లక్నో: మధ్యప్రదేశ్‌లో 103 ఏళ్ల వ్యక్తి 49 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. తన ఇద్దరు భార్యలు మరణించిన కారణంగా మూడో పెళ్లి చేసుకున్నట్లు ఆయన చెప్పారు. తాత వయసున్న ఆయన తన మూడో భార్యతో బయటకు వెళ్లిన క్రమంలో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హబీబ్ నాజర్(103) మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నాడు. ఆయన ఇద్దరు భార్యలు ఇప్పటికే మరణించారు. దీంతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న ఆయన ఒంటరిగా జీవించాలని అనుకోలేదు. అందుకే మూడో వివాహం చేసుకోవాలనుకున్నారట. అందుకే 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్ అనే మహిళను వివాహం చేసుకున్నారు.
शादी की कोई उम्र नहीं! 103 साल के बुजुर्ग ने 49 की फिरोज जहां से किया निकाह, देखें Video
— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) January 29, 2024
पूरी खबर पढ़ें: https://t.co/rgQhoNLQli#Bhopal #ndtvmpcg #viralvideos pic.twitter.com/dDtcsUOlEm
విహహం అనంతరం నాజర్ మాట్లాడుతూ..' నాకు 103 ఏళ్లు. నా భార్యకు 49. నాసిక్‌లో మొదటిసారి వివాహం అయింది. ఆమె చనిపోయాకు లక్నోలో మరో వివాహం చేసుకున్నారు. రెండో భార్య కూడా చనిపోయింది. నాకు జీవితం ఒంటరిగా అనిపిస్తోంది. ఆరోగ్యంగా ఉన్నాను. ఎలాంటి మెడికల్ సమస్యలు లేవు. అందుకే మరో వివాహం చేసుకున్నాను.' అని తెలిపారు. ఫిరోజ్ జహాన్‌కు ఇది రెండో వివాహం. తన భర్త చనిపోయిన కారణంగా ఒంటరిగా జీవిస్తోంది. 103 ఏళ్ల హబీబ్ నాజర్‌కు స్థానికంగా మంచి పేరు కూడా ఉంది. ఆయనకు చూసుకునే వారు ఎవరూ లేనందున వివాహానికి జహాన్ ఒప్పుకుంది.
ఇదీ చదవండి: Preeti Rajak: సుబేదార్ ప్రీతి
Comments
Please login to add a commentAdd a comment