శతాధిక స్వాంతంత్య్ర సమరయోఢుడు, తమళనాడుకు చెందిన సీపీఎం సీనియర్ నేత ఎన్.శంకరయ్య(102) బుధవారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చైన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ నేరుగా ఆస్పత్రికి వచ్చి ఎన్. శంకరయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎన్. శంకరయ్య పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తీసుకెళ్లే ముందు అభిమానుల సందర్శనార్థం సీపీఎం కార్యాలయానికి తరలించనున్నారు. ఎన్. శంకరయ్య కన్నుమూత గురించి తెలియజేస్తూ తమిళనాడు సీపీఎం సోషల్ మీడియా ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. కామ్రేడ్ శంకరయ్య భౌతికంగా మనకు దూరమైనా చరిత్ర ఉన్నంత వరకూ ఆయన మనతోనే ఉంటారని పేర్కొంది.
స్వాంతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర
అత్యంత సీనియర్ నాయకుడు, స్వాంతంత్య్ర సమరయోధుడిగా పేరొందిన ఎన్.శంకరయ్య భారత స్వాంతంత్య్ర ఉద్యమంలో చరుకైన పాత్ర పోషించారు. ఎన్నో విద్యార్థి ఉద్యమాలను నడిపించారు. 1995 నుంచి 2002 వరకు సీపీఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. తన రాజకీయ ప్రస్థానంలో మధురై వెస్ట్, మధురై ఈస్ట్ నియోజకవర్గాల నుంచి తమిళనాడు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.
தோழர் என்.எஸ். மறைவு! #CPIM மாநிலச் செயலாளர் தோழர் கே.பாலகிருஷ்ணன், தமிழ்நாடு முதல்வர் மு.க.ஸ்டாலின் ஆகியோர் நேரில் அஞ்சலி செலுத்தினர். #ComradeNS #NSankaraiah #FreedomFighter #CommunistLeader #CPIMLeader More: https://t.co/46hnp062DE pic.twitter.com/h8lPadt4Pp
— CPIM Tamilnadu (@tncpim) November 15, 2023
Comments
Please login to add a commentAdd a comment