వడగాల్పులకు తాళలేక తెలంగాణ సమరయోధుడు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలోని లోహిత గ్రామంలో సోమవారం జరిగింది.
సంగెం(వరంగల్ జిల్లా): వడగాల్పులకు తాళలేక తెలంగాణ సమరయోధుడు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలోని లోహిత గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన తెలంగాణ సమరయోధుడు అడ్డగట్ల కిషన్‌రావు(96) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికి తోడుగా ప్రస్తుతం వీస్తున్న వడగాలులకు సొమ్మసిల్లిపోయిన కిషన్‌రావు రెండు రోజులుగా ఆహారం తీసుకోవడంలేదు.
దీంతో సోమవారం ఉదయం మృతి చెందారు. కిషన్‌రావు రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొని గుల్‌బర్గా జైల్‌లో శిక్ష అనుభవించారు. ఆయనకు భార్య శకుంతల, కుమారులు సోమేశ్వర్‌రావు(లేట్), సంపత్‌రావు, కూతుళ్లు భారతమ్మ, సరస్వతి మనమలు, మనమరాళ్లు ఉన్నారు.