Veteran
-
వెటరన్... ఆపేదేలేదు!
వయసు పై బడడం అంటే కలల దారులు మూసివేయడం కాదు. గంభీర ఏకాంతవాసం కాదు. క్షణక్షణం ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం. ‘వయసు పై బడింది’ అని ఎప్పుడూ భారంగా అనుకోలేదు ఈ మహిళలు. ‘ఈ వయసులో ఆటలేమిటీ!’ అనే నిట్టూర్పు వారి నోటి నుంచి ఎప్పుడూ వినిపించలేదు. వెటరన్ అథ్లెట్స్‌లో సత్తా చాటుతూ నిత్యోత్సాహానికి నిలువెత్తు చిరునామాగా నిలుస్తున్నారు...ఇటీవల గుంటూరులో ఏపీ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 6వ ఏపి మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో... రేస్ వాక్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకున్న శిరీషారెడ్డి, షాట్‌పుట్, జావెలిన్ థ్రో, జంప్స్లో మూడు బంగారు పతకాలు గెలుచుకున్న ఎం.లక్ష్మి, పరుగులో మూడు బంగారు పతకాలు సాధించిన వి. విజయ... ఆత్మవిశ్వాసం, నిత్యోత్సాహం మూర్తీభవించిన మహిళలు.గుంటూరుకు చెందిన విజయకు పదిహేనేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలలో ఒకరు దివ్యాంగురాలు. ఇళ్లలో పనిచేస్తూ, ఇంటి ముందు టిఫిన్ బండి పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం తాను పనిచేసే ఇంటి యజమాని కుమార్తె కోసం మైదానంలో అడుగుపెట్టింది. ఒక జిమ్ ట్రైనర్ సూచన ప్రకారం వెటరన్ అథ్లెటిక్స్ కోసం సాధనప్రారంభించింది. పతకాలు సాధించడం ఇప్పుడామెకు పరిన్టిగా మారింది. క్యాన్సర్ బారిన పడినప్పుడు ‘ఇక నా పని అయిపోయింది’ అని నిరాశలోకి వెళ్లిపోలేదు శిరీష. ఆ మనోధైర్యానికి కారణం...క్రీడాస్ఫూర్తి. నెల్లూరు చెందిన 71 ఏళ్ల శిరీషా రెడ్డికి ఆటల్లో గెలవడం వల్ల వచ్చినవి పతకాలు మాత్రమే కాదు. అంతకంటే విలువైన ఆత్మవిశ్వాసం తాలూకు శక్తులు!విశాఖపట్టణానికి చెందిన 86 ఏళ్ల లక్ష్మి వయసు న్తికేళ్ల దగ్గరే ఆగిపోవడానికి కారణం ఆటలు! ‘ఆటలు ఆనందాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి’ అంటున్న లక్ష్మి ఆరోగ్య రహస్యం... క్రమశిక్షణ. ఆ ఉక్కు క్రమశిక్షణకు మూలం... ఆటలు.‘విరమణ అనేది ఉద్యోగానికే. ఆటలకు కాదు’ అంటున్న నెల్లూరు జిల్లా కావలికి చెందిన 76 సంవత్సరాల కోటేశ్వరమ్మ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకుంటోంది.వెటరన్ అంటే మాటలు కాదు... గెలుపు దారిలో విరామం లేకుండా ఉత్సాహమే శక్తిగా పరుగులు తీయడమే అని చెప్పడానికి ఈ వెటరన్ అథ్లెట్లు తిరుగులేని ఉదాహరణ.– మురమళ్ళ శ్రీనివాసరావు,సాక్షి, గుంటూరు– కె.ఎస్., సాక్షి, కావలి, నెల్లూరు జిల్లాక్యాన్సర్ నుంచి బయటపడి...గత 35 ఏళ్ళ నుండి క్రీడాసాధన చేస్తున్నాను. 2011లో క్యాన్సర్ సోకింది. కొంత కాలం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మొండి ధైర్యంతో దానిని సులభంగా జయించాను. 2021లో కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆటలు ఆడడం కష్టమయ్యింది. అయినా వెనకడుగు వేయలేదు. ఏడు పదుల వయసులో ఎన్నో జాతీయ స్థాయి పతకాలు సాధించాను.– ఎల్. శిరీషా రెడ్డి, నెల్లూరుకష్టాల్లోనూ నవ్వడం నేర్చుకున్నాఆరు పదుల వయసు దాటినా కష్టాలు మాత్రం వెన్నంటే ఉంటున్నాయి. అందుకే అవి చుట్టుముట్టినప్పుడల్లా నవ్వుతోనే ఎదుర్కొంటాను. ఆ నవ్వుకు కారణం ఆటలు. పదకొండు అంతర్జాతీయ వెటరన్స్ పోటీల్లో మూడు బంగారు పతకాలతో సహా మొత్తం పదకొండు పతకాలు సాధించాను. గుంటూరులో జరిగిన పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించాను. ఊపిరి ఉన్నంత వరకు పోటీల్లో పాల్గొంటాను.– వి.విజయ, గుంటూరు 86 = ఎనర్జిటిక్ఉదయించే సూర్యుడు అస్తమించే వరకు తన విధి నిర్వర్తిస్తాడు. పుట్టుకకు, మర ణానికి మధ్యలో ఉండే జీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా నడిపించాలనేది నా సిద్ధాంతం. నేను పూర్తి శాకాహారిని. ఎక్కడ పోటీలున్నా ఒంటరిగానే వెళతాను. క్రమశిక్షణకుప్రాణం ఇస్తాను.– ఎం.లక్ష్మి, 86, విశాఖపట్నంకావాలి... ఇలాంటి శక్తిఅంతర్జాతీయ వెటరన్ క్రీడాకారిణిగా రాణిస్తున్న నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన ఏనుగుల కోటేశ్వరమ్మ వయస్సు 76 ఏళ్లు. అయినా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అసమాన క్రీడా నైపుణ్యాన్ని ఆమె ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 125, జాతీయ స్థాయిలో 115, అంతర్జాతీయ స్థాయిలో 17 పతకాలు సాధించింది. కావలిలోని జవహర్ భారతి కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించింది. పదవీ విరమణ చేసినప్పటికీ ఆటలపై ఆసక్తితో పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో న్ల్గొంటూ విజేతగా నిలుస్తోంది. లక్షల రూన్యలు ఖర్చు అయ్యే అంతర్జాతీయ క్రీడా పోటీల్లో న్ల్గొనడానికి తనకు వచ్చే పింఛన్ నగదును దాచుకొని వాటితో క్రీడాపోటీల్లో న్ల్గొంటోంది.ఆటలే ఆరోగ్యం... మహాభాగ్యంసింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, జన్న్ లలో బంగారు పతకాలు సాధించినప్పటికీ, స్వీడన్ లో సాధించిన కాంస్య పతకం సంతోషాన్ని ఇచ్చింది. ఒలింపిక్స్‌లో న్ల్గొన్న క్రీడాకారులతో పోటీపడి అన్నిరకాల ప్రీ పోటీల్లో విజేతగా నిలవడంతో చివరి పోటీల్లో న్ల్గొనే అర్హత రావడమే చాలా గొప్ప విషయం. రోజూ గ్రౌండ్లోప్రాక్టీస్ చేస్తూనే ఉంటా. అందువల్లనే ఆరోగ్య సమస్యలు లేకుండా హుషారుగా ఉంటాను. – ఏనుగుల కోటేశ్వరమ్మ -
వామపక్ష దిగ్గజ నేత సీతారాం ఏచూరి ప్రత్యేక ఫొటోలు..
-
కొలెస్ట్రాల్ కంట్రోల్‌తో సెంచరీ కొట్టేశాడు! ఎలాగంటే..
గోర్డాన్ గ్రెన్లే హంట్ అనే వ్యక్తి 104వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఈ ఏజ్‌లో కూడా తన పనులు తాను చేసుకుంటాడు. అతను రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి వ్యక్తి. ఆ టైంలో ఆక్స్‌ఫర్డ్‌లోని కార్ల తయారీ సంస్థ బ్రిటిష్ లైలాండ్ రాయల్ ఎలక్ట్రిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్‌లో పనిచేసేవాడు. అతనికి విపరీతమైన ఆకలి ఉందని, అయినా సమతుల్యమైన ఆహారం తీసుకుని జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకుంటానని చెబుతున్నాడు. ప్రతిరోజు తాను ఇంట్లో చేసిన అల్పహారాన్నే తీసుకుంటానని చెబుతున్నాడు. ఎక్కువ ఫ్రూట్ సలాడ్ తీసుకుంటానని, తరుచుగా సాల్మన్ చేపలు, చిప్స్ తీసుకుంటానని అన్నారు. అంతేగాదు అతడి శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు కూడా నార్మల్‌గానే ఉన్నాయి. అతడి రెండో భార్య 2019లో మరణించడంతో డోర్సెట్‌లోని లార్క్సెలీస్ రెంట్ హోమ్‌లో నివశిస్తున్నాడు. తన తండ్రి దీర్ఘాయువుకి తిండిపై ఉన్న ఇష్టం, శ్రద్ధేనని కొడుకు ఫిలిప్స్ చెబుతున్నాడు.తన తండ్రి గుర్రం మాదిరిగా వేగంగా తింటాడు, డైట్ దగ్గరక వచ్చేటప్పటికీ చాలా స్ట్రిట్‌గా ఉంటాడని అన్నారు. అతను తన వయసు గురించి చాలా గర్వంగా ఫీలవ్వుతుంటాడని చెబుతున్నాడు. ఆ వృద్ధుడి సుదీర్ఘ జీవితానికి కొలస్ట్రాల్ స్థాయిలు ఎలా తోడ్పడయ్యన్నది సవివరంగా చూద్దాం.కొలస్ట్రాల్ స్థాయిలు జీవితకాలాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే..కొలస్ట్రాల స్థాయిని అదుపులో ఉంచుకోవడం వల్ల సుదీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. అధిక కొలస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేగాదు పరిశోధనల్లో వారానికి రెండు భాగాలు సాల్మాన్ చేపలు తీసుకోవడం వల్ల అధిక కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. సాల్మన్ చాలా పోషకాలను కలిగి ఉన్న ఆహారాల్లో ఒకటి. ప్రతి వంద గ్రాముల సాల్మన్లో 25 గ్రాముల ప్రోటీన్, 11 గ్రాముల కొవ్వు, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్, విటమిన్ బీ12, సెలీనియం, నియాసిన్, పాంతోతేనిక్ ఆమ్లం, థియామిన్, ఫోలిక్ యాసిడ్, పోటాషియం, ఫాస్ఫరస్ తదితరాలు ఉంటాయి. అలాగే శాకాహారులకు కొలస్ట్రాల్‌ని అదుపులో ఉంచుకునేందుకు తీసుకోవాల్సినవి..నట్స్: బాదం, వాల్నట్ వంటి కొన్ని గింజలలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.అవకాడోలు: మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉన్న అవకాడోలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.చిక్కుళ్ళు: బీన్స్, కాయధాన్యాలు, చిక్పీస్ వంటి కొన్ని చిక్కుళ్ళు దానిలోని ఫైబర్లు కొలస్ట్రాల్‌ని కరిగించి జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతాయి.(చదవండి: ఆ వ్యాధులకు తప్పుదారి పట్టించే ఆ ఫుడ్ ప్రకటనలే కారణం!) -
కామ్రేడ్ శంకరయ్య కన్నుమూత.. నేరుగా ఆస్పత్రికి వెళ్లిన సీఎం స్టాలిన్
శతాధిక స్వాంతంత్య్ర సమరయోఢుడు, తమళనాడుకు చెందిన సీపీఎం సీనియర్ నేత ఎన్.శంకరయ్య(102) బుధవారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చైన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ నేరుగా ఆస్పత్రికి వచ్చి ఎన్. శంకరయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎన్. శంకరయ్య పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తీసుకెళ్లే ముందు అభిమానుల సందర్శనార్థం సీపీఎం కార్యాలయానికి తరలించనున్నారు. ఎన్. శంకరయ్య కన్నుమూత గురించి తెలియజేస్తూ తమిళనాడు సీపీఎం సోషల్ మీడియా ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. కామ్రేడ్ శంకరయ్య భౌతికంగా మనకు దూరమైనా చరిత్ర ఉన్నంత వరకూ ఆయన మనతోనే ఉంటారని పేర్కొంది. స్వాంతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర అత్యంత సీనియర్ నాయకుడు, స్వాంతంత్య్ర సమరయోధుడిగా పేరొందిన ఎన్.శంకరయ్య భారత స్వాంతంత్య్ర ఉద్యమంలో చరుకైన పాత్ర పోషించారు. ఎన్నో విద్యార్థి ఉద్యమాలను నడిపించారు. 1995 నుంచి 2002 వరకు సీపీఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. తన రాజకీయ ప్రస్థానంలో మధురై వెస్ట్, మధురై ఈస్ట్ నియోజకవర్గాల నుంచి తమిళనాడు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. தோழர் என்.எஸ். மறைவு! #CPIM மாநிலச் செயலாளர் தோழர் கே.பாலகிருஷ்ணன், தமிழ்நாடு முதல்வர் மு.க.ஸ்டாலின் ஆகியோர் நேரில் அஞ்சலி செலுத்தினர். #ComradeNS #NSankaraiah #FreedomFighter #CommunistLeader #CPIMLeader More: https://t.co/46hnp062DE pic.twitter.com/h8lPadt4Pp — CPIM Tamilnadu (@tncpim) November 15, 2023 -
కెనడా ప్రధాని క్షమాపణలు
ఒట్టావా: కెనడా పార్లమెంట్లో నాజీల తరుపున యుద్ధంలో పాల్గొన్న వ్యక్తిని ప్రశంసించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో క్షమాపణలు తెలిపారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకోకుండా సభలో సభ్యులు ప్రశంసలు కురిపించారని వెల్లడించిన ట్రూడో.. నాజీల దురాఘాతంలో నష్టపోయినవారికి ఇబ్బందికరమైన అంశంగా ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కెనడాలో పర్యటించారు.ఈ క్రమంలో హౌజ్ ఆఫ్ కామన్స్ సభలో ఆయన ప్రసంగించారు. ఇదే సమయంలో నాజీల తరుపున యుద్ధంలో పాల్గొన్న యారోస్లావ్ హుంకా(98)ను స్పీకర్ ఆంథోనీ రోటా ఆహ్వానించారు. సభలో సభ్యులందరూ హుంకాకు చప్పట్లతో ఆహ్వానం పలికి ప్రశంసించారు. స్పీకర్ రోటా.. హుంకాను హీరోగా అభివర్ణించారు. ఇది కాస్త వివాదంగా మారింది. ఎందుకు వివాదం..? యారోస్లావ్ హుంకా రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నాయకత్వంలో పనిచేసిన నాజీల ప్రత్యేక సైన్యంలో పోరాడారు. ఈ యుద్ధంలో యూదులను అంతం చేయడానికి హిట్లర్ భయంకరమైన హింసకు పాల్పడ్డాడు. అయితే.. ఈ యుద్ధ సమయంలో ఉక్రెయిన్ నాజీల ఆధీనంలో ఉండేది. స్వయంగా జెలెన్స్కీ కూడా తన యూదు బంధువులను ఎందరినో కోల్పోయారు. ఇలాంటి రాక్షస క్రీడ జరిపిన యుద్ధ పక్షాన నిలపడిన హుంకాను కామన్స్ సభలో సత్కరించడం వివాదంగా మారింది. యారోస్లావ్ హుంకా ఒకప్పుడు ఉక్రెయిన్ దేశస్థుడు. కెనడాకు వలస వచ్చి.. ఇక్కడే స్థిరపడ్డాడు. ఈ వివాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడారు. క్షమాపణలు కోరినట్లు స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఒత్తిడితో హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్ ఆంథోనీ రోటా కూడా ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. అటు.. ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ దేశ అధ్యక్షుని పర్యటనలో ఇలాంటి ఘటనలు జరగడం దేశానికి అవమానంగా పేర్కొన్నారు. అయితే.. స్పీకర్ రోటా హుంకాను ఆహ్వానించే అంశాన్ని ప్రభుత్వంతో పంచుకోరని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వివాదంపై రష్యా కూడా స్పందించింది. యుద్ధంలో ప్రేరేపించి ఉక్రెయిన్ను అంతం చేసే దిశగా పశ్చిమ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. కెనడాలో జరిగిన ఈ సంఘటన ఇందుకు ఉదాహారణగా పేర్కొన్నారు. ఇదీ చదవండి: పన్నూపై కెనడా హిందూ సంఘాల ఆగ్రహం -
కొడుకు చేసిన పనికి తండ్రికి శిక్ష.. పార్టీ సభ్యత్వం రద్దు..
లడఖ్: లడఖ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత నజీర్ అహ్మద్(74) కుమారుడు నెలరోజుల క్రితం ఒక బౌద్ధ మహిళను ప్రేమించి ఆమెతో కలిసి ఉడాయించాడు. దీంతో ఆగ్రహించిన స్థానిక బీజేపీ పార్టీ పెద్దలు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. అచ్చం 'దేశముదురు' సినిమా కథను తలపిస్తూ లడఖ్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్ తనయుడు మంజూర్ అహ్మద్(39) ఓ బౌద్ధ యువతిని ప్రేమించాడు. తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లాడాడు. వివాహానికి నజీర్ కుటుంబమంతా వ్యతిరేకమే అయినప్పటికీ బీజేపీ పార్టీ మాత్రం ఈ మతాంతర వివాహంలో ఆయన పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ప్రాధమిక పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు లడఖ్ బీజేపీ పార్టీ చీఫ్ ఫంచోక్ స్టాంచిన్ బుధవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేశారు. పార్టీ బహిష్కరణ తర్వాత నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. నా కుమారుడికి ఆ బౌద్ధ యువతికి 2011లోనే నిఖా జరిగి ఉంటుంది. గతనెల వారు మళ్ళీ కోర్టు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి నాకు గానీ నా కుటుంబ సభ్యులకు గానీ ఎవ్వరికీ ఇష్టం లేదు. వారి పెళ్లి జరిగినప్పుడు నేను ఇక్కడ లేను. హాజ్ యాత్రకు వెళ్లాను. తిరిగొచ్చాక విషయం తెలిసినప్పటి నుండి వాడి కోసం గాలిస్తూనే ఉన్నాను. శ్రీనగర్ తదితర ప్రాంతాలన్నీ వెతికాను. ఎక్కడా వారి ఆచూకీ దొరకలేదు. నా కొడుకు పెళ్ళికి నన్నెందుకు నిందిస్తున్నారో నాకైతే అర్ధం కాలేదని వాపోయారు. ఇది కూడా చదవండి: చెంపదెబ్బకి అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడ్డాడు.. తర్వాత.. -
మల్కపేట రెండో పంపు వెట్‌రన్ సక్సెస్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ రెండో పంపు వెట్‌రన్ విజయవంతమైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీలో భాగంగా సిరిసిల్ల శివారులోని మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) జలాశయం బ్యాక్‌వాటర్‌ను సొరంగం ద్వారా 12.03 కిలోమీటర్ల దూరంలోని మల్కపేటకు మళ్లించారు. మల్కపేట వద్ద రూ.504 కోట్లతో మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌లోకి 30 మెగావాట్ల పంపుతో సర్జిపూల్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోశారు. మే 23న మొదటి పంపు వెట్‌రన్ నిర్వహించారు. తాజాగా రెండో పంపు వెట్‌రన్‌ను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.40 గంటలకు ప్రారంభించి 1.40 గంటల వరకు కొనసాగించారు. ట్రయల్‌రన్ విజయవంతమైనట్లు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ప్రకటించారు. రెండో పంపు ట్రయల్‌రన్ విజయవంతం కావడంతో మంత్రి కె.తారక రామారావు ఇంజనీర్లను అభినందించారు. దీంతో కాళేశ్వరం 9 ప్యాకేజీ తొలి దశ పూర్తయిందని అధికారు లు తెలిపారు. సిరిసిల్ల మధ్యమానేరు జలాశయం నీరు 12 కిలోమీటర్లు సొరంగం ద్వారా ప్రయాణించి ధర్మారం వద్ద నిర్మించిన సర్జిపూల్‌కు చేరాయి. ఆ నీటిని రెండో పంపు ద్వారా మల్కపేట రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. రాష్ట్ర ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, 9వ ప్యాకేజీ ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ జి.శ్రీనివాస్‌రెడ్డి, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంబోత్సవానికి ఏర్పాట్లు మల్కపేట రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోసే కాళేశ్వరం 9వ ప్యాకేజీలో రెండు పంపుల వెట్‌రన్ విజయవంతం కావడంతో ఈ పంపులను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 15 –20 రోజుల్లో కేసీఆర్ చేతుల మీదుగా 9వ ప్యాకేజీని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవల ఎల్లారెడ్డిపేటలో ప్రకటించారు. దీంతో మధ్యమానేరు నుంచి ఏడాదిలో 120 రోజులపాటు 11.635 టీఎంసీల నీటిని రెండు మోటార్లతో ఎత్తిపోసి మల్కపేట రిజర్వాయర్‌ను నింపి.. అక్కడి నుంచి గంభీరావుపేట మండలం సింగసముద్రం మీదుగా బట్టల చెరువు, నర్మాల ఎగువమానేరు జలాశయానికి గోదావరి జలాలను చేర్చనున్నారు. ఈ క్రమంలో మధ్యలో ఉండే వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపుతారు. ఈ పథకం కింద సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 96,150 ఎకరాలకు సాగునీరు అందనుంది. వానాకాలంలో 12వేల ఎకరాలకు మల్కపేట రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలని భావిస్తున్నారు. 9 డి్రస్టిబ్యూటరీల ద్వారా పొలాలకు సాగునీరు అందించనున్నట్టు అధికారులు తెలిపారు. -
సంగీత విద్వాంసుడు సంగీతరావు కన్నుమూత
సాక్షి, చెన్నై: సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు, శతాధిక వృద్ధుడు అయిన పట్రాయని సంగీతరావు ఇకలేరు. కరోనా మహమ్మారి బారిన పడ్డ ఆయన బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతం లో చెన్నైలో కన్నుమూశారు. సినీ సంగీత దిగ్గజం ఘంటసాలకు సహాయకుడిగా పనిచేసిన ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమా ర్తెలు. 1920 నవంబర్ 2న విజయనగరం జిల్లా కిండాం అగ్రహారంలో జన్మించిన సంగీతరావు వయసు 101 ఏళ్లు. పట్రాయని వారి సంగీత కుటుంబంలో మూడోతరానికి చెందిన సంగీత రావు అసలు పేరు నరసింహమూర్తి. అయితే, హార్మోనియం వాయించడంలో దిట్ట అయిన ఆయన సంగీతరావుగానే సుపరిచితులు. ఘంటసాల స్వర సహాయకుడిగా 1974 వరకు సుమారు పాతికేళ్ల పాటు తెలుగు సినిమాతో సంగీతరావు జీవితం ముడిపడివుంది. సాహితీ రంగంలోనూ సంగీతరావు ఎంతో ప్రతిభను కనపరిచారు. తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, జగతి వంటి ప్రముఖ పత్రి కలలో సంగీతరావు రచనలు వచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం సంగీతరావును కలై మామణి బిరుదుతో సత్కరించింది. చదవండి: వరదగూడు.. కనువిందు చేసెను చూడు! -
అరవైలలో...ఆరోగ్యమే ఒక పతకం
జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వాళ్లకు వయసు అడ్డంకి కాదు. ఈ సిద్ధాంతాన్ని నమ్మినవాళ్లు.. ఆరు పదులు దాటిన వయసులోనూ ‘సెంచరీలు కొట్టే వయస్సు మాది..’ అంటూ దూసుకెళ్తుంటారు. అభిరుచులు, అలవాట్లకు అనుగుణంగా ఇష్టమైన రంగాల్లో రాణిస్తుంటారు. ఆదర్శంగా నిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వారిలో గుంటూరులో నివాసం ఉంటున్న 67 ఏళ్ల పెంట్యాల సుబ్బాయమ్మ మొదటి వరుసలో ఉంటారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో షార్ట్‌పుట్, డిస్క్‌త్రో, జావెలిన్, స్విమ్మింగ్, పరుగు పోటీల్లో సత్తా చాటుతూ వెటరన్ అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారామె. ఆరోగ్యమే ఒక పతకం అంటున్నారు. ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన సుబ్బాయమ్మకు అదే జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులకు చెందిన పెంట్యాల జైహింద్ గురూజీతో వివాహమైంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన సుబ్బాయమ్మ భర్త వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాలు కూడా నిర్వహించేవారు. పిల్లలు ప్రయోజకులై, పెళ్లిళ్లు చేసుకుని ఉద్యోగాల్లో ఉండటంతో 2006లో ద్రోణాదుల నుంచి సుబ్బాయమ్మ, జైహింద్‌లు గుంటూరు వచ్చి స్థిరపడ్డారు. స్వగ్రామంలో యోగా శిక్షణ ఇస్తుండే సుబ్బాయమ్మ.. గుంటూరుకు వచ్చాక రోజూ ఎన్టీఆర్ స్టేడియానికి వెళ్లేవారు. 2008లో లాఫింగ్ క్లబ్లో చేరారు. క్లబ్ నిర్వాహకులు ఆమె ఉత్సాహం గమనించి క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించారు. దీంతో ఈమె వెటరన్ అథ్లెట్‌గా రూపాంతరం చెందారు. షార్ట్‌పుట్, డిస్క్‌త్రో, జావెలిన్, స్విమ్మింగ్, పరుగు విభాగాల్లో సుబ్బాయమ్మ మైదానంలో దిగారంటే పతకం సాధించకుండా వెనుతిరగరు అనే పేరుంది. సుబ్బాయమ్మను క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించడంతో పాటు తాను కూడా వెటరన్ అథ్లెట్‌గా రాణిస్తున్నారు ఆమె భర్త 77 ఏళ్ల జైహింద్. నడక, పరుగు విభాగాల్లో భార్యతోపాటు వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. నిత్య సాధన సుబ్బాయమ్మ రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి గంటన్నర పాటు యోగా, వ్యాయామం చేసి రన్నింగ్, వాకింగ్ ప్రాక్టీస్ చేస్తారు. మొలకెత్తిన గింజలు, పండ్లు, డ్రైప్రూట్స్, చిరుధాన్యాలు ఆహారంగా తీసుకుంటారు. మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఎక్కువ ఉప్పు, నూనెలు ఆమె తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండవు. ఆరోగ్యం కోసం దంపతులిద్దరూ నేటికీ ప్రతిరోజు 3 గంటల పాటు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకవైపు క్రీడల్లో రాణిస్తూనే ఇద్దరూ సేంద్రియ వంటకాలను గుంటూరు నగరవాసులకు పరిచయం చేస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నాలుగు ఎకరాల సొంత పొలంలో కొంత కౌలుకు ఇచ్చి కొంత భాగంలో తేనెటీగలు పెంచుతూ స్వచ్ఛమైన తేనెను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్న ఈ దంపతులు తమ కాళ్ల మీద తాము నిలబడే ప్రయత్నం చేయడమే కాదు... అందరూ ఆరోగ్యంగా ఉండేందుకూ కృషి చేయడం అభినందనీయం. విజేత సుబ్బాయమ్మ 2012 : బెంగుళూరు–జాతీయ స్థాయి 100, 200 మీటర్ల పరుగు పందెం పోటీల్లో ప్రథమ స్థానం. 2013 : బాపట్ల–రాష్ట్ర స్థాయి పోటీల్లో 100, 200 మీటర్ల పరుగు పందెం పోటీల్లో ప్రథమ స్థానం. 2014 : నెల్లూరు–100, 200, 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం. 2015 : గుంటూరు–35 వ మాస్టర్స్ వెటరన్ అథ్లెటిక్స్‌లో డిస్కస్‌త్రో, 400 మీటర్ల పరుగుపందెంలో మొదటి స్థానం, జావెలిన్ త్రో, 100 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానం. 2016 : మధ్యప్రదేశ్–జాతీయ స్థాయి పోటీల్లో డిస్కస్ త్రో, జావెలిన్,100 మీటర్ల పరుగులో బంగారు పతకం. 2017 : బెంగళూరు–జాతీయ స్థాయి పరుగు పందెం పోటీలో బంగారు పతకం. 2018 : హైదరాబాద్–జాతీయ స్థాయి ఈత పోటీల్లో సుబ్బాయమ్మ మూడు విభాగాల్లో పతకాలు. 2020: కేరళ–జాతీయ స్థాయి పోటీల్లో డిస్కస్‌త్రో, జావెలిన్‌లో ప్రథమ బహుమతి. ఆరోగ్యవంతమైన సమాజం కోసం మా క్రీడాస్ఫూర్తిని సమాజంలో నలుగురికి పంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయడం మా లక్ష్యం. రాష్ట్రం సహా, దేశ వ్యాప్తంగా ఎక్కడ క్రీడల పోటీలున్నా నేను, నా భర్త వెళ్లి పాల్గొంటాం. ఉత్సాహం ఉన్న మా వయసు వారిని మాతో కలుపుకుని, ప్రాక్టీస్ చేయడంతో పాటు, వారిని కూడా పోటీలకు తీసుకువెళుతుంటాం. ఎవరమైనా మితాహారం, నిత్యం వ్యాయామం చేయడం వల్లే ఆరోగ్యంగా ఉంటాం. – సుబ్బాయమ్మ, వెటరన్ క్రీడాకారిణి – వడ్డే బాలశేఖర్. ‘సాక్షి’, గుంటూరు ఫోటోలు : గజ్జల రామ్‌గోపాల్‌రెడ్డి -
మరో బాహుబలి మోటార్ వెట్‌రన్ సక్సెస్
రామడుగు (చొప్పదండి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీపూర్ పంపుహౌస్ (గాయత్రి)లో నీటి పారుదల శాఖ అధికారులు సోమవారం రాత్రి 9.15 గంటలకు 4వ బాహుబలి విద్యుత్ మోటార్ వెట్‌రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం అధికారులు ఇక్కడ 5వ బాహుబలి మోటార్‌కు విజయవంతంగా వెట్‌రన్ నిర్వహించిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 4వ మోటార్ వెట్‌రన్‌కు ఏర్పాట్లు చేసుకున్న అధికారులు కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించారు. అనంతరం రాత్రి వెట్‌రన్ నిర్వహించారు. రాష్ట్ర సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి స్విచ్ఆన్ చేసి మోటార్‌ను ప్రారంభించారు. ఈ వెట్‌రన్ కార్యక్రమంలో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్, డీఈఈ గోపాలకృష్ణ, ఏఈఈలు సురేశ్, రమేశ్, శ్రీనివాస్ ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. దాదాపు గంటపాటు ఈ వెట్‌రన్‌ను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. -
పి.టి. ఉషకు ఐఏఏఎఫ్ అవార్డు
న్యూఢిల్లీ: భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్ పి.టి. ఉషను అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ప్రతిష్టాత్మక ‘వెటరన్ పిన్’ అవార్డుకు ఎంపిక చేసింది. మన దేశంలో విశేష కృషికి గుర్తింపుగా ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారంలాంటిదే ‘వెటరన్ పిన్’ అవార్డు. తను ఈ అవార్డుకు ఎంపికైన విషయాన్ని ఆమె ట్విట్టర్లో తెలియజేసింది. ‘ప్రపంచ అథ్లెటిక్స్‌లో సుదీర్ఘ కాలం పాటు చేసే సేవలకు గుర్తింపుగా ఐఏఏఎఫ్ వెటరన్ పిన్ అవార్డు అందజేస్తారు. అలాంటి విశిష్ట పురస్కారానికి నేను ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది. ఐఏఏఎఫ్‌కు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేసింది. దోహాలో సెప్టెంబర్ 24న జరిగే ఐఏఏఎఫ్ కాంగ్రెస్‌లో 55 ఏళ్ల ఉషకు ఈ అవార్డు అందజేస్తారు. -
ప్రముఖ నిర్మాత కన్నుమూత
హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, వివాహ్, ప్రేమ్ రతన్ థన్ పాయో లాంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రాజశ్రీ ఫిలింస్ అథినేత రాజ్ కుమార్ బర్జాత్య గురువారం ఉదయం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. తండ్రి అడుగు జాడల్లో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన రాజ్ కుమార్ ఎన్నో విమర్శకుల ప్రశంసలందుకున్న ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. టెలివిజన్ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రాజ్‌కుమార్. దాదాపు అన్ని ప్రముఖ హిందీ చానల్స్‌లోనూ రాజ్‌కుమార్ నిర్మాణంలో తెరకెక్కిన సీరియల్స్ ప్రసారమయ్యాయి. తన వారసుడిగా సూరజ్ బర్జాత్యను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాజ్‌కుమార్, తనయుడి దర్శకత్వంలో మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, వివాహ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. దాదాపు 70 సంవత్సరాలుగా సినీ రంగంతో సంబంధాలు ఉన్నా రాజ్‌కుమార్ బర్జాత్య మృతి పట్ల బాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. -
పతకాలను వెనక్కి ఇవ్వనున్న మాజీ సైనికులు!
న్యూఢిల్లీ: సైనికులకు 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' విధానాన్ని అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని, దీనికి నిరసనగా మాజీ సైనికులు తమకు లభించిన పతకాలను వెనక్కివ్వాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 11, 12 తేదీలలో మాజీ సైనికాధికారులు పతకాలను వెనక్కిచ్చే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలుస్తోంది. మాజీ జవాన్లు డిమాండ్ చేస్తున్న ఓఆర్ఓపీని ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించిందని పంద్రాగస్టున ప్రధాని చెప్పినప్పటికీ.. దీనిని ఎప్పటినుంచి అమలు చేసేది పేర్కొనలేదు. ఇటీవల దేశంలో పెరిగిపోతున్న అసహనానికి నిరసనగా పెద్ద ఎత్తున రచయితలు, మేధావులు తమకు లభించిన జాతీయ అవార్డులను వెనక్కి తిరిగి ఇస్తున్న విషయం తెలిసిందే. -
పొత్తూరి వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆవిష్కంణ
-
రభస..
ఎమ్మెల్యే కాశప్ప వ్యవహారంపై అట్టుడికిన ఉభయ సభలు అరెస్ట్‌కు పట్టుబట్టిన బీజేపీ శెట్టర్, సిద్ధు తీవ్ర వాగ్వాదం స్పీకర్ పోడియం వద్ద విపక్ష సభ్యుల ఆందోళన సభలు సోమవారానికి వాయిదా సాక్షి ప్రతినిధి, బెంగళూరు : స్థానిక యూబీ సిటీలోని స్కై బార్లో పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాగలకోటె జిల్లా హనగుంద ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్ (కాంగ్రెస్)ను తక్షణమే అరెస్టు చేయాలని ప్రతిపక్ష బీజేపీ రెండో రోజు శుక్రవారమూ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో సభ్యులను శాంతింపజేయడానికి పదే పదే చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభను సోమవారానికి వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎమ్మెల్యే ఆచూకీ గురించి ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. ఈ దశలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగాయి. మూడు సార్లు బీజేపీ సభ్యులు ధర్నాకు దిగారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్‌ల మధ్య ఆవేశ పూరితంగా వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఈరోజు దీనిపై ప్రకటన చేస్తానని చెప్పిందని శెట్టర్ గుర్తు చేశారు. ప్రశ్నోత్తరాలు ముగిశాక దీనిపై మాట్లాడతామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ప్రతిష్టంభన నెలకొంది. తొలుత బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఆచూకీ గురించి మీకేమైనా తెలుసా అంటూ స్పీకర్‌ను ప్రశ్నించారు. అనంతరం మాట్లాడిన శెట్టర్ ఇదో తలవంపుల సంఘటన అంటూ, తానేమీ తప్పు చేయలేదని చెబుతున్న ఎమ్మెల్యే ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారని నిలదీశారు. దీనిపై ప్రశ్నించడానికి ముఖ్యమంత్రి, హోం మంత్రి, న్యాయ శాఖ మంత్రుల్లో ఎవరూ సభలో లేరని తెలిపారు. ఈ దశలో ప్రవేశించిన ముఖ్యమంత్రి బీజేపీపై ఎదురు దాడికి దిగారు. మంత్రిగా ఉన్నప్పుడు హాలప్ప చేసిన పని, ఎమ్మెల్యే సతీమణి ఆత్మహత్య కేసు, శాసన సభలో బీజేపీ ఎమ్మెల్యేలు నీలి చిత్రాలు చూడడం లాంటి సంఘటలను ఉటంకించడంతో బీజేపీ సభ్యులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఎమ్మెల్యే విషయమై సమాధానం చెబుతామంటున్నా, ఎందుకు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ నిలదీశారు. ప్రశ్నోత్తరాలను జరగనీయండి, సభకు ఆటంకం కల్పించవద్దు అని కోరారు. ఈ సందర్భంగా శెట్టర్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ హయాంలో కొందరు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావించడంలో సభలో మళ్లీ అలజడి చెలరేగింది. మధ్యలో కాంగ్రెస్ సభ్యుడు రమేశ్ కుమార్ మాట్లాడుతూ ‘పార్టీలు అందరూ చేసుకుంటారు. విజయానంద అవివేకంగా ప్రవర్తించాడు. తగులుకోకుండా ఉండాల్సింది’ అని అనడంతో గందరగోళంలోనూ సభ్యులు నవ్వుకున్నారు. ఈ దశలో స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే బీజేపీ సభ్యులు పట్టు వీడకుండా ధర్నాకు దిగారు. శాసన మండలిలో.. పోలీసులపై ఎమ్మెల్యే విజయానంద దాడి చేశారన్న ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సభ్యులు శాసన మండలిలో శుక్రవారం ధర్నాను కొనసాగించారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రభుత్వం నుంచి ప్రకటన చేయించాలని చైర్మన్ డీహెచ్. శంకరమూర్తిని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత ప్రకటన చేయిస్తానని ఆయన హామీ ఇచ్చినప్పటికీ, ధర్నా విరమించలేదు. ఈ సందర్భంగా పాలక ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభా నాయకుడు ఎస్ఆర్. పాటిల్ జోక్యం చేసుకుని, ప్రశ్నోత్తరాలను రద్దు చేసి, వేరే విషయాన్ని చేపట్టిన ఉదాహరణలు లేవని గుర్తు చేశారు. జేడీఎస్ నాయకుడు బసవరాజ హొరట్టి కూడా ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించాలని బీజేపీ సభ్యులను కోరారు. చివరకు చైర్మన్ ప్రశ్నోత్తరాల తర్వాత హోం మంత్రితో ప్రకటన చేయిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ప్రశ్నోత్తరాల అనంతరం సోమవారం ప్రకటన చేస్తానని హోం మంత్రి తెలపడంతో బీజేపీ సభ్యులు మళ్లీ పోడియం వద్దకు దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు.