నేతాజీ సుభాష్ చంద్రబోస్ శిష్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఎంకేఎం. అమీర్ హంస ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. ఈ విషయాన్ని మనిదనేయ మక్కల్ కట్చి అధ్యక్షుడు ఎంహెచ్.జవాహరుల్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో నేతాజీ ప్రధాన అనుచరుడిగా బ్రిటీష్ దొరలకు ప్రాణాలు ఎదురొడ్డి నిలిచి పోరాడిన తన జీవితాన్ని, ఆర్థిక వనరులను దేశానికి అంకితం చేశాడని పేర్కొన్నారు. అమీర్ హంస అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.