స్వాతంత్య్ర సమరయోధుడు ‘నర్రా’ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నర్రా మాధవరావు(93) శని వారం సాయంత్రం కన్నుమూశారు. ఆస్తమాతో బాధ పడుతున్న ఆయనను చికిత్స కోసం ఈ నెల 24న బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు. 1922 అక్టోబర్ 10న ఆయన జన్మించారు. చిన్నతనంలోనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. పలుమార్లు జైలు జీవితం, అజ్ఞాతవాసం గడిపారు. 1947లో సోషలిస్టు పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ్‌ను జైలులో పెట్టినందుకు నిరసనగా ఉద్యమించి, జైలు కు వెళ్లి వచ్చారు. అలాగే రజాకార్లపై ఆయన చేసిన పోరాటం మరువలేనిది. 1948 సెప్టెంబర్ 16న మహ్మద్‌ఖాన్ అనే రజాకార్‌పై యాసిడ్ బాంబ్‌తో దాడి చేశారు.