కోల్‌కతాలో దుర్గాపూజ వేడుకలు ఎంత ఆర్భాటంగా ఘనంగా జరుగుతాయో తెలిసిందే. అంతేగాదు అక్కడ చేసే దుర్గా వేడుకలు యునెస్కో గుర్తింపును కూడా అందుకున్నాయి. అంతలా చరిత్రలో పేరుగాంచడానికి కారణం స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ చంద్రబోస్. ఆయన విశాల దృక్పథం సరొకొత్త పూజా ఆవిష్కరణకు నాంది పలికింది. దేశభక్తిని పెంపొందించే వేదికలా.. బహింరంగంగా అంతా కలిసి చేసుకునే వేడుకగా మలిచారు. అలా కోల్‌కతాలో ఈ వేడుకలు బహిరంగంగా పెద్ద కోలాహలంగా జరగడం ప్రారంభమయ్యింది. సామాన్యుడు కూడా ఈ పండుగలో పాలుపంచుకోవాలనే సంకల్పం నెరవేరేలా మార్పులు తీసుకొచ్చారు. నవరాత్రుల సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోల్‌కతాలో జరిగే దుర్గాపూజ వేడుకను ఎలా మార్చారు..? అంతలా గుర్తింపు వచ్చేందుకు కారణమైనవి ఏంటి?..తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.
పశ్చిమ బెంగాల్‌లో ఈ వేడుకలు మొదట్లో జమిందార్లు నిర్వహించేవారు. ఆ తర్వాత 1610లో బరిషాకు చెందిన సవర్ణ చౌదరి కుటుంబం చేసే వేడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలన్నీ ఘనంగా నిర్వహించినప్పటికీ ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ప్రభావితం చేయలేకపోయాయి. అయితే నేతాజీ స్వాతంత్ర్యం కోసం రకరకాల ప్రణాళికతో ముందుకు పోతున్న ఆయనకు ఈ వేడుక ఎంతాగానో ఆకర్షించింది.
ఈ వేడుకును అందర్ని కలుపుకునే నిర్వహించి దీంతో స్వాతంత్ర సమరయోధులను సంఘాన్ని ఏర్పరుచుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన పుట్టింది. ఆ క్రమంలో నేతాజి 'సర్బోజోనిస్' అనే పేరుతో 10 రోజుల వేడుకలు నిర్వహించారు. ఆయనే ఆ కమిటీ ఆధ్యక్షుడిగా ఉండి ఈ పండుగ జయప్రదమయ్యేలా ముందుండి నడిపించారు. ఇక్కడ సర్బోజోనిన్ అంటే సమాజంలోని అందరి పండుగ అని అర్థం. బెంగాల్ వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంలా అంగరంగ వైభవంగా ఈ వేడుకలు ఇప్పటికి కొనసాగడం విశేషం.
ఖైదీలు పూజించే హక్కు..
1920లో బోస్ మాండలే జైలులో ఉన్నప్పుడు తన రాజకీయ గురువు బసంతీ దేవికి దుర్గాపూజ గురించి వివరిస్తూ లేఖ రాశారు. ప్రతి ఏడాది ఒకసారి వచ్చే ఈ నవరాత్రుల పండుగలో జైలులో ఉన్న తన బిడ్డల సందర్శించి వారి బాధలను తొలగిస్తుంది. అందువల్ల తాము కూడా పూజించుకునే హక్కు ఉందంటూ ఓ నినాదం లేవనెత్తారు నేతాజీ. ఆ కాలంలో క్రిస్మస్ వంటి పండుగలకు ప్రభుత్వం తరుపున రూ. 1200 గ్రాంట్ వచ్చేది. అలానే మాకు కూడా కావలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ వంతుగా రూ. 140లు, ప్రభుత్వం తరుఫు నుంచి రూ. 660లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే దీన్ని ఖైదీల జీతం నుంచే మినహించమని బ్రిటిష్ అధికారులు ఆదేశించడం నచ్చక నేతాజీ బర్మాలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెమోరాండం పంపారు. అయితే అది కూడా తిరస్కరింపబడింది.
దీంతో ఆయన ఖైదీలకూ కూడా తమ మతపరమైన ఆచారాలను నిర్వహించుకునే హక్కు ఉందంటూ నిరాహార దీక్ష ప్రారంభించారు. అలాగే సరస్వతి పూజకు అదనంగా రూ. 60 ఇవ్వాలిన డిమాండ్ చేశారు. ఈ ఘటన దావనంలా వ్యాప్తి చెందడంతో బ్రిటిష్ ప్రభుత్వం దిగి వచ్చి ఖైదీలు ఒక్కొక్కరికి పూజ నిమిత్తం రూ. 30 మంజూరు చేసింది. ఇది తక్కువ మొత్తమే అయినా ఖైదీల హక్కులను హైలెట్ చేసింది.
పూజా సంప్రదాయంలో మార్పులు..
ఎచ్చల విగ్రహ సంప్రదాయంలో దుర్గా దేవత ఆరాధన తీసుకొచ్చారు. అంటే ఒకే పైకప్పుకింద పూజించటం అని చెప్పొచ్చు. దుర్గమ్మ ఆమె పిల్లలు అంతా ఒకే వేదికపై పూజలు చేసుకునేలా చేయడం. అలాగే విగ్రహా తయారీ సంప్రదాయ పద్ధతిలో కూడా మార్పులు తీసుకొచ్చారు. దుర్గమ్మ ఆమె పిల్లిలిద్దర్ని వేర్వేరు ఫ్రేమ్‌లలో తయారు చేయమని కళాకారులను కోరారు. దీని వల్ల సమయం ఆదా కావడమే గాక, ఏకకాలంలో వివిధ విగ్రహాలు రూపుదిద్దుకునే వెసులబాటు ఏర్పడింది.
ఈ పండుగతో చిన్నా చితక పనులు చేసుకునే వారందర్నీ ఒకతాటిపైకి తీసుకొచ్చి మనమంతా ఒక్కటే అని చాటిచెప్పేలా ఈ పూజలో అందరూ భాగమయ్యేలా చేశారు. అట్టడుగు, ధనిక వర్గం అనేది దేవుడి సమక్షంలో ఉండదనే గొప్ప విషయాన్ని నేతాజీ ఆనాడే ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేసి, ఆ సంప్రదాయం నేటికీ కొనసాగేలా చేశారు. యావత్తు ప్రపంచం కోల్‌కతా దుర్గా పూజ సంపద్రాయానికి ఫిదా అయ్యి నమస్కరించేలా చేశారు.
(చదవండి: కరణ్ జోహార్ 'టై' అంత ఖరీదా..? దేనితో డిజైన్ చేశారంటే..)
Comments
Please login to add a commentAdd a comment