భూమి పూజ చేస్తున్న ప్రొఫెసర్ కోదండరాం
ఖిలా వరంగల్ : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి వీరమరణం పొందిన పోరాట యోధుడు బత్తిని మొగిలయ్య గౌడ్ జీవిత చరిత్రను భావితరాలకు అందించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసన సభ మండలి నాయకుడు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. బత్తిని మొగిలయ్య 72వ వర్ధంతి, శత జయంతి సందర్భంగా ఆదివారం ఖిలా వరంగల్ తూర్పుకోట హనుమాన్ జంక్షన్‌లో బత్తిని మొగిలయ్య ఫౌండేషన్ కన్వీనర్ గోపగాని శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో కాంస్య విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా షబ్బీర్ అలీ, టీజేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం, మేయర్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. మొగిలయ్య కాంస్య విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం తీగల జీవన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడారు. మొగిలయ్య గౌడ్ నడియాడిన నేలపై కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
అమరులను ప్రభుత్వం గుర్తించాలి..
వీరమరణం పొందిన అమరవీరులను ప్రభుత్వం గుర్తించి వారి జీవిత చరిత్రను పుస్తక రూపంలో భావితరాలకు అందించాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మొగిలయ్య రక్తం చిందిన నేలపై ఎంతో మంది ఉద్యమకారులు పుట్టుకొచ్చారన్నారు. మొగిలయ్య పేరు మీద కోటి నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని మేయర్ నన్నపునేని నరేందర్ తెలిపారు.
అనంతరం ఇంటిపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరువు సుధాకర్, ఓయూ జేఏసీ అధ్యక్షురాలు బాల లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ మొగిలయ్య త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క, కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పీసీసీ నాయకులు నాగయ్య, బండి సుధాకర్, మహేష్‌గౌడ్, ఇందిరాశోభ, పుల్లా భాస్కర్, టీజేఏసీ నాయకుడు గాదే ఇన్నయ్య, గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్, గట్టగాని రవీందర్, కార్పొరేటర్లు బిల్ల కవిత, బైరబోయిన దామోదర్, సోమిశెట్టి శ్రీలత, బిల్లా శ్రీకాంత్, సోమిశెట్టి ప్రవీణ్, కాంగ్రెస్ గ్రేటర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, కొత్తపెల్లి శ్రీనివాస్, మహిళా విభాగం ఆధ్యక్షురాలు పోశాల పద్మ, వేణుగౌడ్, అచ్చవిద్యాసాగర్, రవీందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment