
స్వాతంత్య్ర సమరయోధుడు శాస్త్రి మృతి
సీతంపేట (విశాఖ): మహాత్మా గాంధీ కలలుగన్న సమసమాజ స్థాపనకు అలుపెరగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు కొల్లూరు సత్యనారాయణ శాస్త్రి (95) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. గత నెల 18న బాత్‌రూమ్‌లో జారి పడటంతో ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు శస్తచికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంగళవారం సాయంత్రం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య రమణమ్మ ఉన్నారు.