నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు చెందిన పత్రాలను బయటపెట్టాలన్న పశ్చిమ బెంగాల్ నిర్ణయాన్ని పీఎంకే అధినేత ఎస్ రాందాస్ స్వాగతించారు.
చెన్నై: భారత స్వాతంత్ర్య సమర సేనాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు చెందిన పత్రాలను బయటపెట్టాలన్న పశ్చిమ బెంగాల్ నిర్ణయాన్ని పీఎంకే అధినేత ఎస్ రాందాస్ స్వాగతించారు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉందన్నారు. నేతాజీకి సంబంధించిన 64 డాక్యుమెంట్లు బయటపెడతామని పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రకటించడం స్వాగతించతగ్గ పరిణామమని అన్నారు. నేతాజీ
అదృశ్యం పరిష్కారం కాని మిస్టరీగా ఉండిపోయిందని అన్నారు.