freedom fighter
-
Sarojini Naidu: మహాత్మునితో ‘మిక్కీ మౌస్’ అని పిలిపించుకుని..
ఆమె ఆరేళ్ల చిరుప్రాయంలోనే కవితలు రాసేది . 12 ఏళ్ల వయసులో రచించిన నాటకం ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. లండన్‌లో విద్యాభ్యాసానికి స్కాలర్షిప్ పొందిన సమయంలో ఆమెకు 16 ఏళ్లు. స్వతంత్ర భారతదేశంలో స్త్రీలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు కల్పించాలని పోరాడిన ఆమె.. మరెవరో కాదు..స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు(Sarojini Naidu). చిన్నవయసులోనే ఆమె చూపిన తెగువ, పోరాట పటిమను మెచ్చుకున్న మహాత్మాగాంధీ ఆమెను ప్రేమగా ‘మిక్కీమౌస్’ అని పిలిచేవారు.సరోజినీ నాయుడు 1979, ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి ఆమెను శాస్త్రవేత్తగా చూడాలనుకున్నారు. కానీ ఆమె ఆమెకు కథలు, కవితలు రాయడమంటే అమితమైన ఆసక్తి. తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. సరోజినీ తన 12 ఏళ్ల వయసులో రాసిన ‘మహేర్ మునీర్’ నాటకం ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది.చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే సరోజినీకి 16 ఏళ్ల వయసులో హైదరాబాద్ నిజాం నుంచి స్కాలర్షిప్ లభించింది. ఈ స్కాలర్‌షిప్‌తో ఆమె లండన్‌లోని కింగ్స్ కాలేజీలో చదువుకునేందుకు వెళ్లింది. అక్కడ ఆమె పెద్దిపాటి గోవిందరాజులు నాయుడును కలుసుకుంది. ఇది తరువాతి కాలంలో వారి మధ్య ప్రేమగా పరిణమించి, వివాహానికి దారి తీసింది. పెళ్లి చేసుకునే సమయానికి సరోజినీ వయసు కేవలం 19 ఏళ్లు. నాడు జరిగిన వీరి కులాంతర వివాహం పలు చర్చలకు దారితీసింది. అయితే వారి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా సాగింది. వారికి ఐదుగురు సంతానం. వారి కుమార్తె పద్మజ కూడా స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారు. సరోజినీ నాయుడు రాజకీయ జీవితం 1905లో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్(Women's Indian Association) (డబ్ల్యూఏఐ) స్థాపనతో ప్రారంభమైంది. ఆమె సాగించిన రచనలు దేశ స్వాతంత్య్రాన్ని, మహిళా స్వేచ్ఛను, సమానత్వాన్ని ప్రతిబింబించేవి. ఆమె 1906లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించారు. సరోజనీ నాయుడు సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం ఎనలేని కృషి చేశారు. 1925లో ఆమె భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొని జైలుకు వెళ్లారు.సరోజినీ నాయుడు తొలి కవితా సంకలనం 1905లో ప్రచురితమైంది. దాని పేరు - 'ది గోల్డెన్ థ్రెషోల్డ్.' సరోజినీ నాయుడు భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్. 1947 నుండి 1949 వరకు యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ ఆగ్రా అండ్ ఔద్(United Provinces of Agra and Oudh)కు గవర్నర్‌గా పనిచేశారు. సరోజినీ నాయుడు జ్ఞాపకార్థం దేశంలోని పలు సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులకు ఆమె పేరు పెట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన రెండేళ్ల తర్వాత అంటే 1949 మార్చి 2న సరోజినీ నాయుడు తన 70వ ఏట ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గుండెపోటుతో కన్నుమూశారు.ఇది కూడా చదవండి: నేడు తొలి విశ్వశాంతి కేంద్రం ప్రారంభం -
Chandrashekhar Azad: ‘నా పేరు ఆజాద్.. స్వాతంత్ర్యం నా తండ్రి’
చంద్రశేఖర్ ఆజాద్(Chandrashekhar Azad).. దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు. 1906, జూలై 23న మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలోని భాబ్రాలో జన్మించిన ఆయన 1931, ఫిబ్రవరి 27న కన్నుమూశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిపడిన యువకెరటంగా పేరొందిన ఆయన వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుని జీవితంలోని ప్రముఖ ఘట్టాలను గుర్తుచేసుకుందాం.చంద్రశేఖర్ చాలా చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్య పోరాటం(freedom fight)లో భాగస్వామ్యం వహించారు. 1922లో చౌరీ చౌరా ఘటన తర్వాత గాంధీజీ తన ఉద్యమాన్ని ఉపసంహరించడంతో ఆజాద్ కాంగ్రెస్ తీరుపై నిరాశచెందారు. దీని తరువాత ఆయన 1924లో పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, సచింద్రనాథ్ సన్యాల్, యోగేష్ చంద్ర ఛటర్జీ ఏర్పాటు చేసిన హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చేరారు. దీనిలో చంద్రశేఖర్ తొలుత రామ్ ప్రసాద్ బిస్మిల్ నాయకత్వంలో 1925లో కాకోరి ఘటనలో చురుకుగా పాల్గొన్నారు.చంద్రశేఖర్ 1928లో లాహోర్‌లో బ్రిటిష్ పోలీసు అధికారి ఎస్పీ సాండర్స్‌ను కాల్చి చంపి, లాలా లజపతి రాయ్(Lala Lajpati Roy) మరణానికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఇది విజయవంతం కావడంతో చంద్రశేఖర్ బ్రిటిష్ ఖజానాను దోచుకుని, హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌కు నిధులు సమకూర్చారు. వీటిని విప్లవాత్మక కార్యకలాపాలకు వినియోగించేవారు. ఈ సంపద భారతీయులదని,దీనిని బ్రిటిష్ వారు దోచుకున్నారని చంద్రశేఖర్ తరచూ అనేవారు.‘ఆజాద్’ పేరు వెనుక..చంద్రశేఖర్‌కు ‘ఆజాద్’ అనే పేరు రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆయన 15 ఏళ్ల వయసులో ఏదో ఒక కేసులో న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. అక్కడ, న్యాయమూర్తి అతనిని పేరు అడిగినప్పుడు.. ‘నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు ఇండిపెండెన్స్, నా ఇల్లు జైలు’ అని చెప్పారు. ఈ మాట విన్న న్యాయమూర్తి ఆగ్రహించి, చంద్రశేఖర్‌కు 15 కొరడా దెబ్బల శిక్ష విధించారు. ఇక అప్పటినుంచి చంద్రశేఖర్ పేరు ఆజాద్ అయ్యింది. చంద్రశేఖర్ జీవితాంతం స్వేచ్ఛను కోరుకున్నారు.బ్రిటిషర్లతో పోరాడటానికి చంద్రశేఖర్ ఆజాద్ అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్క్‌లో సుఖ్‌దేవ్, అతని ఇతర సహచరులలో కలిసి ఒక పార్కులో కూర్చుని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయం బ్రిటిష్ పాలకులకు తెలిసింది. దీంతో బ్రిటిష్ పోలీసులు అకస్మాత్తుగా చంద్రశేఖర్‌పై దాడి చేశారు. ఆజాద్ పోలీసుల తూటాలకు తీవ్రంగా గాయపడ్డారు. తాను బ్రిటిషర్లకు ఎప్పటికీ పట్టుబడనని, వారి ప్రభుత్వం తనను ఏనాటికీ ఉరితీయలేనని గతంలో ఆజాద్ పేర్కొన్నారు. అందుకే తన పిస్టల్‌తో తనను తాను కాల్చుకుని, మాతృభూమి కోసం తన ప్రాణాలను అర్పించారు ఆజాద్. ఇది కూడా చదవండి: ఆకట్టుకున్న మహా కుంభమేళా చివరి హారతి -
ఈ అమ్మల ఒడికి చేరిన పద్మాలు
పోరాట స్వరం @100పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా లిబియా లోబో సర్దేశాయ్ పేరు వార్తల్లోకి వచ్చింది. నిజానికి లిబియా లోబో సర్దేశాయ్ అనేది ఒక పేరు కాదు. స్వాతంత్య్ర పోరాట స్వరం. గోవా స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన లోబో సర్దేశాయ్ పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడానికి అటవీప్రాంతంలో ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ అనే రేడియో స్టేషన్నిప్రారంభించారు.పద్మశ్రీ (Padma Shri) పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా... పోర్చుగీస్ పాలన నుంచి గోవాకు విముక్తి లభించిన రోజు ఎంత సంతోషంగా ఉన్నానో, ఇప్పుడూ అంతే సంతోషంగా ఉన్నాను’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది గోవా స్వాతంత్య్ర సమరయోధురాలు లిబియా లోబో సర్దేశాయ్(lobo sardesai).గోవాకు విముక్తి లభించిన రోజున తన సహోద్యోగి, ఆ తర్వాత భర్త వామన్ సర్దేశాయ్తో కలిసి భారత వైమానిక దళం విమానంలో పనాజీ, గోవాలోని ఇతర ప్రాంతాల మీదుగా ప్రయాణించింది. అందులోని రేడియో ట్రాన్సిస్టర్‌కు లౌడ్ స్పీకర్ అమర్చి పోర్చుగీస్, కొంకిణి భాషల్లో ప్రకటనలు చేసి వారు కరపత్రాలు విసిరారు.‘పోర్చుగీసు వారు లొంగిపోయారు. 451 సంవత్సరాల వలస పాలన తరువాత గోవా స్వాతంత్య్రం పొందింది’ అనేది ఆ ప్రకటనల సారాంశం.‘ఈరోజు కూడా అలాంటి సంతోషమే నాకు కలిగింది. ఇలాంటి క్షణాలు నా జీవితంలో అరుదు. ఈ అవార్డు ఆశ్చర్యకరమైన ఆనందాన్ని కలిగించింది. నేనెప్పుడూ ఊహించలేదు. కోరుకోలేదు. ఈ అవార్డు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని, స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను’ అంటుంది లోబో సర్దేశాయ్. గత ఏడాది మేలో ఆమె శతవసంతాన్ని పూర్తి చేసుకుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో (lobo sardesai)లోబో సర్దేశాయ్... ఇటాలియన్ యుద్ధ ఖైదీలు రాసిన రహస్య లేఖలను అర్థం చేసుకుంటూ, సెన్సార్ చేస్తూ ట్రాన్స్‌లేటర్ గా పనిచేసింది. బొంబాయిలోని ఆల్ ఇండియా రేడియోలో స్టెనోగ్రాఫర్, లైబ్రేరియన్‌గా పనిచేసింది. తరువాత న్యాయవాద వృత్తిలోకి వచ్చింది. కాలేజీలో చదివే రోజుల్లో గోవా జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనేది. విమోచనానంతరం న్యాయవాదిగా ప్రాక్టిస్ చేయడంతో పాటు మహిళా సహకార బ్యాంకును స్థాపించింది. రాష్ట్ర పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన తొలి టూరిజం డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.ఆమెకు ‘పద్మ’ పురస్కారం ప్రకటించిన సందర్భంగా గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై పణాజీలోని సర్దేశాయ్ నివాసానికి వెళ్లి ఆమెకు పుష్పగుచ్ఛాన్ని అందించి, అభినందించారు. ఆమె మరింతకాలం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సర్దేశాయ్ జీవన గాథను శ్రద్ధగా అధ్యయనం చేసి, దానినుంచి స్ఫూర్తిని పొందవలసిందిగా విద్యార్థులకు సూచించారు. ‘మీరు చెబుతున్నంత గొప్పదాన్నేమీ కాదు, నా మార్గంలోకి ఏమి వచ్చిందో, నేను అదే చేసుకుంటూ పోయాను అంతే’ అని నిండుగా నవ్వారామె. మేలు బొమ్మలు@98‘తోలు బొమ్మలాట’ ఆడిస్తూనే 98 ఏళ్లకు చేరుకున్న భీమవ్వ చిర్నవ్వు నవ్వింది. ఆమెకు ‘పద్మశ్రీ’ ప్రకటించారు. టీవీలు, సినిమాలు, ఓటీటీలు వచ్చినా భారతీయ సంప్రదాయకళను ఏ ప్రయోజనం ఆశించక ఆమె కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ‘పద్మశ్రీ’ ఇస్తే ఆమె చేతి వేళ్లు కదిలి తోలుబొమ్మలు చప్పట్లు కొట్టొచ్చు. కాని నిజమైన చప్పట్లు జనం నుంచి ఆమెకు ఎప్పుడో దక్కాయి. భీమవ్వ లాంటి వాళ్లు రుషులు. పురస్కారాలకే వీరి వల్ల గౌరవం.భక్తులకు పుణ్యక్షేత్రాలు ఉంటాయి. కానీ ‘తోలుబొమ్మలాట’కు ఒక పుణ్యక్షేత్రం ఉందీ అంటే అది కర్నాటకలోని కొప్పల్ జిల్లాలోని ‘మొరనాల’ అనే పల్లెలో ఉన్న భీమవ్వ ఇల్లే. ఆ ఇంట్లో ఎవర్ని కదిలించినా తోలుబొమ్మలాట వచ్చు అని చెబుతారు. భీమవ్వకు ఇప్పుడు 96 సంవత్సరాలు. ఆమె కొడుకు కేశప్ప, మనవలు, మునిమనవలు అందరూ తోలుబొమ్మలాటలో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే వారి వంశం కనీసం రెండు వందల ఏళ్లుగా తోలుబొమ్మలాట ఆడిస్తూ ఉంది. ‘నేను 14 ఏళ్ల వయసులో తోలుబొమ్మలాట నేర్చుకున్నాను’ అంటుంది భీమవ్వ. ఆమెకు ‘పద్మశ్రీ’ ప్రకటన వచ్చాక ఆమె ఇల్లు, ఊరు మాత్రమే కాదు మొత్తం కొప్పల్ జిల్లా సంబరం చేసుకుంటూ ఉంది. ఎందుకంటే భీమవ్వ ఆట కట్టని పల్లె ఆ జిల్లాలో లేదు. కర్నాటకలో లేదు. భీమవ్వ అందరికీ తెలుసు. ఉత్సవాలకు, జాతర్లకు భీమవ్వ ఆట ఉందంటే జనం బండ్లు కట్టుకుని వచ్చేవారు ఒకప్పుడు. ఇప్పుడూ ఆ ఘనత చెరగలేదు.‘నేను రామాయణ, మహాభారతాలను పొల్లు పోకుండా పాడగలను. భారతంలోని పద్దెనిమిది పర్వాలకూ ఆట కడతాను. అయితే కురుక్షేత్రం, కర్ణ పర్వం, ద్రౌపది వస్త్రాపహరణం, ఆది పర్వం ఇవి ఎక్కువగా చె΄్తాను. జనం వీటిని బాగా అడుగుతారు. రామాయణంలో లవకుశుల కథ చాలామందికి ఇష్టం’ అని చెప్పింది భీమవ్వ.గ్రామీణ కళ, జానపద కళ అయిన తోలుబొమ్మలాటను కర్నాటకలో ‘తొగలు గొంబెయాట’ అంటారు. తెలుగులో ఒకప్పుడు ప్రసిద్ధంగా ఉన్నట్టే కర్నాటకలో కూడా ఈ కళ ప్రసిద్ధం. అయితే భీమవ్వ వంశం దాని కోసం జీవితాలను అంకితం చేసింది. కనుక అక్కడ ఇంకా ఆ ఆట వైభవం కొనసాగుతూ ఉంది. ‘తోలు బొమ్మలాటలో నేనే రాముణ్ణి, సీతను, లక్ష్మణున్ని. అందరి పాటలూ పాడతాను. నా ఆట గొప్పదనం తెలిసిన ప్రపంచ దేశాలు నన్ను పిలిచి ఆట చూపించమన్నాయి. అమెరికా, పారిస్, ఇటలీ, ఇరాన్, ఇరాక్, స్విట్జర్లాండ్ ఈ దేశాలన్నింటికి వెళ్లి తోలుబొమ్మలాట ఆడాను’ అందామె. అదొక్కటే కాదు ఆమె దగ్గర 200 ఏళ్ల కిందటి తోలుబొమ్మలు భద్రపరిచి ఉన్నాయి.శిక్షణ ఇస్తున్నాతనకు తెలిసిన విద్య తన వాళ్లకే అనుకోలేదు భీమవ్వ(Bhimavva). ప్రతి ఏటా కొంతమంది యువతను ఎంపిక చేసి తోలుబొమ్మలాట(puppeteer)లో శిక్షణ ఇస్తుంది. అది నేర్చుకున్నవారు ఆటను కొనసాగిస్తున్నారు. కర్నాటక ప్రభుత్వం ఈ కృషిని గుర్తించి ఎన్నో పురస్కారాలు ఇచ్చింది. జనం భీమవ్వను గుండెల్లో పెట్టుకున్నారు. ‘ఇది మనదైన విద్య. దీనిని పోగొట్టుకోకూడదు. మన గ్రామీణ కళల్లో నీతి ఎంతో ఉంటుంది. మనిషికి నీతి చెప్పడానికైనా ఇలాంటి కళలను కాపాడుకోవాలి’ అంది భీమవ్వ.భీమవ్వ ఎన్నోసార్లు విమానం ఎక్కింది. కాని ఈసారి ఎక్కబోయే విమానం ఆమెను ‘పద్మశ్రీ’ ఇవ్వనుంది. ప్రధాని, కేంద్ర మంత్రులు, పెద్దలు కరతాళధ్వనులు చేస్తుండగా రాష్ట్రపతి చేతుల మీద ఆమె పద్మశ్రీ అందుకుని తోలు బొమ్మల ఆటకు కిరీటం పెట్టనుంది. -
జన్ జాతీయ గౌరవ్ దివస్.. విస్మృత పోరాట యోధుడి జయంతి
గత రెండేళ్ల క్రితం నుంచి నవంబర్ 15 నాడు బిర్సా ముండా జయంతిని ‘జన్ జాతీయ గౌరవ్ దివస్’గా పాటిస్తున్నాం. ఇన్నేళ్లకైనా విస్మృత పోరాట యోధుణ్ణి స్మరించుకోవడం ఆనందదాయకం. ఆదివాసీల్లో పోరాట భావాలను రగిలించిన తొలి వీరుడు బిర్సా ముండా. నాటి బెంగాల్ ప్రావిన్స్‌లోని బిహార్ (నేటి జార్ఖండ్)లో ఆదివాసీల రాజ్యాన్ని తేవటానికి సమరశంఖం పూరించాడు. ఆయన తన ఆదివాసీ ప్రజలకు ‘రాణి రాజ్యానికి అంతం పలుకుదాం–మన రాజ్యాన్ని స్థాపిద్దాం’ అనే నినాదం ఇచ్చాడు. ఈ నినాదం ప్రజలను తిరుగుబాటు వైపుకు నడిపించింది.ముండా తెగకు చెందిన సుగుణ, కార్మిహాలు దంపతులకు 1875 నవంబర్ 15న ఛోటానాగపూర్ సమీప చెల్కడ ప్రాంతంలోని బాబా గ్రామంలో ఆయన జన్మించాడు. ప్రాథమిక విద్యను కొద్దికాలం అభ్యసించిన తర్వాత ఒక జర్మన్ మిషనరీ స్కూల్లో చేరాడు. ఆ పాఠశాలలో చేరాలంటే క్రైస్తవుడై ఉండాలన్న నిబంధన ఉండడం వల్ల ఆయన మత మార్పిడి చేసుకున్నాడు. అయితే కొన్నేళ్లలోనే స్కూల్ నుంచి బయటికి వచ్చి క్రైస్తవాన్ని త్యజించి తన సొంత ఆదివాసీ ఆచారాలనే ఆచరించడం ప్రారంభించాడు. ఆదివాసీలందరినీ స్థానిక విశ్వాసాలనే అనుసరించమని బోధించాడు. తాను తన జాతీయులను ఉద్ధరించడానికి అవతరించినట్లు ప్రకటించాడు. ఆయన బోధనలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.ముండా ప్రజలు ఆయన్ని దేవునిగా భావించి ‘భగవాన్’ అని పిలవడం ప్రారంభించారు. అయితే బిర్సా ముండాను అనుసరించనివారు ఊచకోతకు గురవుతారనే గాలివార్త ప్రచారంలోకి రావడంతో ఆయన్ని బ్రిటిష్‌వాళ్లు ఛోటానాగపూర్ ప్రాంతంలో 1895 ఆగస్టులో అరెస్ట్ చేసి రెండేళ్లకు పైగా జైల్లో ఉంచారు. దీంతో ఆయన విడుదల కోరుతూ జాతీయోద్యమకారులు పెద్దఎత్తున బ్రిటిషర్లపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం ఎట్టకేలకు 1897 నవంబర్‌లో బిర్సాని విడుదల చేసింది.ఆ రోజుల్లో బ్రిటిష్‌వాళ్లు, వాళ్ల తాబేదార్లు ఆదివాసీల సాగు భూములపై పన్నులు విధిస్తూ... వాటిని కట్టకపోతే ఆ భూములను జమీందారీ భూములుగా మార్చేవారు. దీంతో చాలా మంది ప్రజలు అస్సాంలోని తేయాకు తోటల్లో కూలి పనుల కోసం వలస వెళ్లేవారు. దీన్ని గమనించిన బిర్సా... వన జీవులందరినీ సమావేశపరిచి, బ్రిటిష్‌వాళ్లకు కప్పాలు కట్టవద్దనీ, వాళ్లను తరిమి కొట్టాలనీ పిలుపునిచ్చాడు. అనుచరులతో కలిసి బాణాలు ధరించి 1899 డిసెంబర్లో భారీ ‘ఉల్’ గులాన్’ (తిరుగుబాటు ర్యాలీ) నిర్వహించాడు.చదవండి: ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?ఈ చర్యలను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్ని 1900 ఫిబ్రవరి 3న బంధించి రాంచీ జైలుకు తరలించింది. కేసు విచారణలో ఉన్న కాలంలో జూన్ 9న జైల్లోనే ఆయన తుది శ్వాస విడిచాడు. చివరికి 1908లో బిటిష్ ప్రభుత్వం ఆదివాసీల భూములను ఆదివాసీలు కానివారికి బదిలీ చేయడాన్ని నిషేధిస్తూ ‘ది ఛోటానాగపూర్ టెనెన్సీ యాక్ట్’ను తీసుకువచ్చింది. అనంతర కాలంలో బిర్సా స్ఫూర్తితో ముండా, ఒరియాన్, సంతాల్ తెగలు తమ హక్కులను సాధించుకున్నాయి.– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, తెలంగాణ (2024, నవంబర్ 15న బిర్సాముండా 150వ జయంతి ప్రారంభం) -
ఆ తడబాటుతోనే ఈ ఎడబాటు..
శతాబ్దాల పాటు విదేశీ పాలనలో సర్వం కోల్పోయిన జాతి మేల్కొని స్వాతంత్య్రం సాధించుకోవడం చరిత్రాత్మకమే! భారత స్వాతంత్య్రోద్యమం ప్రధానంగా అహింసాయుతంగా సాగినా, స్వరాజ్యం రక్తపుటడుగుల మీదనే వచ్చిందన్న సత్యం దాచకూడనిది. స్వాతంత్య్రం, దేశ విభజన ఏకకాలంలో జరిగాయి. నాటి హింసకు ఇరవై లక్షల మంది బలయ్యారు. కోటీ నలభయ్ లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారత విభజన ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్తపాతంతో కూడిన ఘటనగా నమోదైంది.విస్మరించలేని వాస్తవాలు స్వాతంత్య్ర సమరంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రస్థానంలో నిలిచిన సంగతితో పాటు గిరిజన, రైతాంగ పోరాటాలు, విదేశీ గడ్డ మీద నుంచి జరిగిన ఆందోళనలు, తీవ్ర జాతీయవాదులు సాగించిన ఉద్యమాలు, బ్రిటిష్ ఇండియా చట్టసభలలో ప్రవేశించిన భారతీయ మేధావులు నాటి చట్టాలను దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మలచడానికి చేసిన కృషి విస్మరించలేనివి. అటవీ చట్టాల బాధతో కొండకోనలలో ప్రతిధ్వనించిన గిరిజనుల ఆర్తనాదాలు, అండమాన్ జైలు గోడలు అణచివేసిన దేశభక్తుల కంఠశోష ఇప్పటికైనా వినడం ధర్మం.విభజన సృష్టించిన హింసాకాండ..రెండో ప్రపంచయుద్ధం ప్రారంభమైన రెండేళ్లకే వలసల నుంచి ఇంగ్లండ్ వైదొలగడం అవసరమన్న అభిప్రాయం ఆ దేశ నేతలలో బలపడింది. ఆ నేపథ్యంలోనే 1942 నాటి క్విట్ ఇండియా ఘట్టం భారత్ స్వాతంత్య్రోద్యమాన్ని చివరి అంకంలోకి ప్రవేశపెట్టింది. ‘భారత్‌ను విడిచి వెళ్లండి!’ అన్నది భారత జాతీయ కాంగ్రెస్ నినాదం. ‘భారత్‌ను విభజించి వెళ్లండి!’ అన్నది ముస్లిం లీగ్ సూత్రం. ఇదే ప్రతిష్టంభనను సృష్టించింది. స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా సంవత్సరం ముందు (16 ఆగస్ట్ 1946) ముస్లిం లీగ్ ఇచ్చిన ‘ప్రత్యక్ష చర్య’ పిలుపు, పర్యవసానాలు ఆ ప్రతిష్టంభనకు అవాంఛనీయమైన ముగింపును ఇచ్చాయి. భారత్‌లో అంతర్యుద్ధం తప్పదన్న భయాలు ఇంగ్లండ్‌కు కలిగించిన పరిణామం కూడా అదే! అంతర్యుద్ధం అనుమానం కాదు, నిజమేనని పంజాబ్ ప్రాంత ప్రముఖుడు మాస్టర్ తారాసింగ్ ప్రకటించారు.అటు పంజాబ్లోను, ఇటు బెంగాల్లోను మతఘర్షణలు తారస్థాయికి చేరాయి. ఈ దృశ్యానికి పూర్తి భిన్నమైన చిత్రం మరొకటి ఉంది. 1946లో జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ భాగస్వాములుగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం విభేదాలతో సతమతమవుతున్నది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో విభజన ప్రయత్నాలు శరవేగంగా జరిగాయి. భారత స్వాతంత్య్రానికి 1947 ఫిబ్రవరి 20న లేబర్ పార్టీ ప్రధాని క్లెమెంట్ అట్లీ ముహూర్తం ఖరారు చేశాడు. 1947 మార్చి 5న బ్రిటిష్ పార్లమెంట్లో చర్చ జరిగింది. నిజానికి అది భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే అంశం కాదు. ఉపఖండ విభజన గురించి. ఫిబ్రవరి 20 నాటి ప్రకటన ప్రకారం 1948 జూన్ మాసాంతానికి భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలి. కానీ ఆ ఘట్టాన్ని 11 మాసాల ముందుకు తెచ్చినవాడు లార్డ్ లూయీ మౌంట్‌బాటన్ , ఆఖరి వైస్రాయ్. ఈ తడబాటే, ఈ తొందరపాటే ఉపఖండాన్ని నెత్తురుటేరులలో ముంచింది.గాంధీజీకి నెరవేరని కోరిక..విభజన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాడన్న నెపంతో 1947 ఫిబ్రవరిలో వైస్రాయ్ వేవెల్ను వెనక్కి పిలిపించి, 1947 మార్చి 22న మౌంట్‌బాటన్ ను పంపించారు. భారత్ విభజనను ఆగమేఘాల మీద పూర్తి చేసేందుకే మౌంట్‌బాటన్ ను నియమించారు. ఈ దశలోనే గాంధీజీకీ, జాతీయ కాంగ్రెస్‌కూ మధ్య ‘మౌన’సమరం మొదలయింది. ‘విభజనను కాంగ్రెస్ ఆమోదిస్తే అది నా శవం మీద నుంచే జరగాలి’ అని మౌలానా అబుల్ కలాం ఆజాద్‌తో గాంధీజీ వ్యాఖ్యానించినా దాని ప్రభావం కనిపించలేదు. 1947 మేలో మౌంట్‌బాటన్ విభజన ప్రణాళికను కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ల ముందు పెట్టాడు. ఇది స్వదేశీ సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చింది. దీనిని మొదట నెహ్రూ వ్యతిరేకించినా, తరువాత అంగీకరించారు. స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితులలో 565 సంస్థానాలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారాన్ని విభజన ప్రణాళిక ఇచ్చింది.గాంధీజీ లేకుండానే విభజన నిర్ణయం..1947 జూన్ 3న మౌంట్‌బాటన్ భారత్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, విభజన గురించి ప్రకటించారు. కేవలం తొమ్మిది మంది సమక్షంలో విభజన నిర్ణయం ఖరారైంది. నెహ్రూ, పటేల్, జేబీ కృపలానీ (కాంగ్రెస్), జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ (లీగ్) బల్దేవ్సింగ్ తదితరులు మాత్రమే ఉన్నారు. ఈ కీలక సమావేశంలో గాంధీజీ లేని సంగతి గమనించాలి. మౌంట్‌బాటన్ పథకానికే 1947 జూలై 5న ఇంగ్లండ్ సింహాసనం ఆమోదముద్ర వేసింది. మూడు రోజుల తరువాత బ్రిటిష్ పార్లమెంట్ అంగీకారం తెలియచేసింది. ఆగస్ట్ 15వ తేదీకి ఐదు వారాల ముందు 1947 జూలై 8న సరిహద్దు కమిషన్ ఆ పని ఆరంభించింది. కాంగ్రెస్, లీగ్‌ల నుంచి చెరొక నలుగురు సభ్యులుగా ఉన్నారు. సర్ సిరిల్ జాన్ రాడ్‌క్లిఫ్ ఆ కమిషన్ అధ్యక్షుడు. భారతదేశం గురించి ఏమాత్రం అవగాహన లేనివాడని ఆయన మీద ఆరోపణ. కాలదోషం పట్టి మ్యాపుల ఆధారంగా విభజన రేఖలు వచ్చాయి. బెంగాల్, పంజాబ్‌ల విభజనకు కూడా కమిషన్ లు ఏర్పడినాయి.ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పటేల్, మేనన్..యూనియన్ జాక్ దిగితే భారత్‌కు సార్వభౌమాధికారం వస్తుంది. కానీ సంస్థానాలు స్వయం నిర్ణయం తీసుకుంటే కొత్త సార్వభౌమాధికారానికి పెను సవాలు ఎదురవుతుంది. ఈ ప్రమాదాన్ని సకాలంలో గుర్తించిన వారు సర్దార్ పటేల్, బ్రిటిష్ ఇండియాలో రాష్ట్రాల వ్యవహారాల ఇన్ చార్జ్ వీపీ మేనన్ . ఆ సమస్యను పరిష్కరించినవారూ వారే! దేశం మీద స్వతంత్ర భారత పతాకం ఎగిరే నాటికే కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని సంస్థానాలను వారు భారత యూనియన్ లోకి తేగలిగారు. ఇది స్వతంత్ర భారతావని భవిష్యత్తును తీర్చిదిద్దిన నిర్మాణాత్మక ఘట్టం. సాంస్కృతిక ఐక్యతకు రాజకీయ ఐక్యతను జోడిరచిన పరిణామం. 1947 ఆగస్ట్ 15న భారత్ స్వతంత్ర దేశమైంది. – డాక్టర్ గోపరాజు నారాయణరావు -
మన్యం విప్లవ జ్యోతి..
భారత స్వాతంత్య్ర పోరాటంలో విప్లవ పథాన్ని అనుసరించి పోరాడిన వీరుల్లో అల్లూరి సీతారామరాజు అగ్రగణ్యుడు. విశాఖ జిల్లా పాండ్రంకిలో జన్మించిన ఆయన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణ విద్యతో పాటు యుద్ధ విద్య, జ్యోతిష్యం వంటివాటిని అభ్యసించాడు. తరువాత దేశ సంచారం చేసి దేశంలో ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని విశాఖ జిల్లా కృష్ణదేవిపేట వచ్చి మన్యంలో తిరుగుబాటు మొదలుపెట్టాడు.కవర్డు, హైటర్ వంటి అధికారులను సీతారామరాజును మట్టు పెట్టటానికి మన్యం పంపింది బ్రిటిష్ ప్రభుత్వం. లోతుగడ్డ వాగు దగ్గర సీతారామరాజు ఉన్నాడని తెలుసుకొని, 300 మంది పటాలంతో వాళ్లు బయలుదేరారు. ముందుగానే వారి రాకను పసిగట్టిన సీతా రామరాజు విలువిద్యలో ఆరితేరిన గోకిరి ఎర్రేసు, గాము గంటం దొర, మల్లు దొర, పడాలు అగ్గిరాజువంటి వారితో కలిసి గొరిల్లా యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇరుకైన మార్గంలో వస్తున్న కవర్డ్, హైటర్లు సీతారామరాజు దళం దెబ్బకు పిట్టల్లా రాలిపోయారు. ఇది రామరాజు మొదటి విజయం. దీంతో రామరాజు తలమీద బ్రిటిష్ గవర్నమెంట్ 10 వేల రివార్డు ప్రకటించింది.అయితే ఈ దాడిలో మల్లు దొరకు తుపాకీ గుండు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు రామరాజు బ్రిటిష్ వారితో పోరాడాలంటే విల్లంబులు చాలవనీ, తుపాకులు కావాలనీ భావించాడు. తుపాకుల కోసం ఎవరి మీద దాడి చేయకుండా, పోలీస్ స్టేషన్లో తుపాకులను, మందుగుండు సామగ్రిని కొల్లగొట్టాలి అని నిర్ణయించుకున్నాడు. అన్నవరం, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం పోలీస్ స్టేషన్లకు ఒకదాని తరువాత మరొకదానికి మిరపకాయ టపా పంపి తాను స్టేషన్‌పై దాడికి వస్తున్నట్లు తెలిపి మరీ తుపాకులను దోచుకున్నాడు. పోలీస్ రికార్డుల్లో తాను ఎన్ని తుపాకులు తీసుకువెళ్తున్నాడో ఆ వివరాలన్నీ రాసి కింద ‘శ్రీరామరాజు’ అని సంతకం చేశాడాయన.గుంటూరు కలెక్టర్‌గా పనిచేస్తున్న రూథర్‌ఫర్డ్‌ను సీతారామరాజును అణచడానికి విశాఖ జిల్లాకు పంపించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇదే సమయంలో పరమ నీచుడైన బ్రిటిష్ మేజర్ గుడాల్, గిరిజన గూడేలపై పడి ఆడవాళ్ళపై అత్యాచారాలు చేస్తూ పసిపిల్లలను వధించటం, భార్యల ఎదుటే భర్తను చంపటం, గిరిజన గూడేలను తగలబెట్టడం లాంటి చర్యలకు ఒడిగట్టాడు. ఇది సీతారామరాజుకి తెలిసి, తన వల్ల అమాయకులైన గిరిజన జనం చనిపోవడం, ఇబ్బందులపాలు కావడం ఇష్టంలేక లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. మార్గమధ్యలో గుడాల్ మాటు వేసి, తన సైన్యంతో సీతారామరాజును బంధించాడు. ఆయన్ని నులక మంచానికి కట్టి, నానా హింసలు పెట్టి, వీధుల్లో ఊరేగించి తుపాకీతో కాల్చి చంపాడు. ఆ విధంగా ఒక విప్లవ జ్యోతి అమరదీపమై దేశ స్వాతంత్రోద్యమానికి దారి చూపింది. – పొత్తూరి సీతారామరాజు, కాకినాడ (నేడు అల్లూరి సీతారామరాజు జయంతి) -
విప్లవ జ్యోతి
ప్రపంచ ప్రజలను ప్రభావితం చేసిన విప్లవ నాయకుడు చే గువేరా. అర్జెంటీనాకు చెందిన ఈ మార్క్సిస్ట్ విప్లవకారుడు... వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకర్త, క్యూబన్ విప్లవంలో ముఖ్యుడు. ఆయన అసలు పేరు ఎర్నేస్తో ‘చే’ గువేరా. 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియోలో జన్మించారు. ఆయనకు ఆస్తమా వ్యాధి వుండేది. ఆ వ్యాధితో బాధపడుతూనే విప్లవ పోరాటాలు చేశారు. లాటిన్ అమెరికాలో పర్యటన సమయంలో అక్కడి పేదరికం చూసి చలించిపోయారు. దీనికి కారణం ఆర్థిక తారతమ్యాలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, నూతన వలసవాదం, సామ్రాజ్యవాదాలేనని భావించారు. సమకాలీన వ్యవస్థపై తిరుగుబాటు చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చని భావించారు. అందుకే విప్లవం బాట పట్టారు.మెక్సికోలో ఉంటున్న సమయంలో రౌల్, ఫిడెల్ కాస్ట్రోలను కలిశారు. అప్పటి నుంచి వారితో భుజం భుజం కలిపి క్యూబాను బాటిస్టా పాలన నుంచి విముక్తి చేయడానికి పోరాడారు. విప్లవకారుల్లో ముఖ్యమైన వ్యక్తిగా, సైన్యంలో రెండవ స్థానానికి చేరుకుని, నియంతృత్వ బాటిస్టాపై జరిగిన గెరిల్లా పోరాటంలో కీలకపాత్ర పోషించారు. క్యూబా తిరుగుబాటు తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో అనేక ప్రధాన బాధ్యతలను స్వీకరించారు. మంచి వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా, క్యూబా సైనికదళాల బోధనా నిర్దేశకునిగా, క్యూబన్ సామ్యవాద దౌత్యవేత్తగా ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు చేశారు.గెరిల్లా యుద్ధ తంత్రంపై ఆధార గ్రంథాన్ని రాశారు. దక్షిణ అమెరికాలో ఆయన జరిపిన యూత్ మోటార్ సైకిల్ యాత్ర జ్ఞాపకాల ఆధారంగా పుస్తకం రాశారు. గువేరా 1965లో క్యూబాను వదలి కాంగో కిన్షాసాలోనూ, బొలీవియాలోనూ యుద్ధాలకు నాయకత్వం వహించారు.బొలీవియా యుద్ధంలో పాల్గొని, 1967 అక్టోబర్ 9న అక్కడి సైనికాధికారులకు పట్టుబడి కాల్చివేతకు గురయ్యారు. అలా తాను పుట్టిన దేశం వదలి ప్రపంచ పీడితుల పక్షాన వివిధ దేశాల్లో పోరాటాలు చేస్తూ అసువులు బాసి ఆధునిక విప్లవం మీద తనదైన ముద్ర వేశారు చే!– ర్యాలి ప్రసాద్, కాకినాడ(నేడు చే గువేరా జయంతి) -
ఎనిమిదేళ్లకే పెళ్లి..బడి గుమ్మం తొక్కలేదు : అయితేనేం ఆమె ఒక లెజెండ్!
స్వాతంత్ర్య పోరాటంలో భారతీయ మహిళలు కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సమరరంగాన దూకేందుకు ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. అలాంటి సమర యోధుల్లో నెల్లూరుకు చెందిన పొణకా కనకమ్మ ఒకరు. ఎనిమిదేళ్లకే వివాహం. పాఠశాల గడప తొక్క కుండానే పాండిత్యాన్ని సంపాదించారు. చివరికి జైలుకు వెళ్లారు. ఎవరీ కనకమ్మ? నెల్లూరు వాసులకే కాదు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచిన ధీరవనిత కనకమ్మ జీవిత విశేషాలు మీకోసం... కవయిత్రి, సామాజిక కార్యకర్త కనకమ్మ 1882 జూన్ 10న పోట్లపూడి గ్రామంలో మరుపూరు కొండారెడ్డి, రావమ్మల దంపతులకు జన్మించారు. ఎనిమిదేళ్లకే నెల్లూరు సమీపంలోని పొట్లపూడి గ్రామం భూస్వామి మేనమామ, సుబ్బ రామ రెడ్డితో బాల్య వివాహం అయింది కనకమ్మకు. దీంతో కుటుంబ కట్టుబాట్ల ప్రకారం పాఠశాలకు వెళ్లేందుకు అనుమతి లేదు. అయితే ఆమెలోని ధీరత్వం వెనక్కి పోలేదు. సంఘ సేవ కోసం ఇల్లు విడిచి కనకమ్మ ఉద్యమబాటన నడిచారు. నెల్లూరు కాంగ్రెస్ కమిటీకి తొలిమహిళా అధ్యక్షురాలుగా ఎంపికైన ఘనత కనకమ్మ సొంతం. మహాత్మా గాంధీ శిష్యురాలిగా ఉప్పు 1930ల కాలంలో సత్యాగ్రహం,వందేమాతరం ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దీంతో వేలూరు, నెల్లూరు జైళ్లలో ఒక ఏడాదికిపైగా జైలు జీవితాన్ని అనుభవించారు. 1913లో పోట్లపూడిలో సుజన రంజనీ సమాజ స్థాపన, వివేకానంద గ్రంథాలయం, బాలబాలికల విద్య కోసం శ్రీ కస్తూరిదేవి విద్యాలయం స్థాపనలో ఆమె కృషి మరువలేనిది. సాహిత్య రంగంలో కూడా కనకమ్మ ఎంతో కృషి చేశారు. వ్యాసాలు, కవితలు రచించారు. ముఖ్యంగా స్త్రీవాద కోణంలో ఆమె రచనలు సాగాయి. కొంతకాలం జమీన్ రైతు పత్రికను కూడా నడిపారు. అందుకే ప్రతిష్ఠాత్మకమైన గృహలక్ష్మి స్వర్ణకంకణం కూడా ఆమెను వరించింది.తన జీవితంలో 45 ఏళ్లు సామాజిక కార్యక్రమాలకే అంకితం చేసిన గొప్ప మహిళ. 1963 సెప్టెంబర్ 15న కనకమ్మ కనకమ్మ అస్తమించారు. 2011లో ఆమె ఆత్మకథను తెలుగులో “కనకపుష్యరాగం” పేరుతో డా.కె.పురుషోత్తం విడుదల చేయడం గమనార్హం‘‘ఊయలలూగించే కోమల కరాలే రాజ్యాలు శాసిస్తవి ,తూలికపట్టే మృదుహస్తాలే శతఘ్నులు విదలిస్తవి, జోలలుబుచ్చే సుకుమారపు చేతులే జయభేరులు మోగిస్తవి’’ -కనకమ్మ -
ఎనిమిదేళ్లకే పెళ్లి..బడి గుమ్మం తొక్కలేదు : అయితేనేం ఆమె ఒక లెజెండ్!
స్వాతంత్ర్య పోరాటంలో భారతీయ మహిళలు కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సమరరంగాన దూకేందుకు ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. అలాంటి సమర యోధుల్లో నెల్లూరుకు చెందిన పొణకా కనకమ్మ ఒకరు. ఎనిమిదేళ్లకే వివాహం. పాఠశాల గడప తొక్క కుండానే పాండిత్యాన్ని సంపాదించారు. చివరికి జైలుకు వెళ్లారు. ఎవరీ కనకమ్మ? నెల్లూరు వాసులకే కాదు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచిన ధీరవనిత కనకమ్మ జీవిత విశేషాలు మీకోసం... కవయిత్రి, సామాజిక కార్యకర్త కనకమ్మ 1882 జూన్ 10న పోట్లపూడి గ్రామంలో మరుపూరు కొండారెడ్డి, రావమ్మల దంపతులకు జన్మించారు. ఎనిమిదేళ్లకే నెల్లూరు సమీపంలోని పొట్లపూడి గ్రామం భూస్వామి మేనమామ, సుబ్బ రామ రెడ్డితో బాల్య వివాహం అయింది కనకమ్మకు. దీంతో కుటుంబ కట్టుబాట్ల ప్రకారం పాఠశాలకు వెళ్లేందుకు అనుమతి లేదు. (మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు: సెల్ఫీ వీడియో పుణ్యమే!) అయితే ఆమెలోని ధీరత్వం వెనక్కి పోలేదు. సంఘ సేవ కోసం ఇల్లు విడిచి కనకమ్మ ఉద్యమబాటన నడిచారు. నెల్లూరు కాంగ్రెస్ కమిటీకి తొలిమహిళా అధ్యక్షురాలుగా ఎంపికైన ఘనత కనకమ్మ సొంతం. మహాత్మా గాంధీ శిష్యురాలిగా ఉప్పు 1930ల కాలంలో సత్యాగ్రహం,వందేమాతరం ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దీంతో వేలూరు, నెల్లూరు జైళ్లలో ఒక ఏడాదికిపైగా జైలు జీవితాన్ని అనుభవించారు. 1913లో పోట్లపూడిలో సుజన రంజనీ సమాజ స్థాపన, వివేకానంద గ్రంథాలయం, బాలబాలికల విద్య కోసం శ్రీ కస్తూరిదేవి విద్యాలయం స్థాపనలో ఆమె కృషి మరువలేనిది. (లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు? ) సాహిత్య రంగంలో కూడా కనకమ్మ ఎంతో కృషి చేశారు. వ్యాసాలు, కవితలు రచించారు. ముఖ్యంగా స్త్రీవాద కోణంలో ఆమె రచనలు సాగాయి. కొంతకాలం జమీన్ రైతు పత్రికను కూడా నడిపారు. అందుకే ప్రతిష్ఠాత్మకమైన గృహలక్ష్మి స్వర్ణకంకణం కూడా ఆమెను వరించింది.తన జీవితంలో 45 ఏళ్లు సామాజిక కార్యక్రమాలకే అంకితం చేసిన గొప్ప మహిళ. 1963 సెప్టెంబర్ 15న కనకమ్మ కనకమ్మ అస్తమించారు. 2011లో ఆమె ఆత్మకథను తెలుగులో “కనకపుష్యరాగం” పేరుతో డా.కె.పురుషోత్తం విడుదల చేయడం గమనార్హం. (వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!) ‘‘ఊయలలూగించే కోమల కరాలే రాజ్యాలు శాసిస్తవి ,తూలికపట్టే మృదుహస్తాలే శతఘ్నులు విదలిస్తవి, జోలలుబుచ్చే సుకుమారపు చేతులే జయభేరులు మోగిస్తవి’’ -కనకమ్మ -
103 ఏళ్ల తాత మూడో పెళ్లి
లక్నో: మధ్యప్రదేశ్‌లో 103 ఏళ్ల వ్యక్తి 49 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. తన ఇద్దరు భార్యలు మరణించిన కారణంగా మూడో పెళ్లి చేసుకున్నట్లు ఆయన చెప్పారు. తాత వయసున్న ఆయన తన మూడో భార్యతో బయటకు వెళ్లిన క్రమంలో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హబీబ్ నాజర్(103) మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నాడు. ఆయన ఇద్దరు భార్యలు ఇప్పటికే మరణించారు. దీంతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న ఆయన ఒంటరిగా జీవించాలని అనుకోలేదు. అందుకే మూడో వివాహం చేసుకోవాలనుకున్నారట. అందుకే 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. शादी की कोई उम्र नहीं! 103 साल के बुजुर्ग ने 49 की फिरोज जहां से किया निकाह, देखें Video पूरी खबर पढ़ें: https://t.co/rgQhoNLQli#Bhopal #ndtvmpcg #viralvideos pic.twitter.com/dDtcsUOlEm — NDTV MP Chhattisgarh (@NDTVMPCG) January 29, 2024 విహహం అనంతరం నాజర్ మాట్లాడుతూ..' నాకు 103 ఏళ్లు. నా భార్యకు 49. నాసిక్‌లో మొదటిసారి వివాహం అయింది. ఆమె చనిపోయాకు లక్నోలో మరో వివాహం చేసుకున్నారు. రెండో భార్య కూడా చనిపోయింది. నాకు జీవితం ఒంటరిగా అనిపిస్తోంది. ఆరోగ్యంగా ఉన్నాను. ఎలాంటి మెడికల్ సమస్యలు లేవు. అందుకే మరో వివాహం చేసుకున్నాను.' అని తెలిపారు. ఫిరోజ్ జహాన్‌కు ఇది రెండో వివాహం. తన భర్త చనిపోయిన కారణంగా ఒంటరిగా జీవిస్తోంది. 103 ఏళ్ల హబీబ్ నాజర్‌కు స్థానికంగా మంచి పేరు కూడా ఉంది. ఆయనకు చూసుకునే వారు ఎవరూ లేనందున వివాహానికి జహాన్ ఒప్పుకుంది. ఇదీ చదవండి: Preeti Rajak: సుబేదార్ ప్రీతి -
కామ్రేడ్ శంకరయ్య కన్నుమూత.. నేరుగా ఆస్పత్రికి వెళ్లిన సీఎం స్టాలిన్
శతాధిక స్వాంతంత్య్ర సమరయోఢుడు, తమళనాడుకు చెందిన సీపీఎం సీనియర్ నేత ఎన్.శంకరయ్య(102) బుధవారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చైన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ నేరుగా ఆస్పత్రికి వచ్చి ఎన్. శంకరయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎన్. శంకరయ్య పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తీసుకెళ్లే ముందు అభిమానుల సందర్శనార్థం సీపీఎం కార్యాలయానికి తరలించనున్నారు. ఎన్. శంకరయ్య కన్నుమూత గురించి తెలియజేస్తూ తమిళనాడు సీపీఎం సోషల్ మీడియా ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. కామ్రేడ్ శంకరయ్య భౌతికంగా మనకు దూరమైనా చరిత్ర ఉన్నంత వరకూ ఆయన మనతోనే ఉంటారని పేర్కొంది. స్వాంతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర అత్యంత సీనియర్ నాయకుడు, స్వాంతంత్య్ర సమరయోధుడిగా పేరొందిన ఎన్.శంకరయ్య భారత స్వాంతంత్య్ర ఉద్యమంలో చరుకైన పాత్ర పోషించారు. ఎన్నో విద్యార్థి ఉద్యమాలను నడిపించారు. 1995 నుంచి 2002 వరకు సీపీఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. తన రాజకీయ ప్రస్థానంలో మధురై వెస్ట్, మధురై ఈస్ట్ నియోజకవర్గాల నుంచి తమిళనాడు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. தோழர் என்.எஸ். மறைவு! #CPIM மாநிலச் செயலாளர் தோழர் கே.பாலகிருஷ்ணன், தமிழ்நாடு முதல்வர் மு.க.ஸ்டாலின் ஆகியோர் நேரில் அஞ்சலி செலுத்தினர். #ComradeNS #NSankaraiah #FreedomFighter #CommunistLeader #CPIMLeader More: https://t.co/46hnp062DE pic.twitter.com/h8lPadt4Pp — CPIM Tamilnadu (@tncpim) November 15, 2023 -
ఖుదీరామ్ కష్టాలు
భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుల్లో అతి చిన్న వయసులో అమరులైన ఖుదీరామ్ బోస్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. రాకేష్ జాగర్లమూడి టైటిల్ రోల్లో విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. జాగర్లమూడి పార్వతి సమర్పణలో రజితా విజయ్ జాగర్లమూడి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో, అలాగే గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులకు ఈ సినిమాని ప్రదర్శించగా ప్రశంసించారని యూనిట్ పేర్కొంది. అయితే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన ఈ సినిమా విడుదలకు నోచుకోక, ఆర్థిక సమస్యల ఒత్తిడితో విజయ్ జాగర్లమూడి గుండె పొటుకు గురై, చికిత్స తీసుకుంటున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ముఖ్యమంత్రిగా పని చేసి చివరి రోజుల్లో తినడానికి తిండి లేని స్థితిలో..
స్వాతంత్య్రోద్యమ పోరాటంలో దమ్ముంటే కాల్చండి.. రండిరా అంటూ పోలీసులకే ఎదురెళ్లి చొక్కా విప్పి రొమ్ము చరిచి నిలబడ్డ ఘనుడు టంగుటూరి ప్రకాశం పంతులు. సంతంత్ర ఉద్యమ పోరాటంలో ప్రజల కోసం తన యావదాస్తిని ఖర్చు చేసిన మహాశిలి ఈ ఆంధ్రకేసరి. కటిక పేదరికంలో జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన పట్టుదలతో బారిష్టర్ చదివి డబ్బు సంపాదించారు. ఆంధ్రరాష్ట తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు తన చివరి రోజుల్లో తినడానికి తిండి లేక అల్లాడిపోయారు. కటిక పేదరికంలోనే కన్నుమూశారు. నిరుపేదల లాయర్ టంగుటూరి ప్రకాశం చివరి రోజుల్లో ఎంత ఇబ్బందులపాలయ్యాడో వివరించాడు సినీ గేయరచయిత టంగుటూరి వెంకట రామదాస్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'టంగుటూరి ప్రకాశం గొప్ప లాయర్. ఆయన న్యాయవాదిగా పని చేసేటప్పుడు ధనవంతుల దగ్గర ఎంత డబ్బు తీసుకునేవారో లేనివాళ్ల దగ్గర ఒక్క పైసా కూడా తీసుకునేవారు కాదు. ఒకసారి ఆయన కోర్టులో వాదిస్తున్నప్పుడు తన ఇంట్లో ఎవరో చనిపోయిన వార్త అందింది. పూలకు బదులు పండ్లు తేవచ్చుగా అయినా సరే ఆయన వెళ్లకపోవడంతో జడ్జి ఇంకా ఇక్కడే ఎందుకున్నావని అడిగారు. దానికాయన.. చనిపోయినవాళ్లను ఎలాగో తిరిగి తీసుకురాలేను. ఈ కేసు ఓడిపోతే వీరి జీవితం అన్యాయం అయిపోతుందని బదులిచ్చారు. అలాంటి నిస్వార్థ వ్యక్తి చివరి రోజుల్లో తినడానికి తిండి లేని దయనీయస్థితిలో గడిపారు. కటిక దరిద్రంలో ప్రాణాలు విడిచారు. ఒకసారి ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానం చేశారు. ఈ పూలకు బదులుగా అర డజను అరటిపండ్లు తెస్తే తినేవాడిని కదరా అన్నారు. ఆ మాటతో ఆయన వాస్తవ స్థితి అర్థమై అక్కడున్నవారంతా ఏడ్చేశారు. అలా సంపాదించిందంతా పోయింది ఈ పరిస్థితికి రావడానికి గల కారణం.. టంగుటూరి ప్రకాశంకు ఉన్న మితిమీరిన జాలి, దయాగుణం. ఎవరైనా సాయమడిగితే తన దగ్గర ఎంతుంటే అంత ఇచ్చేవారు. బీరువాలో ఎంతుంటే అది రెండు చేతులతో తీసిచ్చేవారు. తన కోసం, తన కుటుంబం కోసం ఏదీ దాచుకోలేదు. అలా సంపాదించిందంతా పోయింది' అని పేర్కొన్నారు. కాగా టంగుటూరి వెంకటరామదాస్.. కౌసల్య, గోదావరి, శివలింగాపురం, మహదేవపురం, ఆది నీవే అంతం నీవే, నీకు నేను నాకు నువ్వు వంటి పలు చిత్రాల్లో గేయ రచయితగా పని చేశారు. చదవండి: ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్.. ప్లానింగ్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! -
బీజేపీలోకి సి.రాజగోపాలచారి ముని మనవడు
న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత దేశ చిట్టచివరి గవర్నర్ జనరల్ అయిన సి.రాజగోపాలాచారి ముని మనవడు సీఆర్ కేశవన్ శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దక్షిణభారతంలో మరింతగా పుంజుకునేందుకు కృషిచేస్తున్న పార్టీలోకి నేతలు చేరుతుండటం బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. కేంద్ర మంత్రి వీకే సింగ్, బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి అనిల్ బలూనీల నేతృత్వంలో ఆయన బీజేపీలో చేరారు. ‘ ప్రజామోదంతో పాలిస్తూ అవినీతిరహిత, సమ్మిళ ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తున్న ప్రధాని మోదీపై గౌరవంతో పార్టీలో చేరాను’ అని బీజేపీలోకి వచ్చిన సందర్భంగా కేశవన్ వ్యాఖ్యానించాను. తమిళనాడుకు చెందిన కేశవన్ తొలినాళ్లలో కాంగ్రెస్‌లో కొనసాగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను వీకేసింగ్ పరోక్షంగా విమర్శించారు. ‘ సి.రాజగోపాలాచారి దేశం కోసం అవిశ్రాంతంగా పోరాడారు. కానీ స్వాతంత్య్రం వచ్చాక ఆయన చేసిన త్యాగాలు మరుగునపడేలా, చరిత్ర గర్భంలో కలిసిపోయేలా కొందరు కుట్ర పన్నారు. దేశం కోసం తాము మాత్రమే కష్టపడ్డామని కేవలం ‘ఒక్క కుటుంబం’ మాత్రం ప్రకటించుకుంది’ అంటూ గాంధీల కుటుంబాన్ని పరోక్షంగా విమర్శించారు. తమిళనాడులో కేశవన్ బీజేపీ వాణిని గట్టిగా వినిపిస్తారన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీలో చేరుతున్న నేతల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. -
Subhash Chandra Bose: ఉర్రూతలూగించిన నేత!
క్రమశిక్షణ, దేశభక్తి, దైవభక్తి ఉన్న సేవాతత్పరుడు సుభాష్ చంద్రబోస్ మరణించి 78 ఏళ్లవుతోంది. అయినా ఆయన మరణానికి కారణమని చెబుతున్న విమాన ప్రమాద కారణం నేటికీ జవాబులేని ప్రశ్నగా నిలిచి పోయింది. ప్రభావతీ దేవి, జానకీ నాథ్ బోస్ దంపతుల సంతానంలో తొమ్మిదోవాడుగా సుభాస్ చంద్రబోస్ 1897 జనవరి 23న కటక్‌లో జన్మించారు. ఐసీఎస్‌లో అఖిల భారత స్థాయిలో నాలుగవ స్థానం పొందారు. బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ సహాయ కార్యదర్శిగా దేశమంతా పర్యటిస్తూ చేసిన ప్రసంగాలకు లక్షలాది మంది ప్రేరణ పొందారు. ఉప్పు సత్యా గ్రహం సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసి అనేక జైళ్లలో తిప్పి, చివరికి దేశ బహిష్కరణ శిక్ష వేసింది. 1933లో ‘ఇండియన్ స్ట్రగుల్’ పుస్తకాన్ని రాశారు. తండ్రి మరణంతో భారత్‌కు తిరిగి రాగా, ఆరోగ్యం క్షీణిస్తే, చికిత్స కోసం ప్రజలు చందాలువేసి మరీ వియన్నా పంపారు. అప్పుడే యూరప్ పర్యటించారు. ఆ రోజుల్లోనే ముస్సోలినీ, హిట్లర్, రోమరోల వంటివారిని కలిశారు. నెహ్రూ అధ్యక్షతన లక్నోలో జరిగే కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యేందుకు దేశంలో దిగగానే ఆయనను ఖైదు చేసి ఎరవాడ జైలుకు పంపారు. 1937లో విడుదల కాగానే అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడై దేశమంతా పర్యటిస్తూ ప్రజలను స్ఫూర్తిదాయక ఉపన్యాసాలతో ఉర్రూతలూగించి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడయ్యారు! ఆది ఆయన పట్ల అసూయాపరులను పెంచింది. రెండవ పర్యాయం మళ్ళీ పోటీజేసి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గెలుపు కోసం ప్రయత్నించకుండానే పట్టాభి సీతారామయ్యపై గెలిచి కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు. అయితే గాంధీజీకి ఆయన అధ్యక్షుడు కావడం ఇష్టం లేదు. దీంతో బోస్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేశారు. వెంటనే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. వారపత్రిక కూడా వెలువరించడం మొదలు పెట్టి మరోసారి దేశమంతా పర్యటించారు. 1942 జనవరి 26న పులి బొమ్మతో రూపొందించిన జండా ఎగరేసి, బెర్లిన్లోనే ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించారు. 1941 ఫిబ్ర వరి 27న ఆజాద్ హింద్ ఫౌజ్ రేడియోలో అద్భుత ప్రసంగం చేసి యావత్ భారతాన్నీ ఆయన ఆవేశంలో ముంచెత్తారు. మహిళలకు రంగూన్లో ఝాన్సీ లక్ష్మీబాయి రెజి మెంట్ ఏర్పాటు చేసి యుద్ధ శిక్షణ మొదలు పెట్టారు. చలో ఢిల్లీ నినాదం ఇచ్చి ప్రత్యక్ష యుద్ధానికి ప్రణాళిక రచించి ఇంఫాల్, అండమాన్, నికోబార్‌లో స్వతంత్ర భారత పతాకాన్ని ఆవిష్కరించి సాగిపోయారు. ఇంతలో జపాన్ మీద అణుబాంబు పడ్డది. జపాన్ అతలాకుతలమై పోయింది. బోస్ నిస్సహాయుడై సహచరుల బలవంతంపై మంచూరియాలో సురక్షిత అజ్ఞాత స్థలానికి వెళ్ళడానికి అనిష్టంగానే జపాన్‌లో విమానం ఎక్కి తైపే వరకూ ప్రయాణించారు. 1945 ఆగస్ట్ 18న అకస్మాత్తుగా విమానంలో సాంకేతిక ఇబ్బంది వచ్చి కూలిపోయిందన్నారు. విమానంతో పాటే కోట్లాది భారతీయుల ఆశలూ నేల కూలాయి. 50 సంవత్సరాల వయసులోనే ఆ యోధునికి నూరేళ్ళూ నిండాయి. (క్లిక్ చేయండి: ‘కోహినూర్‌ను బ్రిటన్ దొంగిలించింది’) – నందిరాజు రాధాకృష్ణ (జనవరి 23 నేతాజీ జయంతి) -
Ravuri Arjuna Rao: కులం పేరు చెప్పాలని జైల్లో కొట్టారు
‘ఉప్పు సత్యాగ్రహంలో జైలుకెళ్లినప్పుడు కులం పేరు చెప్పని నాలాంటి వారిని పోలీసులు లాఠీలతో కొట్టారు. అయినా నా సిద్ధాంతానికి నీళ్లు వదల్లేదు. కుల మత రహిత సమాజాన్నే జీవితాంతం కోరుకుంటాను’ అంటూ నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడ్డ స్వాతంత్య్ర సమరయోధుడు, నాస్తికుడు రావూరి అర్జునరావు. వర్ణ వివక్షకు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన యోధుడు ఆయన. నాస్తికోద్యమ నాయకుడు, గాంధేయవాది గోపరాజు రామచంద్రరావు (గోరా) పెద్ద అల్లుడు రావూరి అర్జునరావు (104) వయోభారంతో ఆదివారం హైదరాబాద్‌లో తన చిన్నకుమారుడు డాక్టర్ పవర్ నివాసంలో కన్నుమూశారు. సుమారు తొమ్మిదేళ్ల ఏళ్ల క్రితం ‘సాక్షి’తో ఆయన పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే... తొమ్మిది నెలల కఠిన కాగార శిక్ష కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వానపాముల గ్రామంలో 1918లో జన్మించాను. 1940లో సంఘ సంస్కర్త గోపరాజు రామచంద్రరావు(గోరా) ముదునూరు వచ్చారు. అప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడింది. నాస్తిక కేంద్రంలో అన్నే అంజయ్య సహకారంతో వయోజన విద్యా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. 1942లో గాంధీగారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బళ్లారిలోని ఆలీపురం క్యాంప్ జైల్లో తొమ్మిది నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాను. అస్పృస్యతా నివారణకు కృషి జైలు శిక్ష అనంతరం వానపాముల వచ్చి నాస్తికోద్యమ నాయకుడు గోరాతో కలిసి అస్పృస్యతా నివారణ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అప్పుడు దళితుల మధ్య కుల ద్వేషం ఎక్కువగా ఉండేది. నాలుగేళ్లు అక్కడే ఉండి రెండు కులాల్లో ఎవరి ఇంట్లో వివాహాలు జరిగినా కలిసి భోజనం చేయడం, బహు మతులు ఇచ్చి పుచ్చుకునేలా మార్పులు తీసుకొచ్చాం. ఆదర్శ వివాహాలకు ప్రాధాన్యమిచ్చాం. కులాంతర వివాహాల వల్ల సామాజిక అసమానతలు పోతాయని గోరా నమ్మేవారు. అదే ఆయనను గాంధీగారికి సన్నిహితుడిని చేసింది. గాంధీజీకి సపర్యలు జైల్లో ఉన్నప్పుడు గోరాతో నాకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. తన పెద్ద కుమార్తె మనోరమను వివాహం చేసుకోవాలని ఆయన నన్ను కోరారు. ఎవరైనా మంచి వ్యక్తితో మనోరమ వివాహం చేయమన్నాను. మనోరమతో వివాహానికి నన్ను ఒప్పించారు. ఈ విషయాన్ని ఆయన గాంధీకి తెలిపారు. 1945లో మమ్మల్ని మద్రాస్ తీసుకురావాలని గాంధీజీ గోరాకు ఉత్తరం రాశారు. మనోరమతో గాంధీజీ మాట్లాడి కులాంతర వివాహాన్ని రెండేళ్ల తరువాత చేయాలని సూచించారు. నన్ను సేవాగ్రామ్‌లో ఉండి హిందీ నేర్చుకోవాలని, అందరితో పరిచయాలు పెంచుకుని మనోరమకు ఉత్తరాలు రాయాలని గాంధీజీ చెప్పారు. అలా 1946 ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి 1948 ఏప్రిల్ వరకు గాంధీజీ సేవాగ్రాం ఆశ్రమం వార్ధాలో ఉంటూ ఆయనకు సపర్యలు చేశాను. 1948లో గాంధీజీ హత్యకు గురవ్వడంతో ఆయన సమక్షంలో జరగాల్సిన నా వివాహం నిలిచిపోయింది. మహామహులే పెళ్లి పెద్దలు గాంధీజీ లేరన్న శోకం నుంచి తేరుకున్నాక వార్ధాలోని మహాత్ముడి ఆశ్రమంలోనే అదే ఏడాది మార్చి 13న హరిజన్ సేవక్ సంఘ్ అధ్యక్షుడు ఠక్కర్బాబా ఆధ్వర్యంలో ‘సత్యసాక్షి’గా ప్రభాకర్జీ మా వివాహం జరిపించారు. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్, ఆచార్య కృపలానీ వంటి మహామహులు మా పెళ్లికి పెద్దలు. తరువాత విజయవాడ నాస్తిక కేంద్రానికి చేరుకున్నాం. 20 మందికి ఆదర్శ వివాహాలు 1953లో మా దంపతులం వానపాముల చేరుకుని కాపురం ప్రారంభించి, గాంధీ స్మారక నిధి తరఫున పని చేశాం. 1960లో గుడివాడకు మకాం మార్చాం. అక్కడే హరిజన సేవా సంఘం, బాలుర వసతి గృహం నడిపాం. ఖాదీ బోర్డులో కూడా పని చేసేవాడిని. గుడివాడ, కృష్ణా, నెల్లూరులలోని కొన్ని ప్రాంతాలలో మూఢనమ్మకాల నిర్మూలన, కుల మత రహిత సమాజ స్థాపనకు, సెక్యులర్ వ్యవస్థ నిర్మాణానికి కృషి చేశాం. సుమారు 20 మందికి ఆదర్శ వివాహాలు చేశాం. మనిషిని గౌరవించటం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. విజ్ఞానం పెరిగే కొద్దీ కులతత్వం పెరిగిపోతోంది. పూర్వం త్యాగం ఉండేది. స్వార్థం కోసమే కులతత్వం పెరుగుతోంది. ఆ బీజం నశించినప్పుడే నిజమైన నవ సమాజ స్థాపన జరిగినట్లు. విజయవాడకు రావూరి భౌతికకాయం రావూరి అర్జునరావు భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి సోమవారం విజయవాడ బెంజి సర్కిల్లోని నాస్తిక కేంద్రానికి తీసుకురానున్నారు. సోమవారమే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రావూరి అర్జునరావుకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
స్వాతంత్య్రయోధుడు రావూరి కన్నుమూత
వానపాముల(పెదపారుపూడి)/లబ్బీపేట(విజయవాడతూర్పు): స్వాతంత్య్ర సమరయోధుడు, నాస్తికోద్యమ నాయకుడు, గాంధేయవాది రావూరి అర్జునరావు (104) కన్నుమూశారు. ఆయన వయోభారంతో ఆదివారం హైదరాబాద్‌లో కుమారుడు డాక్టర్ పవర్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వానపాములలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయనకు భార్య మనోరమ, నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. మనోరమ నాస్తికోద్యమ నాయకుడు గోరా పెద్దకుమార్తె. అర్జునరావు.. గోరాతో కలిసి స్వతంత్ర పోరాటం, సాంఘిక ఉద్యమాల్లో పనిచేశారు. క్విట్ ఇండియా పోరు సమయంలో జైలు జీవితం గడిపారు. అర్జునరావు, మనోరమ గుజరాత్‌లోని గాంధీ సేవాగ్రాం ఆశ్రమంలో గాంధీతో కలిసి రెండేళ్లు ఉన్నారు. ఆ ఆశ్రమంలో మహాత్మాగాంధీ చేతుల మీదుగా జరగాల్సిన వీరి ఆదర్శ (కులాంతర) వివాహం.. ఆయన హత్యకు గురవడంతో నాటి ప్రధాని నెహ్రు చేతుల మీదుగా నిర్వహించారు. జీవితాంతం సామాజిక పరివర్తనకు కృషిచేసిన అర్జునరావు 2018లో వానపాములలో మార్పు ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం, దుస్తులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. అర్జునరావు భౌతికాయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడలో నాస్తిక కేంద్రానికి తరలించి సోమవారం అంత్యక్రియలు జరపనున్నారు. -
సాయుధ పోరాట యోధుడు జైని మల్లయ్యగుప్తా అంత్యక్రియలు పూర్తి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాటవీరుడు జైని మల్లయ్యగుప్తా(97) బుధవారంరాత్రి కన్నుమూశారు. కొద్దికాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మల్లయ్యగుప్తా హైదరాబాద్ నాగోల్‌లోని తన కుమారుడు మధుసూదన్ ఇంట్లో తుదిశ్వాస విడిచారు. అనంతరం భౌతికకాయాన్ని బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌లోని పెద్ద కుమారుడి ఇంటికి తరలించారు. మల్లయ్యగుప్తా సతీమణి సునంద 10 ఏళ్ల క్రితమే మరణించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన జైని మల్లయ్యగుప్తా 1945లో తెలంగాణ సాయుధపోరాటంలో కమ్యూనిస్టు నేత ఆరుట్ల రాంచంద్రారెడ్డి దళంలో పనిచేశారు. మల్లయ్య గుప్తా 1942లో క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ముంబైకి వెళ్లారు. నిజాం రాచరిక వ్యవస్థ, దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రముఖ కమ్యూనిస్టు నేత రావి నారాయణరెడ్డి నేతృత్వంలో సాగిన మహోద్యమంలో మల్లయ్యగుప్తా పాల్గొన్నారు. 1946 అక్టోబర్‌లో నిజాం ప్రభుత్వం మల్లయ్యతోపాటు పలువురిని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించింది. అయితే 1948లో జైలు నుంచి ఆయన చాకచక్యంగా తప్పించుకొని అజ్ఞాతంలో ఉండి పోరాటం కొనసాగించారు. ఆయనను పట్టించినవారికి ఇనాం ఇస్తామని కూడా ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఆ తరువాత పోరాటకాలంలో రావినారాయణ రెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలాదేవి తదితరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు. 1942లో భువనగిరి పురపాలక సంఘానికి మల్లయ్య గుప్తా తొలి వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. మొదటి నుంచి ఆయనకు సాహిత్యం, గ్రంథాలయోద్యమంపట్ల మక్కువ ఎక్కువ. అనేక గ్రంథాలయాల ఏర్పాటుకు ఆయన తోడ్పాటు అందించారు. పలువురు ప్రముఖుల సంతాపం జైని మల్లయ్యగుప్తా భౌతికకాయాన్ని ప్రొఫెసర్ హరగోపాల్, ప్రముఖ పాత్రికేయులు కె. శ్రీనివాస్, పాశం యాదగిరి, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ నేతలు పల్లా వెంకట్‌రెడ్డి, ఎస్వీ సత్యనారాయణ, సీపీఎం నేత ఎం.శ్రీనివాస్ సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులు అంబర్‌పేట శ్మశాన వాటికలో మల్లయ్యగుప్తా అంత్యక్రియలు నిర్వహించారు. -
Birsa Munda: ఆదివాసీల ఆరాధ్యదైవం
ఆదివాసీ ప్రజల హక్కుల కోసం పోరాడిన యువకిశోరం బిర్సా ముండా. ఆయనను తన జాతి ప్రజలు దేవునిగా కొలిచారు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా ఉలిహత్ గ్రామంలో 1875 నవం బర్ 15న సుగుణ ముండా, కర్మిహాట్ దంపతులకు బిర్సా ముండా జన్మించాడు. ‘సాల్గా’ గ్రామంలో మేనమామ వద్ద ఉంటూ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. అనంతం చయిబాసాలోని మిషనరీ పాఠశాలలో చేరాడు. ఇందుకోసం క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. బిర్సా ముండా పేరు బిర్సా డేవిడ్ గా మారింది. అందులో చదువుకుంటూనే పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. అప్పట్లో ఆదివాసీల భూములపై బ్రిటిష్ పాలకులు అధిక పన్నులు వసూలు చేసేవారు. పన్ను చెల్లించని వారి ఆస్తులను లాక్కునేవారు. ఎదురు తిరిగిన వారిని నానా బాధలు పెట్టేవారు. బ్రిటిష్‌వాళ్ల బాధలు పడ లేక చాలామంది ఆదివాసీలు అస్సాంలోని తేయాకు తోటలలోకి కూలీలుగా వెళ్లేవారు. తమ భూములను తిరిగి చ్చేయాలని ఒకరోజు ముండా తెగ పెద్దలతో కలిసి బిర్సా తెల్ల దొరలపై ఒత్తిడి చేశాడు. దాంతో మిషనరీ పాఠశాల ఆయనను బహిష్కరించింది. దీన్ని సవాలుగా తీసుకున్న బిర్సా వారి ఎదుటే నుదుట నామం పెట్టి, జంధ్యం ధరించి, ఇకపై క్రైస్తవంలోకి ఒక్క ఆదివాసీని కూడా మారకుండా చూస్తానని ప్రతిన బూనాడు. బ్రిటిషర్ల వల్ల ముండా, సంథాల్, ఓరియన్, కోల్ జాతి తెగలు ఎప్పటికైనా ప్రమా దంలో పడే అవకాశం ఉందని భావించిన బిర్సా ప్రత్యేకంగా ‘బిర్సాయిత్’ మతాన్ని స్థాపించాడు. ఆయా తెగలకు ఆధ్యాత్మిక అంశాలు బోధించే వాడు. ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాడు. ప్రకృతి వైద్యంతో ఎంతోమంది ఆదివాసీలను కాపాడాడు. ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు నచ్చిన ఆదివాసీలు బిర్సా ముండాను ధర్తీలబా(దేవుడు)గా కొలిచేవారు. తెల్లదొరలకు వ్యతిరేకంగా 1899 డిసెంబర్లో ఉల్ గులాన్ (తిరుగుబాటు) పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. అందులో 7,000 మంది పాల్గొన్నారు. బిర్సా ఆచూకీ తెలపాలని ఆదివాసీలను నిర్బంధిస్తూ వారిపై దాడులకు దిగేవారు బ్రిటిష్‌వాళ్లు. వీటిని సహించని ఆయన అనుచరులు 1900 జనవరి 5న ఎట్కేడీ ప్రాంతంలో ఇద్దరు పోలీసులను చంపేశారు. దీనితో రగిలిపోయిన పోలీసులు ఆయన కోసం వేట ప్రారంభించి చివరికి 1900 ఫిబ్రవరి 3న జంకోపాయి అటవీ ప్రాంతంలో అరెస్టు చేసి రాంచీ జైలుకు తరలించారు. ఎప్పటికైనా తమకు ప్రమాదకారిగా మారతాడని భావించిన ప్రభుత్వం బిర్సా ముండాను 1900 జూన్ 9న విష ప్రయోగంతో చంపేసింది. బయటకు మాత్రం మలేరియాతో మరణించాడు అంటూ ప్రచారం చేసింది. ఇప్పటికీ ఆయన్ని జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆదివాసీలు ‘భగవాన్ బిర్సా ముండా’గా పూజిస్తున్నారు. చనిపోయేటప్పుడు బిర్సాకు కేవలం 25 ఏళ్లు మాత్రమే. ఆయన ఉద్యమ ఫలితంగానే 1908లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఛోటా నాగపూర్ కౌలుదారుల హక్కు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. (క్లిక్ చేయండి: నిజంగా భక్తులేనా? పైకి మాత్రమేనా?) – చింత ఎల్లస్వామి ఏబీవీపీ రాష్ట్ర పూర్వ సంయుక్త కార్యదర్శి (నవంబర్ 15న బిర్సా ముండా జయంతి) -
మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్ బరిలోకి
పార్లమెంటరీ ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు నేపాల్‌లోని గుర్ఖా ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు టికా దత్ పోఖారెల్. వయసు 100 ఏళ్లు. నేడు(సోమవారం) వందవ ఒడిలోకి అడుగుపెట్టాడు. దేశ రాజకీయాలపై విసుగుచెంది తాను కూడా పోటీ సిద్ధమయ్యాడు. అది కూడా నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండపై పోటీ చేసి గెలిచి, హిమలయ దేశాన్ని మళ్లీ హిందూ దేశంగా మార్చాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నట్లు పోఖారెల్ తెలిపారు. ఇక్కడ చట్టం, న్యాయం లేదని, కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారని పోఖారెల్ ఆరోపించారు. సరైన నాయకుడే నేపాల్‌లో లేడని, అందుకే తాను పోటీకి సిద్ధమైనట్లు తెలిపారు. అంతేగాదు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, బాగా నడవడం, మాట్లాడటమే గాకుండా రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉంటారని నేపాలీ కాంగ్రెస్(బీపీ) అధ్యక్షుడు సుశీల్ మాన్ సెర్చన్ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా ఆయన పేరును అభ్యర్థిగా నమోదు చేసింది. నవంబరు 20న జరగనున్న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పెద్ద అభ్యర్థి ఆయనే. అంతేకాదు నేపాల్‌లో ఫెడరల్ పార్లమెంట్‌కి, ప్రావిన్షియల్ అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోఖారెల్ మాట్లాడుతూ....ప్రచండను ఓడించి ఎన్నికల్లో గెలుస్తానని పోఖారెల్ ధీమాగా చెబుతున్నాడు. గుర్ఖా నేలకు తానెంటో తెలుసునని అన్నారు. ఈ దేశ నాయకులు విధానాలు, సూత్రాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయకుండా దోచుకున్నారని చెప్పారు. తాను ప్రజలకు హక్కులను కల్పించడమే కాకుండా మళ్లీ హిందూ దేశంగా మార్చేందుకే తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశానని వివరించారు. 67 ఏళ్ల ప్రచండకు వ్యతిరేకంగా 11 మంది అభ్యర్థుల తోపాటు గుర్ఖా రెండు నియోజకవర్గాల నుంచి తన అభ్యర్థిత్వాన్ని పోఖారెల్ దాఖలు చేసినట్లు సెర్చన్ తెలిపారు. (చదవండి: పుతిన్ ప్లాన్ అట్టర్ ప్లాప్...71 వేల మంది రష్యా సైనికులు మృతి) -
పోరుబాటలో ఆయనది ఉక్కు సంకల్పం
