
Live durga utsav: దసరా ఉత్సవాల్లో మండపాలలో దుర్గామాత విగ్రహాలు కనిపించడం సాధారణ దృశ్యమే. అయితే కోల్‌కతాలో బ్రహ్మ కుమారీస్ నిర్వహించే ‘లైవ్ దుర్గా ఉత్సవ్’లో 30 ఏళ్లు దాటిన మహిళలు కొన్ని గంటల పాటు కదలకుండా విగ్రహాల్లా కూర్చుంటారు!
‘జీవకళ ఉట్టిపడుతుంది’ అనుకునే వాళ్లకు దగ్గరకు వచ్చి చూస్తేగానీ అసలు విషయం తెలియదు.
‘ఇది సహనానికి పరీక్ష. కదలకుండా కూర్చోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. పెద్ద సవాలు. ఈ సవాలు కోసం ప్రతి సంవత్సరం ఇష్టంగా ఎదురు చూస్తుంటాను’ అంటుంది 32 ఏళ్ల సులేఖ.
గత పదిహేను సంవత్సరాలుగా లక్ష్మి, సరస్వతితో సహా వివిధ దేవతల రూపంలో మండపంలో కూర్చుంటూ ఉంది సులేఖ. సందర్శకులు నాణేలు, పువ్వులు వేదికపై విసురుతుంటారు.
‘ఒక్కో దేవతకు ఒక్కో రకమైన ముఖకవళికలు ఉండాలి. దుర్గ ముఖంలో కోపం, శక్తి, ప్రశాంతత మిళితమై ఉంటాయి. నేను వేదికపై ధ్యానముద్రలో ఉంటాను కాబట్టి ఏ విషయంపైనా నా దృష్టి మళ్లదు’ అంటుంది ‘లైవ్ దుర్గా’గా పేరుగాంచిన సులేఖ.
చదవండి: దురితాలను పోగొట్టి.. మన చుట్టూ రక్షణకవచంలా నిలబడే దుర్గమ్మ