One Rank One Pension
-
కేంద్రంపై ‘సుప్రీం’ ఆగ్రహం.. రూ.2లక్షల జరిమానా..!
ఢిల్లీ : పెన్షన్ల జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలు చేయకపోవడపై కేంద్రంపై సీరియస్ అయ్యింది.భారత సైన్యంలో రీటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు చెల్లించే కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వన్‌ర్యాంక్ వన్ పెన్షన్ చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రక్రియలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని మండిపడింది.ఈ క్రమంలో కేంద్రానికి రెండు లక్షలు జరిమానా విధించింది. ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చిన సుప్రీం కోర్టు నవంబర్ 14లోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. లేదంటే పెన్షన్ పెంపుపై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది సుప్రీం కోర్టు. పెన్షన్ విషయంలో దాఖలైన పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. -
ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక
షిమ్లా: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ)పై నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ‘ఓన్లీ రాహుల్ ఓన్లీ ప్రియాంక ’అని వ్యంగ్యంగా అర్థం చెప్పగా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ‘దేశం ప్రస్తుతం ఓడొమోస్ (ఓవర్ డోస్ ఆఫ్ ఓన్లీ మోదీ ఓన్లీ షా)తో ఇక్కట్లు పడుతోంది’అని అన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ)కి కాంగ్రెస్ అర్థం మార్చేసిందని, ఓఆర్ఓపీ అంటే వారి దృష్టిలో ’ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యంగ్యంగా అన్నారు. 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం కూడా సైనికులను పట్టించుకోలేదని, మోదీ ప్రభుత్వం వచ్చాకనే మాజీ సైనికులకు నిజాయితీగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ అమలు చేసిందని ఆయన తెలిపారు. ‘ దశాబ్దాలుగా అధికారంలో ఉండి మీరప్పుడు పేదరికం గురించి ఎందుకు పట్టించుకోలేదు. బీజేపీ తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలు, పథకాల ద్వారానే దేశంలో పేదరికం తగ్గుతోంది’అని షా వ్యాఖ్యానించారు. రాహుల్ జోకరేగా: ప్రియాంక గాంధీని ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ట్రంప్ కార్డుగా వ్యవహరిస్తున్నారని, మరి ఇన్నిరోజులు జోకర్‌గా రాహుల్ వ్యవహరించారా అని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సరోజ్ పాండే అన్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్ కు ప్రియాంకా గాంధీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై కాంగ్రెస్ నేత ఆజాద్ ప్రియాంకను కాంగ్రెస్ ట్రంప్ కార్డుగా వ్యవహరించిన విషయం విదితమే. -
ఆ జవాను కాంగ్రెస్ సర్పంచ్‌గా గెలిచాడు!
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌వోపీ) అమలు విషయమై ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ మాజీ జవాను రాంకిషన్ గ్రెవాల్‌పై మరోసారి కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ విమర్శలు గుప్పించారు. రాంకిషన్ మానసిక పరిస్థితిపై బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీకేసింగ్ తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని ఆరోపించారు. రాంకిషన్ కాంగ్రెస్ టికెట్‌పై సర్పంచ్‌గా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారని చెప్పారు. ఏదిఏమైనా ఆయన ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆయనకు ఆత్మహత్య చేసుకోవడానికి సల్ఫాస్ ట్యాబ్లెట్లు ఎవరు ఇచ్చారనే దానిపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని పేర్కొన్నారు. బ్యాంకు డబ్బు విషయమై ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రాం కిషన్ సాయం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించి.. అది లభించకపోయి ఉంటే.. అప్పుడు తమ తప్పు అయ్యేదని, ఈ వ్యవహారంలో ప్రభుత్వం తప్పేమీ లేదని పేర్కొన్నారు. ఆర్మీ జవాన్లుకు మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చినమేరకు ఓఆర్‌వోపీ పథకాన్ని అమలుచేయకపోవడంతో మనస్తాపం చెందిన ఆర్మీ మాజీ సుబేదార్ రామ్ కిషన్ గ్రెవాల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికీ లక్షమందికిపైగా రక్షణశాఖ సిబ్బందికి ఓఆర్‌వోపీ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉందని తెలిపారు. కాగా, ఆత్మహత్య చేసుకున్న జవాను మానసిక పరిస్థితి ఏమిటో విచారించాలన్న వీకే సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత రాజ్ బబ్బర్ మండిపడ్డారు. ముందు వీకే సింగ్ మానసిక పరిస్థితి ఏమిటో ఆరా తీయాలని, ఇలాంటి వ్యక్తి పేరు ముందు జనరల్ అని రాసుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. -
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
-
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
న్యూఢిల్లీ : హర్యానాకు చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి జంతర్ మంతర్ వద్ద ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. మాజీ సైనికుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ ర్యాంకు వన్ పెన్షన్ విధానం ఆలస్యం కావడంపై తమ గోడును వెల్లబుచ్చుకోవడానికి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌తో భేటీ కావడం కుదరకపోవడంతో మనస్తాపం చెందిన సుబేదార్ రామ్ కిషన్ గ్రెవాల్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే మనోహర్ పారికర్‌ను కలిసేందుకు ఎలాంటి అభ్యర్థనను తాము రక్షకుడిని నుంచి స్వీకరించలేదని మంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆర్మీ ఉద్యోగి వన్ ర్యాంకు వన్ పెన్షన్‌లో మార్పులు డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో కూడా పాలుపంచుకున్నారు. పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి, ఆత్మహత్యకు గల కారణాలను తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని సుబేదార్ గ్రెవాల్ కుమారుడు రామ్ క్రిష్ణ గ్రెవాల్ తెలిపారు. దేశం కోసం ఎంతో కష్టపడిన మాజీ సైనికోద్యోగులందరికీ తక్షణమే వన్ ర్యాంకు-వన్ పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని జంతర్ మంతర్ వద్ద వారు గతేడాది నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. 80 రోజుల మాజీ సైనికోద్యోగుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం, ఆ పథకాన్ని అమలుచేస్తున్నట్టు ప్రకటించింది. అయితే తమ నాలుగు ప్రాథమిక పరిస్థితులను చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్టు మాజీ సైనికోద్యోగులు చెబుతున్నారు. ఈ విధానాన్ని అమలుచేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంందని వారు ఆరోపిస్తున్నారు. -
'మాట నిలబెట్టుకోలేకపోతే ఆయనేం ఆర్థికమంత్రి'
న్యూఢిల్లీ: మరోసారి ఓఆర్ఓపీ పెన్షన్ దారులు ఆందోళన బాట పట్టారు. వారంతా ఢిల్లీలోని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అధికారిక నివాసం ముందు దర్నాకు దిగారు. తమ ఆందోళనలు కేంద్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదని, తాము చేసిన సూచనలు పెడచెవిన పెడుతున్నారని ఆరోపిస్తూ ఆదివారం వారంతా జైట్లీ ఇంటిముందు నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే బారీకేడ్లు భారీ స్థాయిలో ఇంటి ముందుపెట్టించడమే కాకుండా పోలీసులను కూడా మోహరించారు. మంత్రుల నివాసాల ముందు నేరుగా మాజీ సైనికులు పెన్షన్ల కోసం ధర్నాలకు దిగడం గడిచిన వారం రోజుల్లో ఇది రెండో సారి. 'ఇదే నెలలో 3న మేం ఇదే మంత్రి నివాసం ముందు ధర్నాకు వచ్చినప్పుడు ఆయన కేంద్ర రక్షన మంత్రితో మాట్లాడతామని హామీ ఇచ్చారు. వారంలోగా ఆ పని పూర్తిచేయాలని మేం కోరాం. కానీ ఇప్పటికీ రెండు వారాలు అవుతోంది. ఆయన మాత్రం ఏ విధంగాను స్పందించలేదు. ఆయన ఇచ్చిన మాటనే నిలబెట్టుకోలేకపోతే ఆయనను ఇక ఏం ఆర్థికమంత్రి అనుకోవాలి' అని వీకే గాంధీ అనే మాజీ సైనికుడు అన్నారు. -
'అందరినీ సంతృప్తి పరచలేం'
న్యూఢిల్లీ: ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ నోటిఫికేషన్ పై వెల్లడైన అభ్యంతరాలపై రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. అందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. పథకం అమల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. 'ప్రధాన అంశాలన్నింటినీ నోటిఫికేషన్ లో చేర్చాం. ఇంకా ఏవైనా సమస్యలుంటే కమిషన్ పరిష్కరిస్తుంది. ప్రజాస్వామ్యంలో డిమాండ్ చేసే హక్కు అందరికీ ఉంది. ప్రధాన డిమాండ్లను నెరవేర్చాం. ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదు' అని పారికర్ అన్నారు. సైనికులు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 'ఒక ర్యాంకు-ఒక పెన్షన్' పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఒకే ర్యాంకులో పనిచేసి గతంలో రిటైరైన ఉద్యోగులకు.. అదే ర్యాంకులో పనిచేసి 2013 తర్వాత రిటైరైన ఉద్యోగులతో సమానంగా పెన్షన్ అందనుంది. 2014 జూలై 1 నుంచి ఈ పథకం వర్తించనుంది. కాగా, నోటిఫికేషన్ సరిగా లేదని, తమ డిమాండ్లను సర్కారు పరిగణనలోకి తీసుకోలేదని నిరసన చేస్తున్న సైనికోద్యోగులు విమర్శించారు. ఐదేళ్లకోసారి దీన్ని సమీక్షించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని.. సర్కారు దీన్ని 'వన్ ర్యాంక్ ఫైవ్ పెన్షన్స్'గా మార్చేసిందన్నారు. -
'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' అమలు చేస్తూ నోటిఫికేషన్
న్యూ ఢిల్లీ: వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) అమలు చేస్తూ కేంద్రప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఓఆర్‌ఓపీతో 25 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఐదేళ్లకోసారి పింఛన్లను సవరించనున్నారు. 2014 జూలై ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా ఓఆర్ఓపీని అమలుచేయనున్నారు. దీనికి సంబంధించిన బకాయిలను నాలుగు విడతల్లో ఆరేసి నెలలకు ఒకసారి చొప్పున ఇవ్వనున్నారు. యుద్ధ వితంతువులకు మాత్రం ఒకే సారి మొత్తం బకాయిలు ఒకేసారి చెల్లించనున్నారు. దీనివల్ల ఖజానాపై 8000 కోట్ల నుంచి 10000 కోట్ల వరకు భారం పడనుంది. అలాగే బకాయిల చెల్లింపునకు మరో 10-12 వేల కోట్ల వరకు ఖజానా పై అదనపు భారం పడనుంది. -
పతకాలను వెనక్కి ఇవ్వనున్న మాజీ సైనికులు!
న్యూఢిల్లీ: సైనికులకు 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' విధానాన్ని అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని, దీనికి నిరసనగా మాజీ సైనికులు తమకు లభించిన పతకాలను వెనక్కివ్వాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 11, 12 తేదీలలో మాజీ సైనికాధికారులు పతకాలను వెనక్కిచ్చే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలుస్తోంది. మాజీ జవాన్లు డిమాండ్ చేస్తున్న ఓఆర్ఓపీని ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించిందని పంద్రాగస్టున ప్రధాని చెప్పినప్పటికీ.. దీనిని ఎప్పటినుంచి అమలు చేసేది పేర్కొనలేదు. ఇటీవల దేశంలో పెరిగిపోతున్న అసహనానికి నిరసనగా పెద్ద ఎత్తున రచయితలు, మేధావులు తమకు లభించిన జాతీయ అవార్డులను వెనక్కి తిరిగి ఇస్తున్న విషయం తెలిసిందే. -
పరుగుతో ఆరోగ్యం పదిలం: మల్లారెడ్డి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి అన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్ కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో బోయిన్ పల్లి ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులో 1 కే రన్ నిర్వహించారు. మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ కోసం సైనికులు సుదీర్ఘ పోరాటం చేసి దక్కించుకున్నారని తెలిపారు. సైనికుల పోరాటానికి తాను సహకారం అందించిన విషయాన్ని గుర్తుచేశారు. విజయోత్సవ సంబరాలకు మళ్లీ తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని అన్నారు. -
‘రైల్వే కార్మికులకూ ఓఆర్ఓపీ ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే కార్మికులకు వన్ ర్యాంక్-వన్ పెన్షన్ వర్తింపుచేసేలా పథకాన్ని రూపొందించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (ఎన్ఎఫ్ఐఆర్) కేంద్రాన్ని డిమాండ్ చేసింది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరింది. ఈ రెండు డిమాండ్లపై ప్రధానికి మోదీకి లేఖను పంపింది. ఎన్ఎఫ్ఐఆర్ ప్రధాన కార్యదర్శి ఎం.రాఘవయ్య విలేకర్లతో మాట్లాడుతూ.. రైల్వే కార్మికులకు కూడా వన్‌ర్యాంక్-వన్ పెన్షన్ అమలు చేయాలన్నారు. రైల్వేలోని 13.2 లక్షల మంది రైల్వే కార్మికులు సైన్యం తరహాలోనే దేశ సేవ చేస్తున్నారని చెప్పారు. -
‘వన్ పెన్షన్’ వచ్చేసింది
-
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలుకు గ్రీన్ సిగ్నల్
► 2014 జూలై 1 నుంచి ఓఆర్ఓపీ అమలు ► నాలుగు విడతల్లో ఆరేసి నెలల్లో బకాయిల చెల్లిపు ► రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ ప్రకటన న్యూఢిల్లీ: మాజీ సైనికుల కల ఫలించింది. 42 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 2014 జూలై ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా ఓఆర్ఓపీని అమలుచేస్తామని, దీనికి సంబంధించిన బకాయిలను నాలుగు విడతల్లో ఆరేసి నెలలకు ఒకసారి చొప్పున ఇస్తామని తెలిపారు. యుద్ధ వితంతువులకు మాత్రం ఒకే సారి మొత్తం బకాయిలు చెల్లిస్తామన్నారు. ఐదేళ్లకోసారి పింఛనును సవరిస్తుంటామని పారిక్కర్ చెప్పారు. దీనివల్ల ఖజానాపై 8000 కోట్ల నుంచి 10000 కోట్ల వరకు ఖర్చవుతుంది. అలాగే బకాయిల చెల్లింపునకు మరో 10-12 వేల కోట్ల వరకు ఖజానాపై భారం పడుతుందని రక్షణ మంత్రి తెలిపారు. మన భద్రతాదళాలు అపార ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నాయని, వీళ్లు శాంతి భద్రతలతో పాటు విపత్తులు వచ్చినప్పుడు కూడా తమ సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా పారిక్కర్ ప్రశంసించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా పెండింగులో ఉందని, దీనిపై ఇంతకు ముందు ప్రభుత్వాలు చాలావరకు నిర్లక్ష్యం వహించాయని చెప్పారు. యూపీఏ సర్కారు గతంలో ఒకసారి 500 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టినా, అది సరిపోతుందా లేదా అన్న విషయం ఆలోచించలేదని విమర్శించారు. దీన్ని అమలుచేయడానికి పాలనా పరమైన, సాంకేతిక, ఆర్థిక సమస్యలున్నాయని 2009లో పార్లమెంటులో చెప్పారన్నారు. అందుకే ఈ ప్రభుత్వం కూడా ఓఆర్ఓపీ అమలుకు కొంత సమయం తీసుకుందని, అయినా ప్రధాని నరేంద్రమోదీ మాత్రం పలు సందర్భాల్లో ఓఆర్ఓపీని అమలు చేస్తామనే చెప్పారన్నారు. దీని అమలుకు నిపుణులు, మాజీ సైనికులతో చర్చించామని... అయితే వీఆర్ఎస్ తీసుకున్నవాళ్ల విషయంలోనే కొంత సమస్య వచ్చిందని పారిక్కర్ తెలిపారు. ఒకే ర్యాంకులో ఒకే సర్వీసు పూర్తిచేసిన వాళ్లకు ఎప్పుడు రిటైరయ్యారన్నదాంతో సంబంధం లేకుండా ఒకే తరహాలో ఇక మీదట పింఛను వస్తుందన్నారు. -
ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ కోరుతూ రిలే దీక్షలు
ఇందిరాపార్కు (హైదరాబాద్) : ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ సైనికులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. నగరంలోని ఇందిరాపార్కులో పలువురు మాజీ సైనికులు మంగళవారం దీక్షలకు దిగారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాల మాజీ సైనిక అధికారి విద్యాసాగర్ పాల్గొన్నారు. తమ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన కోరారు. -
24 నుంచి నిరశన దీక్ష: మాజీ సైనికులు
న్యూఢిల్లీ: రక్షణ శాఖలో ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ)’ అమలు చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తున్న మాజీ సైనికులు తమ ఆందోళనను మరింత తీవ్రం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 24 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్టు ‘యునెటైడ్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్‌మెన్ మూవ్మెంట్’ మీడియా సలహాదారు కల్నల్(రిటైర్డ్) అనిల్ కౌల్ తెలిపారు. మాజీ జవాన్లు డిమాండ్ చేస్తున్న ఓఆర్ఓపీని ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించిందని పంద్రాగస్టున ప్రధాని చెప్పినప్పటికీ.. దీనిని ఎప్పటినుంచి అమలు చేసేది పేర్కొనకపోవడం వారిని నిరాశకు గురిచేసింది. -
రాహుల్.. గో బ్యాక్!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి దేశ రాజధానిలో చేదు అనుభవం ఎదురైంది. 'రాహుల్.. గో బ్యాక్' అంటూ నిరసనకారులు నినదించారు. వచ్చింది చాలు, ఇక వెళ్లచ్చని హితవు పలికారు. 'ఒక ర్యాంకు - ఒక పెన్షన్' డిమాండు సాధన కోసం నిరసన ప్రదర్శన చేస్తున్న మాజీ సైనికులకు సంఘీభావంగా వెళ్లినప్పుడు ఇలా జరిగింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మాజీ సైనికోద్యోగులు నిరసన ప్రదర్శన చేస్తుండగా.. వారికి సంఘీభావంగా ఉండేందుకు రాహుల్ గాంధీ అక్కడకు వెళ్లారు. అయితే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించి తీరుతో విసుగెత్తి ఉన్నారో ఏమో గానీ.. మాజీ సైనికులు ఆయనను సాదరంగా స్వాగతించలేకపోయారు. ఇక మరోవైపు పోలీసులు మాజీ సైనికులను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇది బ్లాక్ ఇండిపెండెన్స్ డే అని వాళ్లు అభివర్ణించారు. -
'త్వరలో శుభవార్త వింటారు'
లక్నో: వన్ ర్యాంకు వన్ పెన్షన్(ఓఆర్ఓపీ)పై త్వరలో శుభవార్త వింటారని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఓఆర్ఓపీ అమలు చేయాలని పదవీ విరమణ చేసిన సైనికోద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. 'ఓఆర్ఓపీ అమలు అనేది రక్షణశాఖ అంతర్గత వ్యవహారం. దీనిపై కసరత్తు దాదాపు కొలిక్కివచ్చింది. దీనికి చాలా సమయం పడుతుంది. అయినప్పటికీ ఓఆర్ఓపీపై త్వరలోనే గుడ్ న్యాస్ వింటారు' అని పారికర్ వ్యాఖ్యానించారు. ఓఆర్ఓపీ అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకుముందు స్పష్టం చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ సైనిక ఉద్యోగులకు పీఆర్సీ సిఫారసు ఆధారంగా పెన్షన్లు ఇస్తున్నారు.