ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతకు తాళలేక ఇద్దరు మృత్యువాతపడ్డారు. దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బాణావత్ రాంచందర్(70) శుక్రవారం వడదెబ్బకు తాళలేక ఇంట్లోనే చనిపోయాడు. అలాగే, నెన్నెల మండలం మెట్‌పల్లి గ్రామానికి చెందిన వేల్పుల శంకరయ్య(65) గురువారం తోట కాపలాకు వెళ్లాడు. సాయంత్రానికి అతడు అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించటంతో శుక్రవారం వేకువజామున ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు.
వడదెబ్బతో ఇద్దరు మృత్యువాత
Published Fri, Apr 22 2016 12:35 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement