజన్’ ఏర్పాటు చేసుకున్నాడు. ఉత్తర ఆఫ్రికాలోని బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి, యుద్ధంలో జర్మనీకి చిక్కిన సైనికులు వీళ్లు! హిట్లర్ హ్యాండిచ్చాడు! ‘లీజన్’ అంటే సైనిక సమూహం. ఇండియన్ లీజన్, జర్మనీ సైన్యం కలిసి ఇండియా వెళ్లి కాళ్లతో నేలను రెండు చరుపులు చరిస్తే చాలు... బ్రిటన్ ఎగిరిపడాలని బోస్ వ్యూహం. 1941 నుంచి 1943 వరకు ఇదే వ్యూహం మీద జర్మనీలోనే ఉండిపోయారు బోస్. అక్కడే ఎమిలీ షెంకెల్ని పెళ్లి చేసుకున్నారు. అక్కడే వారికి అనిత పుట్టింది. అక్కడే జర్మనీపై అతడి భ్రమలు తొలగిపోయాయి! హిట్లర్ హ్యాండిచ్చాడు! బోస్ అక్కడి నుంచి జపాన్ బయల్దేరాడు. మొదట జర్మనీ సబ్‌మెరైన్ యు–180 లో ప్రయాణించి మధ్యలో జపాన్ సబ్‌మెరైన్ ఐ–29లోకి మారి వెళ్లాడు. ఆర్మీకి గానీ, పోలీసు విభాగానికి గానీ చెందని ఒక సాధారణ పౌరుడు రెండు దేశాల సబ్మెరైన్లలో మారి ప్రయాణించడం అదే మొదటిసారి! బోస్ మేనేజ్ చేశాడు. జపాన్‌లో దిగాక, బోస్ అక్కడి నుంచి సింగపూర్ వెళ్లాడు.జర్మనీలో ఎలాగైతే భారతీయులతో సైన్యాన్ని కూడగట్టుకున్నాడో అక్కడా అలాగే ఒక లీజన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అదే... ఇండియన్ నేషనల్ ఆర్మీ. అదే అజాద్ హింద్ ఫౌజ్. ‘‘మీ రక్తాన్ని ధారపొయ్యండి. మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’’ అన్నాడు బోస్. అంతేనా! ఢిల్లీ చలో అన్నాడు. జైహింద్ అన్నాడు. సొంత సైన్యం, సొంత కరెన్సీ, సొంత పోస్టల్ స్టాంప్స్, సొంత న్యాయం, సొంత నియమం. అన్నీ సొంతం! బ్రిటన్‌ని వ్యతిరేకించే దేశాలన్నీ వీటన్నిటినీ ఆమోదించాయి. ఆఖరికి రష్యా, అమెరికా కూడా! అంటే పారలల్ మిలట్రీ. పారలల్ గవర్నమెంట్. బోస్ సమాంతర ప్రభుత్వాన్ని, సమాంతర సైన్యాన్ని నడుపుతున్నాడు. సింగపూర్‌లో ఏర్పాటు చేసుకున్న అజాద్ హింద్ రేడియోలోంచి 1944 జూలై 6న మాట్లాడుతూ మొదటిసారిగా బోస్ గాంధీజీ పేరెత్తారు! ‘‘జాతిపితా... నన్ను దీవించండి. ఈ పోరాటంలో నేను గెలవాలని నన్ను దీవించండి’’ అని కోరారు. మరణం రాసిపెట్టలేదు! తర్వాత ఏమయింది? మూడేళ్ల తర్వాత భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. బోస్ ఏమయ్యారు? ఇన్నేళ్ల తర్వాత ఇప్పటికీ తెలీదు! సింగపూర్ నుంచి టోక్యో వెళ్లడానికి నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఎక్కిన జపాన్ యుద్ధ విమానం 1945 ఆగస్టు 18న నేలకూలి అందులో ఉన్న వారితో పాటు ఆయనా మరణించారని ఒక ‘అధికారిక’ కథనం! కాదు, ఆ ప్రమాదంలో ఆయన తప్పించుకున్నారని, అక్కడి నుంచి ఇండియా వచ్చి అజ్ఞాతంగా సాధువురూపంలో గడిపారని; కాదు కాదు ఏ శత్రుదేశమో నేతాజీని బందీగా ఉంచుకుందనీ, అలాంటిదేం లేదు... రష్యాలో ఆయన తలదాచుకున్నారనీ... ఇలా ఏవేవో అనధికారిక కథనాలు. ఒకటి మాత్రం వాస్తవం. నేతాజీ... అమరుడు! ఆయనకు జననమే కానీ, మరణం లేదు. కావాలంటే ఏ హిస్టరీ బుక్ అయినా తెరిచి చూడండి. జననం ఒక్కటే కనిపిస్తుంది. చదవండి: వైద్య ప్రతిభామూర్తి : యల్లాప్రగడ సుబ్బారావు / 1895–1948 -
జైహింద్ స్పెషల్.. నిప్పుకణం నేతాజీ
యుద్ధంలో రేగిన దుమ్ము కుదురుకోక ముందే బ్రిటన్ చేతుల్లోంచి ఫ్రీడమ్‌ని లాగేసుకునేందుకు బోస్ కాచుక్కూర్చున్నారు. బ్రిటన్ సతమతం అవుతున్నప్పుడే దానిని చావుదెబ్బ తియ్యాలని బోస్ ఆలోచన. గారిబాల్డీ, మేజినీ అతడిని లోలోపల రాజేస్తున్నారు. 1939. భారత జాతీయ కాంగ్రెస్ పైకి కలిసే ఉంది కానీ, లోపల రెండుగా విడిపోయింది. గాంధీజీ–నేతాజీ వర్గాలవి! పార్టీ అధ్య ఎన్నికల్లో.. ‘‘బోస్.. ఈసారి నువ్వు పోటీ చేయకు’’ అన్నారు గాంధీజీ. కానీ నేతాజీ విన్లేదు! మీ మాట మీద నాకు ఎంత గౌరవం ఉందో, నా సిద్ధాంతం మీద నాకు అంతే గౌరవం ఉంది అన్నాడు. ముత్తురామలింగం దేవర్ ముందుకొచ్చి బోస్ వైపు నిలబడ్డారు. సౌత్ ఇండియా ఓట్లన్నీ బోస్కి పడ్డాయి. నేతాజీ గెలిచారు. వరుసగా రెండోసారి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. విజేత నిష్క్రమణ! ప్రజలు సాయుధ పోరాటాన్ని కోరుకుంటున్నారా? గాంధీజీని వద్దనుకుంటున్నారా? లేదు. గాంధీజీ చేతిలో తుపాకీని చూడాలనుకుంటున్నారు! సర్వసభ్య సమావేశంలో కల్లోలం మొదలైంది. ఎవరు అంత మాట అన్నది?! మహాత్ముడిని మామూలు మనిషిగా చూడాలనుకుంటున్నారా? ఆ మాట అన్నదెవరో ముందుకు రండి. ‘‘ఇంకెవరు? బోస్ ముఠా!’’– శాంతి ప్రియుల సహనం చచ్చిపోతోంది. పళ్లు పటపటలాడిస్తున్నారు. ‘‘పార్టీ నుంచి వెళ్లగొట్టండి పొగురుబోతుల్ని’’ – పెద్దగా అరుపులు. ‘‘అవునవును. వెళ్లగొట్టాలి’’ బోస్‌ని పిలిపించారు గాంధీజీ. ‘‘వింటున్నావా?’’ అన్నారు. పార్టీ నుంచి బయటికి వచ్చేశారు నేతాజీ! వచ్చి, ‘ఫార్వర్డ్ బ్లాక్’ పార్టీ పెట్టారు. దేవర్ కూడా ఆయనతో పాటు వచ్చేశారు. మొదటి బహిరంగ సభ మధురైలో. వీధులు చాల్లేదు. ఆకాశం కావలసి వచ్చింది. జనం మేడలు మిద్దెలు ఎక్కి కూర్చున్నారు. ‘‘ఎవరు వచ్చింది గాంధీజీనా?’’ వృద్ధ మూర్తులెవరో అడుగుతున్నారు. ‘‘కాదు, నేతాజీ సుభాస్ చంద్రబోస్.’’ ఇంగ్లండ్‌కు పయనం రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. యుద్ధం ముగిశాక బ్రిటన్ మనకు ఫ్రీడమ్ ఇచ్చేస్తుందని గాంధీ, నెహ్రూ, కాంగ్రెస్‌లోని పెద్దలు నిరీక్షిస్తూ ఉన్నారు. యుద్ధంలో రేగిన దుమ్ము కుదురుకోక ముందే బ్రిటన్ చేతుల్లోంచి ఫ్రీడమ్‌ని లాగేసుకునేందుకు బోస్ కాచుక్కూర్చున్నారు. బ్రిటన్ సతమతం అవుతున్నప్పుడే దానిని చావుదెబ్బ తియ్యాలని బోస్ ఆలోచన. గారిబాల్డీ, మేజినీ అతడిని లోలోపల రాజేస్తున్నారు. కటక్ స్టివార్డ్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మొదటిసారిగా గ్యారీ, మేజినీల గురించి విన్నాడు బోస్. అక్కడే రేవన్షా కాలేజియేట్ స్కూల్లో వాళ్ల గురించి చదివాడు. ఇద్దరూ ఇటాలియన్ లీడర్స్. కొత్త ఆలోచనలతో దేశానికి కొత్త రక్తం ఎక్కించినవారు. ఒకరు నేషనల్ హీరో. ఇంకొకరు సోల్ ఆఫ్ ఇటలీ! వాళ్లు అవహించారు బోస్‌ని. బ్రిటన్‌ని తరిమికొట్టాక ఇండియాని కొన్నాళ్లయినా ఇటలీలా, టర్కీలా సోషలిస్టు నియంతృత్వంలోకి నడిపించాలని అతడి కల. బ్రిటన్ డిసిప్లీన్ కూడా బోస్కి నచ్చుతుంది! కానీ ఆ జులుం! దాన్నే భరించలేకపోతున్నాడు. బ్రిటన్ లేబర్ పార్టీలో థింకర్స్ కొందరు ఉన్నారు. లార్డ్ హాలిఫాక్స్, జార్జి లాన్స్బరీ, క్లెమెంట్ అట్లీ, గిల్బర్ట్ ముర్రే, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్... వీళ్లందరితోనూ ఇంగ్లండ్ వెళ్లి తన ఆలోచనల్ని పంచుకున్నాడు బోస్. కన్సర్వేటివ్ పార్టీ నాయకులు మాత్రం బోస్‌ని దగ్గరకు రానివ్వలేదు. బ్రిటన్ అప్పుడు ఉన్నది కన్సర్వేటివ్‌ల చేతుల్లోనే. వలస దేశీయుడితో మాటలేమిటని వాళ్లంతా మొహం చాటేశాడు. బోస్ ఇండియా వచ్చేశాడు. తిరిగి ఇండియాకు వచ్చీరాగానే వార్త! బ్రిటన్ తరఫున ఇండియా కూడా ప్రపంచ యుద్ధంలోకి వచ్చేస్తోందని వైశ్రాయ్ లిన్లిత్గో ప్రకటించాడని!! ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో ఒక్కమాటైనా చెప్పకుండా తీసుకున్న ప్రకటన అది. బోస్ తిరగబడ్డాడు! మనది కాని యుద్ధాన్ని మనం చేయడం ఏమిటని గాంధీజీతో అన్నారు. కాంగ్రెస్ అయోమయంలో ఉంది. ‘‘నాకైతే క్లారిటీ ఉంది’’ అన్నాడు బోస్. మొత్తం కలకత్తాని వెనకేసుకుని వీధివీధీ తిరిగాడు. గో బ్యాక్ అని గర్జించాడు. జైల్లో పడ్డాడు. వారం రోజులు అన్నం నీళ్లూ ముట్టకుండా జైల్లో హంగర్ స్ట్రైక్ చేసి విడుదలయ్యాడు. బోస్ దేశం దాటకుండా బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తాలో అతడు ఉంటున్న ఇంట్లోనే అతడిని బంధించింది. చుట్టూ నిఘా పెట్టింది. బోస్ దేశం దాటితే ఏమౌతుంది? దాటకుండానే ఏడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. దాటితే ఏడు ఖండాల శత్రువుల్ని పోగేస్తాడు. రష్యా, జర్మనీ, జపాన్, ఇటలీ, క్రొయేషియా, థాయ్‌లాండ్, బర్మా, ఫిలిఫ్పీన్స్... ఇవన్నీ బ్రిటన్‌కి వ్యతిరేకం. అన్నిటినీ కలుపుకుని భ్రిటన్ని ఒక ఆట ఆడుకుంటాడు. బోస్ ప్లాన్లు వేస్తున్నాడు. అతడికి ఒక విషయం స్పష్టమయింది. యుద్ధం పూర్తయ్యేవరకు తనను వదిలిపెట్టరు. యుద్ధం పూర్తయితే దేశాన్ని వదిలిపెట్టరు. ఈలోపే పొగపెట్టాలి. జర్మనీతో ‘టై–అప్’ అయితే బ్రిటన్‌ని ఇంటికి పంపడం తేలిక. ఓం శాంతి అంటే లాభం లేదు. మిలట్రీ ట్రక్కుల నుంచి ఇండియాలోకి జర్మన్ సైన్యాన్ని దింపాలి. బోస్ జంప్! ది గ్రేట్ ఎస్కేప్! -
జైహింద్ స్పెషల్: యుద్ధతంత్రం.. శాంతిమంత్రం
పాఠం మొదలైంది. అది ఫస్టియర్ బి.ఎ. హిస్టరీ క్లాస్. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజ్. ప్రొఫెసర్ ఇ.ఎఫ్.ఆటెన్ క్లాస్ మొదలు పెట్టారు. అంతకుముందే అతడు స్టాఫ్ రూమ్‌లో కూర్చొని ఉన్నప్పుడు.. ఇండియన్ స్టూడెంట్స్‌కి బుద్ధీజ్ఞానం లేవన్నాడు! చిన్న ఈక్వేషన్ తెలుసుకోలేకపోతే ఎలా అన్నాడు.. క్లాస్‌లోకి వచ్చి, కొనసాగింపుగా. హిస్టరీ ప్రొఫెసర్‌కు సమీకరణాలతో ఏం పని? అయితే ఆయన మాట్లాడుతున్నది కూడా చరిత్ర సమీకరణాల గురించే! చదవండి: ఆగస్టు 15న ఓలా మరో సంచలనం: బీ రడీ అంటున్న సీఈవో ఒకే ఆత్మ.. ఒకే ఆగ్రహం ‘‘చూడండి, అధికులదే ఎప్పుడూ అధికారం. ఇండియన్స్ కన్నా బ్రిటిషర్లు మోరల్లీ సుపీరియర్స్. ఇది రియాలిటీ. దీన్ని యాక్సెప్ట్ చెయ్యకుండా ఎన్నాళ్లని నినాదాలిస్తారు?’’ ఆశ్చర్యంగా అడిగారు ఆటెన్. తోటి ప్రొఫెసర్లు మౌనంగా ఉండిపోయారు. ఇక్కడ... క్లాస్‌రూమ్‌లో స్టూడెంట్స్ ఉడికిపోయారు. ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఎవరైనా గౌరవ మర్యాదలు పాటిస్తున్నారూ అంటే వారు ఇంకోచోట ఎక్కడో తేల్చుకోవాలనుకున్నారని అర్థం. అయితే స్టూడెంట్స్‌లో అంత కుట్ర ఉండదు. స్టూడెంట్స్‌కి అంత నిగ్రహం ఉండదు. స్టూడెంట్స్‌కి విడివిడి ఆత్మలు ఉండవు. ఒకే దేశంలా అందరిదీ ఒకే ఆత్మ. ఒకరికి దెబ్బతగిలితే ఇంకొకరి చర్మం కములుతుంది. ఒకరికి మనసుకు గాయం అయితే ఇంకొకరి పిడికిలి బిగుసుకుంటుంది. ప్రొఫెసర్ ఆటెన్... ఒకరి మనసునే గాయపరచలేదు. ముందున్న కుర్రాడు నూరేళ్ల ప్రెసిడెన్సీ కాలేజీలో ఇలాంటిది జరగలేదు! భారతదేశ చరిత్రలోనే ఇలాంటిది జరగలేదు! ఏమైంది? ఏమైందీ?! ప్రొఫెసర్ ఆటెన్పై చెయ్యి చేసుకుంటున్నారు. ఎవరు చేసుకుంటున్నారు?.. బి.ఎ. ఫస్టియర్ స్టూడెంట్స్. ఎందుకు అని వైస్ ఛాన్స్లర్ అడగలేదు. ‘‘ఎవరు?’’ అని అడిగాడు. ఎవరో ఎవరినో చూపించారు. ‘‘నేనడుగుతున్నది... చెయ్యి చేసుకున్నవారి వెనుక ఉన్నది ఎవరూ అని?’’ అన్నాడు. ఎవరూ చెప్పలేదు. చెప్పకుండానే తెలుసుకున్నాడు ఛాన్స్లర్. సు–భా–స్... చంద్రబోస్!! కానీ, బోస్... వెనుక లేడు. అందరికన్నా ముందు ఉన్నాడు. ఆటెన్‌ని అందరికన్నా ముందు కొట్టింది కూడా అతడేనేమో తెలీదు. ఆటెన్‌కు ‘బ్రిటిష్ ఇండియా’ క్షమాపణ చెప్పింది. కాలేజ్ రిజిష్టర్‌లో బోస్ పేరు ‘తొలగించడమైనది’. గమ్యం ఒకటే.. దారులే వేరు! హీరో అయ్యాడు బోస్. ‘‘వయసు?’’ ‘‘ఇరవై.’’ ‘‘కాలేజ్ నుంచి ఎందుకు పంపించారు?’’ ‘‘ప్రొఫెసర్ ఆటెన్ ఇండియన్స్‌ని తిట్టాడు. ప్రొఫెసర్ ఆటెన్‌ని మేము...’’ ‘‘అర్ధమైంది! యు ఆర్ ఆడ్మిటెడ్’’ ‘‘.......’’ ‘‘కానీ బోస్... గుర్తుంచుకో. ఆటెన్‌ని నువ్వేదో చేసినందుకు కాదు, నీ ఫ్యూచర్ పాడవకూడదని.’’ బోస్ ‘స్కాటిష్ చర్చెస్ కాలే జ్’ లో ఏకంగా బి.ఎ. థర్డ్ ఇయర్లో చేరాడు. ఫస్ట్ క్లాస్‌లో పాసై íఫిలాసఫీ పట్టాతో బయటికి వచ్చాడు. కానీ అతడికి గాంధీజీ ఫిలాసఫీ ఏమిటో అంతుబట్టడం లేదు! అహింస అంటున్నారు గాంధీజీ. దూకుడు మీదుండే ఇరవై రెండేళ్ల కుర్రాడికి.. రెణ్ణాళ్లకే సివిల్ సర్వీసు ఉద్యోగాన్ని కాలితో తన్నొచ్చిన జాతీయవాదికి.. బెంగాల్ అతివాద బెబ్బులి చిత్తరంజన్‌దాస్ దగ్గర పంజాకు పదును పెట్టుకున్న చిరుతకు.. యుద్ధ తంత్రాన్ని రచించకుండా శాంతిమంత్రాన్ని జపిస్తే రుచిస్తుందా?! ముళ్లదారిలో నడుస్తూ గులాబీ గుత్తుల సందేశాలను మోసుకెళ్లడం ఏమిటి? గాంధీజీ సిద్ధాంతం బోస్కి నచ్చలేదు. బోస్ దూకుడుని గాంధీజీ మెచ్చలేదు. ఇద్దరిదీ ఒకే గమ్యం. దారులు వేరు! శత్రువుకు కోసం గాంధీజీ చెంపను చూపిస్తే, నేతాజీ చూపుడు వేలిని చూపిస్తున్నాడు. అరె! కుర్ర బోస్... హఠాత్తుగా నేతాజీ ఎప్పుడయ్యాడు?! ‘కాంగ్రెస్’కు పోటీ! బోస్ హఠాత్తుగా ‘నేతాజీ’ అవలేదు. ముందు ఆలిండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంటు అయ్యాడు. ‘ఫార్వర్డ్’ న్యూస్‌పేపర్‌కి ఎడిటర్ అయ్యాడు. కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ సి.ఇ.వో. అయ్యాడు. చుట్టుముట్టిన పోలీసులకు చిక్కి అరెస్ట్ అయ్యాడు. మాండలే జైలులో ఖైదీ అయ్యాడు. రెండేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలై మళ్లీ హీరో అయ్యాడు. కాంగ్రెస్‌పార్టీ జనరల్ సెక్రెటరీ అయ్యాడు. కలకత్తా మేయర్ అయ్యాడు. నెహ్రూకి దగ్గరయ్యాడు. సహాయ నిరాకరణ చేసి మళ్లీ అరెస్టయ్యాడు. ఐరోపా వెళ్లాడు. అక్కడి భారతీయ విద్యార్థుల్ని, ఐరోపా రాజకీయ నాయకులని, ముస్సోలినీని కలిశాడు. కమ్యూనిజాన్ని, ఫాసిజాన్ని స్టడీ చేశాడు. తిరిగొచ్చాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేశాడు. గాంధీజీకి నచ్చలేదు. స్వరాజ్యం కోసం తుపాకీ పట్టాల్సిందేనని అన్నవాడెవడూ ఆయనకు సహజంగానే నచ్చరు. పైగా ఇప్పుడు బోస్... ది గ్రేట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి పోటీ పడేందుకు వచ్చాడు. అసలే నచ్చడు. గాంధీజీ ఒప్పుకోలేదు! పార్టీలో గాంధీజీకి ఎంతమంది ఉన్నారో, బోస్కి అంతమంది ఉన్నారు. ఎటువైపు ఎంతమంది ఉన్నా, అందరం కలిసే ఉందాం అన్నాడు బోస్. కలిసి ఉండి దేశాన్ని ఏం చేద్దామని? గాంధీజీకి అర్థంకావడం లేదు. బోస్ గెలిచాడు. మళ్లీ ఏడాది కూడా నిలబడ్డాడు. ‘‘నో’’ అన్నారు గాం«ధీజీ! ఆయనకు తెలుసు. చేత్తో తుపాకీ పట్టుకుని ఆవేశంగా తిరగేవాడు ఎప్పుడో కొంప ముంచేస్తాడు. ఇంత శ్రమా వృథా అవుతుంది. ఇంత శాంతీ బూడిదవుతుంది. ‘‘అవును నిజమే’’ అన్నారు నెహ్రూ. పెద్దాయనకు ఇంకో పెద్దాయన సపోర్ట్. ఎవరూ మాట్లాడలేదు. గాంధీజీ తన క్యాండిడేట్‌గా పఠాభి సీతారామయ్యను నిలబెట్టారు. ‘‘బోస్... నువ్వు పోటీ చేయకు’’ అనే సంకేతం కూడా పంపారు. -
మహోజ్వల భారతి అధికారమంతా భారతీయులకే
భారత జాతీయ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన సుభాస్ చంద్రబోస్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించిన రోజు ఇది (జూన్ 22). ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ. 1939 లో సుభాష్ చంద్రబోసు నేతృత్వంలో ఈ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజకీయ పార్టీగా తిరిగి దానిని స్థాపించారు. పార్టీకి నేడు ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో బలమైన ఉనికి ఉంది. పార్టీ ప్రస్తుత సెక్రటరీ జనరల్ దేబబ్రత బిశ్వాస్. స్వాతంత్య్రినంతర కాలంలో, శరత్ చంద్రబోసు (సుభాష్ చంద్రబోసు సోదరుడు), చిత్త బసులు పార్టీ నాయకులుగా ప్రఖ్యాతి గాంచారు. గాంధీజీతో విభేదాలు వచ్చిన సుభాస్ చంద్రబోస్ 1939 ఏప్రిల్ 29న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం కలకత్తాలో నిర్వహించిన ర్యాలీలో ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటును బహిరంగంగా ప్రకటించారు. పార్టీలో చేరాక ఎవరూ కూడా ఎన్నటికీ బ్రిటిషు వారి వైపు తిరగాల్సిన అవసరం ఉండదని, వారి రక్తంతో సంతకం చేసి, ప్రతిజ్ఞ ఫారమ్‌ను పూర్తి చెయ్యాలని బోసు ఆ సందర్భంగా ఆదేశించారు. ముందుగా పదిహేడు మంది యువతులు వచ్చి ప్రతిజ్ఞా పత్రంలో సంతకం చేశారు. ప్రారంభంలో ఫార్వర్డ్ బ్లాక్ లక్ష్యం కాంగ్రెస్‌లోని అన్ని వామపక్ష విభాగాలను సమీకరించడం, కాంగ్రెస్ లోపల ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం. బోసు ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడయ్యారు. జూన్ చివరిలో బొంబాయిలో ఫార్వర్డ్ బ్లాక్ ప్రాథమిక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ రాజ్యాంగాన్ని, కార్యక్రమాన్నీ ఆమోదిం చారు. జూలైలో సుభాష్ చంద్రబోసు ఫార్వర్డ్ బ్లాక్ కమిటీని ప్రకటించారు. కమిటీ అధ్యక్షులుగా సుభాష్ చంద్రబోసు, ఉపాధ్యక్షులుగా పంజాబ్‌కు చెందిన ఎస్ఎస్ కవిషర్, ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీకి చెందిన లాల్ శంకర్ లాల్, కార్యదర్శులు గా బొంబాయికి చెందిన విశ్వంభర్ దయాళు త్రిపాఠి, ఖుర్షీద్ నారిమన్‌లు ఎంపికయ్యారు. ఇతర ప్రముఖ సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మద్దూరి అన్నపూర్ణయ్య, బొంబాయికి చెందిన సేనాపతి బాపట్, హరి విష్ణు కమ్నాథ్, తమిళనాడుకు చెందిన పసుంపన్ యు.ముత్తురామలింగం తేవర్, బీహార్ నుండి షీల్ భద్ర యాగీ ఉన్నారు. పార్టీ బెంగాల్ ప్రావిన్సు కార్యదర్శిగా సత్య రంజన్ బక్షి నియమితుడయ్యాడు. బోసు తన కొత్త రాజకీయ పార్టీకి మద్దతు కూడగడుతూ దేశవ్యాప్తంగా పర్యటించారు. మరుసటి సంవత్సరం 1940 జూన్ 20–22 న ఫార్వర్డ్ బ్లాక్ తన మొదటి అఖిల భారత సమావేశాన్ని నాగపూర్‌లో నిర్వహించింది. ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్‌ను సామ్యవాద రాజకీయ పార్టీగా ప్రకటించారు. జూన్ 22 ను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వ్యవస్థాపక తేదీగా తీసుకున్నారు. బ్రిటిషు వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం కోసం మిలిటెంట్ చర్యను కోరుతూ ‘అధికారమంతా భారతీయులకే’ అనే తీర్మానాన్ని ఈ సమావేశం ఆమోదించింది. (చదవండి: అడవి నుంచి రేడియో బాణాలు) -
వాట్సాప్‌లో ఆయన మార్ఫింగ్ ఫొటో వైరల్
Subhas Chandra Bose Morphing Photo Viral: స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడైన సుభాష్ చంద్రబోస్ మరణం.. నేటికి ఓ వీడని మిస్టరీనే. 1945, ఏప్రిల్ 23న జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని ప్రకటనలు వెలువడినప్పటికీ.. అవశేషాలు దొరకకపోవడంతో ఆయన మరణం అధికారికంగా ధృవీకరణ కాలేదు. అయితే ఆ క్రాష్‌లో ఆయన చనిపోలేదని చాలాకాలం జీవించే ఉన్నారని చెబుతూ రకరకాల కథనాల్ని ప్రచారం చేస్తుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ ఫొటో, దాని మీద సందేశం.. ఆయన అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. Original picture with some reimagination by @BiplabC2.#Netaji #DeathThatWasnt #TheBoseMystery #Gumnaami @prosenjitbumba @srijitspeaketh @chandrachurg @PanickarS @koushikzworld @SayakSen6 @Sayani_Pandit pic.twitter.com/ep8T70g6Uj — Anuj Dhar (@anujdhar) August 18, 2019 విమాన ప్రమాదంలో బోస్ చనిపోయారనే వార్త కాంగ్రెస్ ఆడిన అబద్ధమని, తన మరణం మీద వచ్చిన వార్తను ఓ పత్రికలో బోస్ చదివారంటూ సదరు ఫొటో వైరల్ అవుతోంది. అయితే 2019లో ఇదే ఫొటో ఓ బంగ్లా వ్యక్తి ఫేస్బుక్ అకౌంట్లో వైరల్ అయ్యింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఆ ఫొటోపై అసలు విషయం తేలింది. ఆ సమయంలో జపాన్‌లో ప్రధాన పత్రికగా ఉన్న ఇంగ్లిష్ పత్రిక నిప్పన్ టైమ్స్‌ను బోస్ చదువుతుండగా తీసిన ఫొటో అది. Subhas Chandra Bose reading Nippon Times (now The Japan Times), Japan's largest and oldest English-language daily newspaper @japantimes pic.twitter.com/6A7YMXGEkW — Anuj Dhar (@anujdhar) May 27, 2018 మే 27, 2018లో అంజుధార్ అనే వ్యక్తి ట్విటర్ అకౌంట్ నుంచి ఈ విషయం ధృవీకరించడం జరిగింది. అంతేకాదు 2019లో బిప్లబ్సీ2 అనే వ్యక్తి ట్విటర్ అకౌంట్ నుంచి ఈ మార్ఫింగ్ ఫొటో వైరల్ అయ్యిందని అంజుధార్ బయటపెట్టాడు కూడా. ఆ తర్వాత ట్విటర్ ఆ అకౌంట్‌ను తొలగించింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ను బద్నాం చేసేలా ఆ మార్ఫింగ్ ఫొటోనే వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. చదవండి: బోస్ బతికున్నారో లేదో చెప్పండి: సీఐసీ -
పనితీరును మెరుగుపర్చుకోండి..
సాక్షి, ఏలూరు: రెవెన్యూ రికార్డుల నిర్వహణలో పనితీరును మెరుగుపర్చుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అధికారులకు సూచించారు. ఆయన మంగళవారం ఏలూరులో మంత్రులు శ్రీరంగనాథ రాజు, ఆళ్ల నాని, తానేటి వనితలతో కలసి గృహ నిర్మాణ శాఖపై సమీక్ష జరిపారు. రెవెన్యూ రికార్డులను కరెక్ట్‌గా నిర్వహించకపోతే ప్రభుత్వం ఏం చేసినా ఫలితం ఉండదని బోస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పేదలందరికీ ఇళ్లు అందించేందుకు ప్రతి జిల్లాలోనూ సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి సమీక్షలు ప్రారంభించామని వెల్లడించారు. పేదలకు ఇళ్ల మంజూరు కోసం భూమి సేకరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ ద్వారా యాప్‌ను నిర్వహిస్తున్నామని.. దీని ద్వారా లబ్ధిదారులకు సేవలందిస్తామన్నారు. భూ సేకరణ కొంత కష్టంగా ఉంది.. డెల్టా ప్రాంతాల్లో భూ సేకరణ కొంత కష్టంగా ఉందని గృహనిర్మాణ మంత్రి చెరుకూరి శ్రీరంగనాథరాజు అన్నారు. జిల్లాలో ప్రభుత్వభూమి చాలా ఉందని.. వివాదాల్లో ఉన్నప్రభుత్వ భూములను త్వరితగతిన స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
నటుడు బోస్ ఇక లేరు
ప్రముఖ సినీ, టీవీ నటుడు సుభాష్ చంద్రబోస్ అలియాస్ బోస్ ఇక లేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఆదివారం తుది శ్వాస విడిచారు. సుమన్ హీరోగా తెరకెక్కిన ‘సాహసపుత్రుడు’ సినిమాతో బోస్ తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు. ఆయన ఎక్కువగా కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బోస్ ‘ఇడియట్, నిన్నే పెళ్లాడతా, అల్లరి రాముడు, శివమణి’ వంటి పలు సినిమాల్లో నటించారు. ఆయనకు ‘ప్రేమఖైదీ’ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు. బోస్ మృతిపట్ల పలువురు సినీ, టీవీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. -
ఆజాద్ నారీ ఫౌజ్
స్త్రీలు యుద్ధంలోకి ఎందుకు? స్త్రీల చేతికి తుపాకులెందుకు? ఏమిటీ ప్రశ్న! స్త్రీల సామర్థ్యంపై సందేహమా? స్త్రీల భద్రతపై సంశయమా? ఇంత భారీ డిఫెన్స్ ఫోర్స్‌ని పెట్టుకుని కూడా ‘ఫ్రంట్‌లైన్ వార్’లోకి స్త్రీలను వెళ్లనివ్వడం లేదు మన రక్షణ దళాధిపతులు! మరి.. ఏ బలాలు, దళాలు లేని కాలంలో.. స్వాతంత్య్ర సంగ్రామానికి మహిళల్ని ఏ ధైర్యంతో ఆహ్వానించారు సుభాస్‌చంద్రబోస్?! ధైర్యంతో కాదు. నమ్మకంతో.. మహిళా శక్తిపై నమ్మకంతో! నేడు చంద్రబోస్ జయంతి. ఈ సందర్భంగా.. డెబ్బై ఆరేళ్ల క్రితమే ఆయన స్థాపించిన ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’ ఆవిర్భావ సందర్భంపై సంక్షిప్త మననం. 1943 జూలై 9, సింగపూర్.. బోస్ మాట్లాడుతున్నాడు.. సుభాస్ చంద్రబోస్! ఎదురుగా భారతీయులు.. అరవై వేల మంది! ఇల్లొదిలి, దేశం వదలి తనెందుకు వచ్చిందీ చెప్పాడు. అయితే అది కాదు అతడు చెప్పబోతున్నదని అక్కడి వారికి అర్థమైపోయింది. ఇంకేదో చెప్పబోతున్నాడు. ఏంటది?‘‘ఆడవాళ్లు కూడా తుపాకులు అందుకోవాలి’’ అన్నాడు బోస్. ఒక్కసారిగా నిశ్శబ్దం! ‘‘వాళ్లొచ్చి ఏం చేస్తారు బోస్.. భారం అవుతారు ఆజాద్ హింద్ ఫౌజ్‌కి’’.. ఎవరో అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ – ఐఎన్ఎ) .. బోస్ నిర్మించిన సైనిక దళం. గొరిల్లా, ఇన్ఫాంట్రీ, స్పెషల్ ఆపరేషన్స్.. వెరీ డేంజరస్. ఐఎన్ఎ అలికిడి అయితే చాలు.. బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. ఏడాదైంది బోస్ ఐఎన్ఎ ని తయారుచేసి. అందులోకే ఇప్పుడు మహిళల్ని రమ్మంటున్నాడు. ‘‘ఒంట్లో సత్తువ ఉన్న ప్రతి ఒక్కరూ.. ఇంట్లో దూరిన శత్రువుని తరిమికొట్టడానికి సైన్యంలోకి రావాలి’’ అన్నాడు బోస్. ‘‘ఏం చేస్తారు బోస్.. ఆడవాళ్లు సైన్యంలోకి వచ్చి?’’ మళ్లీ అదే ప్రశ్న. బోస్ గర్జించాడు. ‘‘ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందో అదే చేస్తారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా ఖడ్గాన్ని తిప్పిందో అలాగే ఖడ్గాన్ని తిప్పుతారు. తిరుగుబాటుకు, స్వాతంత్య్ర సంగ్రామానికి అప్పుడున్నది ఒక్క లక్ష్మీబాయే. ఇప్పుడు ప్రతి మహిళా ఒక లక్ష్మీబాయి. నేను నమ్ముతున్నాను.. మహిళా భాగస్వామ్యం కూడా ఉంటే త్వరగా స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. నేనునమ్ముతున్నాను.. మహిళలూ కదనరంగంలోకి దుమికితే.. భారతదేశం అణువణువునా స్వాతంత్య్ర కాంక్ష రగులుతోందన్న సంకేతం బ్రిటన్‌కు అందుతుంది’’బోస్ ప్రసంగం ముగించాడు. ముగిస్తూ, చెయ్యి ముందుకు చాపి.. ప్రమాణం చేస్తున్నట్లుగా అన్నాడు. ‘‘మన మహిళా దళం పేరు.. ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’. ఎవరూ చేతుల్లేపలేదు!‘‘ఇక స్వాతంత్య్రం వచ్చినట్లే’’.. ఎవరో అన్నారు. ‘అవునవును’.. ఇంకో గొంతు. మరికొన్ని వంత గొంతుకలు. మూడ్రోజులు గడిచాయి. చప్పుడు లేదు.నాలుగో రోజు సింగపూర్‌లోనే.. ‘ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్’ (ఐఐఎల్) మీటింగ్ జరుగుతోంది. ఐఐఎల్ మహిళా విభాగం మీటింగ్ అది. అక్కడికి వెళ్లాడు బోస్. ఇండియా బయట ఉండి, ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్న భారతీయులంతా కలిసి పెట్టుకున్న రాజకీయపార్టీ ఐఐఎల్.‘‘నా పేరు బోస్. మీలాగే భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఒక సైనికుడిని’’ అన్నాడు బోస్. మీటింగ్‌లోని మహిళలు కొందరు సంభ్రమంగా చూశారు. ‘మీలాగే’ అన్న మాట.. వారిలో ఉత్తేజాన్ని నింపింది. ‘‘మీతో కలిసి బ్రిటిష్ వాళ్లపై పోరాటం చేయాలనుకుంటున్నాను’’ అన్నాడు బోస్. బోస్‌తో కలిసి పోరాడాలని అనుకుంటారు ఎవరైనా. కానీ బోసే అంటున్నాడు ‘నేను మీతో కలిసి పోరాడతాను’ అని! ఆశ్చర్యంగా కళ్లింత చేసి చూశారు మహిళలు. సమావేశంలో డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ ఉన్నారు. సింగపూర్‌లో ఐఐఎల్ మహిళా విభాగంలో ఆమెది కీ రోల్. ఆ సమావేశంలోనే.. బోస్కి మహిళలతో ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇప్పించాలన్న నిర్ణయం జరిగింది. సైనిక వందనం!మహిళలైతే ఉన్నారు. మహిళా సైనికులు ఎక్కడ దొరుకుతారు.. ‘గార్డ్ ఆఫ్ ఆనర్’కి. కష్టపడి ఓ ఇరవై మంది సాధారణ మహిళల్ని ఒప్పించగలిగారు. బోస్ ఐఎన్ఎ దళం నుంచి లీ–ఎన్ఫీల్డ్ 303 రైఫిల్స్ తెప్పించారు. వాటిని ఎలా పట్టుకోవాలో, ఎలా వందన సమర్పణ చేయాలో ఆ ఇరవై మందికి అప్పటికప్పుడు నేర్పించారు. యూనిఫారాల్లేవు. చీరల వస్త్రధారణలోనే గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. వందన సమర్పణ ముగిసింది. బోస్ ప్రసంగం మొదలైంది. ‘‘స్వాతంత్య్రం కోసం దశాబ్దాలుగా మగాళ్లకు దీటుగా మీరూ ముందుకు నడుస్తున్నారు. నాకనిపిస్తున్నది ఏమిటంటే.. ముందుకు నడవడమే కాదు, ముందుకు నడిపించగలరు కూడా మీరు’’.ఆ ఒక్కమాట చాలదా.. తుపాకీని భుజానికెత్తుకోడానికి. ఎత్తుకున్నారు. కానీ, అదంత తేలిగ్గా ఏమీ జరగలేదు. ఆడవాళ్లెందుకు ఆజాద్ హింద్ ఫౌజ్‌లోకి అనే ప్రశ్న మళ్లీ వచ్చింది. బోస్కి సైనిక వందనం చేసిన మహిళల్లో డాక్టర్ నసీరా కయానీ అనే డాక్టర్ కూడా ఉన్నారు. రైఫిల్‌ని ఎత్తిపట్టుకున్న ఆ గ్రూపులో ఉన్న నసీరాను చూసి ఆజాద్ హింద్ ఫౌజ్ కు జనరల్‌గా ఉన్న మొహమ్మద్ జమాన్ కయానీ ఖిన్నుడయ్యాడు. తన భార్యేమిటీ, అకస్మాత్తుగా ఇక్కడ ప్రత్యక్షం అయిందేమిటీ? అని ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్లాక నసీరాను కోప్పడ్డాడు. ‘‘డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ కాలేజ్‌లో నా క్లాస్మేట్. తను రమ్మంటే వెళ్లాను’ అని భర్తకు చెప్పారు నసీరా. ఆర్‌జెఆర్ (రాణి ఝాన్సీ రెజిమెంట్) లో చేరదామని వెళ్లి కూడా, భర్త వద్దనడంతో ఆమె ఆగిపోయారు. పైస్థాయిలోనే ఇలా ఉంటే, కింది స్థాయిలో ఇంట్లో మగాళ్లు మహిళల్ని సైన్యంలోకి వెళ్లనిస్తారా? అయినా ఆర్‌జెఆర్ నిలబడింది. నిలదొక్కుకుంది. కలబడింది. బలపడింది. కదిలివచ్చిన కొద్దిపాటి మహిళలతోనే నేతాజీ మహిళా సైన్యం 1943 అక్టోబర్ నుంచి 1945 మే వరకు ఉరుములా, మెరుపులా వెయ్యి మంది సైనికులతో ఉనికిలో ఉంది. కెప్టెన్ లక్ష్మీ సెహెగల్ (లక్ష్మీ స్వామినాథనే లక్ష్మీ సెహెగల్) ఈ దళాన్ని నడిపించారు. 1945 అక్టోబర్‌లో యుద్ధం పూర్తయింది. అంతకు రెండు నెలల ముందే ఆగస్టులో సుభాస్ చంద్రబోస్ అదృశ్యమయ్యారు. ఆ అదృశ్యశక్తి మహిళలోని పోరాట పటిమకు శక్తినిస్తూ ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటుంది. ఆ పటిమను నిరూపించుకోవలసిన అవకాశాన్ని యువతులకు ఇవ్వవలసింది మాత్రం ఇప్పటి మన రక్షణ దళాల అధిపతులే. -
బోస్ బతికున్నారో లేదో చెప్పండి: సీఐసీ
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నారా? చనిపోయారా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిందిగా జాతీయ అర్కైవ్స్ విభాగాన్ని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. బోస్పై అవధేశ్ కుమార్ చతుర్వేది అనే వ్యక్తి ప్రధాని కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం కింద అభ్యర్థించారు. 2015, 16ల్లో బోస్ జయంతి రోజున ప్రధాని ఎందుకు నివాళి అర్పించారో చెప్పాలన్నారు. సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో సీఐసీని ఆశ్రయించారు. సంబంధిత రికార్డులన్నీ జాతీయ అర్కైవ్స్ విభాగం వద్ద ఉన్నాయని పీఎంవో చెప్పడంతో 15 రోజుల్లోగా దరఖాస్తుదారుడికి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ప్రధాన సమాచార కమిషనర్ ఆర్కే మాథుర్ అర్కైవ్స్ విభాగాన్ని ఆదేశించారు. -
త్వరలోనే ఎమ్మెల్యే బీవీ చిట్టా విప్పుతా
కర్నూలు(అర్బన్): రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తనను అరెస్ట్ చేయించి జైలుకు పంపించారని, త్వరలోనే ఆయన చిట్టా విప్పుతానని గోనెగండ్ల మాజీ సర్పంచ్ టి. నాగేష్‌నాయుడు అన్నారు. సోమవారం స్థానిక కార్యాలయంలో వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గోనెగండ్ల సొసైటీలో ఎన్నో అక్రమాలు జరిగాయని, ఇప్పటికీ రూ.40 లక్షల అవినీతికి సంబంధించి ఆదోని న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయన్నారు. రాజకీయంగా ఎదుగుతున్న వాల్మీకులను అణగదొక్కేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారని వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 65 వేల మంది వాల్మీకుల ఓట్లు ఉన్నాయని.. ఎన్నికల్లో తమ సత్తా చూపించాల్సి వస్తుందన్నారు. సమావేశంలో వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరు గిడ్డయ్య, నాయకులు బోయ గోపీ, వీవీ నాయుడు, శివ, గోనెగండ్ల నాయకులు రంగస్వామి, మురళీనాయుడు, గుడికల్లు రంగన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
కవి విగ్రహానికి అవమానం...
సాక్షి, కోల్కత్తా : లెనిన్ విగ్రహం కూల్చివేతతో మొదలైన ధ్వంసకాండ ఇప్పట్లో ఆగేలా లేదు. పెరియార్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలపై జరిగిన వివిధ ఘటనలపై ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. 19 శతాబ్దానికి చెందిన ప్రముఖ బెంగాలీ కవి మైఖేల్ మధుసూదన్ దత్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు ఎర్ర రంగు పూశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. అప్రమత్తమైన మున్సిపాలిటీ శాఖ విగ్రహాన్ని శుభ్రం చేయించింది. ఎవరీ.. మైఖేల్ మధుసుదన్ దత్ ఆంగ్ల భాషలో పద్యాలు రచించిన మొదటి భారతీయ కవిగా ప్రసిద్ధి చెందారు. చిన్నతనంలోనే క్రైస్తవ మతం స్వీకరించి పేరు మార్చుకున్నారు. బెంగాలీతో పాటు సంస్కృతం, తమిళ్, తెలుగు, హిబ్రూ, లాటిన్, గ్రీకు తదితర భాషల్లో ప్రావీణ్యం కలవారు. -
నేతాజీ ప్రతిమనూ వదల్లేదు..
జబల్పూర్ : విగ్రహాల ధ్వంసం ఘటనలకు బ్రేక్ పడటం లేదు. దేశవ్యాప్తంగా మహనీయుల విగ్రహాలను లక్ష్యంగా చేసుకుంటున్న దుండగులు తాజాగా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని అవమానించారు. శుక్రవారం ఉదయం కొందరు దుండగులు నేతాజీ విగ్రహానికి ఎరుపు రంగు పులిమారు. ఈ ఘటనపై స్ధానిక అధికారుల చొరవతో పోలీసులు ప్రాధమిక దర్యాప్తును చేపట్టారు. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. త్రిపురలో రెండు లెనిన్ విగ్రహాలను కొందరు కూల్చివేశారు. అగర్తలాలో కొందరు దుండగలు లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేయగా, బెలోనియాలో వ్యవసాయ క్షేత్రంలోని లెనిన్ విగ్రహాన్ని బుల్డోజర్తో తొలగించారు. లెనిన్ విగ్రహాన్ని నేలమట్టం చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.మరోవైపు యూపీలోని ఖరోవ్ గ్రామంలో శుక్రవారం హనుమాన్ విగ్రహంపైనా దుండగులు దాడికి తెగబడ్డారు. విగ్రహాల కూల్చివేతలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపడతామని ప్రధాని హెచ్చరించినా ఇలాంటి ఘటనలు కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
నేతాజీ
-
'డీఎన్ఏ పరీక్షతో అన్ని అనుమానాలు పోతాయ్'
సాక్షి, న్యూఢిల్లీ : డీఎన్ఏ పరీక్ష చేయడం ద్వారా స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ (నేతాజీ) మరణంపై ఉన్న అనుమానాలన్నింటికి స్వస్తి పలకవచ్చని ఆయన కూతురు అనితా బోస్ అన్నారు. బోస్‌ను ఖననం చేసిన అవశేషాలు మిగిలి ఉంటాయని వాటి డీఎన్ఏను పరీక్షిస్తే అసలు విషయం తేలిపోతుందని అభిప్రాయపడ్డారు. 'లేయిడ్ టు రెస్ట్ : ది కాంట్రవర్సి ఓవర్ సుభాష్ చంద్రబోస్ డెత్' అనే పుస్తకంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ మరణంపై ఉన్న అనుమానాల పరంపరను పేర్కొంటూ వస్తున్న ఈ కొత్త పుస్తకాన్ని ఆశీష్ రే రాశారు. సుభాష్ చంద్రబోస్ అవశేషాలను 1945 సెప్టెంబర్ నుంచి టోక్యోలోని రెంకోజి ఆలయంలో భద్రపరుస్తూ వస్తున్నారు. నేడు దేశ వ్యాప్తంగా నేతాజీ 121వ జయంతి వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. -
జాతిపితా... నన్ను దీవించండి
‘ఎవరిది వాళ్లకుంటుంది’.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని డైలాగ్ ఇది. ఎవరిది వాళ్లకు ఉన్నప్పుడు అడాల్ఫ్ హిట్లర్‌కి, నేతాజీ సుభాస్ చంద్రబోస్‌కి ఇంకెంతుండాలి? హిట్లర్ నియంత. నేతాజీ.. నియంతలకే ఒక వింత! స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ గైడ్ లైన్స్ ఏవీ ఫాలో కాలేదు నేతాజీ. ‘శత్రువుకు చెంప చూపిస్తే స్వరాజ్యం రాదు, గన్ తీసి కణతలకు గురిపెడితే వస్తుంది’ అని గాంధీజీతోనే వాదించినవాడు నేతాజీ. అలాంటి వాడు జర్మనీతో టై–అప్ అయి, బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి ఇండియాకు స్వాతంత్య్రం సంపాదించాలని ప్లాన్ వేసుకుని హిట్లర్ని కలవడానికి వెళ్లాడు. సహాయం కోసం కాదు, ‘ఇచ్చిపుచ్చుకోవడం’ అనే డీల్ కోసం వెళ్లాడు. హిట్లర్ కూడా బ్రిటన్‌పై పోరాడుతున్నాడు కాబట్టి, నేతాజీ సైన్యం (సొంత సైన్యం) హిట్లర్‌కు, హిట్లర్ సైన్యం నేతాజీకి హెల్ప్ చేస్తుంది. అది మాట్లాడ్డానికి వెళ్లాడు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు’ అవుతాడు అనే సింపుల్ లాజిక్‌తో వెళ్లాడు. తగ్గి వెళ్లలేదు. దేశం కోసం తగ్గితే మాత్రం ఏముంది అనీ వెళ్లలేదు. చెయ్యి కలిపితే కలిపాడు, లేకుంటే లేదు. ఎవరిది వాళ్లకు ఉంటుంది.. అనుకుని వెళ్లాడు. హిట్లర్ అనుచరులు నేతాజీని ఆహ్వానించారు. అయితే హిట్లర్ దగ్గరికి వెళ్లనివ్వలేదు. బయటి గదిలోనే కూర్చోబెట్టారు! ‘ఫ్యూరర్ లోపల ఇంపార్టెంట్ మీటింగులో ఉన్నారు’ అని చెప్పారు. ఫ్యూరర్ అంటే లీడర్ అని.నేతాజీ చాలాసేపు బయటే వేచి ఉన్నాడు. బల్ల మీద న్యూస్ పేపర్లు ఉంటే, వాటిని తిరగేస్తున్నాడు. ఎంతసేపటికీ రాడే హిట్లర్! చివరికి వచ్చాడు. వచ్చాక నేతాజీని చూసీచూడనట్లు మళ్లీ లోపలికి వెళ్లిపోయాడు. నేతాజీ కూడా గమనించీ, గమనించనట్లు ఉండిపోయాడు. హిట్లర్ రావడం, నేతాజీని చూడడం; నేతాజీ కూడా హిట్లర్‌ను గమనించడం, గమనించనట్లు ఉండడం.. అలా చాలాసార్లు జరిగింది. తర్వాత మళ్లీ ఒకసారి వచ్చి, నేతాజీ పక్కన నిలుచున్నాడు హిట్లర్. నేతాజీ పట్టించుకోలేదు. పేపర్ చదువుతున్నట్లుగా ఉండిపోయాడు. హిట్లర్.. నేతాజీ వెనక్కు Ðð ళ్లి నిలుచుని నేతాజీ భుజాలపై చేతులు వేశాడు! వెంటనే నేతాజీ తలతిప్పి చూసి, ‘‘హిట్లర్!’’ అన్నాడు. హిట్లర్ నవ్వాడు. ‘‘హిట్లర్‌నని నువ్వెలా చెప్పగలవ్?’’ అన్నాడు. నేతాజీ నవ్వాడు. ‘‘హిట్లర్‌కి కాకుండా, సుభాస్ చంద్రబోస్ భుజాలపై చేతులు వేసే ధైర్యం మరెవరికి ఉంటుంది?’’ అన్నాడు. అంతేగా. ఎవరిది వాళ్లకుంటుంది. హిట్లర్‌కి చాలామంది డూప్‌లు ఉండేవాళ్లు. డూప్‌లకు పల్టీకొట్టే రకం కాదు నేతాజీ. ప్రతి లక్ష్యానికీ రెండు దారులు ఉంటాయి. ‘కంటికి కన్ను’ దారొకటి. ‘రెండో చెంప’ దారొకటి. మొదటి దారి నేతాజీది. రెండో దారి గాంధీజీది. అలాగని నేతాజీ.. గాంధీజీని గౌరవించకుండా లేరు! సింగపూర్‌లో ఏర్పాటు చేసుకున్న ‘ఆజాద్ హింద్’ రేడియోలోంచి 1944 జూలై 6న మాట్లాడుతూ, తొలిసారిగా నేతాజీ.. గాంధీజీ పేరెత్తారు! ‘‘జాతిపితా.. నన్ను దీవించండి. ఈ పోరాటంలో నేను గెలవాలని నన్ను దీవించండి’’అని కోరాడు. (రేపు.. జనవరి 23.. నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి). – మాధవ్ శింగరాజు -
ఘాజీ దర్శకుడి మరో పరిశోధన
ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. భారత్, పాక్ ల మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో మునిగిపోయిన ఓ జలాంతర్గామి కథతో ఘాజీ సినిమాను తెరకెక్కించాడు సంకల్ప్. రానా, తాప్సీ, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఆకట్టుకుంది. ఘాజీ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సంకల్ప్ తన తదుపరి చిత్రం విషయంలో కూడా ప్రయోగానికే సిద్ధమవుతున్నాడు. ఘాజీ కథ కోసం ఎంతో పరిశోదన చేసిన సంకల్ప్, త్వరలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. అయితే గతంలో వచ్చిన బోస్ సినిమాల మాదిరిగా కాకుండా ఆయన జీవితంలో వెలుగులోకి రాని ఎన్నో సంఘటనలపై సుధీర్ఘ పరిశోధన చేసి ఈ కథను తయారుచేస్తున్నారు. బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నేతాజీకి సంబంధించి సరికొత్త కోణం ఆవిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
గుమ్నానీ బాబా.. నేతాజీయేనా?!
సాక్షి, లక్నో : నేతాజీ సుభాస్ చంద్రబోస్.. స్వంతత్ర పోరాటంలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన పేరు. ఇండియన్ ఆర్మీ వ్యవస్థాపకుడిగా.. చరిత్రలో నిలిచినపేరు. ఫ్రీడమ్ ఫైట్ లో ఆయనదంటూ ప్రత్యేక శైలి. జపాన్ వెళ్లినా.. జర్మనీ స్నేహం చేసినా అంతా కొత్త పంథానే. ఆయన జీవితం ఎంత రహస్యంగా గడిచిందో.. ఆయన మరణం కూడా అంతే నిగూఢంగా మిగిలిపోయింది. గుమ్నానీ బాబానే నేతాజీ అని నమ్మేవాళ్లు దేశంలో చాలామంది ఉన్నారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ తాజాగా జస్టిస్ విష్ణు సాహి తన నివేదికను ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ కు సమర్పించారు.స్వతంత్రానంతరం నేతాజీ గుమ్నానీ బాబాగా రహస్యంగా జీవించారని స్థానికులు నమ్ముతున్నట్లు ఆయన తన నివేదికలు వెల్లడించారు. మెజారిటీ సాక్షులు ఇదే విషయాన్న ధృవీకరిస్తున్నారని చాహల్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. గుమ్నానీ బాబానే నేతాజీ అంటూ గత ఏడాది అలహాబాద్ కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై స్పందించింన హైకోర్టు.. గుమ్నానీ బాబా విషయాన్ని తేల్చేందుకు చర్యలు తీసుకోవాలని అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఎస్పీ ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ విష్ణు సాహి నేతృత్వంలో ఒక కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ ఏడాదిపాటు పూర్తిగా విచారణ చేసి విలువైన సమాచారాన్ని సేకరించింది. -
నేతాజీ 1945లో చనిపోయారు: ప్రభుత్వం
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లోనే విమాన ప్రమాదంలో చనిపోయారని ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం స్పష్టం చేసింది. నేతాజీ మృతిపై కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి కేంద్ర హోం శాఖకు సమాచార హక్కు కింద గతంలో దరఖాస్తు చేశారు. షానవాజ్ కమిటీ, జస్టిస్ జీడీ ఖోస్లా కమిషన్, జస్టిస్ ముఖర్జీ కమిషన్ల నివేదికల్లోని సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం నేతాజీ చనిపోయారనే నిర్ధారణకు వచ్చామని హోం శాఖ తెలిపింది. నేతాజీ కొన్ని రోజులపాటు గుమ్నమి బాబాగా మారువేషంలో జీవించారనే వాదనననూఅధికారులు కొట్టిపారేశారు. కేంద్రం సమాధానాన్ని నేతాజీ కుటుంబ సభ్యులు ఖండించారు. ‘సరైన సాక్ష్యాలు లేకుండానే నేతాజీ విమాన ప్రమాదంలోనే చనిపోయారని ప్రభుత్వం ఎలా చెబుతుంది?’ అని నేతాజీ మునిమనవడు చంద్రబోస్ ప్రశ్నించారు. -
బాస్
-
ఆ 'రహస్యాల' వెల్లడి గర్వకారణం: మోదీ
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 121వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం జాతి యావత్తూ ఆయనను స్మరించుకుంది. నేతాజీ ఓ గొప్ప మేధావి అని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం తపించేవారని, వలస పాలకులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చిరస్మరనీయమని ప్రధాని నరేంద్రమోదీ గుర్తుచేశారు. "ఆ మహోన్నత నాయకుడికి సంబంధించిన ఫైళ్లను వెల్లడించే అవకాశం మా ప్రభుత్వానికి దక్కడం గర్వకారణం"అని మోదీ ట్వీట్ చేశారు. అరుణ్‌జైట్లీ, రాజ్యవర్థన్ రాథోడ్ సహా పలువురు కేంద్రమంత్రులు సైతం నేతాజీని స్మరిస్తూ ప్రకటనలుచేశారు. (నేతాజీ రహస్య ఫైళ్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సుభాష్ చంద్రబోస్ 1897, జనవరి 23న ఒడిశాలోని కటక్ పట్టణంలో జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు ప్రభావతిదేవి, జానకినాథ్ బోస్. కటక్‌లోని రావెన్షా కాలేజియట్ స్కూల్లో, కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కాలేజీలో, ఆపై కేంబ్రిడ్జి యూనివర్సిటీలో సుభాష్ చదువు పూర్తిచేశారు. 1920లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసిన బోస్.. జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించారు. అయితే ఏడాది తిరిగేలోపే ఉద్యోగాన్ని వదిలేసి జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి స్వాతంత్ర్య సంగ్రామంలోకి దూకేశారు. రెండు సార్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేసిన ఆయన.. మహాత్మా గాంధీతో సిద్ధాంతపరమైన విబేధాలు తలెత్తడంతో కాంగ్రెస్‌ను వీడి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించి పోరాటాన్ని కొనసాగించారు. ('నేతాజీ' ఫైళ్లు చెప్పిన నిజం) రెండోప్రపంచ యుద్ధం సమయంలోనే బ్రిటిషర్లను దెబ్బకొట్టాలనే సంకల్పంతో నేతాజీ భారీ ప్రణాళికలు రచించారు. జపాన్ సహకారంతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటుచేశారు. ఈ ప్రయత్నాలు సాగుతుండగానే 1945, ఆగస్టు 18న నేతాజీ ప్రయాణిస్తోన్న విమానం అంతర్థానమైంది. ఆ తర్వాత బోస్‌కు సంబధించి రకరకాల వార్తలు వెలువడ్డాయి. దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఆయన డెత్ మిస్టరీ ఇంకా విడలేదు. ఈ నేపథ్యంలో నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను మోదీ సర్కారు గత ఏడాది బహిర్గతం చేసింది. వాటిపైనా విమర్శలు చెలరేగడం తెలిసిందే. (నేతాజీ 'రహస్యం' పెద్ద జోకా?) -
మహనీయుడి కారుకి ప్రాణం పోశారు
కోల్‌కతా: మహనీయుడి కారు మళ్లీ ప్రాణం పోసుకుంది. స్వాంతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్(నేతాజీ) నడిపిన కారు మరోసారి రోడ్డు ఎక్కేందుకు సిద్ధమైంది. జనవరి 18న కోల్‌కతాలోని నేతాజీ భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ కారు ప్రారంభం కానుంది. ఈ కారులో ప్రయాణించే భాగ్యం కూడా తొలిసారి రాష్ట్రపతి ప్రణబ్‌కు దక్కనుంది. దాదాపు 80 ఏళ్ల తర్వాత ఇది ఊపిరి పీల్చనుంది. చాలా ఏళ్లుగా కదలకుండా ఓ అద్దాల గదిలో ఉన్న ఆ కారును తిరిగి మనుగడలోకి తెచ్చేందుకు జర్మన్ ఆడి కారు సంస్థ అధికారులతో నేతాజీ రీసెర్చ్ బ్యూరో(ఎన్ఆర్ బీ) ఒప్పందం చేసుకున్న మేరకు ఈ కారు సిద్ధమైంది. చదవండి.. (మహనీయుడి కారుకి మళ్లీ ప్రాణం) 1937లో జర్మనీలోని వాండరర్ సెడాన్ కంపెనీ ఈ కారును తయారు చేయగా దానిని సుభాష్ చంద్రబోస్ సోదరుడు తెప్పించారు. బోస్ ఈ కారును ఉపయోగించేవారు. స్వాతంత్ర్య పోరాటం జరిగే రోజుల్లో ఆయనను ఓసారి బ్రిటిష్ సేనలు గృహ నిర్బంధం చేశాయి. దీంతో జనవరి 16, 1941న వాండరర్లో కోల్ కతాలోని ఎల్గిన్ రోడ్డులోని తన నివాసం నుంచి బిహార్‌లోని గోమో ప్రాంతానికి(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) బోస్ పారిపోయారు. అక్కడి నుంచి జర్మనీకి వెళ్లారు. దీనినే చరిత్రలో 'గ్రేట్ ఎస్కేప్'గా అభివర్ణిస్తారు. అప్పటి నుంచి గొప్ప జ్ఞాపికగా ఉంటున్న బోస్ కారు చివరకు కదలనుంది. -
చిత్రహింసల వల్లే నేతాజీ మరణం!
కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, సోవియట్ యూనియన్ లో బ్రిటిష్ అధికారుల ఇంటరాగేషన్ లో చిత్రహింసల వల్ల మృతి చెందారని తాజా వాదన తెరపైకి వచ్చింది. రిటైర్డ్ మేజర్ జనరల్ జీడీ బక్షీ రాసిన ‘బోస్– ది ఇండియన్ సమురాయ్’ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. జపాన్ నుంచి తప్పించుకుని సైబీరియాకు వెళ్లిన నేతాజీ అక్కడ ఆజాద్ హింద్ ప్రభుత్వ ఎంబసీని ఏర్పాటు చేశారని , నేతాజీ తప్పించుకున్న విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు.. ఆయనను విచారణ కు అనుమతించాలంటూ సోవియట్ అధికారులపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. -
నేతాజీ మృతిపై వైస్రాయ్ దర్యాప్తు !
లండన్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి దారితీసిన పరిస్థితులపై పరిశోధన చేస్తున్న బ్రిటన్ వెబ్సైట్ బోస్‌ఫైల్స్.ఇన్ఫో మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. తైపీలో విమానప్రమాదంలో బోస్ చనిపోయాడని భావిస్తున్న 9 రోజుల తర్వాత.. 1945 ఆగస్టు 27న ఆయన మృతిపై అప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ వేవెల్ తన మంత్రివర్గ సభ్యులకు తెలియజేశారని పేర్కొంది. యూకే మాజీ విదేశాంగ కార్యదర్శి రిఫ్‌కిండ్ 1995 నవంబర్‌లో లార్డ్ సాండ్వెల్కు రాసిన లేఖను వెబ్సైట్ ప్రచురించింది. ఈ లేఖలో బోస్ మృతి నిజం అని ఉంది. ఈ లేఖను 2015లో బ్రిటిష్ విదేశాంగ, కామన్వెల్త్ కార్యాలయం యూకే సమాచార స్వేచ్ఛ కింద ‘మహారాష్ట్ర టైమ్స్’మాజీ ఎడిటర్ గోవింద్‌కు పంపింది. -
మహనీయుడి కారుకి మళ్లీ ప్రాణం
కోల్‌కతా: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉపయోగించిన కారుకు మళ్లీ ప్రాణం రానుంది. చాలా ఏళ్లుగా కదలకుండా ఓ అద్దాల గదిలో ఉన్న ఆ కారును తిరిగి మనుగడలోకి తెచ్చేందుకు జర్మన్ ఆడి కారు సంస్థ అధికారులతో నేతాజీ రీసెర్చ్ బ్యూరో(ఎన్ఆర్ బీ) ఒప్పందం చేసుకుంది. ఈ కారుకు 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. 1937లో జర్మనీలోని వాండరర్ సెడాన్ కంపెనీ ఈ కారును తయారు చేయగా దానిని సుభాష్ చంద్రబోస్ ఉపయోగించారు. స్వాతంత్ర్య పోరాటం జరిగే రోజుల్లో ఆయనను ఓసారి బ్రిటిష్ సేనలు గృహ నిర్బంధం చేశాయి. దీంతో జనవరి 16, 1941న వాండరర్లో కోల్ కతాలోని ఎల్గిన్ రోడ్డులోని తన నివాసం నుంచి గోమో ప్రాంతానికి(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) బోస్ పారిపోయారు. అక్కడి నుంచి జర్మనీకి వెళ్లారు. ఆ సమయంలో ఆ కారును నడిపింది బోస్ మేనళ్లుడు సిసిర్ బోస్. దీనినే చరిత్రలో 'గ్రేట్ ఎస్కేప్'గా అభివర్ణిస్తారు. కట్టుదిట్టంగా ఆయన ఇంటిచుట్టు బ్రిటీష్ సేనలు, నిఘా అధికారులు ఉన్నప్పటికీ బోస్ వారు కళ్లుగప్పి తప్పించుకున్నారు. అందుకే ఇది 'గ్రేట్ ఎస్కేప్'గా నిలిచిపోయింది. ఆ కారును ప్రస్తుతం నేతాజీ ఇంటిలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో అద్దాల గదిలో ఉంచుతున్నారు. ఆయన ఇళ్లు ప్రస్తుతం ఎన్ఆర్బీగా మారిన సంగతి తెలిసిందే. దీని చైర్ పర్సన్ కృష్ణ బోస్ ఇటీవల జర్మనీకి చెందిన ఆడి కంపెనీని సంప్రదించి ఆ కారుకు తిరిగి ప్రాణంపోయాలని చెప్పారు. అందుకు ఆ సంస్థ కూడా అంగీకరించింది. వింటేజ్ కార్ల నిపుణుడు పల్లాబ్ రాయ్ సమక్షంలో ఈ కారు తిరిగి రూపుదిద్దుకోనుంది. ఇది ఈ ఏడాది డిసెంబర్‌నాటికి పూర్తి అవనున్నట్లు ఎన్ఆర్ బీ చైర్ పర్సన్ కృష్ణ బోస్ మీడియాతో చెప్పారు. కాగా, చరిత్రలో నిలిచిపోయిన ఈ కారు నెంబర్ బీఎల్ఏ 7169. ఈ కారు ద్వారా తప్పించుకోగలిగిన బోస్ ఆ వెంటనే అఫ్గనిస్థాన్ నుంచి వయా కాబూల్, మాస్కో ద్వారా జర్మనీ చేరుకున్నారు. -
జైట్లీ ట్వీట్ తో షాక్ కు గురయ్యా:మమతా బెనర్జీ
కోల్ కతా: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై ట్వీటర్ లో చేసిన కామెంట్స్ వల్ల షాక్ కు గురయ్యానని పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. ఇది బాధించే ట్వీట్ అని ఆమె పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ శౌర్యానికి ప్రతీక అని, ఆయన వర్థంతి సందర్భంగా నివాళి అర్పించాలని జైట్లీ ట్వీట్ చేశారు. నేతాజీ 1945లో విమాన ప్రమాదంలో మరణించలేదని భావిస్తున్నవారి మనోభావాలను జైట్లీ గాయపరిచారని మమత పేర్కొన్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన నేతాజీ మనువడు సైతం జైట్లీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జైట్లీ ట్వీట్ పై స్పందించిన మమత రక్షా బంధన్ సందర్భంగా ఎవరినీ బాధ పెట్టే ఉద్దేశ్యం తనకు లేదని కానీ జైట్లీ ట్వీట్ తో చాలా బాధపడ్డామని ట్వీటర్ లో కామెంట్ చేశారు. నేతాజీ మరణం ఇప్పటికీ బెంగాళ్ లో సున్నితమైన అంశంగా ఉంది. ప్రభుత్వాలు నియమించిన విచారణ కమిటీలు సైతం భిన్నమైన రిపోర్టులను ఇచ్చాయి. -
నేతాజీ స్నేహితుడి భార్యకూ పింఛను కరువు
కేకేనగర్: తిరువారూర్ జిల్లా ముత్తుపేట రోడ్డులో నివసిస్తున్న స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ కెఎస్ మహ్మద్‌దావూద్ (99) బ్రిటీషు వారికి వ్యతిరేకంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఐఎన్ఏ బృందంలో విశిష్ట సేవలు అందించారు. ఒకసారి బర్మాలో జరిగిన కార్యక్రమానికి నేతాజీ మారువేషంలో వచ్చారు. ఆయన్ను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న మహ్మద్ దావూద్ మారువేషంలో వచ్చింది నేతాజీ అని తెలిసిన అనంతరమే ఆయన్ను అనుమతించారు. దావూద్ నిజాయితీని ఎంతగానో మెచ్చుకున్న నేతాజీ అప్పటినుంచి ఇతడితో సన్నిహితంగా మెలిగేవారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన ద్వారా జీవితాన్ని గడిపిన మహ్మద్ దావూద్ గత సంవత్సరం మరణించాడు. అప్పటి నుంచి ఆయన సతీమణి సబురా అమ్మళ్కు పెన్షన్ అందించడం లేదు. దీనిపై పలుమార్లు అధికారులను కలిసి వినతి ప్రతం సమర్పించినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మట్లాడుతూ భర్త చనిపోయినప్పటి నుంచీ తనకు పింఛన్ మంజూరు కావడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనకు పెన్షన్ మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదా?
టీనగర్: నేతాజీ సుభా్‌ష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని తిరుచ్చిలో ఐఎన్ఏ సైనికుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. తిరుచ్చి జోసెఫ్ కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలో మండ్రం ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. నేతా జీ ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) దళంలోని సైనికుడు దురైరాజ్ (96) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మలేసియాలో నేతాజీ ఐఎన్ఏ కోసం అభ్యర్థులను సేకరించారని, ఆ యన ప్రసంగానికి ఆకర్షితుడినై తనతో సమా 180 మం ది ఐఎన్ఏలో చేరామని తెలిపారు. మలేసియాలోని రెం డవ బెటాలియన్‌లో 20 వేల మంది ఉన్నామని.. ఇక్కడ నుంచి ఒక బెటాలియన్ ఇంఫాల్ (బర్మా)కు పంపారన్నా రు. ఐఎన్ఏ దళం మణిపూర్ సమీపంలోని కోహిమా అనే నగరాన్ని స్వాధీనం చేసుకుందన్నారు. తానున్న బెటాలి యన్ మలేసియాలో వుందని.. ఆ సమయంలో ఆంగ్లేయు లు ఆకాశ దాడులను ముమ్మరం చేశారన్నారు. ఈ దాడుల్లో కోహిమా అడవుల్లోని ఒక బెటాలియన్ చిక్కుకోగా అందు లో అనేక మంది చనిపోయారని తెలిపారు. దళాధిపతి షానవాజ్, బిల్లన్ అరెస్టయినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో హిరోషిమా అణుబాంబు దాడులు జరిగాయన్నారు. జపాన్ అమెరికాకు లొంగిపోయే ముందు నేతాజీని కాపాడాలనే ఉద్దేశంతో జపనీయులు నేతాజీ తప్పించుకునేలా చేశారన్నారు. దీంతోపాటు విమానంలో వెళ్లే సమయంలో మృతిచెందినట్లు నమోదు చేశారన్నారు. మలేసియాలోని రెండవ బెటాలియన్ లో తాను పనిచేస్తుండగా తైపే (తైవాన్)లో ఆ విమాన ప్రమా దం జరిగిందని, ప్రమాదంలో నేతాజీ ఉన్నట్లయితే 60 మైళ్ల దూరంలో పనిచేస్తున్న తమ దళానికి వెంటనే సమాచారం తెలి యజేసేవారని చెప్పారు. తద్వారా నేతాజీ అంత్యక్రియలు వెం టనే జరిగివుండేవని పేర్కొన్నారు. జపాన్ నుంచి రష్యాకు వెళ్లిన నేతాజి స్వాతంత్య్రం తరువాత ఉత్తర భారతదేశంలో గుర్తు తెలియని చోట జీవించి మృతిచెందారన్నారు. -
నేతాజీని ఎప్పుడూ అలా చూడలేదట
కోల్ కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ పేరు వింటేనే ప్రతి భారతీయుడి నెత్తురు ఉప్పొంగుతుంది. బ్రిటీష్ ప్రభుత్వం ఎప్పుడూ నేతాజీని యుద్ద నేరస్తుడిగా చూడలేదట. నేతాజీ జీవితానికి సంబంధించి చివరిగా బయటకు వచ్చిన 24 ఫైళ్లు ఈ విషయాన్ని చెబుతున్నాయి. న్యూయార్క్ లోని పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా, విదేశీ వ్యవహారాల శాఖ ఈ ఫైళ్లను సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ వార్ క్రిమినల్స్ అండ్ సెక్యూరిటీ సస్పెక్ట్స్ (సీఆర్ఓడబ్ల్యూసీఏఎస్ఎస్) నుంచి తీసుకున్నట్లు తెలిపింది. ఇందులో ఏప్రిల్ 6, 1999 తేదీతో రాసిన లేఖలో నేతాజీ పేరు యుద్ధ క్రిమినల్స్ లిస్టులో లేదు. దీనిపై మరింతగా విచారణ జరిపేందుకు ఈ ఆధారాలు ఉపయోగపడతాయని నేతాజీ ముని మేనల్లుడు చంద్రబోస్ తెలిపారు. ఇవే నేతాజీకి సంబంధించిన పత్రాలని చెప్పడాన్ని తాను అంగీకరించడం లేదని అన్నారు. ఇవి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి నేషనల్ అఫైర్స్ కు ఇచ్చినవి మాత్రమే కావొచ్చని అన్నారు. ఎటు వెళ్లారో కూడా తెలియని నేతాజీని గుర్తించే కార్యక్రమం ఇంకా తొలి అడుగులోనే ఉన్నట్లు వివరించారు. -
ఢిల్లీలో నేతాజీ స్మృతి చిహ్నం: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకాన్ని నిర్మించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. నేతాజీకి చెందిన మరో 25 పత్రాలను బహిర్గతం చేసిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. 1956-2009 మధ్య కాలానికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన 5 ఫైళ్లు, హోం శాఖకు సంబంధించిన 5 ఫైళ్లు, విదేశాంగ శాఖకు చెందిన 15 ఫైళ్లను బహిర్గతం చేసింది. జపాన్ కూడా 5 ఫైళ్లలో రెండింటిని బహిర్గతం చేసేందుకు అంగీకరించిదని సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. నేతాజీ స్మారకంతో పాటు మ్యూజియం కూడా నిర్మిస్తామని, పనులు మొదలయ్యాయని తెలిపారు. మళ్లీ దర్యాప్తునకు ఆదేశించిన మొరార్జీ 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని గత ప్రభుత్వాలు నిర్ధారించినప్పటికీ.. నేతాజీ మరణంపై మరింత దర్యాప్తు చేయాలని 1977లో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆదేశించినట్లు మహేశ్ శర్మ వెల్లడించారు. -
ఆ ప్రమాదంలో బోస్ చనిపోకపోయి ఉండొచ్చు!
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం.. ఎన్నివిచారణలు జరిగినా, ఎన్నికమిటీలు వేసినా, మరెన్ని నివేదికలు బహిర్గతం చేసినా ఇప్పటికీ అంతుపట్టని ఓ రహస్యం. ఆయన గురించి వార్తా కథనాలు వెలువడినప్పుడల్లా అందులో ఏదో ఉందని తెలుసుకునే ఆసక్తి. నేతాజీ అదృశ్యానికి సంబంధించి ఇటీవల ఎప్పటి నుంచో రహస్యంగా ఉన్న ఫైళ్లను బయటపెట్టిన విషయం తెలిసిందే. 1945 ఆగస్టు 18న ఆయన విమాన ప్రమాదంలో మరణించారని చెబుతున్నా.. తాజాగా బయటపెట్టిన ఫైళ్లు మాత్రం ఆ విషయంపై ఓ స్పష్టతను ఇవ్వలేక తిరిగి పాత ప్రశ్ననే మిగిల్చాయి. ఆ విమాన ప్రమాదం నుంచి నేతాజీ బతికి బయటపడ్డారని అప్పట్లో కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి. 1992నాటి ఒక ఐదు పేజీల నోట్ లో సుభాష్ బతికే ఉన్నట్లుగా వెల్లడించాయి. అలా వెల్లడించిన నోట్ పై ఎలాంటి పేరుగానీ, తేదిగానీ లేదు. అది ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చినట్లుగా ఉంది. నాటి బెంగాల్ గవర్నర్ ఆర్జీ కేసీ కార్యాలయంలో విధులు నిర్వహించే పీసీ ఖర్ అనే ఉద్యోగి చెప్పిన ప్రకారం నేతాజీకి సంబంధించి మూడు పత్రికా కథనాలను(డిసెంబర్ 1945, జనవరి, ఫిబ్రవరి 1946) గవర్నర్ కార్యాలయ పర్యవేక్షణ సిబ్బంది స్వీకరించింది. అందులోని ఒక కథనంలో ' భారత దేశ స్వాతంత్ర్యం కోసం నా గుండె రగులుతోంది. అహింసతో స్వాతంత్ర్యం రానట్లయితే మనం రెండేళ్లలో స్వాతంత్ర్యం తెచ్చుకోవాల్సిందే' నేతాజీ చెప్పినట్లు ఉండగా నేతాజీ మహాత్మాగాంధీ పట్ల గౌరవంతో ఉండేవారని కూడా చెప్పింది. 1946 ఫిబ్రవరి నెలలో వెలువడిన కథనం మాత్రం నేతాజీ భారత మాత గౌరవించదగిన పుత్రుడని తెలిపింది. అలాగే, అసలు విమాన ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లేవని, ఆయన అంత్యక్రియల నివేదిక సర్టిఫికెట్ బోస్ జపాన్ సైన్యంలో ఒక హోదా లేని ఉద్యోగి అని తెలిపిందని, చనిపోయిన వ్యక్తి పుట్టిన తేదికి నేతాజీ పుట్టిన తేదికి అస్సలు పోలికలేదని పేర్కొంది. దీంతోపాటు నేతాజీకి ముస్సోలిని, స్టాలిన్ ఇష్టం అని, అంతేకాకుండా నేతాజీ మంచి భోజన ప్రియుడని, బీఫ్ కూడా తినేవాడని పేర్కొంది. నేతాజీ గొప్ప హిందుత్వ వాదని కూడా నాటి వార్త కథనాలు వెల్లడయ్యాయి. -
గుమ్నామీ బాబా మిస్టరీలో మరో మలుపు
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్య ఘటన మిస్టరీ వీడిందని ఆయన వారసులు భావిస్తున్న తరుణంలో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. చాలా మంది నేతాజీగా భావించిన గుమ్నామీ బాబా అలియాస్ భగవాన్జీకు సంబంధించిన వస్తువుల్లో బోస్ కుటుంబ సభ్యులు ఫొటోలను రెండింటిని కనుగొన్నారు. ఫైజాబాద్ జిల్లా ట్రెజరీలో వీటిని గుర్తించారు. ఓ ఫొటోలో 22 మంది బోస్ కుటుంబ సభ్యులు ఉన్నారు. మరో ఫొటోలో బోస్ తల్లిదండ్రులు ప్రభావతి దేవి, జానకీనాథ్ బోస్ ఉన్నారు. అంతేగాక అజాద్ హింద్ ఫౌజ్ సీనియర్ నాయకులు పవిత్రా మోహన్ రాయ్, సునీల్ కాంత్ గుప్తాలు.. నేతాజీ పుట్టినరోజు (జనవరి 23)న భగవాన్జీకి పంపిన టెలీగ్రామ్లను కూడా గుర్తించారు. గుమ్నామీ బాబా చివరి రోజుల్లో రామ్ భవన్లో గడిపారు. దీని యజమాని శక్తి సింగ్ ఈ విషయాలను వెల్లడించారు. గుమ్నామీ బాబా 1985, సెప్టెంబర్ 16వ తేదీన మరణించారు. కాగా నేతాజీ జీవితానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన రహస్య పత్రాల ప్రకారం.. 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించినట్టు వెల్లడైంది. -
పాక్ ఆటగాళ్లకు ఘనస్వాగతం
కోల్‌కతా: కొన్ని రోజులుగా కొనసాగిన అనిశ్చితి వీడడంతో టి20 ప్రపంచకప్‌లో ఆడేందుకు పాకిస్తాన్ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. 27 మందితో కూడిన పాక్ క్రికెట్ బృందం అబుదాబి ద్వారా శనివారం రాత్రి స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. భారత్‌లో భద్రతాపరమైన ఇబ్బందులున్నాయని ఆరోపించడంతో పాక్ ఆటగాళ్లను రెండు బస్సుల ద్వారా కట్టుదిట్టమైన సెక్యూరిటీతో వారు బస చేసే హోటల్‌కు తరలించారు. వందలాది సీఐఎస్ఎఫ్ సిబ్బందితో పాటు బ్లాక్ కమెండోస్ రక్షణగా ఉన్నారు. అయితే విమానాశ్రయం నుంచి వెలుపలికి వచ్చిన పాక్ క్రికెటర్లకు భారత అభిమానుల నుంచి అద్భుత స్వాగతమే లభించింది. ఆఫ్రిది బృందాన్ని చప్పట్లతో స్వాగతించగా ఆటగాళ్లు కూడా వారికి చేతులూపుతూ వెళ్లారు. సోమవారం ఈ జట్టు శ్రీలంకతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. -
మమతపై నేతాజీ మనవడి పోటీ
భవానీపూర్ నుంచి చంద్రకుమార్‌ను బరిలోకి దించిన బీజేపీ న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగనున్నాయి. భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్న సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీతో బీజేపీ అభ్యర్థిగా స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ మనవడైన చంద్రకుమార్ బోస్ తలపడనున్నారు. మమతపై తమ అభ్యర్థిగా 55 ఏళ్ల చంద్రకుమార్ పోటీ చేస్తారని కేంద్రమంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో చెప్పారు. బెంగాల్ ఎన్నికల కోసం 52 మంది, అస్సాం ఎన్నికల కోసం 88 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా విడుదల చేసింది. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ.. ‘బెంగాల్ ప్రజలు మార్పు కోసం 2011లో తృణమూల్‌ను గెలిపించారు. అయితే మార్పు రాలేదు. బీజేపీ మాత్రమే మార్పు తెస్తుంది’ అని అన్నారు. మీరు గెలిచే అవకాశముందా అని విలేకర్లు అడగ్గా, ఇది వ్యక్తిగత పోటీ కాదని, ప్రజల అంశమని అన్నారు. చంద్రకుమార్ నేతాజీ అన్న అయిన శరత్చంద్ర బోస్ మనవడు. ఆయన ఈ ఏడాది జనవరి 25న బీజేపీలో చేరారు. కాగా, ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఎం పొత్తు అనైతికమని, దానికి ఆ పార్టీల కార్యకర్తలు మద్దతిస్తారా? అని మమత ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నల్లధనం చలామణి, ఓటర్లకు అక్రమ తాయిలాలపై కన్నేయడానికి ఎన్నికల సంఘం ఆదాయపన్ను శాఖ నుంచి 30 మంది ఐఆర్ఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. -
నేతాజీ 'రహస్యం' పెద్ద జోకా?
న్యూఢిల్లీ: 'సాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ సుభాష్ చంద్రబోస్ విదేశాల్లో అంతర్థానమయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన రహస్యాలు వెలుగులోకి వస్తే పలు దేశాలతో మనకున్న దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతింటాయి' అని చిన్నప్పటి నుంచి స్కూల్, కాలేజీల్లో చదువుకున్నాం. నాటి జవహర్ లాల్ ప్రభుత్వం నుంచి నేటి మోదీ సర్కార్ దాకా అందరికి అందరూ ఇదే విషయాన్ని చెబుతూవచ్చారు. కాలం సమీపించడంతో నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బహిర్గతం చేసింది. అయితే ముందునుంచీ భయపడ్డట్లు దీనిపై ఇటు రష్యాగానీ, అటు జపాన్ గానీ ఒక్కమాటైనా మాట్లాడలేదు. వాళ్లతో భారత్ సంబంధాలు తెగిపోనూలేదు. అంటే ఇన్నాళ్లూ నేతాజీ విషయంలో ప్రభుత్వాలు చెప్పినవన్నీ అబద్ధాలా? నేతాజీ అంతర్థానం, దాని వెనకున్న రహస్యం పెద్ద జోకా?' అంటూ పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదీశారు బిజూ జనతాదళ్(బీజేడీ) ఎంపీ బతృహరి మహతాబ్. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాధాలు చెప్పే తీర్మానంలో భాగంగా శుక్రవారం లోక్ సభలో మాట్లాడిన ఎంపీ మహతాబ్.. నేతాజీ అంతర్థానం, రహస్య ఫైళ్ల వెల్లడిలో ప్రభుత్వాలు అనుసరించిన తీరును ఘాటుగా విమర్శించారు. విడతల వారీగా ప్రభుత్వం వెల్లడిస్తోన్న రహస్య ఫైళ్లలో కొత్త విషయాలేవీ లేవని, అందులో ఉన్నదంతా దేశప్రజలకు ఇదివరకే తెలుసునని, గొప్ప యోధుడి విషయంలో ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవపట్టించడం దారుణమని మహతాబ్ అన్నారు. అటల్ బిహారీ ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పాటుచేసిన ఎం కె ముఖర్జీ కమిషన్ నివేదికను ప్రస్తావిస్తూ.. నేతాజీ అంతర్థానం అయ్యారని భావిస్తున్న ప్రాంతంలో విమాన ప్రమాదమేదీ జరగలేదని ఆ కమిటీ పేర్కొందని, మిగతా ఫైళ్లు మాత్రం ప్రమాదం జరిగిందని నివేదించడం గమనార్హమన్న ఆయన.. ఇప్పటికైనా ఈ విషయంలో అన్ని విషయాలు వెల్లడైనట్టా? లేక ఇంకేవైనా రహస్యాలను ప్రభుత్వం దాచిపెడుతోందా? అని ప్రశ్నించారు. లోక్ సభలో మాట్లాడుతున్న బీజేడీ ఎంపీ బతృహరి మహతాబ్. -
నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష!
లండన్: జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ అస్థికలకు డీఎన్ఏ టెస్టు జరపాలని.. సుభాష్ చంద్రబోస్ చివరి రోజుల్లో జరిగిన పరిణామాలపై పరిశోధనలు చేస్తున్న బోస్‌ఫైల్స్.కామ్ అనే వెబ్సైట్ డిమాండ్ చేసింది. 1945, ఆగస్టు 18నలో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మృతిచెందారని.. అంత్యక్రియల తర్వాత ఆయన అస్థికలను టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని ఇటీవలే భారత ప్రభుత్వం విడుదల చేసిన రహస్యాల్లో వెల్లడైంది. అయితే దీన్ని విభేదిస్తున్నవాళ్లూ ఉండటంతో.. నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష జరిపితే అంతా తేలిపోతుందని బోస్‌ఫైల్స్.కామ్ కోరింది. 1995లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే.. డీఎన్ఏ పరీక్ష కోసం భారత ప్రభుత్వం అనుమతివ్వాలంటూ.. ఈ వెబ్సైట్ సృష్టికర్త నేతాజీ మునిమనవడు ఆశిశ్ రాయ్ రాసిన లేఖను కూడా ఈ వెబ్సైట్ పోస్టు చేసింది. -
నేతాజీ చితాభస్మం టోక్యోకు ఎలా వెళ్లిందంటే..
లలండన్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ తైవాన్‌లో విమాన ప్రమాదంలో చనిపోయినట్టు డాక్యుమెంట్లు బయటపెట్టిన బోస్‌ఫైల్స్. ఇన్ఫో వెబ్సైట్.. ఆయన చితాభస్మం తైపీ నుంచి టోక్యోలోని రెంకోజీ ఆలయానికి వెళ్లిన క్రమాన్ని సోమవారం వెల్లడించింది. 1945 ఆగస్టు 22 నేతాజీ అంత్యక్రియలు జరగ్గా మరుసటి రోజు ఆయన సహాయకుడు కల్నల్ రెహ్మన్, జపాన్ ఆర్మీ అధికారి మేజర్ నగటోమోల, జపాన్ దుబాసీ నకమురాలు చితాభస్మాన్ని తైవాన్‌లోని నిషి హాంగాజీ ఆలయానికి తీసుకెళ్లారు. తర్వాత విమానంలో తైపీ నుంచి విమానంలో జపాన్ తీసుకెళ్లారు. జపాన్ ఆర్మీ అధికారి చితాభస్మం ఉన్న ప్యాకెట్‌తో ఫుకువోకాకు, తర్వాత రైల్లో టోక్యో చేరుకున్నారు. తొలుత ఆర్మీ ఇంపీరియల్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంచారు. మరుసటి రోజు జపాన్‌లోని ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ చీఫ్ రామమూర్తి, ఎస్ ఏ అయ్యర్(నేతాజీ ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వ మంత్రి) టోక్యో చేరుకున్నారు. చితాభస్మాన్ని మూర్తి ఇంటికి తీసుకెళ్లారు. 1945, సెప్టెంబర్‌లో బహుశా 18వ తేదీన చితాభస్మాన్ని ఊరేగింపుగా రెంకోజీ ఆలయానికి తీసుకెళ్లారు. -
23న మరో పాతిక 'నేతాజీ' ఫైళ్ల విడుదల
న్యూఢిల్లీ: స్వాతంత్ర్యసమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్థానానికి సంబంధించిన ఫైళ్ల వెల్లడిలో కేంద్ర ప్రభుత్వం విపరీతధోరణి ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. తన దగ్గరున్న అన్ని రహస్య ఫైళ్లను బహిర్గంతం చేస్తానని ఇదివరకే ప్రకటించిన కేంద్రం.. ఆ పనిని ఒకే విడతలోకాకుండా నెలకో పాతిక ఫైళ్ల చొప్పున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. మే లే దా జూన్ లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫైళ్ల విడుదల వ్యవహారం లబ్ధి కోసమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి మనీశ్ శర్మ ఆదివారం ఢిల్లీలో మాట్లాడుతూ ఈ నెలలో నేతాజీకి సంబంధించిన మరో 25 ఫైళ్లు బహిర్గతం చేయనున్నట్లు, అందుకు ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు పేర్కొన్నారు. అయితే జనవరి 23న తొలిదఫా రహస్య ఫైళ్ల విడుదల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తదుపరి ఫైళ్లను నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా(ఎన్ఏఐ) విడుదల చేస్తుందని చెప్పారు. కాగా, ఆ ప్రకటనకు విరుద్ధంగా ప్రభుత్వమే ఫైళ్లను బహిర్గతం చేస్తానని ముందుకురావడం గమనార్హం. ప్రభుత్వం తన వద్ద ఉన్న 100 రహస్య ఫైళ్లను నాలుగు దఫాలుగా.. ప్రతినెలా 23వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకుని జనవరి 23న ఢిల్లీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ రహస్యఫైళ్లను జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. 16 వేల పైచిలుకు పేజీలున్న ఆ ఫైళ్లను డిజిటల్ రూపంలోనూ భద్రపరిచింది నేషనల్ ఆర్కైవ్స్ సంస్థ. భారత ప్రభుత్వం, ఇతర దేశాలు వెల్లడంచిన సమాచారాన్ని బట్టి 1945 ఆగస్ట్ 18న తైపీలో జరిగిన విమానప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించినట్లు నిర్ధారణ అయింది. -
'ఆజాద్ హింద్ ఫౌజ్' జవాన్ ఇకలేరు!
కోటవురట్ల (విశాఖపట్టణం): దేశమాత దాస్య శృంఖాలు తెంపేందుకు అలుపు ఎరుగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు మద్దిల గంగాధరరావు ఇక లేరు. నిండు నూరేళ్ల జీవితాన్ని జీవించిన ఆయన (101) మంగళవారం కన్నుమూశారు. విశాఖ జిల్లా కోటవురట్ల శివారు రాట్నాలపాలెంలో 1915లో జన్మించిన ఆయన దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. 1937లో కటక్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన 'ఆజాద్ హింద్‌ఫౌజ్'లో సైనికుడిగా పనిచేశారు. అనంతరం అహ్మదాబాద్‌లో మిలటరీలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. స్వాతంత్య్రానంతరం చైనా, పాకిస్థాన్లతో జరిగిన యుద్ధాల్లోనూ తన సేవలందించారు. 1967, 1971లలో రాష్ట్రపతి అవార్డులతో సహా మొత్తం 11 పురస్కారాలు అందుకున్నారు. 1974లో ఉద్యోగ విరమణ చేశారు. అల్లూరి సీతారామరాజుతో కూడా ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష చేయండి
బోస్ కుమార్తె అనిత న్యూఢిల్లీ: జపాన్‌లోని టోక్యో రెంకోజీ ఆలయం లో ఉన్న నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని ఆయన కుమార్తె అనితబోస్ కోరారు. తద్వారా ఆ అస్థికలు తన తండ్రివో కాదో తేలుతుందన్నారు. తైపీలోని తైహోకు విమానాశ్రయం సమీపంలో 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని తానూ నమ్ముతున్నానన్నారు. జర్మనీలో ఉంటున్న ఆమె వచ్చే నెల భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, అప్పుడు డీఎన్ఏ పరీక్ష గురించి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తానని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో అనిత వెల్లడించారు. -
నేతజీ రహస్య పత్రాలు బహిర్గతం
-
నెహ్రూ లేఖపై మళ్లీ రాజుకున్న వివాదం
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ మాజీ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీకి భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1945, డిసెంబర్ 26వ తేదీన రాసినట్టుగా ప్రచారం జరుగుతున్న ఓ లేఖపై మళ్లీ వివాదం రాజుకుంది. అందులో బోస్‌ను బ్రిటిష్ యుద్ధ నేరస్థుడిగా నెహ్రూ పేర్కొనడం పట్ల రభస జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన వంద ఫైళ్లను నరేంద్ర మోదీ ప్రభుత్వం శనివారం బయటపెట్టిన నేపథ్యంలో మళ్లీ నెహ్రూ వివాదాస్పద లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఈ లేఖ పూర్తిగా నకిలీదని, ఎవరో దురుద్దేశంతోనే సోషల్ మీడియాలో ఈ లేఖను ప్రచారం చేస్తున్నారని, వారందరిని వెతికి పట్టుకొని తగిన శిక్ష పడేలా చూస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ హెచ్చరించారు. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత బ్రిటన్ రూపొందించిన ‘యుద్ధ నేరస్థుల’ జాబితాలో సుభాష్ చంద్ర బోస్ పేరు లేదనే విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ, రక్షణ శాఖ 2001లో భారత్‌కు స్పష్టం చేసిన విషయం తెల్సిందేనని శర్మ వ్యాఖ్యానించారు. ఈ రోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం బోస్‌కు సంబంధించి విడుదల చేసిన వంద ఫైళ్లలో నెహ్రూ రాసినట్టుగా ప్రచారం అవుతున్న లేఖ, లేకపోవడం గమనార్హం అని చెప్పారు. అయినా ఈ దశలో మోదీ ప్రభుత్వం బోస్‌కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేవలం మోదీ ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ఫైళ్లను బయటపెట్టిందని విమర్శించారు. బోస్‌ను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ స్వాతంత్య్ర యోధుడిగానే గుర్తిస్తుందని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని అన్నారు. వాస్తవానికి బీజేపీకిగానీ, దాని సంఘ్ పరివార్కుగానీ భారత స్వాతంత్య్ర పోరాటంతో ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘డియర్ మిస్టర్ అట్లీ, మీ యుద్ధ నేరస్థుడు, సుభాష్ చంద్ర బోస్ రష్యా దేశంలోకి ప్రవేశించేందుకు స్టాలిన్ అనుమతించారనే విషయం నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెల్సింది. బ్రిటిష్, అమెరికన్లకు మిత్ర దేశాంగా ఉంటున్న రష్యా, బోస్‌ను తమ దేశంలోకి అనుమతించడం రష్యన్ల విశ్వాసాలను దెబ్బతీయడమేకాదు, మోసం చేయడం కూడా....ఇట్లు జవహర్లాల్ నెహ్రూ’ అని నెహ్రూ లేఖ రాసినట్లు ప్రచారం జరగుతోంది. -
నేతాజీ అస్తికలు తెచ్చేందుకు కేంద్రం నో!!
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలు జపాన్ రాజధాని టోక్యోలోని ఓ బౌద్ధ ఆలయంలో ఉన్నప్పటికీ వాటిని స్వదేశానికి తిరిగి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విముఖత చూపిస్తూ వచ్చింది. నేతాజీ అస్తికలు భారత్‌కు తీసుకువస్తే దేశంలో రాజకీయ దుమారం చెలరేగే అవకాశముంటుందనే భయంతోనే ప్రభుత్వం ఇందుకు సాహసించడం లేదని 1970 నాటి ఓ పత్రం వెల్లడించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి సందర్భంగా ఆయన అదృశ్యానికి సంబంధించిన 100 వర్గీకృత పత్రాలను ప్రధాని నరేంద్రమోదీ బహిర్గత పరిచారు. ఇందులో కేంద్ర హోంశాఖకు సంబంధించిన పత్రంలో నేతాజీ అస్తికల గురించి సమాచారముంది. టోక్యోలోని రెంకోజి ఆలయంలో ప్రధాన పూజారి అధీనంలో ఉన్న బోస్ అస్తికలను స్వదేశానికి తరలించాలని అక్కడి భారత రాయబార కార్యాలయం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో సమన్వయంగా వ్యవహరించినప్పటికీ పెద్దగా పురోగతి మాత్రం సాధ్యపడలేదు. చాలామంది అధికారులు బోస్ అస్తికలను భారత్‌కు తీసుకురావాలని ప్రతిపాదించారని 200 పేజీలున్న ఈ పత్రం తెలిపింది. అయితే కేంద్రం మాత్రం ఇందుకు సుముఖత చూపలేదు. 1945 ఆగస్టులో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించలేదని భావిస్తున్న నేతాజీ కుటుంబసభ్యులు, కొన్ని వర్గాల ప్రజలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించే అవకాశముండటం ఇందుకు కారణమని 1976లో విదేశాంగ శాఖ ఉత్తర, తూర్పు ఆసియా జాయింట్ సెక్రటరీ ఎన్ఎన్ ఝా ఈ పత్రంలో పేర్కొన్నారు. ఆ సమయంలో దేశంలో ఎమర్జెన్సీ పాలనలో ఉంది. -
రహస్య పత్రాలు వెల్లడి.. ఉద్వేగంతో కుటుంబ సభ్యులు
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. భారత స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్ర బోస్ జీవితానికి సంబంధించిన రహస్య ఫైళ్లను శనివారం బహిర్గతం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన నేతాజీ ఫైళ్లను డిజిటల్ రూపంలో విడుదల చేశారు. నేతాజీ 119వ జయంతి సందర్భంగా ప్రధాని ఆయనకు ఘన నివాళులర్పించారు. బోస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం బోస్ కుటుంబ సభ్యులను ప్రధాని పలకరించారు. ఢిల్లీలోని నేషనల్ ఆర్కైస్ మ్యూజియంలో జరిగిన ఈ కార్యక్రమానికి నేతాజీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పైళ్లను విడుదల చేసిన అనంతరం కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. అటు పశ్చిమబెంగాల్ లో బీజేపీ సంబరాలు చేసింది. కోలకతాలో బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కాగా రహస్య ఫైళ్ల ను బహిర్గతం చేయడం ద్వారా నేతాజీ మరణానికి సంబంధించిన కొన్ని అంశాలు బయటపడే అవకాశాలున్నాయని దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. -
నేతాజీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
-
నేడు నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయనున్న మోదీ
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన రహస్య ఫైళ్లను శనివారం బహిర్గతం చేయనున్నారు. బోస్ జయంతి సందర్భంగా ఈ రోజు నేతాజీ కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ 100 డిజిటల్ కాపీలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బోస్ కుటుంబ సభ్యులు 20 మంది పాల్గొంటారు. నేతాజీ జయంతిని పురష్కరించుకుని పార్లమెంట్ వద్ద జరిగే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అనంతరం నేతాజీ ఫైళ్లను విడుదల చేస్తారు. గత అక్టోబర్‌లో నేతాజీ కుటుంబ సభ్యులను కలిసిన సందర్భంగా నేతాజీ రహస్య ఫైళ్లను వెల్లడిస్తామని ప్రధాని వారికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మమతా బెనర్జి నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల నేతాజీకి సంబంధించిన 64 రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. నేతాజీ విమాన ప్రమాదంలో మృతిచెందినట్లు తాజాగా వెల్లడైన పత్రాలు చెబుతున్నాయి. బోస్ మిస్టరీ ఛేదించేందుకు ఏర్పాటు చేసిన వెబ్సైట్ బోస్‌ఫైల్స్.ఇన్ఫో వీటిని బయటపెట్టింది. నేతాజీ తైపీలో 1945 ఆగస్టు 18వ తేదీన జరిగిన విమాన ప్రమాదం తర్వాత అదే రోజు నగర శివారులోని ఆస్పత్రిలో చనిపోయినట్లు ఇవి చెబుతున్నాయి. -
బహిర్గతం కానున్న రహస్య పత్రాలు
-
నేతాజీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, జాతీయ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్ట్ 18న విమాన ప్రమాదంలో చనిపోయారనే విషయాన్ని నమ్ముతున్నట్లు ఆయన కుమార్తె అనితా బోస్ (73) ప్రకటించారు. స్వాతంత్ర్య పూర్వమే ప్రపంచవ్యాప్తంగా ఎంతో బలమైన నాయకుడిగా ఎదిగిన తన తండ్రి నేతాజీ భారత్ తిరిగొస్తే, నెహ్రూకు మంచి బలమైన ప్రత్యామ్నాయంగా మారి ఉండేవారని ఆమె వ్యాఖ్యానించారు. జపాన్‌లోని రెంకోజీ దేవాలయంలో ఉంచిన నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అనితా బోస్ డిమాండ్ చేశారు. బోస్ 119వ జయంతి సందర్భంగా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాని ప్రయత్నాల పట్ల అనితా బోస్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ మిస్టరీకి ఇప్పటికైనా ముగింపు పడుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. తండ్రికి సంబంధించి ప్రత్యేక జ్ఞపకాలేవీ లేకపోయినప్పటికీ, ఆయన గొప్పదనం గురించి తల్లి ఎపుడూ చెబుతూ ఉండేవారన్నారు. భారతదేశం స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తి అని అనితా బోస్ కొనియాడారు. కొన్ని సమస్యలపై నెహ్రుకు, తన తండ్రికి అభిప్రాయాలు ఒకేలా ఉన్నా, విబేధాలు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యంగా మత ఘర్షణలు, మతాధిపత్యం లేని రాజకీయ వ్యవస్థను ఇద్దరూ అభిలాషించారని తెలిపారు. అలాగే పారిశ్రామికీకరణను ఇద్దరూ కోరుకున్నా, పాకిస్తాన్ విషయంలో మాత్రం చాలా తేడాలున్నాయని ఆమె చెప్పారు. బోస్ బతికుంటే రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించేవారని, నెహ్రూకు ప్రత్యామ్నాయంగా కచ్చితంగా ఉండేవారని వ్యాఖ్యానించారు. పొరుగుదేశం పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగ్గా ఉండేలా ప్రయత్నించి, విజయం సాధించి వుండేవారని తెలిపారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన ఒక వ్యక్తి, దేశానికి, రాజకీయాలకు, తన కుటుంబానికి సంబంధం లేకుండా ఒక బాబాగా ఎక్కడో పర్వతాల్లో బతికి ఉంటారనే విషయాన్ని ఎలా నమ్ముతామని అనితా బోస్ ప్రశ్నించారు. ఆయన బతికుంటే అందరికీ సంతోషమే కానీ, పర్వతాల్లో గుమనామి బాబా సంచరిస్తున్నారంటూ మతి లేని ప్రచారం చేయడం నేతాజీ ప్రతిష్టకే భంగకరమన్నారు. అలాగే దేశం కోసం జీవితాన్ని అర్పించిన వ్యక్తి మరణం వివాదాస్పద కావడం బాధ కలిగించిందన్నారు. దేశ ప్రజలు తన తండ్రిని ఆ వివాదం ద్వారా గుర్తు పట్టడం విచారించాల్సిన విషయమని అనితా బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో భారత్, జపాన్ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలన్నారు. ప్రత్యేక నిపుణులతో అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. దశాబ్దాలుగా ఇంత అగౌరవమైన చర్చ జరుగుతున్నా జపాన్ ఈ నిజాలను బయట పెట్టకపోవడం ఆ దేశానికే అవమానకరమని చురకలంటించారు. కాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి భారత ప్రభుత్వం వద్ద ఉన్న కొన్ని రహస్య పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బోస్ 119వ జయంతి సందర్భంగా ఈ నెల 23వ తేదీన (శనివారం) బహిర్గతం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జరిగే కార్యక్రమానికి బోస్ కుటుంబ సభ్యులు, కొందరు నాయకులు హాజరవుతారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ గురువారం తెలిపారు. ఈ నేపథ్యంలో నేతాజీ కుమార్తె అనిత వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరి కొద్దిగంటల్లో ప్రభుత్వం వివరాలు బయటపెట్టనున్న తరుణంలో ఏడు దశాబ్దాలుగా ఉత్కంఠను రాజేసిన మిస్టరీకి ఇక తెరపడనుందా.. వేచి చూడాల్సిందే. -
మారుపేరుతో అంత్యక్రియలు!
* 1945 ఆగస్టు 22న తైపీలో నేతాజీ భౌతికకాయానికి దహనసంస్కారం * ఇచిరో ఒకురా అనే పేరుతో మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చిన జపాన్ * నాటి తైపీ అధికారి సాక్ష్యం ఇచ్చిన పత్రాలు విడుదల చేసిన బోస్‌ఫైల్స్ వెబ్సైట్ లండన్: నేతాజీ సుభాష్‌చంద్రబోస్ చివరి రోజుల వివరాలను క్రోడీకరించేందుకు ఏర్పాటు చేసిన బ్రిటన్ వెబ్సైట్ బోస్‌ఫైల్స్. ఇన్ఫో.. నేతాజీ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తాను ఏర్పాట్లు చేసినట్లు చెప్తూ తైవాన్ అధికారి ఒకరు ఇచ్చిన సాక్ష్యాన్ని విడుదల చేసింది. దాని ప్రకారం.. నేతాజీ భౌతికకాయానికి 1945 ఆగస్టు 22వ తేదీన తైవాన్ రాజధాని తైపీ నగరంలో ‘ఇచిరో ఒకురా’ అనే పేరు రిజిస్టరు చేసి అంత్యక్రియలు నిర్వహించారు. భారత స్వాతంత్య్ర పోరాటయోధుడు బోస్.. 1945 ఆగస్టు 18వ తేదీన తైపీ శివార్లలోని ఒక వైమానిక కేంద్రంలో విమానప్రమాదంలో చనిపోయినట్లు పలు విచారణ నివేదికలను ఉటంకిస్తూ ఈ వెబ్సైట్ కొన్ని పత్రాలను బహిరంగ పరచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విడుదల చేస్తున్న చివరి పత్రాల్లో భాగంగా.. బ్రిటన్ విదేశాంగ కార్యాలయంలో.. ఎఫ్‌సీ1852/6 ఫైల్ నంబరుతో ఉన్న తైవాన్ అధికారి సాక్ష్యం పత్రాన్ని తాజాగా వెబ్సైట్లో ప్రచురించింది. 1956 సంవత్సరానికి చెందిన ఈ పత్రం ప్రకారం.. 1945 ఆగస్టు 22వ తేదీన బోస్ అంత్యక్రియలు జరిగాయని.. నాడు తైపీ నగరంలో అంత్యక్రియల అనుమతులను జారీ చేసే అధికారి టాన్ టి-టి సాక్ష్యం ఇచ్చారు. అయితే.. అంతకుముందు రోజు అంటే 1945 ఆగస్టు 21వ తేదీన ఇచిరో ఒకురా అనే పేరుతో ఉన్న మరణ ధ్రువీకరణ పత్రాన్ని.. బోస్ భౌతికకాయంతో పాటు వచ్చిన జపాన్ సైనికాధికారి ఒకరు తైపీ అధికారులకు సమర్పించారు. మరుసటి రోజు ఆగస్టు 22వ తేదీన.. భౌతికకాయంతో వచ్చిన సదరు జపాన్ అధికారి.. అది భారత నాయకుడు (కమాండర్) బోస్‌దని, ఆయన ఒక ముఖ్యమైన పని మీద టోక్యో వెళుతుండగా విమాన ప్రమాదానికి గురై గాయపడ్డట్లు చెప్పారని టి-టి వాంగ్మూలం ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సైనిక మృతుల బంధువులు అందుబాటులో లేనపుడు సైనిక ఆస్పత్రి ఇచ్చే మరణ ధ్రువీకరణ పత్రం ఆధారంగా అంత్యక్రియలకు అనుమతి ఇవ్వటం జరిగేదని తైవాన్ ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. ఈమేరకు.. ఇచిరో ఒకురా అనే పేరును మునిసిపల్ హెల్త్ సెంటర్ రిజిస్టరులో నమోదు చేసి బోస్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు భావిస్తున్నారు. ఆగస్టు 22వ తేదీన జపాన్ అధికారి, ఒక భారతీయుడితో కలిసి కారులో ఒక శవపేటికలో భౌతికకాయంతో వచ్చారని టి-టి పేర్కొన్నారు. ఆ శవపేటికను టోక్యోకు తీసుకువెళ్లాలనేది తొలుత ఉద్దేశం కాగా.. అప్పటికి అంత పెద్ద పెట్టె పట్టే విమానాలు లేకపోవటంతో భౌతికకాయానికి తైపీలోనే అంత్యక్రియలు నిర్వహించినట్లు వివరించాడు. సదరు జపాన్ సైనికాధికారితో పాటు వచ్చిన భారతీయుడు బోస్ సహాయకుడు కల్నల్ హబీబుర్ రెహ్మాన్గా భావిస్తున్నారు. అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజు.. అంటే ఆగస్టు 23వ తేదీన జపాన్ సైనికాధికారి, రెహ్మాన్‌లు ఇద్దరూ వచ్చి బోస్ అస్తికలను తీసుకెళ్లినట్లు టి-టి చెప్పారు. బోస్‌తో పాటు విమానప్రమాదంలో గాయపడి ప్రాణాలతో బయటపడ్డ కల్నల్ రెహ్మాన్ 1945 ఆగస్టు 24న ఇచ్చిన సాక్ష్యం కూడా ఇలాగే ఉంది. జపాన్ సైనికాధికారుల ఏర్పాట్లతో బోస్ భౌతికకాయానికి తైహోకు (తైపీకి జపాన్ భాషలో పేరు)లో 1945 ఆగస్టు 22న అంత్యక్రియలు నిర్వహించటం జరిగిందని, ఆ మరుసటి రోజు అస్తికలను తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. బోస్‌ఫైల్స్ విడుదల చేసిన పత్రాలు విశ్వసనీయమైనవేనని తాను భావిస్తున్నట్లు నేతాజీ కుమార్తె ప్రొఫెసర్ అనితా ఫాఫ్ పేర్కొన్నారు. రేపు భారత రహస్య పత్రాల విడుదల... న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి భారత ప్రభుత్వం వద్ద ఉన్న కొన్ని రహస్య పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బోస్ జన్మదినమైన ఈ నెల 23వ తేదీన (శనివారం) బహిర్గతం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జరిగే కార్యక్రమానికి బోస్ కుటుంబ సభ్యులు, కొందరు నాయకులు హాజరవుతారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ గురువారం తెలిపారు. -
నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయనున్న మోదీ
న్యూ ఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన రహస్య ఫైళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిర్గతం చేయనున్నారు. జనవరి 23న బోస్ జయంతి సందర్భంగా ప్రధాని ఈ రహాస్య ఫైళ్లను వెల్లడించనున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ గురువారం ప్రకటించారు. నేతాజీ కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది నేతల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. గత అక్టోబర్‌లో నేతాజీ కుటుంబ సభ్యులను కలిసిన సందర్భంగా నేతాజీ రహస్య ఫైళ్లను వెల్లడిస్తామని ప్రధాని వారికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మమతా బెనర్జి నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల నేతాజీకి సంబంధించిన 64 రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. అయితే ప్రధాని బహిర్గతం చేయనున్న సమాచారంలో నేతాజీ అదృష్యానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
‘నేతాజీ పత్రాలన్నింటినీ బయటపెట్టాలి’
కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, ఆయన అదృశ్యం వెనుక గల రహస్యాలకు సంబంధించిన పత్రాలను కేంద్రం వెంటనే బయటపెట్టాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బయటపెట్టిన పత్రాల్లో కొత్త విషయాలేవీ లేవని, వీటి కంటే స్వతంత్ర సంస్థలు చేసిన పరిశోధనల్లో ఎక్కువ సమాచారం ఉందని లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్ బోస్ ఆదివారం పేర్కొన్నారు. నేతాజీ జన్మదినమైన జనవరి 23న దేశ్‌ప్రేమ్ దివస్‌గా జరుపుతామని తెలిపారు. -
గాయాలతోనే చనిపోయారు!
* నేతాజీ మృతిపై తాజా పత్రాల వెల్లడి * ఐదుగురు సాక్షుల కథనాలు * స్వతంత్ర పోరాటాన్ని సాగించాలని బోస్ చివరి సందేశం లండన్: స్వాతంత్య్ర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో అయిన గాయాలతోనే మృతిచెందినట్లు తాజాగా వెల్లడైన పత్రాలు చెబుతున్నాయి. ఆయన సన్నిహితుడు సహా ఐదుగురు సాక్షులు చెప్పిన వివరాలు దీన్ని ధ్రువీకరిస్తున్నట్టు పత్రాల ద్వారా తెలుస్తోంది. బోస్ మిస్టరీ ఛేదించేందుకు ఏర్పాటు చేసిన వెబ్సైట్ బోస్‌ఫైల్స్.ఇన్ఫో వీటిని బయటపెట్టింది. నేతాజీ సన్నిహితుడు కల్నల్ హబీబుర్ రెమ్మాన్ ఖాన్, ఇద్దరు జపాన్ డాక్టర్లు, ఒక దుబాసీ, ఒక తైవాన్ నర్సు సాక్ష్యాలు వీటిలో ఉన్నాయి. నేతాజీ తైపీలో 1945 ఆగస్టు 18వ తేదీన జరిగిన విమాన ప్రమాదం తర్వాత అదే రోజు నగర శివారులోని ఆస్పత్రిలో చనిపోయినట్లు ఇవి చెబుతున్నాయి. వీటి మధ్య తేడాలు కూడా లేవు. కడదాకా పోరాడాను.. ప్రమాదంలో నేతాజీతోపాటు గాయపడిన ఆయన సహచరుడు హబీబుర్.. ప్రమాదం జరిగాక ఆరు రోజుల తర్వాత సాక్ష్యం ఇచ్చారు. అంతిమ క్షణాల్లో బోస్ ఇచ్చిన సందేశాన్ని తెలిపారు. ‘‘తను చనిపోతున్నానని బోస్ నాతో చెప్పారు. దేశప్రజలకు తన సందేశాన్ని అందివ్వమన్నారు. ‘భారత స్వాతంత్య్రం కోసం కడదాకా పోరాడాను. అందుకోసమే ఇప్పుడు ప్రాణత్యాగం చేస్తున్నాను. దేశప్రజలారా! స్వాతంత్య్ర పోరు కొనసాగించండి. త్వరలోనే భారత్‌కు స్వాతంత్య్రం వస్తుంది. ఆజాద్ హింద్ వర్ధిల్లాలి’ అని సందేశమిచ్చారు’’ అని వెల్లడించారు. చనిపోయారని టెలిగ్రాం.. 1945 సెప్టెంబర్‌లో జేజీ ఫిగెస్ తదితర నిఘా అధికారులతో కూడిన రెండు భారత బృందాలు బ్యాంకాక్, సైగాన్, తైపీ వెళ్లాయి. బోస్ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు ధ్రువీకరించాయి. ‘టీ(నేతాజీ) టోక్యో వెళ్తుండగా ఆగస్టు 18న మధ్యాహ్నం 2 గంటలకు విమాన ప్రమాదం జరిగింది. ఆయన గాయాలతో ఆ రోజు అర్ధరాత్రి చనిపోయారు’ అని 1945 ఆగస్టు 20వ తేదీతో వచ్చిన టెలిగ్రామ్‌ను ఆ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. బోస్ నెలకొల్పిన ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియాతో సంప్రదింపుల కోసం జపాన్ ఆర్మీ తను ఏర్పాటు చేసిన సంస్థ(హికారీ కికాన్)కు దీన్ని పంపింది. బ్రిటన్ అధికారి ఫిగెస్.. 1946 మే-జూలైల మధ్య టోక్యోలో ఆరుగురు జపాన్ అధికారులను విచారించారు. ప్రమాదం తర్వాత నాన్మోన్ సైనిక ఆస్పత్రిలో నేతాజీ చికిత్స పొందుతున్నప్పుడు అక్కడున్న డాక్టర్ సురుటా తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రంతా నా పక్కనే కూర్చుంటారా అని బోస్.. సురుటాను అడిగారు. అయితే రాత్రి 7 గంటలకు ఆరోగ్యం క్షీణించింది. ఆర్మీ డాక్టర్, ఆస్పత్రి అధికారి యోషిమి మళ్లీ ఒక కర్పూర ఇంజెక్షన్ ఇచ్చారు. బోస్ కోమాలోకి వెళ్లి చనిపోయారు. నేతాజీకి చికిత్స అందించిన సాన్ పీ షా అనే నర్సు కూడా 1946లో ముంబై నుంచి వెళ్లిన హరీన్ షా అనే జర్నలిస్టుకు ఈ వివరాలు చెప్పింది. ‘బోస్ స్పృహలోకి వచ్చినప్పుడల్లా దాహం అనే వారు. కాస్త మూలుగుతూ నీరు కావాలనేవారు’ అని తెలిపింది. ఆస్పత్రి వార్డులలో నైరుతి మూలకు తీసుకెళ్లి బోస్ అక్కడే చనిపోయారంది. యోషిమి1946లో నేతాజీ మరణంపై బ్రిటిష్ అధికారులకు సాక్ష్యమిచ్చారు. ‘బోస్ గాయాలను నూనెలతో శుభ్రం చేశాను. ఒళ్లంతా తీవ్రగాయాలతో, తలపై అత్యంత తీవ్రగాయాలతో బాధపడ్డారు. తలపై గుర్తుపట్టడానికేమీ లేదు. నకమురా అనే దుబాసీని పిలిపించాం. తను బోస్‌తో చాలాసార్లు మాట్లాడానని నకమురా చెప్పారు. తర్వాత(ఆస్పత్రిలో చేరిన4 గంటల తర్వాత) బోస్ అపస్మారకంలోకి పోతున్నట్లు కనిపించింది. ఆయన కోమాలో ఏదో గొణుక్కున్నారు. కానీ స్పృహ రాలేదు. రాత్రి 11 గంటలకు చనిపోయారు’ అని యోషిమి తెలిపారు. ఆయన 1956లో నేతాజీ విచారణ కమిటీ ముందు, 1974లో ఖోస్లా కమిటీ ముందూ హాజరయ్యారు. ఆయన 1995లో బోస్‌ఫైల్స్.ఇన్ఫో బెబ్‌సైట్ వ్యవస్థాపకుడైన ఆశిష్ రేకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ననోమియా అనే సైన్యాధికారి.. బోస్ ముఖ్యమైన వ్యక్తి. ఏమైనా సరే బతికించాలి అని నాతో చెప్పారు. అందువల్లే బోస్ ఎవరో నాకు తెలిసింది’ అని వెల్లడించారు. ‘నా తలలోకి రక్తం పోటెత్తుతోంది. కాసేపు నిద్రపోతా’ అని నేతాజీ చెప్పారన్నారు. నకమురా విచారణ కమిటీ ముందు సాక్ష్యమిస్తూ.. ‘నేతాజీ నోట్లోంచి నొప్పి మాటే వినిపించలేదు. ఆయన నిబ్బరం చూసి ఆశ్చర్యపోయాం. నేతాజీ చనిపోయాక గదిలోని జపాన్ అధికారులు వరుసగా నిల్చుని ఆయన భౌతికకాయానికి వందనం చేశారు’ అని తెలిపారు. రష్యా కోణంలో దర్యాప్తు జరపాలి: మమతా బెనర్జీ కోల్‌కతా: నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు తాను నమ్మడం లేదని, ఆయన అదృశ్యం వెనక రష్యా కోణంలో దర్యాప్తు జరిపించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఆయనకు సంబంధించిన ఫైళ్లు రష్యాలో చాలా ఉన్నాయని వెల్లడించారు. మహాత్ముడు జాతిపిత అయితే నేతాజీ జాతి నేత అని శనివారమిక్కడ అన్నారు. -
యూకే వెబ్సైట్ సంచలన ప్రకటన
లండన్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయాడంటూ అమెరికాకు చెందిన ఓ వెబ్ సైట్ సంచలన ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలను వెల్లండించింది. భారత స్వాతంత్ర్య సమరయోధుడు బోస్ తైవాన్ విమాన ప్రమాదంలోమరణించారని నిక్కచ్చిగా తేల్చి చెబుతోంది. తమ ప్రకటనకు మద్దతుగా నేతాజీ సన్నిహిత సహచరుడు, ఇద్దరు జపాన్ వైద్యులు, నర్స్ ఒక జర్నలిస్టు, ఇలా అయిదుగురి సాక్షులను అధికారికంగా ప్రకటించింది. దీంతో నేతాజీ డెత్ మిస్టరీపై మరింత చర్చకు తెరలేచింది. భారత జాతీయ సైన్యం యొక్క స్థాపకుడైన బోస్ 1945 ఆగస్టు 18 న మరణించాడని ధృవీకరిస్తోంది. విమానం ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అదే రోజు అర్ధరాత్రి మరణించారంటోంది. దీంతో పాటు నేతాజీ చనిపోతూ భారత ప్రజలకు ఒక సందేశానిచ్చినట్టుగా పేర్కొంది. ఆనాటి విమాన ప్రమాదంనుంచి ప్రాణాలతో బైటపడిన బోస్ అంగరక్షకుడు , కల్నల్ హబాబుర్ రెహమాన్ 1 945 ఆగస్టు 24న ఒక ప్రకటన చేశారంటోంది. అది నేతాజీ చివరి మాటలతో కూడిన ప్రకటన అని పేర్కొంది. "తన మరణానికి ముందు ఆయన (బోస్) తన ముగింపు సమీపంలో ఒక సందేశాన్ని ఇచ్చారు. తాను భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న క్రమంలో తన ప్రాణాలనుకూడా ధారపోస్తున్నాని చెప్పారు. భారతదేశ ప్రజలు తమ స్వాతంత్ర్యం పోరాటం కొనసాగించాలని ఆకాంక్షించారు. లాంగ్ లివ్ ఆజాద్ హింద్ అంటూ కన్నుమూశారని కల్నల్ ప్రకటించాడంటోంది. 1945 సెప్టెంబర్‌లో ఫిన్నె , డేవిస్ ల ఆధ్వర్యంలో భారతదేశ రెండు ఇంటిలిజెన్స్ బృందాలు బ్యాంకాంక్ , సైగాన్, తాయ్ పే లలో పర్యటించి విచారించాయంటోంది. అనంతరం విమానం ప్రమాదంలో బోస్ మరణించినట్టుగా ఒక అంచనాకు వచ్చారని తెలిపింది. దీంతోపాటుగా నేతాజీకి చికిత్సచేసిన ఇద్దరు డాక్టర్లు, నర్సు అందించిన వివరాలను ఉటంకింస్తోంది. ఈ కేసులో పరిశోధనకు వెళ్లిన ముంబై జర్నలిస్టు హరీన్ షా కు బోస్‌కు చికిత్స అందించిన నర్స్ చెప్పిన వివరాలను ఈ వెబ్సైట్లో ప్రచురించారు. -
'నేతాజీ మంటల్లో కాలిపోవటం చూశా'
నేతాజీతో కలిసి విమానంలో ప్రయాణించిన ఆయన ముఖ్య అనుచరుడు కల్నల్ హబీబ్ ఉర్ రహమాన్ వాగ్మూలం: 'పెద్ద శబ్ధంతో ప్రొఫెల్లర్.. ఆ వెంటనే విమానం నేల కూలి మంటలు చెలరేగాయి. ముందువైపు డోర్లన్నీ బిగుసుకుపోవటంతో 'నేతాజీ.. వెనుకవైపు మార్గమొక్కటే మిగిలింది మనకు' అన్నాన్నేను. వేరే దారిలేక ఇద్దరమూ మంటల్లో నడుస్తూ బయటికొచ్చాం. నేను వేసుకున్నవి ఉన్ని దుస్తులు కావటం వల్ల తీవ్రంగా కాలిపోలేదు. బయటికొచ్చి నేతాజీని చూద్దునుకదా.. నడుస్తున్న మంటలా ఉన్నారాయన. దుస్తులు, వెంట్రుకలు, శరీరంలో కొన్ని భాగాలు కాలిపోయాయి. నేతాజీ ఖాదీ దుస్తులు వేసుకోవటం వల్ల మంటలు త్వరగా అంటుకున్నాయని అర్థమైంది. వెంటనే నేతాజీ దగ్గరికెళ్లి ఆయన్ను కింద పడుకోబెట్టి నడుముకున్న బెల్ట్ ను విప్పే ప్రయత్నం చేశా. అప్పుడు గమనించా.. నేతాజీ తలకు ఎడమవైపు పెద్ద గాయమైంది. ఆ స్థితిలోనూ నేతాజీ.. 'నీకేం ప్రమాదం లేదు కదా, మనవాళ్లు ఎలా ఉన్నారు?' అని వాకబుచేశారు. జపనీస్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ మేజర్ టారో కానో వాగ్మూలం: 'బోస్ బృందం ప్రయాణించడం కంటే రెండు రోజుల ముందే బాంబర్ విమానం ఎడమ ఇంజన్ లో లోపం ఉన్నట్లనిపించడంతో పరీక్షించా. ఆ తర్వాత అది బాగానే పనిచేస్తోదని నిర్ధారించుకున్నా. ఎందుకైనా మంచిదని ఇంజనీర్ చేతా కూడా ఓసారి పరీక్ష చేయించా. అతనుకూడా ఇంజన్ పర్ ఫెక్ట్ గా ఉందన్నాడు' టోరెన్స్ ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ ఇంజనీర్ కెప్టెన్ నకామురా అలియాస్ యమామొటో వివరణ: 'బాంబర్ విమానం ఎడమ ఇంజన్ లో లోపం ఉన్నట్లనిపించింది. అదే విషయం పైటల్(మేజర్ టకిజవా) తో చెబితే ఓ ఐదు నిమిషాలపాటు దానికి మరమ్మతులు చేశాడు. బోస్ బృందం విమానం ఎక్కకముందు రెండు సార్లు టెస్ట్ ఫ్లై కూడా చేశాడు. అంతా సిద్ధంగా ఉందనుకున్న తర్వాతే విమానం టోక్యోకు బయలుదేరింది. నేను ఎయిర్ బేస్ లో నిలబడి విమానాన్నే చూస్తున్నా.. టేకాఫ్ తీసుకుని బహుషా 100 మీటర్లు వెళ్లిందోలేదో.. విమానం ఒక్కసారిగా ఎడమవైపునకు తిరిగి, నేలరాలుతున్నట్లు అనిపించింది. విమానం గాలిలో ఉండగానే ప్రొఫెల్లర్ ఊడిపడటం చూశా. కాంక్రీట్ రన్ వేకు దూరంగా విమానం కుప్పకూలి మంటలు చెలరేగిన దృశ్యాలు కనిపించాయి. వెంటనే మేం అటువైపు పరెగుపెట్టాం' షానవాజ్ ఖాన్ కమిటీ నివేది: 'ఇండియన్ నేషనల్ ఆర్మీ చీఫ్ సుభాష్ చంద్రబోస్, జపాన్ సైన్యానికి చెందిన లెప్టినెట్ జనరల్ సునామసా, సైనికులు, పైలట్, సిబ్బంది అంతా కలిపి 13 మంది ఆ రోజు ఉదయమే జపనీస్ ఎయిర్ పోర్స్ కు చెందిన బాంబర్ లోకి ప్రవేశించారు. టొరెన్స్(వియత్నాం) నుంచి హౌతో, తైపీ మీదుగా టోక్యో వెళ్లటం వారి ఉద్దేశం. అప్పుడు వాతావరణం సాధారణంగా ఉంది. విమానం ఇంజన్ లోనూ ఎలాటి లోపాలు లేవు. దీంతో హౌతోలో దిగకుండా నేరుగా తైపీకే వెళ్దామని నిర్ధారించాడు పైలట్. టోక్యోకు చేరుకోవాలనే తొందరలో బోస్, మిగతవాళ్లుకూడా అందుకు సరేనన్నారు ప్రమాదం జరిగిన తర్వాత.. విమాన ప్రమాదాన్ని గుర్తించిన ఎయిర్ బేస్ సిబ్బంది ఆంబులెన్స్ లతోసహా ఘటనా స్థలికి చేరుకున్నారు. నేతాజీ సహా విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అందర్నీ సమీపంలోని నన్మూన్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరేసమయానికి బోస్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఈ సంఘటన గురించి తెలియగానే ఇండియాలోని బ్రిటిష్ అధికారులు ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులను వియత్నాంకు పంపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆ ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులు ఆసుపత్రిలో బోస్ పరిస్థితి గురించి బ్రిటిష్ పాలకులకు సమాచారం అందించారు. వెలుగులోకి తెచ్చిన బ్రిటిష్ వెబ్ సైట్.. నేతాజీ మరణించినట్లుగా భావిస్తున్న రోజు (ఆగస్టు 18, 1945)న అసలేం జరిగిందనేది ప్రత్యక్ష సాక్షుల వాగ్మూలం ఆధారంగా రూపొందించిన పత్రాల్ని బ్రిటన్ కు చెందిన బోస్ ఫైల్స్ ఇన్ఫో అనే వెబ్ సైట్ శనివారం విడుదల చేసింది. వీటిలో షాజవాజ్ ఖాన్ కమిటీ (నేతాజీ అంతర్ధానంపై 1956లో భారత్ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ) రిపోర్టుతోపాటు మరో ముగ్గురు ప్రత్యక్ష సాక్షుల వాగ్మూలాలను వెబ్ సైట్ బయలుపర్చింది. వాగ్మూలం ఇచ్చిన వారిలో ఒకరు నేతాజీ అనుచరుడు హబీబ్ ఉర్ రహమాన్ కాగా, మిగతా ఇద్దరు ఎయిర్ స్టాఫ్ అధికారి, సహ ప్రయాణికుడు. తర్వాత ఏం జరిగింది? బోస్ ఆసుపత్రిలో కోలుకున్నారా? లేక పరమపదించారా? ఆయన్ని చూడటానికి ఇండియా నుంచి ఎవరైనా వెళ్లారా? అసలు ఆసుపత్రిలో ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం జనవరి 16 వరకు నిరీక్షించాలి. అదే రోజున బోస్ ఫైళ్లకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది www.bosefiles.info వెబ్ సైట్. -
నేతాజీ శిష్యుడు అమీర్ హంస కన్నుమూత
నేతాజీ సుభాష్ చంద్రబోస్ శిష్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఎంకేఎం. అమీర్ హంస ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. ఈ విషయాన్ని మనిదనేయ మక్కల్ కట్చి అధ్యక్షుడు ఎంహెచ్.జవాహరుల్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో నేతాజీ ప్రధాన అనుచరుడిగా బ్రిటీష్ దొరలకు ప్రాణాలు ఎదురొడ్డి నిలిచి పోరాడిన తన జీవితాన్ని, ఆర్థిక వనరులను దేశానికి అంకితం చేశాడని పేర్కొన్నారు. అమీర్ హంస అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
'1945, ఆ తర్వాత బోస్ రష్యా వెళ్లారా?'!
లండన్: భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు సుభాష్ చంద్రబోస్ అదృశ్యం, మరణంపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నెలాఖరులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యాలో పర్యటిస్తారని భావిస్తున్న నేపథ్యంలో నేతాజీ విషయమై భారత్-రష్యా మధ్య కొనసాగిన లేఖలను బోస్ మనవడు ఆశిష్ రాయ్ లండన్‌లో విడుదల చేశారు. నేతాజీకి సంబంధించి భారత ప్రభుత్వం వర్గీకరించిన పత్రాల్లో ఈ లేఖలు ఉన్నాయని ఆయన తెలిపారు. 1954లో నేతాజీ ఎక్కడున్నాడనే విషయమై 1991లో, 1995లో భారత్-రష్యా ప్రభుత్వాల మధ్య కొనసాగిన సంప్రదింపుల వివరాలు ఈ పత్రాల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. రికార్డుల ప్రకారం చూసుకుంటే 1945లోనే సుభాష్ చంద్రబోస్ చనిపోయినట్టు భావిస్తున్నారు. అయితే 1945 లేదా ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆయన రష్యాలోకి ప్రవేశించారా? అంటూ భారత్ ప్రభుత్వం ఆ దేశాన్ని ఆరాతీసింది. నేతాజీ రష్యాకు ఎప్పుడైనా వచ్చారా, అక్కడ నివసించారా అన్న విషయాలు తెలియజేయాలని కోరుతూ రష్యా ఫెడరేషన్‌కు 1991 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం లేఖ రాసింది. దీనికి 1992 జనవరిలో రష్యా ప్రత్యుత్తరమిస్తూ భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన సుభాష్ చంద్రబోస్ తమ దేశంలో కొన్నిరోజులు ఉన్నట్టు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. మరో మూడేళ్ల తర్వాత మరోసారి కూడా భారత ప్రభుత్వం రష్యాకు లేఖ రాసింది. 1945, ఆ తర్వాత ఎప్పుడైనా నేతాజీ సోవియట్ యూనియన్ కు వచ్చారా, అక్కడ కొంతకాలం ఉన్నారా అన్నది పురాతత్వ, చారిత్రక విభాగాలను సమన్వయం చేసుకొని కచ్చితంగా నిర్ధారించాలని భారత్ కోరింది. అయినా రష్యా తన పాత సమాధానాన్నే పునరావృతం చేసింది. రెండు ప్రభుత్వాల మధ్య కొనసాగిన ఈ లేఖలు కొందరు అనుకుంటున్నట్టు నేతాజీ ముందే నిష్క్రమించలేదని స్పష్టం చేస్తున్నాయని ఆశిష్ రాయ్ పేర్కొన్నారు. 1945 ఆగస్టు 18న తైవాన్‌లోని తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయినట్టు చెప్తున్నారు. అయితే భారత్‌లో ఈ వాదనను చాలామంది విశ్వసించడం లేదు. ఆ తేదీన విమాన ప్రమాదం జరిగితే.. అందుకు ఆధారాలు చూపించాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నేతాజీ అదృశ్యంపై మిస్టరీని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికార రహస్య పత్రాల వర్గీకరణ చేపట్టాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. -
జనవరి నుంచి ఫైళ్లు బహిర్గతం
నేతాజీ కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ హామీ * జనవరి 23 బోస్ జయంతి నుంచి ఒక్కో రహస్యం బట్టబయలు * చరిత్రను అణచిపెట్టాల్సిన అవసరం లేదు * నన్ను మీ కుటుంబ సభ్యుడిగా చూడండి న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి ఏడు దశాబ్దాలుగా అణచివేతకు గురైన రహస్యాలు బట్టబయలు కానున్నాయి. 1945 ఆగస్టు 18న అకస్మాత్తుగా నేతాజీ అదృశ్యమైన ఘటన వెనుక దాగిఉన్న అతి రహస్యమేదో జాతికి వెల్లడి కానుంది. 2016 జనవరి 23 నుంచి నేతాజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక్కో రహస్యఫైలును బయటపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అధికారికంగా ప్రకటించారు. సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి చెందిన 35 మంది సభ్యులు ప్రధానితో ఆయన అధికార నివాసం 7, రేస్‌కోర్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, చరిత్రను అణచిపెట్టి ఉంచాల్సిన అవసరం ఇక ఎంతమాత్రం లేదని అన్నారు. నేతాజీకి సంబంధించి విదేశాల్లో ఉన్న ఫైళ్లను కూడా బహిర్గతం చేయాల్సిందిగా ఆయా దేశాల ప్రభుత్వాలను కోరతామని మోదీ తెలిపారు. ఈ మేరకు వివిధ దేశాల ప్రభుత్వాలకు తాను వ్యక్తిగతంగా లేఖలు రాయటమే కాకుండా.. ఆయా దేశాధినేతలతో జరిగే సమావేశాల్లో ప్రత్యేకంగా కోరనున్నట్లు మోదీ చెప్పారు. డిసెంబర్లో రష్యా నేతలతో సమావేశమయ్యే సందర్భంలో బోస్ ఫైళ్లను బహిర్గతం చేయాలని కోరతానన్నారు. 2016 జనవరి 23 నేతాజీ జయంతి సందర్భంగా ఆయన రహస్యాల వెల్లడి ప్రక్రియ ప్రారంభమవుతుందని మోదీ స్పష్టం చేశారు. బోస్ కుటుంబ సభ్యులతో దాదాపు గంటసేపు ప్రధాని సమావేశమయ్యారు. ‘‘చరిత్రను అణచివేయాల్సిన అవసరం లేనే లేదు. చరిత్రను మరచిపోయే దేశాలు చరిత్రను సృష్టించలేవు’’ అని బోస్ కుటుంబంతో భేటీ అనంతరం మోదీ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. తనను వారి కుటుంబ సభ్యుడిగానే పరిగణించాలని నేతాజీ కుటుంబాన్ని కోరినట్లు మోదీ మరో ట్వీట్లో తెలిపారు. నేతాజీ కుటుంబానికి తన నివాసంలో ఆతిథ్యమివ్వటం గొప్ప గౌరవమని పేర్కొన్నారు. 2014 జూన్‌లో మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత బోస్ రహస్యాలు బయటపెట్టాలన్న డిమాండ్లు పెరిగిన సంగతి తెలిసిందే. మోదీ ముందు దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ కూడా బోస్ ఫైళ్లను బహిర్గత పరచటానికి నిరాకరిస్తూ వచ్చాయి. అలా చేస్తే వివిధ దేశాలతో భారత్ సంబంధాలు దెబ్బతింటాయని కూడా వాదిస్తూ వచ్చాయి. మోదీ ప్రభుత్వం కూడా గత ఆగస్టు వరకూ ఇదే వాదన వినిపించింది. అదే సమయంలో నేతాజీ కుటుంబ సభ్యులు కేంద్రం దగ్గర ఉన్న ఫైళ్లను కూడా బహిర్గత పరచాలన్న స్వరాన్ని పెంచుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గత నెల(సెప్టెంబర్ 18న) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజల ముందుంచింది. ఆ తరువాత రెండు రోజులకే(సెప్టెంబర్ 20) ప్రధాని మోదీ తన నెలవారీ మన్‌కీ బాత్ కార్యక్రమంలో తాను అక్టోబర్‌లో నేతాజీ కుటుంబ సభ్యులను కలుస్తున్నట్లుగా ప్రకటించారు. బుధవారం నేతాజీ కుటుంబసభ్యులతో భేటీలో రహస్య ఫైళ్ల విడుదలపై మోదీ స్పష్టతనిచ్చారు. ఈ భేటీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నేతాజీకి సంబంధించిన ఫైళ్లతో పాటు విదేశీ ప్రభుత్వాల దగ్గర ఉన్న ఫైళ్లను కూడా ప్రపంచం ముందుంచేలా చొరవ తీసుకోవాలని బోస్ కుటుంబసభ్యులు మోదీని కోరినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తన ఆలోచనలు, తన ప్రభుత్వ ఆలోచనలతో నేతాజీ కుటుంబ సభ్యుల ఆలోచనలు కూడా కలుస్తున్నాయని మోదీ అన్నారని పేర్కొంది. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నేతాజీని గుర్తుచేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని మోదీ అన్నారని ఆ ప్రకటనలో తెలిపారు. కుటుంబం హర్షం.. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన రహస్యాలను బయటపెట్టాలన్న ప్రధాని ప్రకటనపై బోస్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భారతదేశానికి ఈరోజే అసలైన స్వాతంత్య్రం సిద్ధించిన రోజని నేతాజీ మునిమనుమడు చంద్రకుమార్ బోస్ అన్నారు. వచ్చే ఏడాది జనవరి 23నుంచి బోస్ అదృశ్య రహస్యాలను ఆవిష్కరిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారని ఆయన తెలిపారు. అంతకుముందున్న ప్రభుత్వాలు వీటిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే.. ప్రధాని మోదీ ఈ రహస్యాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చంద్రకుమార్ ప్రశంసించారు. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా మోదీ చొరవను అభినందించారు. -
మోదీతో భేటీకానున్న నేతాజీ వారసులు
-
'మేం బయటపెడతాం.. కానీ టైం కావాలి'
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వివరాలకు సంబంధించి తమవద్ద ఉన్న ఫైళ్లు బహిర్గతం చేసేందుకు మరింత గడువుకావాలని బ్రిటన్ కోరింది. ఈ విషయాన్ని బోస్ కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. 1945 తర్వాత బోస్ కనిపించకపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ బోస్‌కు సంబంధించిన వివరాలతో ఉన్న దస్త్రాలు అన్నింటిని బయటపెట్టాలని ఇటీవల బోస్ కుటుంబ సభ్యులు బ్రిటన్ అధికారులను కలిశారు. 'మా సోదరి మాధురి బోస్ బ్రిటన్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. దానికి వారు పలు విధాలుగా బదులిచ్చారు. అయితే, ఫైళ్లను బహిర్గతం చేసే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కోరారు' అని నేతాజీ ముని మేనల్లుడు సూర్య కుమార్ బోస్ తెలిపారు. గత కొద్ది రోజులుగా నేతాజీ అకస్మికంగా కనిపించకపోవడం వెనుక ఉన్న రహస్యాలను చేదించేందుకు రష్యా, జపాన్, అమెరికాలోని బోస్‌కు చెందిన పైళ్లను బయటపెట్టాల్సిందిగా కోరుతున్న విషయం తెలిసిందే. -
శాస్త్రి మృతికి బోస్ అంశం కారణమా?
కోల్‌కతా: మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బోస్ అదృశ్యానికి సంబంధించిన మరిన్ని ఫైళ్లను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవలే బహిర్గతం చేయగా.. రష్యాలోని తాష్కెంట్లో మృతి చెందిన లాల్ బహదూర్ శాస్త్రి మృతిపై ప్రభుత్వం సిద్ధంచేసిన ఫైళ్లను బయటపెట్టాలని ఆయన కుమారులు బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. నేతాజీ కుటుంబానికి చెందిన చంద్రకుమార్ బోస్ సోషల్ మీడియా ఫేస్బుక్లో కొన్ని మిస్టరీ అంశాలను పోస్ట్ చేశారు. ఈ తాజా పరిణామాలను బట్టి చూస్తే శాస్త్రి మరణానికి నేతాజీ అదృశ్యం కారణమా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 1966 జనవరిలో రష్యా పర్యటనకు వెళ్లే ఒక నెల ముందు(డిసెంబర్ 23న) శాస్త్రిని కోల్కోతాలో తన తండ్రి అమియనాథ్ బోస్ కలిసినట్లు పేర్కొన్నారు. తన రష్యా పర్యటనలో నేతాజీ ఆ దేశంలో ఉన్నాడేమో తెలుసుకుంటానని శాస్త్రి ఆ భేటీలో అమియానాథ్కు చెప్పినట్లు వెల్లడించారు. అంతేగాక దేశం గర్వించదగ్గ వ్యక్తి అని, దేశ ప్రధానులందరిలోనూ లాల్ బహదూర్ శాస్త్రి చాలా గొప్పవాడంటూ కొనియాడారు. అయితే తన ఫేస్బుక్ ఖాతాలో శాస్త్రి మృతి, నేతాజీ అదృశ్యం అంశాలపై చంద్రకుమార్ బోస్ పోస్ట్ చేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నట్లు కనిపిస్తోంది. -
మరిన్ని నేతాజీ ఫైళ్లు బహిర్గతం
కోల్‌కతా: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్య ఘటనకు సంబంధించి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మరిన్ని ఫైళ్లను బహిర్గతం చేసింది. సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ వివరాలను వెల్లడించారు. నేతాజీకి సంబంధించి 1937- 47 మధ్య జరిగిన బెంగాల్ రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లోని అంశాలను బహిర్గతం చేశారు. నేతాజీకి సంబంధించిన ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం కూడా బహిర్గతం చేయాలని మమతా బెనర్జీ కోరారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇటీవల నేతాజీకి సంబంధించిన 64 పైళ్లను బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. కోల్ కతాలోని పోలీసు మ్యూజియంలో వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఫైళ్లతోపాటు కొన్ని డీవీడీలు కూడా బయటపెట్టిన ఆ రాష్ట్ర హోంశాఖ డీవీడీలను నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేసింది. ఈ ఫైళ్లలో మొత్తం 12,744 పేజీలు ఉన్నాయి. ఈ ఫైళ్ల ప్రకారం నేతాజీ 1948లో చైనాలో బతికున్నట్టు తెలుస్తోంది. చైనాలోని మంచూరియాలో ప్రాంతంలో ఉన్నట్టు వెల్లడైంది. కాగా 1945 ఆగస్టు 22న విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్టు టోక్యో రేడియో ప్రకటించింది. అయితే ఈ వార్తను బోస్ అనుచరులు ఖండించారు. అప్పటి నుంచి నేతాజీ మరణం, అదృశ్యం మిస్టరీగా మారింది. -
గుమ్నామీ బాబాగా నేతాజీ బోస్?
(స్కూల్ ఎడిషన్) లక్నో: భారత స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్, స్వాతంత్య్రానంతరం ఎక్కడున్నారు ? ఆయన తన జీవిత చరమాంకంలో ఎక్కడ గడిపారు, ఎలా గడిపారు? అన్న అంశంపై పలు ఆసక్తికరమైన కథనాలు, ఊహాగానాలు నేటికి ప్రచారంలో ఉన్న విషయం తెల్సిందే. ఆయన గుమ్నామీ బాబా అలియాస్ భగవాన్‌జీగా ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో గడిపారన్నది అందులో ఓ కథనం. గుమ్నామీ బాబా 1985, సెప్టెంబర్ 16వ తేదీన మరణించారు. ఆయనే మారువేషంలో ఉన్న సుభాస్ చంద్రబోస్ అని అప్పట్లో ‘నయా లోగ్’ అనే స్థానిక పత్రిక మొదటి పేజీలో ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. అవును, ఆయన నేతాజీనేనంటూ బాబా అనుచరులు కూడా విస్తృత ప్రచారం చేశారు. ఎందుకంటే, గుమ్నామీ బాబా భక్తుల ముందుకుగానీ, అనుచరుల ముందుకుగానీ ఎప్పుడు వచ్చే వారు కాదు. తెర వెనక ఉండే మాట్లాడేవారు. పైగా ఆయన చనిపోయినప్పుడు ఆయన వద్ద నేతాజీ రాసిన కొన్ని పుస్తకాలు దొరికాయి. ఈ ప్రచారాన్ని దాదాపు మూడు దశాబ్దాల పాటు, అంటే, 2006 సంవత్సరం వరకు కూడా ప్రజలు నమ్ముతూ వచ్చారు. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని, ఇది పూర్తిగా అబద్ధమని 2006లో జస్టిస్ ముఖర్జీ కమిషన్ తేల్చింది. కమిషన్ కావాలనే అలా తేల్చింద ంటూ ఆ ప్రచారాన్ని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్లు ఉన్నారు. అజ్ఙాతవాసంలో బోస్? ‘ఫైజాబాద్ మే అజ్ఞాత్‌వాస్ కర్ రహే సుభాస్ చంద్రబోస్ నహీ రహే’ శీర్షికతో అశోక్ టాండన్ సంపాదకత్వంలో 1985, అక్టోబర్ 28వ తేదీన ‘నయా లోగ్’ పత్రిక ఒక కథనం ప్రచురించింది. జర్నలిస్టులు రామ్తీర్థ్ వికల్, చంద్రేశ్ కుమార్ శ్రీవాత్సవ్‌లు ఆ కథనాన్ని రాశారు. బోస్ 12 సంవత్సరాల పాటు ఫైజాబాద్‌లో అజ్ఞాతవాసంలో బతికారని, చివరకు సెప్టెంబర్ 16వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని మొదటి పేరాలో పేర్కొన్నారు. అప్పుడు ఈ వార్త సంచలనం సష్టించింది. అయితే తన వార్తా కథనానికి ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది ఆ పత్రిక. బాబా అనుచరుల కథనం ప్రకారం అని మాత్రమే పేర్కొంది. అప్పుడు ఈ కథనాన్ని పోటీ పత్రిక ‘జన్‌మోర్చా’ ఖండించింది. అప్పుడు రెండు పత్రికల్లో మధ్య బాబానే బోస్ అంటూ, కాదంటూ పోటాపోటీ వరుస కథనాలు వెలువడ్డాయి. నయా లోగ్ వార్తా కథనం తప్పని రుజువు చేయడం కోసం జన్‌మోర్చా పత్రిక బోస్ బంధువులు, మిత్రుల ఇంటర్వ్యూలను కూడా ప్రచురించింది. జస్టిస్ ముఖర్జీ కమిటీ నియామకం.. కుటుంబ సభ్యుల నుంచే కాకుండా దేశంలోని పలు వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు కేంద్ర ప్రభుత్వం 1999లో బోస్ మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరపడానికి జస్టిస్ ముఖర్జీ కమిషన్‌ను నియమించింది. నయాలోగ్ కథనంలో వాస్తవం ఎంతుందో తెలుసుకునేందుకు జస్టిస్ ముఖర్జీ కమిషన్ ఇటు గుమ్నామీ బాబా చేతిరాత ప్రతులను, అటు బోస్ చేతిరాత ప్రతులను సేకరించి సిమ్లా, కోల్‌కతాలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలకు పంపించింది. అలాగే చేతిరాత నిపుణుడు బీ లాల్ వద్దకూ పంపించింది. రెండు రాత ప్రతులకు మధ్య ఎలాంటి సామీప్యత లేదని ఆ పరీక్షల్లో తేలిపోయింది. అయినప్పటికీ మరింత రూఢీ చేసుకునేందుకు గుమ్నామీ బాబా పంటి నుంచి డీఎన్ఏను సేకరించి, బోస్ తండ్రివైపు, తల్లివైపు వారి నుంచి రక్తాన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలు జరిపారు. ఆ పరీక్షల్లో కూడా గుమ్నామీ బాబా, బోస్ ఒక్కరు కాదని తేలిపోయింది. జన్‌మోర్చా నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకే నయాలోగ్ పత్రిక ఇలాంటి ప్రచారాన్ని తీసుకొచ్చిందనే విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఈ కథనాన్ని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్లు ఉండడం గమనార్హం. -
‘నేతాజీ చైనాలో ఉన్నారు!’
కోల్‌కతా: ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నారని, చైనాలోని మంచూరియాలో ఎక్కడో ఉన్నారని నేతాజీ విశ్వసనీయ అనుయాయి దేవ్నాథ్ దాస్ చెబుతున్నారు. దేవ్నాథ్.. నేతాజీ ప్రారంభించిన ఐఎన్ఏ మాజీ నేత. ప్రస్తుతం కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు’ అన్న సమాచారం ఉన్న పత్రమొకటి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బహిర్గతపర్చిన ఫైళ్లలో ఉంది. 1948, ఆగస్ట్ 9 నాటి ఆ ఫైల్లో దేవ్నాథ్ సహా ఐఎన్ఏ నేతలకు సంబంధించి నిఘావిభాగం సేకరించిన సమాచారం ఉంది. ‘జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను నేతాజీ నిశితంగా గమనిస్తున్నారని, భారత్‌కు మిత్ర, శత్రుదేశాలేవని అధ్యయనం చేస్తున్నారని దేవ్నాథ్ నేతాజీ అభిమానులతో చెబుతున్నారు’ అని అందులో పేర్కొన్నారు. కాగా, నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయాలంటూ కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాశ్రేయో వ్యాజ్యాన్ని సోమవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. -
బోస్... అంతుచిక్కని రహస్యం!
లక్నో: భారత స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్, స్వాతంత్య్రానంతరం ఎక్కడున్నారు ? ఆయన తన జీవిత చరమాంకంలో ఎక్కడ గడిపారు, ఎలా గడిపారు? అన్న అంశంపై పలు ఆసక్తికరమైన కథనాలు, ఊహాగానాలు నేటికి ప్రచారంలో ఉన్న విషయం తెల్సిందే. ఆయన గుమ్నామీ బాబా అలియాస్ భగవాన్‌జీగా ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో గడిపారన్నది అందులో ఓ కథనం. గుమ్నామీ బాబా 1985, సెప్టెంబర్ 16వ తేదీన మరణించారు. ఆయనే మారువేషంలో ఉన్న సుభాస్ చంద్రబోస్ అని అప్పట్లో ‘నయా లోగ్’ అనే స్థానిక పత్రిక మొదటి పేజీలో ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. అవును, ఆయన నేతాజీనేనంటూ బాబా అనుచరులు కూడా విస్తృత ప్రచారం చేశారు. ఎందుకంటే, గుమ్నామీ బాబా భక్తుల ముందుకుగానీ, అనుచరుల ముందుకుగానీ ఎప్పుడు వచ్చే వారు కాదు. తెర వెనక ఉండే మాట్లాడేవారు. పైగా ఆయన చనిపోయినప్పుడు ఆయన వద్ద నేతాజీ రాసిన కొన్ని పుస్తకాలు దొరికాయి.ఈ ప్రచారాన్ని దాదాపు మూడు దశాబ్దాల పాటు, అంటే, 2006 సంవత్సరం వరకు కూడా ప్రజలు నమ్ముతూ వచ్చారు. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని, ఇది పూర్తిగా అబద్ధమని 2006లో జస్టిస్ ముఖర్జీ కమిషన్ తేల్చింది. కమిషన్ కావాలనే అలా తేల్చిందంటూ ఆ ప్రచారాన్ని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్లు ఉన్నారు. జర్నలిస్టులు రామ్తీర్థ్ వికల్, చంద్రేశ్ కుమార్ శ్రీవాత్సవ్‌లు 1985, అక్టోబర్ 28వ తేదీన ఆ కథనాన్ని రాశారు. ‘ఫైజాబాద్ మే అజ్ఞాత్‌వాస్ కర్ రహే సుభాస్ చంద్రబోస్ నహీ రహే’ శీర్షికతో ఆ వార్తను అశోక్ టాండన్ సంపాదకత్వంలో ‘నయా లోగ్’ పత్రిక ప్రచురించింది. బోస్ 12 సంవత్సరాల పాటు ఫైజాబాద్‌లో అజ్ఞాతవాసంలో బతికారని, చివరకు సెప్టెంబర్ 16వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని మొదటి పేరాలో పేర్కొన్నారు. అప్పుడు ఈ వార్త సంచలనం సృష్టించింది. అయితే తన వార్తా కథనానికి ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది. బాబా అనుచరుల కథనం ప్రకారం అని మాత్రమే పేర్కొంది. అప్పుడు ఈ కథనాన్ని పోటీ పత్రిక ‘జన్‌మోర్చా’ ఖండించింది. అప్పుడు రెండు పత్రికల్లో మధ్య బాబానే బోస్ అంటూ, కాదంటూ పోటాపోటీ వరుస కథనాలు వెలువడ్డాయి. నయా లోగ్ వార్తా కథనం తప్పని రుజువు చేయడం కోసం జన్‌మోర్చా పత్రిక బోస్ బంధు, మిత్రుల ఇంటర్వ్యూలను కూడా ప్రచురించింది. కుటుంబ సభ్యుల నుంచే కాకుండా దేశంలోని పలు వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు కేంద్ర ప్రభుత్వం 1999లో బోస్ మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరపడానికి జస్టిస్ ముఖర్జీ కమిషన్‌ను నియమించింది. నయాలోగ్ కథనంలో వాస్తవం ఎంతుందో తెలుసుకునేందుకు జస్టిస్ ముఖర్జీ కమిషన్ ఇటు గుమ్నామీ బాబా చేతిరాత ప్రతులను, అటు బోస్ చేతిరాత ప్రతులను సేకరించి సిమ్లా, కోల్‌కతాలోని సెంట్రల్ ఫోరెన్సిన్ సైన్స్ లాబరేటరీలకు పంపించింది. అలాగే చేతిరాత నిపుణుడు బీ లాల్ వద్దకూ పంపించింది. రెండు రాత ప్రతులకు మధ్య ఎలాంటి సామీప్యత లేదని ఆ పరీక్షల్లో తేలిపోయింది. అయినప్పటికీ మరింత రూఢీ చేసుకునేందుకు గుమ్నామీ బాబా పంటి నుంచి డీఎన్ఏను సేకరించి, బోస్ తండ్రివైపు, తల్లివైపు వారి నుంచి రక్తాన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలు జరిపారు. ఆ పరీక్షల్లో కూడా గుమ్నామీ బాబా, బోస్ ఒక్కరు కాదని తేలిపోయింది. జన్‌మోర్చా నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకే నయాలోగ్ పత్రిక ఇలాంటి ప్రచారాన్ని తీసుకొచ్చిందనే విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఈ కథనాన్ని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్లు ఉండడం గమనార్హం. మమతా బెనర్జీ బోస్ కు సంబంధించిన కొన్ని రహస్య ఫైళ్లని బయటపెట్టనప్పటికి ఆయన అదృశ్యం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. -
విస్మరించలేని యోధుడు
-
కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టిన మమత
-
దాచేసిన నిజం కాల్చేసే నిప్పు
-
ప్రధానిని కలవనున్న నేతాజీ కుటుంబీకులు
* మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ * చేనేతను ప్రోత్సహించండి.. కనీసం ఒక ఖాదీ వస్త్రం కొనండి * అదే గాంధీజీకి నిజమైన నివాళి సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలలో సుభాష్ చంద్రబోస్ కుటుంబసభ్యులు తనను కలవనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వివిధ దేశాల్లో నేతాజీ కుటుంబానికి చెందిన దాదాపు 50 మంది తనను కలుస్తారని పేర్కొన్నారు. ప్రతినెలా నిర్వహించే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి రేడియోలో మాట్లాడారు. ‘మే నెలలో నేను కోల్‌కతా వెళ్లినప్పుడు సుభాష్ చంద్రబోస్ కుటుంబీకులను కలిశాను. నేతాజీ కుటుంబీకులంతా ఓసారి ప్రధాని నివాసాన్ని సందర్శించాలన్న నిర్ణయం అప్పుడే జరిగింది. పలు దేశాల్లో ఉంటున్న సుభాష్ బాబు కుటుంబీకులు 50 మందిని వచ్చేనెలలో కలుసుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది. వారంతా కలసి ప్రధాని నివాసానికి రావడం బహుశా ఇదే మొదటిసారి. ఇంతటి గొప్ప అవకాశం ఇంతకుముందు ఏ ప్రధాని కూడా రాలేదు’ అని తెలిపారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇటీవల నేతాజీకి సంబంధించిన 64 రహస్య ఫైళ్లు బయటపెట్టడం తెలిసిందే. అదే తరహాలో కేంద్రం కూడా తన వద్ద ఉన్న ఫైళ్లు బహిర్గత పరచాలని బెంగాల్ సీఎంతోపాటు పలువురు డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై మోదీ మాట్లాడలేదు. గత మన్‌కీ బాత్ కార్యక్రమాల్లో మాట్లాడిన వివిధ అంశాలనే మరోసారి గుర్తుచేశారు. అరగంట మాట్లాడిన ఆయన.. ఎల్పీజీ సబ్సిడీ వదులుకోవడం, ఖాదీకి ప్రోత్సాహం, స్వచ్ఛభారత్ వంటి అంశాలను ప్రస్తావించారు. 1965నాటి భారత్-పాక్ యుద్ధంలో మరణించిన జవాన్లకు నివాళి ప్రకటించారు. బిహార్ ఎన్నికలను నేరుగా ప్రస్తావించకుండానే.. పోలింగ్ శాతం పెరగాలని, ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలని కోరారు. ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు బాగున్నాయని ప్రశంసించారు. గతంలో ఎన్నికల సంఘం ఒక నియంత్రణ సంస్థగా ఉండేదని, కానీ కొన్నేళ్లుగా ఓటర్లలో అవగాహన పెంచడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. ప్రజలను చేరడానికి రేడియో ఒక ప్రధాన సాధనమని, నేతాజీ కూడా జర్మనీలో రేడియో స్టేషన్ ద్వారా పలు భాషల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేవారని గుర్తుచేశారు. ‘గాంధీ జయంతి సందర్భంగా అందరూ ఖాదీని ప్రోత్సహించేందుకు ముందుకు రావాలి. అదే ఆయనకు నిజమైన నివాళి. ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఖాదీ వస్త్రం, ఒక చేనేత ఉత్పత్తి కొనాలి. అక్టోబర్ 2 నుంచి నెల రోజులు ఖాదీ, చేనేత దుస్తులపై కల్పించే రాయితీని సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచించారు. చేనేత దుస్తులు కొనడం ద్వారా ప్రజలిచ్చే డబ్బు పేద చేనేతకారులకు చేరుతుందన్నారు. కిందటేడాది సరిగ్గా గాంధీ జయంతి రోజునే మోదీ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘ఇతర దేశాలూ ఫైళ్లను బయటపెట్టాలి’ కోల్‌కతా: నేతాజీ అదృశ్యానికి సంబంధించి వివిధ దేశాల దగ్గరున్న ఫైళ్లను బహిర్గతం చేయాలని ఆయన కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఈమేరకు ఆయా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయాలని మోదీని కోరనున్నట్లు నేతాజీ మునిమనవడు చంద్రబోస్ ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం అధీనంలో ఉన్న ఫైళ్ల ద్వారా నేతాజీ అదృశ్యానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియకపోవచ్చని, ఎందుకంటే ఇందిరాగాంధీ హయాంలో 4 కీలక ఫైళ్లను ధ్వంసం చేశారని ముఖర్జీ కమిషన్ చెప్పిందని అన్నారు. అందువల్ల రష్యా, జపాన్, చైనా, అమెరికా, బ్రిటన్, సింగపూర్, మలేసియా దేశాలకు ఫైళ్లను బహిర్గతం చేయాలని కోరుతూ లేఖ రాయాలని మోదీని కోరనున్నామని తెలిపారు. కాగా, కేంద్రం వద్ద ఉన్న నేతాజీ ఫైళ్ల బహిర్గతంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. -
దాచేసిన నిజం కాల్చేసే నిప్పు
కాంగ్రెస్, దాని మిత్రులు అధికారాన్ని ప్రయోగించి నేతాజీ గురించిన నిజాన్ని దాచి ఉంచాలని ఎందుకు ప్రయత్నించారు? నేతాజీ కుటుంబంపై దశాబ్దాల తరబడి నిరంతర నిఘా ఎందుకు ఉంచినట్టు? ఇలాంటి ప్రశ్నలకు కాంగ్రెస్ ఎన్నడూ జవాబులు చెప్పలేదు. కాబట్టి ఊహాగానాలు అనివార్యం. సజీవంగానే ఉన్న నేతాజీని దేశానికి వెలుపలే ఉంచేయడానికి నెహ్రూ విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యాడని ప్రజల విశ్వాసం. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల ద్వారా నెహ్రూ, కాంగ్రెస్‌లను అధికారం నుంచి తప్పించగలిగిన శక్తివంతుడైన నేత నేతాజీ ఒక్కడే. మనకు ‘నేతాజీ’గా సుపరిచితుడైన సుభాష్ చంద్రబోస్ 1945లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో మరణించినట్టు అధికారిక కథనం. ఆయనకు సమకాలీనుడైన విన్స్టన్ చర్చిల్ అన్నట్టు అది నేటికీ ‘‘నిగూఢతలో దాగిన అంతుబట్టని సమస్య’’గానే ఉంది. అయితే జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని ప్రథమ భారత ప్రభుత్వం నేతాజీ అక్కడికక్కడే చనిపోయాడనే కథనాన్ని సులువుగానే ఆమోదించేసింది. కానీ భారత అంతరాత్మ మాత్రం ఏడు దశాబ్దాల తర్వాత నేటికీ సందేహంతో కలత చెందుతూనే ఉంది. ఆ అంతుబట్టని సమస్యను పరిష్కరించే దిశగా గత వారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఒక ముఖ్య చర్యను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న బోస్‌కు సంబంధించిన 64 రహస్య ఫైళ్లను విడుదల చేశారు. నాకింకా అవి అందలేదు కాబట్టి వాటిలోని విషయం గురించి వ్యాఖ్యానించడం మరీ తొందరపాటు అవుతుంది. అయితే ఈ విషయంలో పాటిస్తూ వచ్చిన నిగూఢతను గురించి చర్చించడం పూర్తి సహేతుకమే. కాంగ్రెస్, దాని మిత్రులు అధికారంపై తమకున్న పట్టును ఉపయోగించి నేతాజీ గురించిన నిజాన్ని దాచి ఉంచాలనే ప్రయత్నాన్ని ఎందుకు కొనసాగించారు? కాంగ్రెస్ నాయకత్వ పరంపర నేతాజీ కుటుంబంపై దశాబ్దాల తరబడి నిరంతర నిఘా ఎందుకు ఉంచింది? అసలు కాంగ్రెస్ ఎందుకు భయపడుతోంది? ఇలాంటి ప్రశ్నలకు కాంగ్రెస్ ఎన్నడూ జవాబులు చెప్పలేదు. కాబట్టి ఊహాగానాలు అనివార్యం. సజీవంగానే ఉన్న నేతాజీని దేశానికి వెలుపలే ఉంచేయడానికి నెహ్రూ విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యాడని ప్రజల విశ్వాసం. అందుకు కారణాలు చాలానే ఉండొచ్చు. విస్తృత ప్రజానీకంలోని ఈ చర్చకు కారణం సంక్లిష్టమైనదేమీ కాదు. సార్వత్రిక ఎన్నికల ద్వారా నెహ్రూ, కాంగ్రెస్‌లను అధికారం నుంచి తప్పించగలిగిన శక్తివంతుడైన నేత నేతాజీ ఒక్కడే. బహుశా అది 1957 నాటికే జరిగి ఉండేది కావచ్చు. కనీసం 1962లోనైతే కచ్చితంగా జరిగి ఉండేది. ఇది ఒక ఆసక్తికరమైన ఆలోచనను రేకెత్తిస్తోంది. చైనా యుద్ధానికి ముందే 1962 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కాబట్టి నేతాజీయే ప్రధానిగా ఉండి ఉంటే చైనా, భారత్‌పై యుద్ధానికి దిగి ఉండేదేనా? అయితే అది మరొక కథ. నేతాజీని ఉద్దేశపూర్వకంగానే దేశానికి బయట ఉంచినట్టయితే, ఆయన ఎక్కడ ఉన్నట్టు? ఆయన దాక్కుని ఉండే వారైతే కాదు. అంటే ఆయనను జైల్లో నిర్బంధించి ఉండాలి. ఎక్కడ? బెంగాల్ ఫైళ్లలో ఆ విషయంపై మనకు స్పష్టమైన సూచన దొరకొచ్చు. అయితే, 1972లో బెంగాల్ ముఖ్యమంత్రిగా సిద్ధార్థ శంకర్ రే, ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండగా కాంగ్రెస్‌కు మింగుడుపడని ఓ ఫైలును నాశనం చేసేశారని బోస్ కుటుంబ సభ్యులు కొందరి కథనం. అదే నిజమైతే, భయంతో కూడిన విధేయతకు మారుపేరైన రే... ఇందిర ఆదేశానుసారమే ఆ ఆధారాన్ని ధ్వంసం చేయించి ఉండాలి. మరో ఆధారం కూడా ఉంది. ఆశ్చర్యకరంగా ఎక్కువ మంది ఆ విషయాన్ని శ్రద్ధగా పట్టించుకుని చూడలేదు. దేశంలోని రెండు ముఖ్య కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ(ఎం), సీపీఐలతో కూడిన వామపక్షం, మమతా బెనర్జీకి ముందు రెండున్నర దశాబ్దాలకుపైగా బెంగాల్‌ను పరిపాలించింది. మార్క్సిస్టు ముఖ్యమంత్రులైన జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్యలకు సర్వాధికారాలుండేవి. వారెందుకు బోస్ ఫైళ్లను దాచేసినట్టు? కాంగ్రెస్ ముఖ్యమంత్రులంటే వారి స్వీయ ప్రయోజనాల కోసం చేశారనేది స్పష్టమే. బోస్ ఫైళ్లను బయటపెట్టకుండా సీపీఐ(ఎం)కు అడ్డుపడిందేమిటి? బోస్ ప్రారంభించిన ఫార్వర్డ్ బ్లాక్ కూడా వామపక్ష కూటమిలో ఒక భాగస్వామి. బోస్ నిర్మించిన భారత జాతీయ సైన్యపు సుప్రసిద్ధ చిహ్నం ‘దూకుతున్న పులి’ ఆ పార్టీ జెండాపై నేటికీ ఉంది. నేతాజీ 1945లో మరణించారనే వైఖరిని ఆ పార్టీ మొదటి నుంచీ నిలకడగా తిరస్కరిస్తూనే ఉంది. కోల్‌కతాలోని బెంగాల్ ప్రభుత్వంపైనా, తనకున్న పరిమిత బలంతో ఢిల్లీలోని పార్లమెంటులోనూ అది బోస్‌కు సంబంధించిన రహస్య ఫైళ్లన్నిటినీ బహిర్గత పరచాలని ఒత్తిడి తెస్తూనే ఉంది. అందుకు ప్రతిస్పందనగా కాంగ్రెస్, ఫార్వర్డ్ బ్లాక్‌ను విచిత్ర కాల్పనికవాదుల గుంపుగానో లేదా లెక్కలోకే రాని అసంబద్ధవాదులుగానో తీసిపారేస్తూ వస్తోంది. ఇంతకూ బోస్ విషయంలో కాంగ్రెస్‌తో కమ్యూనిస్టులు ఎందుకు కుమ్మక్కయినట్టు? మార్క్సిస్టులు ఎవరిని కాపాడుతున్నారు? మన చరిత్రలోని ఆ కలవరపరిచే ఘట్టంలో సోవియెట్ యూనియన్ పాత్ర బయటపడకుండా వారు కాపాడుతున్నారా? నేతాజీకి సంబంధించిన సమాచారాన్ని నెహ్రూ ప్రభుత్వ గూఢచార సంస్థ (ఇంటెలిజెన్స్ బ్యూరో) బ్రిటన్ గూఢచార సంస్థలతో పంచుకునేదనే విషయం మనకు తెలిసిందే. దీనర్థం 1945 తర్వాత బోస్ బ్రిటన్‌కు బందీగా ఉన్నారనా? కాదు. ప్రజాస్వామిక దేశమైన బ్రిటన్‌లోని చట్టాలు బోస్‌ను విచారించక తప్పని పరిస్థితిని అక్కడి ప్రభుత్వానికి కల్పించి ఉండేవి. కాబట్టి నెహ్రూ బ్రిటిష్ వారికి బోస్ విషయాలను తెలియపరుస్తూ ఉండేవారని మాత్రమే బహుశా ఆ గూఢచార సమాచార మార్పిడి సూచిస్తుండి ఉండాలి. నేతాజీ అమెరికా అధీనంలోకి వచ్చిన జపాన్‌లో ఉండి ఉంటారనడానికి వీల్లేదు. 1948లో అధికారంలోకి వచ్చిన చైర్మన్ మావో జెడాంగ్ బ్రిటన్‌కు అనుకూలంగా వారు చెప్పినట్టు ఆటలాడి ఉండరు. కాబట్టి చైనాలోనూ ఉండి ఉండరు. మరి నేతాజీ, సజీవుడై ఉండగా ఎక్కడున్నట్టు? సమాధానం బహుశా ఇంకా తెలిసి ఉండదు. కానీ ప్రశ్నలు మాత్రం కావాల్సినన్ని ఉన్నాయి. నేతాజీ, స్టాలిన్ రష్యాలో బందీగా ఉండి ఉంటారా? అధికారికంగా సీపీఐ(ఎం) ఇంకా స్టాలినిస్టు పార్టీగానే ఉంది. ఈ అంశంపై దేశంలో మిగతా మరెక్కడికన్నా బెంగాల్లోనే ఉద్వేగోద్రేకాలు ఎక్కువగా ఉన్నాయి. మార్క్సిస్టులు బతికి బట్టకట్టాలంటే తిరిగి పుంజుకోవాల్సింది బెంగాల్లోనే. అయినా బోస్ ఫైళ్లపై ప్రస్తుతం జరుగుతున్న టెలివిజన్ చర్చల్లో మార్క్సిస్టులు ఎక్కడా కనబడకపోవడం గమనార్హం. ఇలాంటి సందిగ్ధ స్థితిలో కాంగ్రెస్‌లాగా అసందర్భ ప్రలాపాలకు దిగడం కంటే సీపీఐ(ఎం)లాగా మౌనం వహించడమే మరింత మెరుగైన వ్యూహం అవుతుంది. దిగ్భ్రాంతికరమైన మాటల గారడీతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒకరు చాలా ఏళ్లపాటూ నేతాజీ కుటుంబంపై మన గూఢచార విభాగం ఉంచిన తీవ్ర నిఘా, ఏడు దశాబ్దాలుగా ఆ పార్టీ అనుసరిస్తూ వచ్చిన రెండు నాల్కల వైఖరి మొత్తమంతా కలసి ఒట్టి ‘‘నిఘా’’ మాత్రమే తప్ప గూఢచర్యం కాదని సెలవిచ్చారు. ఇలాంటి వెర్రిమొర్రి పద విన్యాసాలకు కాలం చెల్లిపోయింది. నేతాజీ ‘రహస్య’ పత్రాలలో ఇంకా కావలసినంత నిప్పు మిగిలే ఉంది. అది ఎవరినోగానీ దహించక మానదు. (వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి) - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
నేతాజీ వారసులను కలుస్తా..
- వచ్చే నెలలో ప్రధాని నివాసంలో భేటీ కానున్నట్లు వెల్లడించిన మోదీ న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసులను త్వరలో కలుసుకోనున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ప్రతి నెల మూడో ఆదివారం నిర్వహించే 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వచ్చే నెల (అక్టోబర్)లో ప్రధాని నివాసంలోనే ఆ సమావేశం ఉండబోతుందన్నారు. 'గత మేలో కోల్‌కతా వెళ్లినప్పుడు సుభాష్ బాబూ (నేతాజీ) కుటుంబ సంభ్యులు కొందరిని కలిశాను. అందుబాటులో ఉన్న వారసులందరినీ కలుసుకోవాలని అప్పుడే నిర్ణయం జరిగింది. ఆ మేరకు వచ్చే నెలలో ఢిల్లీ రేస్ కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసంలో 50 మందికిపైగా బోస్ వారసులతో భేటీ అవుతున్నా' అని మోదీ పేర్కొన్నారు. దశాబ్ధాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరతీస్తూ నేతాజీ అంతర్ధానానికి సంబంధించిన రహస్య ఫైళ్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇటీవలే బయటపెట్టడం, కేంద్రం కూడా తన వద్ద ఉన్న ఫైళ్లను వెల్లడించాలని బెంగాల్ సీఎం మమత డిమాండ్ చేయడం తెలిసిందే. ఫైళ్లలోని అంశాలను బట్టి నేతాజీ కుటుంబసభ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వాలు గూఢచర్యకు పాల్పడిందని నమ్ముతున్నట్లు ఆయన వారసులు పేర్కొంటున్న తరుణంలో వారితో మోదీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. -
పత్రాలు చెప్పిన రహస్యాలు
-
ఆ ఎంపీని పార్లమెంటు నుంచి పంపేయండి!
నేతాజీ సుభాష్ చంద్రబోస్ తైపీ విమాన ప్రమాదంలో మరణించారంటూ ప్రచారం చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుగతో బోస్‌ను పార్లమెంటు నుంచి పంపేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యం స్వామి డిమాండ్ చేశారు. సోవియట్/ నెహ్రూ ప్రచారాన్ని ఆయన బలపరిచారని, ఇప్పుడు అదంతా అసత్యమని తేలిపోయినందున సుగతో బోస్‌ను పార్లమెంటు నుంచి ఒక తీర్మానం ద్వారా తీసేయాలని స్వామి డిమాండ్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన కొన్ని ఫైళ్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బయటపెట్టిన విషయం తెలిసిందే. దాన్నిబట్టి, నేతాజీ 1964 వరకు బతికే ఉన్నారని చెబుతున్నారు. Sugato Bose TMC MP be sacked from Parliament by a Resolution for mouthing the Soviet / Nehru propaganda that Netaji died in Taipeh crash — Subramanian Swamy (@Swamy39) September 18, 2015 -
'నేతాజీ ఫైళ్లు బహిర్గతం'
-
'నేతాజీ ఫైళ్లు బహిర్గతం'
న్యూఢిల్లీ: ఏళ్ల తరబడి రహస్యంగా, వివాదాస్పదంగా ఉన్న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదానికి సంబంధించిన ఫైళ్లను చెప్పిన మాట ప్రకారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విడుదల చేసింది. కోల్ కతా పోలీసులు మొత్తం 64 పైళ్లను బహిర్గతం చేశారు. కోల్ కతాలోని పోలీసు మ్యూజియంలో సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం వాటిని పోలీసు ఉన్నత కార్యాలయంలో ఉంచారు.దీంతో ఆయన మరణానికి సంబంధించిన పలు అనుమానాలు వీడనున్నాయి. ఈ ఫైళ్లతోపాటు కొన్ని డీవీడీలు కూడా బయటపెట్టిన హోంశాఖ డీవీడీలను నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేసింది. ఈ ఫైళ్లలో మొత్తం 12,744 పేజీలు ఉన్నాయి. '12,744 పేజీలతో మొత్తం 64 ఫైల్స్ ఉన్నాయి. వాటిని బహిర్గతం చేశాం. అన్ని ఫైల్స్ డిజిటలైజ్ చేశాం' అని కోల్ కతా పోలీసు కమిషనర్ సురజిత్ కర్ పర్కాయస్థ అన్నారు. కీళక ఫైళ్లను విడుదల చేస్తున్న సందర్భంగా పలువురు ఆయన కుటుంబ సభ్యులు పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు వచ్చారు. వీరిలో నేతాజీ మేనళ్లుడు కృష్ణ బోస్ భార్య కూడా ఉన్నారు. అయితే, ఈ ఫైళ్లు విడుదలకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు ప్రభుత్వ ప్రతినిధులు ఎవ్వరూ కూడా ఈ కార్యక్రమంలో లేకపోవడం గమనార్హం. 1937 నుంచి 1947 మధ్య జరిగిన అంశాలు ఈ పైళ్లలో ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఫైళ్లు పెద్దగా ప్రాముఖ్యం లేనివని, వీటి ద్వారా అంత కీలకమైన సమాచారం పెద్దగా తెలియకపోవచ్చని పలువురు అంటున్నారు. కీలకమైన దస్త్రాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదీనంలోనే ఉన్నట్లు తెలిసింది. విదేశాలతో జాతీయ అంతర్జాతీయ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున నేతాజీ అదృశ్యానికి సంబంధించిన దస్త్రాలను విడుదల చేయలేమని గత ఆగస్టులో ప్రధాని కార్యాలయం కేంద్ర సమాచార కమిషన్‌కు చెప్పడం కూడా అసలైన ఫైల్స్ కేంద్రం వద్దే ఉన్నాయనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. వచ్చే ఏడాది బెంగాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే మమత ఇప్పుడు ఆ ఫైల్స్‌తో హడావిడికి తెరతీశారని పలువురు భావిస్తున్నారు. -
బెంగాల్ నిర్ణయాన్ని స్వాగతించిన పీఎంకే
చెన్నై: భారత స్వాతంత్ర్య సమర సేనాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు చెందిన పత్రాలను బయటపెట్టాలన్న పశ్చిమ బెంగాల్ నిర్ణయాన్ని పీఎంకే అధినేత ఎస్ రాందాస్ స్వాగతించారు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉందన్నారు. నేతాజీకి సంబంధించిన 64 డాక్యుమెంట్లు బయటపెడతామని పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రకటించడం స్వాగతించతగ్గ పరిణామమని అన్నారు. నేతాజీ అదృశ్యం పరిష్కారం కాని మిస్టరీగా ఉండిపోయిందని అన్నారు.