సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరాం
నర్సంపేట రూరల్: ప్రజా సమస్యలపై తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీ నిరంతరం పోరాడుతోందని ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నా రు. భూముల క్రమబద్ధీకరణ, సాదాబైనామా తదితర కార్యక్రమాలతో భూములపై హక్కులను కల్పించి, నేడు కాలరాసేందుకు ప్రభుత్వం యత్ని స్తోందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాస్‌పుస్తకాల్లో 90శాతం ఏదో ఒక తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించ డం లేదన్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు పెరుగుతున్నాయని తెలిపారు.
ఆయా సమస్యల పరిష్కారం కోసం సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట చేపడుతున్న ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు. టీజేఎస్ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి అన్ని స్థాయిల్లో కమిటీలను వేయనున్నట్లు తెలిపారు. టీజేఎస్ రాష్ట్ర నాయకులు అంబటి శ్రీనివాస్, చాపబాబు, బొనగాని రవీందర్, షేక్‌జావీద్, బొట్ల పవన్, భూక్యగోపాల్‌నాయక్, అంగోతు వినోద్, మామిండ్ల ఐలయ్య, బుల్లెట్ వెంకన్న, నందగిరి రజనీకాంత్, బందెల సదానందం, గుంటి సంజీవ, రాజశేఖర్, జాఫర్, యాకుబ్, హనుమంత్, లక్ష్మయ్య, శివ, అనిల్ పాల్గొన్నారు.
పెద్దకోర్పోలు గ్రామంలో...
నెక్కొండ(నర్సంపేట): టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తెలంగాణ జన సమితి పార్టీ పోరా డుతోందని ఆ పార్టీ అధినేత ప్రోఫెసర్ కోదండరాం అన్నారు. చైతన్యయాత్రలో భాగంగా నెక్కొం డ మండలం పెద్దకోర్పోలు గ్రామంలో ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయని, నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, ఉపాధి మార్గాలను మరిచిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు.
60 ఏళ్లలో రూ.63వేల కోట్ల అప్పు ఉంటే.. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో అప్పులను రెట్టింపు చేశారని అన్నారు. భూ ప్రక్షాళనతో సమస్యలు పరిష్కారం కాకపోగా రైతులకు కొత్త చిక్కులు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. టీజేఎస్ సోమవారం చేపట్టే రైతు దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అంబటి శ్రీనివాస్, వరంగల్ కన్వీనర్ బోనగాల రవీందర్, వెంకన్న, వినోద్‌నాయక్ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరాం
Comments
Please login to add a commentAdd a comment