sankaraiah
-
కామ్రేడ్ శంకరయ్య కన్నుమూత.. నేరుగా ఆస్పత్రికి వెళ్లిన సీఎం స్టాలిన్
శతాధిక స్వాంతంత్య్ర సమరయోఢుడు, తమళనాడుకు చెందిన సీపీఎం సీనియర్ నేత ఎన్.శంకరయ్య(102) బుధవారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చైన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ నేరుగా ఆస్పత్రికి వచ్చి ఎన్. శంకరయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎన్. శంకరయ్య పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తీసుకెళ్లే ముందు అభిమానుల సందర్శనార్థం సీపీఎం కార్యాలయానికి తరలించనున్నారు. ఎన్. శంకరయ్య కన్నుమూత గురించి తెలియజేస్తూ తమిళనాడు సీపీఎం సోషల్ మీడియా ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. కామ్రేడ్ శంకరయ్య భౌతికంగా మనకు దూరమైనా చరిత్ర ఉన్నంత వరకూ ఆయన మనతోనే ఉంటారని పేర్కొంది. స్వాంతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర అత్యంత సీనియర్ నాయకుడు, స్వాంతంత్య్ర సమరయోధుడిగా పేరొందిన ఎన్.శంకరయ్య భారత స్వాంతంత్య్ర ఉద్యమంలో చరుకైన పాత్ర పోషించారు. ఎన్నో విద్యార్థి ఉద్యమాలను నడిపించారు. 1995 నుంచి 2002 వరకు సీపీఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. తన రాజకీయ ప్రస్థానంలో మధురై వెస్ట్, మధురై ఈస్ట్ నియోజకవర్గాల నుంచి తమిళనాడు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. தோழர் என்.எஸ். மறைவு! #CPIM மாநிலச் செயலாளர் தோழர் கே.பாலகிருஷ்ணன், தமிழ்நாடு முதல்வர் மு.க.ஸ்டாலின் ஆகியோர் நேரில் அஞ்சலி செலுத்தினர். #ComradeNS #NSankaraiah #FreedomFighter #CommunistLeader #CPIMLeader More: https://t.co/46hnp062DE pic.twitter.com/h8lPadt4Pp — CPIM Tamilnadu (@tncpim) November 15, 2023 -
‘కిలిమంజారో’పై సీఎం జగన్ ఫొటో ప్రదర్శన
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని చిల్డ్రన్ స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా సభ్యులైన కె.శంకరయ్య, శీలం ఈశ్వరయ్య టాంజానియా దేశంలో ప్రపంచంలోనే అత్యంత రెండో ఎత్తయిన కిలిమంజారో మంచు పర్వత శిఖరాన్ని అధిరోహించారు. ఈ నెల 17న హైదరాబాద్ నుంచి టాంజానియా బయలుదేరిన వారు 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ ఘనత సాధించారని క్లబ్ కార్యదర్శి జి.శాంతమూర్తి శనివారం గుంటూరులో వెల్లడించారు. కిలిమంజారో పర్వతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోటోను ప్రదర్శించి శంకరయ్య తన అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే జాతీయ జెండాను సైతం ఎగురవేశారు. అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థలో శంకరయ్య స్పోర్ట్స్ కోచ్గా పని చేస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతంలోని మారుమూల తండా దాపుపల్లికి చెందిన శీలం ఈశ్వరయ్య డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోరటపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నెల్లి శంకరయ్య (53) అనే రైతు ఇంటిలో ఉరి వేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే శంకరయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వడదెబ్బతో ఇద్దరు మృత్యువాత
ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతకు తాళలేక ఇద్దరు మృత్యువాతపడ్డారు. దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బాణావత్ రాంచందర్(70) శుక్రవారం వడదెబ్బకు తాళలేక ఇంట్లోనే చనిపోయాడు. అలాగే, నెన్నెల మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన వేల్పుల శంకరయ్య(65) గురువారం తోట కాపలాకు వెళ్లాడు. సాయంత్రానికి అతడు అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించటంతో శుక్రవారం వేకువజామున ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. -
నడిరోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త
అదనపు కట్నం, మనస్పర్థలతో దారుణం గొల్లపల్లి: అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడంతో పాటు.. మనస్పర్థలు పెరగడంతో చివరకు భార్యను భర్తే నడిరోడ్డుపై కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం గోవింద్పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలం గోవింద్పల్లికి చెందిన గుర్రం లక్ష్మి-శంకరయ్య దంపతుల పెద్ద కూతురు మమతను ధర్మపురి మండలం మద్దునూర్కు చెందిన సోమ మల్లేశంకు ఇచ్చి 2010 లో వివాహం చేశారు. వీరికి కొడుకు శివ(4), కూతురు సహస్ర(2) ఉన్నారు. వివాహ సమయంలో రూ.5.50 లక్షలకట్నం, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. మమత పెళ్లి జరిగిన కొద్ది రోజులకే చిన్న కూతురు రజితకు పెళ్లి చేశారు. మమత కన్నా రజితకు ఎక్కువ కట్నం ఇచ్చారని మమత భర్త మల్లేశం అదనపు కట్నం తీసుకురావాలని భార్యను రెండేళ్ల నుంచి వేధించడం మొదలు పెట్టాడు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఏడు నెలల క్రితం వచ్చిన మల్లేశం వరకట్న వేధింపులు మానుకోలేదు. దీంతో మమత తండ్రి వచ్చి కూతురిని, పిల్లలను తీసుకెళ్లాడు. తర్వాత మల్లేశం వెళ్లి కొడుకును బలవంతంగా తీసుకెళ్లాడు. అయితే, మమత నెలరోజుల నుంచి జగిత్యాలలో కుట్టుమిషన్ నేర్చుకుంటోంది. రెండు రోజుల క్రితం ధర్మపురి పోలీస్స్టేషన్లో భర్తపై వరకట్నం కేసు పెట్టింది. ఈ క్రమంలో మమతపై ఆగ్రహం పెంచుకున్న మల్లేశం ఆమె కుట్టుమిషన్కు వెళ్లే సమయంలో హత్య చేయూలని పథకం వేసుకున్నాడు. బుధవారం ఉదయం 10 గంటలకు మమత గోవింద్పల్లి బస్టాండ్కు నడుచుకుంటూ వస్తుండగా నడిరోడ్డుపైనే పదునైన ఆయుధంతో మెడపై నాలుగుసార్లు నరికాడు. దీంతో మమత అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు అడ్డుకునేలోపే మల్లేశం పరారయ్యూడు. మమత తండ్రి శంకరయ్య ఫిర్యాదుతో మల్లేశంపై పోలీసులు కేసు నమో దు చేశారు. కాగా.. మల్లేశం ఆస్తి ఇద్దరు పిల్లలకు చెందేలా చర్యలు తీసుకోవాలని మమత తల్లిదండ్రులు రోడ్డుపై ఆందోళన చేశారు.