లండన్‌లో ఘనంగా దసరా అలాయి బలాయి | Dussehra Alai Balii Celebrations For The First Time In London | Sakshi
Sakshi News home page

లండన్‌లో ఘనంగా దసరా అలాయి బలాయి

Published Thu, Oct 17 2024 1:19 PM | Last Updated on Thu, Oct 17 2024 1:19 PM

Dussehra Alai Balii Celebrations For The First Time In London

హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా పరాయి గడ్డపై అలాయి బలాయి సాంస్కృతికి నాంది పలికారు. ప్రతి దేశంలో ఇప్పుడు ఎన్నో కుల సంఘాలు మత సంఘాలు రాష్ట్ర సంఘాలు, జిల్లా సంఘాలు ఇలా తెలుగు వారందరూ ఏదో ఒక సంస్థ ద్వారా సంఘాల ద్వారా విడిపోయి ఉన్నారు అందరిని కులాలకు మతాలకు అతీతంగా అందరిని ఒక వేదికపై తీసుకువచ్చి తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల వలే కలిసి ఉండాలని చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని సీక్క చంద్ర శేకర్ అన్నారు.

ఈ కార్యక్రమానికి  యూకే నలుముల నుండి వచ్చిన మిత్రులు వివిధ రాజకీయ పార్టీలకు, సంస్థలకు చెందిన ప్రముఖులు, డాక్టర్స్ ,ఇంజనీర్స్ వివిధ వ్యాపారాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు అందరూ ఈ  కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇలానే ప్రతి ఏడాది ఇంకా అంగరంగ వైభవంగా చేసుకోవాలని కొనియాడారు. వివిధ తెలంగాణ రుచికరమైన వంటలు ఈ కార్యక్రమం లో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. 

సౌత్‌ఆల్‌ మాజీ ఎంపీ  వీరేంద్ర శర్మ,గారికి  మొదటిగా అలయ్ బలై కండువా కప్పి  ప్రారంభించడం జరిగింది.  ఒక మంచి న్యూట్రల్  వేదిక (తటస్థ వేదిక)కు నాంది పలకడం కూడా ఎంతో ఆనంద దాయకం అన్ని అలై బలై సభ్యులు కొనియాడారు..ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ కూడా ఎంతో మంది మిత్రులను కలిసిన సందర్బాలు తక్కువ. 

దశాబ్దాల కిందటి మిత్రులను కూడా ఈ వేదిక ద్వారా కలుసుకోవడం అలాగే ఎటువంటి జెండా, అజెండా ఈ కార్యక్రమానికి లేదని ఇది కేవలం స్నేహపూర్వక కలయికే. జమ్మి ఆకు ఇచ్చి పుచ్చుకొని  అందరూ అలైబలే చెప్పుకొని  తారతమ్యాలను మరచి ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకున్నారని ఈ సందర్భంగా  సభ్యులు అతిధులు కొనియాడారు.

(చదవండి: TCUK ఆధ్వర్యంలో తొలిసారి యూకేలో బతుకమ్మ వేడుకలు)

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement