లక్డీకాపూల్ : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, సామాజిక కార్యకర్త టి.సావిత్రీదేవి(95) సోమవారం కన్నుమూశారు. పంజగుట్టలోని నాగార్జున సర్కిల్‌లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కిన్నెర, మాధురితో పాటు నలుగురు మనవరాళ్లు ఉన్నారు. వీరిలో నిర్వి తన ప్రతిభా పాటవాలతో చిన్న వయసులోనే సెలబ్రిటీగా నిలిచారు. సోమవారం సావిత్రీదేవి అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరిపారు. పలువురు ప్రముఖులు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment