న్యూఢిల్లీ: సైనికులకు 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' విధానాన్ని అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని, దీనికి నిరసనగా మాజీ సైనికులు తమకు లభించిన పతకాలను వెనక్కివ్వాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 11, 12 తేదీలలో మాజీ సైనికాధికారులు పతకాలను వెనక్కిచ్చే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలుస్తోంది.
మాజీ జవాన్లు డిమాండ్ చేస్తున్న ఓఆర్‌ఓపీని ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించిందని పంద్రాగస్టున ప్రధాని చెప్పినప్పటికీ.. దీనిని ఎప్పటినుంచి అమలు చేసేది పేర్కొనలేదు. ఇటీవల దేశంలో పెరిగిపోతున్న అసహనానికి నిరసనగా పెద్ద ఎత్తున రచయితలు, మేధావులు తమకు లభించిన జాతీయ అవార్డులను వెనక్కి తిరిగి ఇస్తున్న విషయం తెలిసిందే.