స్వాతంత్య్రోద్యమంలో గర్జించిన గుంటూరు పోరాట కీర్తి.. పొట్టిశ్రీరాములు కంటే ముందే ఆంధ్రరాష్ట్రం కోసం గళమెత్తిన అమృతమూర్తి.. విశాఖ ఉక్కు కోసం పిడికిలెత్తిన ఉద్యమస్ఫూర్తి.. మహోజ్వలిత తేజం తమనంపల్లి అమృతరావు. ఆయన జీవితం ఆద్యంతం ఆదర్శనీయం. అక్టోబర్ 21న మహనీయుని జయంత్యుత్సవం సందర్భంగా ఆయన సేవా ప్రస్థానం స్మరణీయం.. గుంటూరు: అమృతరావు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విశదల గ్రామంలో 1920 అక్టోబర్ 21న పేద దళిత కుటుంబంలో జన్మించారు. పేదరికం వల్ల విద్యను మధ్యలోనే ఆపేశారు. సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. మహాత్మా గాంధీ పిలుపుతో 1940 దశకంలో స్వాతంత్య్రసమరంలోకి అడుగుపెట్టారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్నారు. గుంటూరులోని కొండా వెంకటప్పయ్య పంతులు ఇంటికి వచ్చినప్పుడు మహాత్మా గాంధీ అమృతరావును ప్రత్యేకంగా పిలిపించుకుని గంటకుపైగా మాట్లాడారట. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారట. అమృతరావు కొండా వెంకటప్పయ్య పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, వింజమూరి భావనాచార్యులు, నడింపల్లి తదితరులతో కలిసి బ్రిటిష్ సేనలపై వీరోచితంగా పోరాడారు. ఆంధ్రరాష్ట్ర సాధన ఉద్యమానికి నాంది పొట్టి శ్రీరాములుకంటే ముందే అమృతరావు ఆంధ్రరాష్ట్ర సాధనకు నడుంకట్టారు. 1952 ఆగస్ట్ 2న మద్రాసు సెక్రటేరియెట్ ముందు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీంతో స్పందించిన ప్రకాశం పంతులు ఇంత చిన్నవయసులో ఇంత పెద్ద ఉద్యమం వద్దని హితవు పలికి దీక్షను విరమింపజేశారు. ఆ తర్వాత 1952 అక్టోబర్‌లో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష ప్రారంభించి ప్రాణత్యాగం చేశారు. అనంతరం మహాత్ముని సిద్ధాంతాల ప్రచారానికి అమృతరావు 1959లో గాంధీ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిని ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. విశాఖ ఉద్యమంలో కీలకంగా.. 1964లో కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ముందు ప్రకటించి ఆ తర్వాత వెనక్కుతగ్గింది. దీంతో అమృతరావు విశాఖపట్నం కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ పేరుతో 21 రోజులపాటు దీక్షను నడపడం విశేషం. ఇది మహోద్యమంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకారపత్రం అందజేశారు. ► అనంతరం 1978–83 వరకు తాడికొండ నియోజకవర్గం నుంచి అమృతరావు శాసన సభ్యుడిగా పనిచేశారు. ► అప్పట్లో జిల్లా కలెక్టర్ అమృతరావుకు ఇచ్చిన సుమారు 15 ఎకరాల భూమిని ఆయన పేదలకు పంచి పెట్టారు. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు నగర్ ప్రాంతం అదే. స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో ప్రభుత్వం ఇచ్చిన పింఛన్నూ తిరస్కరించిన నిజమైన దేశభక్తుడు అమృతరావు. ఆఖరుకు పేదరికంతోనే 1989 ఏప్రిల్ 27న ఆయన నెల్లూరులో కన్నుమూశారు. విశాఖలో విగ్రహం ఏర్పాటుచేసిన వైఎస్సార్ అమృతరావు సేవలకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అద్భుత గుర్తింపునిచ్చారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా రూ.78 లక్షలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవరణలో అమృతరావు కాంస్య విగ్రహంతోపాటు ఆయన పేరుతో పార్క్‌నూ ఏర్పాటు చేశారు. 2008లో గుంటూరులోనూ అమృతరావు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. వైఎస్సార్ రుణం తీర్చుకోలేనిది తాతగారి ఉద్యమాలను, గొప్పదనాన్ని గుర్తించిన ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విశాఖలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ రుణం తీర్చుకోలేనిది. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా వైఎస్సార్ అడుగుజాడల్లోనే నడుస్తూ స్వాతంత్య్ర ఉద్యమకారులను గుర్తిస్తున్నారు. గుంటూరులోని సోషల్ వెల్ఫేర్ భవనానికి అమృతరావు పేరును పెట్టాలని కోరుతున్నాం. – తమనంపల్లి మోహన్ గాంధీ గాంధీ మిషన్ అధ్యక్షులు (అమృతరావు మనవడు) గొప్ప నేతతో నా సాంగత్యం అమృతరావుతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆ రోజుల్లో ఆయన నిస్వార్థ ప్రజా సేవ ఎనలేనిది. ఆయన జ్ఞాపకార్థం 2008లో స్థానిక అమరావతి రోడ్డులో అమృతరావు విగ్రహాన్ని వైఎస్సార్ ఏర్పాటు చేయడం అభినందనీయం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అమృతరావును స్మరించుకోవడం సంతోషంగా ఉంది. – వింజమూరి రాజగోపాలాచారి (బాబు), సీనియర్ న్యాయవాది -
గాంధీ స్ఫూర్తితో మా తాత నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు: కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనగానే.. తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి అని చెప్పుకుంటారు. అయితే, కేటీఆర్ తాజాగా తమ ఫ్యామిలీకి సంబంధించిన ఓ స్పెషల్ ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ ఫ్యామిలీలో కూడా గాంధీజీ బోధనలతో ఉత్తేజం పొంది తెలంగాణ తిరుగుబాటు ఉద్యమంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన తన తాత గురించి చెప్పుకొచ్చారు. అయితే, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఓ ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆ ఫొటోలో ఉన్నది తన తాతయ్య (తల్లి తరఫు) జె.కేశవరావు అని వెల్లడించారు. ఆ ఫొటోలపై వివరణ ఇస్తూ.. తమ కుటుంబంలో ఆయన ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి అని అన్నారు. గాంధీజీ బోధనలతో ఉత్తేజం పొంది తెలంగాణ తిరుగుబాటు ఉద్యమంలో 1940ల్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. భారత కేంద్ర ప్రభుత్వం సైతం ఆయనకు స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తింపు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులు ఎంత మంది స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. వారికి సంబంధం లేని విషయాలను కూడా తమదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారని కేటీఆర్ విమర్శించారు. ఇక, ఒక ఫొటోలో కేటీఆర్, కవిత, ఎంపీ సంతోష్ రావు ఎలా ఉన్నారో కూడా చూడవచ్చు. Let me introduce you all to an inspirational figure from my family: My maternal Grandfather Sri J. Keshava Rao Garu Inspired by Gandhi ji, he fought against the Nizam as part of Telangana Rebellion in late 1940s He received recognition from Govt of India as a freedom fighter pic.twitter.com/s1YCR6c2vo — KTR (@KTRTRS) September 3, 2022 -
మహోజ్వల భారతి: వీరనారి రాజ్‌కుమారి
రాజ్‌కుమారి గుప్త స్వాతంత్య్ర సమరయోధురాలు. 120 ఏళ్ల క్రితం 1902లో కాన్పూర్‌లో జన్మించారు. ఆమె ఏ తేదీన జన్మించిందీ కచ్చితమైన వివరాలు చరిత్రలో నమోదు కాలేదు కానీ, ఆగస్టు 9 అనే తేదీ చరిత్రలో ఆమెను చిరస్మరణీయురాలిని చేసింది. 1925లో లక్నో సమీపంలోని కాకోరీ అనే గ్రామంలో ఆ రోజున జరిగిన రైలు దోపిడీకి రాజ్‌కుమారి విప్లవకారులకు సహకరించారు. ఆ దోపిడీకి పాల్పడింది ‘హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్’ అనే విప్లవ సంస్థకు చెందిన చంద్రశేఖర ఆజాద్ బృందం. ఆ బృందంలో సభ్యురాలు రాజ్‌కుమారి. ఆమెకు చిన్నప్పుడే మదన్మోహన్ గుప్తా అనే గాంధేయవాదితో వివాహం జరిగింది. ఆయనకు ఈ ‘హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్’వాళ్లతో పైపై పరిచయాలు ఉండేవి. రాజ్‌కుమారి తన భర్తతో పాటు భారత జాతీయ కాంగ్రెస్ పురమాయించిన కార్యక్రమాలను నిర్వహిస్తుండేవారు. హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఉద్యమకారుల ప్రభావానికి లోనైన రాజ్‌కుమారి.. భర్తకు కూడా తెలీకుండా రహస్యంగా ఉద్యమ సమాచారాలను చేరవేస్తూ అసోసియేషన్ గ్రూపులో కీలక సభ్యురాలిగా మారారు. గ్రూపులో రాజ్‌కుమారి వంటి చురుకైన కార్యకర్తలు ఉన్నారు కానీ, సరిపడా ఆయుధాలే లేవు. ఆయుధాలను కొనేందుకు డబ్బులేదు. అందుకోసం డబ్బు దోచుకోవాలని పథకం వేశారు. అప్పట్లో బ్రిటిష్ అధికారులు పన్నులు, జరిమానాలు, జులుంల రూపంలో తమకు వసూలైన సొమ్మునంతా రైల్లో తరలించేవారు. అది కనిపెట్టి ఆజాద్ బృందం రైలు లక్నో దగ్గరకు రాగానే రైల్లోని డబ్బును దోచుకోవాలని పథకం వేసింది. రైలు కాకోరీ సమీపంలోకి రాగానే ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్వఖుల్లా ఖాన్, మరికొందరు రైలు గొలుసును లాగి ఆపారు. ఆయుధాలతో రైలు గార్డును బెదరించి డబ్బు దోచుకెళ్లారు. దోడిపీలో రాజ్‌కుమారి పాత్ర ప్రత్యక్షంగా లేకున్నా, అత్యంత కీలకమైన పాత్రే ఉంది. గార్డును బెదిరించడానికి, ముందు జాగ్రత్త కోసం ఆజాద్ బృందం తీసుకెళ్లిన ఆయుధాలు రాజ్‌కుమారి తెచ్చి ఇచ్చినవే. చంటి బిడ్డను చంకనెత్తుకుని, లోదుస్తుల్లో ఆయుధాలను దాచుకుని పొలాల్లో పడి నడుచుకుంటూ వెళ్లి సమయానికి వారికి ఆయుధాలను అందించారు రాజ్‌కుమారి. తర్వాత విషయం తెలిసి భర్త, అత్తమామలు ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టారు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని ప్రపంచానికి ప్రకటించారు. తర్వాత ఈ గ్రూప్నంతటినీ, రాజ్‌కుమారి సహా బ్రటిష్ ప్రభుత్వం వెంటాడి, వెతికి పట్టుకుని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కూడా రాజ్‌కుమారి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు మూడుసార్లు జైలు శిక్ష అనుభవించారు. గాంధీమార్గంలో పైకి కనిపిస్తూ సాయుధ పోరాటాన్ని సాగించిన వీరనారి రాజ్‌కుమారి. -
జైహింద్ స్పెషల్: వీళ్లంతటివాడు పుల్లరి హనుమంతుడు
నారు పోశావా? నీరు పెట్టావా? కోత కోశావా? ఎందుకు కట్టాలిరా శిస్తు!.. అంటూ నిలదీసిన ఆ గొంతు పల్నాటి ప్రజల్లో పరపాలనకు వ్యతిరేకంగా ఉద్యమస్ఫూర్తిని నింపింది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి సాధారణ రైతు జీవితం గడుపుతున్న ఆ శక్తి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ఆ స్ఫూర్తి, ఆ శక్తే.. పల్నాడు పుల్లరి ఉద్యమానికి వెన్నుముకగా నిలిచిన కన్నెగంటి హనుమంతు! చదవండి: జైహింద్ స్పెషల్: ఈస్టిండియా కుటిల వ్యూహం దేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం జోరుగా సాగుతున్న తరుణంలోనే పల్నాడులో పుల్లరి సత్యాగ్రహం ఊపందుకుంది. పుల్లరి అంటే పచ్చిక మైదానాలపై విధించే పన్ను. అడవుల్లో కట్టెలు కొట్టాలన్నా, మైదానాల్లో పశువుల్ని మేపాలన్నా శిస్తు కట్టాల్సిందేనన్న బ్రిటిష్ ఆజ్ఞలను ధిక్కరిస్తూ సత్యాగ్రహ స్ఫూర్తి పల్నాడు మొత్తం వ్యాపించింది. ఈ ఉద్యమ కాలంలో హనుమంతును పలుమార్లు బ్రిటిష్ పాలకులు అరెస్టు చేశారు. సత్యాగ్రహ కొనసాగింపుగా నల్లమల ప్రాంత చెంచులతో కలిసి హనుమంతు పోరుబాట పట్టారు. 1921–22 కాలంలో హనుమంతు పేరు వింటే పల్నాడులో బ్రిటిష్ అధికారులకు ముచ్చెమటలు పట్టేవంటే అతిశయోక్తి కాదు. కన్నెగంటి హనుమంతు కోర మీసము దువ్వి.. పలనాటి ప్రజలచే పన్నులెగ గొట్టించె అని కవులు ఆయన పోరాటాన్ని గానం చేశారు. అసామాన్య యోధుడు గుంటూరు జిల్లా దుర్గి మండలం పరిధిలోని మించాలపాడు గ్రామంలో వెంకటప్పయ్య, అచ్చమ్మ దంపతులకు పుట్టిన అసామాన్య స్వాతంత్య్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు. పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వెల్దుర్తి, జట్టిపాలెం, రెంటచింతల వంటి ప్రాంతాల్లో ప్రజాజీవనం ఆ ప్రాంతపు అడవులతో ముడిపడి ఉంది. 1921 సంవత్సరం ప్రాంతంలో పల్నాడులో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పరాయి పాలనలో సామాన్య ప్రజలకు కూడు, గుడ్డ వంటి కనీసావసరాల మాట దేవుడెరుగు కనీసం పశువులకు గ్రాసం, గ్రామ జీవితంలో భాగమైన కట్టెలు కొట్టుకోవడం, ఆకూ అలమూ పోగుచేసుకోవడం వంటి వాటికి సైతం బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలపై ఆంక్షలు విధించింది. పశువుకు రెండు రూపాయలు శిస్తుగా పుల్లరి కట్టాలని ఆదేశించారు. ఈ అమానుషంపై ప్రజలను సంఘటితపరచి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి నాయకత్వం వహించాడు కన్నెగంటి. ప్రభుత్వానికి ప్రజలు పుల్లరి చెల్లించరాదనే ఉద్యమాన్ని లేవదీశాడు. దీంతో పల్నాడులో ప్రజలు పుల్లరి కట్టడం మానేయడంతో పాటు అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులనూ సాంఘిక బహిష్కారానికి గురిచేశారు. మిణుగురులు లేచె బెడదవు శౌర్యాగ్నిశిఖలు మాంచాలపురిన్ హనుమంతుడన వీరుడు.. తెల్ల దొరల నేదిరించెన్... అని గుర్రం జాషువా కన్నెగంటి హనుమంతు పోరాటాన్ని ప్రశంసించారు. పాలకుల కుయుక్తులు దావానలంలాగా రేగుతున్న ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనేక కుట్రలు పన్నింది. తొలుత హనుమంతుకు లంచమిచ్చి తమవైపు తిప్పుకోవాలని నాటి బ్రిటిష్ అధికారి రూథర్‌ఫర్డ్ కుయుక్తి పన్నాడు. స్థానిక కరణం ద్వారా హనుమంతుకు వర్తమానం పంపాడు. దుర్గి ఫిర్కాకు కన్నెగంటిని జమిందార్ గా చేస్తామన్నారు. ఇష్టం వచ్చినంత శిస్తు వసూలు చేసుకోవచ్చని ఆశ పెట్టారు. కానీ నిష్కళంక దేశభక్తుడైన కన్నెగంటి తాను తార్పుడు గాడిని కాననీ, నా తోటి భారతీయులను వంచించి నెత్తుటి కూడు తిననని తెగేసి చెప్పాడు. దీంతో ఇక దండోపాయమే శరణ్యమని భావించిన రూథర్‌ఫర్డ్ ఆమేరకు గుంటూరు కలెక్టర్ వార్నర్‌కు ఆదేశాలిచ్చాడు. బలి ఇచ్చె హనుమంతు నూ పలనాడు! పర ప్రభుత్వము గుండ్లకు ! అని పులపుల శివయ్య కవి గానం చేసిన రీతిలో స్థానికులే నమ్మకద్రోహం చేసి హనుమంతు మరణానికి కారణమయ్యారు. 1922 ఫిబ్రవరి 22 శివరాత్రి రోజున కొందరు అటవీ, రెవిన్యూ శాఖలకు చెందిన అధికారులు మించాలపాడు గ్రామానికి వచ్చి హనుమంతును కలిసి పుల్లరి కట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. ఆప్పటికే గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని విరమిస్తూ నిర్ణయం తీసుకొని వున్నారు కనుక పుల్లరి చెల్లించడానికి అభ్యంతరం లేదని కన్నెగంటి చెప్పారు. పోరాటాన్ని తర్వాత వేరే రూపాల్లో కొనసాగించాలని ఆయన భావించారు. పల్నాటి కాళరాత్రి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మించాలపాడుతో సహా చుట్టు పక్కల గ్రామాలలోని యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కన్నెగంటి అనుచరులు, అభిమానులు కాంగ్రెస్ ప్రభతో కలసి వెళ్ళారు. గ్రామాల్లో మహిళలు, పెద్దలు మాత్రమే ఉన్నారు. అదే అదనుగా భావించిన గుంటూరు జిల్లా కలెక్టర్ వార్నరు దుర్గి సబ్ ఇన్స్పెక్టర్ రాఘవయ్య నాయుడికి తోడుగా మరికొంత మంది సైన్యాన్ని ఇచ్చాడు. పుల్లరి కట్టని మించాలపాడు గ్రామస్తుల పశువులను నిర్బంధించవలసిందిగా ఆదేశించాడు. అంతే.. బ్రిటిష్ సైన్యం మించాలపాడు గ్రామంపై విరుచుకుపడింది. పశువుల్ని నిర్బంధించడం మొదలు పెట్టింది. పుల్లరి చెల్లిస్తామని తాము చెప్పినా బ్రిటిషర్లు దొంగదెబ్బ తీయడాన్ని హనుమంతు సహించలేకపోయారు. ఆయన ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఎదురుదాడికి దిగారు. శిస్తు కడతామని అధికారులతో చెప్పేందుకు వెళ్లిన కన్నెగంటిని స్థానిక కరణం గుర్తించి బ్రిటిషర్లకు తెలియజేశాడు. దీంతో సైనికులు ఆయనపై కాల్పులు జరపడంతో 26 తూటాలు హనుమంతు శరీరంలోకి దూసుకుపోయాయి. ఆయనతో పాటు మరో ఇద్దరిని సైనికులు పొట్టనబెట్టు కున్నారు. సాయంకాలం 6 గంటలకు తుపాకి తూటాలకు గాయపడిన పల్నాడు సింహం కన్నెగంటి అర్థరాత్రి వరకు శక్తి కూడదీసుకొని వందేమాతరం అని నినాదాలు చేస్తూనే ఉన్నాడు. అర్థరాత్రి దాటాక పల్నాటి వీరబిడ్డడు అమరుడయ్యాడు. పల్నాటి పుల్లరి సత్యాగ్రహంలో వీరమరణం పొందిన కన్నెగంటి త్యాగాన్ని జాతీయ కాంగ్రెస్ సంఘం గుర్తించింది. బ్రిటిష్ అధికారుల పట్ల పల్నాటి ప్రజలు అనుసరించిన సాంఘిక బహిష్కరణ విధానం తక్కిన దేశానికంతటికీ దారిచూపింది. హనుమంతు త్యాగనిరతిని శ్లాఘిస్తూ మించాలపాడు గ్రామ ప్రజలు అతని సమాధిపై ఏర్పాటు చేసిన శిలాశాసనం నేటికీ ఆ వీరుని పోరాట స్ఫూర్తికి చిహ్నంగా నిలిచి వుంది. – దుర్గరాజు శాయి ప్రమోద్ -
క్విట్ ఇండియా రేడియో! సీక్రెట్ ఫైల్స్
క్విట్ ఇండియా ఉద్యమ వేళ 1942లో ఒక రహస్యవాణి 78 రోజులపాటు ఈ జాతిని ప్రభావితం చేసింది. అప్పటి బ్రిటిష్ పాలకులు దీనిని ‘కాంగ్రెస్ ఇల్లీగల్ రేడియో’ అని పిలిచారు. అయితే దాన్ని నిర్వహించిన నాయకులు ‘కాంగ్రెస్ రేడియో’ అని పిలిచారు. దివంగత సోషలిస్టు రచయిత మధు లిమాయే ‘ఆజాద్ రేడియో’ అని పేర్కొన్నారు. ఈ రహస్య ప్రజావాణికి వ్యూహకర్త రామ్ మనోహర్ లోహియా! ఈ రేడియో ప్రసారాల క్రతువు నిర్వహించిన బృందం 20 నుంచి 40 ఏళ్ల వయసు గల ఏడు యువకిశోరాలు! ఇంతవరకు పూర్తిగా తెలియని ఈ సమాచారం మనకు గొప్ప తృప్తినీ, గర్వాన్ని ఇస్తుంది. కరేంగే.. యా మరేంగే 1942 ఆగస్టులో గాంధీజీ బ్రిటిష్ వారి దుష్టపాలనకు మృత్యుగీతం రచిస్తూ ‘కరేంగే... యా మరేంగే’ అనే పిలుపునిచ్చారు. అది జాతిమంత్రమై దేశం ఎల్లెడలా పాకింది. బ్రిటిషు అధికారులు ఈ నాయకులను అగ్రస్థాయి నుంచి, అడుగున బ్లాకు స్థాయి దాకా చెరసాలల్లో నింపేశారు. ఆ సమయంలో చాలామంది సోషలిస్టు నాయకులు తప్పించుకుని రహస్యంగా ఉద్యమంలో సాగారు. అరెస్టుల కారణంగా 1942 ఆగస్టు 9 నుంచి ఉద్యమం నాయకత్వాన్ని కోల్పోయింది. ఆ సమయంలో దిశానిర్దేశం చేసిన రహస్య మాధ్యమం ‘కాంగ్రెస్ రేడియో’! 1942 ఆగస్టు 27 నుంచి బ్రిటిషు ప్రభుత్వం కైవశం చేసుకునే దాకా (అంటే 1942 నవంబర్ 12 దాకా) గొప్ప సేవలందించింది. 1988 ఫిబ్రవరి 13 సంచిక మరాఠీ పత్రిక ‘సాధన’లో సోషలిస్టు నాయకుడు మధు లిమాయే ఈ చరిత్రాత్మక ఆధారాలు రాస్తూ నాసిక్‌లోని శంకరాచార్య మఠంలో ఆజాద్ రేడియో పరికరాలను విఠల్‌రావ్ పట్వర్థన్ తెచ్చి ఉంచారనీ, అక్కడ నుంచి ప్రసారాలు చేయాలని తలంచినా, పోలీసు దాడిని ఎదుర్కోవలసి వస్తుందని గోదావరి నదిలో పడవేశారని పేర్కొన్నారు. పోలీస్ మానిటరీ రిపోర్ట్! ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డ్యూరింగ్ క్విట్ఇండియా మూవ్మెంట్’ అనే పుస్తకం 2018లో కేంద్ర ప్రభుత్వ సంస్థ పబ్లికేషన్ డివిజన్ ప్రచురించింది. దాని ప్రకారం ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్, న్యూఢిల్లీకి చెందిన పరిశోధకులు గౌతమ్‌చటర్జీ 1984 నుంచి నేషనల్ ఆర్కైవ్స్‌లో గాలించి, పరిశోధన చేశారు. వీరికి ‘పోలీస్ మానిటరీ రిపోర్ట్’ అనే పోలీసు ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫైల్ తారసపడింది. దీన్ని గురించి ఎవరూ ఎక్కడా రాయలేదు. అప్పట్లో ‘ఆజాద్ రేడియో’ ప్రసారాలను గమనిస్తూ, బ్రిటిష్ పోలీసులు తయారు చేసిన రహస్య ఫైలు ఇది. ఇందులో అక్టోబరు 9 నుంచి పోలీసులు నమోదు చేసిన ప్రసారాల వివరాలున్నాయి. ఇవి దేశ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలించిన అంశాలు. ఈ రేడియో ప్రసార విషయాలను గమనిస్తే కరాచీ నుంచి బృందావనం దాకా, అలహాబాద్ నుంచి బెంగాల్ దాకా, బిహార్ నుంచి మద్రాసు దాకా, కోయంబత్తూరు నుంచి త్రివేండ్రం దాకా, గుజరాత్ నుంచి మహారాష్ట్ర దాకా సమాచారాన్ని సవ్యంగా ఇచ్చారని బోధపడుతుంది. కీలకం.. లోహియా! ‘... స్కాట్ సిద్ధం చేసిన నివేదికలు జాగ్రత్తగా పరిశీలించాను. కాంగ్రెస్ సోషలిస్టు భావాలతో సాగిన ఈ ప్రసారాలకు కీలకం సోషలిస్ట్ రాజకీయ నాయకుడు రామ్ మనోహర్ లోహియా అని తెలిసింది. రైతులు, కార్మికుల కోసమే స్వాతంత్య్ర భారతదేశమని అక్టోబరు 23వ తేదీ ప్రసారాలలో ప్రకటించడం గమనార్హం. అలాగే అక్టోబరు 27వ తేదీన స్వాతంత్య్రం కోసం విప్లవం అనేది పేదల కోసం విప్లవం. రైతుల కోసం, కార్మికుల కోసమే ఈ స్వాతంత్య్ర భారతం’’ అని బ్రిటిష్ గవర్నమెంట్ అడిషనల్ సెక్రటరీ హెచ్.వి.ఆర్. అయ్యంగార్ ఈ ఆజాద్ రేడియో ప్రసారాల పూర్వాపరాల గురించి అప్పటి ప్రభుత్వానికి వివరించారు. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా నిర్వహించిన ‘ఆజాద్ హింద్ రేడియో’కు భిన్నమైనది ఈ ఆజాద్ రేడియో. – డా. నాగసూరి వేణుగోపాల్‌ఆకాశవాణి పూర్వ సంచాలకులు (చదవండి: అఖండ భారత స్వతంత్ర ప్రధాని: మౌలానా బర్కతుల్లా) -
తొలి మహిళా రాష్ట్రపతి... తొలి ఆదివాసీ రాష్ట్రపతి
తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి. 2007 జూలై 25న ఆమె రాష్ట్రపతిగా బాధ్యతలను చేపట్టారు. అంతకుముందు వరకు రాజస్థాన్ గవర్నరుగా (2004–2007) ఉన్నారు. ప్రతిభా పాటిల్ 1934 లో మహారాష్ట్ర లోని నందగావ్‌లో జన్మించారు. రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం ముఖ్యాంశాలుగా డబల్ ఎమ్.ఎ. చేశారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి కూడా. 1962లో ప్రతిభా పాటిల్ ఎం.జె.కళాశాల ‘కాలేజ్ క్వీన్‘గా ఎన్నికయ్యారు. ఉన్నత విద్యాభాసం తర్వాత భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులను మెరుగుపరచడానికి సామాజిక అంశాలపై ఆసక్తిని ఏర్పరచుకున్నారు. పాటిల్‌ను యునైటెడ్ ప్రొగ్రెస్సెవ్ ఆలియన్స్ (యు.పి.ఎ) తన రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. యు.పి.ఎ మొదటప్రతిపాదించిన శివరాజ్ పాటిల్ లేదా కరణ్ సింగ్‌ల అభ్యర్థిత్వాన్ని వామపక్షాలు అంగీకరించనందు వల్ల పాటిల్‌ను ఒక రాజీ మార్గ అభ్యర్థిగా ప్రకటించారు. పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్‌కు, నెహ్రూ గాంధీ కుటుంబానికి అనేక దశాబ్దాల పాటు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నందున కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఆమెను ఎంపిక చేశారు. పాటిల్ తన ప్రత్యర్థి భైరాన్ సింగ్ షెకావత్‌పై భారీ మెజారిటీ గెలిచారు. తొలి ఆదివాసీ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నేడు (జూలై 25) భారతదేశ 15 వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రతిభా పాటిల్ దేశ తొలి మహిళా రాష్ట్రపతి కాగా, శ్రీమతి ముర్ము దేశ తొలి ఆదివాసీ రాష్ట్రపతి. ముర్ము 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా పని చేశారు. తాజా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసి, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజారిటీతో గెలిచారు. ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా, బైదాపోసి గ్రామంలో గిరిజన తెగకు చెందిన సంతాల్ కుటుంబంలో 1958 జూన్ 20 న జన్మించారు. భువనేశ్వర్ లోని రమాదేవి మహిళా కాలేజీ నుంచి బీఏ పూర్తి చేసి ఆ తర్వాత ఉపాధ్యాయురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1977–83 మధ్య ఒడిశాలోని నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా, 1994 నుంచి 97 వరకూ శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. అడవిలో పుట్టిన వేటగాడు జిమ్ కార్బెట్ వేటగాడు, క్రూరమృగాల జాడల్ని గుర్తించే నేర్పరి. జంతు సంరక్షకుడు కూడా. నేడు జిమ్ కార్బెట్ జయంతి. 1875 జూలై 25న నార్త్ వెస్ట్ ప్రావిన్సు (నేటి ఉత్తరాఖండ్) లోని నైనిటాల్ అటవీ ప్రాంతంలో జన్మించారు. నరమాంసానికి అలవాటు పడిన పులుల్ని, చిరుతల్ని చంపడంలో జిమ్ కార్బెట్ సిద్ధహస్తుడు. భారత ఉపఖండంలో, ముఖ్యంగా ఆగ్రా, అవధ్ల సంయుక్త ప్రావిన్సు మొత్తంలో మనుషుల్ని తినే పులి ఎక్కడ సంచరిస్తున్నా వెంటనే జిమ్ కార్బెట్‌కి బ్రిటిష్ ప్రభ్వుతం నుంచి పిలుపు అందుతుంది. వెళ్లి మనుషుల్ని రక్షిస్తాడు. అంతకంటే ముందు ఆ మ్యాన్ ఈటర్ పులిని రక్షించడానికి (చంపకుండా బంధించడం) ప్రయత్నిస్తాడు. జిమ్ కార్బెట్ తన అనుభవాలతో ‘మాన్–ఈటర్స్ ఆఫ్ కుమావోన్’ అనే గ్రంథం రాశారు. అతడు ఫొటోగ్రాఫర్ కూడా. వన్యప్రాణుల్ని అవి మ్యాన్ ఈటర్సే అయినా వాటిని అంతరించిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనిషిదేనని అంటాడు. (చదవండి: జిన్నా రమ్మన్నా అజీమ్ తండ్రి వెళ్లలేదు!) -
అఖండ భారత స్వతంత్ర ప్రధాని: మౌలానా బర్కతుల్లా
‘మౌలానా బర్కతుల్లా’ గా భారత స్వాతంత్య్రోద్యమంలో గౌరవ ప్రతిష్టలు అందుకున్న మహమ్మద్ బర్కతుల్లా భోపాలీ.. సమరశీల విప్లవ యోధుడు. తిరుగుబాటు వీరుడు. తొలి స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ధీరుడు. స్వతంత్ర భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకునే అపురూపమైన క్షణాలను చూడకముందే కన్నుమూసిన ‘దేశ ప్రధాని’! మౌలానా బర్కతుల్లా 1854 జూలై 7న బ్రిటిష్ ఇండియాలోని భోపాల్ రాష్ట్రంలో జన్మించారు. భోపాల్‌లోని సులేమానియా హైస్కూల్లో టీచరుగా ఉన్న సమయంలో ఆయన మీద షేక్ జమాలుద్దీన్ ఆఫ్ఘనీ అనే ఉద్యమకారుడి ప్రభావం ఎక్కువగా ఉండేది. జమాలుద్దీన్ ముస్లింలలో సోదరభావం పెంపొందించడానికి ప్రపంచదేశాల్లో పర్యటించేవారు. బర్కతుల్లా తల్లిదండ్రులు మరణించడంతో జమాలుద్దీన్తోపాటు ఆయన భోపాల్ నుంచి ముంబయికి మారారు. ఖండాలా, ముంబయిలలో ఇంగ్లిష్ టీచర్‌గా తన వృత్తిని కొనసాగించారు. అక్కడ శ్యామ్‌జీ కృష్ణవర్మ వంటి అతివాద నాయకులతో సన్నిహితంగా మెలిగారు. క్రమంగా జాతీయోద్యమం వైపు మళ్లారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన దశలో మనదేశంలో ఉన్న హిందువులు, ముస్లింలు ఎవరికి వారు ఉండరాదని, ఐక్యంగా పోరాడాలని నమ్మిన ఆనాటి తొలి వ్యక్తి బర్కతుల్లా. ఈ రెండు మతాల మధ్య వేర్పాటువాదం ఉన్నంత కాలం అది బ్రిటిష్ పాలకులకు ఆయుధంగా ఉంటుందని, సోదరభావంతో ఒకటై ఉంటే తప్ప వలస పాలకుల గుండెల్లో దడ పుట్టదని తన ప్రసంగాల్లో, వార్తా పత్రికల వ్యాసాల్లో ఉద్బోధించారు. విదేశాలే స్థావరం జమాలుద్దీన్ స్ఫూర్తితో బర్కతుల్లా ఎక్కువ కాలం విదేశాల్లోనే గడిపారు. ఇంగ్లండ్‌లో ఉన్న సమయంలో హథ్రాస్ రాజకుటుంబీకుడు రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్‌తో పరిచయమైంది. అనంతరం ఒక ఏడాది అమెరికాలో గడిపిన తర్వాత 1904లో టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. అమెరికా, జపాన్ల మధ్య పర్యటిస్తూ, భారత జాతీయోద్యమానికి ఐరిష్ ఉద్యమకారుల మద్దతును కూడా సాధించారు. స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టిన లాలాలజ్‌పత్‌రాయ్, అజిత్ సింగ్‌లకు మద్దతుగా విదేశాల్లో ఉన్న భారతీయులను చైతన్యవంతం చేశారు. ఈ క్రమంలో ఎక్కువ కాలం అమెరికాలో నివసించిన బర్కతుల్లా గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా క్రియాశీలకంగా పనిచేశారు. కాబూల్ వ్యూహరచన గదర్ మూవ్మెంట్లో భాగంగా బర్కతుల్లా జర్మనీ, టర్కీల సహాయంతో కాబూల్ చేరారు. అక్కడి నుంచి భారత స్వాతంత్య్ర సిద్ధి కోసం తన వ్యూహరచనను వేగవంతం చేశారు. ఫలితమే కాబూల్‌లో స్వయం ప్రకటిత స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పాటు! 1915 డిసెంబర్ 1 న ‘ఫ్రీ హిందూస్థాన్’ పేరుతో బర్కతుల్లా బృందం ఆ ఇండియన్ ప్రొవిజనల్ గవర్నమెంట్‌ను స్థాపించింది. రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అధ్యక్షుడిగా బర్కతుల్లా ప్రధానమంత్రిగా ఏర్పడిన ఆ ప్రభుత్వమే తొలి భారత స్వాతంత్య్ర సమర ప్రభుత్వం. ఆజాద్ హింద్ ఫౌజ్‌కు చాలా ఏళ్లకు ముందే బర్కతుల్లా, ఆయన సహ విప్లవకారులు ప్రకటించుకున్న ఆ ప్రభుత్వానికి ప్రారంభంలో స్థానిక ఆఫ్గన్ పాలకుల పరోక్ష మద్దతు ఉన్నప్పటికీ, బ్రిటిష్ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి వారు పక్కకు తప్పుకున్నారు. 1919 నాటికి ఆ తాత్కాలిక ప్రభుత్వం కూలిపోయింది. చివరి క్షణాల్లోనూ..! 1927 సెప్టెంబర్ 20 వ తేదీ రాత్రి బర్కతుల్లా ప్రపంచాన్ని వీడిపోయారు. ఆ చివరి రాత్రి కూడా శాన్ఫ్రాన్సిస్కోలో ఆయన తన తోటి ఉద్యమకారులతో భారతదేశ విముక్తి గురించే మాట్లాడారు. ‘‘నా మాతృభూమికి స్వాతంత్య్రం సముపార్జించేవరకు విశ్రమించకూడదనుకున్నాను. ఎంత కష్టాన్నైనా భరిస్తూ నిజాయితీగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే ఈ రోజు నేను ఈ జీవితాన్ని వదిలి వెళ్లిపోతున్నాను. నా జీవితంలో అత్యంత విచారకరమైన రోజు ఇది. బ్రిటిష్ పాలన నుంచి మాతృభూమిని విముక్తం చేసే ప్రయత్నంలో విజయం సాధించలేకపోయాను. అయితే లక్షలాది ధైర్యవంతులు నా కలను నిజం చేస్తారని నమ్ముతున్నాను. నా తర్వాత ఈ మహోద్యమాన్ని వారు చేపట్టి విజయం సాధిస్తారు’’ అని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశం ఈ దేశభక్తుడికి సగౌరవంగా నివాళిని సమర్పించుకుంది. ఆయన గౌరవార్థం భోపాల్ యూనివర్సిటీకి బర్కతుల్లా యూనివర్సిటీగా పేరు మార్చి ఆయన పోరాటాన్ని చిరస్మరణీయం చేసుకుంది. – వాకా మంజులారెడ్డి ఆఫ్గన్ మిషన్ ఇన్ కాబూల్ ::: 1915 కాబూల్‌లో సమావేశమైన టర్కీ, జర్మనీ దౌత్యాధికారులతో బర్కతుల్లా భోపాలి (కుడి చివర); రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ (కూర్చొన్న వారి మధ్యలో) -
గదర్ గర్జన
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అన్నాడు కవి. కానీ ఆ తల్లి బానిస సంకెళ్ల చెరలో ఉంటే ఏ దేశమేగినా, ఎందుకాలిడినా బిడ్డలు సంతోషంగా ఉండలేరు. బ్రిటిష్ పాలనలో మగ్గుతున్న తల్లి భారతి దుస్థితికి స్వదేశంలోని భారతీయులతో పాటు విదేశాల్లో ఉండే భారతీయులు కూడా తీవ్రవేదన అనుభవించారు. మాతృమూర్తి దాస్యం చూసీ చూసీ ప్రవాస భారతీయుల కన్నీరు ఎరుపెక్కింది! ఎలాగైనా బ్రిటిష్ చెర నుంచి జన్మభూమికి విముక్తి కల్పించాలని ఆ ఎర్రటి కన్నీటి సాక్షిగా ప్రవాస భారతీయులు చేసుకున్న ప్రతిజ్ఞ నుంచి ఆవిర్భవించింది గదర్ పార్టీ! పార్టీకి ముందే పత్రిక ‘గదర్’ అనే పేరు వెనుక చాలా నేపథ్యం ఉంది. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర పోరాటాన్ని బ్రిటిషు వారు ‘గదర్’ అని పిలిచేవారు. గదర్ అంటే పంజాబీ, ఉర్దూ భాషలలో తిరుగుబాటు అని అర్థం! ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తిని, పోరాటాన్ని కొనసాగించి, అంతిమంగా దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయాలన్న లక్ష్యంతో ‘హిందుస్థాన్ గదర్’ అనే పత్రికను ప్రవాస భారతీయులు ఆరంభించారు. ఈ పత్రిక ఆధారంగా పలువురు వీరులు దగ్గరై గదర్ సంఘంగా మారారు. ఇదే అనంతర కాలంలో గదర్ పార్టీగా రూపొందింది. ఈ పార్టీ హిందూ, సిక్కు, ముస్లిం నాయకుల సమ్మేళనం. 1913లో బ్రిటిష్ పాలనతో సంబంధం లేకుండా విదేశాల నుంచి స్వదేశంలోని స్వాతంత్య్ర విప్లవోద్యమానికి సహాయం చేయాలన్న సంకల్పంతో పార్టీ అవతరించింది. ఆరంభంలో ఈ పార్టీలో అత్యధికులు అమెరికా, కెనెడాల్లోని ప్రవాస భారతీయులు కాగా తర్వాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లోని ప్రవాస భారతీయులు ఇందులో చేరారు. హిందూస్థాన్ గదర్ పత్రిక కార్యాలయం ఉన్న కాలిఫోర్నియాలోని శాన్ ప్రాన్సిస్కోలో పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది. జాతీయవాద చైతన్యం 1903–1913 కాలంలో దాదాపు పదివేలకు పైగా భారతీయులు ఉత్తర అమెరికాలో పలు ఉద్యోగాలకు వలసవెళ్లారు. వీరిలో సగంమంది బ్రిటిష్ మిలటరీలో చేరారు. నానాటికీ పెరుగుతున్న భారతీయుల, ముఖ్యంగా పంజాబీల ప్రాధాన్యం తగ్గించేందుకు కెనడా ప్రభుత్వం పలు చట్టాలు తీసుకువచ్చింది. దీంతో కెనడాకు వెళ్లడం కష్టంగా మారింది. ఇప్పటికే కెనడాలో ఉన్న భారతీయుల హక్కులపై పరిమితి విధించడం జరిగింది. ఇవన్నీ ప్రవాస భారతీయుల్లో అసంతృప్తిని పెంచాయి. వీరు గురుద్వారాల్లో, హిందుస్థానీ సమాఖ్య సమావేశాల్లో కలుసుకొని తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను చర్చించేవారు. ఇదే సమయంలో ప్రవాసీల్లో జాతీయతా భావనలు పెరిగాయి. బ్రిటిష్ పాలన నుంచి స్వదేశానికి విముక్తి కల్పించాలన్న ఆలోచన పలువురిలో కలిగింది. ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ బర్కిలీ విద్యార్థుల్లో జాతీయవాద చైతన్యం ఉప్పొంగనారంభించింది. ఇందుకు హర్దయాళ్, తారక్నాథ్ దాస్ తదితరుల ఉపన్యాసాలు దోహదం చేశాయి. వీరికి భారతీయ విప్లవకారుడు రాస్‌బీహారీ బోస్‌తో సంబంధాలు పెరిగాయి. ‘పసిఫిక్ కోస్ట్ హిందుస్తానీ’ దేశానికి విప్లవ మార్గంలో స్వాతంత్య్రం సంపాదించాలన్న ఆలోచనతో ఇలాంటి భావనలున్న వారంతా కలిసి పసిఫిక్ కోస్ట్ హిందుస్తానీ అసోసియేషన్ గా 1913 జూలై 15న ఏర్పడ్డారు. ఇదే తదనంతరం గదర్‌పార్టీగా మారింది. సోహన్ సింగ్ భక్నా దీనికి తొలి అధ్యక్షుడు. ఇందులో భాయ్ పర్మానంద్, హర్ దయాల్, మొహమ్మద్ ఇక్బాల్ శేదై, కర్తార్ సింగ్ శరభ, అబ్దుల్ హఫీజ్ బరకాతుల్లా, సులామన్ చౌదరి, అమీర్ చౌదరి, రష్బీరి బోస్, గులాబ్ కౌర్ తదితరులు కీలక సభ్యులు. – దుర్గరాజు శాయి ప్రమోద్ (చదవండి: గాంధీజీ ప్రసంగం అనువాదం! వెంకట సుబ్బమ్మ) -
మహోజ్వల భారతి: ఫడ్కే పట్టుబడిన రోజు
వాసుదేవ బల్వంత ఫడ్కే (1845–1883) బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు. మహారాష్ట్రలోని కోలీలు, భిల్లులు, ధాంగర్లు మొదలైన తెగల సహకారంతో ‘రామోషీ’ అనే విప్లవ బృందాన్ని ఆయన తయారుచేశారు. బ్రిటిష్ సైనికులపై హఠాత్తుగా జరిపిన గెరిల్లా దాడుల్లోని ఒకదానిలో ఏకంగా పుణె నగరంపైనే ఫడ్కే పట్టు సాధించి కొద్దిరోజులు నిలబెట్టుకోవడంతో ఆయన వెలుగులోకి వచ్చారు. ఫడ్కే మహారాష్ట్రలోని రాయఘడ్ జిల్లాకు చెందిన పన్వెల్ తాలూకా షిర్ధాన్ గ్రామంలో మరాఠీ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్న కాలంలో కుస్తీ, గుర్రపుస్వారీ వంటివి ఉత్సాహంగా నేర్చుకున్నారు. ఆయుధాలు లేకుండా బ్రిటిషు వారిపై తిరుగుబాటు చేయడం కష్టమని నిర్ణయించుకొని ఫడ్కే 1879లో అటవీప్రాంతంలో రహస్యంగా గిరిజన యువకులతో సైన్యాన్ని నెలకొల్పారు. ఆ సైన్యం ఆయుధాలు సమీకరించేది. ఆర్థిక అవసరాలకోసం ధనికులైన ఆంగ్లేయులను బంధించి, దోపిడీ చేసేది. దేశవ్యాప్తంగా వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకకాలంలో అనేక దాడులను నిర్వహించడానికి వాసుదేవ బల్వంత ఫడ్కే ప్రణాళికలు రచించినా పరిమిత విజయాన్నే అందించాయి. ఒకసారి ఘనూరు గ్రామంలో బ్రిటిషు సైన్యంతో నేరుగా తలపడ్డాడు. ఆ తర్వాత అతడిని పట్టుకోవడానికి ప్రభుత్వం బహుమతి ప్రకటించింది. అదే సమయంలో రోహిల్లా, అరబ్బులను తన సంస్థలో చేర్చుకోవడానికి ఫడ్కే హైదరాబాద్ రాష్ట్రానికి వెళ్లాడు బ్రిటిష్ మేజర్ హెన్రీ విలియం డేనియల్, హైదరాబాద్ నిజాం పోలీసు కమిషనర్ అబ్దుల్ హక్.. తదితరులు పగలు, రాత్రి ఫడ్కే అచూకి కోసం వెతికారు. 1879 జూలై 20న అతడు పండార్పూర్ వెళ్తున్నప్పుడు కొందరు నమ్మక ద్రోహులు ఇచ్చిన సమాచారంతో బ్రిటిష్ సైనికులు అతడిని పట్టి బంధించారు. తర్వాత జీవిత ఖైదు విధించారు. 1883 ఫిబ్రవరి 13న ఫడ్కే జైలు నుండి తప్పించుకున్నా మళ్లీ వెంటనే బ్రిటిష్ పోలీసులకు దొరికిపోయాడు. అప్పటినుంచి నిరాహార దీక్ష చేస్తూ ఫిబ్రవరి 17న ఫడ్కే తుదిశ్వాస విడిచాడు. (చదవండి: మొబైల్ ఫోన్ల శకారంభం) -
ఎయిర్‌పోర్ట్‌కి శంకర్ పేరు
భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను లాహోర్ జైలులో ఉరి తీశారన్న వార్తతో ఆగ్రహించిన ప్రజానీకం పలుచోట్ల గట్టిగా నిరసనలు తెలిపింది. కాన్పూర్‌లో ఘోరమైన మత కల్లోలాలు జరిగాయి. నాలుగు వందల మంది వరకు చనిపోయారు. అలాంటి సమయంలో ఆ రక్తపాతం నుంచి, ఆ మౌఢ్యం నుంచి అటు హిందువులను, ఇటు ముస్లిం మతానికి చెందిన అమాయకులను రక్షించడానికి ఒక జాతీయ కాంగ్రెస్ నాయకుడు, గాంధీజీ అనుచరుడు నేరుగా రంగంలో దిగారు. అదే అదనుగా ఒక మూక ఆయన మీద పడి, కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేసింది. రెండురోజులకు గాని ఆయన మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. ఆయనే గణేశ్‌శంకర్ ‘విద్యార్థి’. గణేశ్ శంకర్ విద్యార్థి (1890–1931) ఒక పేద కుటుంబంలో పుట్టారు. అలహాబాద్ సమీపంలోన అట్టార్‌సుయి ఆయన జన్మస్థలం. ఆయన అభిరుచి అంతా పత్రికా రచనే. ‘స్వరాజ్య’ పత్రికకు రచనలు పంపించేవారు. ఆ రచనల కోసం ఆయన పెట్టుకున్న పేరు ‘విద్యార్థి’. చివరికి ఆయనే ‘ప్రతాప్’ అనే వారపత్రిక ఆరంభించారు. ‘అణచివేత, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధుడిని నేను. ఉద్యోగులు, జమీందార్లు, పెట్టుబడిదారులు, కులీనులు ఎవరు ఈ పనికి పాల్పడినా నేను వారిపై పోరాడతాను. అమానవీయతకు వ్యతిరేకంగా నా ప్రాణమొడ్డి పోరాడతాను. అందుకు భగవంతుడు నాకు శక్తిని ఇస్తాడని కాంక్షిస్తున్నాను’ అని ఒక సందర్భంలో విద్యార్థి అన్నారు. స్వాతంత్య్రోద్యమంలో ఆయన పోరాటానికి, కృషికి గౌరవ సూచకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2017 జూలై 18న కాన్పూర్ విమానాశ్రయానికి ‘గణేశ్ శంకర్ విద్యార్థి ఎయిర్పోర్ట్’ అని పేరు పెట్టింది. (చదవండి: నేను మహిళను నేను విప్లవాన్ని...చిట్టగాంగ్‌లోని పహార్తలి యూరోపియన్ క్లబ్... ప్రీతిలతా వడ్డేదార్) -
నేను మహిళను నేను విప్లవాన్ని... ప్రీతిలతా వడ్డేదార్
పహార్తలి యూరోపియన్ క్లబ్ ముందు బ్రిటిషర్లు ‘‘కుక్కలకు, భారతీయులకు అనుమతి లేదు’’ అని అత్యంత అవమానకర రీతిలో ఒక బోర్డు పెట్టారు. దీంతో ఈ క్లబ్బుపై దాడి చేయాలని సేన్ బృందం నిర్ణయించుకుంది. ఈ దాడికి ప్రీతి నాయకత్వం వహించారు. ‘‘సోదరీమణులకు ఒక విన్నపం! ఇకపై తెరచాటున ఉండకూడదని మహిళలు బలమైన నిర్ణయం తీసుకున్నారు. జన్మభూమి స్వాతంత్య్రం కోసం ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా మగవారితో పాటు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. నన్ను నేను ధైర్యంగా విప్లవకారిణిగా ప్రకటించుకుంటున్నాను. అలాగే మిగతావారు కూడా..’’ ఒక మహిళా విప్లవకారిణి మృతదేహానికున్న దుస్తుల్లో ఈ మాటలున్న పాంపెట్లను చూసి బ్రిటిష్ బలగాలు బెంబేలెత్తాయి. బెంగాల్ తొలి మహిళా అమరురాలుగా చరిత్రకెక్కిన ప్రీతీలాల్ వడ్డేదార్ స్వయంగా రాసిన పాంపెట్లవి! తూటాల్లాంటి మాటలతో పాటు, స్వయంగా తూటాలు కురిపిస్తూ బ్రిటిషర్లతో యుద్ధం చేస్తూ దేశం కోసం ప్రీతి అశువులు బాసారు. చిన్న వయసులోనే..! చిట్టగాంగ్‌లో 1911 మే 5న ప్రీతీలాల్ వడ్డేదార్ జన్మించారు. తండ్రి జగబంధు చిట్టగాంగ్ మున్సిపాలిటీలో క్లర్కుగా పనిచేసేవారు. చిన్నప్పుడు ప్రీతిని ముద్దుగా రాణి అనేవారు. కస్తాగిర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రీతి చదివే రోజుల్లో ఉషా దీ అనే టీచరు పిల్లలకు జాతీయ భావాలను బోధించేవారు. ఉషా బోధనలతో ప్రీతి చిన్నవయసు నుంచే వలసపాలనపై వ్యతిరేకత పెంచుకున్నారు. చదువుకునే రోజుల్లో విప్లవ సాహిత్యం ఆమెను ఎంతగానో ఆకర్షించింది. ఝాన్సీ లక్ష్మీబాయిని ప్రీతి ఆదర్శంగా భావించేవారు. మహిళలు పెద్ద సంఖ్యలో కష్టాలను ఓర్చుకుంటూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం ప్రీతిని కదిలించింది. 1929లో ప్రీతి ఢాకాలోని ఈడెన్ కాలేజీలో చేరారు. కాలేజీలో ఆమె దీపాలి సంఘ అనే విప్లవ బృందంలో సభ్యురాలయ్యారు. ఈ బృందంలో మహిళలకు యుద్ధ పోరాటరీతులను, రాజకీయ అంశాలను బోధించేవారు. అనంతరం కలకత్తాలోని బెథూన్ కాలేజీలో ప్రీతి ఉన్నత విద్యనభ్యసించారు. ఫిలాసఫీలో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అయితే ఆ కాలంలో ఆమె విప్లవ భావాలను వ్యతిరేకించిన బ్రిటిష్ అధికారులు ఆమె డిగ్రీ పట్టాను నిలిపివేశారు. ఉన్నతవిద్య అనంతరం చిట్టగాంగ్‌లోని నందకన్నన్ అపర్ణాచరణ్ స్కూల్లో ఆమె టీచర్‌గా చేరారు. ఈ సమయంలోనే ఆమె భారత స్వాతంత్ర పోరాటంలో చేరాలని నిర్ణయించుకున్నారు. సూర్యసేన్ పరిచయం ప్రీతి విప్లవభావాల గురించి విన్న ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుడు సూర్యసేన్ ఆమెను తన బృందంలో చేర్చుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆమె సూర్యసేన్ ను ధాల్‌ఘాట్ క్యాంపులో కలిశారు. మహిళలను విప్లవ బృందంలో చేర్చడాన్ని తోటి విప్లవకారుడు బినోద్ బిహారీ వ్యతిరేకించారు. అయితే మహిళలు సులభంగా విప్లవ బృందాలకు కావాల్సిన ఆయుధాలను రవాణా చేయగలరన్న కారణంతో కఠిన శిక్షణ అనంతరం చివరకు ప్రీతిని బృందంలో చేర్చుకున్నారు. చిట్టగాంగ్ ఐజీ క్రెగ్‌ను హతమార్చేందుకు సూర్యసేన్ నిర్ణయించుకొని ఆ పనిని రామకృష్ణ బిశ్వాస్, కలిపాద చక్రవర్తికి అప్పగించారు. అయితే వీరిద్దరు క్రెగ్ బదులు వేరే అధికారులను హత్యచేసి 1931లో పట్టుబడ్డారు. బిశ్వాస్‌ను జైల్లో కలిసిన ప్రీతి ఆయన బోధనలతో స్ఫూర్తి పొందారు. అనంతరం సేన్ తో కలిసి ఆయన బృందంలో భాగంగా ప్రీతి పలు సాయుధ దాడుల్లో పాల్గొన్నారు. 1930 చిట్టగాంగ్ దాడి అనంతరం బృందంలో మగవారిపై నిఘా ఎక్కువ కావడంతో మహిళానేతలు చురుగ్గా విప్లవ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పహార్తలి క్లబ్ ఘటన జలియన్ వాలాబాగ్ దురంతం అనంతరం దేశవ్యాప్తంగా సమర వీరుల రక్తం మరిగిపోయింది. ఇదే సమయంలో స్థానిక పహార్తలి యూరోపియన క్లబ్ ముందు బ్రిటిషర్లు ‘‘కుక్కలకు, భారతీయులకు అనుమతి లేదు’’ అని అత్యంత అవమానకర రీతిలో ఒక బోర్డు పెట్టారు. దీంతో ఈ క్లబ్బుపై దాడి చేయాలని సేన్ బృందం నిర్ణయించుకుంది. ఈ దాడికి ప్రీతి నాయకత్వం వహించారు. 1932 సెప్టెంబర్‌లో ఆమె పంజాబీ మగమనిషిలా దుస్తులు ధరించి, విప్లవకారులతో కలిసి క్లబ్‌లోకి వెళ్లి క్లబ్బును పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ సమయంలో క్లబ్బులో ఉన్న పోలీసులు కాల్పులు జరపడంతో ప్రీతి కాలికి బుల్లెట్ తగిలి పారిపోయే వీలు చిక్కలేదు. దీంతో పోలీసుల చేతికి చిక్కకూడదన్న దృఢ నిశ్చయంతో ఆమె సైనేడ్ గుళిక మింగి అమరురాలయ్యారు. ఈ ఘటన జరిగే నాటికి ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలే! ప్రీతి ఆత్మత్యాగం దేశీయ మహిళా లోకంలో కలకలం సృష్టించింది. ఆమె స్ఫూర్తితో అనేకమంది స్త్రీలు కులమతాలకు అతీతంగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. ప్రీతి మహిళలకు ఆదర్శప్రాయమని బంగ్లా రచయిత్రి సెలినా హుస్సేన్ ప్రస్తుతించారు. – దుర్గరాజు శాయి ప్రమోద్ (చదవండి: స్వతంత్ర భారతి:1993/2022 స్టాక్ మార్కెట్లోకి ఇన్ఫోటెక్ ) -
చైతన్య భారతి: శ్రీ అరబిందో ఘోష్ / 1872–1950 పరిపూర్ణవాది
అరబిందో ఘోష్‌ను అర్థం చేసుకునే ప్రయత్నంలోని జటిలత్వాన్ని సరళీకరించుకోవడం కోసం ముందుగా ఆయన్ని ఒక పరిపూర్ణ పరిణామవాదిగా మనసులో ప్రతిష్టించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయనలోని కవి పుంగవుడు, జాతీయవాది, యోగసాధకుడు ఒకరొకరుగా దర్శనమివ్వడం మొదలుపెడతారు. ఘోష్ ఒక విలక్షణమైన తాత్విక చింతనాపరుడు. జీవ పరిణామక్రమంలో మనిషికి ఒక మెట్టు పైన ఉన్న, లేదా మనిషిని ఒక మెట్టు పైన ఉంచిన ‘మనస్సు’ అనే దశను కూడా దాటి అధిమానవ స్థితిలోకి వెళ్లేందుకు తన చివరి నలభై ఏళ్లూ తపోనిష్టలో ఉన్నారు అరబిందో ఘోష్! ఆయన పూర్వ నిర్యాణ అవశేషమే ‘ఇంటెగ్రల్ నాన్ డ్యూయలిజం’. ఈ అద్వైత పూర్ణ పరిణామాన్ని ఘోష్ దర్శించారా లేక కేవలం ప్రతిపాదించారా అంటే మాత్రం ఆయనే రాసిన ‘ది లైఫ్ డివైన్’, ‘సావిత్రి’ వంటి గ్రంథాలను ఆశ్రయించవలసిందే. ది లైఫ్ డివైన్.. పూర్ణయోగ సైద్ధాంతిక అంశాలను తర్కిస్తుంది. ‘సావిత్రి’.. మహాభారతంలోని సావిత్రి, సత్యవంతుల కథ ద్వారా ఘోష్ దర్శన సమస్తాన్ని ఆవిష్కరిస్తుంది. ఘోష్‌లోని గాఢతను ఆయన చూసిన ప్రపంచం నుంచి కాక, ఆయన చదివిన వాజ్ఞయ జ్ఞానసారం నుంచి మాత్రమే సాక్షాత్కరింపజేసుకోవాలి. దీనర్థం ఘోష్ చూసిన ప్రపంచం పరిమితమైనదని కాదు. ప్రాపంచిక దృక్పథానికి ఆవలే ఆయన జీవనయానం మొత్తం సాగిందని. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, యోగ, తంత్ర శాస్త్రాలతో పాటు పాశ్చాత్య చింతనను ఆయన తన యానానికి సోపానాలుగా నిర్మించుకున్నారు. 1872 ఆగస్టు 15న కోల్‌కతాలోని ఒక బెంగాలీ సంపన్న కుటుంబంలో జన్మించిన అరవిందో ఘోష్... తండ్రి నిర్ణయం మేరకు తన ఏడవయేట సోదరులతో కలిసి అప్రమేయంగా ఇంగ్లండ్ వెళ్లారు. ప్రపంచ భాషలు నేర్చుకున్నారు. ఉన్నత విద్యావంతుడయ్యారు. ఇరవై ఒకటో యేట ఇండియా తిరిగివచ్చి ప్రభుత్వోద్యోగంలో చేరారు. భారత జాతీయ కాంగ్రెస్ సభలకు హాజరవడం ఆయన్ని జాతీయవాదిగా మార్చిందో లేక, జాతీయవాదిగా మారాక సభలకు వెళ్లారో చెప్పలేం కానీ, మితవాద రాజకీయాల్లో ఆయన ఎక్కువకాలం ఉండలేకపోయారు. ఆధ్యాత్మికం వైపు మళ్లి, అధిభౌతిక తాత్వికునిగా మానవుని దివ్య చైతన్య దశను అన్వేషించే క్రమంలోనే 1950 డిసెంబర్ 5న కాలగర్భితు డయ్యారు. (చదవండి: సామ్రాజ్య భారతి: 1901/1947 ఘట్టాలు, జననాలు...చట్టాలు) -
నేను నమ్ముతున్నాను
నేను నమ్ముతున్నాను.. మహిళా భాగస్వామ్యం కూడా ఉంటే త్వరగా స్వాతంత్య్రం సిద్ధిస్తుందని. నేను నమ్ముతున్నాను.. మహిళలూ కదనరంగంలోకి దుమికితే.. భారతదేశంలో అణువణువునా స్వాతంత్య్ర కాంక్ష రగులుతోందన్న సంకేతం బ్రిటన్ కు అందుతుందని.. ఎనభై ఏళ్ల క్రితమే ఏ బలాలు, దళాలు లేని కాలంలో స్వాతంత్య్ర సంగ్రామానికి మహిళల్ని ఏ ధైర్యంతో ఆహ్వానించారు సుభాస్‌చంద్రబోస్?! ధైర్యంతో కాదు. మహిళా శక్తిపై ఉన్న నమ్మకంతో! ఆ నమ్మకంతోనే బోస్ ‘రాణీ ఝాన్సీ’ మహిళా రెజిమెంట్‌ను స్థాపించి, వారి తుపాకులను బ్రిటిష్‌వారి పైకి ఎక్కుపెట్టించారు! 1943 జూలై 9, సింగపూర్.. బోస్ మాట్లాడుతున్నాడు.. సుభాస్ చంద్రబోస్! ఎదురుగా భారతీయులు.. అరవై వేల మంది! ఇల్లొదిలి, దేశం వదలి తనెందుకు వచ్చిందీ చెప్పాడు. అయితే అది కాదు అతడు చెప్పబోతున్నదని అక్కడి వారికి అర్థమైపోయింది. ఇంకేదో చెప్పబోతున్నాడు. ఏంటది? ‘‘మహిళలు కూడా తుపాకులు అందుకోవాలి’’ అన్నాడు బోస్. ఒక్కసారిగా నిశ్శబ్దం! ‘‘వాళ్లొచ్చి ఏం చేస్తారు బోస్.. భారం అవుతారు ఆజాద్ హింద్ ఫౌజ్‌కి’’.. ఎవరో అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ – ఐఎన్ఎ) .. బోస్ నిర్మించిన సైనిక దళం. గొరిల్లా, ఇన్ఫాంట్రీ, స్పెషల్ ఆపరేషన్స్.. వెరీ డేంజరస్! ఐఎన్ఎ అలికిడి అయితే చాలు.. బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. అప్పటికి ఏడాదైంది బోస్ ఐఎన్ఎ ని తయారుచేసి. అందులోకే ఇప్పుడు మహిళల్ని రమ్మంటున్నాడు. ‘‘ఒంట్లో సత్తువ ఉన్న ప్రతి ఒక్కరూ.. ఇంట్లో దూరిన శత్రువుని తరిమికొట్టడానికి సైన్యంలోకి రావాలి’’ అన్నాడు బోస్. ‘‘ఏం చేస్తారు బోస్.. మహిళలు సైన్యంలోకి వచ్చి?’’ మళ్లీ అదే ప్రశ్న. ఆ ప్రశ్నకు బోస్ గర్జించాడు. ఎవరూ చేతుల్లేపలేదు! ‘‘ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందో అదే చేస్తారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా ఖడ్గాన్ని తిప్పిందో అలాగే ఖడ్గాన్ని తిప్పుతారు. తిరుగు బాటుకు, స్వాతంత్య్ర సంగ్రామానికి అప్పుడున్నది ఒక్క లక్ష్మీబాయే. ఇప్పుడు ప్రతి మహిళా ఒక లక్ష్మీబాయి. నేను నమ్ముతున్నాను.. మహిళా భాగస్వామ్యం కూడా ఉంటే త్వరగా స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. నేను నమ్ముతున్నాను.. మహిళలూ కదనరంగంలోకి దుమికితే.. భారతదేశంలో అణువణువునా స్వాతంత్య్ర కాంక్ష రగులుతోందన్న సంకేతం బ్రిటన్ కు అందుతుంది..’’. బోస్ ప్రసంగం ముగించాడు. ముగిస్తూ, చెయ్యి ముందుకు చాపి.. ప్రమాణం చేస్తున్నట్లుగా అన్నాడు. ‘‘మన మహిళా దళం పేరు.. ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’ అన్నాడు. ఎవరూ చేతుల్లేప లేదు!‘‘ఇక స్వాతంత్య్రం వచ్చినట్లే’’.. ఎవరో అన్నారు. ‘అవునవును’.. ఇంకో గొంతు. మరికొన్ని వంత గొంతుకలు. మూడ్రోజులు గడిచాయి. చప్పుడు లేదు. నాలుగో రోజు సింగపూర్‌లోనే.. ‘ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్’ (ఐఐఎల్) మీటింగ్ జరుగుతోంది. ఐఐఎల్ మహిళా విభాగం మీటింగ్ అది. అక్కడికి వెళ్లాడు బోస్. ‘నా పేరు బోస్.. !’ ఇండియా బయట ఉండి, ఇండియన్ ఇండిపెండెట్స్ కోసం పోరాడుతున్న భారతీయులంతా కలిసి పెట్టుకున్న రాజకీయపార్టీ ఐఐఎల్.‘‘నా పేరు బోస్. మీలాగే భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఒక సైనికుడిని’’ అన్నాడు బోస్. మీటింగ్‌లోని మహిళలు కొందరు సంభ్రమంగా చూశారు. ‘మీలాగే’ అన్న మాట.. వారిలో ఉత్తేజాన్ని నింపింది. ‘‘మీతో కలిసి బ్రిటిష్ వాళ్లపై పోరాటం చేయాలనుకుంటున్నాను’’ అన్నాడు బోస్. బోస్‌తో కలిసి పోరాడాలని అనుకుంటారు ఎవరైనా. కానీ బోసే అంటున్నాడు ‘నేను మీతో కలిసి పోరాడతాను’ అని! ఆశ్చర్యంగా కళ్లింత చేసి చూశారు మహిళలు. సమావేశంలో డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ ఉన్నారు. సింగపూర్‌లో ఐఐఎల్ మహిళా విభాగంలో ఆమెది ముఖ్య పాత్ర. ఆ సమావేశంలోనే.. బోస్కి మహిళలతో ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇప్పించాలన్న నిర్ణయం జరిగింది. అంటే సైనిక వందనం! ఎక్కడ దొరుకుతారు?! సైనిక వందనం ఇప్పించేందుకు మహిళలైతే ఉన్నారు. మహిళా సైనికులు ఎక్కడ దొరుకుతారు.. ‘గార్డ్ ఆఫ్ ఆనర్’కి?! కష్టపడి ఓ ఇరవై మంది సాధారణ మహిళల్ని ఒప్పించగలిగారు. బోస్ ఐఎ¯Œ ఎ దళం నుంచి లీ–ఎన్ఫీల్డ్ 303 రైఫిల్స్ తెప్పించారు. వాటిని ఎలా పట్టుకోవాలో, ఎలా వందన సమర్పణ చేయాలో ఆ ఇరవై మందికి అప్పటికప్పుడు నేర్పించారు. యూనిఫారాల్లేవు. చీరల వస్త్రధారణలోనే గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. వందన సమర్పణ ముగిసింది. బోస్ ప్రసంగం మొదలైంది. ‘‘స్వాతంత్య్రం కోసం దశాబ్దాలుగా మగాళ్లకు దీటుగా మీరూ ముందుకు నడుస్తున్నారు. నాకనిపిస్తున్నది ఏమిటంటే.. ముందుకు నడవడమే కాదు, ముందుకు నడిపించగలరు కూడా మీరు’’. ఆ ఒక్కమాట చాలదా మహిళలు తుపాకీని భుజానికెత్తుకోడానికి. ఎత్తుకున్నారు. ఖిన్నుడైన జనరల్ కానీ, అదంత తేలిగ్గా ఏమీ జరగలేదు. ఆడవాళ్లెందుకు ఆజాద్ హింద్ ఫౌజ్‌లోకి అనే ప్రశ్న మళ్లీ వచ్చింది. బోస్కి సైనిక వందనం చేసిన మహిళల్లో డాక్టర్ నసీరా కయానీ అనే డాక్టర్ కూడా ఉన్నారు. రైఫిల్‌ని ఎత్తిపట్టుకున్న ఆ గ్రూపులో ఉన్న నసీరాను చూసి ఆజాద్ హింద్ ఫౌజ్ కు జనరల్‌గా ఉన్న మొహమ్మద్ జమాన్ కయానీ ఖిన్నుడయ్యాడు. తన భార్యేమిటీ, అకస్మాత్తుగా ఇక్కడ ప్రత్యక్షం అయిందేమిటీ? అని ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్లాక నసీరాను కోప్పడ్డాడు. ‘‘డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ కాలేజ్‌లో నా క్లాస్మేట్. తను రమ్మంటే వెళ్లాను’ అని భర్తకు చెప్పారు నసీరా. ఆర్‌జెఆర్ (రాణి ఝాన్సీ రెజిమెంట్) లో చేరదామని వెళ్లి కూడా, భర్త వద్దనడంతో ఆమె ఆగిపోయారు. పైస్థాయిలోనే ఇలా ఉంటే, కింది స్థాయిలో ఇంట్లో మగాళ్లు మహిళల్ని సైన్యంలోకి వెళ్లనిస్తారా? అయినా ఆర్‌జెఆర్ నిలబడింది. నిలదొక్కుకుంది. కలబడింది. బలపడింది. కదిలివచ్చిన కొద్దిపాటి మహిళలతోనే నేతాజీ మహిళా సైన్యం 1943 అక్టోబర్ నుంచి 1945 మే వరకు ఉరుములా, మెరుపులా వెయ్యి మంది సైనికులతో ఉనికిలో ఉంది. కెప్టెన్ లక్ష్మీ సెహెగల్ (లక్ష్మీ స్వామినాథనే లక్ష్మీ సెహెగల్) ఈ దళాన్ని నడిపించారు. 1945 అక్టోబర్‌లో ప్రపంచ యుద్ధం పూర్తయింది. అంతకు రెండు నెలల ముందే ఆగస్టులో సుభాస్ చంద్రబోస్ అదృశ్యమయ్యారు. ఆ అదృశ్యశక్తి మహిళల్లో పోరాట పటిమకు శక్తినిస్తూ ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటుంది. – సుభాస్ చంద్రబోస్ -
మహోజ్వల భారతి: ‘నల్లదొరతనం’ పై రాయనన్న దేశభక్తుడు
సహాయ నిరాకరణోద్యమ స్ఫూర్తితో గరిమెళ్ల సత్యనారాయణ వీరావేశంతో ఉద్యమంలోకి దూకారు. ‘మాకొద్దీ తెల్లదొరతనము..’ అంటూ గొంతెత్తి పాడుతూ రాజమండ్రి వీధి వీధినా తిరిగారు. ఎక్కడికక్కడ జనం ఆయన చుట్టూ చేరి ఆయనతో పాటే గొంతు కలిపారు. ఆనాటి రోజుల్లో ఆ పాట నకలు ప్రతులు ఒక్కొక్కటీ పన్నెండు పైసలకు అమ్ముడు పోయాయంటే, గరిమెళ్ల పాట ఎంతలా జనాలను ప్రభావితులను చేసిందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ కలెక్టర్‌కు తెలుగుభాష రాకపోయినా, గరిమెళ్ల చేత ఈ పాట పాడించుకుని విన్నాడు. తనకు భాష అర్థం కాకపోయినా, ఈ పాట జనాలను ఏ స్థాయిలో ఉద్రేకపరచగలదో ఊహించగలనంటూ గరిమెళ్లకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాడు. అంతటి మనిషికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన పాలకుల వల్ల ఎలాంటి మేలూ జరగలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో జనాలను ఉర్రూతలూగించే పాట రాసినందుకైనా ఆయనకు ఎలాంటి ప్రభుత్వ సత్కారాలూ దక్కలేదు. చివరి దశలో ఆయనకు ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. ఏ పనీ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో ఆయన యాచనతో రోజులను వెళ్లదీశారంటే, ఆయన పట్ల మన పాలకులు ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్య్రానంతరం దేశంలో ప్రబలిన అవినీతికి విసిగి వేసారిన గరిమెళ్ల మిత్రుల్లో కొందరు ఆయనను ‘మాకొద్దీ నల్లదొరతనము..’ అంటూ కొత్త పాట రాయాల్సిందిగా కోరారు. అయితే, నరనరానా దేశభక్తిని జీర్ణించుకున్న ఆయన అందుకు అంగీకరించలేదు. దుర్భర దారిద్య్ర పరిస్థితులతో పోరాడుతూనే ఆయన 52 ఏళ్ల వయసుకే తుదిశ్వాస విడిచారు. నేడు గరిమెళ్లవారి జయంతి. 1893 జూలై 14న ఆయన శ్రీకాకుళంలోని నరసన్నపేటలో జన్మించారు. -
తలక్కల్ చందు తలవంచిందేలే!
కేరళ ఆదివాసీ వీరుడు తలక్కల్ చందు గొరిల్లా యుద్ధ రీతులతో బ్రిటీషర్లను గజగజలాడించాడు. పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్ధంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే మలబారు తీరంలో మిరియాల వర్తకంపై ఏకఛత్రాధిపత్యం సాధించాలన్న కంపెనీ ప్రయత్నాలకు కేరళ ఆదివాసీ వీరులు అడ్డుగా నిలిచారు. ఈ వీరులకు పోరాటాల్లో కేరళ కొట్టాయంకు చెందిన వీర కేరళ వర్మ పళాసీ రాజా సాయం చేశారు. రాజా సాయంతో స్థానిక ఆదివాసీ వీరుడు తలక్కల్ చందు గొరిల్లా యుద్ధ రీతులతో బ్రిటీషర్లను గజగజలాడించాడు. 1779–1805 కాలంలో వయనాడ్‌లోని కురిచియ సైన్యాన్ని కంపెనీకి వ్యతిరేకంగా ఆయన ముందుండి నడిపించారు. కేరళ మనంతవాడికి చెందిన కక్కొట్టిల్ కురిచయ తరవాడ్ (కురిచయల ఉమ్మడి కుటుంబం)లో చందు కీలక సభ్యుడు. ఈ కుటుంబానికి పళాసీ ఎడచన నాయర్ కుటుంబంతో చాలా అనుబంధం ఉండేది. కురిచయ తెగ ప్రజలు వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడేవారు. వయనాడ్ ప్రాంతంలో వరి సాగులో వీరు ముందంజలో ఉండేవారు. పన్నుల భారం మలబార్ రెవెన్యూ సెటిల్మెంట్కు మేజర్ విలియం మాక్లీడ్ పన్ను కలెక్టర్‌గా పనిచేసిన కాలం మలబార్ ప్రాంత రైతాంగానికి పీడకలలా మారింది. ముఖ్యంగా వయనాడ్ ఆదివాసీ రైతులను పన్నుల పేరిట విలియం పలు ఇక్కట్లు పెట్టాడు. మేజర్ కింద పనిచేసే అవినీతి అధికారులు అసంబద్ధ రెవెన్యూ సర్వేలు చేసేవారు. చివరకు ఒక్కో వ్యక్తి బంగారం రూపంలో చెల్లించాల్సిన పన్నులను 20 శాతం పెంచాడు విలియం. అలాగే వరి ఉత్పత్తిపై పన్ను 40 శాతం వరకు పెంచారు. వీటి వసూలు కోసం బ్రిటీష్ పోలీసులు, రెవెన్యూ అధికారులు కురిచియ తెగ నివాసాలపై దాడులు చేసేవారు. దాడుల సమయంలో అమాయక ఆదివాసీలను అవమానించడం, అణగదొక్కడం జరిగేది. ఇవన్నీ చూసిన చందు తన ప్రజల్లో విప్లవాగ్ని రగిలించాడు. వరి సాగుతో పాటు పోరాట అవసరాన్ని వివరించాడు. దీంతో వయనాడ్ ప్రాంత ఆదివాసీలు చందు నాయకత్వంలో సంఘటితమయ్యారు. మిలీషియా దాడి మేజర్ విలియం అకృత్యాలకు ప్రతిఘటనగా చందు నాయకత్వంతో దాదాపు 150 మంది కురిచయ మిలిషీయా 1802 అక్టోబర్ 11న వయనాడ్‌లోని పనమరం బ్రిటీష్ క్యాంపుపై దాడి చేసింది. ఆ సమయంలో క్యాంపులో 70 మంది సైనికులున్నారు. వీరంతా బొంబాయి ఇన్‌ఫ్యాంటరీకి చెందిన కెప్టెన్ డికెన్సన్ , లెఫ్టినెంట్ మాక్స్వెల్ ఆధ్వర్యంలో పనిచేసేవారు. కురిచయ ప్రజలను అవమానించడంలో వీరిది అందెవేసిన చేయి. అందుకే తొలిదాడికి ఈ క్యాంపును చందు ఎంచుకున్నాడు. కెప్టెన్ , లెఫ్టినెంట్ సహా ఏ ఒక్క సైనికుడిని మిగల్చకుండా కురిచయ సైనికులు హతమార్చారు. క్యాంపు నుంచి 112 తుపాకులు, ఆరు పెట్టెల మందుగుండు, రూ. 6వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. క్యాంపులో నిర్మాణాలన్నీ తగలబెట్టి కంటోన్మెంట్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో కురిచయల సైన్యంలో ఐదుగురు మరణించారు. ఈ దాడి దక్షిణ భారతంలో బ్రిటీషర్లకు తీవ్ర దిగ్భ్రమను కలిగించింది. కంపెనీకి అవమానం పనమరం దాడికి ప్రతీకారం కోసం బ్రిటీష్ సైన్యం దాదాపు మూడేళ్లు యత్నించింది. చందు సహా కురిచయన్ యోధులను బంధించాలని, తద్వారా పళాసీ రాజాను అదుపులోకి తీసుకోవాలని విపరీతంగా శ్రమించింది. అయితే కురిచయల గొరిల్లా పోరాట రీతులముందు బ్రిటీషర్ల ప్రయత్నాలు ఫలించలేదు. వీరంతా పులపల్లి సమీపంలోని సీతాదేవీ ఆలయంలో తలదాచుకొనేవారు. ఎలాగైనా వయనాడ్‌ను బ్రిటీషర్ల నుంచి విముక్తి చెందించి పళాసీ రాజాను గద్దెనెక్కించాలని కురిచయలు ప్రతినబూనారు. వీరి పోరాటాలను తట్టుకోలేని కంపెనీ ప్రభుత్వం 1803లో ఆ ప్రాంతమంతా మార్షల్ లా విధించింది. అయితే ఎవరూ ఈ చట్టానికి తలవంచకపోవడం, స్థానికులంతా బ్రిటీషర్లను ఎదరించడం వంటివి కంపెనీకి మరింత అవమానం మిగిల్చాయి. చివరకు ఆంగ్లో మరాఠా యుద్ధంలో వీరుడిగా పేరుగాంచిన ఆర్థర్ వెల్లెస్లీ సైతం కురిచయల చేతిలో ఓటమిని చవిచూశాడు. పట్టించిన నమ్మకద్రోహం ఎదురుదెబ్బలు తగిలిన చోట కుట్రలు పన్నడం బ్రిటీషర్లకు వెన్నతో పెట్టిన విద్య! చందు పోరాటాన్ని తట్టుకోలేని కంపెనీ చివరకు కుట్రలకు దిగింది. కురిచయల, చందు ఆచూకీ తెలిపినవారికి ధనం, భూమి ఇస్తామని ఆశపెట్టడంతో స్థానికుల్లో కొందరు నమ్మక ద్రోహానికి దిగారు. 1805 నవంబర్ 14న జరిగిన భీకర యుద్దంలో స్థానికుల కుట్ర కారణంగా చందు కంపెనీ చేతికి చిక్కాడు. పట్టుబడిన చందును పనమరం కోటకు తెచ్చి దాదాపు తీవ్రంగా హింసించి అనంతరం నవంబర్ 15న కోలీ చెట్టుకు ప్రజలందరి ముందర ఉరి తీశారు. ఆయన సహచరుడు ఎడచెన కుంకన్ బ్రిటీషర్ల చేతికి చిక్కకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. చందు పోరాటం కేరళలో పలు స్వాతంత్య్రోద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. 2012లో కేరళ ప్రభుత్వం పనమరం కోటలో చందు పేరిట మ్యూజియంను, స్మారకచిహ్నాన్ని నెలకొల్పింది. ఈ మ్యూజియంలో చందు, ఆయన తోటి వీరులు వాడిన విల్లంబులు ఇతర ఆయుధాలతో పాటు నాటి సాంప్రదాయక వ్యవసాయ సామగ్రిని ప్రదర్శనకు ఉంచారు. – దుర్గరాజు శాయి ప్రమోద్ (చదవండి: జైహింద్ స్పెషల్: ఉద్వేగాలను దట్టించి.. కథల్ని ముట్టించారు) -
సమర యోధుడు: అనుగ్రహ నారాయణ్ సిన్హా
అనుగ్రహ నారాయణ్ సిన్హా స్వాతంత్య్ర సమర యోధులు, రాజనీతిజ్ఞులు, గాంధేయవాది. ఆధునిక బిహార్ నిర్మాతలలో ఆయన ఒకరు. సిన్హా చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. బిహారుకు తొలి ఉప ముఖ్యమంత్రి (1937)గా చేశారు. రాజ్యాంగ రచనకు ఏర్పాటైన భారత రాజ్యాంగ పరిషత్‌లో సభ్యులుగా ఉన్నారు. బాబు సాహెబ్ అనే పిలుపుతో ప్రసిద్ధులైన అనుగ్రహ నారాయణ్ సిన్హా మహాత్మాగాంధీకి అత్యంత సన్నిహితులు. సిన్హా 1887 జూన్ 18 న బిహార్‌లోని పూర్వపు గయ జిల్లా (నేడు ఔరంగాబాద్) పోయివాన్ గ్రామంలో జన్మించారు. ఆయన రాజపుత్ర వంశానికి చెందినవారు. న్యాయవాద వృత్తిని చేపట్టారు. 1917లో మహాత్మా గాంధీ జాతికి ఇచ్చిన పిలుపును అందుకుని చంపారన్ సత్యాగ్రహ ఉద్యమంలో చేరారు. అందుకోసం తన న్యాయవాద వృత్తిని విడిచిపెట్టారు. అనంతరం సిన్హా జాతీయ స్థాయి నాయకుడయ్యారు. ప్రతిభావంతులైన యువకులను చైతన్యపరిచేందుకు డాక్టర్ రాజేంద్రప్రసాద్ స్థాపించిన బిహార్ విద్యాపీఠంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన మొదటి విద్యార్థులలో యువ జయప్రకాష్ నారాయణ్ ఒకరు. భారత జాతీయవాద చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించే 1930 నాటి శాసనోల్లంఘన ఉద్యమంలో సిన్హా.. గాంధీ వెనుక కీలక శక్తిగా పనిచేశారు. పర్యవపానంగా బ్రిటిషు ప్రభుత్వం 1933–34లో ఆయనకు 15 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. తిరిగి 1940–41లో సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు కూడా బ్రిటిషు అధికారులు ఆయనను అరెస్టు చేసి, 1942లో హజారీబాగ్ కేంద్ర కారాగారంలో ఉంచారు. 1944లో ఆయన విడుదలయ్యారు. బయటికి వచ్చాక అంటువ్యాధి పీడిత ప్రజలకు సేవ చేయడానికి అంకితమయ్యారు. సిన్హా రాజకీయ జీవితం కూడా ఎంతో విస్తృతమైనది. 1935లో సహబాద్–పాట్నా నియోజకవర్గం నుండి సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడిగా భారీ అధిక్యతతో ఎన్నికయ్యారు. 1936లో బిహార్ శాసనసభ సభ్యుడయ్యారు. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం బ్రిటిషువారు మంజూరు చేసిన ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిలో భాగంగా మొదటి కాంగ్రెస్ మంత్రివర్గం 1937 జూలై 20న ప్రమాణ స్వీకారం చేసింది. అప్పుడే సిన్హా బిహార్ ఉపముఖ్యమంత్రి అయ్యారు. స్వతంత్ర భారత తొలి పార్లమెంటులో కూడా ఆయన సభ్యులుగా ఉన్నారు. కార్మిక, స్థానిక స్వరిపాలన, ప్రజా పనులు, సరఫరా–ధరల నియంత్రణ, ఆరోగ్యం, వ్యవసాయం వంటి శాఖల్ని నిర్వహించారు. నేడు సిన్హా వర్ధంతి. డెబ్బై ఏళ్ల వయసులో 1957 జూలై 5న ఆయన కన్నుమూశారు. -
స్వాతంత్ర్య సమరయోధుడి కుమార్తెకు పాదాభివందనం చేసిన మోదీ!
సాక్షి పశ్చిమగోదావరి జిల్లా: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దివంగత పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని మోదీ కలిశారు. ఆ సమరయోధుడి కుమార్తె 90 ఏళ్ల పసల కృష్ణ భారతిని కలవడమే కాకుండా ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాదు ఆమె సోదరి, మేనకోడలు వద్ద నుంచి కూడా మోదీని ఆశీర్వదాలు తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకాలోని పశ్చిమ విప్పర్రు గ్రామంలో 1900లో జన్మించిన పసల కృష్ణమూర్తి 1921లో తన సతీమణితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధేయవాది అయిన ఆయన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని ఒక ఏడాది జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆయన 1978లో కన్నుమూశారు. ఈ మేరకు మోదీ ఏపీలో పర్యటించడమే కాకుండా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొని భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామారాజు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. (చదవండి: ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి: ప్రధాని నరేంద్ర మోదీ) -
Alluri Sitarama Raju: వైరాగ్యం నుంచి విప్లవం వైపు...
సన్యసించి విప్లవకారులుగా మారిన ఇద్దరే ఇద్దరు యోధులు భారతీయ స్వాతంత్య్ర సమరంలో కనిపిస్తారు. అందులో ఒకరు అరవింద్ ఘోష్ అయితే, మరొకరు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. అమాయకులైన ఆదివాసీలపై బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు చేస్తున్న దోపిడీ రాజును కదిలించింది. ఇల్లు వదలి సన్యాసిలా దేశాటన చేసి వచ్చిన సీతారామరాజు చివరికి మన్యంలో విప్లవ శంఖాన్ని పూరించిన వైనం అపూర్వం. అటువంటి వీరుని 125 జయంతి ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తున్నారు. ఇదే సందర్భంలో భీమవరంలో 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని స్వహస్తాలతో ఆవిష్కరించి ఘనమైన నివాళి అర్పిస్తున్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు గొప్ప దేశభక్తుడు. ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్‌ల కోవకు చెందిన మహావీరుడు. అమాయకులు, విద్యా విహీనులైన కొండ జాతి ప్రజ లను ఒక్క తాటిపై నిలిపి, వారిని విప్లవ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్ ప్రభుత్వంపై యుద్ధం చేసిన అల్లూరి వంటివారు భారత విప్లవ చరిత్రలో మరొకరు కానరారు. సీతారామరాజు విప్లవం విజయ వంతం కాకపోయినా, ఆయన ధైర్యసాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజపరచి, వారిలో జాతీయతా భావాన్నీ, దేశభక్తినీ పురిగొల్పాయి. సన్యాసి జీవితం గడిపిన రాజు, తన స్వీయ ముక్తి కంటే, అణగారిన ప్రజల సాంఘిక, ఆర్థిక విముక్తికి కృషి చేయ డమే తన విద్యుక్త ధర్మమని భావించాడు. భారతదేశ చరిత్రలో సన్యసించి, విప్లవ కారునిగా మారిన వారు అరుదు. అరవింద్ ఘోష్, అల్లూరి సీతారామరాజు మాత్రమే మనకు కనిపిస్తారు. నేడు సీతా రామరాజు 125వ జయంతి. ఈ సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాన మంత్రి నేడు ఆవిష్కరిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మోగల్లు గ్రామ వాస్తవ్యులు అల్లూరి వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ మొదటి సంతానంగా 1897 జూలై 4వ తేదీన రాజు జన్మించారు. ఈయన అసలుపేరు శ్రీరామరాజు. ఆయన తండ్రి రాజమండ్రిలో ఫొటోగ్రాఫర్‌గా స్థిర పడ్డారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు జరుగుతున్న సమ యంలో 1908లో ఆయన కలరా వ్యాధితో మరణించాడు. అప్పటి నుంచి సీతారామరాజు తాసీల్దారైన పినతండ్రి రామకృష్ణంరాజు సంరక్షణలో పెరిగాడు. చదువుపై కన్నా ఆయనకు సన్యాసం, ప్రజాసేవ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందుకే పినతండ్రి మందలించాడు. దీంతో ఆయన ఇల్లు వదలి వెళ్లిపోయాడు. పలువురిని ఆశ్రయించి జ్యోతిషం, వాస్తు శాస్త్రం అభ్యసించాడు. సంస్కృత భాషపై పట్టు సాధించాడు. ఇచ్ఛాపురం నుండి కాలినడకన కలకత్తా చేరాడు. కలకత్తా వీధుల్లో వెళుతుండగా అప్పటి అగ్ర స్వాతంత్య్ర సమర యోధుల్లో ఒకరు సురేంద్రనాథ్ బెనర్జీ నిత్యార్చన చేసి, తనతో సహపంక్తి భోజనం చేసే ఒక అతిథి కొరకు ఇంటి బయటికి వచ్చి వెతుకుతుండగా ఎదురుగా రాజు కనిపించాడు. సీతారామరాజును భోజనానికి ఆహ్వానించాడు. అక్కడే 10 రోజులు బెనర్జీ కోరిక మేరకు రాజు ఉండిపోయాడు. ఆ సమయంలో బెనర్జీ ఇంటికి వచ్చిన మోతీలాల్ నెహ్రూ వంటి జాతీయ నాయకులతో రాజు దేశ పరిస్థితుల గురించి చర్చించాడు. అక్కడినుండి కాశీ, హరిద్వార్, రుషీకేశ్, బద్రీనాథ్ వంటి పుణ్య క్షేత్రాలు దర్శించి 1917 జూలై 24న విశాఖ జిల్లా కృష్ణదేవిపేట చేరాడు. దారకొండపై తపస్సుకు వెళ్తున్న రాజును చిటికెల భాస్కరుడు అనే గ్రామ పెద్ద చూసి, విషయం తెలుసుకుని తపస్సుకు ఆ గ్రామంలోనే అన్ని ఏర్పాట్లు చేశాడు. ప్రజలకు జ్యోతిషం, పురాణాలు, ఆయుర్వేద వైద్యంతో దగ్గరయ్యాడు. అధికారుల దోపిడీని ఎదుర్కొనమని వారిని ప్రోత్సహిం చాడు. వారిలో జాతీయతాభావం రగుల్కొలిపి, ప్రభుత్వ కోర్టులకు పోవద్దనీ, పంచాయతీ కోర్టులు ఏర్పాటు చేసి అక్కడే తగవులు తీర్చుకోమనీ; మద్యం సేవించరాదనీ, ఖద్దరు బట్టలనే ధరించమనీ బోధించాడు. డిప్యూటీ తాసీల్దారు బాస్టియన్, ఓవర్సీరు సంతానం పిళ్ళై చేస్తున్న అరాచకాలను పై అధికారులకు మహజర్ల రూపంలో పంపేవాడు. ఈ మన్య ప్రాంతంలో గతంలో కొన్ని పితూరీలు, దోపిడీలు జరిగాయి. దానితో ప్రభుత్వానికి రాజుపై అను మానం కలిగి డివిజనల్ మేజిస్ట్రేట్ ఫజులుల్లా ఖాన్‌ను ఎంక్వయిరీ చేయమని పంపారు. రాజు పినతండ్రికి ఖాన్ సహోద్యోగి. సీతారామరాజును నర్సీపట్నం తీసుకుని వెళ్లి తాసీల్దారు ఇంటిలో పెట్టి కృష్ణదేవిపేట వెళ్లవద్దని సలహా ఇచ్చాడు. ఉద్యోగం గానీ, వ్యవసాయ భూమి గానీ తీసుకోమని ఒత్తిడి చేశాడు. సీతారామరాజు ప్రభుత్వ దృష్టిని మళ్ళించటానికి ‘పైడిపుట్ట’లో ఇచ్చిన భూమిని తీసుకున్నాడు. ప్రజల సమస్యలు తీర్చటానికి తిరుగుబాటే ఏకైక మార్గమని భావించి దానికి రహస్యంగా తగిన ఏర్పాట్లు చేయసాగాడు. ప్రభు త్వంపై తిరుగుబాటుకు ఉత్సాహం చూపించిన సుమారు 200 మంది యువకులను 1922 ఆగస్టు 15న శరభన్నపాలెంలో సమావేశపరచి వారిచే ప్రమాణం చేయించాడు. ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడితో ప్రారంభమైన విప్లవం 1924 మే నెల వరకు అనేక విజయాలతో, బహుకొద్ది అపజయాలతో కొనసాగింది. ప్రభుత్వం 20 మంది యూరోపియన్ ఉన్నతాధికారులను, 1,500 మంది పైగా ఈస్ట్ కోస్ట్ స్పెషల్ పోలీసు, మలబారు స్పెషల్ పోలీసులను నియ మించి ఉద్య మాన్ని అణచే ప్రయత్నం చేసింది. ఆనాడు జిల్లా యంత్రాంగం– మద్రాస్ ప్రభుత్వం – ఢిల్లీకి మధ్య జరిగిన రహస్య తంతివార్తలు కొన్ని గమనిస్తే విప్లవం గురించి ప్రభుత్వం చెందిన ఆందోళన తెలుస్తుంది. ఢిల్లీ హోమ్ సెక్రటరీకి మద్రాస్ చీఫ్ సెక్రటరీ రాస్తూ, ‘‘రాజు నాయకత్వాన ప్రారంభమైన విప్లవం 18 నెలలు జరిగినా... అనేక రిజర్వు దళాలను పంపి కూడా అణచలేక పోయాం. సమీపంలో అంతమవుతుందని నమ్మకం లేదు. ఉన్నత న్యాయస్థానం కూడా దీనిని బ్రిటిష్ చక్రవర్తిపై యుద్ధంగానే గుర్తిం చింది’’ అని వాపోయాడు. ఏజెన్సీ కమిషనర్ స్టీవర్ట్ 1922 అక్టోబర్ 24న మద్రాస్‌కు తంతి పంపుతూ, ‘‘సీతారామరాజు గూఢచర్య చర్యలు అమోఘం. మన దళం బయలుదేరిన వెంటనే ఆ సమాచారం అతనికి చేరుతోంది. మనకు అందే సమాచారమంతా మనల్ని తప్పుదోవ పట్టించడానికి రాజు పంపుతున్న వార్తలే’’ అని పేర్కొన్నాడు. మద్రాస్ స్టాఫ్ కెప్టెన్ బిషప్, ఢిల్లీ హోం సెక్రటరీకి రాస్తూ... ‘‘రెండేళ్ల నుంచి విప్లవం నిరా ఘాటంగా సాగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా పదేళ్లయినా కొనసాగుతుంది. అకస్మాత్తుగా అనుకోని పరిస్థితులు విప్లవకారులకు ఎదురైతే తప్ప ఈ విప్లవం ఆగడం కలలోని మాట. అందువల్ల వెంటనే మార్షల్ లా గానీ, గవర్నర్ జనరల్ ఆర్డినెన్స్ గానీ ప్రకటిం చాలి’’ అని చెప్పాడు. ఈ విధంగా ప్రభుత్వం ఆందోళన చెందుతున్న సమయంలో రూథర్‌ఫర్డ్ అనే నరరూప రాక్షసుడిని ఏజెన్సీ కమిషనర్‌గా నియ మించారు. అతను రాజుకు సహాయం చేస్తున్న వారిని అనుమానించి 58 మంది గ్రామ మునసబులనూ, ముఠాదారులనూ అరెస్టు చేసి రుషికొండ జైలులో బంధించాడు. రాజు ఆచూకీ తెలపండని స్త్రీలను, పిల్లలను చిత్రహింసలు పెట్టించాడు. 1924 మే మొదటి వారంలో కృష్ణదేవి పేటలో రూథర్‌ఫర్డ్ మీటింగ్ పెట్టి పరిసర గ్రామ పెద్దలను హెచ్చరిస్తూ, వారం రోజులలో రాజు దళాన్ని పట్టి ఇవ్వకపోతే కృష్ణ దేవిపేటతోపాటు అనేక గ్రామాలను తగులబెడు తామనీ, చిటికెల భాస్కరుడితో సహా, పెద్దలను జైళ్లలో వేస్తామనీ హెచ్చరించాడు. రాజుకు కృష్ణదేవిపేట అన్నా, చిటికెల భాస్కర్ కుటుంబం అన్నా ఎన లేని అభిమానం అని రూథర్‌ఫర్డ్‌కు తెలిసే ఈ హెచ్చరిక చేశాడు. ప్రభుత్వం తనను ఎదుర్కొనలేక, ప్రజలను పెడుతున్న బాధలను చూసి రాజు బాధపడ్డాడు. అందుకే 1924 మే7వ తేదీన కుంచు మీనన్ నాయకత్వంలోని స్పెషల్ పోలీసు దళానికి ఒక బాలుని ద్వారా కబురు పంపి ‘మంప’ గ్రామంలో లొంగి పోయాడు. సీతారామరాజును బంధించి కొయ్యూరులో ఉన్న మేజర్ గుడాల్ దగ్గరకు తీసుకువెళ్లారు. రాజుతో గూడాల్ ఘర్షణపడి రాజును తుపాకీతో కాల్చి చంపాడు. ఆ విధంగా ఒక మహోద్యమం పరిసమాప్తం అయింది. సీతారామరాజు దేశభక్తి, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ జాతిని మేల్కొలుపుతూనే ఉంటుంది. వ్యాసకర్త: జి. కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక, పర్యాటకామాత్యులు -
బ్రిటిషర్లతో పోరాడిన తొలి భారతీయ రాణి: ఖడ్గధారి భరతనారి
భారత్‌లో వ్యాపార నిమిత్తం అడుగుపెట్టిన పరాయి దేశస్థులు దక్షిణ భారతంలో మొదట పట్టు సాధించారు. ఈ క్రమంలో వీరి పోకడలను వ్యతిరేకిస్తూ పలువురు విముక్తి పోరాటాలు చేశారు. అయితే భారతీయులంతా సంఘటితంగా తొలిసారి పోరాడింది 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామం లోనే! ఈ తొలి సంగ్రామం కన్నా ముందు నుంచే వేర్వేరు ప్రాంతాల్లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సామాన్యుల నుంచి మహారాజుల వరకు తమకు సాధ్యమైన రీతిలో స్వేచ్ఛ కోసం పోరాడారు. అలా తమిళనాట బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా 1780 ల్లోనే మహారాణి వేలునాచియార్ వీర పోరాటం చేశారు. క్రూరమైన ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన తొలి భారతీయ రాణిగా వేలు నాచియార్ ఖ్యాతిగాంచారు. ఆమె వీరత్వానికి, సాహసానికి గుర్తుగా తమిళులు ఆమెను వీరమంగై (వీరవనిత) అని కీర్తించారు. ఆర్కాట్ నవాబు మోసం తమిళనాడులోని రామ్నాడ్ రాజ్యానికి చెందిన రాణి సకందిముతల్‌కు, చెల్లముత్తు విజయరఘునాథ సేతుపతి మహారాజుకు 1730లో రాణి వేలు నాచియార్ జన్మించారు. మగ సంతతి లేకపోవడంతో నాచియార్‌ను రాజుగారు మగపిల్లాడిలా పెంచారు. ఆమెకు అన్నిరకాల విద్యలతో పాటు ఖడ్గయుద్ధ రీతులను, దండాయుధ పోరాట విధానాలను నేర్పారు. వీటితో పాటు భారతీయ రణవిద్యలైన వలరి, సిలంబం వంటివాటిలో నాచియార్ నైపుణ్యం సాధించారు. విలువిద్యలో, అశ్వవిద్యలో ఆమెకు సాటిలేరు. రాణిగా రాణించాలంటే కేవలం స్థానిక భాషపై పట్టు ఉంటే సరిపోదని భావించిన రాజుగారు తన కూతురుకు ఉర్దూ, ఫ్రెంచ్, ఇంగ్లీష్ నేర్పించారు. 1746లో నాచియార్‌కు శివగంగ సంస్థానాధిపతి రాజా ముత్తువదుగనతపెరియ ఉదయతేవర్‌తో వివాహమైంది. వీరికి ఒక కూతురు జన్మించింది. అయితే నాచియార్ వైవాహిక జీవితం మూణ్నాళ్ల ముచ్చటైంది. అప్పటి ఆర్కాట్ నవాబు బ్రిటిషర్లతో చేతులు కలిపి స్వదేశీ సంస్థానాలపై విరుచుకు పడ్డాడు. శివగంగ సంస్థానంపై నవాబు భారీగా పన్నులు విధించి వసూలు చేయడానికి ఈస్టిండియా కంపెనీ అధికారులను పంపాడు. అయితే రాజా ఉదయ్‌తేవర్ ఈ పన్నులను వ్యతిరేకించారు. 1772 యుద్ధంలో బ్రిటిషర్లు, ఆర్కాట్ నవాబు కలిసి అతడిని హతమార్చారు. దీంతో కూతురు వెలాచ్చితో కలిసి నాచియార్ విరుపాచ్చికి చెందిన పలయకారర్ గోపాల నాయకర్ వద్ద ఎనిమిదేళ్లు ఆశ్రయం పొందారు. నాచియార్, ఆమె దండనాయకులను గోపాల్ ఎంతగానో ఆదరించాడు. ఈ సమయంలో తిరిగి సంస్థానం స్వాధీనం చేసుకోవడం గురించి రాణి నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు. తొలి సూసైడ్ బాంబర్ 1780లో ఆమెకు కాలం కలిసివచ్చింది. ఆర్కాట్ నవాబుకు వ్యతిరేకంగా హైదర్ఆలీ యుద్ధం ప్రకటించాడు. ఇదే అదనుగా శివగంగను స్వాధీనం చేసుకునేందుకు నాచియార్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆమెతో పాటు అనేకమంది మహిళా సైనికులు స్థానిక రాజరాజేశ్వరి ఆలయానికి విజయదశమి సందర్భంగా చేరుకున్నారు. అంతా పండుగ వేడుకల్లో ఉన్నప్పుడు రాణి ఒక్కమారుగా బ్రిటిషర్లపైకి దాడికి దిగారు. అయితే ఎంత వ్యూహాత్మకంగా ముందుకు కదిలినా.. బ్రిటిషర్ల ఆయుధ సంపత్తి అపారంగా ఉండడంతో రాణికి పోరాటం కష్టంగా మారింది. ఇదే సమయంలో రాణి మహిళా దళపతి కుయిలి మహా సాహసానికి ఒడిగట్టింది. ఒంటి నిండా చమురు పోసుకొని ఆయుధగారం వద్దకు చేరుకున్న కుయిలీ తనను తాను కాల్చుకుంది. దీంతో భారీ విస్ఫోటనంతో ఆయుధాలన్నీ ధ్వంసమయ్యాయి. ఇలా చరిత్రలో తొలి సూసైడ్ బాంబర్‌గా కుయిలీ నిలిచింది. అంతకుముందు కూడా రాణి నాచియార్‌ను కుయిలీ పలుమార్లు కాపాడింది. కుయిలీని తన దత్తపుత్రికగా నాచియార్ పేర్కొనేవారు. అనంతర కాలంలో ‘ఉడైయాల్‘ అనే స్త్రీసేనను పోరాటంలో మరణించిన తన దత్తపుత్రిక పేరుతో స్థాపించారు నాచియార్. హైదర్ఆలీతో రాణి చేతులు కలిపిన సంగతి గ్రహించిన ఆర్కాట్ నవాబు చివరకు చేసేది లేక ఆమెకే శివగంగ సంస్థానాన్ని అప్పగించారు. ఈ నేపథ్యంలో మరుదు సోదరులు, కూతురుతో కలిసి ఆమె శివగంగ ఆస్థానానికి తిరిగి వచ్చారు. వెల్లై మరుదును సేనాధిపతిగా, చిన్న మరుదును మంత్రిగా నియమించుకొని పాలన సాగించారు. తన ధైర్యసాహసాలతో వీరవనిత అనే నామాన్ని సార్ధకపరచుకొన్నారు నాచియార్. యుద్ధానంతరం క్రమంగా ఆమె మురుదు సోదరులకు పరిపాలనాధికారం అప్పగించారు. 1796లో నాచియార్ మరణించారు. ఆమె సాహసానికి గుర్తుగా నాచియార్‌ను ‘జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా‘ అని కీర్తిస్తారు. – దుగ్గరాజు శాయి ప్రమోద్ (చదవండి: మార్గరెట్ బూర్కి–వైట్: తను లేరు, తనిచ్చిన లైఫ్ ఉంది) -
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్(1875–1950): మహాబలుడు
సర్దార్ పటేల్ 1950లో మృతి చెందినప్పుడు.. ‘‘స్వాతంత్య్ర సమర పోరాటంలో మన బలగాలకు ఆయన గొప్ప కెప్టెన్. చంచలిత హృదయాలను తిరిగి రగిలించిన మహాబలుడు’’ అని జవహర్లాల్ నెహ్రూ ఆయన గురించి చెప్పారు. ఉక్కు మనిషిగా పటేల్‌ను అభివర్ణించడమే మనందరికీ ఎక్కువగా తెలుసు. కానీ, వాస్తవానికి పటేల్ బలమంతా అలవోకగా త్యాగం చేయడంలో ఉట్టిపడుతుంది. న్యాయవాద వృత్తిని భారత స్వాతంత్య్రోద్యమం కోసం వదులుకున్న త్యాగధనులు పటేల్ మాదిరిగా చాలామంది ఉన్నారు. కానీ, సాక్షాత్తూ జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలవోకగా వదులుకున్న ఖ్యాతి మాత్రం పటేల్ సొంతం. 1929లో, 1937లో, తిరిగి 1946లో నెహ్రూని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయడం కోసం గాంధీజీ చేసిన అభ్యర్థన కారణంగా, పటేల్ తనకు గల అవకాశాన్ని వదులుకోవలసి వచ్చింది. ఇలా అహంకారాన్ని పక్కన పెట్టి వ్యవహరించే సామర్థ్యం కారణంగా 1936 నుంచి పటేల్ తుది శ్వాస పీల్చే వరకూ.. దాదాపు పదిహేనేళ్ల పాటు భారతదేశానికి నెహ్రూ–పటేల్‌ల నాయక ద్వయం లభించింది. పటేల్ వాస్తవ దృక్పథానికి మేలిమి ఉదాహరణ దేశ స్వాతంత్య్ర సముపార్జన అనంతరం 500 సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో ఆయన చూపిన చొరవ. అది ఆయనలోని వజ్ర సంకల్పానికి, విజ్ఞతకు నిలువెత్తు నిదర్శనం. రాచరిక పాలనకు స్వస్తి చెప్పి, ప్రజాస్వామ్యానికి పట్టం కట్టాలని సంస్థానాధీశులను ఆయన ఒప్పించగలిగారు. అదే సమయంలో వారి ప్రయోజనాలను ఒక సహేతుకమైన స్థాయి వరకు అంగీకరించి వారి పట్ల గౌరవ మర్యాదలను చూపించారు. విదేశీ వ్యవహారాలలో నిపుణుడైన కాంగ్రెస్ వాదిగా నెహ్రూ పేరు పొందినప్పటికీ, ఆ వ్యవహారాలలో పటేల్ అవగాహన మరింత పదునుగా, విస్పష్టంగా ఉండేది. అయినా దేశ ప్రయోజనాల కోసం, పరస్పర ప్రేమ, గౌరవాల కారణంగా ఇద్దరూ తమ విభేదాలను అధిగమించి వ్యవహరించారు. – రాజ్ మోహన్ గాంధీ, మహాత్మా గాంధీ మనుమడు, రాజకీయ ఉద్యమకారుడు -
మహోజ్వల భారతి: దేవుడు, దాసుడు
బందా సింగ్ బహదూర్ (1670–1716) సిక్కు సైన్యాధ్యక్షుడు. మహా యోధుడు. లక్ష్మణ్ దేవ్, బందా బహదూర్, లక్ష్మణ్ దాస్, మాధవ్ దాస్ అనే పేర్లతోనూ ఆయన ప్రఖ్యాతి చెందారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి ఆయన జన్మస్థలం. పదిహేనవ యేట ఇల్లు విడిచి సన్యసించి, ‘మాధవ్ దాస్’ అన్న దీక్షానామం స్వీకరించారు. గోదావరి తీరంలోని నాందేడ్ ప్రాంతంలో ఒక మఠాన్ని స్థాపించారు. 1708 సెప్టెంబరులో ఆయన ఆశ్రమాన్ని గురు గోవింద సింగ్ సందర్శించారు. అనంతరం ఆయనకు మాధవ్ దాస్ శిష్యుడయ్యారు. ఆ సందర్భంగా బందా సింగ్ బహదూర్ అన్న పేరును గురు గోబింద్ సింగ్ పెట్టారు. గురు గోబింద్ సింగ్ ఇచ్చిన దీవెనలు, అధికారంతో బందా సింగ్ బహదూర్ ఓ సైన్యాన్ని తయారుచేసి, మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. 1709 నవంబరులో మొఘల్ ప్రావిన్షియల్ రాజధాని సమానాను ముట్టడించి, విజయం సాధించి తన తొలి ప్రధాన విజయాన్ని నమోదు చేశారు. పంజాబ్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక జమీందారీ వ్యవస్థను రద్దుచేసి, సాగుచేసుకుంటున్న రైతులకే భూమిని పంచిపెట్టారు. 1716లో మొఘలులు ఆయన్ను బంధించి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. రేపు (జూన్ 9) ఆయన వర్ధంతి. (చదవండి: స్వతంత్ర భారతి: భారత రత్నాలు) -
రాహుల్ బజాజ్ ఇక లేరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ పారిశ్రామికవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో నెల క్రితం పుణేలోని రూబీ హాల్ క్లినిక్ హాస్పిటల్లో చేరిన ఆయన శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన లోటు పూడ్చలేనిదంటూ రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. ఆయనకు ఇద్దరు కుమారులు రాజీవ్, సంజీవ్, కుమార్తె సునైనా కేజ్రివాల్ ఉన్నారు. భారత్‌ను ప్రపంచ పటంలో నిలిపారు రాహుల్‌బజాజ్ 1938 జూన్ 10న జన్మించారు. ఢిల్లీ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఏ (ఆనర్స్), ముంబై వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. బజాజ్ గ్రూప్ 1926లో ప్రారంభమైంది. జమ్నాలా ల్ బజాజ్ ఈ సంస్థను స్థాపించారు. తన తండ్రి కమల్‌నయన్ బజాజ్ బృందంలో రాహుల్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా చేరారు. 30 ఏళ్ల వయసులో 1968లో బజాజ్ ఆటో సీఈవో అయ్యారు. రాహుల్ నేతృత్వంలో సంస్థ వృద్ధిబాటన పయనించింది. జపాన్ మోటార్‌సైకిల్ కంపెనీల పోటీని తట్టుకుని బజాజ్ స్కూటర్లను విదేశీ గడ్డపైనా పరుగెత్తించా రు. విభిన్న ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లో బజాజ్ బ్రాండ్‌ను మెరిపించారు. ఆటోమొబైల్‌తో పాటు సాధారణ, వాహన బీమా, ఇన్వెస్ట్మెంట్స్, కన్సూమర్ ఫైనాన్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, పవన విద్యుత్, అలాయ్, స్టెయిన్లెస్ స్టీల్ తదితర రంగాలకు గ్రూప్ అంచెలంచెలుగా విస్తరించింది. రాహుల్ సారథ్యంలో బజాజ్ ఆటో టర్నోవర్ రూ.7.2 కోట్ల నుంచి రూ.12,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం గ్రూప్‌లో 60 వేల పైచిలుకు ఉద్యోగులున్నట్టు చెబుతారు. 2005లో బజాజ్ ఆటో బాధ్యతలను కుమారుడు రాజీవ్‌కు అప్పగించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ చైర్మన్‌గా చేశారు. 2021 ఏప్రిల్ 30 దాకా బజాజ్ ఆటో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్మన్‌గా ఉన్నారు. 2001లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2006లో రాజ్యసభకు ఎంపికయ్యారు. ముక్కుసూటి మనిషి.. రాహుల్‌కు నిక్కచ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరుంది. ప్రభుత్వంపై విమర్శలకూ వెనకాడేవారు కాదు. సొంత కొడుకుతోనూ తలపడ్డ చరిత్ర ఆయనది. విమర్శలను ప్రభుత్వం అణచివేస్తోందంటూ ముంబైలో 2019లో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సమక్షంలోనే సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘భయంతో కూడిన ఈ వాతావరణం కచ్చితంగా మా మనస్సుల్లో ఉంటుంది. విమర్శలను మీరు స్వీకరిస్తారన్న నమ్మకం మాకు లేదు’ అంటూ కుండబద్దలు కొట్టారు. స్కూటర్లకు స్వస్తి చెప్పి మోటార్‌సైకిళ్లపై దృష్టి పెట్టాలని కుమారుడు రాజీవ్ నిర్ణయించుకున్నప్పుడు తన నిరాశను బహిరంగంగా వెల్లడించారు. హమారా బజాజ్ బజాజ్ గ్రూప్ అనగానే టక్కున గుర్తొచ్చేది బజాజ్ చేతక్ స్కూటరే. 1972లో బజాజ్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ‘హమారా బజాజ్..’ అంటూ మధ్యతరగతి కుటుంబాలకు చేరువైంది. చేతక్ స్కూటర్ భారతీయ కుటుంబాలకు ఒక ఆకాంక్షగా మారిందంటే అతిశయోక్తి కాదు. బజాజ్ ప్రియ స్కూటర్లు సైతం ఆదరణ పొందాయి. 2006లో బజాజ్ స్కూటర్ల ఉత్పత్తి ఆగిపోయింది. బజాజ్ చేతక్ అర్బనైట్ ఈవీ సబ్‌బ్రాండ్ పేరుతో 2019 అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లతో రీ–ఎంట్రీ ఇచ్చింది. రాహుల్ కెరీర్ దేశ కార్పొరేట్ రంగం పెరుగుదలకు సమాంతరంగా సాగింది. ఆయన మరణం పారిశ్రామిక ప్రపంచంలో శూన్యాన్ని మిగిల్చింది. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి చేసిన విశేషమైన కృషికి ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. గొప్ప సంభాషణకర్త. సమాజ సేవపైనా మక్కువ చూపారు. – ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ వ్యాపార ప్రపంచంపై ఆయన పాదముద్రలు ఎప్పటికీ చెరిగిపోవు – మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నేను చెప్పలేనంత షాక్‌కు గురయ్యాను. దేశం ఒక గొప్ప పుత్రున్ని, నిర్మాతను కోల్పోయింది. – బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా -
జనజాతీయ గౌరవ్ దివస్‌గా బిర్సా ముండా జయంతి: మోదీ
-
రాంచీలో బిర్సా ముండా స్మారకాన్ని ప్రారంభించిన మోదీ
రాంచీ: ధార్తీ ఆబాగా ప్రసిద్ధి చెందిన గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జ్ఞాపకార్థం ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలో మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ధార్తీ ఆబా ఎక్కువ కాలం జీవించలేకపోయినప్పటికీ భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసేలా భారత చరిత్రలో లిఖించబడిని ఒక మహోన్నత వ్యక్తిగా అభివర్ణించారు. అంతేకాదు ముండాకు భారతదేశ గిరిజన సమాజ గుర్తింపును చెరిపివేయాలని కోరుకునే భావజాలానికి వ్యతిరేకంగా పోరాడిని గొప్ప వ్యక్తి బిర్సా . (చదవండి: జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్‌టాక్ షేర్ చేయడంతో పరార్!!) ఆధునికత పేరుతో వైవిధ్యంపై దాడి చేయడం, ప్రాచీన గుర్తింపును, ప్రకృతిని తారుమారు చేయడం సమాజ శ్రేయస్సుకు మార్గం కాదని భగవాన్ బిర్సాకు తెలుసు. ఆధునిక విద్యకు అనుకూల మార్పు కోసం వాదించాడు. అంతేకాదు తన గిరిజన సమాజంలోని లోటుపాట్లను గురించి మాట్లాడే ధైర్యం చూపించాడు." అని అన్నారు. ఈ మేరకు మోదీ బిర్సా ముండా మెమోరియల్ ఉద్యాన్ మ్యూజియంను జాతికి అంకితం చేశారు. జార్ఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ మ్యూజియం రాంచీలోని బిర్సా ముండా తుది శ్వాస విడిచిన ఓల్డ్ సెంట్రల్ జైలులో ఉంది. అంతేకాదు ఇక్కడ 25 అడుగుల ఎత్తు ఉన్న ముండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ మ్యూజియం ఆదివాసీలు తమ అడవులు, భూమి హక్కులు, సంస్కృతిని పరిరక్షించడానికి వారు ప్రదర్శించిన శౌర్యాన్ని, త్యాగాలను ప్రతిబింబిస్తుందని ఇది దేశ నిర్మాణానికి చాలా ముఖ్యమైనదని అని మోదీ అన్నారు. పైగా ముండాతో పాటు, బుధు భగత్, సిద్ధూ-కన్హు, నీలాంబర్-పీతాంబర్, దివా-కిసున్, తెలంగాణ ఖాదియా, గయా ముండా, జాత్రా భగత్, పోటో హెచ్ భగీరథ్ మాంఝీ గంగా నారాయణ్ సింగ్ వంటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధులను కూడా ఈ మ్యూజియం హైలైట్ చేస్తుంది. (చదవండి: యూకే లివర్‌పూల్ నగరంలో కారు బ్లాస్ట్... ఒకరు మృతి) -
దేవుడు బాబు: మరుగునపడిన స్వాతంత్య్రయోధుడు
మహాత్మాగాంధీ పిలుపుమేరకు ఉప్పు సత్యాగ్రహం, విదేశీ హటావో, ఖాదీ ఉద్యమం తదితర ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొని, జైలుకి వెళ్లి, లాఠీ దెబ్బలు కూడా తిన్న ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు చరిత్రలో కనుమరుగయ్యారు. అలాంటి వారిలో పూడిపెద్ది సుందరరామయ్య ఒకరు. ఆయన 12–8–1912న విశాఖపట్నంలో జన్మిం చారు. 1982 సెప్టెంబర్ 23న, తన 70వ ఏట కన్నుమూశారు. 1929లో గాంధీగారి పిలుపుమేరకు, న్యాయశాస్త్రంలో పట్టా కోసం జరిగే పరీక్షలను సైతం వదులుకుని, అతి పిన్న వయసులోనే, అనగా తన 17వ ఏటనే, స్వాతంత్య్రం కోసం పోరాడిన యువకుడుగా పేరు గడించారు. తొలుత హార్బర్లో టైం ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చినప్పుడు, బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన గడియారం పెట్టుకుని పని చేయాలని, ఒక బ్రిటిష్ అధికారి చెప్పడంతో, అది నచ్చక తొలి రోజే రాజీనామా చేసేశారు. వీరు చేసిన పలు సేవా కార్యక్రమాలు: పేదవారైన స్వాతంత్య్ర సమరయోధులను జైలులో పెట్టినప్పుడు కుల, మతాలకు అతీతంగా, వారివారి కుటుంబ సభ్యులందరికీ, మూడుపూటలా, ఇంట్లో వండించి క్యారేజీలు పంపించేవారు, మందులు, బట్టలు, డబ్బు కూడా పంపించేవారు. గర్భిణీ స్త్రీలకి నొప్పులొస్తే, తన కారు, డ్రైవర్ని ఇచ్చి, వాళ్ళని హాస్పిటల్లో దింపించేవారు. స్టోన్ హౌస్ అనే ఇల్లు కట్టించి, అందులో, 105 మంది పేద పిల్లలకి పెళ్లిళ్లు చేయించారని చెబుతుం టారు. ఎలాంటి ధనాశా లేకుండా, తన ఇంటి పక్క ఖాళీ స్థలం, ఉచి తంగా పేదవారికి ఇచ్చారు, నూకరాజు కార్ల రిపేర్ షెడ్, దేవుడమ్మ టీ దుకాణం పెట్టుకుని ఇలాగే జీవనోపాధిని పొందారు. విశాఖలో పూడిపెద్ది సుందరరామయ్యను ‘దేవుడు బాబు’ అని పిలిచేవారు. – ఉగాది వసంత, పూర్వ మేనేజర్,వైజాగ్ స్టీల్ ప్లాంట్ ‘ 98494 55367 (నేడు పూడిపెద్ది సుందరరామయ్య వర్థంతి) -
బేలాబోస్: ఆమె పేరు మీద ఒక రైల్వేస్టేషన్!
బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశాన్ని రక్షించడం కోసం, పరాయి పాలకుల చేతిలో నుంచి భరతమాతకు విముక్తి ప్రసాదించడం కోసం వేలాది మంది దశాబ్దాల పాటు పోరాడారు. ఆ పోరాటంలో భరతమాత ముద్దుబిడ్డల పోరాటఫలితంగా స్వాతంత్య్రం వచ్చింది. స్వేచ్ఛావాయువులను ఆస్వాదిస్తూ ఆ ముద్దుబిడ్డల పేర్లతో మన దేశంలో అనేక గ్రామాలు, వీథులు, ఊర్లు, జిల్లాలు కొత్తగా నామకరణం చేసుకున్నాయి. ఆ కొత్త పేర్లన్నీ భరతమాత పుత్రులవే. మరి భారత దాస్య విముక్తి పోరాటంలో పాలుపంచుకున్న పుత్రికల పేర్లు మన దేశ ముఖచిత్రంలో ఎన్ని కనిపిస్తున్నాయి? ఇండియన్ రైల్వేస్ మాత్రం తమ వంతుగా బేలాబోస్‌ను గౌరవించింది. ఆమె పేరు మీద ఒక రైల్వేస్టేషన్‌కు ‘బేలా నగర్’ అని పేరు పెట్టింది. ఈ రైల్వేస్టేషన్ వెస్ట్‌బెంగాల్, హౌరా జిల్లాలో కోల్‌కతా నగరం సబర్బన్‌లో ఉంది. నాటి శరణార్థి శిబిరం! బేలాబోస్ శరణార్థుల కోసం కోల్‌కతా శివార్లలో తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసి ఆ ప్రదేశానికి అభయ్‌నగర్ అని పేరు పెట్టింది. ఆ అభయ్ నగర్ స్టేషన్‌నే రైల్వే శాఖ బేలానగర్గా గౌరవించింది. కోల్‌కతా వెళ్లినప్పుడు తప్పక చూడాల్సిన ప్రదేశం బేలానగర్. (చదవండి: మనకు తెలిసిన పేరు... తెలియని ఊరు!) బేలా బోస్ ఎవరు? బేలాబోస్ తండ్రి సురేంద్ర చంద్రబోస్. ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి అన్న. బేలా మీద ఆమె చెల్లెలు ఇలాబోస్ మీద నేతాజీ ప్రభావం ఎక్కువగా ఉండేది. అక్కాచెల్లెళ్లిద్దరూ జాతీయోద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. నేతాజీ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఝాన్సీరాణి బ్రిగేడ్‌లో బాధ్యతలు చేపట్టింది బేలా. ఐఎన్ఐ రహస్య నిఘా విభాగంలో కూడా విజయవంతమైన సేవలందించింది. జాతీయోద్యమంలో పాల్గొన్న వాళ్ల కోసం డబ్బు అవసరమైనప్పుడు తన పెళ్లి ఆభరణాలను అమ్మి డబ్బు సమకూర్చింది. భారత్– సింగపూర్ల మధ్య అత్యంత పకడ్బందీగా రహస్య సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి నిర్వహించిందామె. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆమె కుటుంబానికి పరిమితమైంది. దేశవిభజన తర్వాత శరణార్థుల కోసం ఆమె బెంగాల్లో ఝాన్సీ రాణి రిలీఫ్ టీమ్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. శరణార్థులకు ప్రభుత్వం పునరావాసం కల్పించే వరకు వారికి బేలాబోస్ ఆశ్రయమిచ్చింది. (చదవండి: మొదటి ట్రాన్స్‌జెండర్ ఫొటో జర్నలిస్ట్ కథ చెప్పే క్లిక్) -
‘ఝాన్సీ కీ రాణి’.. ఈ పాఠం రాసింది ఈమెనే!
విషయం ఎంతటి సంక్లిష్టమైనది అయినా సరే.. వివరణ సరళంగా ఉంటేనే ఎక్కువ మందికి అర్థం అయ్యేది. ఆ సూత్రాన్ని ఒడిసిపట్టి తన కవితలతో ఎందరిలోనో బ్రిటిష్ వ్యతిరేక పోరాట స్ఫూర్తిని నింపింది సుభద్ర కుమారి చౌహాన్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సుభద్ర.. స్వాతంత్ర సంగ్రామంలో అరెస్ట్ కాబడ్డ మొదటి మహిళా సత్యాగ్రహి!. ఈరోజు(ఆగష్టు 16న) ఆమె జయంతి. అందుకే గూగుల్ డూడుల్‌తో ఆమెను గుర్తు చేస్తోంది గూగుల్. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల స్కూల్ సిలబస్ పుస్తకాల్లో కనిపించే పాఠం.. ‘ఝాన్సీ కీ రాణి’. వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయ్(మణికర్ణిక) పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే కవిత్వం అది. ఆ హిందీ కవితను రాసింది ఎవరో కాదు.. సుభద్ర కుమారి చౌహాన్. ప్రముఖ హిందీ కవయిత్రిగా, స్వాతంత్ర సమర యోధురాలిగా ఆమె పేరు భారత చరిత్రలో సుస్థిరంగా నిలిచింది. అరెస్టైన మొదటి సత్యాగ్రహి 1904, ఆగష్టు 16న యూపీ ప్రయాగ్‌రాజ్ నిహల్పూర్ గ్రామంలో ఓ రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టింది సుభద్ర కుమారి చౌహాన్. స్కూల్ విద్య కొనసాగించిన సుభద్ర.. తొమ్మిదేళ్లకే ‘నీమ్’ కవితతో సాహిత్య ప్రపంచంతో ‘చిచ్చురపిడుగు’ బిరుదు అందుకుంది. పదిహేనేళ్ల వయసులో థాకూర్ లక్క్ష్మణ్ సింగ్ చౌహాన్‌ను వివాహం చేసుకుని.. జబల్పూర్కు కాపురం వెళ్లింది. ఆపై భర్త ప్రోత్సాహంతో కవిత్వాలు రాస్తూ.. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. నాగ్‌పూర్‌లో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా జరిపిన నిరసన ప్రదర్శనకు గానూ ఆమెను అరెస్ట్ చేయమని నాగ్‌పూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ టైంలో ఆమె గర్భవతి కావడంతో కొన్నాళ్లపాటు జైళ్లో నుంచి వదిలేశారు. ఆపై 1941లో సుభద్ర కుమారి భర్త థాకూర్, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాలుపంచుకున్నాడు. ఆ సమయంలో ఐదుగురు పిల్లలున్నా.. భర్తతో పాటు ఆమె కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. ఈ క్రమంలో 1942లో ఆమె రెండోసారి అరెస్ట్ అయ్యారు. అంతేకాదు అంటరానీతనం, కుల వ్యవస్థ, పర్దా పద్ధతులకు వ్యతిరేకంగా ఆమె పోరాడింది కూడా. పిల్లలకు సైతం అర్థం అయ్యేలా.. హిందీ కవిత్వంలో ఆమెది ఎంతో సరళమైన శైలి. మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలను, ముఖ్యంగా పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఆమె తన రచనలు చేసేది. వీరనారి ఝాన్సీ రాణి పోరాటాన్ని పొగుడుతూ రాసిన కవిత్వం ‘ఝాన్సీ కీ రాణి’.. హిందీ సాహిత్యంలో సుస్థిరంగా నిలిచింది. ‘జలియన్ వాలా బాగ్ మే వసంత్’, ‘వీరోన్ కా కైసా హో బసంత్’, ‘రాఖీ కీ చునౌతీ’, ‘విదా’ తదితర కవిత్వాలు స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించాయి. ఆమె రాసిన చిన్నకథలు పిల్లలను బాగా ఆకట్టుకునేవి. ఆపై సెంట్రల్ ప్రావిన్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. 1948, ఫిబ్రవరి 15న అసెంబ్లీ సమావేశాలకు నాగ్‌పూర్ వెళ్లి జబల్పూర్కు తిరిగి వస్తుండగా సియోని(మధ్యప్రదేశ్) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గూగుల్ డూడుల్స్ గౌరవం సుభద్ర కుమారి చౌహాన్ మరణాంతరం ఎన్నో గౌరవాలు దక్కాయి. ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్‌కు ‘ఐసీజీఎస్ సుభద్ర కుమారి చౌహాన్’ పేరు పెట్టారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం జబల్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 1976లో భారత పోస్టల్ శాఖ.. ఓ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది 117వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ ఇండియా.. గూగుల్ డూడుల్‌తో గౌరవించింది. ఆమె కూతురు సుధా చౌహాన్‌ను భర్త ఎవరో కాదు.. లెజెండరీ రైటర్ ప్రేమ్ చంద్ కొడుకు అమృత్ రాయ్. తల్లిదండ్రుల జీవిత చరిత్ర ఆధారంగా సుధా ‘మిలా తేజ్ సే తేజ్’ అనే పుస్తకం రాసింది. సుధా-అమృత్‌ల కొడుకు అలోక్ రాయ్ ఇంగ్లీఫ్ ప్రొఫెసర్.. ప్రస్తుతం ఆయన భారత రాజకీయాలు, కల్చర్ మీద కాలమ్స్ రాస్తున్నారు. -
164 ఏళ్ల లోకల్ హీరో వీరగాథ; నడిబజారులో ఉరికంబానికి
సాక్షి,హైదరాబాద్: జూలై 17..సాయంత్రం ఆరున్నర..అసురసంధ్య వేళ భాగ్యనగరం పుత్లీబౌలి ప్రాంతంలో అలికిడి మొదలైంది. దాదాపు 500 మంది యువకులు రహస్యంగా ఓ చోటకు చేరారు. వారికి తురేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్‌లు నాయకత్వం వహిస్తున్నారు. నెమ్మదిగా ముందుకు సాగి బ్రిటిష్ రెసిడెన్సీ గేటుకు సమీపంలో ఉన్న రెండు ఇళ్లలోకి చేరారు. అక్కడి నుంచి తమ పరిమిత ఆయుధ సంపత్తితో రెసిడెన్సీపై దాడి ప్రారంభించారు. చిన్నదిగా ఉన్న గోడను కొంతమేర కూల్చి లోనికి చొరబడ్డారు. వారి లక్ష్యం ఒక్కటే..లోపల బందీగా ఉన్న జమేదార్ చీదాఖాన్‌ను వెంటతీసుకెళ్లాలి. కానీ మద్రాసు హార్స్ ఆర్టిలరీ శిక్షణ పొందిన బ్రిటిష్ సైన్యం ముందు ఆ యువకులు నిలవలేకపోయారు. దాడి విఫలమైంది. చివరకు నిజాం ప్రభుత్వమే వారి జాడను బ్రిటిష్ సైన్యానికి అందించి వారికి మరణశాసనం లిఖించింది. సిపాయి తిరుగుబాటు చరిత్రలో సగర్వంగా నిలవాల్సిన భాగ్యనగర పుటకు ప్రాధాన్యం లేకుండా పోయింది. వారి వీరగాథకు ప్రచారం రాకుండా నాటి నిజాం ప్రభుత్వమే అణచివేసిందనేది చరిత్రకారుల మాట. సరిగ్గా 164 ఏళ్ల క్రితం నాటి లోకల్ హీరో వీరగాథ ఇది ఇది కోఠి కూడలిలో ఉమెన్స్ కాలేజీ గోడనానుకుని నిర్మితమైన ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు బయటి ప్రపంచానికి కనిపించకుండా ఉన్న స్మారకం, కనిపించినా ఇదేంటో కొందరు చరిత్రకారులకు తప్ప ఎవరికీ తెలియని నిర్మాణం.. భారత స్వాతంత్య్ర సంగ్రామానికి పౌరుషాన్ని అద్దిన సిపాయి తిరుగుబాటుతో హైదరాబాద్‌కు ముడిపడిన ఓ వీరగాథకు సజీవసాక్ష్యం ఇది. ఎవరీ తరేబాజ్ఖాన్? బ్రిటిష్ వారి ఆగడాలు మితిమీరిపోతుండటం, తన ఉనికిని కాపాడుకునే క్రమంలో నాటి నిజాం పాలకులు సాగిలపడిపోవటం.. కొందరు పౌరుల్లో అసహనాన్ని పెంచింది. అలాంటి అభిప్రాయంతో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పనిచేయటం ప్రారంభించిన జమేదార్ చీదాఖాన్‌ను బ్రిటిష్ సైన్యం అరెస్టు చేసి ప్రస్తుతం కోఠి ఉమెన్స్ కాలేజీ భవనంగా ఉన్న నాటి బ్రిటిష్ రెసిడెన్సీలో ఖైదు చేసింది. ఈ విషయం తెలిసి బేగంబజార్‌కు చెందిన ఓ సాధారణ సిపాయి తురేబాజ్ఖాన్లో ఆగ్రహాన్ని నింపింది. ఇతనిలాగే రగిలిపోతున్న మౌల్వీ అల్లావుద్దీన్‌తో కలిసి తిరుగుబాటుకు పథకం రచించాడు. 1857 జూలై 17న 500 మంది యువకులతో బ్రిటిష్ రెసిడెన్సీ నోడ వద్ద ఉన్న రెండు ఇళ్లలోకి చేరి గోడ కూల్చి లోనికి చొరబడి బ్రిటిష్ సైన్యంపై దాడి ప్రారంభించారు. కానీ ఈ దాడి గురించి ముందుగానే వేగుల ద్వారా తెలుసుకున్న నిజాం ప్రభుత్వ మంత్రి తురబ్ అలీఖాన్ దాడి సమాచారాన్ని బ్రిటిష్ సైన్యానికి చేరవేశారు. దీంతో తురేబాజ్ ఖాన్ గెరిల్లా పోరాటం ఎక్కువసేపు సాగలేదు. సుశిక్షితులైన బ్రిటిష్ సిబ్బంది ముందు నిలవలేక..మరోసారి పెద్ద ఎత్తున దాడి చేద్దామని నిర్ణయించి అంతా పారిపోయారు. తురేబాజ్, అల్లావుద్దీన్‌ల ఆచూకీని నిజాం మంత్రి అలీఖాన్ బ్రిటిష్ సైన్యానికి చేరవేయడంతో వారిని పట్టుకుని అండమాన్ తరలించారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా తురేబాజ్ను హైదరాబాద్ తరలించి బ్రిటిష్ రెసిడెన్సీ ముందు నడిరోడ్డుపై ఉరి తీసి రోజంతా శవాన్ని అలాగే ఉంచారు. ఇప్పుడు అదే చోట స్మారకం ఉంది. ఆయన అండమాన్ నుంచి తప్పించుకుని మళ్లీ పోరాటానికి పథకం సిద్ధం చేసే ప్రయత్నంలో ఉండగా, నిజాం ప్రభుత్వం గుర్తించి బ్రిటిష్ సైన్యంకు పట్టించిందని, 1858 జనవరిలో ఆయనను కాల్చి చంపారన్న మరో కథ కూడా ఉంది. -
అక్షర యోధుడు రాంరెడ్డి ఇక లేరు..
సాక్షి, విద్యారణ్యపురి : అచ్చంగా తెలంగాణ రాష్ట్రం కోసమే అక్షర సేద్యం చేసిన ప్రముఖ కవి, హన్మకొండలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ విభాగం రిటైర్డ్ అధ్యాపకులు వెలపాటి రాంరెడ్డి(89) కన్నుమూశారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం హన్మకొండ కనకదుర్గకాలనీలోని తన స్వగృహంలో మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రేగుల గ్రామంలో 1932 నవంబర్ 4న కేశవరెడ్డి, చిలకమ్మ దంపతులకు జన్మించిన ఆయన ఇంగ్లిష్ అధ్యాపకుడిగా కొనసాగుతూనే ప్రవృత్తిగా తెలుగు సాహిత్యంలో ఎన్నో రచనలు చేశారు. పుస్తకాలు రాయడమే కాకుండా తెలుగు కవుల సమ్మేళనాల్లో భాగస్వాములయ్యేవారు. కాగా, రాంరెడ్డి రాసిన తెలంగాణ సాయుధ పోరాటం గ్రంథం ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలంగాణ కావ్యం, వీరతెలంగాణ, వెలుగు నీడలు, తెలంగాణ పద్యమంజరి, కోటిగాయాల మౌనం తెలంగాణ, తెలంగాణ నడుస్తున్న చరిత్ర, నవశకం వంటి అనేక పుస్తకాలను తెలంగాణ నేపథ్యంలోనే ఆయన రచించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. కాగా, ఏడో తరగతి తెలుగు వాచకంలో మన శిల్పారామం రామప్ప, ఇంటర్ తెలుగు వాచకంలో ఓ కావ్యంగా ఆయన రచనలు పాఠ్యాంశాలుగా ప్రచురించారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్న రాంరెడ్డి మృతిపై హన్మకొండలోని సాహిత్య సాంస్కృతిక సంస్థ బాధ్యులు గిరిజ మనోహరబాబు, డాక్టర్ ఎన్వీఎన్.చారి, వనం లక్ష్మీకాంతారావు, కృష్ణమూర్తి తదితరులు సంతాపం ప్రకటించారు. చదవండి: జర్నలిస్టులకు వ్యాక్సినేషన్: సీఎంకు ప్రెస్‌క్లబ్ కృతజ్ఞతలు -
పోరాటాల దొరెస్వామి అస్తమయం
యశవంతపుర: కన్నడనాట ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, పాత్రికేయుడు హెచ్ఎస్ దొరెస్వామి (103) బుధవారం మధ్యాహ్నం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. వయోభారం, గుండె సమస్యలతో ఆయన జయదేవ ఆస్పత్రిలో ఇటీవల చేరారు. కరోనా సోకడంతో మే 8న జయదేవ ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకోవడంతో నయమై 13న ఇంటికి చేరుకున్నారు. 17న గుండె సమస్య రావడంతో ఆస్పత్రిలో చేరారు. బుధవారం గుండె పనిచేయడం ఆగిపోవడంతో కన్నుమూశారని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. ఆయన అంతిమసంస్కారాలను కోవిడ్ నియామాలను పాటిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తిచేస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ‘నాకు వయసైపోయింది. నాకు ఆస్పత్రిలో బెడ్ అక్కర్లేదు. యువతకు బెడ్ కేటాయించండి’అని పదేపదే చెప్పేవారని ఆస్పత్రి వైద్యులు గుర్తుచేసుకున్నారు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా పోరాటాలను పక్కనపెట్టి ఇంటికే పరిమితమయ్యారు. టీచర్ నుంచి క్విట్ ఇండియా బరిలోకి హరోహళ్లి శ్రీనివాసయ్య దొరెస్వామి 1918 ఏప్రిల్ 10న బెంగళూరు సమీపంలోని హరోహళ్లిలో జని్మంచారు. బెంగళూరు సెంట్రల్ కాలేజీలో బీఎస్సీ పూర్తిచేశారు. తరువాత ఓ హైసూ్కల్లో సైన్స్, గణిత ఉపాధ్యాయునిగా మారిన ఆయన 1942లో గాం«దీజీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిటిష్‌వారిని హడలగొట్టేందుకు చిన్నసైజు టైమ్‌బాంబులను ప్రభుత్వ ఆఫీసుల్లోని రికార్డు రూమ్‌లు, పోస్ట్‌బాక్స్‌లలో ఉంచేవారు. 1943లో బాంబులతో పోలీసులకు పట్టుబడడంతో జైలు పాలయ్యారు. 14 నెలల కారాగారవాసం తరువాత విడుదలయ్యాక స్వాతంత్య్ర పోరాటం కొనసాగిస్తూ పలు పత్రికలను స్థాపించి స్వరాజ్య స్ఫూర్తిని రగిల్చారు. స్వాతంత్య్రం తరువాత సైతం స్వాతంత్య్రం సిద్ధించాక దేశంలోని అసమానతలపై దొరెస్వామి దృష్టి సారించారు. 1950లలో భూదాన్ ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ఎమర్జెన్సీని విధించబోతున్నట్లు ముందుగానే గ్రహించిన దొరెస్వామి అప్పటి ప్రధాని ఇందిరాగాం«దీని నియంతతో పోలుస్తూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడుతానని గళమెత్తారు. జయప్రకాష్ నారాయణ్ సోషలిస్టు ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. కర్ణాటక, బెంగళూరుకు సంబంధించిన అనేక ప్రజా సమస్యల పోరాటాల్లో ముందున్నారు. బెంగళూరులో అన్నాహజారే చేపట్టిన అవినీ తి వ్యతిరేక ఉద్యమంలోను సంఘీభావం తెలిపారు. ఎక్కడ ప్రజాందోళనలు జరిగినా అక్కడ దొరె స్వామి ఉంటారని పేరుగాంచారు. ఆయనకు భార్య లలితమ్మ, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. లలితమ్మ రెండేళ్ల కిందట కన్నుమూశారు. దొరె స్వామి కర్ణాటక అంతరాత్మ అంటూ ఆయన మృతికి కర్ణాటక ముఖ్యమంత్ర యడియూరప్ప సహా ప్రముఖులు సంతాపం తెలిపారు. -
Sunderlal Bahuguna: ‘చిప్కో’ ఉద్యమ కర్త ఇకలేరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, చిప్కో ఉద్యమానికి ఊపిరిపోసిన సుందర్‌లాల్ బహుగుణ(94) కన్నుమూశారు. సుందర్‌లాల్ బహుగుణకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ నెల 8వ తేదీన రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం 12.05 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రవికాంత్ తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. బహుగుణ మృతికి ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిషికేశ్‌లో గంగానదీ తీరాన పూర్ణానంద్ ఘాట్‌లో బహుగుణకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. 13 ఏళ్లకే స్వాతంత్య్ర పోరాటంలోకి ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో 1927 జనవరి 9వ తేదీన జన్మించిన బహుగుణ 13 ఏళ్ల వయస్సులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ అహింసా వాదాన్ని జీవితాంతం ఆచరించారు. 1947లో లాహోర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని తెహ్రీ సంస్థాన రాచరికానికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 1948లో ఏర్పడిన ప్రభుత్వంలో ప్రచారశాఖ మంత్రి అయ్యారు. 1974లో హిమాలయ ఘర్వాల్ ప్రాంతంలో చెట్ల నరికివేతను అడ్డుకొనేందుకు శాంతియుత నిరసన ఉద్యమం చిప్కోను ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు చెట్లను నరికివేసే సమయంలో వాటిని కౌగిలించుకోవడం ద్వారా కాపాడుకోవడమే దీని లక్ష్యం. ఇలా వృక్షాలను రక్షించే ఉద్యమంగా ప్రారంభమై పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. 84 రోజుల నిరశన దీక్ష చెట్లను నరికివేయడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ 1981లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీని తీసుకోవడానికి బహు గుణ నిరాకరించారు. సొంత జిల్లా తెహ్రీలో ప్రభుత్వం తలపెట్టిన డ్యాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదముంది. దీంతో తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ 84 రోజులపాటు ఉపవాస దీక్ష సాగించారు. హిమాలయాల పర్యావరణ పరి రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన పలు పర్యాయాలు పాదయాత్రలు కూడా చేపట్టారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ సహా పలు అవార్డులు ఆయన్ను వరించాయి. బహుగుణ మరణం మన జాతికి తీరని నష్టం. ప్రకృతితో మమేకం కావాలనే మన వారసత్వ విలువల ను పరిరక్షించేందుకు ఆయన కృషి చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. సుందర్‌లాల్ బహుగుణ ‘అద్భుతమైన సంఘ సేవకుడు’అని ప్రముఖ పర్యావరణవేత్త చండీప్రసాద్ భట్ అభివర్ణించారు. -
స్వాతంత్ర సమరయోధుడి కన్నుమూత
కోదాడ రూరల్: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొండపల్లి మట్టపల్లి లక్ష్మీనరసింహారావు (87) శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో మృతిచెందారు. రామలక్ష్మీపురం సింహయ్యగా పిలిపించుకునే కొండపల్లి మట్టపల్లి లక్ష్మీనరసింహారావు అప్పట్లోనే ఆంగ్లంలో ఎంఏ పూర్తి చేసి కొన్నాళ్లు హిందు పత్రికలో జర్నలిస్టుగా కూడా పనిచేశారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని గణపరం రామలక్ష్మీపురంలో జన్మించిన ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా జైలుకెళ్లి వచ్చారు. అదేవిధంగా కోదాడ, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి అక్కిరాజు వాసుదేవరావుగా సమీప బంధువు. విద్యార్థి దశ నుంచే క్రియాశీలక రాజకీయాల్లో పనిచేశారు. ఆయన మృతికి టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు విరేపల్లి లక్ష్మీనారాయణరావు, వేనేపల్లి చందర్రావు, ఉత్తమ్ పద్మావతి, నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం నాయకులు కొండపల్లి వాసుదేవరావు, కొండపల్లి మురళీధర్‌రావు, విద్యాత్తవేత్తలు మంత్రిపగఢ భరతరావు, శ్రీరామకవచం వెంకటేశ్వర్లు, గ్రామస్తులు తమ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. చదవండి: మానవత్వం చాటిన ఎమ్మెల్యే కంచర్ల చదవండి: శభాష్! క్రేన్‌తో వ్యక్తిని కాపాడిన పోలీసులు -
స్వాతంత్య్ర సమరయోధుడు 'పావులూరి' కన్నుమూత
తెనాలిరూరల్/వేమూరు/గుంటూరు వెస్ట్: తెనాలికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య (98) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1923 నవంబర్ 15న తెనాలి సమీపంలోని గోవాడ గ్రామంలో జన్మించిన ఆయన తురుమెళ్లలో ప్రాథమిక విద్య అనంతరం గోవాడలో ఉన్నత విద్య అభ్యసించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మెట్రిక్యులేషన్, మద్రాసు యూనివర్సిటీ నుంచి హిందీ పట్టా, ఆగ్రా యూనివర్సిటీ నుంచి హిందుస్థానీ, భారతీయ పారంగత్ పట్టా అందుకున్నారు. హిందీ ఉపాధ్యాయుడిగా చేస్తూ భారత స్వాతంత్య్ర పోరాటంలో జైలు జీవితాన్ని అనుభవించారు. జాతీయ భాష హిందీని ఉచితంగా బోధిస్తూ శివయ్య మాస్టారుగా ఖ్యాతిని ఆర్జించారు. మహాత్మాగాంధీ సేవాగ్రామ్‌లో ఏడాది పాటు ఉండి మహాత్ముడికి సేవలందించారు. 1933లో కావూరు వినయాశ్రమంలో గాంధీజీకి స్వాగతం పలికారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో ఆలీపూర్‌లో కారాగార శిక్ష అనుభవించారు. జిల్లా పరిషత్ హైస్కూలులో ప్రథమ శ్రేణి హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసి 1979లో రిటైరయ్యారు. శివరామకృష్ణయ్య తన స్వగ్రామం గోవాడలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పార్లమెంటు నిధులతో తన గ్రామంలో కమ్యూనిటీ హాలు కూడా నిర్మించారు. శంకర్‌దయాళ్‌శర్మ, మన్మోహన్సింగ్, సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్, ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వంటి ప్రముఖుల సత్కారాలను అందుకోవడంతో పాటు 2018లో జరిగిన విశ్వహిందీ సమ్మేళనంలో విశిష్ట సన్మానం అందుకున్నారు. శివరామకృష్ణయ్యకు భార్య మంగమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు విజయకుమార్ వ్యవసాయశాఖలో జాయింట్ డైరెక్టర్‌గా రిటైరయ్యారు. రెండో కుమారుడు కృష్ణకుమార్ అధ్యాపకుడిగా చేసి, గుంటూరులో వ్యాపారంలో స్థిరపడ్డారు. కుమార్తె జయశ్రీ గృహిణిగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశ్రమ సలహాసంఘ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, కావూరు వినయాశ్రమం ధర్మకర్తల మండలి సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త పావులూరి శివరామకృష్ణయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. చంద్రబాబు సంతాపం స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య మృతిపట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధేయవాదంతో నేటి తరానికి శివరామకృష్ణయ్య స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీతో పాటు ఆశ్రమంలో ఉన్న వ్యక్తుల్లో శివరామకృష్ణయ్య ఒకరని, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. రైతు బాంధవుడిగా పేరు గడించిన శివరామకృష్ణయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
సదాశివ రావు బాపు సాహెబ్ భోసలే మృతి
యశవంతపుర: దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది సదాశివ రావు బాపు సాహెబ్ భోసలే (101) కన్నుమూశారు. వృద్ధాప్యంతో బెళగావి తాలూకా కడోళి గ్రామంలో తన స్వగృహం లో గురువారం తుదిశ్వాస విడిచారు. 25 ఎకరాలు పేదలకు దానం చేశారు. భోసలే బెళగావి దక్షిణ, హిరేబాగేవాడి స్థానాల నుంచి కర్ణాటక శాసనసభకు రెండు సార్లు ఎన్నికయ్యారు. భూదా నోద్యంలో పాల్గొనడమే కాకుండా తనకున్న 25 ఎకరాల భూమిని పేదలకు పంచి పెట్టారు. ఉత్తర కర్ణాటకకి అన్యాయం జరుగుతోందనే బాధతో 12 ఏళ్లపాటు అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. 1969లో ఎమర్జెన్సీ సమయంలో జైలుశిక్షను అనుభవించారు. తన స్వగ్రామంలో గాంధీ స్మారక నివాసాన్ని నిర్మించారు. భోసలే మృతికి గవర్నర్ వజూభాయ్ నివాళులు అర్పించారు. -
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/సాక్షి, మేడ్చల్ జిల్లా: స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు బూర్గుల నర్సింగరావు (89) సోమవారం తెల్లవారుజామున కేర్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గుం డె సంబంధిత సమస్యలతో పాటు కరోనాకు చికిత్సకోసం వారం క్రితం ఆయనను హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచా రు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. బూర్గుల నర్సింగరావు విద్యార్థి దశలో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. సీపీఐ హైదరాబాద్ జిల్లాకమిటీ సభ్యుడిగా కీలకపాత్ర పోషించారు. ముంబైలోని సీపీఐ కార్యాలయంలో కూడా ఆయన పని చేశారు. అలాగే తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు అధ్యక్షుడిగా పని చేశారు. హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు బి.వెంకటేశ్వరరావు కుమారుడే నర్సింగరావు. 1932 మార్చి14న ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో ఆయన జన్మించారు. రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టయి చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. 1952లో జరిగిన ముల్కీ ఉద్యమంలో ముందుండి పోరాడారు. 1955లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) మొదటి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై 1959 వరకు బాధ్యతలు నిర్వహించారు. సొంతూరు బూర్గులలో రైల్వేస్టేషన్ ఏర్పాటులో కీలకపాత్ర పోషిం చారు. ఊర్లో స్కూల్ స్థాపనకు భూమిని విరాళంగా ఇచ్చారు. ఆయనకు భార్య డాక్టర్ మంజూత, కుమార్తె మాళవిక, కుమారులు అజయ్, విజయ్‌లున్నారు. సీఎం సంతాపం తెలంగాణ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో పాటు, తొలి.. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో నర్సింగరావు పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. బూర్గుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రులు, ప్రముఖుల సంతాపం బూర్గుల మృతి పట్ల మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం ప్రకటించారు. అలాగే సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్ పాషా, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, తెలంగాణ అమరవీరుల ట్రస్టు కార్యదర్శి కందిమల్ల ప్రతాపరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సంతాపం తెలిపారు. ఈ నెల 21న మఖ్దూంభవన్‌లో సంతాప సభ నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర సమితి ప్రకటించింది. బూర్గుల భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న సీపీఐ నేత నారాయణ, (ఇన్సెట్) -
తొలితరం సాగునీటి ఉద్యమకారుడు 'అనంత'
దశాబ్దాల కరువు ‘అనంత’ను ఛిద్రం చేసింది. సాగునీటి వనరులు అంతంత మాత్రంగానే ఉన్న జిల్లాను సస్యశ్యామలం చేయాలంటే ప్రాజెక్ట్‌ల అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని ముందుగా గుర్తించింది స్వాతంత్ర సమరయోధుడు అనంత వెంకటరెడ్డి. తొలితరం సాగునీటి ఉద్యమకారుడిగా జిల్లా చరిత్ర పుటల్లో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. అన్యాయాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి పరితపించిన అనంత వెంకటరెడ్డి సేవలను గుర్తుకు చేసుకుంటూ ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సందర్భం: నేడు అనంత వెంకటరెడ్డి 21వ వర్ధంతి సాక్షి, అనంతపురం సెంట్రల్: అనంత వెంకటరెడ్డి 1921, జూలై 1న జన్మించారు. గుంటూరులోని హిందూ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కర్ణాటకలోని బెల్గాంలో బీఎల్ (బ్యాచులర్ ఆఫ్ లా) చేశారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే మహాత్మా గాంధీ అడుగుజాడలను అనుసరిస్తూ వచ్చారు. మహాత్ముడి పిలుపు మేరకు ఆ రోజుల్లో క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. న్యాయవాది పట్టా పొందిన తర్వాత అనంతపురంలో న్యాయవాది వృత్తిని చేపట్టారు. సుమారు 35 సంవత్సరాల పాటు ఈ వృత్తిలో కొనసాగారు. 1967–68లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. రాజకీయరంగ ప్రవేశం.. స్వాతంత్య్రం అనంతరం భారత జాతీయ కాంగ్రెస్‌లో అనంత వెంకటరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. 1964–67, 1969–72 సంవత్సరాలలో జిల్లా కాంగ్రెస్ కమిటీకి ప్రధానకార్యదర్శిగా, 1978–79లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1969లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికయ్యారు. అనంతపురం లోకసభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు గెలుసొంది ఎంపీగా పనిచేశారు. రాష్ట్ర విధాన సభ, పార్లమెంటులోను వివిధ కమిటీలలో సభ్యుడిగా ఆయన విలువైన సేవలను అందించారు. జలసాధన ఉద్యమాలు.. అనంత వెంకటరెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత జిల్లా కరువు పరిస్థితులు ఆయనను కదిలించాయి. కరువు రక్కసిని జిల్లా నుంచి శాశ్వతంగా పారదోలాలంటే సాగునీటి ప్రాజెక్ట్‌ల సాధనే శరణ్యమని భావించారు. తాను అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రైతు సంక్షేమం కోసమే పరితపించారు. తొలిసారిగా పార్లమెంట్లో జిల్లా కరువు పరిస్థితులపై గళం విప్పి, అనంత ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిళ్లు తీసుకెళ్లారు. ఆయన పోరాటాల ఫలితంగానే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని ఆరు జిల్లాలను డీపీఏపీ (దుర్భిక్ష ప్రాంత అభివృద్ధి పథకం), డీడీపీ (ఎడారి అభివృద్ధి పథకం) కిందకు తీసుకొచ్చింది. ఆ తర్వాత కరువును శాశ్వతంగా పారదోలేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు జిల్లాకు చెందిన పాత్రికేయ బృందంతో కలిసి రాజస్తాన్‌లోని జైసల్మేర్ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రాజెక్ట్‌కు ‘అనంత’ పేరు.. జిల్లాలో కరువు శాశ్వత నివారణ చర్యలు చేపట్టేలా సాగునీటి ప్రాజెక్ట్‌ల సాధనకు అనంత వెంకటరెడ్డి సాగించిన పోరాటాలను 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తించారు. దీంతో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కు అనంత వెంకటరెడ్డి పేరు పెట్టారు. ఈ విషయం టీడీపీ పెద్దలకు నచ్చలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. జిల్లా సాగునీటి చరిత్ర పుటల్లో నుంచి అనంత వెంకటరెడ్డి పేరును తుడిచి వేసే చర్యలకు పూనుకున్నాడు. ఇందులో భాగంగానే హంద్రీనీవా ప్రాజెక్ట్‌కు అనంత వెంకటరెడ్డి పేరును తొలగించేశాడు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్‌ను అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతిగా మార్చేసింది. నేడు వర్ధంతి జిల్లాకు ప్రాజెక్ట్‌ల సాధన కోసం పోరాటాలు సాగించిన అనంత వెంకటరెడ్డి 21వ వర్ధంతిని మంగళవారం నిర్వహించనున్నారు. నగరంలోని సర్వజనాస్పత్రి ఎదుట ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహానికి ఉదయం 9.30 గంటలకు ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులు పూలమాలలు వేసి, నివాళులర్పించనున్నారు. అనంతరం బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలోని అనంత వెంకటరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. ఈ మేరకు అనంత వెంకటరెడ్డి తనయుడు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, కుటుంబసభ్యులు తెలిపారు. -
స్వాతంత్య్ర సమర యోధుడికి తీవ్ర అవమానం
భువనేశ్వర్ : కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ఆదివాసీ నేత, దేశ స్వాతంత్య్ర సమరంలో అమరుడైన ప్రథమ ఆదివాసీ నాయకుడు సహిద్ లక్ష్మణ నాయక్‌కు తీవ్ర అవమానం జరిగింది. కొట్‌పాడ్ కళాశాలలో సహిద్ లక్ష్మణ్ నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నారు. అయితే శనివారం ఎవరో దుండగులు ఆ విగ్రహాన్ని పెకిలించి మహిళల మరుగుదొడ్డి పక్కన పడవేశారు. ( భారత్‌లో ఆకలి కేకలు ) ఈ పని ఎవరు చేసినా ఒక ఆదివాసీ సాతంత్య్ర సమర యోధునికి అవమానం జరిగినట్లేనని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహుళ ఆదివాసీ కొరాపుట్ జిల్లాలో పుట్టి దేశ స్వాతంత్య్రం కోసం చిరునవ్వుతో ఉరికంబమెక్కి ప్రాణాలు అర్పించిన దేశ భక్తుడికి జరిగిన అవమానం ఇదంటూ కేవలం ఆదివాసీ ప్రజలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఇది ఓ తిరుగుబాటు ఆత్మకథ
తెలంగాణ సాయుధపోరాటం నుంచి తనను విడదీసి చూడలేనంతగా మమేకమైనవాడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి. భూమి భుక్తి విముక్తికోసం తెలంగాణ ఎర్రసెలకల్లో పుట్టిన మహత్తర పోరాటమది. ‘దున్నేవానికే భూమి’ అన్న నినాదంతో 4000 మంది వీరులు నెత్తురు ధారవోసిన మహాజ్వల సాయుధ పోరాట ఘట్టమది. వెట్టిచాకిరీ వ్యతిరేక ఉద్యమం ఎగిసిపడి దొరగడీలను నేలకూల్చిన పోరు అది. భూస్వామ్య జాగీర్ధారీ వ్యవస్థలను అల్లకల్లోలంచేసిన చీమలదండులు సాగించిన మహత్తర తెలంగాణ సాయుధపోరాటమది. రైతాంగ తిరుగుబాటును ఒక మలుపు తిప్పి ఆయుధ పోరాటానికి శ్రీకారం చుట్టిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి వీర గాధకు ప్రాణంపోస్తూ 2007 సంవత్సరంలో ఒక డాక్యుమెంటరీ వెలువడింది. వీర తెలంగాణ సాయుధపోరాట యదార్థగాథను, ఈ నేలమీద సాగిన సాహసపోరాటగాథను భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఈ డాక్యుమెంటరీలో వ్యక్తంచేశారు. సుమారు 9 గంటలపాటు సాగిన ఆయన సంభాషణను 45 నిమిషాలకు ఎడిటింగ్చేసి శ్రోతల ముందుకు తెచ్చారు. సామాన్యులే చేసిన అసమాన్య పోరాటం ఎట్లా కొనసాగిందో యుద్ధవీరుడైన భీమిరెడ్డి నర్సింహారెడ్డి కళ్లకు కట్టినట్లు వివరించారు. పాత నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని కరివిరాల కొత్తగూడెం మట్టిలో పురుడు పోసుకున్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఆర్యసమాజ కార్యకర్తనుంచి కమ్యూనిస్టుగా మారిన తీరు సింహంలా తుపాకి పట్టుకుని పోరాడిన తీరు మొత్తంగా డాక్యుమెంటరీలో కనిపిస్తుంది. నంగినంగి వొంగివొంగి బాంచన్ దొరా నీకాల్మోక్తా అన్న మూగజీవాలు ఎట్లా ఎదురుతిరిగి పోరాడారో అందులో చూస్తాం. సూర్యాపేట నుంచి జనగామదాకా, జనగామ నుంచి జగిత్యాల దాకా ఈ విప్లవాగ్నులు ఎలా ప్రజ్వరిల్లాయో ఈ డాక్యుమెంటరీ ద్వారా చూడవచ్చును. చాకలి ఐలమ్మ బువ్వగింజలు పోరాటానికి శ్రీకారం చుడితే కడివెండి దొరగడీని, ఆ దొర అనుయాయులను తరిమికొట్టిన సాహసి భీమిరెడ్డి ఆనాటి అనుభవాలు ఇందులో చూడవచ్చు. వీర తెలంగాణ సాయుధపోరాటం 1944–1951 కాలంలోని సమగ్రపోరు రూపంకు ప్రాణంపోసిన తీరు ఈ డాక్యుమెంటరీలో ఉంది. ఈ భూపోరాటమే దేశంలో భూసంస్కరణలకు ప్రాణంపోసింది. ఈ డాక్యుమెంటరీ బీఎన్ జీవిత విశేషాలను కూడా కళ్లకుకట్టింది. ఆయన తెలంగాణ భూపోరాటానికి తొలికేక. గెరిల్లా సైన్యం దళపతి. ఆయనే కామ్రేడ్ బి.ఎన్.గా పిలువబడే భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఆయనను యాది చేసుకోవడమంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మననం చేసుకోవడమే. 1922లో నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం, కరివిరాల కొత్తగూడెం గ్రామంలో జన్మించారు బీఎన్. బాల్యం నుంచే గొంతెత్తి కమ్మగా పాడేవాడు. అప్పుడు 8వ తరగతిలో వున్నాడు. ఓ పక్క వందేమాతరం ఉద్యమం, మరోపక్క ప్రపంచ యుద్ధం ఆయనలోని విప్లవకారుడ్ని తట్టి లేపాయి. ఆంధ్రమహాసభతో అనుబంధం పెంచుకున్నాడు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా గళమెత్తాడు. లెవీ పేరుతో రైతుల తిండిగింజలు దోచుకుంటున్న ప్రభుత్వ అధికారులకు నిరసనగా జరిగిన 70 కిలోమీటర్ల రైతుల పాదయాత్రలో పాల్గొన్నాడు. దేశ్‌ముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి దౌష్ట్యాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో తొలిసారిగా దెబ్బలు రుచి చూశాడు. 1946 జూలై 4వ తేదీన జనగాం తాలూకా కడవెండి గ్రామంలో దొడ్డి కొమురయ్య ఆహుతయ్యాడు. దీంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనివార్యమైంది. చాకలి అయిలమ్మ తిరుగుబాటు, విసునూరి గడికి నిప్పంటుకునేలా చేసింది. 1947 ప్రారంభంలో కళాశాల విద్యార్థులు ‘క్విట్ కాలేజి’ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం మిలిటరీని రంగంలోకి దించింది. దీంతో గెరిల్లా పోరాటం అనివార్యమైంది. బీఎన్ గెరిల్లా దళపతి అయ్యాడు. పాత సూర్యాపేట, దేవరుప్పుల, ఆలేరు, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో మిలిటరీకి చెమటలు పట్టించాడు. రావులపెంట, కోటపాడు, దివ్వెల గ్రామాల్లో జరిపిన దాడుల ద్వారా సేకరించిన ఆయుధాలతో సాయుధ పోరాటం కొనసాగించాడు. 1945–46లో మొండ్రాయి ప్రాంతంలో కడారు రాంచందర్‌రావు జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, అలాగే 1946 దేవరుప్పల పోరాటం, బాలెం గ్రామంలో జరిగిన బాహాబాహీ పోరాటం బీఎన్ సమర్థ నాయకత్వానికి మెచ్చుతునకగా చెప్పొచ్చు. 1947 నవంబర్‌లో భారత్ ప్రభుత్వం నిజాం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని రైతాంగ పోరాట అణచివేతకు మిలిటరీ బలాన్ని అందించేది. దీంతో దున్నేవాడిదే భూమి పేరుతో రైతాంగ సాయుధ పోరాటం ముమ్మరమైంది. సెప్టెంబర్ 18న నిజాం లొంగిపోవడంతో పోరాటం కొనసాగించాలా, లేక ఆపాలా? అన్నదానిపై కమ్యూనిస్టు పార్టీలో భేదాలు తలెత్తాయి. బీఎన్ మాత్రం పోరాటం వైపుకే మొగ్గు చూపాడు. ‘బండెనక బండి గట్టి, పదహారు బండ్లుగట్టి, ఏ బండ్లే పోతివి కొడుకో నా కొడక ప్రతాపరెడ్డి’ అంటూ పాట రాసిన యాదగిరి ఆయన దళం సభ్యులే. పాలకుర్తి అయిలమ్మ ఘటనకూ నాయకుడు బీఎన్. అయిలమ్మ పంటకు రక్షణగా నిలబడి, విసునూరు దేశ్‌ముఖ్ గూండాలతో తలపడి, ఆరెకరాల పంటను ఆమె ఇంటికి చేర్చిన యోధుడు ఆయన. తెలంగాణలో యూనియన్ సైన్యాలు ప్రవేశించిన నేపథ్యంలో పోరాటాన్ని ఎలా కొనసాగించాలో చర్చించేందుకు సూర్యాపేట తాలూకా పాతర్లపాడు సమీపంలోని చిట్టడవిలోని కొండలమధ్య ఏరియా కమిటీ సమావేశం జరుగుతోంది. సుందరయ్య మాట్లాడుతున్నారు. ఇంతలో సెంట్రీ నుంచి ‘పోలీస్’ అన్న కేక. దాని వెనుకే తుపాకీ శబ్దం. ఆ శబ్దాన్ని బట్టే గ్రహించాడు బీఎన్. వచ్చింది పోలీసులు కాదు, అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన యూనియన్ సైన్యాలనీ. వ్యూహాత్మకంగా కాల్పులకు దిగకుండా తన రక్షణ వ్యవస్థకు ఆదేశాలిస్తూనే ఒక్కుదుటున గుహలోకి దూకి, నిద్రలో ఉన్న తన పసిబిడ్డను తీసుకొని చాకచక్యంగా నాయకులతో సహా అందరినీ శత్రువలయం నుంచి సురక్షితంగా తప్పించాడు. తెలంగాణలో సాయుధపోరాటానికి మొట్టమొదట ఆయుధ మెత్తిందీ, చిట్టచివర ఆయుధం దించిందీ బిఎనే. సీపీఐ(ఎం) నల్ల గొండ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యునిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, అఖిల భారత ఉపాధ్యక్షునిగా సుదీర్ఘకాలం పని చేసిన బీఎన్ మొదట పీడీఎఫ్, ఆ పైన సీపీఐ(ఎం) తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. బీబీనగర్–నల్లగొండ రైల్వే లైన్, శ్రీరాంసాగర్ రెండవదశ కాల్వల నిర్మాణాలు ఆయన పోరాట ఫలితంగా వచ్చినవే. కమ్యూనిస్టు నేతగా, సీనియర్ పార్లమెంటేరియన్‌గా పేరొంది, 2008లో కన్ను మూసేనాటికి తనకంటూ ఒక్క పైసా కూడా మిగుల్చుకోని ఓ నిరుపేద, నిస్వార్థ నాయకుడు బీఎన్! నాగలిపట్టిన రైతుచేతికి రైఫిల్ ఎలా వచ్చిందో బీఎన్ డాక్యుమెంటరీ చూస్తే అర్థం అవుతుంది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఈ డాక్యుమెంటరీలో అనేక అనుభవాలను చెప్పారు. కడివెండి, ముండ్రాయి, కోటపాడు, పాతసూర్యాపేట బాలెంల అనుభవాలు, ఆనాటి మిగిలివున్న తన సహచరులను గుర్తుచేస్తున్న దృశ్యాలు ఇందులో చూడవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే భీమిరెడ్డి సైద్ధాంతికతను చెప్పే తాత్వికుడు కాదు. యుద్ధ భూమిమీద నిలిచిన యోధుడు. వ్యాసకర్త: ఎ. రజాహుస్సేన్, రచయిత, సాహిత్య విమర్శకుడు 90631 67117 -
గాంధీజీ స్ఫూర్తితోనే బ్రిటీష్ బంగ్లా కాల్చేశాం...
ఎందరో వీరుల త్యాగఫలం.. నేటి స్వేచ్ఛా భారతం. భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు తెల్లదొరలపై పోరాడి ప్రాణాలు అర్పించిన వారు ఎందరో. బందీలుగా మారి జైళ్లలో జీవితాలు గడిపిన వారు ఇంకెందరో.. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో నాటి స్వాతంత్య్ర సమరయోధులు ఆనాటి స్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్నారు. అలాంటి ఆఖరి తరం స్వాతంత్య్ర సమరయోధుడే శ్రీకాంతం శ్యామమూర్తి. సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోధులు కల్లూరు సుబ్బారావు శిష్యగణంలో నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డితో పాటు శ్యామమూర్తి కూడా కీలక పాత్ర పోషించారు. వందేళ్ల వయస్సులోనూ స్వాతంత్య్రోదమాన్ని ప్రస్తావిస్తే ఆయనలో దేశభక్తి ఉప్పొంగుతుంది. పదేళ్ల వయస్సులోనే భరతమాత స్వేచ్ఛ కోసం బ్రిటీష్ వారిని ఎదిరించి కారాగార శిక్షను అనుభవించారు. ఆనాటి జ్ఞాపకాలను ‘సాక్షి’ పాఠకుల కోసం ఆనందంగా పంచుకున్నారు. మాది కదిరి తాలూకా ముత్యాల చెరువు గ్రామం. అమ్మానాన్నలు ఆదిలక్ష్మమ్మ, నంజుండప్ప. ఊళ్లోని శివాలయంలో అర్చకులుగా పనిచేసే కుటుంబం మాది. మేము ఐదుగురు సంతానం. అందరూ వెళ్లిపోయారు. మా తల్లిదండ్రులు ఏనాడు మమ్మల్ని ఇప్పటిలా గోముగా పెంచలేదు. దేశం గురించి తరచూ చెప్పేవాళ్లు. త్యాగం, దేశభక్తి, నిస్వార్థం అప్పటి సమాజం నుంచే నేర్చుకున్నాం. కాబట్టే నాకు పదేళ్ల వయసు వచ్చేనాటికే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నిత్యం నినాదాలు చేస్తూ పాఠశాలలకు వెళ్లేవాళ్లం. కొన్ని సార్లు దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది. గాంధీజీ స్ఫూర్తితోనే.. మహాత్ముడు స్వాతంత్య్ర సమరానికి నేతృత్వం వహిస్తున్న రోజులవి. ఆయన దేశవ్యాప్తంగా తిరుగుతూ, ప్రజలను చైతన్య పరుస్తూ ఓసారి మా ఊరికి సమీపంలోని కదిరికి వచ్చారు. ఆయన్ను నాకు చూపించడానికి మా నాన్న తన భుజాలపై ఎత్తుకొని తీసుకెళ్లారు. తీరా దగ్గరకు రాగానే ‘భారత్ మాతాకీ జై.. గాంధీజీ జిందాబాద్’ అంటూ గట్టిగా నినదించాను. ఓ పోలీసాయన నన్ను తీసుకొని గాంధీజీ దగ్గరకు చేర్చారు. ఖాకీ నిక్కరు వేసుకొని ఉన్న నన్ను ఎత్తుకున్న మహాత్మాగాంధీ హిందీలో ఏదో చెప్పారు. అప్పుడు నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ పిల్లాడికి మంచి భవిష్యత్ ఉందని పెద్దలతో అన్నారంట. ఆయన ఆశీర్వాదమో, లేక ఆనాటి నిరంత స్ఫూర్తిదాయక పోరాటాల ఫలితమో తెలియదు కానీ, నాలో దేశభక్తి నరనరాన జీర్ణించుకుంది. నేను ఇక చదువుకోవాల్సిన అవసరం కన్నా దేశమాత స్వేచ్ఛ కోసం పోరాడాలనిపించింది. ఇంట్లో వద్దని చెబుతున్నా థర్డ్ ఫారమ్(ఇప్పటి ఎనిమిదవ తరగతికి సమానం)తో చదువుకు స్వస్తి చెప్పి.. స్నేహితులతో రహస్య సమావేశాలకు వెళ్లేవాడిని. బ్రిటీష్ బంగ్లా కాల్చేశాం... గాంధీజీ ఇచ్చి స్ఫూర్తితో మేము ఎన్నో పోరాటాలు చేశాం. ఆ రోజుల్లో బ్రిటీష్ వారు చాలా చోట్ల బంగ్లాలను నిర్మించుకుని అక్కడి నుంచే పాలన సాగించేవారు. అలా మా చుట్టపక్క ప్రాంతాల్లో ఎన్నో బంగ్లాలుండేవి. మా స్నేహితులు బసిరెడ్డి సుబ్బారెడ్డి నేతృత్వంలో కూర్మాల గంగిరెడ్డి, దొన్నికోట రామిరెడ్డి, పులగంపల్లి ఆదిమూర్తి ముదిగుబ్బ చెన్నప్ప తదితరులతో కలిసి నల్లమాడ సమీపంలో బ్రిటీషర్లు నిర్మించిన ఓ బంగ్లాను తగలబెట్టడమేకాకుండా జాతీయ జెండాపట్టుకొని గట్టిగా నినాదాలు చేశాం. ఈ వార్త గంటల్లో అధికారులకు చేరిపోయింది. మమ్మల్ని అరెస్టు చేసి పెనుగొండ సబ్‌జైలుకు తరలించారు. అక్కడ అప్పటికే శిక్షననుభవిస్తున్న దేశభక్తులు మా పోరాటాన్ని అభినందించారు. నేనలా 9 నెలల 11 రోజులు కారాగారశిక్ష అనుభవించి విడుదలయ్యాను. కానీ స్వాతంత్య్రం వచ్చే వరకు ఏదో రూపంలో పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ క్రమంలో మాకు స్ఫూర్తిగా నిలిచింది కల్లూరు సుబ్బారావు గారు, నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి తదితరులు. వారంతా ఎంతో నిస్వార్థమైన నాయకులు. ఎందరో అజ్ఞాత వీరులు శ్రమించారు మా కాలంలో గణాంకాలు ఇంత కచ్చితంగా ఉండేవి కావు. కాబట్టే అధికారిక లెక్కల ప్రకారం నాకు వందేళ్లు రావడానికి ఇంకా కొన్ని నెలలు ఉన్నాయంటున్నారు. వాస్తవానికి నేనెప్పుడో వందేళ్లు దాటేశాను. పంచాంగం ప్రకారం వెయ్యి పౌర్ణిమలను చూసిన వారు వందేళ్ల వారని చెబుతారు. నేను అంతకంటే ఎక్కువే చూశాను. ఇక మాతో పాటు చియ్యేడు కరణం రామచంద్రారావు, ఆయన సతీమణి సావిత్రమ్మ లాంటి వారు ఎందరో అజ్ఞాతంగా ఉంటూ స్వాతంత్య్రం కోసం శ్రమించారు. త్యాగాలు చేశారు. రాత్రిళ్లు లాంతర్లు పట్టుకొని రహస్య సమావేశాలకు వచ్చేవారు. ఆ అభిమానంతోనే రామచంద్రరావు కూతురు ఉమామహేశ్వరిని నా కుమారుడు కోడలిగా తెచ్చుకున్నాడు. మా మనవరాలు కూడా కార్పోరేటర్ (వైఎస్సార్సీపీ తరఫున )గా ఉంది. ఇప్పటి రాజకీయాలకైతే మా తరం ఎంతో దూరంగా ఉంది. ఢిల్లీకి వెళ్లలేకపోయా... స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1972 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నన్ను స్వాతంత్య్ర సమరయోధునిగా గుర్తిస్తూ తామ్రపత్రం మంజూరు చేశారు. ఢిల్లీకి రావాలని ఆహ్వానం పంపారు. కానీ కొన్ని కారణాలతో వెళ్లలేకపోయాను. కానీ అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నా. అప్పుడే కేంద్ర ప్రభుత్వం వారు ప్రత్యేక పింఛను మంజూరు చేశారు. ఈ పింఛన్ ఇప్పటికీ అందుకుంటూనే ఉన్నా. వయసు మీద పడడం వల్ల ఎక్కడికి పోలేను. కానీ చాలా మంది నన్ను ఇంకా గుర్తిస్తూ ఆనాటి విషయాలను స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక అప్పటి వారితో ఈనాటి పరిస్థితులకు పోలికే లేదు. శత్రువుల పట్ల కూడా ఎంతో నిబద్ధతతో, నిజాయతీగా వ్యవహరించేవాళ్లం. మేమంతా అప్పుడు జాతీయ కాంగ్రెస్‌లో ఉండేవాళ్లం. తరిమెల నాగిరెడ్డి లాంటి వాళ్లు కమ్యూనిస్టు పార్టీలోఉన్నా ఎంతో గౌరవించేవాళ్లం. పార్టీలకతీతంగా మా పట్ల ఆయనకూ అదే అభిమానం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాయదుర్గంలో 18–08–1947లో నిర్వహించిన అన్నదానం ఆనంద ఘట్టం..అపురూప చిత్రం రాయదుర్గం టౌన్: భారతావనికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించగా దేశమంతా సంబరాలు మిన్నంటాయి. రాయదుర్గంలోనూ జనం వీధుల్లోకి వచ్చి ‘భారత్‌మాతాకీ జై’ అంటూ నినదించారు. ఆ తర్వాత స్వాతంత్య్ర ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల తర్వాత 18 ఆగస్టు 1947న స్థానిక రాణిఛత్రం వద్ద తోట అంజినప్ప అండ్ సన్స్ వారు వేలాది మంది ప్రజలకు అన్నదానం చేశారు. ఆ అపురూప దృశ్యాలు నాటి స్వాతంత్య్ర ఆనంద ఘట్టాన్ని తెలియజేస్తోంది. జెండాకు వందనం చేస్తేనే ఆనందం మా పిల్లలందరూ వేర్వేరు చోట్ల స్థిరపడిపోయారు. నేను మా అబ్బాయి సుబ్బారావు వద్ద జిల్లా కేంద్రంలోనే ఉంటున్నా. ఏటా జాతీయ పండుగలొచ్చాయంటే త్రివర్ణ పతానికి వందనం చేసి వస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. ఈసారి కరోనా వల్ల మా పిల్లల ఆందోళన, ప్రభుత్వ నిబంధనల వల్ల జాతీయ జెండాను ఎగురేసే అవకాశం లేకుండా పోతోంది. నియమబద్ధమైన జీవితం వల్ల ఎలాంటి రోగాలు లేవు. కానీ వయోభారం వల్ల మతిమరుపు వచ్చింది. ప్రస్తుతం నా పని నేను చేసుకోగలను. – శ్యామమూర్తి, స్వాతంత్య్ర సమరయోధుడు -
సాయుధపోరాట స్ఫూర్తి దొడ్డి కొమురయ్య
తెలంగాణ సాయుధ పోరాటం రావడానికి, భూమి, భుక్తి, విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమురయ్య అమరత్వం ప్రధాన కారణం. ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్‌ఖాన్ కాలంలో తెలంగాణ ప్రజలు దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. నిజాం అండదండతో గ్రామాల్లో జాగీర్దారులు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు దేశ్‌పాండేలు, దొరలు పేట్రేగిపోయి ప్రజలను విపరీతంగా పీడించేవారు. అలాంటి వారిలో ఒకడు విస్నూర్ దేశ్‌ముఖ్ రాంచంద్రారెడ్డి. 60 గ్రామాలకు మకుటం లేని మహారాజు. అతని ఆగడాలకు హద్దు, పద్దూ లేదు. పరమ కిరాతకుడు. భువనగిరిలో 1944 ఆంధ్రమహాసభ (సంఘం) సమావేశం చైతన్యంతో కడివెండిలో గ్రామ సంఘం ఏర్పడింది. ఊరి జనమంతా ఒక్కో ‘అణా’ చెల్లించి సంఘంలో జేరి, గ్రామ రక్షణ దళంగా ఏర్పడి ఎదురు తిరిగారు. సంఘం అండతో దొరసాని జానమ్మకు పన్ను కట్టడం మానేశారు. పన్ను చెల్లించని వారిపైనా ముఖ్యంగా జానమ్మకు ఎదురు తిరిగిన దొడ్డి మల్లయ్య కుటుంబంపై ఒత్తిడి పెరగగా తన సోదరుడికి కొమురయ్య కూడా అండగా నిలబడ్డాడు. ఈ సందర్భంగా దొరసానికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా 1946 జూలై 4న దేశ్‌ముఖ్ రాంచంద్రారెడ్డి మామ గడ్డం నర్సింహా రెడ్డి నేతృత్వంలో ప్రజా నాయకుడిగా ఎదిగిన ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, నల్లా నర్సింహను హత్య చేయాలని కుట్రపన్ని అందులో భాగంగా దేశ్‌ముఖ్ అనుచరుడు మస్కీనలీ నాయకత్వంలో 40 మంది గుండాలు కడవెండి గ్రామంలోకి వచ్చారు. చీకటి పడే సమయంలో గుండాలు బండ బూతులు తిడుతూ రెచ్చగొడుతూ కార్యకర్తల ఇండ్లపైకి రాళ్ళు రువ్వడం ప్రారంభిం చారు. సంఘం ఆర్గనైజర్ కె.రాంచంద్రారెడ్డితో పాటు రెండు వందలమందికి పైగా ప్రజలు ఆంధ్రమహాసభకు జై, సంఘం వర్ధిల్లాలి, దేశ్‌ముఖ్ దౌర్జన్యాలు నశించాలి’ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిస్తూ ర్యాలీగా బయల్దేరారు. దొడ్డి కొమురయ్య తన అన్న మల్లయ్యతో కల్సి ముందు వరుసలో నిలిచాడు. గడ్డం నర్సింహరెడ్డి, మస్కీనలీ అనుచర గుండాలు ఎటువంటి హెచ్చరికలు లేకుండానే ర్యాలీ గఢీని సమీపించగానే జరిపిన తుపాకి కాల్పుల్లో ఓ తూటా దొడ్డి కొమురయ్య పొట్టలోకి దూసుకుపోగా, ‘ఆంధ్ర మహాసభకు జై’ అంటూ అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. కొమరయ్య మృత దేహాన్ని జనగాం తరలించి పోస్టుమార్టం నిర్వహించి నెల్లుట్ల గ్రామం వద్ద పూడ్చిపెట్టారు. కొమురయ్య హత్యను నిరసిస్తూ తెలంగాణ అంతటా నిరసనలు, ఆందోళనలు జరిగి తెలంగాణ కొలిమై మండడంతో సాయుధ విప్లవోద్యమం ప్రారంభమైంది. దొడ్డి కొమురయ్య ప్రపంచ చరిత్రలో వీరుడిగా చిరస్థాయిగా నిలిచాడు. (నేడు దొడ్డి కొమురయ్య వర్థంతి సందర్భంగా)అస్నాల శ్రీనివాస్, హైదరాబాద్ -
సావిత్రీదేవి కన్నుమూత
లక్డీకాపూల్ : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, సామాజిక కార్యకర్త టి.సావిత్రీదేవి(95) సోమవారం కన్నుమూశారు. పంజగుట్టలోని నాగార్జున సర్కిల్లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కిన్నెర, మాధురితో పాటు నలుగురు మనవరాళ్లు ఉన్నారు. వీరిలో నిర్వి తన ప్రతిభా పాటవాలతో చిన్న వయసులోనే సెలబ్రిటీగా నిలిచారు. సోమవారం సావిత్రీదేవి అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరిపారు. పలువురు ప్రముఖులు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
స్వాతంత్య్ర సమరయోధుడు సుధాకర్ చతుర్వేది ఇకలేరు
సాక్షి, బనశంకరి: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో జలియన్‌వాలాబాగ్ హత్యాకాండకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధుడు సుధాకర్ చతుర్వేది కన్నుమూశారు. బెంగళూరు జయనగర ఐదోబ్లాక్‌లోని ఆయన నివాసంలో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గాంధేయవాదిగా, సమరయోధునిగా, దేశంలో ఎక్కువకాలం జీవించి ఉన్న వ్యక్తిగా ఆయన వయసు 123 ఏళ్లుగా చెబుతున్నారు. వేలాది మంది ప్రజలు హత్యకు గురైన 1919 జలియన్ వాలాబాగ్ హత్యాకాండ సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. జలియన్ వాలాబాగ్ నరమేధం లో అమరులైన వారికి గాంధీజీ ఆదేశాల మేరకు చతుర్వేది వేదోక్తంగా అంతిమసంస్కారాలు నిర్వహించారు. మహాత్మాగాంధీకి స్టెనోగ్రాఫర్‌గా చతుర్వేది పనిచేశారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన 13 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. బెంగళూరులో జననం 1897లో రామనవమి రోజున బెంగళూరులో జన్మించిన సుధాకర్ చతుర్వేది 11 ఏళ్ల వయసులోనే ఉత్తరభారతంలో ప్రసిద్ధి చెందిన కాంగడి గురుకులంలో చేరి వేదాలను అధ్యయనం చేశారు. 25 ఏళ్ల పాటు వేదభ్యాసం చేసి 4 వేదాల్లోనూ ఆయన పట్టు సాధించడంతో సార్వదేశికా ఆర్యా ప్రతినిధి సభ నుంచి చతుర్వేది అనే బిరుదును అందుకు న్నారు. కన్నడ, సంస్కృత, ఇంగ్లిష్, హిందీ భాషల్లో స్వాతంత్య్ర సంగ్రామం, గాంధీ తత్వాల గురించి అనేక పుస్తకాలు రాశారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఒక బాలున్ని దత్తత తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం బెంగళూరు చామరాజపేటలోని శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరిగాయి. -
స్వాతంత్య్ర సమరయోధురాలు రాజారత్నమ్మ కన్నుమూత
కేపీహెచ్‌బీ కాలనీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు కడియాల రాజారత్నమ్మ (106) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ పరిధిలోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్‌లో నివసిస్తున్న కుమార్తె సుగుణ ఇంటిలో ఆమె ఉంటున్నారు. కృష్ణాజిల్లా ఇందుపల్లిలో 1914 జూలై 1న జన్మించిన రాజారత్నమ్మ చిన్ననాటి నుంచే స్వాతంత్య్ర సమరంలో పాల్గొనేవారు. కృష్ణాజిల్లా కాటూరుకి చెందిన కడియాల గోపాలరావును వివాహం చేసుకున్నారు. భర్తతో కలసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భర్త అడుగుజాడల్లో కమ్యూనిస్టు బావజాలంతో సేవలందించారు. స్థానికులు, ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
స్వాతంత్య్ర సంగ్రామంలో ఓ విశాల శకం
దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాలుపంచుకోవాలన్న కాంక్షతో.. తల్లిగా, భార్యగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఉద్యమ పథంలో ఉరకలెత్తిన ధీశాలి... రూపాకుల విశాలాక్షి. సమరశీల మహిళగా మహాత్ముని పిలుపుతో ప్రత్యక్ష పోరాటంలో సైతం ఆమె భాగస్వామిగా మారారు. దేశంలో ఎక్కడ ఉద్యమం జరిగినా ముందు వరుసలో నిలబడ్డారు. లాఠీ దెబ్బలను, జైలు శిక్షలను లెక్క చెయ్యకుండా స్వేచ్ఛా స్వాతంత్య్రమే లక్ష్యంగా తెల్లదొరల్ని ఎదిరించారు. దేశం కోసం అహర్నిశలూ శ్రమించి, కడవరకు సేవా దృక్పథంతో జీవనం సాగించిన ఈ యోధురాలు గురువారం నాడు మాతృభూమి ఒడిలో శాశ్వతంగా ఒదిగిపోయారు. ఆమె మరణంతో విశాఖలో ఒక స్వాతంత్య్ర శకం ముగిసినట్లయింది. విశాఖపట్నం మహారాణి పేటకు చెందిన శిష్టా› దక్షిణామూర్తి, సీతామహాలక్ష్మి దంపతుల ఎనిమిది మంది సంతానంలో నాలుగో సంతానంగా విశాలాక్షి. 1926 ఏప్రిల్ 6వ తేదీన జన్మించారు. తండ్రి స్వాతంత్య్ర పోరాటంలో విశాఖ నుంచి కీలక పాత్ర పోషించేవారు. ఆయనను చూస్తూ పెరిగిన విశాలాక్షి.. తన తొమ్మిదవ ఏట.. తండ్రితో కలిసి ఉద్యమంలోకి తొలి అడుగు వేశారు. బాల్యంలోనే ఆమెకు స్వాతంత్య్ర సమర యోధుడైన రూపాకుల రామకృష్ణయ్య కుమారుడు సుబ్రహ్మణ్యంతో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది నెలలకు గాంధీజీ విశాఖలో పర్యటించిన సందర్భంలో విశాలాక్షి ఆ సభకు హాజరై.. మహాత్ముని మాటలతో సమర స్ఫూర్తి పొందారు. తొలిసారి జైలుకి! ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్న విశాలాక్షిని రాజమండ్రి జైలుకి తరలించారు. జైలుకు వెళ్లడం అదే మొదటిసారి కావడంతో కాస్త భయం వేసినా.. దేశ భక్తి ముందు ఆ భయం బలాదూర్ అయిపోయిందని తమతో ఎప్పుడూ అంటుండేవారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతారు. అదే సమయంలో కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ తండ్రి మంగళంపల్లి పట్టాభిరామయ్య వద్ద విశాలాక్షి శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నారు. తన సంగీత పరిజ్ఞానాన్ని సైతం స్వాతంత్య్ర పోరాటానికే ఆమె వినియోగించారు. విశాలాక్షి సంగీత సారథ్యంలో కొందరు గ్రామాల్లోకి వెళ్లి పాటల రూపంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేవారు. ఈ క్రమంలో ఒకరోజు బ్రిటిష్ వాళ్ల చేతికి విశాలాక్షి దొరికిపోయారు. బళ్లారి జైల్లో బ్రిటిష్ పోలీసులు ఆమె తల వెనుక భాగంలో బలంగా కొట్టడంతో ఎడమ చెవి నుంచి రక్తం వచ్చింది. ఆ తర్వాత వినికిడి కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ విశాలాక్షి వెనకడుగు వెయ్యలేదు. క్విట్ ఇండియా ఉద్యమం, ఖాదీ ఉద్యమం.. ఇలా ప్రతి ఉద్యమంలోనూ పాల్గొన్నారు. ఇసుక తిన్నెలపై సమాలోచనలు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కర్నూలు, మదరాసు, గుజరాత్.. ఇలా ఏ ప్రాంతంలో గాంధీజీ ఉద్యమానికి పిలుపునిచ్చినా.. అక్కడికి వెళ్లిపోయేవారు విశాలాక్షి. ఈ ప్రాంత సమర యోధులైన క్రొవ్విడి లింగరాజు, బులుసు కామేశ్వరరావు, వావిలాల గోపాల కృష్ణయ్య, మొదలైన ప్రముఖులతో కలిసి చర్చల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఉదయమంతా ఆయా గ్రామాలు, ప్రాంతాల్లో తిరిగి.. ప్రజల్ని చైతన్య పరిచేవారు. సాయంత్రం మహారాణి పేటలో తమ ఇంటికి సమీపంలో ఉన్న సముద్రపు ఇసుకతిన్నెలపై కూర్చొని భావి ఉద్యమం కోసం సమాలోచనలు జరుపుతూ వ్యూహరచన చేసేవారు. బ్రిటిష్ సైన్యం కంటబడకుండా భోజనాలు విశాలాక్షి మామగారైన రామకృష్ణయ్యతో పాటు మరికొందరిపై బ్రిటిష్ అధికారులు కనిపిస్తే కాల్చివెయ్యాలని సైన్యానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఆయనతో సహా మరికొందరు పోరాట వీరులు తమ ఇంటి సమీపంలో ఉన్న మరొకరి ఇంట్లో తలదాచుకున్నారు. వారికి ప్రతిరోజూ బ్రిటిష్ సైన్యం కంటపడకుండా విశాలాక్షి భోజనాలు స్వయంగా తీసుకెళ్లేవారు. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి స్వాతంత్య్ర ప్రకటన వెలువడినప్పుడు ఆ విషయం తెలుసుకున్న విశాలాక్షి.. ఆనందంతో ఆ వీధి ప్రజలందరినీ నిద్రలేపేశారు. మాతృభూమి బానిస సంకెళ్లు తెంచుకున్న ఈ రోజు మనకు పండుగ రోజంటూ సంబరాలు చేసుకున్నారు. ఇంట్లో స్వీట్లు ఏవీ లేకపోవడంతో డబ్బాలో ఉన్న పంచదారని అందరి నోట్లో పోసి తీపి చేశారు. బాణాసంచా కాల్చి ఆ రోజంతా విశాలాక్షి ఆనందంగా గడిపారు. అగ్రవర్ణాలు వెలి వేసినా..! అగ్రవర్ణానికి చెందిన విశాలాక్షి చేపట్టిన ఆలయ ప్రవేశ హరిజనోద్ధరణ ఉద్యమం.. ఆ వర్గానికి మింగుడు పడలేదు. దీంతో.. అగ్రవర్ణాలంతా కలిసి.. విశాలాక్షి కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు ప్రకటించారు. ఏ శుభ కార్యానికి కూడా పిలవడం మానేశారు. అయినప్పటికీ.. విశాలాక్షి బాధపడకుండా.. హరిజనవాడల్లో వారి బాగోగుల కోసం కృషిచేశారు. వారితోనే సహపంక్తి భోజనాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. స్వాతంత్య్ర సమరంలో ఉద్ధృతంగా పాల్గొన్న సమరయోధులలో అతికొద్ది మందికి కేంద్ర ప్రభుత్వం తామ్రపత్రాన్ని అందించేది. ఆ మహద్భాగ్యం విశాలాక్షి కి దక్కింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా విశాలాక్షి తామ్రపత్రాన్ని అందుకున్నారు. విశాలాక్షి ఓ వైపు స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకుంటూనే.. ఇంకోవైపు పేదలకు సహాయం చేస్తుండేవారు. 2002లో భర్త మరణించాక ఆయన పేరిట మరికొన్ని సేవా కార్యక్రమాలను చేపట్టారు. అమ్మ అడుగు జాడల్లో విశాలాక్షికి ఆరుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ప్రస్తుతం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు రవికుమార్ సంఘ సేవకుడు, రాజీవ్‌గాంధీ మానవసేవ జాతీయ అవార్డు గ్రహీత. ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె శిష్టా› శ్రీలక్ష్మీ అంతర్జాతీయ వెటరన్ క్రీడాకారిణి, యోగా శిక్షకురాలు, ప్రకృతి చికిత్సాలయం వైద్యురాలు. మరో కుమార్తె కూడా మైథిలి హైదరాబాద్‌లో ఉంటున్నారు. రవికుమార్, శ్రీలక్ష్మి ఇరువురూ విశాఖపట్నం మహారాణిపేటలో నివాసం ఉంటున్నారు. తోడబుట్టిన నలుగురు అన్నదమ్ములు శిష్టా›్ల సత్యనారాయణ, వెంకటరామశాస్త్రి, యజ్ఞనారాయణ, లక్ష్మీనారాయణ విశాఖపట్నంలోనే నివసిస్తున్నారు. విశాలాక్షి ప్రతి ఏటా రాఖీ పండుగనాడు మహారాణిపేటలోని తన స్వగృహానికి వీరిని పిలిపించుకుని వారికి రాఖీ కట్టేవారు. విశాలాక్షి మరణంతో ఒక శకం అంతరించినట్లయింది. స్వాతంత్య్ర సముపార్జన కోసం సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి.. భావితరాలకు అందమైన భవిష్యత్తు ఫలాలు అందించేందుకు తమ శక్తిని ధారబోసిన సమరయోధులు చరిత్రలో ఒకరొకరుగా మమేకమైపోతున్నారు. వారిలో విశాఖ జిల్లాలో విశాలాక్షి చివరి వారు. – కరుకోల గోపీకిశోర్ రాజా, సాక్షి, విశాఖపట్నం హరిజనులకు ఆలయ ప్రవేశం హరిజనోద్ధరణ ఉద్యమం మొదలైన రోజుల్లో ఉద్యమాన్ని ముందుండి నడిపిన అతి కొద్ది మందిలో విశాలాక్షి ఒకరు. అప్పట్లో హరిజనులకు ఆలయ ప్రవేశం నిషేధించారు. ఏపీ హరిజన సేవా సంఘం సభ్యురాలైన విశాలాక్షి పదివేల మంది కార్యకర్తలతో కలిసి హరిజనులకు తిరుమల తిరుపతి ఆలయ ప్రవేశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపట్టారు. ఆ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసి బళ్లారి జైలులో పెట్టారు. అయినా వెరవక విశాలాక్షి ఉద్యమాన్ని కొనసాగించడంతో.. హరిజనులకు ఆలయ ప్రవేశం సుగమంగా మారింది. మొదట తిరుమల ఆలయం, ఆ తర్వాత అన్ని ఆలయాల్లోకీ హరిజనులకు ప్రవేశం కల్పించారు -
యోధురాలి నిష్క్రమణం
బ్రిటిష్ తుపాకులకు ఎదురొడ్డిన రూపాకుల విశ్రమించింది. క్విట్ ఇండియా.. అని చిన్నతనంలోనే గర్జించిన గళం ఆగిపోయింది. భర్త, మామల ఆడుగుజాడల్లో స్వాతంత్య్రోద్యమంలోకి దూకి.. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలతోపాటు హరిజనోద్ధరణకు అవిశ్రాంత కృషి సల్పిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు రూపాకుల విశాలాక్ష్మి అస్తమించారు. శ్వాసకోస వ్యాధితో కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్న ఆమె గురువారం ఉదయం 11.44 గంటలకు తుదిశ్వాస విడిచారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసి తామ్రపత్రం అందుకున్న ఆమె.. తనకొచ్చే సమరయోధుల పింఛనులో కూడా చాలా వరకు సమాజ సేవకే వెచ్చించిన విశాల హృదయురాలామె. ఉద్యమ సమయంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లిన విశాలాక్షి 94 ఏళ్ల సుదీర్ఘ జీవనయానాన్ని ముగించడంతో ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఖిన్నులయ్యారు. ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర సమరయోధురాలు, తామ్రపత్ర గ్రహీత రూపాకుల విశాలాక్షి (94) అస్తమించారు. కొద్ది రోజులుగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విశాలాక్షి గురువారం ఉదయం 11.44 గంటలకు మరణించారు. ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం మహారాణిపేటలోని స్వగృహంలో ఉంచారు. గాంధీజీ పిలుపుతో ఉద్యమంలోకి.. విశాఖపట్నం మహారాణిపేటవాసి శిష్ట్లా దక్షిణామూర్తి, సీతామహాలక్ష్మి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతతిలో నాలుగో సంతానంగా విశాలాక్షి 1926 ఏప్రిల్ ఆరో తేదీన జన్మించారు. తండ్రి దక్షిణామూర్తి స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, స్వదేశీ ఉద్యమం వంటి పలు ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, మహాత్మాగాంధీ పిలుపు మేరకు చిన్నవయసులోనే ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రూపాకుల రామకృష్ణయ్య కుమారుడు సుబ్రహ్యణ్యాన్ని 1935వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అప్పటికే స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకుంటున్న భర్త, మామల అడుగుజాడల్లో నడిచారు. హరిజనోద్యమంలో కీలక భూమిక దేశ నేతలతో పాటు చురుగ్గా ఉద్యమంలో పాలుపంచుకున్న విశాలాక్షిని పలుమార్లు తెల్లదొరలు అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపారు. 1946వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హరిజన సేవా సంఘం సభ్యురాలైన విశాలాక్షి పదివేల మంది కార్యకర్తలతో కలిసి హరిజనులకు తిరుపతి ఆలయ ప్రవేశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపట్టారు. ఆమెను అరెస్ట్ చేసి బళ్లారి జైల్లో పెట్టారు. వారి ఉద్యమంతో హరిజనులకు ఆలయ ప్రవేశం సుగమమైంది. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విశాలాక్షి 2 సంవత్సరాల పాటు గడిపిన జైలు జీవితంలో లాఠీదెబ్బలు తిన్నారు. 1946లో వీరు చేపట్టిన ఆలయప్రవేశ ఉద్యమం సందర్భంగా విశాలాక్షి కుటుంబం అగ్రవర్ణానికి చెందినదైనా అగ్రవర్ణాల వారు వీరిని వెలివేసి, శుభ, అశుభ కార్యక్రమాలకు పిలవడం మానేశారు. విశాలాక్షి మామ రామకృష్ణయ్యను మహాత్మాగాంధీ ఏపీ హరిజన సేవా సంఘం ప్రధాన కార్యదర్శిగా 1941లో నియమించారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం, విశాఖపట్నంలో జరిగిన ఉప్పు సత్యా గ్రహం, టౌన్‌హాలులో మహాత్మాగాంధీ ముఖ్య నేతలతో చేపట్టిన స్వాతంత్య్ర ఉద్యమంలో భర్త సుబ్రహ్మణ్యం, మామ రామకృష్ణయ్యలతో కలిసి పాల్గొన్నా రు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం, విశాఖపట్నంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, టౌన్‌హాలులో మహాత్మాగాంధీ ముఖ్య నేతలతో చేపట్టిన స్వాతంత్య్ర ఉద్యమంలో భర్త సుబ్రహ్మణ్యం, మామ రామకృష్ణయ్యలతో కలిసి పాల్గొన్నారు. భర్త మరణం 2002లో భర్త రూపాకుల సుబ్రహ్మణ్యం మరణించినా, ధైర్యం కోల్పోలేదు. ఆయన జయంతి, వర్ధంతి సమయాల్లో పేదలకు వస్త్రదానం చేసేవారు. పేద యువతుల వివాహానికి ఆర్థిక చేయూతనిస్తూ ఆయన స్మృతుల్లోనే జీవించారు. సంగీతం, పుస్తక పఠనం రూపాకుల విశాలాక్షి మంగళంపల్లి బాలమురళీకృష్ణ తం డ్రి వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. రోజూ కీర్తనలు రాసి పాడుకోవడం, రామాయణ, మహాభారత, భగవద్గీత వంటి గ్రంథాలను చదవడం అలవాటుగా మార్చుకున్నారు. కుటుంబమంతా దేశ సేవలోనే.. రూపాకుల విశాలాక్షి భర్త సుబ్రహ్మణ్యం, మామ రామకృష్ణయ్య, తండ్రి శిష్ట్లా దక్షిణామూర్తి, కుమారుడు రూపాకుల రవికుమార్‌తో సహా కుటుంబం మొత్తం దేశసేవకు అంకితమయ్యారు. సామాజిక సేవ వయసు మీద పడినా సమాజసేవ చేయాలన్న ఆలోచన విశాలాక్షిని వీడలేదు. కేంద్రప్రభుత్వం తనకు ఇచ్చే స్వాతంత్య్ర సమరయోధుల పింఛనులో అధిక మొత్తం పేదల కోసమే ప్రతి నెలా ఖర్చు చేసేవారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, పేద కుటుంబాలకు చెందిన మహిళలకు వస్త్రాలు, నిత్యావసరాలు అందజేసేవారు. సోదరులతో ఆత్మీయానుబంధం : సోదరులతో ఆమెది ఆత్మీయానుబంధం. తోడబుట్టిన నలుగురు అన్నదమ్ములు శిష్ట్లా సత్యనారాయణ, వెంకటరామశాస్త్రి, యజ్ఞనారాయణ, లక్ష్మీనారాయణ విశాఖపట్నంలోనే నివసిస్తున్నారు. ఏటా రాఖీ పండుగనాడు మహారాణిపేటలోని తన స్వగృహానికి వీరిని పిలిపించుకుని వారికి రాఖీ కట్టేవారు. ఇదీ ఆమె కుటుంబం.. విశాలాక్షికి ఆరుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ప్రస్తుతం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు రూపాకుల రవికుమార్ సంఘ సేవకుడు, రాజీవ్‌గాంధీ మానవసేవ జాతీయ అవార్డు గ్రహీత. ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె శిష్ట్లా శ్రీలక్ష్మి అంతర్జాతీయ క్రీడాకారిణి, యోగా శిక్షకురాలు, ప్రకృతి చికిత్సాలయం వైద్యురాలు, మరో కుమార్తె గూడా మైథిలి (గృహిణి) ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. రవికుమార్, శ్రీలక్ష్మి ఇరువురూ విశాఖపట్నం మహారాణిపేటలో నివాసం ఉంటున్నారు. తామ్రపత్ర గ్రహీత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న సమరయోధుల్లో అతికొద్ది మందికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే తామ్ర పత్రాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా విశాలాక్షి అందుకున్నారు. నేడు అంత్యక్రియలు విశాలక్షి పార్థివ దేహానికి 25వ తేదీ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు జ్ఞానాపురంలోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధురాలైన ఆమెకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని ఆమె కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
సమర జ్వాల..వావిలాల
దేశం కోసం.. సమాజ శ్రేయస్సు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతలు. అలాంటి గొప్ప వ్యక్తి, స్వాతంత్య్ర సమర జ్వాల.. మన వావిలాల గోపాలకృష్ణయ్య. భరతమాత ముద్దుబిడ్డగా.. దేశ సేవలో తరించిన ధన్యజీవి. వ్యక్తిగత, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు. బ్రిటీష్ వారిపై విప్లవ శంఖం పూరించిన సమరయోధుడు వావిలాల గోపాల కృష్ణయ్య. నేడు ఆ మహనీయుడి 114వ జయంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సత్తెనపల్లి: స్వాతంత్య్రోద్యమం దేశ చరిత్రలో ఓ మహోజ్వల ఘట్టం. ఎందరో మహానుభావులు భరతమాత బానిస సంకెళ్లు తెంచేందుకు తమ జీవితాలను త్యాగం చేశారు. అలాంటి వారిలో స్వాతంత్య్ర సమరయోధుడు, సత్తెనపల్లి మాజీ శాసన సభ్యుడు వావిలాల గోపాలకృష్ణయ్య ఒకరు. చేతికి సంచి తగిలించుకొని సాదాసీదాగా కనిపించే ఆయన సాయుధ పోరాటంలో భాగంగా విప్లవ బాట పట్టారు. బ్రిటీషు పాలకుల నిరంకుశత్వ పాలనపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసి వారి గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచారు. 1906 సెప్టెంబర్ 17న సత్తెనపల్లిలో వావిలాల నరసింహం, పేరిందేవి దంపతులకు నాల్గో సంతానంగా ఆయన జన్మించారు. క్వింట్ ఇండియా ఉద్యమం మొదలుకొని మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన అన్ని ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు. పల్నాడు అపర గాంధీగా పేరుగడించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ప్రజాసేవకు చేరువ.. స్వాతంత్య్రం వచ్చాక ప్రజాసేవకు వావిలాల గోపాలకృష్ణయ్య మరింత చేరువయ్యారు. 1952లో సత్తెనపల్లి నియోజకవర్గం ఏర్పడటంతో ఇక్కడ పోటీ చేసి తొలి శాసన సభ్యుడిగా ప్రజలకు సేవలు అందించారు. 1952, 1955, 1962, 1972 ఎనికల్లో వరుసగా నాలుగు పర్యాయాలు శాసన సభ్యుడిగా విజయం సాధించి 19 ఏళ్ల పాటు ప్రజా సేవలో నిలిచారు. ఆయన కృషి ఫలితంగానే శాతవాహన నూలు మిల్లు, ఫణిదం చేనేత సహకార సంఘం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటయ్యాయి. సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారు. మద్యపాన నిషేధ ఉద్యమ సంస్థ బాధ్యుడిగా, గ్రంథాలయ ఉద్యమ రథ సారధిగా, దళిత, గిరిజనోద్ధరణ ఉద్యమ నాయకుడిగా ఆయన ముందు నడిచారు. పద్మభూషణ్‌తో పాటు ఎన్నో పురస్కారాలు, సత్కారాలను అందుకున్నారు. 2003 ఏప్రిల్ 29న అనారోగ్యంతో వావిలాల గోపాలకృష్ణయ్య తుదిశ్వాస విడిచారు. స్వాతంత్య్ర సమరయోధుడి గుర్తుగా.. వావిలాల గోపాల కృష్ణయ్యకు రైల్వేస్టేషన్ రోడ్డులోని చెరువు పక్కన ఐదెకరాల్లో ఘాట్‌ను ఏర్పాటు చేశారు. ఆ ఘాట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని నాడు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన మాట నీటిమూటైంది. ప్రసుత్త ఎమ్మెల్యే అంబటి రాంబాబు గత ఏడాది ఆ ప్రాంతాన్ని పరిశీలించి స్వయంగా శుభ్రం చేయించి వావిలాల జయంతి నిర్వహించారు. దీంతో అప్పటి సీఆర్డీఏ అధికారుల్లో కనువిప్పు కలిగి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అయితే వావిలాల ఘాట్‌కు ఎన్టీఆర్ గార్డెన్‌గా నామకరణం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడి ఘాట్ ఆనవాళ్లు కనిపించకుండా చేసేలా గత పాలకులు వ్యవహరించిన తీరుపై స్థానికులు మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే అంబటి రాంబాబు చొరవ తీసుకుని ఆ ప్రాంతానికి గతంలో మాదిరిగానే రికార్డుల్లో ఉన్న వావిలాల ఘాట్ (స్మృతి వనం)గా నామకరణం చేయించేలా చేశారు. కాంస్య విగ్రహం ఏర్పాటు వావిలాల శత జయంతిని పురస్కరించుకొని 2006 సెప్టెంబర్ 14వ తేదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నాటి ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, నాటి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, నాటి సహకార శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, నాటి శాసన సభ్యుడు యర్రం వెంకటేశ్వరరెడ్డి సత్తెనపల్లి తాలుకా సెంటర్లో వావిలాల గోపాలకృష్ణయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. గాంధీ చౌక్ నుంచి అచ్చంపేట వెళ్లే రోడ్డులో కాలనీకి వావిలాల వారి వీధిగా పేరు పెట్టారు. వావిలాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి. సమాజ సేవ కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసే వారు అరుదుగా ఉంటారు. ఆజన్మాంతం వావిలాల బ్రహ్మ చారిగా ఉండి ప్రజా సేవలో తరించారు. విశ్వవిద్యాలయాల స్థాపన, ప్రాజెక్ట్‌ల నిర్మాణం, మద్యపాన నిషేధానికి అనేక ఉద్యమాలు నిర్వహించారు. అలాంటి గొప్ప నాయకుడి జీవిత విశేషాలు భవిష్యత్తు తరాలకు తెలపకపోతే ద్రోహం చేసినట్లు అవుతుంది. ఈ నెల 17న వావిలాల 114వ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం. – అంబటి రాంబాబు, ఎమ్మెల్యే, సత్తెనపల్లి -
వెండితెరకు కాళోజి జీవితం
ప్రముఖ రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జీవితం వెండితెరకు రానుంది.‘అమ్మా నీకు వందనం, ప్రణయ వీధుల్లో.. పోరాడే ప్రిన్స్, క్యాంపస్–అంపశయ్య’ వంటి చిత్రాలను తెరకెక్కించిన డా. ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో ‘కాళన్న’ పేరుతో కాళోజి బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. జైనీ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి జైనీ నిర్మిస్తారు. ఈ సందర్భంగా ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ– ‘‘9.9.2019 కాళోజి నారాయణరావుగారి 105వ జయంతి. ఈ సందర్భంగా కాళోజిగారి జీవిత విశేషాలను, రచనలను, స్వాతంత్య్ర పోరాట విశేషాలను నేటి యువతీయువకులకు పరిచయం చేయాలనుకున్నాం. మన సాంస్కృతిక పునరుజ్జీవనానికి హారతి పట్టిన ఆయన జీవిత విశేషాలను దృశ్య రూపంలో నిక్షిప్తం చేయాలనే మహోన్నత ఆశయంతో ‘కాళన్న’ సినిమా చేస్తున్నాం. కాళోజికి అత్యంత సన్నిహితులైన అంపశయ్య నవీన్, వి.ఆర్. విద్యార్థి, నాగిల్ల రామశాస్త్రి, పొట్లపల్లి, అన్వర్ మొదలైన మిత్రులతో సంప్రదించి స్క్రీన్‌ప్లేకు తుది రూపం ఇచ్చి త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి కుమార్ నీర్ల, సంగీతం: ఘంటసాల విశ్వనాథ్, మహమ్మద్ సిరాజుద్దీన్. -
భారతీయ ఆత్మను కదిలించినవాడు
• ధ్రువతారలు చరిత్రను మలుపు తిప్పిన వ్యక్తిగా చరిత్రలో నమోదు కావడం అసాధారణ ఘట్టం. భారత స్వాతంత్రోద్యమ చర్రితను మలుపు తిప్పిన వ్యక్తిగా తృటిలో అవకాశం తప్పిపోయిన వారు చక్రవర్తి రాజగోపాలాచారి. క్విట్ ఇండియా పిలుపు తరువాత స్వాతంత్రోద్యమంలో ఏర్పడిన దారుణమైన నిశ్శబ్దాన్ని ఛేదించినవారు రాజాజీయే. పాకిస్తాన్ ఏర్పాటును ఆపడం ఎవరితరమూ కాదని మహమ్మద్ అలీ జిన్నా అప్పటికే ప్రకటించాడు. అందులోని అనివార్యతను మొదటిసారి బాహాటంగా చెప్పిన వారు కూడా రాజాజీయే. ఈ ప్రతిపాదనే రాజాజీ ప్రణాళిక పేరుతో చరిత్రలో ఒక మూల దాక్కుని ఉంది. గాంధీజీ అనుమతితో రాజాజీ ఈ అంశాన్ని జిన్నాతో చర్చించాలని అనుకున్నారు. జిన్నా ముందుకు రాకపోవడంతో, 1944, సెప్టెంబర్‌లో గాంధీజీయే ఈ ప్రణాళిక గురించి జిన్నాతో చర్చించారు. 19 రోజుల పాటు జిన్నా స్వగృహంలో జరిగిన చర్చలలో ఇదే ప్రధానాంశం. భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలన్న డిమాండ్‌కు ముస్లిం లీగ్ మద్దతు ప్రకటించడం ఐదు సూత్రాల రాజాజీ ప్రణాళికలో తొలి అంశం. మిగలిన నాలుగు సూత్రాలు ఎలా ఉన్నా, దీనిలో అంతరార్థం ఒకటే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశ విభజన గురించి ఆలోచించాలంటుంది ఆ సూత్రం. జిన్నా దీనిని వ్యతిరేకించడంలో ఆశ్చర్యం లేదు. జాతీయ కాంగ్రెస్ కంటే ఆంగ్లేయుల మీదనే ఆయనకు నమ్మకం ఎక్కువ కూడా. రెండో ప్రపంచ యుద్ధం వేళ మద్రాస్ నగరం మీద జపాన్ బాంబు దాడులకు పాల్పడిన సందర్భమే రాజాజీని అప్పుడున్న ఆ ప్రమాదకర నిశ్శబ్దాన్ని ఛేధించడానికీ, యథాతథ స్థితి మీద దండెత్తడానికీ ప్రేరేపించింది. ఒకటి నిజం. అవిభాజ్య భారత్‌గా ఉండగానే ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఉంటే ఆ పరిణామం చరిత్రలో మలుపు అని పిలవడానికి అర్హమైనదిగా ఉండేదేమో! కానీ ‘ఏమో’, ‘అయితే’ వంటి ఊహాగానాలను చరిత్ర అనుమతించదు. చక్రవర్తి రాజగోపాలాచారి (డిసెంబర్ 10,1878–డిసెంబర్ 25,1972) ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. తండ్రి వెంకటరాయన్ అయ్యంగార్ థోరాపల్లి (తమిళనాడు, కృష్ణగిరి జిల్లా) మున్సిఫ్. తల్లి సింగారమ్మ. రాజాజీ, సీఆర్ అని కూడా పిలుచుకునే రాజగోపాలాచారి ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే జరిగింది. తరువాత మైసూరు రాష్ట్రం (నేటి కర్ణాటక) లో కొంతకాలం చదివారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని, 1900 సంవత్సరంలో సేలంలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. కొద్దికాలంలోనే పెద్ద న్యాయవాదిగా కీర్తి సంపాదించారు. 1906 నాటి కలకత్తా కాంగ్రెస్ సమావేశాలకు హాజరు కావడంతో రాజాజీ స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించారు. అంటే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం నేపథ్యంలోనే రాజాజీ స్వరాజ్య సమరం వైపు నడిచారు. నిజానికి ఆయన ఆనాటికి లోకమాన్య బాలగంగాధర తిలక్ అనుచరుడు. రాజాజీ అటు ఉద్యమాన్ని, ఇటు అధికార పదవులనూ సమానంగానే స్వీకరించారు. 1911లోనే సేలం మునిసిపాలిటీలో సభ్యుడయ్యారు. 1917లో తాను అధ్యక్షునిగా ఎన్నికై, ఒక దళితుడిని కూడా సభ్యునిగా ఎంపిక చేసిన ఘనతను దక్కించుకున్నారు. గాంధీజీ హరిజనోద్ధరణ ఆరంభించడానికి చాలా ముందే రాజాజీ ఇలాంటి అడుగు వేశారు. మునిసిపల్ చైర్మన్ పదవీ కాలం ముగిసిపోతున్న కాలంలో, అంటే 1919 లో మొదటిసారి ఆయనను గాంధీజీని కలుసుకున్నారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంతో కలసి నడిచారు. ఇటు గాంధీ పథంలో ఉన్నప్పటికీ తిలక్ అనుచరుడు, తీవ్ర జాతీయవాది ఓవీ చిదరబరం పిళ్లై అంటే ఎంతో అభిమానించేవారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని, పూర్తిస్థాయి ఉద్యమకారునిగా మారారు. అప్పుడే న్యాయవాద వృత్తి వదిలేశారు. 1924–25లో తమిళనాడులో జరిగిన వైకోమ్ సత్యాగ్రహంలో కీలక పాత్ర వహించారు. అంటరాని కులాల వారిని దేవాలయాలలోకి అనుమతించాలన్న ఆశయంతో ఈ ఉద్యమం ఆరంభమైంది. 1930లో గాంధీజీ దండిలో ఉప్పు సత్యాగ్రహం ఆరంభిస్తే, నాగపట్నం దగ్గరి వేదారణ్యంలో రాజాజీ ఆరంభించారు. జైలు జీవితం తరువాత తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులయ్యారు. 1937 ఎన్నికలలో రాజాజీ మద్రాస్ విశ్వవిద్యాలయం ప్రతినిధిగా శాసనసభలో ప్రవేశించారు. మద్రాస్ తొలి ప్రధాని అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే మధుర మీనాక్షి ఆలయంలో అంటరానివారి ప్రవేశం (1939) జరిగింది. ఆలయాలలో అంటరానివారి ప్రవేశం కోసం ఆయన చట్టాన్ని తెచ్చారు. రైతు రుణ విమోచన చట్టం కూడా ఆయనదే. మద్యపాన నిషేధం విధించి, దీని ద్వారా వచ్చే లోటును భర్తీ చేసుకోవడానికి అమ్మకం పన్ను పెంచారు. అయినా లోటు తప్పలేదు. దీనితో కొన్ని ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. కింది వర్గాల వారి విద్యాభివృద్ధికి రాజాజీ ఈ విధంగా కావాలనే భంగం కలిగించారని ఆయన వ్యతిరేకులు, అంటే ద్రవిడ పార్టీలు విమర్శలకు దిగడం విశేషం. అలాగే హిందీని పాఠ్య ప్రణాళికలో చేర్చాలన్న రాజాజీ నిర్ణయం కూడా వ్యతిరేకులు రాజకీయం కోసమే ఉపయోగించుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం జర్మనీ మీద యుద్ధం ప్రకటించినందుకు నిరసనగా 1940లో కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేశారు. రాజాజీ కూడా ప్రధానమంత్రి పదవికి (నాటి ముఖ్యమంత్రులను ఇలాగే పిలిచేవారు) రాజీనామా చేశారు. ఇందుకు ఇంగ్లిష్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి ఒక సంవత్సరం జైలుకు పంపించింది. అప్పుడే క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభమైంది. కానీ ఆ ఉద్యమాన్ని రాజాజీ సమర్థించలేకపోయారు. అంతకంటే బ్రిటిష్ వారితో చర్చించి, వారు దేశాన్ని విడిచిపోయేందుకు ఒప్పించాలని ఆయన అభిప్రాయం. అప్పటికే జపాన్ మద్రాస్, విశాఖల మీద బాంబులు వేసింది. ఇంగ్లిష్ వాళ్లు వెళ్లిపోయిన తరువాత జర్మనీ లేదా జపాన్ భారత్ మీద ఆధిపత్యం సంపాదించే పరిస్థితిని కల్పించకూడదన్నదే రాజాజీ అభిప్రాయం. అందుకే ఆయన బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు ముస్లింలీగ్‌తో కూడా చర్చలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇందుకు జాతీయ కాంగ్రెస్ వ్యతిరేకించింది. రాజాజీ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ను, గాంధీ–నెహ్రూ నాయకత్వాన్ని రాజాజీ నిరాకరించినా, రాజాజీ అవసరాన్ని నాటి పరిస్థితులలో గుర్తించకుండా తప్పుకునే అవకాశం లేకపోయింది. 1946లో నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అందులో భాగస్వామి కావలసిందంటూ ఆయనను ఆహ్వానించక తప్పలేదు. అత్యంత కీలకమైన నాలుగు శాఖలు– పరిశ్రమలు, రవాణా, విద్య, ఆర్థిక వ్యవహారాలు రాజాజీకి అప్పగించారు. 1948లో మళ్లీ ఆయన అవసరం అనివార్యమైంది. 1947, ఆగస్టు 15న బెంగాల్‌లోని తూర్పు బెంగాల్ పాక్‌లో భాగమైంది. నాటి బెంగాల్ పరిస్థితిని తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. హిందూ–ముస్లిం ఘర్షణలు అంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ముస్లిం లీగ్ నాయకుడు సుహ్రావర్ధి నాయకత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యథేచ్ఛగా రక్తపాతం సృష్టించారు. నౌఖాలి వంటి ఘటనలన్నీ అప్పుడే చోటు చేసుకున్నాయి. ఆ స్థితిలో నెహ్రూ పూర్తి మద్దతుతో రాజాజీని ఆ రాష్ట్ర గవర్నర్‌గా పంపించారు. కానీ సుభాష్ బోస్‌ను విమర్శించిన వ్యక్తిగా రాజాజీ అంటే బెంగాలీలు తీవ్ర వ్యతిరేకత ప్రకటించారు. అయినా తూర్పు ప్రాంతం నుంచి వచ్చిన శరణార్థుల పునరావాసం, శాంతి స్థాపన ధ్యేయంగా రాజాజీ గట్టి కృషి జరిపారని పేరుంది. కొన్ని మాసాల తరువాతే అక్కడ నుంచి వెనక్కి తిరగవలసి వచ్చింది. ఆఖరి బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్‌బాటన్ రెండేళ్లు సెలవులో వెళ్లారు. తన మేనల్లుడు ప్రిన్స్ ఫిలిప్‌కు, యువరాణి ఎలిజబెత్‌కు వివాహం. ఆ సమయంలో మౌంట్‌బాటన్ తాత్కాలిక వైస్రాయ్గా రెండు పేర్లు సూచించారు. ఒకటి సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్, రెండు రాజాజీ. కానీ పటేల్ పేరును నెహ్రూ అంగీకరించలేదు. అలా రాజాజీ భారతీయుడైన తొలి, మలి వైస్రాయ్గా (జూన్ 1948–జనవరి 26,1950) పదవిని అలంకరించి, కీర్తి పొందారు. అంత పెద్ద వైస్రీగల్ భవనంలో ఆయన (నేటి రాష్ట్రపతి భవన్) అతి సాధారణ జీవితం గడిపారు. వైస్రాయ్ పదవిని అలంకరించారు కాబట్టి, స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి పదవికి రాజాజీ అభ్యర్థిత్వమే సహజంగా ముందుకు వస్తుందని అంతా ఆశించారు. నెహ్రూ కూడా ఆయనకే మద్దతు ఇచ్చారు. రాజాజీ కూడా బరిలో దిగాలని ఆశించినా, తరువాత నిర్ణయం మార్చుకున్నారు. కారణం, ఉత్తరాది ఎంపీల ఆధిపత్యం ఒకటని చెప్పినా, క్విట్ ఇండియా ఉద్యమాన్ని రాజాజీ వ్యతిరేకించిన విషయాన్ని విస్మరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. రాజాజీ కాకుండా బాబూ రాజేంద్రప్రసాద్ వైపు జాతీయ కాంగ్రెస్ ఎంపీలు మొగ్గారు. తరువాత మళ్లీ నెహ్రూ ఆహ్వానం మేరకు రాజాజీ కేంద్ర మంత్రి వర్గంలో ఏ శాఖా కేటాయించని మంత్రిగా చేరారు. డిసెంబర్ 15, 1950న పటేల్ మరణంతో హోంశాఖ బాధ్యతను రాజాజీ స్వీకరించారు. కానీ పదిమాసాల తరువాత బయటకు వచ్చేశారు. కారణం– నెహ్రూతో విభేదాలు. చైనా విస్తరణ కాంక్ష గురించి, టిబెట్ సమస్య గురించి పదే పదే రాజాజీ నెహ్రూను హెచ్చరించేవారని చెబుతారు. నిజానికి ఆ ఇద్దరి అభిప్రాయాలకు పొంతన లేదు. నెహ్రూ ఉద్దేశం హిందూ మహాసభ దేశానికి పెద్ద బెడద. కానీ రాజాజీ నమ్మకం, దేశానికి అతి పెద్ద ప్రమాదం కమ్యూనిస్టులు. అంటే సోవియెట్ రష్యా వైపు నెహ్రూ మొగ్గడం ఆయన ఏ మాత్రం ఇష్టపడేవారు కాదు. ఇక్కడ ఒక పరిణామాన్ని గమనించాలి. నాటికి నెహ్రూ జీవించి ఉన్నా ఇది జరిగింది. 1952 మద్రాస్ అసెంబ్లీ ఎన్నికలలో జాతీయ కాంగ్రెస్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన స్థానాలు దక్కలేదు. కమ్యూనిస్టుల నాయకత్వంలోని కూటమి ఆధిపత్యం సాధించింది. ఆ కూటమి, అంటే కమ్యూనిస్టులు అధికారంలోకి రాకుండా నాటి గవర్నర్ శ్రీప్రకాశ్ రాజగోపాలాచారిని ముఖ్యమంత్రిగా నియమించారు. ఆ ఎన్నికలలో పోటీ చేయకున్నా, అటు ప్రధాని నెహ్రూకు గాని, ఇటు రాష్ట్ర నాయకులకుగాని తెలియకుండా గవర్నర్ రాజాజీని ఎంఎల్‌సిగా నామినేట్ చేసి, ముఖ్యమంత్రిగా నియమించారు. తరువాత విపక్షాల ఎంఎల్ఏలను చేర్చుకుని రాజాజీ బలం నిరూపించుకున్నారు. కానీ ప్రత్యేక ఆంధ్రోద్యమం ఆయన కాలంలోనే వచ్చింది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ అప్పుడే జరిగింది. 1953లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. తరువాత ఆయన కాంగ్రెస్‌ను విడిచిపెట్టి స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. భారత స్వాతంత్య్రోద్యమం మీద, పరిపాలన మీద రాజాజీ ముద్ర చెరిపివేయలేనిది. అంటే ఆరు దశాబ్దాల చరిత్ర మీద ఆయన జాడ సుస్పష్టం. ఆయన మౌంట్‌బాటన్ వారసుడు. సర్దార్ పటేల్ వారసుడు. గాంధీగారి వియ్యంకుడు. గాంధీజీ∙నాల్గవ కుమారుడు దేవదాస్ గాంధీకి, తన కుమార్తె లక్ష్మిని ఇచ్చి వివాహం చేశారు. ఇంగ్లిష్‌లో 26 అక్షరాలతో కూడిన చక్రవర్తి రాజగోపాలాచారి పేరేను రాజాజీ అని క్లుప్తీకరించినవారు గాంధీజీయే. గాంధీజీకి ఐదుగురు గొప్ప సన్నిహితులు ఉన్నారని తాతగారి జీవిత చరిత్రలో రాజ్‌మోహన్‌గాంధీ (మనుమడు) రాశారు. పటేల్, నెహ్రూ, అబుల్ కలామ్, రాజేంద్ర ప్రసాద్.. ఆ ఐదో సన్నిహితుడు రాజాజీ. వ్యక్తి స్వేచ్ఛలో, పాలనలో ప్రభుత్వం ప్రమేయం కనిష్టంగా ఉండాలని ఆయన ఆనాడే భావించారు. స్వేచ్ఛా విపణి అవసరమని కూడా వాదించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాట ఆయన ప్రతిభ ముందు చిన్నదే. రామాయణం, భారతం, భాగవతం కూడా ఆయన మళ్లీ రాశారు. సంగీతంతో పరిచయం ఉంది. ఆయన రచనలకు సాహిత్య అకాడెమీ పురస్కారం కూడా దక్కింది. 1954లోనే ఆయన భారతరత్నకు ఎంపికయ్యారు. ఆయన జీవితంలోని వెలుగు చూడని మరొక కోణం, అణ్వాయుధ పరీక్షలకు వ్యతిరేకంగా ఆయన చేసిస కృషి. 1962లో ఈ అంశం మీద అమెరికా ప్రభుత్వంతో మాట్లాడడానికి గాంధీ శాంతి మండలి తరఫున వెళ్లిన బృందానికి నాయకుడు రాజాజీ. అప్పుడే అక్కడ ఉన్న దౌత్యవేత్త కె. నట్వర్‌సింగ్ రాజాజీతో ముచ్చటించారు. మంచి ప్రశ్నలే రాజాజీని ఆయన అడిగారు. దేశ విభజనకి మొదట గాంధీజీ చాలా వ్యతిరేకంగా ఉన్నారు కదా, తరువాత ఎందుకు వెనక్కి తగ్గారు? ఆయన అలా వెనక్కి తగ్గడం అప్పుడు నాలాంటి యువకులందరికీ పెద్ద షాక్ అన్నారు నట్వర్. గాంధీజీ చాలా గొప్పవారు. కాదనలేం. కానీ తరువాతి పరిణామాలతో ఆయన చాలా నిరాశలో కూరుకుపోయారు. చివరికి మీరంతా అంగీకరిస్తే, మీతో పాటే నేను అనేశారు అని చెప్పారు రాజాజీ. ఆపై,‘మీరు జీవిత చరిత్ర ఎందుకు రాయలేదు?’ అని అడిగారు నట్వర్‌సింగ్. ‘ఖాళీ ఎక్కడ దొరికింది?’ అన్నారు రాజాజీ. వైస్రాయ్గా ఉన్నప్పుడు బోలెడు సమయం దొరికి ఉండాలి మీకు అని అన్నారు నట్వర్‌సింగ్. అందుకు నవ్వుతూ సమాధానం చెప్పారు, రాజాజీ. ‘నిజమే, అక్కడ చాలా వెసులుబాటు దొరికిన మాట నిజం. కానీ ప్రధానికీ, ఉప ప్రధానికీ (నెహ్రూ, పటేల్) మధ్య నిత్యం జరిగే కీచులాటలు పరిష్కరించడానికే నా సమయమంతా గడచిపోయింది’ అన్నారు రాజాజీ. ‘అప్పుడే, నీవు నాతో కొలంబియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఉండాల్సింది’ అన్నారు నట్వర్‌తో. ‘అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు చాలా చురుకుగా కనిపించారు. వాళ్లు నన్ను అర్థవంతమైన ప్రశ్నలు అడిగారు. అందులో ధర్మం అంటే ఏమిటి; కర్మ అంటే ఏమిటి అన్న ప్రశ్నలు ఉన్నాయి. ధర్మం అంటే, ప్రపంచ ప్రజలందరి బాధ్యత, అలాగే సహజ ఆదేశం అని చెప్పాను. అందుకు వాళ్లు, అంటే సోషలిజమే కదా అన్నారు. సోషలిజమే, కానీ అది స్వచ్ఛందంగా ఉండాలి. భారత్‌లో సోషలిజం మాదిరిగా కాదు అని చెప్పాను’ అన్నారు రాజాజీ. మళ్లీ, అది బహిరంగ సమావేశం కాదులే, అందుకే అలా చెప్పాను అన్నారాయన. ఉద్యమం, సంస్కృతి, సంస్కరణ, సాహిత్యం, పాలనా దక్షత మేళవించిన అరుదైన నాయకుడు రాజాజీ. ఆయన ప్రభావం కాదనలేనది. గాంధీజీ ఉద్దేశంలో రాజాజీ అంటే భారతీయ ఆత్మను కదలించినవారు. - డా. గోపరాజు నారాయణరావు -
స్త్రీ విముక్తి చేతనం
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా స్త్రీల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న చర్చలూ, పోరాటాలూ, ఉద్యమాలూ మనం చూస్తున్నాం.కానీ వందేళ్ల క్రితమే మహిళల హక్కుల కోసం, స్త్రీల విముక్తికోసం అలుపెరుగని పోరాటం చేసిన ఓ స్త్రీ శక్తిని ఈ రోజు గూగుల్ డూడిల్ జ్ఞాపకం చేసింది. అంతేనా.. ప్రజారోగ్యం కోసం, స్త్రీపురుష సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి 133 వ జయంతి సందర్భంగా ఆమె పుట్టిన రోజును ప్రతియేటా ప్రతి ప్రభుత్వాసుపత్రిలోనూ ‘హాస్పిటల్ డే’ గా జరుపుకోనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వందేళ్ల క్రితమే వైద్యరంగంలోకి! తమిళనాడులోని పుదుకొటై్ట జిల్లాలో ముత్తులక్ష్మీరెడ్డి 1886లో జన్మించారు. కేవలం పురుషులకే పరిమితమైన వైద్యరంగంలోకి అడుగుపెట్టి వంద యేళ్ల క్రితమే 1912లో తొలి మహిళా వైద్యురాలుగా తనదైన చరిత్ర సృష్టించారు. అంతేకాక సర్జరీ విభాగంలో అడుగుపెట్టిన తొలి భారతీయ యువతి కూడా ఈమే. మద్రాసు మెడికల్ కాలేజీలో చదివి మద్రాసులోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో తొలి హౌస్ సర్జన్‌గా ఆమె నియమితులయ్యారు. కేవలం వైద్య రంగంలోనే కాక రాజకీయంగానూ ఆమె తనదైన ముద్ర వేశారు. 1918లో ఇండియన్ ఉమన్స్ అసోసియేషన్‌కి సహ వ్యవస్థాపకులుగా పనిచేశారు. మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎంపికై దేశంలోనే తొలి మహిళా శాసనసభ్యురాలిగా స్త్రీల జీవితాల్లో మార్పుకి ఎనలేని కృషి చేశారు. ఆ రోజుల్లో బాల్యవివాహాల నుంచి బాలికలకు విముక్తి కల్పించాలనే లక్ష్యంతో బాలికలకు కనీస వివాహ వయస్సు అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు ముత్తులక్ష్మీరెడ్డి.. చంద్రమ్మాళ్ అనే దేవదాసీ కూతురు. తమిళనాడులోని పుదుకొట్టే మహారాజా కాలేజీ ప్రిన్సిపల్ నారాయణ స్వామిని ముత్తులక్ష్మీరెడ్డి వివాహం చేసుకున్నారు. మహారాజా హై స్కూల్‌కి ఓ బాలిక రావడం ఆ రోజుల్లో పెద్ద వింత. ముత్తు లక్ష్మీరెడ్డి వస్తే తమ పిల్లలను స్కూల్‌కి పంపించేదే లేదని మగపిల్లల తల్లిదండ్రులు హెచ్చరించినా లెక్కచేయకుండా చదువుని కొనసాగించారు. దేవదాసీ అయిన చంద్రమ్మాళ్ని వివాహం చేసుకోవడంతో ముత్తులక్ష్మీరెడ్డి తండ్రిని ఆయన కుటుంబం వెలివేసింది. దీంతో అమ్మమ్మ ఇంట్లో పెరిగిన ముత్తులక్ష్మీరెడ్డి దేవదాసీల పరిస్థితిని అత్యంత సమీపం నుంచి చూశారు. ఊరుమ్మడి సొత్తుగా భావించి దేవుడి పేరుతో దగాపడ్డ దేవదాసీల జీవితాలను అధ్యయనం చేశారు. వందలాదిమంది దేవదాసీలను ఇంటర్వ్యూ చేసి, ఈ సామాజిక వెనుకబాటుతనానికి సమూలంగా స్వస్తి పలకాలని దేవదాసీ వ్యవస్థ రద్దు బిల్లుని ప్రవేశపెట్టారు. 1930లో ఇద్దరు దేవదాసీ మహిళలు ముత్తులక్ష్మీరెడ్డి ఆశ్రయం కోరారు. నిలువనీడలేని ఆ దేవదాసీ బాలికలను కొద్ది రోజులు తనతో ఉంచుకొని, ఆ తరువాత ఎక్కడైనా వారికి ఆశ్రయం కల్పించే ప్రయత్నం చేశారు. అయితే వారికి ఆశ్రయమిచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ముత్తులక్ష్మీరెడ్డి దేవదాసీ బాలికల కోసం ప్రత్యేకించి ‘అవ్వై హోం’ అనే షెల్టర్ హోంలను నిర్మించి, అక్కడే దేవదాసీ బాలికలకు విద్యాబోధనా ఏర్పాట్లు చేశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో.. స్వాతంత్య్ర సంగ్రామంలో సైతం ముత్తులక్ష్మీరెడ్డి పాత్ర మరువలేనిది. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్న ముత్తులక్ష్మీరెడ్డి అదే ఉద్యమంలో గాంధీ అరెస్టుకి నిరసనగా శాసనసభస్యత్వానికి రాజీనామా చేసి, దేశభక్తిని చాటుకున్నారు. అయితే 1947 డిసెంబర్లో మద్రాసు లెజిస్లేటివ్ అసెంబ్లీలో దేవదాసీ (ప్రివెన్షన్ ఆఫ్ డెడికేషన్) బిల్లు పాస్ అవడంతో ముత్తులక్ష్మీరెడ్డి చిరకాల పోరాటం ఫలించింది. 1954లో చెన్నైలో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన ముత్తులక్ష్మిని 1956 లో ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. తన యావత్ జీవితాన్నీ స్త్రీ సంక్షేమం కోసం, స్రీల హక్కుల కోసం, స్త్రీ విముక్తి కోసం అర్పించిన ముత్తులక్ష్మీరెడ్డి చివరకు 1968లో తన 81వ యేట కన్నుమూశారు. – అరుణ అత్తలూరి -
వెరవని ధీరత్వం
ఇరవయ్యవ శతాబ్దపు తొలి రోజులు. భారతీయ మహిళలకు జెండర్ ఈక్వాలిటీ అనే పదం కూడా తెలియదు. అయినప్పటికీ సమానత్వ సాధన కోసం పోరాడాల్సిన సమయంలో అంతకంటే గొప్ప పోరాటానికి తమ జీవితాలను అంకితం చేశారు. మహిళల గొంతు ఇంటి నాలుగ్గోడలకు కూడా వినిపించని రోజుల్లో జాతీయోద్యమం కోసం గళమెత్తారు. మగవాళ్లతో పాటు ఉద్యమించారు.వారిలో పంజాబ్‌కు చెందిన బీబీ గులాబ్ కౌర్ ఒకరు. జాతీయోద్యమంలో పోరాడిన ధీరవనితల్లో అరుణా అసఫ్ అలీ, లక్ష్మీ సెహగల్, సుచేతా కృపలాని, తారా రాణి, కనకలత వంటి కొన్ని పేర్లు మాత్రమే మనకు గుర్తుకు వస్తుంటాయి. జాతీయోద్యమ ముఖచిత్రంలో తొలి పేజీల్లో చోటు చేసుకున్న ఈ మహిళామణులతోపాటు మరెందరో స్త్రీలు.. రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల స్థాయిలో ఎవరి శక్తి మేరకు వాళ్లు పోరాడారు. ఆ పోరాట యోధులలో పంజాబ్ రాష్ట్రం తమ ఆడపిల్లలకు నేటికీ రోల్‌మోడల్‌గా చూపించుకుంటున్న ఒక యోధురాలు గులాబ్ కౌర్. గమ్యాన్ని మార్చిన ప్రయాణం గులాబ్ కౌర్‌ది పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా, బక్షివాలా గ్రామం. 1890లో పుట్టిన గులాబ్... జాతీయోద్యమంలో అడుగు పెట్టే వరకు అందరిలా మామూలమ్మాయే. మాన్సింగ్ అనే విద్యావంతుడిని పెళ్లి చేసుకుంది. మితిమీరిన సంపన్నులు కాకపోయినా సౌకర్యంగా జీవించగలిగిన సంపన్నత కలిగిన కుటుంబమే వాళ్లది. అయినప్పటికీ అతడికి అమెరికా వెళ్లి బాగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉండేది. భార్యతోపాటు బయలుదేరాడు. ఫిలిప్పీన్స్ మీదుగా అమెరికా చేరడానికి వారి నౌకాయానం మొదలైంది. ఆ ప్రయాణమే గులాబ్‌ను జాతీయోద్యమం వైపు నడిపించింది. ‘విడిపోయిన’ భార్యాభర్తలు అమెరికా ప్రయాణంలో వారితోపాటు గధర్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ల మాటల ద్వారా గులాబ్‌కు వలస పాలనలో మగ్గుతున్న భారతదేశ విముక్తి కోసం పోరాడాల్సిన అవసరం తెలిసి వచ్చింది. భార్యాభర్తల మధ్య ‘వెనక్కి వెళ్లి జన్మభూమి కోసం పోరాటం చేయటమా, ముందుకు వెళ్లి కోరుకున్నంత ధనాన్ని సంపాదించుకుని విలాసవంతంగా జీవించడమా’ అనే చర్చ మొదలైంది. మాన్సింగ్ ప్రయాణాన్ని కొనసాగించడానికే మొగ్గు చూపించాడు. గులాబ్ భర్తను వ్యతిరేకించ లేదు, అలాగని అతడిని అనుసరించనూ లేదు. అతడిని అమెరికాకు పంపించి, తాను ఫిలిప్పీన్స్ నుంచి వెనక్కి వచ్చి జాతీయోద్యమంలో పాల్గొన్నది! అక్షరమే ఆయుధం గులాబ్ కౌర్ పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తల, హోషియార్ పూర్, జలంధర్లలో క్షేత్రస్థాయిలో పనిచేశారు. యువకులను సాయుధ పోరాటం వైపు మరలించారు. వలస పాలనలో భారతీయులకు ఎదురవుతున్న వివక్షను కథనాలుగా రాశారు. అప్పటికే బ్రిటిష్ సేనల నిఘా కళ్లు ఆమె మీదకు ఉన్నాయి. బ్రిటిష్ పాలకుల పట్ల భారతీయుల్లో చెలరేగుతున్న వ్యతిరేకతను ఆమె కళ్లకు కట్టినట్లు రాస్తూ, రహస్యంగా ప్రింట్ చేసి కార్యకర్తల ద్వారా గ్రామాలకు చేరవేశారు. ఆమె రచనలు చదివిన యువకులు ఉత్తేజంతో ఉరికేవాళ్లు. ఆమె అక్షరాలు బ్రిటిష్ పాలకులకు కంట్లో నలుసుగా మారి ప్రశాంతతను దూరం చేశాయి. జర్నలిస్టుగా ఆమె రాసే రాతలు పాఠకులను ఉద్రేక పరిచేటట్లుగానూ, వలస పాలకుల నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయనే నెపంతో ఆమె మీద రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గులాబ్ కౌర్‌ను లాహోర్‌లోని షామి ఖిలా జైల్లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఆ చిత్రహింసలను భరించలేక, రెండేళ్ల శిక్ష కాలం పూర్తి కాకముందే ఆమె 1931లో ప్రాణాలు వదిలారు గులాబ్ కౌర్. పంజాబ్ వాసులు ఇప్పటికీ గులాబ్ కౌర్‌ను గర్వంగా తలుచుకుంటారు. – మంజీర -
ఆదివాసీ విప్లవయోధుడు
బ్రిటిష్ సామ్రాజ్య వలసవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలి ఆదివాసీలలో ‘బిర్సా ముండా’ పేరెన్నికగన్న వ్యక్తి. 1875 నవంబర్ 15న జన్మించిన ‘బిర్సా ముండా’ స్వాతంత్య్ర ఉద్యమంలో ముఖ్య భూమిక పోషిం చారు.. చోటా నాగపూర్ ప్రాంతంలో అడవి మీద ఆధారపడే ఆదివాసుల హక్కుల కోసం పోరాటం నడిపాడు. ఆది వాసులు అందరూ చదువుకోవాలని మొట్టమొదటిసారిగా ఉద్యమం సాగించి చైతన్యం నింపారు. కుంతి, తామర్, బసియా, రాంచి ప్రాంతాలను సరిహద్దులుగా చేసుకుని ఆదివాసీ హక్కుల కోసం మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపారు. ఆదివాసీ ప్రతిఘటన ప్రమాదాన్ని గుర్తించిన బ్రిటిష్ పాలకులు 1900 జనవరి 5న ఆయన ఇద్దరి అనుచరులను కాల్చి చంపారు. ఈ సంఘటన తన మనసును కలచి వేసింది. ఎం ఏ ఫోబ్స్, ఎంసీ సిట్రిడ్ పైడ్ అనే బ్రిటిష్ కమిషనర్లు ‘బిర్సా ముండా’ను చంపితే రూ. 500 ఇస్తామని రివార్డు ప్రకటించారు. బ్రిటిష్ ఆయుధ బలగాలు దుంబర్ హిల్ అనే పర్వత ప్రాంతంలో ‘బిర్సా ముండా’పైన కాల్పులు జరిపారు. ఆ ఘటనలో చాకచక్యంగా తప్పించుకున్నాడు. అయితే జంకోపాయి అడవిలో 3 మార్చి 1900న అరెస్ట్ అయ్యాడు. 460 మంది ఆదివాసీ ప్రజలను 15 క్రిమినల్ కేసులలో బ్రిటిష్ వాళ్ళు అక్రమంగా ఇరికించారు. 19 జూన్ 1900న ‘బిర్సా ముండా’ జైల్లో చనిపోయాడు. బిర్సా ముండా ఉద్యమ ప్రభావ ఫలితంగా 1908లోలో బ్రిటిష్ ప్రభుత్వం చోటా నాగపూర్ కౌలు హక్కు దారు చట్టం తీసుకువచ్చింది కానీ. ఈ చట్టం ద్వారా కూడా ఆదివాసీలకు నష్టం వాటిల్లింది.(రేపు ఆదివాసీ విప్లవ యోధుడు బిర్సా ముండా వర్ధంతి) పి. వెంకటేష్, పాలకుర్తి -
విప్లవోద్యమ అగ్నికెరటం !
సాక్షి, తెనాలి : భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవోద్యమ అగ్నికెరటం అన్నాప్రగడ కామేశ్వరరావు.చిరుప్రాయంలోనే బ్రిటీష్ సైన్యంలో చేరినా, నాలుగేళ్లకే తిరుగుబాటు చేశాడు. మడమ తిప్పని పోరాటంతో బ్రిటిష్ పోలీసులు, గుంటూరు జిల్లా కలెక్టర్ రూథర్‌ఫోర్డ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. ఆ క్రమంలో 18 ఏళ్ల అజ్ఞాతవాసం గడిపారు. తెనాలి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై గుంటూరు జిల్లా మొదటి ఎమ్మెల్యేల బృందంలో సభ్యుడయ్యారు. రాజకీయాలపై ఏవగింపు కలిగి పూనేలో స్థిరపడ్డారు అన్నాప్రగడ కామేశ్వరరావు. యుక్తవయసులోనే విప్లవ భావాలు.. నాదెండ్ల మండలం కనుపర్తిలో 1902 అక్టోబర్ 21న అన్నాప్రగడ రోశయ్య, లక్ష్మీదేవి దంపతుల మూడో కుమారుడిగా కామేశ్వరరావు జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే వయసు ఎక్కువ చెప్పి బ్రిటిష్ సైన్యంలో చేరారు. బ్రిటిష్ అధికారుల ఆదేశంతో 1917లో మెసపుటేమియాలోని బానరలో ప్రజల తిరుగుబాటును అణచివేసేందుకు వెళ్లారు. అక్కడ ‘బద్దు’ జాతి తిరుగుబాటుదారుల ఉపదేశంతో దేశభక్తి ప్రేరేపితుడయ్యాడు. అనంతరం సైన్యంలో ఉంటూనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడంతో ఖైదు చేశారు. 1921లో కరాచీ చేరి విప్లవ పోరాటాల్లో పాల్గొని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. అక్కడా జైలుపాలై 1922లో విడుదలై గుంటూరు వచ్చారు. నాదెండ్ల ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. సొంత పోస్టాఫీసు, సొంత కరెన్సీతో స్వతంత్ర ప్రజాపాలన చేపట్టారు. 1922 జనవరి 22న ఆయన విప్లవ పోరాటంలో తొలిసారిగా నరసరావుపేటలో అరెస్టయ్యారు. కోర్టు ఆయనకు ఏడాది శిక్ష విధించింది. రాజమండ్రి జైలుకు తరలిస్తుండగా వేలాది ప్రజలు అడ్డుకున్నారు. ‘నా బిడ్డతోపాటు స్వాతంత్య్రం కోసం నేనూ పోరాటం చేస్తాను. నా బిడ్డకు అండగా నిలుస్తాను’ అని అన్నాప్రగడ తల్లి లక్ష్మీదేవి చేసిన ఉపన్యాసం ప్రజల్ని ఉత్తేజపరచింది. విప్లవయోధులతో స్నేహం, వివాహం రాజమండ్రి జైల్లో గదర్ పార్టీ నాయకులు పండిత్ జగం రామ్, గణేష్ రఘరామ్, వైశంపాయన్‌లతో పరిచయం ఏర్పడింది. 1922లో జైలు నుంచి విడుదలయ్యాక గౌహతి కాంగ్రెస్ సభలకు వెళ్లారు. 1924లో సావర్కరు, అయ్యరు సలహాపై కరాచీ వెళ్లి కోటంరాజు పున్నయ్య సహకారంతో బెలూచిస్తాన్ చేరారు. అక్కడ ఉద్యమానికి బీజాలు నాటి తిరిగొచ్చి బరోడాలోని ప్రొఫెసర్ మాణిక్యరావు వ్యాయామశాలలో శిక్షణ పొందారు. ఈ క్రమంలో భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, భటుకేశ్వరదత్తు, సురేంద్రనాథ్ పాండే, రాజగురుతో స్నేహం కలిసింది. బరోడాలో పరిచయమైన గుజరాతీ మహిళ సరళాదేవిని వర్ణాంతర వివాహం చేసుకున్నారు. లాహోరు కుట్రకేసులో పోలీసులు అరెస్టు చేయబోగా, బరోడా మహారాజు శాయోజీ గైక్వాడ్ సహకారంతో తప్పించుకున్నాడు. భగత్‌సింగ్‌ను జైలునుంచి తప్పించాలని.. అన్నాప్రగడ కొంతకాలం మాచర్ల వద్ద గల ఎత్తిపోతల జలపాతం వద్ద రహస్య జీవితం గడిపారు. భగత్‌సింగ్‌ను జైలు నుంచి తప్పించి విదేశాలకు పంపించాలని విశ్వప్రయత్నం చేశారు. ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా ఎ.కె.రావు పేరుతో 1931 సెప్టెంబర్ 22న నకిలీ పాస్‌పోర్టు సంపాధించినా ఆ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. 1931 మార్చి 23న భగత్‌సింగ్ బృందాన్ని ఉరితీశాక అదే నకిలీ పాస్పోర్టుతో అన్నాప్రగడ తన భార్యాపిల్లలను దక్షిణాఫ్రికా తీసుకెళ్లి బంధువుల ఇంట్లో వదిలేశారు. ఆ తర్వాత వివిధ దేశాల్లో ఆర్మీ గెరిల్లా యుద్ధరీతిలో శిక్షణ పొందారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మద్రాసు శాసనసభకు.. 1935–36లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1939లో స్వగ్రామం కనుపర్తిలో గృహనిర్బంధం నుంచి తప్పించుకున్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు దేశరక్షణ చట్టం కింద అరెస్టయ్యారు. కమ్యూనిస్టు పార్టీతో విభేదించిన కామేశ్వరరావు క్రమంగా ఆ పార్టీకి దూరమయ్యారు. 1946లో తెనాలి– గుంటూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఉమ్మడి మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. రాజకీయ కాలుష్యం కారణంగా రాష్ట్రాన్ని వదిలి 1956లో పూనాలో స్థిరపడ్డారు. ఇందిరాగాంధీ హయాంలో ఆమె ఆదేశాల ప్రకారం అఖిల భారత స్వాతంత్య్రసమరయోధుల సంఘానికి రెండుసార్లు అధ్యక్షుడిగా దేశమంతటా తిరిగి స్వాతంత్య్రసమరయోధులకు పింఛన్లు ఇప్పించటంలో కీలకపాత్ర వహించారు. అన్నాప్రగడ 1987 జనవరి 30న తుదిశ్వాస విడిచారు. -
కమాండర్ విజయ్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఎఎఫ్)లో జాయిన్ అయ్యారు హీరో అజయ్ దేవగన్. కానీ సినిమా కోసమే. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ విజయ్ కర్నిక్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా తెరకెక్కనుంది. భూషణ్ కుమార్ నిర్మిస్తారు. ఇందులో విజయ్ పాత్రలో నటించనున్నారు అజయ్ దేవగన్. 1971లో ఇండియా–పాకిస్తాన్ యుద్ధం సమయంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. యుద్ధం సమయంలో గుజరాత్‌లోని భూజ్ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్తాన్ భారీ బాంబు దాడి చేసింది. అప్పుడు విజయ్ ఆ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 300 మంది మహిళలను ప్రేరేపించి, భారత ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ల సçహాయంతో ఆ ఎయిర్‌స్ట్రిప్‌లను పునరుద్ధరించి ఆ యుద్ధంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఈ ధైర్యశాలి పాత్రలోనే అజయ్ నటించబోతున్నారు. -
స్వాతంత్య్ర సమరయోధుడి మృతి
పెద్దవూర (నాగార్జునసాగర్) : స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోదుడు యడవెల్లి ఇంద్రసేనారెడ్డి(88) శుక్రవారం స్వగ్రామమైన మండలంలోని తెప్పలమడుగులో గుండెపోటుతో మృతిచెందారు. ఆయ న మరణవార్త తెలుసుకుని గ్రామస్తులు, సమీప గ్రామాల ప్రజలు, బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మృతదేహాన్ని సం దర్శించి నివాళులు అర్పించారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో అందించిన సేవలు, నాడు రజాకార్లు సాగించిన దమనకాండను ఎదురిం చి తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వ్యక్తి యడవెల్లి ఇంద్రసేనారెడ్డి. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రచార వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు నమస్కరించి, పాదా భివందనం చేశారు. మీలాంటి వ్యక్తులు నూటికి ఒక్కరు కూడా ఉండరని మోదీ కొనియాడినట్లు చేప్పేవా రని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఆయన మృతదేహంపై జాతీయ పతాకాన్ని ఉంచారు. ఆదివారం ఆయన అంత్యక్రియలను గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
72 సంవత్సరాల ప్రేమ
స్వాతంత్య్ర సంగ్రామం సమయంలో విడిపోయిన ఓ యువజంట, 72 ఏళ్ల తర్వాత అనూహ్యంగా కలుసుకుంది. ఒకరికోసం మరొకరు చాలా ఏళ్లు ఎదురు చూసి, ఇక జీవితంలో కలవలేమని నిరాశ చెంది, పరిస్థితులతో రాజీ పడిపోయి బతికిన ఆ జంట.. జీవిత చరమాంకంలో కలుసుకోవడం ఒక సినిమా కథనే తలపింపజేస్తోంది. అసలు ఏం జరిగిందంటే.. అది 1946వ సంవత్సరం. కేరళలోని కవుంబాయి గ్రామం. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగుతున్న రోజులు. ఏక్నారాయణన్ నంబియార్ వయసు 17 ఏళ్లు. శారదకి 13 ఏళ్లు.. వారిద్దరికీ కొత్తగా పెళ్లయింది. పట్టుమని పదినెలలు కలిసి ఉన్నారో లేదో రైతు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. భూస్వాములకి వ్యతిరేకంగా రైతన్నలు కదం తొక్కారు. ఆ ఉద్యమంలో నారాయణన్ నంబియార్ తన తండ్రి రామన్ నంబియార్‌తో కలిసి చురుగ్గా పాల్గొన్నారు. ఆ ఉద్యమం హింసాత్మకంగా మారింది. బ్రిటిష్ జవాన్ల కాల్పుల్లో చాలా మంది మరణించారు. నారాయణన్ నంబియార్ అందులో తప్పించుకున్నారు. తండ్రితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వాళ్లిద్దరూ ఇంట్లోనే దాక్కున్నారని బ్రిటిష్ పాలకులు భావించారు. వారి ఆదేశాల మేరకు మలబార్ స్పెషల్ పోలీసులు నంబియార్ ఇంటిపైన దాడి చేశారు. నంబియార్ ఆచూకీ చెప్పకపోతే అందరినీ కాల్చి పారేస్తామని హెచ్చరించారు. ప్రాణభయంతో గజగజలాడుతున్న శారదను చుట్టుపక్కల వారు కాపాడి వాళ్ల పుట్టింటికి పంపేశారు. ఆ తర్వాత నంబియార్ ఆచూకీని కనుక్కున్న పోలీసులు తండ్రీ కొడుకుల్ని జైల్లో పెట్టారు. తరచూ జైళ్లు కూడా మార్చారు. దీంతో భార్యాభర్తలిద్దరికి ఒకరి గురించి మరొకరికి వివరాలు తెలియలేదు. భర్త ఎప్పటికైనా వస్తాడేమోనని శారద ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురు చూసేది. కానీ పుట్టింటివాళ్లు బ్రిటిష్ సైన్యం నంబియార్‌ను చంపేసి ఉంటుందని నిర్ధారించుకొని ఆమెకి బలవంతంగా మళ్లీ పెళ్లి చేశారు. మరోవైపు జైల్లో రామన్ నంబియార్‌ను కాల్చి చంపేశారు. నారాయణన్ శరీరంలో కూడా తూటాలు దిగినా, ప్రాణగండం తప్పింది. పదేళ్ల తరువాత జైలు నుంచి బయటకు వచ్చిన నారాయణన్ నంబియార్‌కి భార్య జాడ తెలియలేదు. దీంతో జీవితంతో రాజీపడి అతనూ మరో పెళ్లి చేసుకున్నారు. అలా ఒకరి పట్ల మరొకరికి అనంతమైన ప్రేమానురాగాలు ఉన్న ఆ జంటని విధి విడదీసింది. అలా ఏళ్లకి ఏళ్లు గడిచిపోయాయి. శారద కుమారుడు భార్గవన్ పెరిగి పెద్దయి వ్యవసాయం చేసేవాడు. ఒకసారి వ్యవసాయ పనుల కోసం కన్నూర్‌కి వచ్చి అనుకోకుండా నారాయణన్ మేనల్లుడు మధుకుమార్‌ను కలుసుకున్నాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు తమ కుటుంబ వివరాలు పంచుకున్నారు. అప్పుడే తెలిసింది మధుకుమార్ మేనమామ నారాయణన్ నంబియారే తన తల్లి శారద మొదటి భర్త అని. 30 ఏళ్ల క్రితమే శారద రెండో భర్త మరణించారు. నంబియార్ భార్య కూడా చాలా ఏళ్ల క్రితమే కన్నుమూసింది. అందుకే వాళ్లిద్దరూ ఆ మాజీ జంటని ఒక్కటి చెయ్యాలని అనుకున్నారు. విషయం విన్న నంబియార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ శారద పరిస్థితి కూడా అదే. నంబియార్ రెక్కలు కట్టుకొని భార్గవన్ ఇంట్లో వాలిపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 72 ఏళ్ల తర్వాత, తొంబై ఏళ్ల వయసులో ఒకరినొకరు చూసుకోగానే వారిద్దరికీ నోటి వెంట మాట కూడా రాలేదు. కళ్లల్లో సుడులు తిరుగుతున్న నీళ్లని అదిమిపెట్టుకుంటూ నంబియార్ శారద తలపై చేయి వేసి ఆర్తితో నిమిరాడు. ఆ చర్య ఒక్కటి చాలు. వారిద్దరి గుండెల్లో ప్రేమ ఎంతలా గూడు కట్టుకొని ఉందో చెప్పడానికి. ఇదంతా చూసిన బంధువులు కూడా వారిద్దరిదీ ఆత్మబంధం అని కీర్తించారు. ఇక తరచూ ఆ రెండు కుటుంబాలు కలవాలని నిర్ణయించుకున్నాయి. ఆనాటి రైతు పోరాటంతోపాటు వీరిద్దరి జీవిత కథని నారాయణన్ మనవరాలు శాంత ‘డిసెంబర్ 30’ అన్న పేరుతో ఒక నవలగా తీసుకువస్తుండడం విశేషం. -
స్వాతంత్య్ర సమరయోధుడి మృతి
సూర్యాపేట రూరల్ : మండలంలోని ఇమాం పేట గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడు నాగిరెడ్డి పాపిరెడ్డి(96) మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుడి కుమారుడు, టీఆర్ఎస్ నాయకుడు నాగిరెడ్డి ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో పాటు కుటుంబసభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో ఎంపీ బడుగు లింగయ్యయాదవ్, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, కట్కూరి గన్నారెడ్డి, వెన్న చంద్రారెడ్డి, కక్కిరేణి నాగయ్యగౌడ్, బుడిగె నవీన్, పుట్టా పుల్లారెడ్డి, సైదిరెడ్డితో పాలు పలువురు ఉన్నారు. -
పోరాట యోధుడు మొగిలయ్య
ఖిలా వరంగల్ : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి వీరమరణం పొందిన పోరాట యోధుడు బత్తిని మొగిలయ్య గౌడ్ జీవిత చరిత్రను భావితరాలకు అందించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసన సభ మండలి నాయకుడు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. బత్తిని మొగిలయ్య 72వ వర్ధంతి, శత జయంతి సందర్భంగా ఆదివారం ఖిలా వరంగల్ తూర్పుకోట హనుమాన్ జంక్షన్లో బత్తిని మొగిలయ్య ఫౌండేషన్ కన్వీనర్ గోపగాని శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో కాంస్య విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా షబ్బీర్ అలీ, టీజేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం, మేయర్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. మొగిలయ్య కాంస్య విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం తీగల జీవన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడారు. మొగిలయ్య గౌడ్ నడియాడిన నేలపై కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమరులను ప్రభుత్వం గుర్తించాలి.. వీరమరణం పొందిన అమరవీరులను ప్రభుత్వం గుర్తించి వారి జీవిత చరిత్రను పుస్తక రూపంలో భావితరాలకు అందించాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మొగిలయ్య రక్తం చిందిన నేలపై ఎంతో మంది ఉద్యమకారులు పుట్టుకొచ్చారన్నారు. మొగిలయ్య పేరు మీద కోటి నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని మేయర్ నన్నపునేని నరేందర్ తెలిపారు. అనంతరం ఇంటిపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరువు సుధాకర్, ఓయూ జేఏసీ అధ్యక్షురాలు బాల లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ మొగిలయ్య త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క, కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పీసీసీ నాయకులు నాగయ్య, బండి సుధాకర్, మహేష్‌గౌడ్, ఇందిరాశోభ, పుల్లా భాస్కర్, టీజేఏసీ నాయకుడు గాదే ఇన్నయ్య, గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్, గట్టగాని రవీందర్, కార్పొరేటర్లు బిల్ల కవిత, బైరబోయిన దామోదర్, సోమిశెట్టి శ్రీలత, బిల్లా శ్రీకాంత్, సోమిశెట్టి ప్రవీణ్, కాంగ్రెస్ గ్రేటర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, కొత్తపెల్లి శ్రీనివాస్, మహిళా విభాగం ఆధ్యక్షురాలు పోశాల పద్మ, వేణుగౌడ్, అచ్చవిద్యాసాగర్, రవీందర్ పాల్గొన్నారు. -
వయసు చిన్న.. బాధ్యత మిన్న
మల్కన్‌గిరి : పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన వయసుఆ బాలికది. తోటి పిల్లలతో చెంగు చెంగున గెంతుతూ ఆటలాడుకోవాల్సిన పసిప్రాయం ఆమెది. అయితే ఎవ్వరూ దిక్కు లేని ఇంటికి తానే అన్నీ అయి బాధ్యతలు మోస్తూ కుటుంబాన్ని నడిపిస్తోంది.జిల్లాలోని మల్కన్‌గిరి సమితి బోయిళపరి గ్రామానికి చెందిన బాలిక జానకీ దురువ(12) ఇంటి పెద్దై బరువు బాధ్యతలు మోస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. అదే గ్రామానికి చెందిన సోంబారీ దురువ(83) సామారీ దురువ అనే స్వాతంత్య్ర సమరయోధుడి భార్య. 1940వ సంవత్సరంలో స్వాతంత్య్ర సమరయోధుడు సహిద్ లక్ష్మణ్‌నాయక్‌తో పాటు సామారీ దురువ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడు. 1942లో మల్కన్‌గిరి జిల్లా మత్తిలి బ్రిటిష్ పోలీస్‌స్టేషన్‌పై చేసిన దాడిలో సామారీ దురువ తీవ్ర గాయాలపాలయ్యాడు. 1942 నుంచి 1944 వరకు సహద్ లక్ష్మణ్‌నాయక్‌తో పాటు బరంపురం జైల్లో ఉండి వచ్చాడు. అనంతరం గిరిజన పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజుతో పాటు ఎన్నో ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొన్నాడు. చివరికి స్వాతంత్య్రం వచ్చిన 1947 తర్వాత కొంత కాలానికి ప్రభుత్వం స్వాతంత్య్ర సమరమోధులకు పింఛన్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సామారీ దురువకు కూడా పింఛన్ వచ్చేది. దీంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. సామారీ దురువకు ఇద్దరు సంతానం. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు. కొడుకు పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. కానీ కూతురికి పెళ్లి చేశాడు. ఆమెకు పుట్టిన బిడ్డ జానకీ దురువ. సామారీ దురువకు 2010వ సంవత్సరానికి రూ.3 వేలు పింఛన్ వచ్చేది. అనారోగ్య కారణాలతో సామారీ దురువ 2010లో చనిపోయాడు. ఢిల్లీ వరకు వెళ్లినా.. తర్వాత సంవత్సరానికే కూతురు, అల్లుడు కూడా చనిపోయారు. వారి బిడ్డయైన జానకీ దురువను అమ్మమ్మ సాంబారీ దురువ పెంచి, పెద్ద చేసింది. ఇప్పుడు ఆమె వృద్ధాప్య దశకు చేరుకోవడంతో ఏ పనీ చేయలేకపోతుండడంతో ఇంటికే పరిమితమయింది. ఇప్పుడు సాంబారీ దురువకు వృద్ధాప్య పింఛన్ రూ.300 మాత్రమే వస్తోంది. తన భర్తకు వచ్చే స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ తనకు ఇప్పించాలని కోరుతూ ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి ఢిల్లీ వరకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో మనుమరాలు జానకీ దురువ కూలీ నాలీ చేస్తూ అమ్మమ్మ, మేనమామను పోషిస్తోంది. ఈ కుటుంబ పరిస్థితులను చూస్తున్న గ్రామస్తులు దిక్కు లేని ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
‘కొండవీటి’కి కన్నీటి వీడ్కోలు
మునుగోడు: తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కొండవీటి జగన్మోహన్రెడ్డికి ప్రజలు శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన జగన్మోహన్రెడ్డి దేశ స్వాతంత్య్ర పోరాటంలో, ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో జిల్లాలో కీలకభూమిక పోషించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం స్వగ్రామమైన పలివెలకు తీసుకువచ్చారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్‌లతోపాటు కమ్యూనిస్టు పార్టీల నాయకులు కొండవీటి భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించి ఆయన వ్యవసాయ బావి వద్ద అంత్యక్రియలు పూర్తి చేశారు. -
నింగికెగిసిన ఉద్యమ నేత
భీమదేవరపల్లి(హుస్నాబాద్): ఉద్యోగాన్ని వదిలి ఉద్యమబాట పట్టిన స్వాతంత్య్ర సమరయోధుడు, రజకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పోరాట యోధుడు, రైతుల పక్షాన నిలబడి, వారి సంక్షేమం కోసం సహకార గ్రామీణ బ్యాంక్‌ను నెలకొల్పిన సహకారవేత్త పడాల చంద్రయ్య(96) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌కు చెందిన ఆయన ప్రస్తుతం స్వాతంత్య్ర సమరయోధుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పడా ల లక్ష్మీనర్సయ్య–అంబమామ్మ కుమారుడైన చంద్రయ్య 5వ తరగతి వరకు ముల్కనూర్‌లో చదివారు. అనంతరం హన్మకొండలో హెచ్ఎస్సీ పూర్తి చేశారు. అనంతరం అజాంజాహీ మిల్లులో ఉద్యోగిగా చేరారు. ఆ ఉద్యోగం మానేసి వ్యవసాయ శాఖలో క్లర్క్‌గా పనిచేస్తున్న రోజుల్లో 1947లో స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఆ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలనే ఆశయంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రామానంద తీర్థ పిలుపు మేరకు కే.వీ నర్సింగరావు, భూపతి కృష్ణమూర్తితో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. చంద్రయ్య అన్న పడాల రాజమౌళి, వదిన వీరమ్మ కూడా కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో పనిచేశారు. ఉద్యమం తీవ్రమవుతున్న క్రమంలో చాంద క్యాంప్‌లో ఆయుధ శిక్షణ తీసుకున్నారు చంద్రయ్య. 1947 చివరలో పోల్సాని నర్సింగరావు నాయకత్వంలో రాయికల్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్లిన ఘటనలో చంద్రయ్య కీలక పాత్ర పోషించారు. అనంతరం వీరూర్ పోలీస్ స్టేషన్‌పై చంద్రయ్య నాయకత్వంలో దాడి చేస్తున్న క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన ఎడమ కాలిలోకి దిగిన బుల్లెట్ మరణించే వరకు కాలిలోనే ఉంది. నాగపూర్‌లో సైతం మిల్ట్రీ శిక్షణ తీసుకున్న ఆయన పీవీ నర్సింహారావు, పోల్సాని నర్సింగారావు, దుగ్గిరా ల వెంకట్రావు తదితరులతో కలిసి ఊరూరా తిరుగుతూ ఉద్యమాలు చేపట్టారు. తిండి గింజల పోరాటంతోపాటు క్విట్ ఇండియా ఉద్యమంలోని పాల్గొని చంద్రయ్య జైలు జీవితం గడిపారు. కాంగ్రెస్ నుంచి సోషలిస్టు పార్టీలోకి... స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా ఏళ్లపాటు కాంగ్రెస్‌లో ఉన్న చంద్రయ్య ఆ పార్టీ విధానాలు నచ్చక సోషలిస్టు పార్టీలో చేరారు. అనంతరం 1952లో పెండ్యాల రాఘవరావు ఆధ్వర్యంలోని పీడీఎఫ్(పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి వచ్చినా రాజ కీయాల్లోకి వెళ్లలేక సాధారణ జీవితం గడిపారు. చంద్రయ్య జీవితంపై పీహెచ్డీ.. చంద్రయ్య జీవితంపై ముల్కనూర్‌కు చెందిన దార్న దివ్య పీహెచ్డీ పూర్తి చేశారు. ఆమె అందించిన సమాచారంతో శ్రీరామానంద ట్రస్ట్‌కు చెంది న దినాకర్ బోరికర్, విలాస్ బావికర్ పడాల చం ద్రయ్య జీవిత చరిత్రను మరాఠీలో ముద్రించారు. బ్యాంకుకు సెలవు.. చంద్రయ్య మరణవార్త తెలియగానే ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి బ్యాంకుకు సెలవు ప్రకటించారు. అనంతరం ర్యాలీగా వచ్చి చంద్రయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియల్లో కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కావేరి సీడ్స్ అధినేత గుండావరపు భాస్కర్‌రావు, హౌస్‌ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, బోయినపల్లి హన్మంతరావు పాల్గొన్నారు. ముల్కనూరు బ్యాంక్ వ్యవస్థాపకుడిగా.. స్వాతంత్ర వచ్చిన తర్వాత రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సిం హారావు, అల్గిరెడ్డి కాశీవిశ్వనాథరెడ్డి తదితరులతో కలిసి ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకును స్థాపించారు. ఆ రోజుల్లో సైకిళ్లపై తిరుగుతూ సహకార రంగంలో చేరాలంటూ రైతులను ప్రోత్సాహించి 1956లో ముల్కనూర్ బ్యాంక్‌ను స్థాపించారు. ఆ బ్యాంకు వ్యవస్థాపక కార్యదర్శిగా 18 ఏళ్లపాటు కార్యదర్శిగా పనిచేశారు. నేడు ఆ బ్యాంక్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విషయం తెలిసిందే. అప్పట్లోనే ఉన్ని, చేనేత, తోళ్ల సహకార సంఘాల ఏర్పాటుకు ఆయన కృషి చేశారు. చంద్రయ్య పార్థీవదేహం కేఎంసీకి అప్పగింత ఎంజీఎం: ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధు డు ముల్కనూర్వాసి పడాల చంద్రయ్య(95) పార్థీవదేహాన్ని బుధవారం వారి కుటుంబ సభ్యులు కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపా ల్ డాక్టర్ సంధ్యారాణికి అప్పగిం చారు. కాళోజీ నారాయణరావు కన్నుమూసిన సమయంలో ఆయన పార్థీవ దేహాన్ని కేఎంసీకి అప్పగించారు. కాళోజీని ఆదర్శంగా తీసుకున్న ఆదర్శంగా తీసు కున్న చంద్రయ్య, వెంకటలక్ష్మి దంపతులు తమ మరణాంతరం తమ పార్థీవదేహాలను స్వీకరించాలని 2003లో కేంఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. 2009లో వెంకటలక్ష్మి చనిపోగా ఆమె పార్థీవదేహాన్ని కేంఎంసీకి అప్పగించారు. ఇప్పు డు చంద్రయ్య పార్థీవదేహాన్ని అప్పగించారు. శరీర దాతల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లారెడ్డి, రాజమౌళి, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.