
మునుగోడు: తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కొండవీటి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన జగన్‌మోహన్‌రెడ్డి దేశ స్వాతంత్య్ర పోరాటంలో, ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో జిల్లాలో కీలకభూమిక పోషించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం హైదరాబాద్‌లో మృతి చెందారు.
ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం స్వగ్రామమైన పలివెలకు తీసుకువచ్చారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్‌లతోపాటు కమ్యూనిస్టు పార్టీల నాయకులు కొండవీటి భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించి ఆయన వ్యవసాయ బావి వద్ద అంత్యక్రియలు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment