ఉయ్యాలవాడలో ముగ్గురు!?
‘దండాలు దొరా’ అంటూ భారతీయులు మాకు ఊడిగం చేయాలన్న బ్రిటీషర్లకు ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అని తెలుసు. అంతకు మించి ఆయన గురించి ప్రేక్షకులకు చెప్పాలని ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చేయనున్న చిరంజీవి, దర్శకుడు సురేందర్‌రెడ్డి అండ్ టీమ్ చరిత్రను తవ్వుతోంది.
వీళ్ల తవ్వకాల్లో ఏం బయటపడిందో తెలుసుకోవాలని సినిమా షూటింగ్ మొదలవ్వక ముందే ప్రేక్షకులు ఆరాలు తీస్తున్నారు. సినిమా టీమ్ వదిలేద్దురూ... అంటున్నా వినడం లేదు! తాజా తవ్వకాల్లో బయట పడింది ఏంటంటే... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో ముగ్గురు మహిళలు ముఖ్య భూమిక పోషించారట! ఆ ముగ్గురిలో ఓ పాత్రకు ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ను అనుకుంటున్నారట. చిరంజీవితో పలు హిట్ సిన్మాలు చేసిన విజయశాంతిని ఓ పాత్రకు, శ్రుతీహాసన్‌ను మరో పాత్రకు తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం.